సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా గత నెల 15న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇప్పటికే రూ.800 కోట్ల వసూళ్లు సాధించింది.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. అలా బోలెలో అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు పూర్ణ తన స్టెప్పులతో డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ ఐటమ్ సాంగ్ రజినీకాంత్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ ఐటమ్ సాంగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.


