'అవతార్ 3' క్రేజీ అప్‍‌డేట్.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ ప్రకటన | Avatar 3 Movie Release Date And Title | Sakshi
Sakshi News home page

Avatar 3: 'అవతార్ 3' ఎప్పుడు రిలీజ్ కానుందంటే?

Aug 10 2024 8:45 AM | Updated on Aug 10 2024 10:07 AM

Avatar 3 Movie Release Date And Title

90స్ జనరేషన్ పిల్లల్ని అవాక్కయ్యేలా చేసిన హాలీవుడ్ సినిమా 'అవతార్'. అప్పుడెప్పుడో 2009లో తొలి భాగం రిలీజ్ కాగా.. మళ్లీ 2022లో సీక్వెల్ రిలీజ్ చేశారు. మొత్తంగా వీటిని ఐదు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు మూడో పార్ట్ పేరుతో పాటు విడుదల తేదీని తాజాగా అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్‌మెంట్.. ఇ‍ప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)

దిగ్గద దర్శకుడు జేమ్స్ కామెరూన్ తీసిన 'అవతార్' తొలి భాగం అప్పట్లో వసూళ్లలో ప్రపంచ రికార్డులు సృష్టించింది. దీన్ని పండోరా గ్రహంలో భూమిపై తీయగా.. 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' అనే పేరుతో వచ్చిన రెండో భాగాన్ని పూర్తిగా నీటిలో తీశారు. ఇప్పుడు మూడో భాగానికి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' అనే టైటిల్ నిర్ణయించారు. పంచ భూతాల్లో మూడోది అయిన అగ్ని కాన్సెప్ట్ బేస్ చేసుకుని దీన్ని తీస్తారని క్లారిటీ వచ్చేసింది.

'అవతార్ 3' సినిమాని 2025 డిసెంబరు 19న థియేటర్లలో రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటించారు. అంటే మరో ఏడాది టైమ్ ఉంది. ఇది కాకుండా మరో రెండు పార్ట్స్ కూడా ఉన్నాయి. వీటిని 2027, 29లో విడుదల చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. కాకపోతే వాటి పేర్లు, రిలీజ్ డేట్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరో సూర్యకు గాయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement