Lucknow Super Giants
-
ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్లో లక్నోపై కేకేఆర్ విజయం
ఐపీఎల్-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మాజాను అందించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ ఓవర్లో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌ను రింకూ తన విరోచిత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు.రింకూ సింగ్ కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 పరుగులు అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మొహ్సిన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సెన్సేషనల్ షమీఅనంతరం లక్ష్య చేధనలో లక్నో కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. కార్తీక్ త్యాగి వేసిన చివరి ఓవర్లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరమవ్వగా.. షమీ చివరి బంతికి సిక్స్ కొట్టడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్‌తో ఫలితం తేల్చాలని అంపైర్లు నిర్ణయించారు. అయితేసూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో మూడు బంతుల్లో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఒక్క పరుగు చేసింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో తొలి బంతికి పూరన్ క్లీన్ బౌల్డ్ కాగా.. రెండో బంతికి పంత్ సింగిల్ తీసి మార్క్రమ్కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి మార్క్రమ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రూల్స్ ప్రకారం.. సూపర్ ఓవర్లో రెండు వికెట్లు వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత తొలి బంతికే రింకూ సింగ్ ఫోర్ కొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు. -
ఫినిషర్ ఈజ్ బ్యాక్.. రఫ్ఫాడించిన రింకూ సింగ్
ఐపీఎల్-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ రింకూ సింగ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌ను రింకూ తన విరోచిత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఓ దశలో ఆచితూచి ఆడిన రింకూ.. చివరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.మహ్మద్ షమీ వేసిన 19 ఓవర్లో 17 పరుగులు రాబట్టిన రింకూ సింగ్.. ఆ తర్వాత ఆఖరి ఓవర్లో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీని ఓ ఆడుకున్నాడు. ఆ ఓవర్లో రింకూ వరుసగా నాలుగు సిక్స్‌లు బాది 26 పరుగులు పిండుకున్నాడు. మరో రెండు పరుగులు వైడ్స్ రూపంలో వచ్చాయి.కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రింకూ సింగ్.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రింకూ సింగ్‌కు ఐపీఎల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం.నిప్పులు చెరిగిన మొహ్సిన్ఇక రింకూ సునామీకి ముందు లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ టాపర్డర్‌ను మోహ్షిన్ కుప్పకూల్చాడు. మొహ్సిన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో లిండే ఓ వికెట్ సాధించారు. మహ్మద్ షమీతో సహా మిగితా బౌలర్లందా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'Rinku Singh and multiple sixes in the last over - we've seen this before 🔥pic.twitter.com/6LOikbBKMG— Cricbuzz (@cricbuzz) April 26, 2026 -
లక్నో వర్సెస్ కేకేఆర్ మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ సిద్దార్ధ్ స్ధానంలో లిండే తుది జట్టులోకి వచ్చాడు. కేకేఆర్ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), కెమెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిలక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్ -
గొయెంకాపై తప్పుడు పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు యజమాని అయిన సంజీవ్ గొయెంకా విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తన పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాడుతూ అవమానకరమైన పోస్టులు, వీడియోలు రూపొందిస్తున్నారని గొయెంకా ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తన ముఖాన్ని ఇతరుల శరీరాలకు జతచేసి, హింసాత్మక లేదా అనుచిత దృశ్యాల్లో చూపిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు గొయెంకాకు వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కల్పించింది. ఐపీఎల్ 2026 సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్, ఏఐ ఆధారిత కంటెంట్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది.గొయెంకా తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేథి వాదనలు వినిపించారు. "ఇది సరదా కాదు, వ్యంగ్యం కాదు. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం" అని కోర్టుకు తెలిపారు. ఇటువంటి కంటెంట్ వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు ఆయన వ్యాపార సంస్థలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రజా ప్రముఖులు విమర్శలను, వ్యంగ్యాన్ని భరించాల్సి ఉంటుందని పేర్కొంటూనే.. డిజిటల్ మార్ఫింగ్, డీప్‌ఫేక్‌ల ద్వారా తప్పుడు కథనాలు సృష్టించడం మాత్రం అనుమతించలేమని స్పష్టం చేసింది.ప్రత్యేకంగా గొయెంకాపై ఐపీఎల్ నేపథ్యంలో వైరల్ అవుతున్న కంటెంట్ హద్దులు దాటిందని కోర్టు అభిప్రాయపడింది. వ్యంగ్యానికి, అవమానానికి మధ్య స్పష్టమైన రేఖ ఉందని తెలిపింది.ఈ ఉత్తర్వులతో గోయెంకా పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని వక్రీకరించి ప్రచారం చేసే కంటెంట్‌ను తొలగించేందుకు మార్గం సుగమమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచలనం!
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస ఓటములతో సతమతవుతున్నప్పటికి.. ఆ జట్టు యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.ముఖ్యంగా ఈ ఢిల్లీ పేసర్ రెడ్-సాయిల్ పిచ్‌లపై సరైన లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ప్రిన్స్ పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో నిలకడగా వికెట్లు తీస్తూ లక్నో ప్రధాన బౌలర్‌గా మారాడు. ఈ ఏడాది సీజన్లో ప్రిన్స్ యాదవ్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో ఉన్నాడు.బుధవారం ఏకానా స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ప్రిన్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. యార్కర్ల వేయడంలో ప్రిన్స్ దిట్ట. దీంతో అతడిని వీలైనంత త్వరగా భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.ప్రస్తుత భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్లు లేరు. సిరాజ్ ఎక్కువగా టెస్టులకే మాత్రమే పరిమితమవుతున్నాడు. దీంతో బుమ్రాపై వర్క్‌లోడ్ పడుతోంది. ఈ క్రమంలో ప్రిన్స్ యాదవ్ వంటి యువ సంచలనం జాతీయ జట్టులోకి వస్తే భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.आयरलैंड दौरे के लिए Prince Yadav का नाम फाइनल समझिए।Prince Yadav का चयन नहीं हुआ तो घोर जातिवाद समझिए। pic.twitter.com/xvqmzz0S5e— Comrade Yadav (@Comrade6989) April 15, 2026ప్రిన్స్ యాదవ్ డొమాస్టిక్ క్రికెట్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 14 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన ప్రిన్స్.. 5.15 ఏకానమితో 29 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా 35 టీ20 వికెట్లు కూడా అతడి పేరిట ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో టీ20 జరిగే టీ20 సిరీస్‌లో భారత తరపున ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేసే అవకాశముంది.చదవండి: IPL 2026: సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్ -
ధోనిని దాటేసిన పంత్
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా, మ్యాచ్‌ను గెలిపించే నాథుడు ఒక్కడు కూడా లేడు. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 5 పరాజయాలు ఎదుర్కొంది. కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది.తాజాగా (ఏప్రిల్ 22) రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసి ప్రత్యర్దిని 159 పరుగులకే కట్టడి చేసినప్పటికీ.. ఆపాటి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. బౌలింగ్‌లో షమీ (4-0-30-2), ప్రిన్స్ యాదవ్ (4-0-29-2), మొహిసిన్ (4-1-17-2) రాణించారు. రాయల్స్ తరఫున బ్యాటింగ్‌లో రవీంద్ర జడేజా (43 నాటౌట్) రాణించాడు.అనంతరం స్వల్ప ఛేదనలో లక్నో ఆదిలోనే చేతులెత్తేసింది. ఆర్చర్ (4-1-20-3), బర్గర్ (4-0-27-2), బ్రిజేష్ శర్మ (3-0-18-2), జడేజా (4-0-29-1), బిష్ణోయ్ (3-0-23-1) ధాటికి 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (55) ఒంటరిపోరాటంతో లక్నోను గెలిపించే ప్రయత్నం చేశాడు. ఇతను మినహా టాప్-4లో మిగతా ముగ్గురు (బదోని, పంత్, మార్క్రమ్) డకౌటయ్యారు.డక్ మాస్టర్ఈ సీజన్లో పంత్ వైఫల్యాల పరంపర కొనసాగింది. రాయల్స్ మ్యాచ్‌లో అతను 3 బంతులు ఆడి బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ డక్‌తో పంత్ ఓ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లైన వికెట్‌కీపర్ బ్యాటర్ల జాబితాలో ధోనిని (6) దాటాడు. 7 డక్‌లతో గిల్‌క్రిస్ట్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. డక్ మాస్టర్ల జాబితాలో దినేశ్ కార్తీక్ (16), పార్థివ్ పటేల్ (10), నమన్ ఓఝా (8) టాప్-3లో ఉన్నారు. -
వైభవ్‌కు చుక్కలు చూపించిన మొనగాడు.. ఎవరంటే?
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ అద్భుత ప్రదర్శన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా రాజస్తాన్ డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మోహ్సిన్ తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు.జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొన్న వైభవ్.. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో మాత్రం తడబడ్డాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వైభవ్‌కు వేసిన మొహ్షిన్ ఖాన్.. ఓవర్‌ను వికెట్ మెయిడిన్‌గా మలిచాడు.తొలి ఐదు బంతులను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ సూర్యవంశీ, ఆరో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో వైభవ్‌కు మెయిడెన్ ఓవర్ వేసిన తొలి బౌలర్‌గా మొహ్సిన్ ఖాన్ నిలిచాడు. అతడి ధాటికి వైభవ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నోపై 40 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.చదవండి: PSL 2026: హైదరాబాద్‌పై స్మిత్ విధ్వంసకర సెంచరీ -
రాజస్తాన్ గెలుపు బాట.. లక్నోపై ఘన విజయం
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. బుధవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక లక్నో చతికలపడింది. పంత్ సేన లక్ష్య చేధనలో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించగా.. బర్గర్, బ్రిజేష్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు రవీంద్ర జడేజా, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు. లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్(55) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్ దూబే(19), హెట్‌మైర్(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మోహ్షిన్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. -
లక్నోను చిత్తు చేసిన రాజస్తాన్ రాయల్స్
IPL 2026 RR vs LSG Live updates: లక్నోపై రాజస్తాన్ ఘన విజయంఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 18 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్(55) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. బర్గర్, బ్రిజేష్ శర్మ తలా రెండేసి వికెట్లు పడగొట్టాడు.లక్నో ఏడో వికెట్ డౌన్ముకుల్ చౌదరి రూపంలో లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో ముకుల్ ఔటయ్యాడు. లక్నో విజయానికి 23 బంతుల్లో 49 పరుగులు కావాలి.లక్నో ఆరో వికెట్ డౌన్‌లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.లక్నో ఐదో వికెట్ డౌన్‌లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన హిమత్ సింగ్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లక్నో విజయానికి 33 బంతుల్లో 69 పరుగులు కావాలి.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్54 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన నికోలస్ పూరన్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు లక్నో స్కోర్: 74/4నిలకడగా ఆడుతున్న మార్ష్, పూరన్7 ఓవర్లకు లక్నో 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(24), పూరన్(14) ఉన్నారు.కష్టాల్లో లక్నోఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో మార్క్రమ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.లక్నోకు భారీ షాక్160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. లక్నో కేవలం 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్(0), బదోని(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.రాణించిన జడేజా.. ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్ దూబే(19), హెట్‌మైర్(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మోహ్షిన్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు.19 ఓవర్లకు రాజస్తాన్ స్కోరెంతంటే?19 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.రాజస్తాన్ ఐదో వికెట్ డౌన్రాజస్తాన్ రాయల్స్ వికెట్ల పతనం కొనసాగుతోంది. 22 పరుగులు చేసిన షిమ్రాన్ హెట్‌మైర్.. మోహ్షిన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.4 ఓవర్లలో రాయల్స్ స్కోర్: 78-5రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్20 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 62/4రాజస్తాన్ మూడో వికెట్రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్ హెట్‌మైర్ వచ్చాడు. 4 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 32/3నిప్పులు చెరుగుతున్న షమీరాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో స్టార్ పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరుగుతున్నాడు. మూడో ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో రాజస్తాన్ వరుస బంతుల్లో జైశ్వాల్(22), ధ్రువ్ జురెల్(0) పెవిలియన్‌కు చేరారు.ఐపీఎల్-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక పోరులో లక్నో రెండు మ్యాచ్‌లతో బరిలోకి దిగింది.అవేష్ ఖాన్, సిద్దార్ధ్ స్ధానాల్లో దిగ్వేష్, మయాంక్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న నికోలస్ పూరన్‌కు లక్నో మరో అవకాశమిచ్చింది. ఇక రాజస్తాన్ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తుది జట్లురాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, మొహసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్ -
ఆ టీమ్‌కు భారీ షాక్.. ఉన్నపళంగా ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2026లో వరుస ఓటములతో సతమతమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. సౌతాఫ్రికా స్పీడ్ అన్రిచ్ నోకియా సీజన్ మధ్యలోనే లక్నో జట్టును వదిలి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి భార్య త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం. దీంతో తన భార్య వద్ద ఉండేందుకు నోర్జే పితృత్వ సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సీజన్లో నోకియా ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.దీంతో తర్వాత మ్యాచ్‌లలో అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ఇక లక్నో విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్లో కూడా పంత్ టీమ్‌కు ఏదీ కలిసి రావడంలేదు. లక్నో బౌలింగ్ పరంగా కాస్త బలంగా ఉన్నప్పటికి, బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. లక్నో తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 22న ఏకానా స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.చదవండి: అతడిని ఎంత పొగిడినా తక్కువే.. కచ్చితంగా స్టార్ అవుతాడు: శ్రేయస్ -
‘రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి’
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు అభిమానులు గోయెంకాకు కృతజ్ఞతలు చెప్పిన తీరు వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్లో 2022లో చేరిన లక్నో జట్టు కేఎల్ రాహుల్ సారథ్యంలో ప్లే ఆఫ్స్ చేరింది.రూ. 27 కోట్ల భారీ ధరకుఅయితే, సంజీవ్ గోయెంకా వైఖరితో విసిగిపోయిన కేఎల్ రాహుల్ (KL Rahul).. 2025 వేలానికి ముందు లక్నోను వీడాడు. గౌరవం లేని చోట తాను ఉండలేనని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో టీమిండియా మరో స్టార్ రిషభ్ పంత్‌ను కొనుగోలు చేసింది.రూ. 26.75 కోట్లకు పంజాబ్ సొంతంమరోవైపు.. 2024లో తమ జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను కోల్‌కతా నైట్ రైడర్స్ వదిలేసింది. ఈ క్రమంలో అయ్యర్ కోసం కూడా ఫ్రాంఛైజీలు ఎగబడగా.. పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పంత్, శ్రేయస్ ఖరీదైన ఆటగాళ్లుగా నిలవగా.. ఇద్దరికీ తమ ఫ్రాంఛైజీలు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాయి.కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా సూపర్ హిట్.. పంత్ విఫలంఅయితే, శ్రేయస్ ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా సూపర్ హిట్ అయ్యాడు. గతేడాది 604 పరుగులు చేసిన ఈ ముంబైకర్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు.. పంత్ మాత్రం దారుణంగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. గతేడాది కేవలం 269 పరుగులు చేసిన పంత్.. కెప్టెన్‌గానూ ఫెయిలై జట్టును ఏడోస్థానంలో నిలిపాడు.ఇక తాజాగా ఐపీఎల్-2026లోనూ పంజాబ్ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. లక్నో వరుస వైఫల్యాలతో సతమతమవుతూ ఉంది. ముల్లన్‌పూర్‌లో ఆదివారం ఇరుజట్లు తలపడగా.. పంజాబ్ లక్నోను 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న సంజీవ్ గోయెంకాకు పంజాబ్ అభిమాని దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి‘‘గోయెంకా సాబ్! పంత్‌ను మీ జట్టులోకి తీసుకున్నందు వేలవేల దండాలు భాయ్.. అతడు పంజాబ్ కెప్టెన్‌గా రానందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఒకవేళ తదుపరి వేలంలో రూ. 32 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా దయచేసి పంత్‌ను మీతోనే ఉంచుకోండి’’ అని సదరు అభిమాని గట్టిగా అరిచాడు.అయితే, ఇందుకు గోయెంకా మాత్రం థాంక్యూ అన్నట్లుగా నవ్వుతూ అభివాదం చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసిన తర్వాత రిషభ్ పంత్ చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు ఒక రకంగా గోయెంకాకు ఎదురైన అవమానానికి కారణం.PBKS fan: Goenka sahab! Thank you for taking Pant, paaji many, many thanks! Shukar hai captain saadi Punjab team ch nahi aaya!Paaji, even if you have to give 32 crores, don't let Pant go, keep him with you!😭Meanwhile,blud Sanjeev Goenka laughing and giving a thumbs up🤣🙏 pic.twitter.com/dKB7s8ouIt— Rohan💫 (@rohann__45) April 20, 2026ఆరోజు పంత్ అన్న మాటనే తిప్పి కొట్టి..వేలం సందర్భంగా.. ‘‘నాకు ఒకటే టెన్షన్.. పంజాబ్‌కు మాత్రం అస్సలు వెళ్లకూడదు అని మొక్కుకున్నా.. నేను ఆడకూడదనుకునే ఒకే ఒక్క టీమ్ అది’’ అని పంత్ వ్యాఖ్యానించాడు. దీంతో అప్పటి నుంచి పంజాబ్ జట్టు ఫ్యాన్స్ అతడిపై గుర్రుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పంజాబ్‌లో పంజాబ్ చేతిలో పంత్ సేన ఓడిన తర్వాత గోయెంకాకు ఇలా పంత్ గురించి సలహా ఇచ్చారు.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్! -
శశాంక్ సింగ్ పరువు తీసిన శ్రేయస్ అయ్యర్!
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో గతేడాది ఫైనల్ చేరిన పంజాబ్.. ఈసారి కూడా ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ శ్రేయస్ సేన దుమ్ములేపింది.సొంత వేదిక ముల్లన్‌పూర్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 254 పరుగులు సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 93) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. కూపర్ కన్నోలి (46 బంతుల్లో 87) మరోసారి ఆకట్టుకున్నాడు.రాణించిన బౌలర్లుఇక లక్ష్య ఛేదనలో లక్నోను పంజాబ్ 200 పరుగులకే పరిమితం చేసింది. మార్కో యాన్సెన్ రెండు, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, యజువేంద్ర చహల్ తలా ఒక వికెట్ తీసి పంత్ సేనను కట్టడి చేశారు. ఫలితంగా పంజాబ్ 54 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.మూడు క్యాచ్‌లు జారవిడిచాడుఅయితే, పంజాబ్ స్టార్ శశాంక్ సింగ్ లక్నోతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు క్యాచ్‌లు జారవిడిచాడు. ముఖ్యంగా లక్నో ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బంతితో రంగంలోకి దిగగా.. ఐడెన్ మార్క్రమ్ భారీ షాట్ ఆడాడు.A brainfade moment for Shashank Singh. 😄 pic.twitter.com/AxJEiBOie7— Mufaddal Vohra (@mufaddal_vohra) April 19, 2026ఈ క్రమంలో స్వీపర్ కవర్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శశాంక్ సింగ్ బంతిని అందుకునేందుకు పరిగెత్తుకు వచ్చాడు. ఆల్మోస్ట్ క్యాచ్ పడతాడని భావించగా.. అక్కడే అలా నిలుచుండిపోయాడు. దీంతో మార్క్రమ్ ఖాతాలో సిక్సర్ చేరగా.. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు డగౌట్లో ఉన్న హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.మార్క్రమ్తో పాటు ముకుల్ చౌదరీతో పాటు నికోలస్ పూరన్‌ల క్యాచ్‌లను శశాంక్ జారవిడిచాడు. ఈ ముగ్గరూ డేంజరస్ ప్లేయర్లే. అయితే, పంజాబ్ బౌలర్లను వాళ్లను సరిగ్గా కుదురుకోనివ్వలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఫలితంపై ప్రభావం పడేది. ఈ నేపథ్యంలో శశాంక్ సింగ్‌పై విమర్శల వర్షం కురుస్తుండగా.. మ్యాచ్ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన పని నెటిజన్లను ఆకర్షిస్తోంది.ఇదిగో ఈ క్యాప్ అడ్డుపెట్టుకోవిజయం తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలోశ్రేయస్ శశాంక్‌ను ఆటపట్టించాడు. సరదాగా శశాంక్ భుజంపై చెయ్యి వేసిన శ్రేయస్ అయ్యర్... ‘‘మన జట్టు సభ్యులకు నీ ముఖం చూపించలేవులే.. మనోళ్లను కదిలించేంత దమ్ము ఇపుడు లేకపోవచ్చు... ఇదిగో ఈ క్యాప్ అడ్డుపెట్టుకో’’ అన్నట్లుగా క్యాప్ అతడి ముఖానికి అడ్డుపెట్టి నడిపించాడు. పాంటింగ్ సైతం శశాంక్ భుజం తట్టి నవ్వులు చిందించాడు. ఈ నేపథ్యంలో.. ‘‘శ్రేయస్ భయ్యా పాపం శశాంక్ పరువు తీసేశావుగా!.. ఏదేమైనా ఈరోజు శశాంక్ అదృష్టం బాగుంది’’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా శశాంక్ ఈ మ్యాచ్‌లో ఆరు బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. పంజాబ్ ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒకటి వర్షం వల్ల రద్దుకాగా.. మిగిలిన ఐదూ గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉంది.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026 -
పంజాబ్ పరుగుల పండగ
గత నాలుగు మ్యాచ్‌ల్లో లక్ష్యఛేదనలో సత్తా చాటిన పంజాబ్ కింగ్స్... ఈసారి మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. లక్నో బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఈ సీజన్లో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకుంది. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కనొలీ పోటీపడి సిక్స్‌లు కొట్టడంతో పంజాబ్ కొండంత స్కోరు చేయగా... ఛేదనలో పలు ప్రయోగాలు చేసిన లక్నో విజయానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది. న్యూ చండీగఢ్: ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ జోరు సాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ తమ ఖాతాలో ఐదో విజయం వేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 93; 4 ఫోర్లు, 9 సిక్స్‌లు), కూపర్ కనోలీ (46 బంతుల్లో 87; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 80 బంతుల్లోనే 182 పరుగులు జోడించడం విశేషం. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులకు పరిమితమైంది. మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్ బదోనీ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ రిషభ్ పంత్ (23 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), మార్క్రమ్ (22 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. సాధించాల్సిన లక్ష్యం మరీ ఎక్కువగా ఉండగా... లక్నో ఏ దశలోనూ ఆ వేగం అందుకలోకపోయింది. పంజాబ్ బౌలర్లలో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. ధనాధన్.. ఈ సీజన్లో తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్... లక్నో బౌలర్లపై తమ ప్రతాపం చూపింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0)ను షమీ తొలి ఓవర్లోనే అవుట్ చేయగా... అక్కడి నుంచి పంజాబ్ ఊచకోత మొదలైంది. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఆరో ఓవర్లో ఆర్య 4, 6, 6 బాదగా... పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ 63/1తో నిలిచింది. బదోనీ ఓవర్లో కూపర్ 4, 6 కొట్టగా... ఆర్య 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. షమీ ఓవర్లో రెండు సిక్స్‌లతో కూపర్ కూడా హాఫ్‌సెంచరీ మార్క్ దాటాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఈ జోడీ దంచి కొట్టడంతో పంజాబ్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మార్క్రమ్ వేసిన 13వ ఓవర్లో అయితే ఈ ఇద్దరు పండగ చేసుకున్నారు. తొలి మూడు బంతులను కూపర్ సిక్స్‌లుగా మలిస్తే... చివరి రెండు బంతులకు ఆర్య సిక్స్‌లు కొట్టాడు. దీంతో 32 పరుగులు వచ్చాయి. ఫలితంగా 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 179/1తో మరింత భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఆఖర్లో కాస్త తేరుకున్న లక్నో బౌలర్లు ఈ ఇద్దరితో పాటు శ్రేయస్ అయ్యర్ (5), నేహల్ వధేరా (13) వికెట్లు తీసి పరుగుల వేగాన్ని నియంత్రించారు. స్టొయినిస్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (6 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో ధాటిగా ఆడారు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ ఆర్య (సి) మార్ష్ (బి) సిద్ధార్థ్ 93; ప్రభ్‌సిమ్రన్ (సి) మార్ష్ (బి) షమీ 0; కూపర్ (సి) సిద్ధార్థ్ (బి) ప్రిన్స్ 87; శ్రేయస్ (సి) షమీ (బి) మొహసిన్ 5; స్టొయినిస్ (రనౌట్) 29; వధేరా (సి) పూరన్ (బి) సిద్ధార్థ్ 13; శశాంక్ (సి) మార్క్రమ్ (బి) ప్రిన్స్ 17; యాన్సెన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–3, 2–185, 3–187, 4–193, 5–208, 6–252, 7–254. బౌలింగ్: షమీ 4–0–56–1; మొహసిన్ 4–0–43–1; ప్రిన్స్4–0–25–2; బదోనీ 1–0–14–0; అవేశ్ 3–0–46–0; సిద్ధార్థ్ 3–0–35–2; మార్క్రమ్ 1–0–32–0. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) బార్ట్లెట్ (బి) చాహల్ 40; బదోనీ (సి) బార్ట్లెట్ (బి) వైశాక్ 35; పంత్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) అర్ష్ దీప్ 43; పూరన్ (సి) శ్రేయస్ (బి) యాన్సెన్ 9; మార్క్రమ్ (సి) స్టొయినిస్ (బి) యాన్సెన్ 42; ముకుల్ (నాటౌట్) 21; హిమ్మత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–61, 2–109, 3–128, 4–139, 5–199. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–1; బార్ట్లెట్ 4–0–54–0; యాన్సెన్ 4–0–37–2; వైశాక్ 4–0–30–1; చాహల్ 4–0–36–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X ముంబై వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రియాన్ష్, కూపర్ విధ్వంసం.. పంజాబ్‌కు ఐదో విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్పూర్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అయితే ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో లక్నో చేతులెత్తేసింది. పంజాబ్‌బౌలర్లలో మార్కో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు పంజాబ్ యువ బ్యాటర్లు ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రియాన్ష్ (93), కన్నోలి (87) తమ కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో స్టోయినిస్ 29 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్,మణిమరన్ సిద్ధార్థ్ చెరో 2 వికెట్లు తీశాడు. లక్నోతో మ్యాచ్ ద్వారా ఈ సీజన్లో అత్యధిక స్కోరు చేసిన పంజాబ్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి (వర్షంతో ఒక మ్యాచ్ రద్దు) 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026 -
ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, వన్‌డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులు చేయగా, కూపర్ 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన మార్కరమ్కు ఈ ఇద్దరు పీడకలను మిగిల్చారు. 13వ ఓవర్ స్ట్రైకింగ్ తీసుకున్న కూపర్ కన్నోలి మార్కరమ్ మొదటి బంతిని సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని ఈసారి లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టిన కన్నోలి మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని వైడ్ వేయగా, నాలుగో బంతికి కూపర్ సింగిల్ తీయడంతో ప్రియాన్ష్ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక ప్రియాన్ష్ కూడా చివరి రెండు బంతులకు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 5 సిక్సర్లు, వైడ్ సహా సింగిల్ మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కరమ్ ఒక చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. లక్నో తరఫున ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్కరమ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రవి బిష్ణోయ్ పేరిట ఉంది. 2022లో ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు.ఇక 2026 సీజన్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ కూడా మార్కరమ్ మాత్రమే. ఈ సీజన్లోనూ ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్ అని చెప్పొచ్చు. 2025 సీజన్లో ఖలీల్ అహ్మద్ (సీఎస్కే) ఆర్సీబీతో మ్యాచ్‌లో 33 పరుగులు, మొయిన్ అలీ (కేకేఆర్) రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 32 పరుగులు సమర్పించుకున్నారు.3️⃣2️⃣ runs of pure destruction 💥🎥 Relive this carnage 👉 https://t.co/EpOcpY1lLb#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/eI5tuleNYM— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: 'క్యాచ్‌లు జారవిడవడం మా కొంపముంచింది’ -
IPL 2026: లక్నోపై పంజాబ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్పూర్ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్ (42 ), రిషబ్ పంత్ (43), మార్ష్ (40) పరుగులు సాధించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ (93), కూపర్ (87) పరుగులు చేశారు. 18 ఓవర్లలో లక్నో 179/418 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మార్కరమ్ 28, ముకుల్ 16 పరుగులతో ఆడుతున్నారు.పంత్ (43) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన లక్నోపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 128 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన పంత్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లలో లక్నో 89/18 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. మార్ష్ (35), పంత్ (18) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నోపంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన ఆయుశ్ బదోని విజయ్ కుమార్ బౌలింగ్‌లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఛేదనను ధాటిగానే ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. మార్ష్ 23, ఆయుశ్ బదోని 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.లక్నో ముంగిట 255 పరుగుల లక్ష్యంఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కన్నోలి (87) విధ్వంసం సృష్టించారు. చివర్లో స్టోయినిస్ (29) కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. పంజాబ్ బ్యాటర్ల ధాటికి లక్నో బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రిన్స్ యాదవ్, మనిమరన్ సిద్దార్థ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్లో పంజాబ్‌దే అత్యధిక స్కోరు. ఇంతకముందు ఇదే సీజన్లో సీఎస్కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ 250 పరుగులు చేసింది.18 ఓవర్లలో పంజాబ్ 230/518 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. స్టోయినిస్ 19 పరుగులు, శశాంక్ సింగ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.శ్రేయస్ అయ్యర్ (5) రూపంలో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అంతకముందు 93 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య సిద్దార్థ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. దీంతో పంజాబ్ 187 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కూపర్ (87) ఔట్పంజాబ్ కింగ్స్ 185 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కూపర్ 46 బంతుల్లో 7 సిక్సులు 8 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో మణిమరన్ సిర్థార్థ్కు క్యాచ్ ఇచ్చుకున్నాడు.9 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 19 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. కన్నోలి 40 పరుగులతో ఆడుతున్నాడు.ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ 63/1పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రియాన్ష్ 40, కూపర్ కన్నోలి 23 పరుగులతో ఆడుతున్నారు.5 ఓవర్లలో పంజాబ్ 43/15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. కూపర్ కన్నోలి 15, ప్రియాన్ష్ ఆర్య 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.ప్రబ్‌సిమ్రన్ డకౌట్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం ముల్లన్పూర్ వేదికగా 29వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్‌జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగింది. మరోవైపు లక్నో ఒక మార్పు చేసింది. దిగ్వేశ్ రాఠీ స్థానంలో సిద్దార్థ్ మణిరమన్ జట్టులోకి వచ్చాడు.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.లక్నో సూపర్‌జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్ -
పంత్‌పై తిట్ల దండకం.. వివరణ ఇచ్చిన గొయెంకా
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా తిట్టాడని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై గొయెంకా ఎట్టకేలకు స్పందించారు. తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. పంత్ లాంటి ఆటగాడిని తిట్టే పరిస్థితి ఎప్పుడూ ఉండదని వివరణ ఇచ్చాడు. నేను ఏది చేసినా వైరలవుతుంది, సోషల్‌మీడియాకు నేనో పంచింగ్ బ్యాగ్‌లాగా మారానని అన్నారు. బయట ఎన్ని ప్రచారాలు ఉన్నా, డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. తన హావభావాలు పదేపదే తప్పుగా అర్దమవుతున్నాయి. ఇక నుంచి చేతులు వెనుక పెట్టుకుని మాట్లాడటం నేర్చుకుంటానని హాస్యంగా చెప్పారు.ఇదే సందర్భంగా ఆటలో తన జోక్యంపై కూడా వివరణ ఇచ్చారు. నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఎప్పుడూ ఆడలేదు. ఆటగాళ్లకు నేను క్రికెట్ పాఠాలు నేర్పాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. టెక్నికల్ వాళ్లు ఆ పనిని చూసుకుంటారు. నా రోల్ జట్టుకు సపోర్ట్ చేయడం మాత్రమే. నేను ఆటలో జోక్యం చేసుకుంటానన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీతో మ్యాచ్ పూర్తైన తర్వాత గొయెంకా పంత్‌ను తిట్టాడని సోషల్‌మీడియా కోడై కూసింది. ఆ మ్యాచ్‌లో లక్నో ఓటమి అనంతరం బౌండరీ లైన్ వద్ద పంత్‌ను తిడుతున్నట్లు ఉన్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. దీనికిపై అప్పుడే లక్నో అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి వివరణ ఇచ్చారు. అందులో గొయెంకా-పంత్ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఈ వీడియోలను నెటిజన్లు నమ్మలేదు. ఫేక్ వీడియోలని కొట్టిపారేశారు. గొయెంకాకు కెప్టెన్లను తిట్టిన చరిత్ర ఉంది. గతంలో కేఎల్ రాహుల్‌ను కూడా దూషించాడు. ఇప్పుడు పంత్‌ను కూడా తిట్టాడని చర్చించుకున్నారు. తాజాగా గొయెంకా స్వయంగా వివరణ ఇచ్చినా నెటిజన్లు అతని మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు.ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో లక్నో పరిస్థితి హాట్ అండ్ కోల్డ్‌గా ఉంది. ఈ సీజన్లో ఆ జట్టు 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కెప్టెన్‌గా రిషబ్ పంత్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్ మినహా వ్యక్తిగతంగానూ విఫలమవుతూ వస్తున్నాడు. లక్నో రేపు జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. -
షాకింగ్.. ఐపీఎల్ నుంచి రిషబ్ పంత్ అవుట్?
