రవితేజ కొత్త సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉన్న దృష్ట్యా ప్రమోషన్లు మొదలుపెట్టారు. 'బెల్లా బెల్లా' అంటూ సాగే తొలి పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. రవితేజ ఎప్పటిలానే డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, ఇతడి పక్కన ఆషికా రంగనాథ్ క్యూట్‌గా కనిపించింది. స్పెయిన్‌లో ఈ పాట చిత్రీకరించారు.
(ఇదీ చదవండి: అయ్యర్‌తో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన మృణాల్)
ఈ సినిమాలో రవితేజ సరసన ఆషిక, డింపుల్ హయతి నటిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకుడు. భీమ్స్ సంగీతమందించాడు. ఇదివరకే గ్లింప్స్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. రవితేజ ఈసారి హిట్ కొడతాడేమోనని అనుకుంటున్నారు. ఎందుకంటే గత కొన్ని చిత్రాలతో దారుణమైన ఫలితాలని అందుకున్న ఈ హీరో మార్కెట్ ఇప్పటికే చాలా డౌన్ అయిపోయింది. కాబట్టి ఈసారి సక్సెస్ చాలా కీలకం. మరి ఏం చేస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: 'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. ఏంటి ఆచారం?)


