పాంచ్‌ డైలాగ్స్‌ ఆఫ్‌ పటాకులు ‘మిస్టర్‌ టపాస్‌’! | Diwali 2026: Dialogues for Diwali Firecrackers Funny Story | Sakshi
Sakshi News home page

పాంచ్‌ డైలాగ్స్‌ ఆఫ్‌ పటాకులు ‘మిస్టర్‌ టపాస్‌’!

Nov 6 2026 5:15 PM | Updated on Nov 6 2026 5:50 PM

Diwali 2026: Dialogues for Diwali Firecrackers Funny Story

‘‘డియర్‌ దీపావళి పటాకులూ! ‘మిస్టర్‌ పటాక్‌’ టైటిల్‌కు మీ అందరి నుంచీ ఎంట్రీలను ఇన్వైట్‌ చేశాంగానీ... ఎంత ట్రై చేసినా మీ అందరూ ఎవరికి వారే గొప్ప అనిపిస్తోంది. మీలో ఎవరినీ ఎన్నుకోలేక ΄ోతున్నాం. మీ మీ స్పెషాలిటీస్‌ ఏమిటో మీరే చెప్పుకోండి’’ చేతులెత్తేసిన జ్యూరీ అక్కడ సమావేశమైన పటాకులందరికీ విజ్ఞప్తి చేసింది. 

మా బుజ్జిగాడు గాడికోసం తెచ్చిన బాంబులన్నింటినీ నాల్రోజుల నుంచి టీవీ ముందే ఆరబెట్టాడు వాడు. టీవీలో వచ్చే మూవీలన్నీ వాటికి బాగా పట్టేశాయి. దాంతో ఒక్కొక్క పటాకూ ఒక్కోరకం పంచ్‌ డైలాగుని పటపటలాడించడం మొదలుపెట్టేశాయి. 

అదెలాగంటే... ‘‘నేను... ఒక్కసారి అంటించుకుంటే వందసార్లు పేలినట్టే రా’’ థౌజెండ్‌ వాలా కాస్తా...  రజనీ స్టైల్లో ఒత్తి చెబుతూ... స్టైలిష్‌గా ఒత్తి ఊపుకుంటూ వెళ్లింది. 

‘‘రేయ్‌... ఊరుకోబే... చిచ్చుబుడ్డి అంటే ఫైరనుకుంటివా... ‘ఫ్లవరూ... వైల్డ్‌ ఫ్లవర్సూ’’ అంది ఫ్లవర్‌పాట్‌ అలియాస్‌ చిచ్చుబుడ్డి. అక్కడితో ఊరుకోలేదు. తన పేరునే ‘పుష్ప’ తెలుగులో తన పేరు పెట్టుకున్నాడంటూ బుస్సుమంటూ పొంగుతూ చెప్పింది. 

‘‘ఎవరిని అంటిస్తే స్కైలోకి దూసుకెళ్లాక... రెడ్డూ, గ్రీనూ, బులుగూ జిలుగూ లైట్లు నిండిపోతాయో... ఆడేరా ఈ రాకెట్టుగాడూ... ఇప్పుడు చెప్పండ్రా మిస్టర్‌ పటాకెవడో’’ డైలాక్కొట్టింది ఆకాశంలోకి వెళ్లాక పూలుచిమ్మే స్పార్క్‌లింగ్‌ రాకెట్టు. 

‘‘రేసుగుర్రంలా దూసుకు΄ోయేదేరా ఈ కీసుపిట్ట...’’ అంది అది... క్రీ...చ్‌...చ్‌... మంటూ ఆ సినిమా టైటిల్‌ బీజీఎంని ‘కీసూ కీసూ కీసూ’ అంటూ మోగిస్తూ! 

చాలా బలంగా పేలుతుంది కాబట్టి వంకాయ్‌ బాంబుకు వత్తి కాస్త పెద్దగా పెట్టడంతో కాలీ కాలీ కాస్త లేట్‌గా ఢామ్మంది. దాంతో మిగతా బాంబులు ‘రేయ్‌... లేటు వంకాయ్‌గా’ అంటూ వెక్కిరించాయ్‌. ఒ(ళ్లు)త్తి మండుకొచ్చిన వంకాయ్‌ బాంబుగాడు ‘‘ఎప్పుడంటించారని కాదన్నయ్యా... భయపెట్టేలా పేలామా లేదా’’ అంటూ పోకిరీ సమాధానమిచ్చింది. 

‘‘ఆడు కాదని ఈడూ... వీడు కాదని వాడూ... ఎవడైనా నన్ను మండిస్తే... (కాస్త గ్యాపిచ్చి) మాడిపోతా... మసైపోతా’’ అంటూ కసిగా డైలాకొట్టాడు పాంబిళ్లగాడు. 

‘‘మిర్చీ మిర్చీ మిర్చీ మిర్చీ మిర్చీ లాంటి పటాసే... మిర్చీ మిర్చీ... మిర్రా మిర్రా మిర్రా మంటూ ఒత్తీ కాల్చి పేలాడే’’ అంటూ తన పాటను తానే పాడుకుంటూ మిర్చీ బాంబు మిడిసిపడింది. 

‘‘వెలుగులు కాస్త తక్కువే వస్తాయేమోగానీ... నేనూ కాలుతూ అంతో ఇంతో బ్రైట్‌గానే వెలుగుతా అత్తా... పిల్లలకేమాత్రం డేంజరు కాకుండా నేనూ వెలుగుతానని గుర్తించత్తా గుర్తించు!!’’ అంటూ వాపోయింది తాడు. 

‘‘రవితేజ సినిమాకు పెట్టిన ‘క్రాక్‌’ టైటిల్‌ ఎవరిదనుకున్నావ్‌? నా అసలు పేరు ‘క్రాక్‌’ రపువ్వొత్తిరా. అసలు... ఏ పటాసు పేలాలన్నా, పేల్చాలన్నా నాతోనే రా. అన్ని బాంబుల్నీ వెలిగించే అసలు క్రాకరేరా ఈ ‘క్రాకర్‌’పువ్వొత్తీ’’ నాలుగో సింహం డైలాగు  స్టైల్లో సెల్ఫ్‌డబ్బా కొట్టుకుంది కాకరపువ్వొత్తి.
‘‘ఒరేయ్‌... మీరంతా కాదురా... దీపావళి రాత్రికి మిమ్మల్ని కస్సుమంటూ కాల్చి... ఢామ్మంటూ పేల్చి, వెలుగొలొచ్చేలా వెలిగించి... తుస్సుమన్నవాటినీ వదలకుండా బుస్సుమంటూ బూడిదచేసే నేనేరా అసలైన మిస్టర్‌ టపాసూ’’ అన్ని బాంబులకూ తనదైన స్టైల్లో వార్నింగిస్తూ  క్లైమాక్స్‌ బ్యాంగిచ్చాడు నా ఆరేళ్ల అసలు సిసలు సిసింద్రీగాడైన మా బుజ్జిగాడు.

– యాసీన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement