IPL 2027: ముంబైకి గుడ్‌బై?.. సూర్యకుమార్‌ పోస్ట్‌ వైరల్‌ | Suryakumar Yadav Drops Hint On MI Future With Cryptic Post Video Viral | Sakshi
Sakshi News home page

IPL 2027: ముంబైకి గుడ్‌బై?.. సూర్యకుమార్‌ పోస్ట్‌ వైరల్‌

Nov 3 2026 6:38 PM | Updated on Nov 3 2026 7:21 PM

Suryakumar Yadav Drops Hint On MI Future With Cryptic Post Video Viral

సూర్యకుమార్‌ యాదవ్‌ (PC: MI/IPL)

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌తో టీమిండియా మాజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది. 2018 నుంచి అతడు జట్టులో భాగంగా ఉ‍న్నాడు. 2019, 2020 టైటిల్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ప్రపంచకప్‌ అందించిన సారథి
ఈ క్రమంలోనే టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన సూర్య అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి టీ20 జట్టు కెప్టెన్‌గా ఎదిగాడు. పొట్టి ఫార్మాట్లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌ స్థాయికి చేరిన ఈ ముంబైకర్‌.. రోహిత్‌ శర్మ తర్వాత సారథిగా పగ్గాలు చేపట్టాడు.

ఆ వెంటనే జట్టులో చోటు గల్లంతు
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కెప్టెన్‌గా భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు సూర్య. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో జట్టులోనే అతడికి స్థానం లేకుండా పోయింది. వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాతి సిరీస్‌ నుంచే సెలక్టర్లు అతడిపై వేటు వేశారు. వ్యక్తిగత ప్రదర్శనలో వైఫల్యాలే ఇందుకు కారణం.

ముంబైకి గుడ్‌బై
ఇక ఐపీఎల్‌-2026 సీజన్‌లోనూ సూర్య బ్యాటర్‌గా విఫలమయ్యాడు. పదిమూడు ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 270 పరుగులు చేయగలిగాడు. ఈ నేపథ్యంలో ముంబై యాజమాన్యం సూర్యను వదిలించుకునేందుకు సిద్ధమైందని.. అతడి పట్ల లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆసక్తి చూపుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా అతడిని నియమించుకోవాలని భావిస్తున్న లక్నో ఫ్రాంఛైజీ అతడిని ట్రేడ్‌ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సూర్య పోస్ట్‌ వైరల్‌
ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ సోషల్‌ మీడియా వేదికగా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ముంబై ఇండియన్స్‌ శిబిరంలో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను సూర్య ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. తద్వారా తాను జట్టు మారే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పాడు. 

ఇదీ చదవండి: విధ్వంసకర శతకం.. ఆపై అజేయ డబుల్‌ సెంచరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement