గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్కు నేటితో చెక్ పడింది. సామ్-రాజ్ ఎక్కడా కనిపించినా డేటింగ్ రూమర్స్ వైరలయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరు మరింత సన్నిహితంగా మెలగడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం దాదాపు ఫిక్సయిపోయారు. అందరూ అంచనాలను నిజం చేస్తూ రెండో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది సమంత. ఊహించిందే అయినప్పటికీ.. సామ్ స్టార్ హీరోయిన్ కావడంతో హాట్ టాపిక్గా మారింది. ఎట్టకేలకు ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.
ఇక పెళ్లి విషయం పక్కనపెడితే అందరి నోటా ఒకటే చర్చ నడుస్తోంది. రెండో పెళ్లి ఓకే.. కానీ వీరిద్దరు వయస్సు మధ్య తేడా ఎంత అనేది ప్రశ్న. ప్రేమ, పెళ్లికి వయసుతో పనేంటని అందరూ అంటూనే ఉంటారు. కానీ జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరి మధ్య వయసు తేడా అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సామ్- రాజ్ ఏజ్ గ్యాప్ ఎంతనేది కూడా నెట్టింట చర్చ మొదలైంది. పెళ్లి చేసుకునే జంటకు పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని అందరూ అనడ మనం వింటుంటాం. మరి వీరి మధ్య ఏంత తేడా ఉంది? అసలు సమంత- రాజ్ మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలుసుకుందాం.
సమంత రూత్ ప్రభు 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు. ఈ లెక్కన సమంతకు ప్రస్తుతం 38 ఏళ్లు. అయితే రాజ్కు సంబంధించిన అఫీషియల్ పుట్టినరోజు లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజ్ 1975 ఆగస్టు 4వ తేదీన తిరుపతలో జన్మించారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆయనకు ఇప్పుడు 50 ఏళ్లు. ఈ లెక్కన సామ్- రాజ్కు మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 12 సంవత్సరాలు. వయస్సుల పరంగా చూస్తే ఇద్దరి మధ్య ఇంత అంతరం ఉండడం చర్చకు దారితీసింది. దీంతో సమంత నిర్ణయంపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ప్రేమకు వయస్సుతో పనిలేదని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఇద్దరి మధ్య పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. సమంత రూత్ ప్రభు 2017లో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2021లో వివాహాబంధానికి గుడ్ బై చెప్పేసింది. తాజాగా మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. రాజ్ నిడిమోరును పెళ్లాడింది. రాజ్ సైతం గతంలో శ్యామలి దేను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. సామ్- రాజ్.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ల్లో కలిసి పనిచేశారు.


