మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో వస్తోన్న మూవీ కాకా. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ మొదటి వారం లోపు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది.
ఈ సినిమా వాయిదా పడనుందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ రచయిత, నిర్మాత అయిన కోన వెంకట్ స్పందించారు. కాకా మూవీపై వస్తున్నవీ కేవలం ఫేక్ న్యూస్ అన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా రాస్తున్నారని మండిపడ్డారు. మేము వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13న వస్తున్నామని ట్వీట్ చేశారు. సంక్రాతికి “కాకా” వస్తున్నాడు.. అసలైన పండగ తెస్తున్నాడు అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌తో కాకా వాయిదా పడుతుందన్న వార్తలకు చెక్ పడినట్లైంది.
కాగా.. ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Once again - Rest in Peace all the rumours, all fake news, all the baseless articles about “KAAKA” - Sorry to disappoint you but we are landing on Jan 13th 🚀 సంక్రాతికి “కాకా” వస్తున్నాడు 🔥 అసలైన పండగ తెస్తున్నాడు 🕺 @dirbobby @KvnProductions https://t.co/M1q3I9QH4g
— KONA VENKAT (@konavenkat99) November 6, 2026


