‘ఐబొమ్మ’రవి కోసం 3 నెలలు ముమ్మర గాలింపు
సెప్టెంబర్ లో ఇద్దర్ని అరెస్టు చేసినా లభించని ఆచూకీ
సవాల్ విసరడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబర్ క్రైమ్ బృందం
సాంకేతిక దర్యాప్తు ద్వారా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: సినీ పరిశ్రమతో పాటు పోలీసులకు చుక్కలు చూపించిన ‘ఐబొమ్మ’రవి కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దా దాపు మూడు నెలల పాటు వేటాడారు. ఓపక్క పైరసీ చేస్తుండటం.. మరోపక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో పాటు సవాళ్లు విసరడంతో ఇతడి అరెస్టును సవాల్‌గా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇమ్మడి రవికి సహకరించిన ఇద్దరు నిందితుల్ని సెప్టెంబర్‌లో పట్టుకున్నా... ఇతడి గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో సాంకేతికంగా ముందుకు వెళ్లిన ప్రత్యేక బృందం ఎట్టకేలకు రవి ఆచూకీ కనిపెట్టింది. కరేబియన్ దీవుల్లో సెటిల్ అయిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఆస్తుల్ని అమ్మేయడానికి వచి్చన అతన్ని అరెస్టు చేసింది.
ఆ ఇద్దరి సహకారంతో వెబ్‌సైట్ ఏర్పాటు..
రవి బీఎస్సీ కంప్యూటర్స్, ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత వెబ్ డిజైనర్, డొమైన్ డెవలపర్‌గా మా రాడు. ఇలా వ్యాపారులకు అవసరమైన వెబ్‌సై ట్లు డిజైన్ చేసి, అభివృద్ధి చేసి ఇచ్చేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సినీ పైరసీ కో సం 2018లో ఐబొమ్మ వెబ్‌సైట్ ఏర్పాటు చే యాలని నిర్ణయించుకున్నాడు.
ఈ డొమైన్ రిజి్రస్టేషన్‌కు అవసరమైన సెల్‌ఫోన్ నంబర్ కోసం సిమ్‌కార్డును తన ఎంబీఏ క్లాస్‌మేట్ అయిన నెల్లూరుకు చెందిన ఎస్.ప్రశాంత్‌ది వినియోగించాడు. అప్పట్లో వెబ్‌సైట్ రూపకల్పనకు స్నేహి తుడైన నెల్లూరు వాసి, వెబ్ సైట్ డెవలపర్ శివాజీ నుంచి సాంకేతిక సహకారం తీసుకున్నాడు. దీంతో ఆ డొమైన్‌లో వీరి వివరాలు నిక్షిప్తమయ్యాయి.
వరుసగా ఐదు కేసులు నమోదు కావడంతో..
ఐబొమ్మ, బప్పం, ఐరాదే సహా మొత్తం 65 వెబ్‌సైట్లు, మిర్రర్ సైట్లపై ఇటీవల కాలంలో ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రవి సినీ పరిశ్రమను, పోలీసుల్ని చేతనైతే తమను పట్టుకోవాలన్నట్టుగా సవాల్ చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేసేందుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.
ఇన్‌స్పెక్టర్లు ఎస్.నరేష్ కుమార్, కె.మధుసూదన్‌రావు, ఎస్సై మహిపాల్, హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్‌రెడ్డిలతో కూడిన ఈ టీమ్ సాంకేతిక దర్యాప్తు చేపట్టింది. ఐబొమ్మ వెబ్‌సైట్ ఏర్పాటు పూర్వాపరాలు పరిశీలించి ప్రశాంత్, శివాజీ పాత్ర గుర్తించారు. వీరికోసం ముమ్మరంగా గాలించి సెపె్టంబర్ 22న పుణేలో ప్రశాంత్‌ని, అదే నెల 24న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శివాజీని అరెస్టు చేశారు.
అయితే 2019 తర్వాత వీరికి రవితో ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో అతడి తాజా వివరాలు వారు చెప్పలేకపోయారు. దీంతో పూర్తిస్థాయి సాంకేతిక దర్యాప్తుపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు.
ఎట్టకేలకు లభించిన తాజా వివరాలు..
రవి 2018లోనే ఐబొమ్మ వెబ్‌సైట్ డిజైన్ చేసినప్పటికీ.. 2020లో లాక్‌డౌన్ అమలు తర్వాత ఇది ఫేమస్ అయ్యింది. వెబ్‌సైట్ ట్రాఫిక్ మానిటరింగ్ చేసే వారు ఈ విషయం గమనించడంతో అనేక గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్ల నిర్వాహకులు యాడ్స్ పోస్టు చేయడం కోసం సంప్రదించారు. వారితో ఒప్పందాలు చేసుకున్న రవి తొలినాళ్లలో ప్రతి నెలా రూ.5 లక్షల వరకు.. ప్రస్తుతం రూ.20 లక్షలు ఆర్జిస్తున్నాడు.
మరోవైపు గూగుల్ యాడ్స్ నుంచి నగదు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నంలోనూ కొన్ని ఆస్తులు కొన్నాడు. ఇవన్నీ గమనించిన సైబర్ క్రైమ్ పోలీసులకు రవి తాజా బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు తెలిశాయి. వీటిని పరిశీలించగా..అతను 2022లో భారత పాస్‌పోర్టు అప్పగించి, లక్ష డాలర్లు చెల్లించడం ద్వారా కరేబియన్ దీవిల్లో ఒక దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పౌరసత్వం, పాస్‌పోర్టు తీసుకున్నట్లు గుర్తించారు.
కాగా పోలీసులు తనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారని తెలుసుకున్న రవి.. సెయింట్ కిట్స్ అండ్ నెవీస్‌లో స్థిరపడిపోవాలని భావించాడు. తనకు ఉన్న ఆస్తుల్ని విక్రయించాలని భావించి గత వారం విజిట్ వీసాపై వచ్చి, హైదరాబాద్ మూసాపేటలోని తన ఫ్లాట్‌లో బస చేశాడు. ఈ విషయం గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసుల బృందం తక్షణమే స్పందించి అతడిని అరెస్టు చేసింది.