ఐపీఎల్ 2026 సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వైదొలగనున్నాడా? అంటే అవునానే అంటున్నారు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఈ ధనధాన్ లీగ్‌లో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంత్ గాయపడ్డాడు. ఆర్సీబీ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికి అతడికి నొప్పి తగ్గలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగించలేక మైదానాన్ని వీడాడు. మళ్లీ ఆఖరిలో పంత్ బ్యాటింగ్‌కు వచ్చినప్పటికి ఆసౌకర్యంగా కన్పించాడు. అతడు మొత్తంగా ఆరు బంతుల్లో ఒక్క మాత్రమే చేసి పెవిలియన్ చేరిపోయాడు. ఆ తర్వాత అతడు ఫీల్డింగ్ రాలేదు. పంత్ స్దానంలో నికోలస్ పూరన్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో పంత్ గాయంపై కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఐపీఎల్-2026 సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు రిషబ్ పంత్ అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. ప్రస్తుతం లక్నో జట్టు చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా వారి బ్యాటింగ్ విభాగం చాలా దారుణంగా ఉంది. కేవలం బౌలింగ్ మాత్రమే బాగుంది. ఈ సీజన్లో లక్నో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రత్యర్ధి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. మార్క్రమ్ ఒక చెత్త క్రికెటర్. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌ను బెంచ్‌కే పరిమితం చేయాలి. ఈ ముగ్గురు భారీ స్కోర్లు సాధిస్తారని వేచి చూడడం ముందు ఆపండి. వారి స్ధానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వండి. ఏదేమైనప్పటికి వారి బ్యాటింగ్ చూస్తుంటే ఈ ఏడాది ప్లే ఆఫ్స్ చేరే అవకాశం అస్సలు కనిపించడం లేదు శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో లక్నో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో ఏడో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: వైభవ్ సూర్యవంశీకి సంబంధించి బిగ్ న్యూస్! -
విరాట్ కోహ్లి కాదు.. వారిద్దరి వల్లే గెలిచాము: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జోరును కొనసాగిస్తోంది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండ్‌షో తో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో లక్నోను 146 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. అనంతరం ఆ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 15.1 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. లక్నోను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేసిన తమ బౌలర్లపై పాటిదార్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మాకు కలిసొచ్చింది. తొలుత ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండీషన్స్‌ను ఉపయోగించుకుని బౌలింగ్ చేసిన తీరు అమోఘం. ఇక కృనాల్ ఒక ధైర్యవంతుడైన బౌలర్. అతడు బంతికి బంతికి వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. అతడు తర్వాత ఏ బంతి వేస్తాడో కెప్టెన్‌గా నేను కూడా అంచనా వేయలేకపోతున్నా. అతడితో పాటు సుయాశ్ శర్మ కూడా స్టంప్ టూ స్టంప్ బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా టీ20 లీగ్‌లలో భువనేశ్వర్, హాజిల్‌వుడ్ వంటి స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్ పని మరింత సులువు అవుతోంది. వారి అనుభవం జట్టులోని ఇతర బౌలర్లకు కూడా ఎంతో మేలు చేస్తోంది. ఐపీఎల్ ప్రారంభం నుంచే ఆర్సీబీ ఫీల్డింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇప్పుడు అదే స్పూర్తిని ఫిల్ సాల్ట్ కొనసాగిస్తున్నాడు. సాధారణంగానే అతడు ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్‌లను అందుకుంటాడు. ఈ రోజ్ కూడా సంచలన క్యాచ్ అందుకున్నాడు. మేము ప్రస్తుతానికి టైటిల్ గురించి ఆలోచించడం లేదన్నాడు. ఇదొక సుదీర్ఘ టోర్నీ. ప్రస్తుతం మా దృష్టి అంతా ఒక్కో మ్యాచ్‌పైనే ఉందని" పాటిదార్ పేర్కొన్నాడు. కాగా 49 పరుగులతో సత్తాచాటిన కోహ్లి గురుంచి పాటిదార్ మాట్లడకపోవడం గమనార్హం.చదవండి: IPL 2026: సీఎస్కేకు ఘోర అవమానం.. ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు -
ఆర్సీబీ ఆడుతూ పాడుతూ...
బెంగళూరు: సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఏకపక్ష పోరులో గెలిచి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ముకుల్ చౌదరి (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్ బదోని (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ (4/24) లక్నోను పడగొట్టగా... భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బెంగళూరు 15.1 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసి విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లి (34 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిలవగా...రజత్ పాటీదార్ (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు), జితేశ్ శర్మ (9 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో మరో 29 బంతులు ఉండగానే ఆర్సీబీ గెలుపు ఖాయమైంది. మూడు కీలక వికెట్లు తీసిన రసిఖ్ సలామ్‌కు కాకుండా ఒక వికెట్ పడగొట్టిన హాజల్‌వుడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు ఇవ్వడం గమనార్హం. సమష్టి వైఫల్యం... చిన్నస్వామి స్టేడియంలో లక్నో ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. మొత్తం పవర్‌ప్లేలో ఆ జట్టు 1 ఫోర్, 2 సిక్స్‌లతో 35 పరుగులే చేయగలిగింది. మార్క్రమ్ (12) విఫలం కాగా, మార్ష్ మాత్రం ఫర్వాలేదనిపించాడు. పూరన్ (1) తన వైఫల్యాన్ని కొనసాగించగా, కృనాల్ తన వరుస ఓవర్లలో మార్ష్ , సమద్ (0)లను వెనక్కి పంపించాడు. ఇలాంటి స్థితిలో బదోని కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు నుంచి ముకుల్ కూడా అతనికి అండగా నిలిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా జార్జ్ లిండే (7)ను బరిలోకి దించినా లాభం లేకపోయింది. ఆర్సీబీ పదునైన బౌలింగ్ ముందు మిగతా బ్యాటర్లూ తేలిపోయారు. ఆఖరి 4 ఓవర్లలో లక్నో జట్టు 5 వికెట్లు చేజార్చుకొని 29 పరుగులే చేసింది. కోహ్లి తొలిసారి... ఛేదనలో సాల్ట్ (7) తొందరగానే అవుటైనా... కోహ్లి జోరుగా మొదలు పెట్టాడు. గత మ్యాచ్‌లో మడమ గాయంతో ఫీల్డింగ్ చేయని కోహ్లి ఈ మ్యాచ్‌లో కూడా నేరుగా బ్యాటింగ్‌కే వచ్చాడు. ఐపీఎల్లో అతను మొదటిసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగాడు. ప్రిన్స్ వేసిన నాలుగో ఓవర్లో అతను 4 ఫోర్లు బాదాడు. కోహ్లి తాను ఆడిన తొలి 14 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు సాధించడం విశేషం! మరో ఎండ్‌లో పడిక్కల్ (10) విఫలమైనా... పాటీదార్, జితేశ్ దూకుడుతో ఆర్సీబీ వేగంగా లక్ష్యం దిశగా దూసుకుపోయింది. షమీ ఓవర్లో పాటీదార్ రెండు వరుస సిక్స్‌లు కొట్టగా... రాఠీ ఓవర్లో జితేశ్ వరుసగా 6, 4, 6, 4 బాదాడు. వీరిద్దరు ఒకే ఓవర్లో అవుటైనా...మిగిలిన 25 పరుగులను బెంగళూరు తర్వాతి 15 బంతుల్లో సాధించి మ్యాచ్ ముగించింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మిచెల్ మార్ష్ (బి) కృనాల్ పాండ్యా 40; మార్క్రమ్ (సి) పడిక్కల్ (బి) సలామ్ 12; పంత్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 1; నికోలస్ పూరన్ (బి) హాజల్‌వుడ్ 1; ఆయుశ్ బదోని (సి) జితేశ్ (బి) సలామ్ 38; సమద్ (సి) పాటీదార్ (బి) కృనాల్ పాండ్యా 0; ముకుల్ (బి) సలామ్ 39; లిండే (సి) డేవిడ్ (బి) భువనేశ్వర్ 7; షమీ (బి) భువనేశ్వర్ 0; అవేశ్ (బి) సలామ్ 1; దిగ్వేశ్ రాఠీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–32, 2–35, 3–71, 4–83, 5–118, 6–124, 7–137, 8–137, 9–145, 10–146. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–3, హాజల్‌వుడ్ 4–0–20–1, రసిఖ్ సలామ్ 4–0–24–4, కృనాల్ పాండ్యా 4–0–38–2, సుయాశ్ శర్మ 4–0–34–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) ప్రిన్స్ 7; కోహ్లి (సి) పూరన్ (బి) అవేశ్ 49; పడిక్కల్ (సి) (సబ్) హిమ్మత్ (బి) అవేశ్ 10; రజత్ పాటీదార్ (సి) రాఠీ (బి) ప్రిన్స్ 27; జితేశ్ (సి) ముకుల్ (బి) ప్రిన్స్ 23; డేవిడ్ (నాటౌట్) 14; షెఫర్డ్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో 5 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–9, 2–66, 3–86, 4–121, 5–122. బౌలింగ్: షమీ 3–0–30–0, ప్రిన్స్ యాదవ్ 3–0–32–3, దిగ్వేశ్ రాఠీ 4–0–51–0, అవేశ్ ఖాన్ 4–0–23–2, లిండే 1.1–0–9–0.పంత్‌కు గాయం...హాజల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బంతి బలంగా తగలడంతో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (1) ఎడమ మోచేతికి గాయమైంది. మూడు బంతులు ఆడిన అనంతరం అతను రిటైర్డ్‌హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో తిరిగి బ్యాటింగ్‌కు వచ్చినా మరో మూడు బంతులే ఆడి అతను అవుటయ్యాడు. పంత్ గాయం తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. అతను కీపింగ్ కూడా చేయకపోవడంతో ముకుల్ చౌదరి ఆ బాధ్యత తీసుకున్నాడు. ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్ వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కోహ్లి, రసిక్ సలామ్ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోరర్‌గా నిలవగా, పటిదార్ (27), జితేశ్ శర్మ (23) రాణించారు. మధ్యలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ చివర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14 నాటౌట్)_ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్ సలామ్ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.As convincing as it gets 🙌A comfortable 5️⃣-wicket win and @RCBTweets remain unbeaten at home ✌️Scorecard ▶️ https://t.co/UztAZM9l0q#TATAIPL | #KhelBindaas | #RCBvLSG pic.twitter.com/pFkug0okkt— IndianPremierLeague (@IPL) April 15, 2026 -
మిచెల్ మార్ష్ కళ్లు చెదిరే సిక్సర్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ కళ్లు చెదిరే సిక్స్‌తో మెరిశాడు. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ ఆఖరి బంతిని మార్ష్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ సందించాడు. 102 మీటర్ల ఎత్తులో వెళ్లిన బంతి స్టేడియం అవతల పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్ సలామ్ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు.102M SIX BY MITCHELL MARSH. 🤯 pic.twitter.com/YwUmYWUYx8— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2026 -
హాజిల్‌వుడ్ దెబ్బ.. పంత్ అబ్బ!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ పేలవ ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే ఆర్సీబీ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ వేసిన బంతి పంత్‌ను గాయపర్చింది. లక్నో ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఇది చోటుచేసుకుంది. 12 పరుగుల చేసి మార్కరమ్ ఔటైన తర్వాత పంత్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్ హాజిల్‌వుడ్ వేశాడు. హాజిల్‌వుడ్ వేసిన తొలి మూడు బంతులను పంత్ జాగ్రత్తగా ఆడాడు. నాలుగో బంతిని పంత్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్సయ్యి పంత్ ఎడమ మోచేతిని బలంగా తాకింది. బంతి బులెట్లా దూసుకురావడంతో దెబ్బకు పంత్ మోచేతి వాచిపోయింది. ఈ సమయంలో పంత్ నొప్పిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టడం కెమెరాలకు చిక్కింది. ఫిజియో వచ్చి పంత్‌ను పరీక్షించాడు. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్ అయిన పంత్ డగౌట్‌కు వెళ్లిపోతున్న క్రమంలో హాజిల్‌వుడ్‌కు గాయమైన తన మోచేతిని చూపించడం గమనార్హం. అయితే ఇన్నింగ్స్ 16వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించిన పంత్ ఆరు బంతులెదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్ తర్వాతి మ్యాచ్ ఆడేది అనుమానమే. మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు.Rishabh Pant gets a blow on his Elbow What a bowling this by RCB ❤️, Hazlewood ☠️ test match lines and result for him ! Krunal gets 2 wickets! #RCBvsLSG #IPL2026 pic.twitter.com/BvRTGLn4lo— Cricket IQ (@S17Anurag) April 15, 2026Rishabh Pant retired hurt, it's a big loss for the rcb.I hope he is fine and a comeback stringer, till then the opposition will miss him the t20s.💔 pic.twitter.com/qV8TPYrWjh— Sujeet Suman (@sujeetsuman1991) April 15, 2026 -
