breaking news
ibomma ravi
-
నాంపల్లి కోర్టులో ఐ-బొమ్మ రవికి బిగ్ షాక్
-
ఐబొమ్మ రవికి మరో షాక్
సాక్షి, హైదరాబాద్: పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. అయితే, కేసు దర్యాప్తు దశలో ఉందని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని.. బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.కాగా, ఇమంది రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్‌తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు, వివరాలు వాడి తన ఫొటోతో వీటిని పొందాడు. వీటిని ఉపయోగించి తన ఫొటోతో కొన్ని గుర్తింపు కార్డులతో దరఖాస్తు చేసి తీసుకోగా.. మరికొన్ని తయారు చేశారు.గతంలో రవి అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్‌తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్ 2017లో అమీర్‌పేటలోని హాస్టల్ రూమ్‌లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్‌కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. కరీంనగర్‌కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్మేట్ అయిన కాళీప్రసాద్ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్.ఇన్, సప్లయర్స్.ఇన్ తదితర వెబ్సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు. -
ఐబొమ్మ రవి కేసులో కీలక మలుపు.. సినీ పెద్దలను ఇరికించే ప్రయత్నం
-
ఐబొమ్మ రవి విచారణ.. ఫ్రాన్స్ టూ హైదరాబాద్..
సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. తన పైరసీ సినిమా గుట్టు బయటపడ్డాక తప్పించుకునేందుకు ప్లాన్ చేసిన రవి.. తనపై ఫిర్యాదు చేసిన సినిమా పెద్దలను ఇరికించాలని చూశాడు. కానీ, అందులో తానే ఇరుక్కున్నాడు. ఐబొమ్మ రవిని 12 రోజులపాటు పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా పలు విషయాలు బయటకు వచ్చాయి.నగర సైబర్ క్రైమ్ పోలీసుల బృందం వివిధ కోణాల్లో రవి నుంచి సమాధానాలు రాబట్టారు. అతడు చేసే నేరాలకు ఎప్పటికీ దొరక్కూడదని 2007 నుంచే, తన క్రిమినల్ బుర్రకు పదునుపెట్టి తాను చేయబోయే పైరసీ నేరాలకు మిత్రులను పావులుగా వాడుకున్నాడని పోలీసులు గుర్తించారు. 2019-23 మధ్య కాలంలో ప్రకటనల ద్వారా రూ. మూడు కోట్లు సంపాదించినట్టు తెలుసుకున్నారు. అయితే, విచారణ సందర్బంగా అతను ఏ ప్రశ్న అడిగినా తడుముకోకుండా సమాధానం చెప్పినట్టు తెలిసింది. అదే ప్రశ్న మరోసారి అడిగితే కళ్లు ఉరిమి చూస్తున్నట్టు సమాచారం. విచారణలో భాగంగా.. రవి ఐ బొమ్మ తదితర సైట్లలో పైరసీ సినిమాలు పెట్టాడు. తరువాత పైరసీ వెబ్సైట్లు మరిన్ని పెరగటంతో అతడి ఆదాయం తగ్గింది. అదే సమయంలో పైరసీపై తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఫిర్యాదు చేయడంతో రవి నయా మార్గం ఎంచుకున్నాడు. అప్పటికే కాలపరిమితి ముగిసిన ఐ బొమ్మ డూప్లికేట్ పోర్టల్ వేదికగా పోలీసులకు సవాల్ విసిరాడు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, బయటి వ్యక్తులు ఇదంతా నడిపిస్తున్నారని సినీ పెద్దలనే ఇరికించే ప్రయత్నం చేశాడు.ఫ్రాన్స్ టూ హైదరాబాద్.. వీఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను రిజిస్టర్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ కంపెనీకి మెయిల్ పంపారు. తాను ఆ డొమైన్లకు సర్వీసు ఇస్తున్నాడని, ఆ పోర్టల్‌లో ఎలాంటి పైరసీ సినిమాలు లేవని బుకాయిస్తూ రవి సమాధానమిచ్చాడు. అందుకు సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే తనకు పంపాలంటూ ఎదురుదాడికి దిగడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. వీఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ ఫోన్ నంబరు ఆధారంతో నిందితుడు విదేశాల్లో ఉంటూ కథ నడిపిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో ఐబొమ్మ వెబ్‌సైట్‌కు పోస్టర్ డిజైన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సరిగ్గా అదే సమయంలో అతడి ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. తాను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చానంటూ రవి పంపిన మెసేజ్ పంపాడు. దాని ప్రకారం, కూకట్‌పల్లిలోని తన ఇంటికి రవి చేరుకున్నాక తనని అరెస్ట్ చేశారు.