విజయ్ దేవరకొండకు 'ఐబొమ్మ' రవి సవాల్‌.. విచారణలో వెల్లడి | iBomma Ravi Reveals Shocking Details In Police Custody, Issues Warning To Vijay Devarakonda | Sakshi
Sakshi News home page

విజయ్ దేవరకొండకు 'ఐబొమ్మ' రవి సవాల్‌.. విచారణలో వెల్లడి

Nov 30 2025 10:42 PM | Updated on Dec 1 2025 11:35 AM

Ibomma ravi warning to vijay devarakonda

సినీ పైరసీ కేసులో  ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఐబొమ్మ వెనుక ఉన్న రహస్యాలను పోలీసులు రాబడుతున్నారు. పైరసీతో సంబంధం ఉన్న నెట్‌వర్క్‌ గురించి చెప్పాలని రవిని ప్రశ్నించగా.. ఇందులో ఎవరూ లేరని, అన్నింటికీ తానే బాధ్యత వ్యవహరిస్తున్నట్లు చెప్పాడు. డబ్బు సంపాధించేందుకు మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, ఈ క్రమంలో విజయ్‌దేవరకొండకు విసిరిన సవాల్‌ గురించి రవి పోలీసులకు చెప్పాడు.

ఈ ఏడాది ఆగష్టులో విజయ్‌దేవరకొండను ఉద్దేశించి సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ చేసింది. 2023లో ఖుషీ సినిమాను పైరసీ చేసి  విజయ్‌ దేవరకొండకు ఐబొమ్మ వెబ్‌సైట్‌ ద్వారా రవి సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో రవి ఒప్పుకున్నాడు.  ఖుషీ సినిమా సమయంలో ఏం జరిగిందో రవి ఇలా చెప్పాడు. 'మేము మీకు ముందే చెప్పాము.. మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మీ మీద కూడా ఫోకస్ చేయాల్సి వస్తుందని..! కానీ, మీరు మా మాట పట్టించుకోలేదు. మీరు ఏజెన్సీస్‌కి డబ్బులు ఇస్తున్నారు. కానీ, వాళ్లు మమ్మల్ని తొక్కి మా పేరుతో ఐ బొమ్మ ఎఫ్‌ఎఫ్‌ డాట్‌ ఇన్‌ పేరుతో రన్‌ చేస్తున్నారు. అలా మా పేరుతో తప్పుడు వెబ్‌సైట్లు రన్ చేస్తున్నారు. దీనిని ముందే హెచ్చరించాం.. అందుకే మీ కింగ్‌డమ్‌ సినిమాను విడుదలకు ముందే బయటకు తెస్తాం.' అంటూ   గతంలోనే విజయ్‌ దేవరకొండను రవి హెచ్చరించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement