breaking news
Avatar 3
-
జేమ్స్ కామెరన్ (డైరెక్టర్) రాయని డైరీ
‘అవతార్–3’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. సన్నగా మళ్లీ కడుపునొప్పి మొదలైంది! డైవర్టిక్యులిటిస్!! డాక్టర్లు ఈ నొప్పికి పేరైతే పెట్టారు కానీ, నయమవటం మాత్రం నా చేతుల్లోనే ఉందంటారు. నా చేతుల్లో అంటే – నేను తినే వాటిల్లో! ‘‘మిస్టర్ కామెరన్! ఇలా నొప్పి వచ్చినప్పుడు మీరు కొద్ది రోజుల పాటు కూరగాయల రసం మాత్రమే తాగండి. అలాగే గుజ్జు లేని పండ్ల రసాలు...’’ అంటారు వైద్యులు. ఈ మందు చీటీ నా దగ్గర ‘అవతార్–1’ ముందు నుంచే ఉంది. పొత్తి కడుపు కింద, ఎడమవైపు సన్నగా మొదలైన నొప్పి... కాసేపు మెలిపెడుతోంది, కాసేపు కత్తితో పొడిచినట్లుగా ఉంటోంది. ఆత్మశక్తిని కూడదీసుకుని పని చేస్తున్నాను. ‘‘ఏంటి మళ్లీనా?’’ అన్నారు, నా పక్కనే ఉన్న స్టీఫెన్ ఇలియెట్. ఫిల్మ్ ఎడిటర్ తను. అతడికి నా డైవర్టిక్యులిటిస్ గురించి తెలుసు.‘‘లేదు, లేదు... స్టీఫెన్, ఏదో కొద్దిగా! అంతే’’ అన్నాను, నవ్వే ప్రయత్నం చేస్తూ. పెయిన్ కన్నా కూడా పని ఆగి పోవటం ఎక్కువ పెయిన్ నాకు. డిసెంబర్లో ‘అవతార్–3’ రిలీజ్ పెట్టుకున్నాం. ఆ లోపే నేను అన్నీ సర్దేసుకుని న్యూజిలాండ్ వెళ్లిపోవాలి. ఇప్పటికి రెండుసార్లు యూఎస్ సిటిజెన్‌షిప్‌కు అప్లికేషన్ పెట్టి కూడా వెనక్కు తీసుకున్నాను. మొదటిసారి 2004లో జార్జి బుష్ అమెరికా ప్రెసిడెంటుగా రీ–ఎలెక్ట్ అయినప్పుడు. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ డోనాల్డ్ ట్రంప్ రీ–ఎలెక్ట్ అయినప్పుడు. హారిఫిక్ ప్రెసిడెంట్లు ఇద్దరూ! ఇలాంటి వాళ్లు మళ్లీ గెలవటం అంటే ఒకే కారుకు పదే పదే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండటం. అమెరికాను వదిలి, న్యూజిలాండ్ వెళ్లటం అంటే కేవలం ఇల్లు మారటం కాదు. ఒక మంచి ఇంట్లోకి మారటం! న్యూజిలాండ్ అందర్నీ సమానంగా చూస్తుంది. కెనడా నుంచి వెళ్లిన వారినైనా, వేరే ఖండం వారే అయినా అక్కడ ప్రశాంతంగా జీవించవచ్చు. ప్రశాంతంగా జీవించటం అంటే, జీవితమంతా ఇష్టంగా చేస్తూ వచ్చిన పనిని జీవితాంతమూ కొనసాగిస్తూ ఉండటం. నేనైతే ఎనభై ఏళ్లకీ, తొంభై ఏళ్లకీ ఎన్ని ‘అవతార్’లు తీయగలిగితే అన్నీ తీస్తూనే ఉంటాను. ఇక తీయలేనప్పుడు, సినిమా తియ్యటం ఎంత తేలికో పిల్లలకు చెబుతూ ఉండిపోతాను. న్యూజిలాండ్ వెళ్లినప్పుడు నన్నొక పట్టభద్రుడు కలిశాడు. ‘‘సర్! నేను సినిమా డైరెక్టర్ని అవ్వాలనుకుంటున్నాను. అవగలనా?’’ అని అడిగాడు.‘అవగలనా?’ అనుకుంటే ఎవరూ అవలేరు.‘‘అవలేనా!’ అనుకుంటే ఎవరైనా అవగలరు అన్నాను.అతడి కళ్లు మెరిశాయి. ‘‘ఒక కెమెరా తీసుకో. ఒక కథ అనుకో. చిన్న కథా, చెత్త కథా అని చూడకు. నీ ఫ్రెండ్స్ చేత యాక్ట్ చేయించు. నీకు సిస్టర్ ఉంటే తనకూ ఒక పాత్ర ఇవ్వు. షూటింగ్ అయ్యాక టైటిల్స్‌లో డైరెక్టర్‌గా నీ పేరు పెట్టుకో. ఇక అప్పట్నుంచీ నువ్వు సినిమా డైరెక్టర్! నువ్వెంత బడ్జెట్లో తీస్తావో, నీకెంత ఇవ్వాలో నిర్మాతలతో బేరం కుదుర్చుకో’’ అని చెప్పాను. మెరుస్తున్న అతడి కళ్లలో నాకు ‘జెనోజెనిసిస్’ సినిమా కనిపించింది. నా 24 ఏళ్ల వయసులో మా టీమ్ తీసిన తొలి సినిమా అది. 12 నిమిషాల సైన్స్ ఫిక్షన్ షార్ట్ ఫిల్మ్! ‘‘కామెరన్... కామెరన్... మళ్లీ మీరు న్యూజిలాండ్ వెళ్లిపోయారా?’’ అని, నా భుజం ఊపుతూ పండ్ల రసం అందించారు స్టీఫెన్.‘‘థ్యాంక్యూ స్టీఫెన్’’ అన్నాను, అతడి చేతిలోని గ్లాసును తీసుకుంటూ. స్టీఫెన్ నా భుజం ఊపినప్పుడు ఏ యాంగిల్లోనో నా కడుపు నొప్పి కాస్త తగ్గినట్లుగా అనిపించింది.కదలిక వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తోందీ అంటే నాకెందుకో నమ్మకం కలుగుతోంది – నేను ముందసలు అమెరికా నుంచి కదిలితే, ఈ డైవర్టిక్యులిటిస్ నన్నొదిలేస్తుందని!-మాధవ్ శింగరాజు -
'అవతార్3' ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ట్రైలర్‌పై ప్రకటన
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన విజువల్ వండర్ 'అవతార్'.. ప్రపంచ సినీ చరిత్రలో ఈ సినిమా ఒక సంచలనం. మొదటి భాగంలో పండోర అనే గ్రహాన్ని క్రియేట్ చేసి అందులోని ప్రకృతి అందాలను కళ్లుచెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు దర్శకుడు. ఆ తర్వాత పార్ట్2 ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’తో మెప్పించారు. తాజాగా దీని మూడో భాగం 'అవతార్- ఫైర్ అండ్ యాష్' గురించి అదిరిపోయే అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.అవతార్ ప్రాంఛైజ్ చిత్రాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మూడో భాగం 'అవతార్- ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆపై జులై 25న మొదటి ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2026 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా దాదాపు160 భాషల్లో 'అవతార్ 3' విడుదల కానుంది. పార్ట్2 అయిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'లో 'కేట్ విన్స్లెట్' చేసిన రోనాల్ పాత్రను అవతార్ 3లో మరింత పొడిగించామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పారు. అందుకోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకున్నట్లు కూడా తెలిపారు. అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా రానున్న 'అవతార్ 4' 2029లో, 'అవతార్ 5' డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే తెలిపింది. Meet Varang in Avatar: Fire and Ash.Be among the first to watch the trailer, exclusively in theaters this weekend with The Fantastic Four: First Steps. pic.twitter.com/MZi0jhBCI5— Avatar (@officialavatar) July 21, 2025 -
అవతార్ 3 కోసం నయా టెక్నాలజీ వాడుతున్న జేమ్స్..
-
అవతార్ 3 పై జేమ్స్ కెమారూన్ బిగ్ అప్డేట్..
-
అద్భుతాలు చూపిస్తాం: జేమ్స్ కామెరూన్
‘‘అవతార్, అవతార్ 2’ చిత్రాల తర్వాత ఈ ఫ్రాంచైజీలో రానున్న మూడో చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఎన్నో అంచనాలుంటాయి. ఆ అంచనాలను మించి మా సినిమా ఉంటుంది’’ అని ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘అవతార్’ (2009), ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (2022) సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.ఈ ఫ్రాంచైజీలో రానున్న మూడో చిత్రం ‘అవతార్–ఫైర్ అండ్ యాష్’. ఈ చిత్రానికి కూడా జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘అవతార్–ఫైర్ అండ్ యాష్’ గురించి జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ– ‘‘వెండితెరపై ఈ విజువల్ వండర్‌ను చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతారు. తొలి, ద్వితీయ చిత్రాల్లో చూపినవి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ధైర్యం చేసి సరికొత్తవి తీసుకొస్తున్నాం.ఇలా ధైర్యం చేసి కొత్తవాటిని సృష్టించకపోతే ప్రేక్షకుల సమయాన్ని, డబ్బును వృథా చేసినవాడిని అవుతాను. ‘అవతార్, అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రాల్లో లేని అద్భుతాలను ‘అవతార్–ఫైర్ అండ్ యాష్’లో చూస్తారు. అంచనాలకు మించిన లైవ్ యాక్షన్‌ని ప్రేక్షకులకు చూపించనున్నాం. ఓ కొత్త ప్రపంచంతో పాటు వైవిధ్యమైన కథ, పాత్రలు ఇందులో కనిపిస్తాయి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం డిసెంబరు 19న విడుదల కానుంది. -
అవతార్ 3 టైటిల్ రివీల్..
-
అవతార్ త్రీకి టైటిల్ ఫిక్స్
పండోరా ప్రపంచంలోకి మళ్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ ఫ్రాంచైజీ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ‘అవతార్’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘అవతార్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సినిమాలు వచ్చాయి. తాజాగా ‘అవతార్’ ఫ్రాంచైజీలోని మూడో సినిమాకు ‘అవతార్:ఫైర్ అండ్ యాష్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు, ఈ సినిమాను 2025 డిసెంబరు 19న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సామ్ వర్తింగ్టన్, జో సల్దాన, కేట్ విన్స్లెట్ తదితరులు ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక పండోరా అనే కల్పిత గ్రహం నేపథ్యంలో ‘అవతార్’ ఫ్రాంచైజీ చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. -
'అవతార్ 3' క్రేజీ అప్డేట్.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ ప్రకటన
90స్ జనరేషన్ పిల్లల్ని అవాక్కయ్యేలా చేసిన హాలీవుడ్ సినిమా 'అవతార్'. అప్పుడెప్పుడో 2009లో తొలి భాగం రిలీజ్ కాగా.. మళ్లీ 2022లో సీక్వెల్ రిలీజ్ చేశారు. మొత్తంగా వీటిని ఐదు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు మూడో పార్ట్ పేరుతో పాటు విడుదల తేదీని తాజాగా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)దిగ్గద దర్శకుడు జేమ్స్ కామెరూన్ తీసిన 'అవతార్' తొలి భాగం అప్పట్లో వసూళ్లలో ప్రపంచ రికార్డులు సృష్టించింది. దీన్ని పండోరా గ్రహంలో భూమిపై తీయగా.. 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' అనే పేరుతో వచ్చిన రెండో భాగాన్ని పూర్తిగా నీటిలో తీశారు. ఇప్పుడు మూడో భాగానికి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' అనే టైటిల్ నిర్ణయించారు. పంచ భూతాల్లో మూడోది అయిన అగ్ని కాన్సెప్ట్ బేస్ చేసుకుని దీన్ని తీస్తారని క్లారిటీ వచ్చేసింది.'అవతార్ 3' సినిమాని 2025 డిసెంబరు 19న థియేటర్లలో రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటించారు. అంటే మరో ఏడాది టైమ్ ఉంది. ఇది కాకుండా మరో రెండు పార్ట్స్ కూడా ఉన్నాయి. వీటిని 2027, 29లో విడుదల చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. కాకపోతే వాటి పేర్లు, రిలీజ్ డేట్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరో సూర్యకు గాయం) View this post on Instagram A post shared by Avatar (@avatar) -
అవతార్ 3 కాన్సెప్ట్ అదుర్స్.. అంచనాలను పెంచేసిన డైరెక్టర్
‘అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్ కామెరూన్. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్ అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2)ను తెరకెక్కించాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశాడు. పార్ట్ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు. దీంతో అవతార్ 3పై అందరికి ఆసక్తి నెలకొంది. పార్ట్ 3 నేపథ్యం ఏంటి? కొత్తగా ఏం చూపించబోతున్నారనే ఉత్సకత ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. తాజాగా అవతార్ 3 కాన్సెప్ట్ ఏంటో దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించాడు. నిప్పు నేపథ్యంలో అవతార్ 3 కొనసాగుతుందట. ఇటీవల క్రిటిక్ చాయిస్ అవార్డ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అవతార్ 2కి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ మూవీ అవార్డు లభించింది. తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్ కామెరూన్ పాల్గొని, అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవతార్ 3 ఎలా ఉండబోతుందో వివరించాడు. ‘అగ్ని ఒక చిహ్నం..ప్రయోజకారి. అవతార్ 3లో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. దీంతో పాటు మరో రెండో సంస్కృతులను కూడా పరిచయం చేస్తా. ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. ఇదంతా పండోరా గ్రహంలోనే జరుగుతుంది. ఇంతకు మించి ఏమి చెప్పలేను’అని జేమ్స్ కామెరూన్ అన్నారు. అవతార్2తో పాటే అవతార్ 3 షూటింగ్‌ని కూడా పూర్తి చేశాడు జేమ్స్ కామెరూన్. విజువల్ఎఫెక్ట్స్ పని మాత్రం మిగిలి ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పండోరా గ్రహంలోని ఏడాది ప్రదేశంలో ఈ సినిమా సాగుతుందని హాలీవుడ్ టాక్. అక్కడ ఉండే సంపదను దోచుకోవడానికి మనుషులు ప్రయత్నిస్తే.. వారిని జేక్ సెల్లీ ఫ్యామిలీ ఎలా అడ్డుకుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.