రోహన్ రాయ్, అరుణ్ దేవ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం సమ్మర్ హాలీడేస్. ఈ మూవీకి శ్రీకర్ నాయన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నవంబరు 6న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు.
అమ్మ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాటకు భరద్వాజ్ గాలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి, సింధూజ తణుకు ఆలపించారు. ఈ సాంగ్‌ను సింజిత్ ఎర్రమల్లి కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ కీలక పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మించారు.


