షెడ్యూల్‌ విడుదల.. తొలి మ్యాచ్‌ ఆర్సీబీ వర్సెస్‌ ముంబై | WPL 2027 Schedule Released | Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌ విడుదల.. తొలి మ్యాచ్‌ ఆర్సీబీ వర్సెస్‌ ముంబై

Nov 4 2026 6:56 PM | Updated on Nov 4 2026 6:56 PM

WPL 2027 Schedule Released

source: X

మహిళల ఐపీఎల్‌ (WPL) 2027 ఎడిషన్‌ (ఐదవది) షెడ్యూల్‌ ఇవాళ విడుదలైంది. ఈ ఎడిషన్‌ మ్యాచ్‌లు జనవరి 14-ఫిబ్రవరి 7 మధ్యలో జరుగనున్నాయి. ఈ ఎడిషన్‌లో జరుగబోయే మొత్తం 22 మ్యాచ్‌లు వడోదర, ముంబై వేదికలుగా జరుగనున్నాయి. చెరో వేదిక తలో 11 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది.

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఆర్సీబీ, రెండు సార్లు ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ తలపడతాయి. ఈ మ్యాచ్‌ వడోదర వేదికగా జరుగనుంది. ఫిబ్రవరి 5, 7 తేదీల్లో జరిగే ఎలిమినేటర్‌, ఫైనల​్‌ మ్యాచ్‌లు ముంబై వేదికగా జరుగనున్నాయి. ఈ ఎడిషన్‌ మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

కాగా, గత ఎడిషన్‌ ఫైనల్లో ఆర్సీబీ-ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడిన విషయం తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఆ ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి రెండో సారి ఛాంపియన్‌గా అవతరించింది. వరుసగా నాలుగో ఎడిషన్‌ ఫైనల్లోనూ ఓడిన ఢిల్లీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

ఇదీ చదవండి: పరుగుల వరద.. వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన అనామక బ్యాటర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement