బేబీ మూవీతో కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. వీరిద్దరు మరోసారి తెరపై సందడి చేయనున్నారు. ఆనంద్, వైష్ణవి జంటగా వస్తోన్న తాజా చిత్రం ఎపిక్. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ టైటిల్ ఆసక్తిని మరింత పెంచేసింది.
ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాకు తెలుగు మాట్లాడే హీరోయిన్ కావాలని డైరెక్టర్ ఆదిత్య హాసన్ చెప్పగా.. నేనే కచ్చితంగా ఆ ఇద్దరే కావాలని పట్టుపట్టానని నాగవంశీ చెప్పారు. బేబీ- 2 చేయండి.. 20 చేయండి… నాకు అనవసరం.. ఈ సినిమాకు మీ ఇద్దరే కావాలని గట్టిగా అడిగినట్లు వెల్లడించారు. వైష్ణవినే తీసుకోవాలని నేను గోలగోల చేస్కే.. ఆనంద్ మేనేజర్ ఒప్పుకోకపోయినా.. సమస్యే లేదు అంటూ.. వైష్ణవి ఉంటేనే చేద్దాం, లేకపోతే వద్దని చెప్పానని నాగవంశీ తెలిపారు.
బేబి 2 చేయండి, 20 చేయండి… నాకు అనవసరం. ఈ సినిమాకు మీ ఇద్దరే కావాలి. అని నేను గోలగోల చేసి ఆనంద్ మేనేజర్ ఒప్పుకోకపోయినా, సమస్యే లేదు అంటూ... వైష్ణవి ఉంటేనే చేద్దాం, లేకపోతే వద్దు అని చెప్పేశా.
– Producer Naga Vamsi #Epic Title Glimpse Launch Event pic.twitter.com/QaagJELcmp— idlebrain.com (@idlebraindotcom) December 1, 2025