ఫోర్జరీలు, నకిలీ సంతకాలు.. రవి 2007లోనే మహారాష్ట్రలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని సంపాదించాడు. వాటితోనే పాన్‌కార్డు కూడా పొందాడు. వాటి ఆధారంగా పోలీసులు రవికి పరిచయమున్న ప్రహ్లాద్, కాళీప్రసాద్, అంజయ్యలను గుర్తించారు. రవిని గుర్తించేందుకు ఇటీవల ప్రహ్లాద్‌ను రప్పించారు. అమీర్‌పేట్‌లో తాను రవితో కలిసి ఉన్నానని ప్రహ్లాద్ చెప్పగా, రవి మాత్రం ప్రహ్లాద్‌ను ఇదే మొదటిసారి చూస్తున్నట్టు నాటకమాడాడు. తాను అసలు ఐ బొమ్మ నడుపుతున్నట్లు రుజువేంటి అంటూ రవి పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరో ఇద్దరి ప్రమేయంపై పోలీసులు విచారిస్తున్నారు. -
ఐబొమ్మ రవి కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక అంశాలు
-
ఐబొమ్మ రవి కేసులో కొత్త మలుపులు
సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక విషయాలు గుర్తిస్తున్నారు. ప్రహ్లాద్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురూ గతంలో ఇతడికి స్నేహితులే కావడం గమనార్హం. వెల్లెల ప్రహ్లాద్ కుమార్‌తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు, వివరాలు వాడి తన ఫొటోతో వీటిని పొందాడు. వీటిని ఉపయోగించి తన ఫొటోతో కొన్ని గుర్తింపు కార్డులతో దరఖాస్తు చేసి తీసుకోగా.. మరికొన్ని తయారు చేశారు.గతంలో రవి అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్‌తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్ 2017లో అమీర్‌పేటలోని హాస్టల్ రూమ్‌లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్‌కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. కరీంనగర్‌కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్మేట్ అయిన కాళీప్రసాద్ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్.ఇన్, సప్లయర్స్.ఇన్ తదితర వెబ్సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు. పోలీసు కస్టడీ ముగియడంతో రవిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. చదవండి: ఐబొమ్మ నాదే అనడానికి ఆధారాలు ఉన్నాయా? -
ఐ బొమ్మ నాదే అనడానికి ప్రూఫ్స్ ఏవి?.. ఇమంది రవి
సినిమాలని పైరసీ చేసి ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దాదాపు 12 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. పలు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్స్ దొంగిలించి వాడుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా కస్టడీ పూర్తవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, అనంతరం నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రవి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'బెట్టింగ్ యాప్స్‌తో నాకు సంబంధాలు ఉన్నాయని, వాటిని ప్రమోట్ చేస్తున్నానని అంటున్నారు. కానీ ఆ ఆరోపణల్లో నిజం లేదు. నా పేరు ఐ బొమ్మ రవి కాదు ఇమంది రవి. ఐబొమ్మ నాదే అనడానికి ఆధారాలు ఏవి? నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని మీకు ఎవరు చెప్పారు? పోలీసులు చెబితే నేను నేరం చేసినట్లేనా? నేను ఎక్కడికీ పారిపోలేదు. వేరే దేశంలో పౌరసత్వం మాత్రమే తీసుకున్నాను. నేను కూకట్‌పల్లిలో ఉంటున్నాను. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను. నాపై ఆరోపణలన్నీ నిరాధారమైనవి. సరైన టైంలో నిజాలు బయటపెడతా' అని మీడియాతో రవి అన్నాడు.మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ.. ఐ బొమ్మ రవి కస్టడీ విచారణలో ఫేక్ ఐడీల సమాచారం సేకరించాం. ముగ్గురు స్నేహితుల ఐడీల ద్వారానే రవి ఫేక్ ఐడీలు సృష్టించాడు. ఇతడికి చెందిన రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశాం. బెట్టింగ్ యాప్స్‌తో రవికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి దర్యాప్తు కొనసాగుతోంది. ఇతర పైరసీ వెబ్‌సైట్స్‌తో ఉన్న సంబంధాల గురించి కూడా ఆరా తీస్తున్నాం. కరేబియన్ దేశంలో ఉన్న రవి డేటాపై ఆరా తీస్తున్నాం. విచారణలో రవితో సంబంధాలు లేవని ప్రహ్లాద్ చెప్పాడు. త్వరలోనే మిగతా ఇద్దరి స్నేహితులను విచారిస్తాం. ఇకపై పైరసీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పారు. -
ఐబొమ్మ రవి కేసులో మరో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యు మెంట్లు ఇమంది రవి దొంగిలించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రహ్లాద్ వెల్లేల పేరిట ఇమంది రవి.. పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు తేలింది.బెంగుళూరు నుంచి ప్రహ్లాద్‌ను పోలీసులు పిలిపించారు. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్‌ను పోలీసులు విచారించారు. రవి ఎవరో తనకు తెలియదని ప్రహ్లాద్ పోలీసులకు చెప్పాడు. అయితే, ప్రహ్లాద్ తన రూమ్ మేట్ అని గతంలో రవి.. విచారణలో చెప్పిన సంగతి తెలిసిందే. తన పేరుతో రవి పాన్, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్‌కు గురయ్యానంటూ ప్రహ్లాద్.. పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. రేపటితో(డిసెంబర్ 29, సోమవారం) ఐబొమ్మ రవి కస్టడీ ముగియనుంది.కాగా, ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. పలు విడతలుగా జరుపుతున్న విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబడుతున్నారు.సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా పలు ఆసక్తికర సంగతులను రవి వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే.. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను సైతం పైరసీ చేయగలిగానంటూ కస్టడీ విచారణలో సైబర్ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. -
ఐబొమ్మ రవి వెనుక 'ప్రహ్లాద్'.. వెలుగులోకి కొత్త విషయం
పైరసీ సినిమాల కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు రవిని మూడోసారి సైబర్‌క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. 12రోజుల పాటు అతన్ని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఐబొమ్మ రవితో పాటు టచ్‌లో ఉన్న మరికొందరి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెచ్డీ సినిమాల్ని ఎలా పైరసీ చేస్తారనే విషయంపై పూర్తి సమాచారాన్ని ఇచ్చేశాడట.తాజాగా జరిగిన విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే ఇద్దరి పేర్లు రవి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వారు కూడా కీలకంగా ఉన్నారని తేలింది. వీరిలో ప్రసాద్ మాత్రం రవికి పదో తరగతి స్నేహితుడని చెప్పాడట. అయితే, ప్రహ్లాద్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. అయితే, ప్రహ్లాద్ పేరుతోనే ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సును రవి తీసుకున్నాడు. కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉంది. చివరకు ఐబొమ్మ వెబ్సైట్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే రిజిస్టర్ చేయించాడు. కానీ, అతని గురించి మాత్రం ఎలాంటి వివరాలు రవి చెప్పడం లేదట. -
మరోసారి పోలీసు కస్టడీకి ఐబొమ్మ రవి
సినిమాలని పైరసీ చేసి పోలీసులకు చిక్కిన రవి అలియాస్ ఐబొమ్మ రవి.. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. రీసెంట్గా బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్స్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. నాంపల్లి కోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలో రవిని 12 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు అనుమతినిచ్చింది. ఒక్కో కేసులో 3 రోజులు పాటు విచారించాలని ఆదేశించింది. దీంతో 4 కేసులకుగాను 12 రోజులు పాటు విచారించనున్నారు. ఈనెల 18 నుంచి సైబర్ క్రైమ్ విచారణ మొదలవుతుంది.మరోవైపు ఇవ్వాళ కొనసాగిన విచారణలోనే రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్ తమ వాదనలు వినిపించారు. రవిని కస్టడీ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. రెండు సార్లు కస్టడీకి తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం.. కస్టడీకి తీసుకుంటేనే రవి నెట్వర్క్ బయటపడుతుందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్సైట్లతో సినిమాల పైరసీ చేశాడు. దీని ద్వారానే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇందుకోసం కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. -
