రాబిన్‌హుడ్ డిజాస్టర్.. డైరెక్టర్ రియాక్షన్ | Robinhood Movie Director Venky Kudumula Reaction On Movie Result | Sakshi
Sakshi News home page

Robinhood Movie: రాబిన్‌హుడ్ డిజాస్టర్.. డైరెక్టర్ రియాక్షన్

Nov 8 2026 2:35 AM | Updated on Nov 8 2026 2:35 AM

Robinhood Movie Director Venky Kudumula Reaction On Movie Result

'భీష్మ' వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో నితిన్ నటించిన చిత్రం రాబిన్ హుడ్. ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్‌  బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రాన్ని యునిక్‌ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. గతేడాది మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.

తాజాగా ఈ మూవీ ఫెయిల్యూర్‌పై దర్శకుడు వెంకీ కుడుముల స్పందించారు. ఈ సినిమా ఫలితం తేడా కొట్టడానికి నేనే కారణమని తెలిపారు. సినిమా ఆలస్యం కావడం వల్లే డ్యామేజ్ జరిగిందన్నారు. నా కంఫర్ట్ జోన్ నుండచి బయటకు వచ్చి ఆ కథ చేశానని వెల్లడించారు. కొత్త వరల్డ్ క్రియేట్ చేసి .. గాంజా కోసం ఒక ఊరిని ఆక్రమించిన విలన్ .. తర్వాత వాళ్ల కోసం వచ్చిన ఒక సేవియర్ ఇలా తీశానని తెలిపారు. అదే ఈ కథకు పెద్ద మైనస్ అయిందన్నారు.  ఫస్ట్ హాఫ్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ట్రాక్ మొత్తం రామ్ - కామ్‌గా తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వెంకీ కుడుముల పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement