సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవిపై ప్రముఖ నిర్మాత నాగవంశీ తాజాగా రియాక్ట్ అయ్యారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటిస్తున్న తాజా సినిమా ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. పైరసీ చేసిన అతడిని హీరోని చేసి చూస్తున్న సమాజంలో మనం జీవిస్తున్నామంటూ వంశీ అన్నారు. సినిమాకు రూ.50 టికెట్ ధర పెంచితే తమను తప్పుబట్టి కామెంట్లు చేసిన వారున్నారని ఆయన పేర్కొన్నారు. 'ఐబొమ్మ రవినే రాబిన్‌హుడ్ చేసిన లోకం ఉన్నాం మనం.. మేమేదో తప్పు చేసినట్టు టికెట్ రూ. 50 రూపాయలు పెంచితే మేము తప్పు చేసిన వాళ్లం అయ్యాం. ఆ అబ్బాయి హీరో అయిపోయాడు.' అని వంశీ అన్నారు.
‘బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటిస్తున్న తాజా సినిమాకి ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ అనే టైటిల్ ఖరారైంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.
#NagaVamsi :#Ibomma రవి నే ROBINHOOD చేసిన లోకం లో ఉన్నాం మనం " మేమేదో తప్పు చేసినట్టు, రేటు 50 రూపాయలు పెంచితే, ఆ అబ్బాయి హీరో అయిపోయాడు.#EPIC #News #Tollywood pic.twitter.com/FNEiqVrZ5i
— IndiaGlitz Telugu™ (@igtelugu) December 1, 2025