ఐబొమ్మ కేసు.. ఇమ్మడి రవికి బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం తిరస్కరించింది. పోలీస్ కస్టడీ కారణంగా రవి బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈలోపు.. మూడో దఫా కస్టడీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి అప్పీల్‌కు వెళ్లడంతో ఆ విచారణ మరింత ఆలస్యం కావొచ్చని రవి ఆందోళన చెందాడు. అయితే.. ఆ అప్పీల్‌ను విచారిస్తూనే ఇటు రవి బెయిల్ పిటిషన్‌నూ కోర్టు పరిశీలించింది. చివరకు కేసుల తీవ్రత దృష్ట్యా రవి బెయిల్‌కు అనర్హుడని తేల్చేసింది. అదే సమయంలో.. కస్టడీపై రివిజన్ విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. మూడు విడతలుగా 8 రోజులపాటు జరిపిన విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబట్టారు. సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా ఆసక్తికర సంగతులను వెల్లడించాడు. అలాగే.. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను సైతం పైరసీ చేయగలిగానని తెలిపాడు. కస్టడీ విచారణలో సైబర్ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే కీలకమైన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రవి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది. అందుకే పోలీసులు కస్టడీని ఎక్కువ రోజుల కోరుతున్నారు. సీసీఎస్ పోలీసుల కస్టడీ అప్పీల్ గనుక రిజెక్ట్ అయితే మూడు కేసులకుగానూ(ఒక కేసులో కస్టడీని కోర్టు కొట్టేసింది) మూడు రోజులపాటే రవిని పోలీసుల విచారించాల్సి ఉంటుంది. -
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకోకుండానే.. మరోసారి నాంపల్లి కోర్టును సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ఇవాళ్టి నుంచి మూడు రోజలపాటు రవిని విచారణ జరపాల్సి ఉంది.. అయితే.. చంచల్‌గూడ్ జైలు నుంచి రవిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం. కోర్టు ఇచ్చిన మూడు రోజుల సమయం సరిపోదని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మరింత టైం కావాలని కోరుతూ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. మరికాసేపట్లో ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడినట్లు వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవిపై ప్రధాన అభియోగం నమోదైంది. ఈ క్రమంలో మరో నాలుగు కేసులూ నమోదు అయ్యాయి. అయితే రెండు విడతలుగా ఇప్పటికే రవిని 8 రోజులపాటు విచారణ జరిపారు సీసీఎస్ పోలీసులు. ఈ క్రమంలో.. నాలుగు కేసులకు సంబంధించి కస్టడీకి అనుమతించాలని పిటిషన్ వేశారు. అయితే.. ఇందులో ఒక కేసును తోసిపుచ్చిన కోర్టు.. మిగిలిన మూడు కేసులకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం నుంచి రవిని విచారించాలని ఆదేశించింది. గత విచారణలో రవి నుంచి సైబర్‌క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్నే సేకరించారు. అయితే కీలకమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాల్సి ఉంది. అందుకే మూడో విడత కస్టడీని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. నిందితుడికి నిరీక్షణ తప్పదా?ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ విచారణ కస్టోడియల్ ఎంక్వైరీ కారణంగానే ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కస్టడీకి ఆదేశించిన సమయంలోనే నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ విచారణపై స్పష్టత ఇచ్చింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో(మూడు రోజుల విచారణ ముగుస్తుంది కాబట్టి) విచారణ జరుపుతామని నిందితుడి తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయంతో ఈ పిటిషన్ విచారణ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. నిందితుడు రవికి షాక్ అనే చెప్పొచ్చు. -
'ఐబొమ్మ' రవికి జాబ్ ఆఫర్.. క్లారిటీ ఇచ్చిన డీసీపీ
పైరసీ సినిమాలతో ఆరేళ్లపాటు సినీ పరిశ్రమతో పాటు పోలీసులను కూడా ముచ్చెమటలు పట్టించిన ఐబొమ్మ రవి కొద్దిరోజుల క్రితమే అరెస్ట్ కావడం జరిగింది. పోలీసులు విచారణలో ఇప్పటికే అతను సంచలన విషయాలను తెలిపాడు. ఏవిధంగా నెట్‌వర్క్‌ను హ్యాక్ చేయగలడొ పోలీసులకు చూపించాడు. పలు వెబ్‌సైట్స్‌తో పాటు కొత్త సినిమా శాటిలైట్ పిన్ వంటి వాటిని సులువుగా హ్యాక్ చేయగలనని తెలిపాడు. దీంతో రవికి పోలీసులు జాబ్ ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే, ఇదే అంశంపై తాజాగా సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు స్పందించారు.ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన వార్తలు నిజం కాదని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు క్లారిటీ ఇచ్చారు. అవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలేనని పేర్కొన్నారు. ఐబొమ్మ రవికి తాము ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదని డీసీపీ తెలిపారు. 8 రోజుల కస్టడీలో రవి కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పాడని ఆయన అన్నారు. తప్పు చేశాననే బాధ రవిలో అసలు కనిపించలేదన్నారు. అతను 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు తాము గుర్తించామని ఆయన పేర్కొన్నారు. రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. -
బొమ్మ బంద్.. ఇక ‘రుచి’ చూపిస్తా !: ఇమ్మడి రవి
సాక్షి, హైదరాబాద్: ఐ బొమ్మ, బప్పం పేర్లతో వెబ్సైట్లను ఏర్పాటు చేసి, 21 వేల సినిమాలను పైరసీ చేసిన ఇమ్మంది రవి తన పంథా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు షడ్రుచుల ఆహార పదార్థాలను విక్రయించాలని యోచిస్తున్నాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో రవి ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇమ్మంది రవిపై హైదరాబాద్‌లో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. తొలుత ఓ కేసులో అరెస్టు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో ఓసారి కస్టడీకి, మరోసారి అదనపు కస్టడీకి తీసుకున్నారు. ఆపై మరో కేసులో అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ కోసం పిటిషన్ వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు రెండు కేసుల్లో ఈ తంతు పూర్తి చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు మిగిలిన మూడు కేసుల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిసారి అరెస్టు చేసిన నాటికి, ఇప్పటికి అతడిలో ఎంతో మార్పు కనిపిస్తోందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. తమకు చిక్కినప్పుడు సినిమా టికెట్ల రేట్లు, హీరోల రెమ్యూనరేషన్ల విషయాలు మాట్లాడి, తన పనిని సమర్థించుకున్నాడని, ప్రస్తుతం పైరసీ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెపుతున్నాడని అధికారులు తెలిపారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ లేదా తన స్వస్థలమైన విశాఖపట్నంలో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పోలీసులతో చెప్పాడు. అలాగే తన తప్పు తెలుసుకున్న రవి తన తండ్రి చిన అప్పారావు వద్దకూ వెళ్లాలని భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. భార్య నుంచి దూరమైన నాటి నుంచి అతడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. ప్రస్తుతం తాను ఇక్కడ, తండ్రి అక్కడ ఒంటరి జీవితం గడుపుతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నాడు. అనారోగ్యంతో, తన తల్లి నుంచి దూరంగా బతుకుతున్న తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటానని పోలీసులకు తెలిపాడు.నేడు కీలక విచారణసినీ పైరసీ కేసు నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే రెండు విడతలుగా.. ఎనిమిది రోజులుగా పోలీసులు రవిని కస్టోడియల్ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే నాలుగు కేసుల్లో విచారణ జరిపేందుకు మరోసారి కస్టడీ కోరుతున్నారు. ఈ పిటిషన్ ఇవాళ కోర్టు ముందుకు రానుంది. దీని విచారణ తర్వాతే కోర్టు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్‌ను పరిశీలించనుంది. -
ఐబొమ్మ రవిగాడిని రాబిన్‌హుడ్ చేశారు: నాగవంశీ
సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవిపై ప్రముఖ నిర్మాత నాగవంశీ తాజాగా రియాక్ట్ అయ్యారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటిస్తున్న తాజా సినిమా ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. పైరసీ చేసిన అతడిని హీరోని చేసి చూస్తున్న సమాజంలో మనం జీవిస్తున్నామంటూ వంశీ అన్నారు. సినిమాకు రూ.50 టికెట్ ధర పెంచితే తమను తప్పుబట్టి కామెంట్లు చేసిన వారున్నారని ఆయన పేర్కొన్నారు. 'ఐబొమ్మ రవినే రాబిన్‌హుడ్ చేసిన లోకం ఉన్నాం మనం.. మేమేదో తప్పు చేసినట్టు టికెట్ రూ. 50 రూపాయలు పెంచితే మేము తప్పు చేసిన వాళ్లం అయ్యాం. ఆ అబ్బాయి హీరో అయిపోయాడు.' అని వంశీ అన్నారు.‘బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటిస్తున్న తాజా సినిమాకి ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ అనే టైటిల్ ఖరారైంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.#NagaVamsi :#Ibomma రవి నే ROBINHOOD చేసిన లోకం లో ఉన్నాం మనం " మేమేదో తప్పు చేసినట్టు, రేటు 50 రూపాయలు పెంచితే, ఆ అబ్బాయి హీరో అయిపోయాడు.#EPIC #News #Tollywood pic.twitter.com/FNEiqVrZ5i— IndiaGlitz Telugu™ (@igtelugu) December 1, 2025 -
iBomma Case: ఇమ్మడి రవికి ఊరట దక్కేనా?
సినీ పైరసీ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన నిందితుడు, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.ఐబొమ్మ, బప్పం పేరుతో వెబ్సైట్లు నడిపిస్తూ సినీ పైరసీకి పాల్పడ్డాడంటూ ఇమ్మడి (ఐబొమ్మ) రవిపై ప్రధాన అభియోగం ఉంది. సైబర్ నేరాల నేపథ్యంలో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే రవికి బెయిల్ కోరుతూ సీనియర్ లాయర్ సీవీ శ్రీనాథ్ కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికే సీసీఎస్ పోలీసులు కస్టడీ కోరడంతో బెయిల్ విచారణ వాయిదా పడింది.ఈగ్యాప్‌లో.. రెండు విడతలుగా ఎనిమిది రోజులపాటు రవిని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో అతని నుంచి కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలనూ సేకరించినట్లు తెలుస్తోంది. అయితే రవి లాయర్ మాత్రం బెయిల్ కచ్చితంగా వస్తుందని అంటున్నారు.రవి బెయిల్ అభ్యర్థనకు ఇప్పటికే పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో.. బెయిలా? జైలా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ బెయిల్ రిజెక్ట్ అయితే గనుక అదనపు విచారణ కోసం పోలీసులు మరోసారి కోర్టులో పిటిషన్ వేసే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు.. అతనిపై నమోదు అయిన మరో మూడు కేసుల్లో రేపటిలోగా కోర్టు ముందు హాజరు పరచాల్సి ఉంది. దీంతో ఇవాళే రవిని హాజరు పర్చవచ్చని తెలుస్తోంది.ఇదీ చదవండి: విశాఖలో బొమ్మ.. అందుకే ఆ పేరు పెట్టా! -
విజయ్ దేవరకొండకు 'ఐబొమ్మ' రవి సవాల్.. విచారణలో వెల్లడి
సినీ పైరసీ కేసులో ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఐబొమ్మ వెనుక ఉన్న రహస్యాలను పోలీసులు రాబడుతున్నారు. పైరసీతో సంబంధం ఉన్న నెట్వర్క్ గురించి చెప్పాలని రవిని ప్రశ్నించగా.. ఇందులో ఎవరూ లేరని, అన్నింటికీ తానే బాధ్యత వ్యవహరిస్తున్నట్లు చెప్పాడు. డబ్బు సంపాధించేందుకు మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, ఈ క్రమంలో విజయ్‌దేవరకొండకు విసిరిన సవాల్ గురించి రవి పోలీసులకు చెప్పాడు.ఈ ఏడాది ఆగష్టులో విజయ్‌దేవరకొండను ఉద్దేశించి సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. 2023లో ఖుషీ సినిమాను పైరసీ చేసి విజయ్ దేవరకొండకు ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా రవి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో రవి ఒప్పుకున్నాడు. ఖుషీ సినిమా సమయంలో ఏం జరిగిందో రవి ఇలా చెప్పాడు. 'మేము మీకు ముందే చెప్పాము.. మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మీ మీద కూడా ఫోకస్ చేయాల్సి వస్తుందని..! కానీ, మీరు మా మాట పట్టించుకోలేదు. మీరు ఏజెన్సీస్‌కి డబ్బులు ఇస్తున్నారు. కానీ, వాళ్లు మమ్మల్ని తొక్కి మా పేరుతో ఐ బొమ్మ ఎఫ్ఎఫ్ డాట్ ఇన్ పేరుతో రన్ చేస్తున్నారు. అలా మా పేరుతో తప్పుడు వెబ్సైట్లు రన్ చేస్తున్నారు. దీనిని ముందే హెచ్చరించాం.. అందుకే మీ కింగ్డమ్ సినిమాను విడుదలకు ముందే బయటకు తెస్తాం.' అంటూ గతంలోనే విజయ్ దేవరకొండను రవి హెచ్చరించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని పోలీసులు తెలిపారు. -
అందుకే ఐబొమ్మ అని పేరు పెట్టా: ఇమ్మడి రవి
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ఇమ్మడి రవి రెండవ విడత పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన నిందితుడి మెయిల్స్ నుంచి కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో మొత్తం 21 వేల సినిమాలు అప్లోడ్ అయినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఫైరసీకి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి రవి సైబర్ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో రవి తెలిపిన వివరాలు.. విశాఖలో సినిమాను బొమ్మ అనేవాళ్లం. ఐ బొమ్మ అంటే ఇంటర్నెట్ బొమ్మ. ఇంటర్నెట్లో బొమ్మ చూపిస్తున్నాం కదా.. అందుకే అలా పేరు పెట్టా. అలాగే మరో వెబ్సైట్ బప్పంగా మొదట అనుకున్న పేరు అది కాదు. బలపం అని పేరు పెడదామని అనుకున్నాం. కానీ, డొమైన్ నేమ్‌లో ఎల్(L) అనే అక్షరంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అందుకే బప్పం అని పెట్టాల్సి వచ్చింది. పైరసీ వెబ్‌సైట్స్ నుంచే సినిమాలు రికార్డు చేశాం. ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ను సైతం రికార్డింగ్ చేయగలిగాం. అలా రికార్డింగ్ చేసిన సినిమా ఆడియో.. వీడియో క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో ఔట్ సోర్సింగ్ వాళ్లతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే తాను అప్లోడ్ చేసిన సినిమాలను టెలిగ్రామ్ చానెల్స్ నుంచి సేకరించినవే అని రవి ఒప్పుకున్నాడు.ఇక.. రవి మెయిల్స్‌లో స్పామ్, హైడ్ ఫైల్స్‌లోనే డాటా మొత్తం దాటి ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. అలాగే ప్రహ్లద్ అనే వ్యక్తి గురించి వివరాలు సేకరించారు. తాము ఎన్జిల ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయ్యామని రవి తెలిపాడు. అయితే ఆ లింకును సైబర్ క్రైమ్ పోలీసులకు చూపించగా అంతలోపే లింక్ రివోక్ అయ్యాయి. దీంతో వాటిని సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. రెండో విడత కస్టడీ మొదటిరోజు విచారణలో.. ఎన్జీల నెట్వర్క్, ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్‌ను పోలీసులు సంపాదించారు. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్ సైట్స్ నిర్వహిస్తున్నా ముఠాలపై ఆరా తీశారు. రెండో రోజు విచారణలో మాత్రం రవి సరిగ్గా నోరు విప్పలేదు. పైగా.. బయటకు రాగానే మంచి పనులు చేస్తానంటూ పోలీసులతో అన్నట్లు సమాచారం. మొత్తంగా.. మూడు రోజులపాటు సాగిన రెండో విడత కస్టడీ నేటితో పూర్తైంది. దీంతో రవిని నాంపల్లి కోర్టుకు హాజరుపరిచి.. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోసారి కస్టడీ కోరతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సినీ పైరసీ కేసులో ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.


