టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో మరోసారి తన నిలకడైన ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 51 బంతుల్లో 74 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అతడు.. న్యూజిలాండ్ గడ్డపై తన వన్డే సగటును 49.66 నుంచి 51.53కు పెంచుకున్నాడు. తద్వారా SENA (సౌతాఫ్రికా (76.38), ఇంగ్లండ్ (51.48), న్యూజిలాండ్ (51.53), ఆస్ట్రేలియా (50.03)) దేశాల్లో 50కిపైగా సగటు సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఆ ఒక్క దేశంలో మాత్రం..!
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో 50కి పైగా వన్డే సగటుతో పరుగులు సాధించిన విరాట్ ఒక్క శ్రీలంకలో మాత్రం 50 కంటే తక్కువ సగటుతో పరుగులు చేశాడు. ఇప్పటివరకు శ్రీలంక గడ్డపై 29 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు 45.25 సగటుతో 1086 పరుగులు చేశాడు. అయితే లంక గడ్డపై తాను సాధించిన పరుగుల్లో ఏకంగా ఐదు సెంచరీలు ఉండటం విశేషం.
దేశాల వారీగా విరాట్ వన్డే బ్యాటింగ్ సగటు
దక్షిణాఫ్రికా- 76.38
బంగ్లాదేశ్- 73.13
భారత్- 62.81
జింబాబ్వే- 60.83
వెస్టిండీస్- 58.92
యూఏఈ- 54.50
న్యూజిలాండ్- 51.53
ఇంగ్లండ్- 51.48
ఆస్ట్రేలియా- 50.03
శ్రీలంక- 45.25
ఇదిలా ఉంటే, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ జరిగిన తొలి వన్డేలో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత భారత బౌలర్లు చెలరేగగా.. ఆతర్వాత విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇదీ చదవండి: షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై


