విందు... పసందు | Bollywood Celebrities at Diwali Celebrations | Sakshi
Sakshi News home page

విందు... పసందు

Nov 7 2026 3:55 AM | Updated on Nov 7 2026 3:55 AM

Bollywood Celebrities at Diwali Celebrations

ప్రీ దివాలీ వేడుకల్లో స్టార్స్‌ హంగామా 

పండగ రోజు ఎలానూ పండగ చేసుకుంటాం. అదే ఓ రెండు రోజులు ముందుగానే ఫెస్టివ్‌ మూడ్‌లోకి వెళ్లిపోతే... బాలీవుడ్‌లో అదే జరిగింది. దీపావళి సమీపిస్తుందనగా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’ అంటూ కొందరు ప్రముఖులు పార్టీ ఇస్తుంటారు. అలా పార్టీ హోస్ట్‌ చేసేవారిలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఒకరు. సినిమాల్లో ధరించే దుస్తుల నుంచి వారి పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు... ఇలా దాదాపు అన్నింటికీ మనీష్‌తోనే కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయించుకుంటుంటారు స్టార్స్‌. 

అభిషేక్, ఐశ్వర్య,

కరీనా, సైఫ్

మాధురి, శ్రీరామ్

కుమారుడు ఆరవ్‌తో ట్వింకిల్, అక్షయ్‌

అలాంటి డిజైనర్‌ ఎంతో ఆడంబరంగా, ఆహ్లాదకరంగా డిజైన్‌ చేసిన పార్టీకి పలువురు ప్రముఖ స్టార్స్‌ హాజరయ్యారు. గురువారం రాత్రి జరిగిన ఈ వేడుకకు ఒకరిని మించి ఒకరు అందంగా ముస్తాబై రావడంతో పార్టీ కలర్‌ఫుల్‌గా మారింది. ‘వాళ్లిద్దరూ విడిపోతున్నారట’ అనే మాటలకు ఫుల్‌స్టాప్‌ పడేలా అభిషేక్‌ బచ్చన్, ఐశ్వర్యా రాయ్‌ చేతిలో చెయ్యేసుకుని పార్టీకి హాజరు కావడంతో పాటు చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. బ్లాక్‌ కలర్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్, సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యారు. 

ఇంకా షారుక్‌ ఖాన్‌–గౌరీ ఖాన్, సుహానా ఖాన్, సైఫ్‌ అలీ ఖాన్‌–కరీనా కపూర్, అక్షయ్‌కుమార్‌–ట్వింకిల్‌ ఖన్నా, కాజోల్, మలైకా అరోరా, శ్రీలీల, అనన్య పాండే తదితరులు ఈ ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఇక ఫ్యాషన్‌ ఐకాన్‌ నీతా అంబానీ ఈ పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వెరైటీ కేక్స్, బిస్కెట్స్, స్వీట్స్, పంజాబీ వంటకాలు... ఇలా మనీష్‌ ఏర్పాటు చేసిన పసందైన విందుని అతిథులు ఫుల్‌గా ఆస్వాదించారు.


 సోదరడు అమన్‌తో రకుల్

రవీనా టాండన్,

మనీష్‌ మల్హోత్రా

కుమార్తె నైసాతో కాజోల్,

జాన్వీ

అనన్య 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement