జాన్వీకి తెలుగులో ఛాన్స్‌లు రావని అర్థమైందా? | Janhvi Kapoor Comments On Tamil Movies Latest Interview | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్.. ముందే చూసుకోవాలిగా!

Nov 8 2026 12:59 PM | Updated on Nov 8 2026 1:06 PM

Janhvi Kapoor Comments On Tamil Movies Latest Interview

జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురు అని అందరికీ తెలుసు. తండ్రి బడా నిర్మాత కావడంతో ఇండస్ట్రీలోకి వచ్చింది. హిందీలో పలు సినిమాలు చేసింది గానీ కమర్షియల్ గా అవేవి పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్‌కి పాన్ ఇండియా గుర్తింపు రావడంతో ఈ హీరోలు తమ సినిమాల్లో జాన్వీని తీసుకున్నారు. కానీ ఈమెకు తెలుగులో పేరు రావడం సంగతి పక్కనబెడితే గ్లామర్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లి చేసుకున్న హీరోయిన్)

రీసెంట్‌గా 'కాఫీ విత్ కరణ్' షోలో పాల్గొన్న జాన్వీ.. రామ్ చరణ్ 'పెద్ది'లో తన సీన్స్ గురించి అసంబద్ధ వ్యాఖ్యలు చేసింది. తాను చేసిన సీన్లు తనకే నచ్చలేదని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ కారణంగా సోషల్ మీడియాలో జాన్వీపై తెలుగులో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటి వల్ల తెలుగులో ఇకపై హీరోయిన్లు ఛాన్సులు వస్తాయా అంటే సందేహమే.

‍అయితే ఈ విమర్శల వల్ల వచ్చిన డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు జాన్వీ మరో ఇంటర్వ్యూ వదిలింది. ఇందులో తన పిన్ని, ఒకప్పటి నటి మహేశ్వరితో కలిసి చాలా విషయాలు మాట్లాడింది. ఇటీవల ‘బ్లాస్ట్’ చూశాను. అందులో ప్రీతి ముకుందన్ నటన బాగుంది. సాయి అభ్యంకర్ మ్యూజిక్ వీడియోలకు నేను పెద్ద అభిమాని. దర్శకుడు వెట్రిమారన్ చిత్రాలంటే విపరీతమైన ఇష్టం. దళపతి విజయ్ ‘పోక్కిరి’ లాంటి కమర్షియల్ సినిమాలని ఇష్టపడతాను. నాన్న బోనీ కపూర్ రీమేక్ చేసిన తమిళ చిత్రాలని రెగ్యులర్‌గా చూస్తుంటాను అని జాన్వీ  చెప్పుకొచ్చింది.

ఉన్నట్లుండి జాన్వీ కపూర్.. తమిళ జపం చేయడంపై నెటిజన్లు ఆ‍శ్చర్యపోతున్నారు. ఎందుకంటే తెలుగులో ఇక అవకాశాలు రావని ఈమెకు అర్థమైందా? అని మాట్లాడుకుంటున్నారు. 

(ఇదీ చదవండి: తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టిన నాగదుర్గ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement