ఎంత వెతికినా దొర‌క‌లేదు.. పాపం కోహ్లి! | Kohli-Search-His-Favourite-Watch-During-Mid-Match-1st ODI-Viral | Sakshi
Sakshi News home page

ఎంత వెతికినా దొర‌క‌లేదు.. పాపం కోహ్లి!

Nov 5 2026 7:36 AM | Updated on Nov 5 2026 7:51 AM

Kohli-Search-His-Favourite-Watch-During-Mid-Match-1st ODI-Viral

Photo Credit: Twitter

ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో వ‌ర్షం పలుమార్లు అడ్డంకులు సృష్టించిన‌ప్ప‌టికీ, టీమిండియా విజ‌య‌బావుటా ఎగుర‌వేసింది. బ‌ర్త్‌డేకు ఒక్కరోజు ముందు హాఫ్ సెంచ‌రీతో రాణించి అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. కానీ కోహ్లి మాత్రం ఒక వ‌స్తువు క‌నిపించ‌క మైదానంలోనే తెగ బాధ‌ప‌డిపోయాడు. దానికోసం పిచ్ పరిస‌రాలు మొత్తం వెతికినా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. 

ఇంత‌కీ కోహ్లి వెతికిందో ఏంటో తెలుసా.. త‌న చేతికుండే ఖ‌రీదైన రిస్ట్ వాచ్ బ్యాండ్‌. విష‌యంలోకి వెళితే.. భార‌త బ్యాటింగ్ స‌మ‌యంలో ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్ నాథ‌న్ స్మిత్ వేశాడు. ఆ ఓవ‌ర్ ఐదో బంతిని కోహ్లి పుల్ షాట్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ బంతి అత‌ని రిస్ట్‌ను తాకింది. దీంతో అత‌డి చేతికున్న వాచ్ విరిగిపోయి కింద‌ప‌డిపోయింది. 

ఇది గ‌మ‌నించని కోహ్లి బ్యాటింగ్ కొన‌సాగించాడు.  ఓవ‌ర్ ముగిసిన త‌ర్వాత త‌న చేతికి వాచ్ లేద‌న్న విష‌యాన్ని గ‌మ‌నించిన‌ కోహ్లి దానికోసం పిచ్ ప‌రిస‌రాల్లో వెతికాడు. చివ‌ర‌కు వాచ్‌ బ్యాండ్ దొరికిన‌ప్ప‌టికీ, కీల‌క‌మైన పిన్ మాత్రం క‌నిపించ‌లేదు. అనుకుంటే కోహ్లి మ‌రో వాచ్ కొనుక్కోవ‌చ్చు. 

కానీ పిన్ కోసం అంత వెతుకులాడాడంటే క‌చ్చితంగా అది స్పెష‌ల్ గిఫ్ట్ అయి ఉంటుంది. ఇక దాని విలువ ప్ర‌త్యేకంగా చెప్పాలా?. అయితే కోహ్లి త‌న రిస్ట్ వాచ్ బ్యాండ్ కోసం అంత‌లా వెత‌క‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

 

ఇదీ చదవండి: వయసు ఒక అంకె మాత్రమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement