ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకం ఎక్కువై చిన్న, పెద్ద అనే తేడాలేకుండా అందరు మెడకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్క్రీన్ల సమయం అధికమై కేవలం కంటి చూపుని కాదు..అన్నింటికంటే ప్రధానమైన మెడ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది మన నిద్రనాణ్యతపై ప్రభావం చూపి పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు సైతం హెచ్చరిస్తుంటారు. అయితే రోజువారీ జీవితంలో భాగమైన ఆ గాడ్జెట్లు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. పైగా అందుకు తగ్గట్టుగా ఏదో ఒక వెసులుబాటు చూసుకుంటామే గానీ తగ్గదే లే, ఆ అలవాట్లు మానుకునేదే లే అనే వాళ్లే ఎక్కువయ్యారు. ఇదంతా ఎందుకంటే ఇక్కడొక మహిళ అచ్చం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటూ పైగా ఏం పనిచేసిందో తెలిస్తే నోరెళ్లబెడతారు.
విపాన్‌దీప్ కౌర్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ కూడా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ కారణంగా విపరీతంగా మెడ సమస్యలు ఎదుర్కొంటోంది. అది కాస్తా ఆమె నిద్రపై ప్రభావం చూపి నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆమెకు నిద్ర అంటే మహా ఇష్టం. ఎలాగైన ఈ సమస్యకు చెక్కుపెట్టాలని అనుకుంది. ఈలోగా అనుకోకుండా జపాన్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో ఉండగా..ఆమె హోన్‌బాషిలోని 400 ఏళ్ల నాటి 'నిషికావా' (Nishikawa) అనే జపనీస్ ప్రసిద్ధ బెడ్డింగ్ బ్రాండ్ దుకాణంని సందర్శించి అక్కడ ఒక దిండుని కొనుగోలు చేసింది.
ఆ దిండు అలాంటి ఇలాంటి పిల్లో కాదు. అంత ప్రత్యేకత ఏముందంటే..మంచి నిద్ర కోసం ప్రత్యేకంగా తయారు చేసిన దిండు అట. కస్టమర్‌కి ఏ రకమైన వస్త్ర బెటర్..అతడి శరరీ భంగిమ ఎలా ఉంటుంది, ఎన్నాళ్ల నుంచి మెడ సమస్యలు ఎదుర్కొంటున్నాడు..ఇవన్నీ బేరీజు వేసుకుని మరి డిజైన చేస్తారట ఈ దిండుని. సింపుల్‌గా చెప్పాలంటే మన నిద్ర అలవాట్లకు అనుగుణంగా డిజైన్ చేసిన దిండు అట. దీని ఖరీదు అక్షరాలు రూ. 40వేలట. నిద్ర నిపుణులు పర్యవేక్షణలో దీన్ని తయారు చేస్తారట. మన ఎత్తు, అలవాట్లు, కావల్సిన కొలతలు ఆధారంగా దిండు తయారీ ప్రక్రియని ప్రారంభిస్తారట.
ఈ దిండులో 'బ్లాక్ బిన్చోటాన్ చార్‌కోల్ పైప్ బీడ్స్' (black Binchotan charcoal pipe beads) ఉంటాయట. వీటిని దిండులో నింపడం వల్ల నిద్ర మరింత సౌకర్యవంతంగా ఉండటమే గాక శరీర భంగిమ మెరుగుపడుతుందట. ఆ విషయాన్నే ఈ చార్టర్డ్ అకౌంటెంట్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ..తాను మంచి దానిపైనే పెట్టుబడి పెట్టాను కదూ..అని అడిగింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ అలవాట్లు మానుకుంటే సరికదా..! ఇంత ఖర్చు అవసరమా? అని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టగా, కొందరు మాత్రం మా వద్ద కూడా అన్ని డబ్బులుంటే కచ్చితంగా కొనుగోలు చేసేవాళ్లమని అన్నారు.
ఇదీ చదవండి: వజ్రాల తళుకులు..క్రిస్టల్ బ్లౌజ్ మ్యాజిక్! అందరి దృష్టి నీతా అంబానీ పైనే..


