2025 క్లైమాక్స్‌కి వచ్చేసింది. కొత్త ఏడాదికి మరో నెల మాత్రమే ఉంది. ఈ ఏడాది టాలీవుడ్‍కి ఉన్నంతలో బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, డాకు మహారాజ్, మిరాయ్, హిట్ 3, కుబేర, ఓజీ చిత్రాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. కోట్లకు కోట్లు కలెక్షన్స్ కూడా సాధించాయి. మరి డిసెంబరులో రాబోతున్న సినిమాలేంటి? వీటిలో ఎవరు హిట్ అయ్యే అవకాశముంది?
(ఇదీ చదవండి: 'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. ఏంటి ఆచారం?)
తొలివారంలో బాలకృష్ణ-బోయపాటి 'అఖండ 2' రాబోతుంది. దీనికి పోటీగా వేరే ఏ సినిమాలు లేవు. గతంలో దీని తొలి భాగం.. 2021 డిసెంబరులో వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్‌తోనే సీక్వెల్‌ని కూడా ఇదే నెలలో రిలీజ్ చేస్తున్నారు. తొలి పార్ట్‌లో ఎక్కువగా యాక్షన్‌ని నమ్ముకోగా, ఈసారి యాక్షన్‌తో పాటు డివోషనల్ అంశాలు కూడా బాగానే ఉండబోతున్నాయని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది. దీని ఫలితం ఏమొస్తుందో చూడాలి? దీనితో పాటు హిందీ చిత్రం 'ధురంధర్'.. 5వ తేదీనే రిలీజ్ కానుంది. కాకపోతే తెలుగు వరకు అయితే ఏ సమస్య ఉండదు.
రెండో వారంలో యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా చేసిన 'మోగ్లీ' రిలీజ్ కానుంది. రోషన్ తొలి మూవీ 'బబుల్ గమ్' ఫ్లాప్ అయినప్పటికీ.. ఈసారి దర్శకుడు సందీప్ రాజ్ కావడం కాస్త ఆసక్తికరంగా అనిపించింది. గతంలో ఈ డైరెక్టర్.. 'కలర్ ఫోటో' మూవీ తీశాడు. కాకపోతే అది ఓటీటీ రిలీజ్. ఈసారి మాత్రం థియేటర్ రిలీజ్. ఏం చేస్తారో చూడాలి? దీంతో పాటు నందు 'సైక్ సిద్ధార్థ్', ఘంటసాల, సకుటుంబానాం అనే తెలుగు చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. ఇదే తేదీన కార్తీ డబ్బింగ్ సినిమా 'అన్నగారు వస్తారు' రిలీజయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి డేట్ అధికారికంగా ప్రకటించలేదు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)

మూడో వారం తెలుగు నుంచి 'దేవగుడి' అనే చిన్న సినిమా మాత్రమే రిలీజ్ కానుంది. అయితే ఆ వీకెండ్‌లో 'అవతార్' ఫ్రాంఛైజీలో మూడో భాగం 'ఫైర్ అండ్ యాష్' రిలీజ్ కానుంది. దీనికి ప్రపంచవ్యాప‍్తంగా క్రేజ్ ఉంది. అవతార్ తొలి పార్ట్ వేల కోట్ల వసూళ్లు సాధించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో పార్ట్ మాత్రం ఓకే ఓకే అనిపించుకుంది. మరి మూడో పార్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇదే వారంలో 'డ్యూడ్' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ కొత్త మూవీ రిలీజ్ కానుంది. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' పేరుతో దీన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళంలో ఇది విడుదల కానుంది.
నాలుగో వారం బోలెడన్ని తెలుగు సినిమా లైన్‌లో ఉన్నాయి. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేసిన 'ఛాంపియన్', దండోరా, పతంగ్, శంబాల అనే చోటామోటా చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలోనూ దేనిపై అస్సలు బజ్ లేదు. రిలీజ్ టైంకి వస్తుందోమో చూడాలి. వీటితో పాటు చివరి వారంలో అనకొండ (తెలుగు డబ్బింగ్), ఇక్కీస్ (హిందీ సినిమా), వృషభ (మలయాళ డబ్బింగ్) అనే మూవీస్ కూడా రాబోతున్నాయి. వీటిలో అఖండ 2, అవతార్ 3కి మాత్రమే ప్రస్తుతం ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కనిపిస్తాయి. మిగిలిన వాటిలో కంటెంట్‌తో సర్‌ప్రైజ్ చేసి ఏమైనా హిట్ కొడితే క్లైమాక్స్ సుఖాంతం అయ్యే అవకాశముంది.
(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)