IPL 2026: లక్నోపై ఆర్సీబీ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోరర్‌గా నిలవగా, పటిదార్ (27), జితేశ్ శర్మ (23) రాణించారు. మధ్యలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ చివర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14 నాటౌట్)_ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జితేశ్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ముకుల్ చౌదరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అంతకముందు 49 పరుగులు చేసిన కోహ్లి అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పడిక్కల్ (10) రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. అవేశ్‌ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పడిక్కల్ హిమ్మత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. కోహ్లి (45), పటిదార్ (7) క్రీజులో ఉన్నారు.కోహ్లి దూకుడు..లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి దంచికొడుతున్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తున్న కోహ్లి 20 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 40 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.147 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఫిల్ సాల్ట్ (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో సాల్ట్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. కోహ్లి (12), పడిక్కల్ (5) క్రీజులో ఉన్నారు.ఆర్సీబీ టార్గెట్ 147 పరుగులుఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్ సలామ్ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా లక్నోతో మ్యాచ్‌లో కృనాల్ ఐపీఎల్లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు.పంత్ ఔట్..లక్నో సూపర్‌జెయింట్స్ ఆరో వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 17 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. 16 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ముకుల్ రాయ్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో గాయపడిన పంత్ మరోసారి బ్యాటింగ్‌కు వచ్చాడు.నాలుగు వికెట్లు డౌన్ లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో రజత్ పటీదార్‌కు క్యాచ్ ఇచ్చుకుని అబ్దుల్ సమద్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం స్కోరు 12 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 90గా ఉంది. లక్నో మూడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ బౌల్డ్ అయ్యాడు. 35 బాల్స్ ఆడిన కృనాల్ పాండ్యా 2 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 40 పరులుగు బాదాడు. ప్రస్తుతం స్కోరు 10 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 75గా ఉంది. లక్నో సూపర్‌జెయింట్స్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పూరన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం లక్నో 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది.ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ పంత్ గాయానికి గురయ్యాడు. హాజిల్‌వుడ్ వేసిన బంతి పంత్ మోచేతిని బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్‌ను ఫిజియో పరీక్షించాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మైదానం వీడాడు. ప్రస్తుతం లక్నో 6 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన లక్నోఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మార్కరమ్ రషీక్ సలామ్ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోయి 32 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్లో ఆర్సీబీ, లక్నోలు ఇప్పటివరకు ముఖాముఖి పోరులో 6 సార్లు తలపడగా.. నాలుగుసార్లు ఆర్సీబీ, రెండుసార్లు లక్నో సూపర్‌జెయింట్స్ విజయాలు సాధించాయి. అయితే చిన్నస్వామి స్టేడియంలో తలపడిన రెండు సందర్భాల్లో ఇరుజట్లు చెరొక మ్యాచ్ నెగ్గాయి.ఆర్సీబీ తుదిజట్టు: ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.లక్నో తుది జట్టు: మార్కరమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్. -
కోహ్లికి గాయం.. లక్నోతో ఆడేది అనుమానమే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన ఆర్సీబీ మూడు విజయాలతో పట్టికలోమూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. అయితే సోమవారం ట్రైనింగ్ సెషన్లో కోహ్లీ కాలికి బ్యాండేజ్‌తో కనిపించాడు. ప్రాక్టీస్ అనంరతం కోహ్లీ మాజీ క్రికెటర్ కేన్ విలియమ్సన్, కెప్టెన్ రిషబ్ పంత్‌లను నవ్వుతూ పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో ఫ్రాంచైజీ తమ ఎక్స్‌లో షేర్ చేసుకుంది. అయితే వీడియోలో కోహ్లీ కుంటుతూ నడుస్తున్నట్లుగా కనిపించింది. దీంతో చీలమండ గాయం నుంచి కోహ్లి ఇంకా కోలుకోలేదని క్లియర్‌గా తెలుస్తోంది. అందుకే లక్నోతో మ్యాచ్‌లో కోహ్లి ఆడుతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ ఆడినా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశముంది. ఇక ఈ సీజన్లో కోహ్లి నాలుగు మ్యాచ్‌లు కలిపి 179 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలున్నాయి. ఇక ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లీ కేవలం బ్యాటింగ్‌కే పరిమితమయ్యాడు.Yaari dosti 🥹🤌 pic.twitter.com/lgdcrCTITI— Lucknow Super Giants (@LucknowIPL) April 14, 2026చదవండి: ‘రుతురాజ్ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్‌కు చాన్స్ ఇవ్వు’ -
ప్రసిధ్ పరాక్రమం
లక్నో: ఐపీఎల్ 19వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన తొలి పోరులో మాజీ విజేత గుజరాత్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచింది. గత మ్యాచ్‌లో ముకుల్ చౌదరీ మెరుపులతో విజయం సాధించిన లక్నో... ఈ పోరులో అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్‌లో కనీస ప్రతిఘటన కనబర్చలేకపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ మార్క్రమ్ (21 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన బ్యాటర్లలో ఒక్కరు కూడా ఇరవై పరుగులు చేయలేకపోయారు. కెప్టెన్ రిషభ్ పంత్ (18), మార్ష్ (11), ఆయుశ్ బదోనీ (9), పూరన్ (19), అబ్దుల్ సమద్ (18), ముకుల్ చౌదరీ (18), జార్జ్ లిండే (16), షమీ (12 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (37 బంతుల్లో 60; 11 ఫోర్లు), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (40 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. లక్ష్యం పెద్దది కాకపోవడంతో టైటాన్స్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది.స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) సుందర్ (బి) ప్రసిధ్ 30; మార్ష్ (సి) గిల్ (బి) రబాడ 11; పంత్ (సి) తెవాటియా (బి) సిరాజ్ 18; బదోని (సి) ఫిలిప్స్ (బి) ప్రసిధ్ 9; పూరన్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 19; అబ్దుల్ సమద్ (సి) ఫిలిప్స్ (బి) అశోక్ 18; ముకుల్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 18; లిండే (సి) (సబ్) షారుక్ (బి) అశోక్ 16; షమీ (నాటౌట్) 12; అవేశ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 164. వికెట్ల పతనం:1–14, 2–45, 3–69, 4–74, 5–109, 6–118, 7–131, 8–157. బౌలింగ్: సిరాజ్ 4–0–19–1; రబాడ 4–0–54–1; అశోక్ 4–0–32–2; ప్రసిధ్ 4–0–28–4; రషీద్ 4–0–25–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) అవేశ్ (బి) రాఠీ 15; గిల్ (సి) పంత్ (బి) ప్రిన్స్ 56; బట్లర్ (సి) మార్క్రమ్ (బి) షమీ 60; సుందర్ (నాటౌట్) 21; తెవాటియా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–45, 2–129, 3–135. బౌలింగ్: షమీ 4–0–36–1; ప్రిన్స్ 4–0–31–1; దిగ్వేశ్ రాఠీ 4–0–31–1; లిండే 3–0–28–0; అవేశ్ 2–0–24–0; మార్క్రమ్ 1.4–0–15–0. -
పూరన్ సరికొత్త చరిత్ర.. రాహుల్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పూరన్ తీవ్ర నిరాశపరిచాడు. అయూశ్ బదోని ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పూరన్ గుజరాత్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. 21 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 2 సిక్స్‌ల సాయంతో 19 పరుగులు చేశాడు.అయితే పూరన్ జిడ్డు ఇన్నింగ్స్ ఆడినప్పటికి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఈ కరేబియన్ ఆటగాడు లక్నో తరపున ఇప్పటివరకు 47 మ్యాచ్‌ల్లో 1422 పరుగులు సాధించాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ లక్నో తరపున 38 మ్యాచ్‌ల్లో 1410 పరుగులు నమోదు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో రాహుల్‌ను పూరన్ అధిగమించాడు.లక్నో తరపున టాప్-3 రన్ స్కోరర్లు వీరేనికోలస్ పూరన్-1422కేఎల్ రాహుల్-1410ఆయుష్ బదోని-1038చదవండి: IPL 2026: 'అతడే మన బెస్ట్ బౌలర్.. గెలిచే మ్యాచ్‌లను దగ్గరుండి ఓడిస్తాడు' -
నాన్న త్యాగం...ధోనిపై అభిమానం
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ ముకుల్ చౌదరీ గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఏడు సిక్సర్లతో మోత మోగించి తన జట్టును గెలిపించాడు. అయితే ఈ ఏడింటిలో తాను కొట్టిన మొదటి సిక్సర్ అన్నింటికంటే ఎక్కువగా నచ్చిందని ముకుల్ మ్యాచ్ తర్వాత చెప్పాడు. వైభవ్ అరోరా వేసిన 17వ ఓవర్లో ఈ సిక్స్ వచ్చింది. అరోరా వేసిన యార్కర్‌ను హెలికాప్టర్ షాట్‌తో లాంగాన్ మీదుగా సిక్స్ బాదిన ముకుల్ తాను ఆరాధించే ధోనిని గుర్తుకు తెచ్చాడు. ధోనిపై ఇష్టంతో క్రికెట్లోకి వచ్చిన ముకుల్ ఇప్పుడు ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌తో స్టార్‌గా మారిపోయాడు. – సాక్షి క్రీడా విభాగంరాజస్తాన్కు చెందిన ముకుల్ ఐపీఎల్లో తన తొలి సీజన్ ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో 14 పరుగులకే పరిమితమైన అతను రెండో మ్యాచ్‌లో 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆడిన ఐదు బంతుల్లోనూ అతను కాస్త తడబడ్డాడు. అయితే ఎక్కువగా ఆందోళన చెందవద్దని, నచ్చినట్లుగా ఆడమని కెపె్టన్ రిషభ్ పంత్ ధైర్యాన్నందించాడు. దాంతో కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ముకుల్ అన్నాడు. ‘ఐదు మ్యాచ్‌లు ఆడినా 50 మ్యాచ్‌లు ఆడినా ఎవరిపైనైనా ఒత్తిడి సహజం. అందులోనూ నేను తొలిసారి ఐపీఎల్లో ఆడుతున్నాను. కాబట్టి జట్టు మనపై నమ్మకం ఉంచినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో కూడా ఒత్తిడి ఉంటుంది. దేశవాళీ క్రికెట్లో కూడా మంచి ప్రదర్శన తర్వాతే ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఇక్కడ బాగా ఆడినప్పుడు వచ్చే గుర్తింపు, పేరు ఎంతో భిన్నం. బయటి అంశాల గురించి పట్టించుకోకుండా మనపై మనం నమ్మకం ఉంచి ఆడటం ముఖ్యం’ అని ముకుల్ వ్యాఖ్యానించాడు. ఆ షాట్ అంటే ఇష్టం... అరోరా బౌలింగ్‌లో ముకుల్ కొట్టిన హెలికాప్టర్ షాట్‌పై అన్ని వైపుల నుంచి నుంచి ప్రశంసలు కురిశాయి. ‘మొదటి నుంచి నేను ధోనికి వీరాభిమానిని. వికెట్ కీపర్ అయిన నేను ధోనిలాగే ఏడో స్థానంలో ఆడుతున్నా. ఆయన మ్యాచ్‌లను ముగించే తీరు నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచే హెలికాప్టర్ షాట్‌ను ఎంతో ప్రాక్టీస్ చేశాను. ఆ షాట్ నాకు చాలా నచ్చేది. యార్కర్‌ను ధోని సిక్సర్‌గా మలిచేవాడు. అలాంటి బంతిని సిక్స్ కొట్టడం అంటే బౌలర్‌పై మన ఆధిపత్యం ఏమిటో తెలుస్తుంది. భారీ షాట్లు కొట్టే విధంగా బలమైన శరీర నిర్మాణం నాకుంది. నేను సాధన కూడా చాలా చేస్తాను. ప్రతీ రోజూ దాదాపు 100–150 సిక్సర్లు ప్రాక్టీస్ చేస్తా. గత ఐదారు నెలలుగా ఇదే తరహాలో ఆడటం ఇప్పుడు ఫలితం చూపించింది’ అని 21 ఏళ్ల ముకుల్ వివరించాడు. దేశవాళీలో చెలరేగి... నాలుగు నెలల క్రితం సరిగ్గా ఇదే తరహా ఆటతో ముకుల్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో దృష్టిలో పడ్డాడు. దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అప్పటికే సత్తా చాటిన ముకుల్ ఢిల్లీతో జరిగిన పోరులో మరింతగా చెలరేగాడు. ఐపీఎల్లో గురువారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లాగానే రాజస్తాన్ 176 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.ముకుల్ 26 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో అజేయంగా 62 పరుగులు చేసి చివరి బంతికి సిక్స్‌తో జట్టును గెలిపించాడు. ఆయుశ్ బదోని వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి కావాల్సిన 25 పరుగులను అతను రాబట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తర్వాతే వేలంలో లక్నో రూ.2 కోట్ల 60 లక్షలకు తీసుకుంది. గతంలో ఈ ఫీట్ నమోదు చేసిన కారణంగానే తనపై తనకు నమ్మకం ఉందని, ఇప్పుడు దానిని పునరావృతం చేశానని అతను చెప్పాడు. లాంగర్ ప్రోత్సాహంతో... ఐపీఎల్లో లక్నో జట్టుకు ఎంపికైన తర్వాత టీమ్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఈ కుర్రాడిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. తన బ్యాటింగ్‌పై నమ్మకంతో పాటు భారీ సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం కోచ్‌ను ఆకట్టుకున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో ‘అత్యంత ప్రమాదకర’ మిడిలార్డర్ బ్యాటర్‌గా ముకుల్‌ను తీర్చిదిద్దుతానని చెప్పి కోచ్ ప్రోత్సాహాన్నందించాడు. ‘అంత పెద్ద కోచ్ నా గురించి ఇలా మాట్లాడాడంటే నాలో ఏదో ప్రత్యేకత ఆయనకు కనిపించి ఉండవచ్చు. ప్రతీ రోజూ 15 నిమిషాల పాటు నా కోసం ప్రత్యేకంగా కేటాయించి సాధన చేయించడమే కాకుండా నేను ఆడాల్సిన ఆట శైలి గురించి వివరించేవారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెలరేగాలని నేనూ గట్టిగా కోరుకున్నా. ఇప్పుడు నా ఆటను చూపించాను’ అని ముకుల్ వెల్లడించాడు. రెండేళ్ల క్రితం బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా తొందరపాటు ప్రదర్శించే వాడినని... అయితే సాధన తర్వాత చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను గెలిపించాలనే పట్టుదల తనలో పెరిగిందని ముకుల్ గుర్తు చేసుకున్నాడు. కోల్‌కతాతో పోరులో బౌలర్ ఏదో ఒక దశలో తప్పు చేస్తాడనే నమ్మకంతోనే వేచి చూశానని చెప్పాడు. తన ఈ ప్రదర్శనను తండ్రికి అంకితం ఇస్తున్నట్లు అతను చెప్పాడు.కుటుంబ త్యాగాలతో... ముకుల్ తండ్రి దలీప్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన తన పెళ్లి కూడా కాకముందే కొడుకు పుడితే క్రికెటర్‌ను చేయాలని నిర్ణయించుకున్నాడు. ముకుల్‌ను 10 ఏళ్ల వయసులో క్రికెట్లోకి తీసుకొచ్చిన సమయంలో తండ్రి ఆరి్థక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కొడుకు శిక్షణలో అండగా నిలిచేందుకు ముందుగా ఆయన తన ఉద్యోగాన్ని వదిలేశాడు. తనకు వాటాగా వచ్చిన ఇంటిని అమ్మేసి ముకుల్ శిక్షణ కోసం వెచ్చించాడు. రాజస్తాన్‌లోని స్వస్థలం ఝన్‌ఝునులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో జైపూర్‌లోని ఆరావళి అకాడమీలో చేరి్పంచాడు. ఆరంభంలో మీడియం పేసర్‌గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్ కీపర్లు ఎవరూ లేకపోవడంతో అవకాశాల కోసం అటువైపు మళ్లాడు. అయితే భారీ షాట్లు ఆడే ముకుల్ శైలిని గుర్తించిన కోచ్‌లు ఆ దిశగా బ్యాటింగ్‌లో ప్రోత్సహించారు. ఆరంభంలో సరైన అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత అతని ఆట పదునెక్కింది. బీసీసీఐ అండర్–23 టోర్నీలో రాజస్తాన్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా కెరీర్ దూసుకుపోయింది. టి20ల్లో మారిన పవర్ హిట్టింగ్‌ను మరింత సాధన చేసేందుకు వీలుగా మధ్యలో కొన్ని నెలల పాటు అతను ఢిల్లీలోని గుర్గావ్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అతని కఠోర శ్రమ, పట్టుదల ఇప్పుడు ఐపీఎల్లో ఫలితం చూపించింది. -
'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్'
లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ చౌదరి ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం అతడి గురించే మాట్లాడుకుంటోంది. 21 ఏళ్ల ముకుల్ చారిత్రత్మక ఈడెన్‌గార్డెన్స్‌లో అద్భుతం చేశాడు.తన విరోచిత బ్యాటింగ్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓటమి తప్పదకున్న చోట చివరి బంతికి లక్నో గెలిపించి రియల్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 2 ఫోర్లతో పాటు 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. అంటే అతడి సాధించిన పరుగులలో మెజారిటీ భాగం సిక్సర్ల ద్వారానే వచ్చాయి. కాగా మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురుంచి మాట్లాడిన ముకుల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని తన రోల్‌మోడల్ ముకుల్ చెప్పుకొచ్చాడు."మా నాన్నకు పెళ్లి కాకముందే తనకు కొడుకు పుడితే క్రికెటర్‌ను చేయాలని కలలు కనేవారు. ఈ విజయాన్ని మా నాన్నకు అంకితమిస్తున్నాను. అలాగే ధోనీ సర్ మ్యాచ్‌ను ఫినిష్ చేసే తీరును చూస్తూ నేను పెరిగాను. ఆయన నాకు రోల్‌మోడల్. ఇప్పుడు నేను కూడా లోయార్డర్‌లోనే బ్యాటింగ్‌కు వస్తున్నాను. కాబట్టి ఈ ఇన్నింగ్స్‌ను ఆయనకు కూడా చేస్తున్నాను. శరీర తత్వంగా కారణంగానే నేను ఆడే షాట్లలో అంత పవర్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి షాట్లు ఆడేందుకు నేను చాలా ఎక్కువగా సాధన కూడా చేశాను. ప్రతిరోజూ నెట్స్‌లో సుమారు 100 నుండి 150 సిక్సర్లు కొడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాను. గత ఐదు, ఆరు నెలలుగా మరింత ఎక్కువగా శ్రమిస్తున్నాను.ఆ ఫలితమే ఇప్పుడు నా ఆటలో కనిపిస్తోంది. హెలీకాప్టర్ షాట్ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పటి నుంచే ఆ షాట్‌ను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. ధోని ఫినిషింగ్ స్టైల్ కూడా నాకెంతో ఇష్టం. అతను యార్కర్ బంతిని కూడా సిక్సర్‌గా మలిచేవాడు. అలాంటి బంతిని కూడా సిక్స్ కొడితే, బౌలర్ కచ్చితంగా ఒత్తిడితోకి వెళ్తాడు" అని ముకుల్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం! రూ.13 కోట్ల ఆటగాడిపై వేటు?Meet Mukul Choudhary - He idolised Hardik Pandya - His father was a Teacher- He was unable to pay High fees of Cricket Academies- So he left his job and tried real estate- Luckily he got success there pic.twitter.com/Is4Hftw01N— Amar💫 (@KUNGFU_PANDYA_0) April 9, 2026 -
లక్నో జట్టులోకి సౌతాఫ్రికా సూపర్ స్టార్
ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఫస్ట్ హాఫ్ సీజన్ తర్వాత హసరంగ జట్టుతో చేరుతాడని లక్నో మేనెజ్మెంట్ భావించింది. కానీ అతడు తన మోకాలి గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో హసరంగ ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 19వ సీజన్ నుంచి హసరంగా వైదొలిగాడు. ఈ విషయాన్ని లక్నో జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ ధ్రువీకరించాడు. అయితే హసరంగ స్ధానాన్ని సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జార్జ్ లిండేతో లక్నో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే లిండేతో లక్నో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనిపై తదుపరి 24 నుంచి 48 గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రోటీస్ ఆల్‌రౌండర్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో ఆడిన అనుభవం ఉంది. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ 250 పైగా టీ20 మ్యాచ్‌ల్లో 218 వికెట్లు పడగొట్టాడు. లిండేకు లోయార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా కూడా ఉంది. లక్నో జట్టులో ఇప్పటికే షాబాజ్ అహ్మద్, ఎం. సిద్ధార్థ్ వంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. కానీ హసరంగ లాంటి స్టార్ ఆల్‌రౌండర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు లక్నో మొగ్గు చూపుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో లక్నో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది.చదవండి: నాపై కోపంతో చెత్తబుట్టలో పడేశాడు.. అతడి తండ్రి వచ్చి..: యువీ -
రికార్డులు కొల్లగొట్టిన రాజస్తాన్ చిన్నోడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా లక్నో సూపర్‌జెయింట్స్ యువ కెరటం ముకుల్ చౌదరి కూడా అదే జాబితాలో చేరాడు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముకుల్ చౌదరి 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 54 పరుగులు నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి లక్నోకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ముకుల్ చౌదరి రెండు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులేంటో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముకుల్ చౌదరి ఏడు సిక్సర్లు బాదాడు. ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు బాదిన తొలి లక్నో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సరసన చేరాడు. బ్రావో ఐపీఎల్ 2018 సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాదాడు.ఇదే మ్యాచ్‌లో ముకుల్ చౌదరి.. అవేశ్‌ఖాన్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. తద్వారా ఐపీఎల్లో టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించిన జట్లలో లక్నోకు 8వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం అని చెప్పొచ్చు.ఇక లక్నో సూపర్‌జెయింట్స్‌కు కేకేఆర్‌పై ఇది ఐదో విజయం. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో తలపడితే అందులో ఈడెన్ గార్డెన్స్ వేదికగానే లక్నో నాలుగు మ్యాచ్‌లు గెలవడం విశేషం.చదవండి: భార్యతో కలిసి చెట్టాపట్టాల్.. ఐపీఎల్‌కు డుమ్మా! -
‘భారత్‌లోనే ప్రమాదకర బ్యాటర్.. ఈ మ్యాచ్‌తో నిరూపించాడు’
ముకుల్ చౌదరి.. ఒక్క మ్యాచ్‌తో భారత క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయిందీ పేరు. ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో గురువారం నాటి పోరులో.. ఈ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు అవసరం కాగా... ఇందులో 54 తానొక్కడే చేశాడు.27 బంతుల్లోకోల్కతా విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ముకుల్ చౌదరి.. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా లక్నోను విజయతీరాలకు చేర్చి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో లక్నో హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ ముకుల్ చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా.. ‘‘వచ్చే నాలుగు నెలల్లో ఇండియాలోనే ఆరు లేదంటే ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా ముకుల్ ఎదగడం ఖాయం’’ అని లాంగర్ అన్నాడు.What JL said 🧿 pic.twitter.com/c7y4oI4Sgn— Lucknow Super Giants (@LucknowIPL) April 9, 2026ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కోల్‌కతాతో మ్యాచ్ సందర్భంగా ముకుల్ గురించి లాంగర్ చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ ముకుల్ చౌదరి?రాజస్తాన్‌కు చెందిన 21 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరి జైపూర్ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్ బౌలర్‌గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు దృష్టి సారించాడు. అండర్–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.ఇక దేశీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 199 స్ట్రయిక్‌రేట్‌తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా ఎదగడం ఖాయం’ అని లాంగర్ ఐపీఎల్‌కు ముందు వ్యాఖ్యానించగా... ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్ దానిని నిరూపించడం విశేషం. This is 𝐂𝐈𝐍𝐄𝐌𝐀 🫡🤯 pic.twitter.com/JTxw0DUgqM— Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2026చదవండి: Yuvraj Singh: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’ -
‘సరదాగా అన్న మాట ఇవాళ నిజమైంది’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చిందని లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ముకుల్ చౌదరీ ప్రదర్శనపై మాటలు రావడం లేదని పంత్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో గురువారం లక్నో 3 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘ఏం చెప్పాలి.. ముకుల్ చౌదరీ గురించి మాటలు రావడం లేదు. నేను అతన్ని తొలిసారి నెట్స్‌లో చూసినప్పుడే భవిష్యత్తులో మంచి బ్యాటర్ అవుతాడని ఊహించాను. ఇవాళ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముకుల్ దానిని నిజం చేసి చూపెట్టాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌ను కళ్ల ప్పగించి చూస్తూ ఉండిపోయాను. అనామక ఆటగాళ్లకు ఐపీఎల్ వెలుగునిచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలో ముకుల్‌చౌదరీ కూడా చేరిపోయాడు. ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు వారు అద్భుతాలు చేయగలరు. ఇలాంటి ప్రతి మ్యాచ్ కూడా జట్టులో ఏదో ఒక గొప్ప విషయం నిర్మితమవుతోందనే సంకేతాన్ని ఇస్తోంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముకుల్ చౌదరీ మూడు బంతులు వరుసగా మిస్ చేశాడు. ఆ సమయంలో అతడి దగ్గరకి వెళ్లి కంగారు పడొద్దు.. భవిష్యత్తులో నీకు అవకాశాలు బాగా వస్తాయి అని చెప్పాను. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముకుల్‌కు ఆ అవకాశం రానే వచ్చింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కడదాకా నిలిచి ఒంటిచేత్తో గెలిపించాడు. ఒక కెప్టెన్‌గా ఇంతకన్నా నాకేం కావాలి చెప్పండి.బదోని ఇప్పుడు మా జట్టులో సీనియర్ ప్లేయర్. అతనికి మేం ఇచ్చిన బాధ్యత అది. బదోని నుంచి మేం ఆశించే సహకారం ఇదే. షమీ కుర్రాడు కాదు. కానీ అతను జట్టుకు ఇచ్చే అనుభవం వెలకట్టలేనిది. అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండటం అద్భుతం. బౌలింగ్ యూనిట్ అంతా బాగా రాణిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు.During Match Between LSG & SRH When Mukul Choudhary missed three balls, Rishabh Pant told him: “Don’t feel nervous, you’ll get many more opportunities in the future.”Today, Mukul Choudhary won the match single-handedly for Rishabh Pant’s LSG. 😭❤️pic.twitter.com/FhDIDunk1B— Cricket Central (@CricketCentrl) April 9, 2026చదవండి: ‘సైందవుడిలా అడ్డుపడి కొంపముంచాడు’ -
‘సైందవుడిలా అడ్డుపడి కొంపముంచాడు’
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్( కేకేఆర్) హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. గురువారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపు దిశగా సాగింది. అయితే చివర్లో ముకుల్ చౌదరి సైందవుడిలా అడ్డుపడి ఒంటిచేత్తో కేకేఆర్ నుంచి గెలుపును లాగేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మ్యాచ్ ఓటమిపై స్పందించాడు.'ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. కానీ మా కుర్రాళ్లు ఆడిన తీరు అమోఘం. ముకుల్ ఆడిన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అతను షాట్లు ఆడిన తీరు అమోఘం. ఇలాంటి మ్యాచ్‌ల్లో తప్పులను వెతకకూడదు. మా ప్రణాళికల అమల్లో చిన్న చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు. కానీ ముకుల్ ఆడిన తీరుకు, అతడి ఇన్నింగ్స్‌కు క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే.పిచ్‌పై స్లో బంతులు బాగానే పనిచేశాయి. అందుకే ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించారు. ముకుల్ షాట్లు మాత్రం అద్భుతం. మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చిందనుకున్న దశలో ముకుల్ చౌదరి సూపర్ ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.ఈ వికెట్‌పై 180-185 అనేది మంచి స్కోరు. ఏది ఏమైనా లక్నో బ్యాటర్లు ఆడిన తీరును మెచ్చుకోవాల్సిందే. ఆఖరి ఓవర్లో ఆవేష్ ఖాన్నే ఎక్కువ సేపు స్ట్రైకింగ్‌లో ఉంచాలని ఫీల్డింగ్ ముందుకు పెట్టాం. కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా ఐదుగురు ఫీల్టర్లు సర్కిల్ లోపల ఉన్నప్పుడు చివరి ఓవర్ వేయడం బౌలర్లకు కష్టమే. అయితే ఈ ఓటమిపై విశ్లేషించుకుంటాం. లోపాలు సరిచేసుకుంటాం. రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఎలా ఆడాలనే విషయాన్ని ఆలోచిస్తాం.'అని రహానే పేర్కొన్నాడు. కేకేఆర్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.చదవండి: ‘ఈ ఇన్నింగ్స్ మా నాన్నకు అంకితం’ -
ఉత్కంఠ పోరులో లక్నో విజయం
-
‘ఈ ఇన్నింగ్స్ మా నాన్నకు అంకితం’
ఐపీఎల్ 2026 సీజన్లో ముకుల్ చౌదరీ రూపంలో నయా స్టార్ పుట్టుకొచ్చాడు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయే స్థితిలో ఉన్న లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఒంటిచేత్తో గెలిపించిన ముకుల్ చౌదరీ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ముకుల్ చౌదరీ మాట్లాడాడు. ఈరోజుతో తన నాన్న కల నెరవేరిందని.. ఇన్నింగ్స్‌ను ఆయనకు అంకిత మిస్తున్నట్లు తెలిపాడు.‘నేను క్రికెటర్ కావాలన్నది మా నాన్న కల. అయితే నా చిన్నతనంలో మా కుటుంబ పరిస్థితి అంత బాగుండక పోవడంతో క్రికెట్‌ను ఆడలేకపోయాను. అయితే 12-13 ఏళ్ల వయస్సులో తొలిసారి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఆరోజుల్లో క్రికెట్ అకాడమీలు ఎక్కువగా ఉండేవి కావు. అందుకే మాకు దగ్గర్లో ఉన్న సికర్‌లోని ఎస్బీఎస్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడే ఒక ఐదు నుంచి ఆరేళ్ల పాటు ఆటలో మెళుకువలు నేర్చుకోవడంతో పాటు క్రికెటర్‌గా ట్రెయిన్ అయ్యాను. ఆ తర్వాత హయ్యర్ లెవెల్‌కు ఆడాలనే ఉద్దేశంతో జైపూర్‌కు నా మకాం మార్చాను. ఆ తర్వాత టీ20 క్రికెట్ ఉన్నతస్థాయికి చేరుకోవడంతో గుర్గావ్లో మూడు నుంచి నాలుగు నెలలల పాటు శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత ఢిల్లీలో ఆడిన చాలా మ్యాచ్‌లు నా కెరీర్‌కు ఉపయోగపడ్డాయి. ఇక యూపీతో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో నా ప్రదర్శనను చూసి నేను క్రికెటర్ అవుతాననే విషయాన్ని మా నాన్న నమ్మాడు. అది లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మా జట్టులో ఎవరు పెద్దగా ఆడలేదు. నేను మాత్రమే మంచి స్కోర్ సాధించాను. అప్పుడే క్రికెట్లో నేను పెద్ద స్థాయికి చేరుతానన్న నమ్మకం మా నాన్నకు కలిగింది. ఇక ఫ్లడ్ లైట్ల కింద నేను ఆడిన రెండో మ్యాచ్ ఇది. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఒత్తిడిలా కాకుండా గోల్డెన్ ఛాన్స్‌లా చూశాను. చివరి వరకు ఆడాలనేదే నా ప్లాన్. నేను క్రీజులో ఉంటే జట్టును గెలిపించగలననే నమ్మకం నాకుంది. ఈరోజు కొట్టిన మొదటి సిక్స్ నాకు ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజు నేను కొట్టిన మొదటి సిక్స్ అదే. ఆఖరి ఓవర్లో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. ఏదో ఒక బంతి నా జోన్లోకి వస్తుందని తెలుసు. ఒక్క సిక్స్ కొడితే చాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను హిట్టింగ్ చేస్తున్నాను. బంతి నా జోన్లో ఉంటే బాదేస్తాను. సిక్సర్లు కొట్టడం నాకు చాలా ఇష్టం. ఇవాళ రాత్రి నువ్వు ఒక జవాన్లా (దేశానికి సేవ చేసే సైనికుల్లో చాలా మంది రాజస్తాన్‌లోని ఝున్ఝు ప్రాంతం నుంచి వచ్చేవారు. ఇది ముకుల్ చౌదరీ స్వస్థలం)ఆడావు అని చాలా మంది మెచ్చుకుంటున్నారు. అవును సార్.. అది నా రక్తంలోనే ఉంది. నేను ఇక్కడ గ్రౌండ్లో ఆడుతున్నాను.. వాళ్లు సరిహద్దులో కాపలా కాస్తూ దేశానికి సేవ చేస్తున్నారు.’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికి వస్తే 182 పరుగుల ఛేదనలో లక్నో 6 ప్రధాన వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది. 32 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరీ 27 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 54 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి కాగా, లక్నోకు ఇది రెండో విజయం.Pressure? What pressure? 🤷♂️🎥 🗣️ It's all about belief and rising to the occasion for Mukul Choudhary 🙌Scorecard ▶️ https://t.co/ov5gAlAtPH #TATAIPL | #KhelBindaas | #KKRvLSG | @LucknowIPL pic.twitter.com/M2Y1F9x3ym— IndianPremierLeague (@IPL) April 9, 2026 Another day, another #TATAIPL thriller 🤩@LucknowIPL get over the line in a last-ball finish, courtesy of Mukul Choudhary's heroics 🫡Scorecard ▶️ https://t.co/ov5gAlAtPH #KhelBindaas | #KKRvLSG pic.twitter.com/VLthHCB8Cm— IndianPremierLeague (@IPL) April 9, 2026చదవండి: జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా! -
ముకుల్ సిక్సర్ల మోత
182 పరుగుల ఛేదనలో 6 వికెట్లు కోల్పోయి ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరగ్గా... లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు కావాలి. ఈ దశలో కోల్‌కతా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ యువ ఆటగాడు ముకుల్ చౌదరీ భిన్నంగా ఆలోచించాడు. చివరి మూడు ఓవర్లలో రెండేసి సిక్సర్లతో చెలరేగిపోయి కేకేఆర్ పని పట్టాడు.57లో తానొక్కడే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి లక్నోకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆఖరి 4 ఓవర్లలో వరుసగా 11, 13, 16, 14 పరుగులు రాబట్టి సూపర్ జెయింట్స్ మ్యాచ్ గెలుచుకుంది. సొంత మైదానంలో విజయానికి చేరువగా వచ్చిన కోల్‌కతా మరో ఓటమితో తీవ్ర నిరాశకు గురైంది. కోల్‌కతా: ఐపీఎల్లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పైచేయి సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రఘువంశీ (33 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజింక్య రహానే (24 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రావ్మన్ పావెల్ (24 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (24 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. రెండో వికెట్‌కు రహానే, రఘువంశీ 52 బంతుల్లో 84 పరుగులు చేయగా... ఐదో వికెట్‌కు గ్రీన్, పావెల్ 40 బంతుల్లో అభేద్యంగా 70 పరుగులు జోడించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ముకుల్ చౌదరీ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, ఆయుశ్ బదోని (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధసెంచరీ సాధించాడు. బ్యాటింగ్ తడబాటు... ప్రిన్స్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఫిన్ అలెన్ (8) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌండరీ వద్ద రాఠీ పట్టిన ఈ క్యాచ్ చర్చకు దారి తీసింది. క్యాచ్ పట్టే సమయంలో అతని కాలు తగిలి కుషన్ స్వల్పంగా కదిలినట్లు అనిపిస్తున్నా... మూడో అంపైర్ వేర్వేరు కోణాల్లో పరీక్షించకుండానే అలెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు! ఈ దశలో రఘువంశీ, రహానే కలిసి కీలక పరుగులు జోడించారు. అయితే లక్నో బౌలర్లు చెలరేగడంతో ఒక్కసారిగా కోల్‌కతా జోరు తగ్గింది. 19 బంతుల వ్యవధిలో 12 పరుగులు మాత్రమే చేసి జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు బౌండరీనే రాలేదు! ఇలాంటి స్థితిలో గ్రీన్, పావెల్ దూకుడుగా ఆడారు. చివరి 4 ఓవర్లలో కేకేఆర్ 54 పరుగులు రాబట్టింది. బదోని అర్ధ సెంచరీ... ఛేదనలో మార్క్రమ్ (22), మార్ష్(15) తొలి వికెట్‌కు 25 బంతుల్లో 41 పరుగులు జోడించి లక్నోకు మెరుగైన ఆరంభం అందించారు. సైనీ ఓవర్లో మార్క్రమ్ వరుసగా 4, 6, 4తో ధాటిని ప్రదర్శించాడు. అయితే అరోరా ఒకే ఓవర్లో వీరిద్దరిని వెనక్కి పంపి దెబ్బ కొట్టగా... ఎట్టకేలకు ఈ సీజన్లో బౌలింగ్‌కు దిగిన గ్రీన్ తన తొలి ఓవర్లోనే పంత్ (10)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత పూరన్ (13), సమద్ (2) విఫలం కాగా, బదోని కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. బదోని అవుటైన తర్వాత లక్నో దాదాపు ఆశలు కోల్పోగా... ముకుల్ అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించాడు. రాజస్తాన్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరీ జైపూర్ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్‌బౌలర్‌గా మొదలు పెట్టినా...అకాడమీలో వికెట్ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు మళ్లాడు. అండర్–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 199 స్ట్రయిక్‌రేట్‌తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా ఎదగడం ఖాయం’ అని లక్నో కోచ్ లాంగర్ ఐపీఎల్‌కు ముందు వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్ దానిని నిరూపించాడు. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X బెంగళూరు వేదిక: గువాహటిరాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్,జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) షమీ (బి) రాఠీ 41; అలెన్ (సి) రాఠీ (బి) ప్రిన్స్ 9; రఘువంశీ (సి) మార్క్రమ్ (బి) సిద్ధార్థ్ 45; గ్రీన్ (నాటౌట్) 32; రింకూ (బి) అవేశ్ 4; పావెల్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–15, 2–99, 3–105, 4–111. బౌలింగ్: షమీ 4–0–27–0, ప్రిన్స్ యాదవ్ 4–0–47–1, సిద్ధార్థ్ 4–0–34–1, దిగ్వేశ్ రాఠీ 4–0–25–1, అవేశ్ 4–0–44–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్(సి) రఘువంశీ (బి) అరోరా 15; మార్క్రమ్ (సి) పావెల్ (బి) అరోరా 22; పంత్ (సి) త్యాగి (బి) గ్రీన్ 10; బదోని (సి) రింకూ (బి) రాయ్ 54; పూరన్ (సి) రమణ్‌దీప్ (బి) త్యాగి 13; సమద్ (బి) రాయ్ 2; ముకుల్ (నాటౌట్) 54; షమీ (సి) రాయ్ (బి) నరైన్ 1; అవేశ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–41, 2–42, 3–73, 4–95, 5–104, 6–125, 7–128. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–38–2, రాయ్ 4–0–32–2, సైనీ 3–0–37–0, నరైన్ 4–0–13–1, త్యాగి 3–0–31–1, గ్రీన్ 2–0–28–1. -
ఓడిపోయే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.. ఎవరీ ముకుల్ చౌదరి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి మరో సూపర్ స్టార్ పుట్టుకొచ్చాడు. తన సంచలన బ్యాటింగ్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ వంటి విధ్వంసకర ఆటగాళ్ల విఫలమైన చోట.. ఆ యువ ఆటగాడు అద్భుతం సృష్టించాడు. ఒంటో చేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. అతడే లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ చౌదరి.ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముకుల్ చౌదరి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోయే మ్యాచ్‌ను ఓంటి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్(32), రావ్మన్ పావెల్(39) రాణించారు.అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో పవర్ ప్లేలోనే ఓపెనర్లు మార్క్రమ్ (22), మార్ష్(15) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత రిషబ్ పంత్(10), పూరన్(13), సమద్(2) ముగ్గురు కూడా వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అయూశ్ బదోని(54) మాత్రం దూకుడుగా ఆడుతూ కేకేఆర్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు.కానీ అదే సమయంలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి కేకేఆర్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం అయూశ్ బదోని సైతం ఔటయ్యాడు. అప్పటికే చివరి నాలుగు ఓవర్లలో లక్నో విజయానికి 50 పరుగులు కావాలి. రెగ్యులర్ బ్యాటర్లు ఎవరు లేకపోవడంతో లక్నో ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ ముకుల్ చౌదరి అందరి అంచనాలను తారుమారు చేశాడు.తొలి ఆరు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసిన ముకుల్.. ఆఖరి నాలుగు ఓవర్లలో విశ్వరూపాన్ని చూపించాడు. వైభవ్ అరోరా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 4, 6, 1 బాది 11 పరుగులు రాబట్టిన ముకుల్ చౌదరి.. తర్వాత కార్తీక్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 2 సిక్సర్లతో 13 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 30 పరుగులు అవసరమయ్యాయి.ఈ సమయంలో కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ముకుల్ 6, 4, 6 బాది 16 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆరోరా వేసిన చివరి ఓవర్లో లక్నో విజయ సమీకరణం 14 పరుగులుగా మారింది. తొలి బంతిని అవేష్ సింగిల్ తీసి ముకుల్ చౌదరికి స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో ముకుల్.. రెండో బంతిని డీప్ స్క్వేర్-లెగ్ దిశగా భారీ సిక్సర్‌గా మలిచాడు.అనంతరం వరుసగా రెండు బంతులకు ఎలాంటి పరుగులు రాకపోవడంతో లక్నో డగౌట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఐదో బంతికి ముకుల్ సిక్స్ బాది స్కోర్లను సమం చేశాడు. చివరి బంతికి బై రూపంలో పరుగు తీసి తన జట్టుని గెలిపించాడు. ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఎవరీ ముకుల్ చౌదరి నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ ముకుల్ చౌదరి?21 ఏళ్ల ముకుల్ చౌదరి.. రాజస్తాన్‌లోని ఝున్‌ఝునులో జన్మించాడు. ముకుల్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. అతడి తండ్రి ముకుల్‌ను గొప్ప క్రికెటర్ చేయాలని కలలు కన్నాడు. కానీ అప్పట్లో వారి ఆర్ధిక పరిస్థితి అంత బాగోలేకపోవడంతో సరైన అకాడమీలో చేర్చలేకపోయాడు. ఆఖరికి పైసా పైసా కూడబెట్టి 12-13 ఏళ్ల వయసులో తొలిసారి ముకుల్‌ను ఓ క్రికెట్ ఆకాడమీలో అతడి తండ్రి చేర్చాడు. ముకుల్ మొదట్లో మీడియం ఫాస్ట్ బౌలర్‌గా శిక్షణ పొందాడు. అయితే తన అకాడమీ జట్టులో వికెట్ కీపర్ లేకపోవడంతో కీపింగ్ గ్లౌవ్స్ ధరించాడు. ఆపై అతడు బౌలింగ్‌ను పక్కన పెట్టి స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా మారిపోయాడు. ముకుల్ 2023లో రాజస్థాన్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో 165+ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.అంతేకాకుండా గతేడాది జరిగిన అండర్-23 వన్డే టోర్నమెంట్లో కూడా అతడు రాజస్తాన్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్డే టోర్నీలో అతడు 102.83 సగటుతో 617 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2026 వేలానికి ముందు అతడిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్రయల్స్‌కు పిలిచింది.ట్రయల్స్‌లో కూడా తన అద్భుత బ్యాటింగ్‌తో ముంబై స్కౌట్లను ఆకట్టుకున్నాడు. దీంతో ముకుల్‌ను వేలంలో కొనుగోలు చేయాలని ముంబై భావించింది. రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. ఆఖరికి లక్నో రూ. 2.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముకుల్ ఆడిన రెండు మ్యాచ్‌లలో అతడు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. కానీ అతడికి లక్నో మేనెజ్మెంట్ మరోసారి అవకాశమచ్చింది. ఈసారి తన మూడో మ్యాచ్‌లో అద్బుత ఇన్నింగ్స్‌తో మేనెజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటివరకు 4 ఫస్ట్ క్లాస్, 5 లిస్ట్-ఎ, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. -
ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి
ఐపీఎల్-2026లో వరుసగా రెండో మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 3 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.ఈ విజయంలో ముకుల్ చౌదరిది కీలక పాత్ర. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో పవర్‌ప్లేలోనే ఓపెనర్లు మార్క్రమ్(22), మార్ష్(15) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే రిషబ్ పంత్(10), నికోలస్ పూరన్(13), సమద్(2) కూడా వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆయూశ్ బదోని మాత్రం కేకేఆర్ బౌలర్లను టార్గెట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన అనంతరం బదోని(54) కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో లక్నో ఓటమి ఖాయమని అంతా భావించారు.ముకుల్ సంచలనంకానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి అందరి అంచనాలను తారుమారు చేశాడు. తొలి ఆరు బంతుల్లో కేవలం 6 పరుగులు చేసిన ముకుల్.. ఆ తర్వాత మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా.. ముకుల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 6, 4, 6 బాది 16 పరుగులు రాబట్టేశాడు. దీంతో లక్నో విజయ సమీకరణం 6 బంతుల్లో 14 పరుగులుగా మారింది. తొలి బంతికి అవేష్ ఖాన్ సింగిల్ తీసి స్ట్రైక్ ముకుల్ చౌదరికి ఇచ్చాడు. రెండో బంతికి సిక్సర్ బాదిన ముకుల్ చౌదరి, ఆ తర్వాత 2 డాట్ బాల్స్ ఆడాడు. చివరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సి వచ్చింది. దీంతో ఇరు జట్ల డగౌట్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఐదో బంతిని ముకుల్ సిక్సర్‌గా బాది స్కోర్లను సమం చేశాడు. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు లభించడంతో లక్నో విజయం సాధించింది. వికెట్ కీపర్ రఘువంశీ డైరెక్ట్ త్రో చేయడంలో విఫలమయ్యాడు.ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా లక్నో 182 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, అనుకుల్ రాయ్ తలా రెండు వికెట్లు సాధించగా.. సునీల్ నరైన్, గ్రీన్, త్యాగీ చెరో వికెట్ పడగొట్టారు.అంతకముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్(32), రావ్మన్ పావెల్(39) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్దార్ధ్, దిగ్వేష్ సింగ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2026: 'అతడొక సంచలనం.. టీమిండియా సూపర్ స్టార్ అవుతాడు' -
ఫిన్ అలెన్‌ది ఔటా? నాటౌటా?
ఐపీఎల్ 2026లో అంపైరింగ్ నిర్ణయాలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ అవుటైన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. లక్నో ఫీల్డర్ దిగ్వేష్ రాఠీ పట్టిన క్యాచ్ క్లీన్ క్యాచ్ కాదా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.ఏమి జరిగిందంటే?కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్ వేసిన నాలుగో బంతిని ఫిన్ అలెన్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని డీప్ థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న దిగ్వేష్ రాఠీ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో రాఠీ కాలు బౌండరీ లైన్‌కు తాకినట్లు కన్పించింది.సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయాలి. కానీ ఆశ్చర్యకరంగా ఫీల్డ్ అంపైర్లు అలెన్‌ను నేరుగా అవుట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత రిప్లేలో అతడి కాలి బౌండరీ రోప్‌కు తాకినట్లు అన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్‌గా నాటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతకుముందు ఇదే సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ క్యాచ్‌లు కూడా వివాదస్పదమయ్యాయి.Finn Allen robbed pic.twitter.com/5Jqb7r6IVl— Nickk Knight (@KnightNick34590) April 9, 2026 -
ఉత్కంఠపోరులో లక్నో విజయం
KKR vs LSG Live updates: కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముకుల్ చౌదరి(27 బంతుల్లో 54) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో లక్నోను గెలిపించాడు. చివరి ఓవర్లో లక్నో విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి అవేష్ ఖాన్ సింగిల్ తీసి స్ట్రైక్ ముకుల్ చౌదరికి ఇచ్చాడు. ముకుల్ రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో లక్నో విజయ సమీకరణం 4 బంతుల్లో 7 పరుగులగా మారింది. అయితే తర్వాతి రెండు బంతులకు ఎటువంటి పరుగులు రాలేదు. చివరి రెండు బంతులకు 7 పరుగులు అసవరమయ్యాయి. మళ్లీ ఐదో బంతికి ముకుల్ సిక్సర్ బాదాడు. దీంతో స్కోర్లు సమమయ్యాయి. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు లభించడంతో లక్నో విజయం సాధించింది. వికెట్ కీపర్ రఘువంశీ డైరెక్ట్ త్రో చేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా లక్నో 182 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతి చేధించింది.దుమ్ములేపుతున్న ముకుల్ చౌదరికేకేఆర్ విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావాలి. ముకుల్ చౌదరి అద్భుతంగా ఆడుతున్నాడు.18 ఓవర్లకు లక్నో స్కోర్: 152/718 ఓవర్లు ముగిసేసరికి లక్నో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ముకుల్ చౌదరీ(26) దూకుడుగా ఆడుతున్నాడు.కేకేఆర్ ఆరో వికెట్ డౌన్కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన ఆయూశ్ బదోని.. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14.4 ఓవర్లకు లక్నో స్కోర్: 125-6లక్నో నాలుగో వికెట్ డౌన్‌లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నికోలస్ పూరన్.. కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.లక్నో మూడో వికెట్ డౌన్రిషబ్ పంత్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రిషబ్ పంత్.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లకు లక్నో స్కోర్: 74-3లక్నో రెండో వికెట్ డౌన్‌లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు.లక్నో తొలి వికెట్ డౌన్41 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన మార్క్రమ్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చాడు.4 ఓవర్లకు లక్నో స్కోరెంతంటే?4 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(22), మిచెల్ మార్ష్(22) ఉన్నారు.రాణించిన కేకేఆర్ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్(32), రావ్మన్ పావెల్(39) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్దార్ధ్, దిగ్వేష్ సింగ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 144/417 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో పావెల్(25), గ్రీన్(15) ఉన్నారు.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్రింకూ సింగ్ రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రింకూ సింగ్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. కేకేఆర్ మూడో వికెట్ డౌన్కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన రఘువంశీ.. సిద్దార్ధ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్అజింక్య రహానే రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన రహానే.. దిగ్వేష్ సింగ్ రాథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 102/27 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 65/17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో రఘువంశీ(26), అజింక్య రహానే(27) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఫిన్ అలెన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువంశీ వచ్చాడు. 2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 16/1ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌కు దూరమైన కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.దీంతో బ్లెస్సింగ్ ముజర్బానీ బెంచ్‌కే పరిమితయమ్యాడు. అయితే స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాత్రం తన చేతి వేలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. మరోవైపు లక్నో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎస్ఆర్హెచ్తో ఆడిన టీమ్‌నే కొనసాగించింది.జట్లు:కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగిఇంపాక్ట్ సబ్‌లు - మనీష్ పాండే, వైభవ్ అరోరా, తేజస్వి దహియా, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్‌లు - ఆయుష్ బడోని, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్, -
18 కోట్ల క్రికెటర్ ఆగమనం.. కేకేఆర్ భవిష్యత్తు మారేనా!
ఐపీఎల్ 2026 సీజన్లోకి మరో ఇద్దరు విదేశీ స్టార్లు త్వరలోనే అడుగుపెట్టే అవకాశముంది. శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ, మతీశా పతీరానాలు త్వరలోనే ఫిట్నెస్ టెస్టులో పాసయ్యి లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ పొందేందుకు సిద్ధమవుతున్నారు. ఐపీఎల్లో హసరంగ లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, పతీరానా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడనున్నాడు. హసరంగను రూ. 2 కోట్ల కనీస ధరకు లక్నో దక్కించుకోగా, పతీరానాను కేకేఆర్ రూ. 18 కోట్ల భారీ ధర చెల్లించి కొనుగోలు చేసింది. పతీరానా రాకతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ ఫుంజుకునే అవకాశముంది. నిఖార్సైన బౌలర్ లేక కేకేఆర్ ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే పరాజయాలనే మూటగట్టుకుంది. కాగా టీ20 ప్రపంచకప్‌కు ముందు గాయాలతో హసరంగ, పతీరానాలు మేజర్ టోర్నీకి దూరమయ్యారు. ఐర్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా తొడ వెనుక కండరాల్లో చీలిక రావడంతో హసరంగ టోర్నీ నుంచి తప్పుకోగా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు పతీరానా కండరాల గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. అప్పటినుంచి ఈ ఇద్దరు కొలంబోలోని ఫిట్నెస్ అకాడమీలో చికిత్స పొందుతున్నారు. లంక క్రికెట్లో సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న 15 మంది ఆటగాళ్ల జాబితాలో హసరంగ, పతీరానాలు చోటు దక్కడంతో బయటి లీగుల్లో ఆడాలంటే లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ తప్పనిసరి. ప్రస్తుతం గాయంతో కోలుకున్న ఈ ఇద్దరు ఫిట్నెస్ టెస్టు పాసయ్యేందుకు శ్రమిస్తున్నారు. అయితే వీరిలో హసరంగా ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీకి దరఖాస్తు చేసుకోకపోవడంతో అతడు ఐపీఎల్ ఆడతాడా లేదా అన్నది స్పష్టత రాలేదు.పతీరానా మాత్రం ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో రెండు రోజుల్లో అతను ఫిట్నెస్ టెస్టుకు హాజరవనున్నాడు. ఫిట్నెస్ టెస్టులో క్లియరన్స్ వచ్చిన మరుక్షణం లేదా ఏప్రిల్ మూడో వారంలో పతీరానా కేకేఆర్‌తో కలిసే అవకాశముంది. ఇక పతీరానా ఐపీఎల్లో 32 మ్యాచ్‌లాడి 47 వికెట్లు పడగొట్టాడు. ఇక హసరంగ ఐపీఎల్లో 37 మ్యాచ్‌లాడి 46 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 19వ సీజన్లో కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓటములు ఎదురవ్వగా.. పంజాబ్‌తో మ్యాచ్ వర్షార్పణమయింది. ఇక లక్నో సూపర్‌జెయింట్స్ తొలి మ్యాచ్‌లో ఓటమి చెందినప్పటికీ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో గెలిచి సీజన్లో బోణీ చేసింది.చదవండి: అన్నింటా విఫలం.. ‘తలా’ లేక సీఎస్కే ఆగమాగం! -
అవేశ్ అత్యుత్సాహం.. బీసీసీఐకి సన్‌రైజర్స్ ఫిర్యాదు?
లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అవేష్ ఖాన్‌కు పేరుకు తగ్గట్టే అవేషం ఎక్కువే. గతంలో తన చర్యలతో భారీ జరిమానా ఎదుర్కొన్న అవేష్ ఖాన్.. ఇప్పుడు మరోసారి తన అత్యుత్సాహంతో చిక్కుల్లో పడ్డాడు. ఐపీఎల్-2026 సీజన్లో భాగంగా ఆదివారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి.అసలేం జరిగింది?ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో లక్నో విజయానికి తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. జయదేవ్ ఉనద్కట్ వేసిన ఆ ఓవర్లో తొలి రెండు బంతులను పంత్ బౌండరీలగా మలిచాడు. దీంతో స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాతి రెండు బంతులకు ఎలాంటి పరుగు కాలేదు. ఐదో బంతిని పంత్ మిడ్-ఆఫ్ మీదుగా బౌండరీకి తరలించాడు. అయితే ఆ బంతి బౌండరీ లైన్‌ను తాకకముందే, డగౌట్ వద్ద అవేష్ ఖాన్ అత్యుత్సాహం ప్రదర్శరించాడు.తదుపరి బ్యాటింగ్ కోసం ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉన్న ఆవేష్ ఖాన్.. బయటి నుండి బ్యాట్‌తో ఆ బంతిని కొట్టాడు. కానీ దీన్ని ఎవరూ గమనించకపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచినట్టు నిర్థారించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఇది గమనించి ఫిర్యాదు ఉంటే లక్నోకు ఐదు పరుగులు పెనాల్టీ పడేదని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.రూల్స్ ఏమి చెబుతున్నాయి?నిబంధనల ప్రకారం.. బంతి లైన్ దాటకముందే బయటి ఉన్న వ్యక్తి తాకకూడదు. లా 20.4.2: మైదానం బయట ఉన్న వ్యక్తి ఆటలో జోక్యం చేసుకుంటే, అంపైర్ ఆ బంతిని 'డెడ్ బాల్'గా ప్రకటించవచ్చు. అంతేకాకుండా లా 41 (అన్‌ఫెయిర్ ప్లే) ప్రకారం.. ఆ బంతిని రద్దు చేసి సదరు జట్టుకు 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు. అయితే అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు చేసినా అంపైర్లు పరిగణలోకి తీసుకోపోయేవారని విశ్లేషకులు చెబుతున్నారు.బీసీసీఐకి సన్‌రైజర్స్ ఫిర్యాదు?అయితే ఘటన మాత్రమే కాకుండా, ఈ సీజన్ లో జరిగిన మరికొన్ని అంపైరింగ్ నిర్ణయాలపై సన్‌రైజర్స్ యాజమాన్యం గుర్రుగా ఉంది. దీనిపై బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసే యోచనలో ఎస్ఆర్హెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ అవుట్‌పై కూడా ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేసింది. అదేవిధంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అవుట్ అయిన తీరు కూడా వివాదస్పదమైంది. -
ఇరగదీస్తున్న ఇద్దరు మొనగాళ్లు.. రీఎంట్రీ ఇవ్వాల్సిందే!
మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్.. ఈ ఇద్దరు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్ గెలవడంలో ఈ ఇద్దరు కీలకపాత్ర పోషించారు. 2013 చాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలవడంలో భువనేశ్వర్ కీలకపాత్ర పోషించాడు. 2012లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన భువనేశ్వర్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాదు ధోని హయాంలో బాగా రాటుదేలిన భువనేశ్వర్‌కు రానురాను అవకాశాలు తగ్గిపోయాయి. స్వింగ్ డెలివరీలతో ముప్పతిప్పలు పెట్టిన భువనేశ్వర్ దశాబ్ద కాలం పాటు టీమిండియాకు మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) ప్రధాన బౌలర్‌గా సేవలందించాడు. 2022లో టీమిండియా తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భువనేశ్వర్ అప్పటినుంచి ఐపీఎల్‌లోనే కనిపిస్తున్నాడు.భువీ కథ అలా ఉంటే టీమిండియా పేసర్ మహ్మద్ షమీది మరో కథ. నిలకడకు మారుపేరుగా నిలిచే షమీ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీయడంలో నేర్పరి. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ పైనల్ చేరడంలో షమీ పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఆ టోర్నీలో భారత్ తుదిమెట్టుపై బోల్తా పడినప్పటికీ షమీ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ టోర్నీలో ఏడు మ్యాచ్‌లాడిన షమీ 24 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. టెస్టుల్లోనూ తనదైన మార్క్ చూపిన షమీకి ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే వస్తోంది. గాయాల పేరుతో అకారణంగా జట్టు నుంచి తప్పించిన షమీ టీమిండియాలో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉన్నాడు.తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో అటు భువనేశ్వర్.. ఇటు మహ్మద్ షమీ తమ సత్తా చాటుతున్నారు. ఈ ఇద్దరు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు నేలకూలుస్తూ తమను పరిగణలోకి తీసుకోవాల్సిందేనంటూ బీసీసీకి పరోక్షంగా సందేశాలు పంపుతున్నారు. లేటు వయసులోనూ పదునైన బౌలింగ్‌తో అందరి దృష్టి ఆకర్షిస్తున్న షమీ, భువనేశ్వర్ ఐపీఎల్ 19వ సీజన్‌తో మరోసారి సెలెక్టర్ల దృష్టిలో పడినట్లే.గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్‌లో కొనసాగిన షమీని లక్నో సూపర్‌జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో షమీ తన ప్రాముఖ్యతను రుచి చూపించాడు. 4 ఓవర్లు వేసిన షమీ 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన షమీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో షమీ 122 మ్యాచ్‌లాడి 136 వికెట్లు పడగొట్టాడు.ఇక ఐపీఎల్లో 200 వికెట్ల మార్క్‌ను అందుకున్న భువనేశ్వర్ కుమార్ కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. 2016లో ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్ చాలాకాలం పాటు ఆ జట్టుకే ఆడాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)అయితే గత సీజన్‌కు ముందు ఆర్సీబీలోకి వెళ్లిన భువనేశ్వర్ 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అంతేకాదు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ఆర్సీబీ జట్టులోనూ భువీ బాగమయ్యాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో భువనేశ్వర్ కుమార్ 192 మ్యాచ్‌ల్లో 202 వికెట్లు తీశాడు.దాదాపు ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షమీ, భువనేశ్వర్‌లు తాజాగా లేటు వయసులోనూ ఇరగదీస్తున్నారు. ఓవరాల్‌గా షమీ అన్ని ఫార్మాట్లు కలిపి 462 వికెట్లు పడగొడితే.. భువనేశ్వర్ అన్ని ఫార్మాట్లు కలిపి 294 వికెట్లు తీశాడు. లేటు వయసులో ఇరగదీస్తున్న భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలు మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిద్దాం. View this post on Instagram A post shared by MOHAMMAD SHAMI (@mdshami.11)చదవండి: భయంతో ఆడిన పంత్.. సంజీవ్ గోయెంకా రియాక్షన్! -
భయంతో ఆడిన పంత్.. సంజీవ్ గోయెంకా రియాక్షన్!
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ బోణీ కొట్టింది. ఆదివారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఐదో బంతికి విజాయన్ని అందుకుంది. కాగా రిషబ్ పంత్ (68 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ మార్కరమ్ (45) మరోసారి మెరిశాడు. అయితే పంత్ తన శైలికి విరుద్ధంగా ఎక్కువ బంతులాడి అర్థసెంచరీ సాధించడం ఆసక్తిగా కనిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓటమి పాలవ్వడంతో ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు రావడం వివాదాస్పదమైంది. ఇద్దరు సీరియస్‌గా చర్చించుకున్న వీడియోలు బయటికి వచ్చాయి. ఆ తర్వాత లక్నో ఫ్రాంచైజీ దీనిపై స్పష్టతనిస్తూ పూర్తి వీడియోనూ విడుదల చేయడంతో వివాదం సద్దుమణిగింది. కానీ లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌లో మాత్రం ఆ భయం పోలేదనిపిస్తుంది. ఈసారి కూడా ఓటమి చవిచూస్తే తమ బాస్ ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని పంత్ భావించినట్లున్నాడు. అందుకే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో పంత్ ఆఖరిదాకా నిలబడి జట్టును గెలిపించాడు. ఫలించిన మొక్కులు..మ్యాచ్ విజయం అనంతరం పంత్ దగ్గరకు వచ్చిన సంజీవ్ గోయెంకా ఈసారి మాత్రం నవ్వుతూ అతన్ని హగ్ చేసుకున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినందుకు అతన్ని మెచ్చుకున్నాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో లక్నో గెలవాలని సంజీవ్ గోయెంకా పదేపదే తన వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకు మొక్కడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.#LucknowSuperGiants owner taking blessings of #LordVenkateswaraOm Namo Venkatesaya 🕉️pic.twitter.com/jqY6bfB4Se— Milagro Movies (@MilagroMovies) April 6, 2026ఇక ఎస్ఆర్హెచ్పై విజయం అనంతరం సంజీవ్ గోయెంకా తన జట్టును మెచ్చుకుంటూ ట్విటర్లో పోస్టు పెట్టాడు. ‘ఐపీఎల్ అనేది సుదీర్ఘంగా సాగుతుంది. ఒక జట్టు విజయం సాధించాలంటే సమయం, సహనం, జట్టు ఐకమత్యం అవసరం. ఇవాళ ఆ మూడు మా లక్నో జట్టులో ప్రతిబింబించాయి. పంత్ కెప్టెన్‌గా జట్టును దిశానిర్దేశం చేస్తే ఆటగాళ్లంతా క్రమశిక్షణతో దానిని అనుసరించారు. జట్టులో ఉండే సమన్వయం ఎదుగుదలకు తోడ్పతుంది. ఈ విజయం మాకు ఆరంభం మాత్రమే. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మున్ముందు మా ఆటలో మరింత పురోగతి కనిపిస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. మిడిలార్డర్లో నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌లు అర్థసెంచరీలతో రాణించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.చదవండి: ఆర్సీబీతో మ్యాచ్.. ఓటమికి పూర్తి బాధ్యత నాదే! -
5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం
-
సన్ రైజ్ కాలేదు
సొంత మైదానంలో తొలి పోరు... మధ్యాహ్నం మ్యాచ్... బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్... టాస్ ఓడినా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. అయినా సరే సన్‌రైజర్స్ హైదరాబాద్ 156 పరుగులకే పరిమితమైంది. 26 పరుగులకే 4 వికెట్లు పడినా... నితీశ్ రెడ్డి, క్లాసెన్ మెరుపులతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ కూడా తడబడినా కెప్టెన్ రిషభ్ పంత్ ముందుండి జట్టును గెలుపు తీరం చేర్చాడు. తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన అతను దూకుడుగా వెళ్లకుండా పరిస్థితికి తగినట్లుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో లక్నో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కిది రెండో పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (33 బంతుల్లో 56; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 63 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. ఐపీఎల్లో ఐదో వికెట్‌కు సన్‌రైజర్స్ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అనంతరం లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రిషభ్ పంత్ (50 బంతుల్లో 68 నాటౌట్; 9 ఫోర్లు), మార్క్రమ్ (27 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌కు కళ్లెం వేసిన లక్నో పేసర్ షమీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సన్‌రైజర్స్ తదుపరి పోరులో ఈనెల 11న న్యూచంఢీగడ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. మెరుపు భాగస్వామ్యం... వరుసగా వికెట్లు కోల్పోవడంతో కాస్త జాగ్రత్త పడుతూ క్లాసెన్, నితీశ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడారు. తొలి 13 బంతుల్లో క్లాసెన్ 8 పరుగులే చేయగా, నితీశ్ 13 బంతుల్లో 4 పరుగులే చేశాడు. అయితే ప్రిన్స్ వేసిన 11వ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్ కొట్టడంతో జోరు మొదలైంది. 19 పరుగుల వద్ద ముకుల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన క్లాసెన్ ఆ తర్వాత అవేశ్ ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో ముందుగా క్లాసెన్ 33 బంతుల్లో, నితీశ్ 30 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే మరింత వేగంగా ఆడే క్రమంలో 2 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరగ్గా... మరో 12 పరుగులు జోడించి రైజర్స్ తర్వాతి 3 వికెట్లు కోల్పోయింది. ఆఖరి 4 ఓవర్లలో జట్టు 5 వికెట్లు చేజార్చుకొని 33 పరుగులే చేయగలిగింది. రాణించిన మార్క్రమ్... ఓపెనర్‌గా చేసిన ప్రయత్నాన్ని లక్నో సారథి పంత్ ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేశాడు. దాంతో మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు), మార్క్రమ్ లక్నో ఛేజింగ్‌ను ప్రారంభించారు. మార్ష్ తొందరగానే అవుటైనా, మార్క్రమ్ ధాటిని ప్రదర్శించాడు. ఉనాద్కట్ ఓవర్లో అతను 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టడంతో లక్నో పవర్‌ప్లేలో స్కోరు 53 పరుగులకు చేరింది. మరోవైపు పంత్ మాత్రం దూకుడుకు పోకుండా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మూడు పరుగుల వ్యవధిలో బదోని (9 బంతుల్లో 12; 1 ఫోర్), నికోలస్ పూరన్ (1)లను అవుట్ చేయడంతో పాటు పరుగుల వేగాన్ని అడ్డుకొని రైజర్స్ పైచేయి సాధించే ప్రయత్నం చేసింది. ఈ దశలో పంత్‌కు అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 16; 2 ఫోర్లు) కొద్దిసేపు అండగా నిలిచాడు. 43 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. చివర్లో ఉత్కంఠ... లక్నో విజయానికి చివరి 18 బంతుల్లో 19 పరుగులు కావాలి. దూబే 6 పరుగులే ఇచ్చి సమద్‌ను అవుట్ చేయగా, 19వ ఓవర్లో హర్షల్ 4 పరుగులే ఇచ్చాడు. దాంతో ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. ఉనాద్కట్ వేసిన తొలి రెండు బంతులను ఫోర్లుగా మలచిన పంత్ తర్వాతి రెండు బంతుల్లో పరుగు తీయలేకపోయాడు. అయితే ఐదో బంతిని మళ్లీ బౌండరీకి తరలించి విజయాన్ని ఖాయం చేశాడు.షమీ సూపర్... సీనియర్ పేసర్ షమీ ఈ మ్యాచ్‌లోనూ తన స్థాయిని ప్రదర్శించాడు. తొలి ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ (0)ను వెనక్కి పంపించిన అతను, తన రెండో ఓవర్ తొలి బంతికే ట్రవిస్ హెడ్ (8 బంతుల్లో 7; 1 ఫోర్)ను అవుట్ చేశాడు. ఇద్దరు విధ్వంసక ఆటగాళ్ల పని పట్టిన షమీ నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండానే తన స్పెల్‌ను 4–0–9–2తో ముగించాడు. మరోవైపు కెప్టెన్ ఇషాన్ కిషన్ (4 బంతుల్లో 1), లివింగ్‌స్టోన్ (20 బంతుల్లో 14; 1 సిక్స్) కూడా వెనుదిరగడంతో స్కోరు 26/4 వద్ద నిలిచింది. పవర్‌ప్లేలో 22 పరుగులే చేసిన రైజర్స్ 10 ఓవర్లు ముగిసేసరికి 35 పరుగులకే పరిమితమైంది. ఆ మూడు సిక్స్‌లు...లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ ‘నోట్‌బుక్’ రాఠీపై నితీశ్ రెడ్డి విరుచుకు పడ్డాడు. రాఠీ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో నితీశ్ మూడు సిక్స్‌లు బాదాడు. అప్పటికే జోరు మొదలు పెట్టిన నితీశ్ దూసుకుపోయాడు. లాంగాన్, లాంగాఫ్ దిశగా వరుసగా రెండు సిక్స్‌లు బాదిన అతను మరో మూడు బంతులకు లాంగాన్ వైపే అలవోకగా మరో సిక్స్‌ను మలిచాడు. ఈ షాట్లతో ఉప్పల్ స్టేడియం హోరెత్తిపోయింది. ఈ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. 5 ఐపీఎల్లో సన్‌రైజర్స్‌పై లక్నోకిది ఐదో విజయం. ఈ ఐదింటిలో నాలుగు ఛేజింగ్లోనే వచ్చాయి. ఈ నాలుగింటిలో మూడింట లక్నో ఐదు వికెట్ల తేడాతో నెగ్గడం విశేషం. ఒక మ్యాచ్‌లో ఏడు వికెట్లతో గెలవగా, మరో మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయం అందుకుంది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) మార్క్రమ్ (బి) షమీ 7; అభిõÙక్ (సి) సిద్ధార్థ్ (బి) షమీ 0; ఇషాన్ కిషన్ (బి) ప్రిన్స్ 1; లివింగ్‌స్టోన్ (సి) పంత్ (బి) రాఠీ 14; క్లాసెన్ (సి) పంత్ (బి) అవేశ్ 62; నితీశ్ రెడ్డి (సి) ప్రిన్స్ (బి) సిద్ధార్థ్ 56; అనికేత్ (నాటౌట్) 2; దూబే (బి) అవేశ్ 0; శివాంగ్ (బి) ప్రిన్స్ 5; హర్షల్ (రనౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–11, 4–26, 5–142, 6–144, 7–144, 8–151, 9–156. బౌలింగ్: షమీ 4–0–9–2, దిగ్వేశ్ రాఠీ 4–0–46–1, ప్రిన్స్ యాదవ్ 4–0–34–2, సిద్ధార్థ్ 4–0–29–1, అవేశ్ 4–0–36–2. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) లివింగ్‌స్టోన్ (బి) శివాంగ్ 45; మిచెల్ మార్ష్ (సి) నితీశ్ (బి) మలింగ 14; పంత్ (నాటౌట్) 68; బదోని (స్టంప్డ్) ఇషాన్ కిషన్ (బి) దూబే 12; పూరన్ (రనౌట్) 1; సమద్ (సి) లివింగ్‌స్టోన్ (బి) దూబే 16; ముకుల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–37, 2–77, 3–102, 4–105, 5–139. బౌలింగ్: హర్ష్ దూబే 4–0–18–2, నితీశ్ రెడ్డి 1–0–14–0, ఉనాద్కట్ 3.5–0–50–0, ఇషాన్ మలింగ 4–0–30–1, హర్షల్ 3–0–16–0, శివాంగ్ 4–0–30–1. -
బోణీ కొట్టిన లక్నో.. ఎస్ఆర్హెచ్కు రెండో ఓటమి
ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయం నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అయితే 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను హెన్రిచ్ క్లాసెన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ బ్యాటర్లు మాత్రం విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ తలా రెండేసి వికెట్లు చొప్పున పడగొట్టారు.పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్..ఇక 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలోనే మిచెల్ మార్ష్(14) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఐడైన్ మార్క్రమ్(45), కెప్టెన్ రిషబ్ పంత్(68 నాటౌట్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మార్క్రమ్ ఔటైనప్పటికి.. పంత్ మాత్రం అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. 19.5 ఓవర్లలో టార్గెట్‌ను లక్నో చేధించింది.ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్ష్ దూబే రెండు వికెట్లు సాధించగా.. ఎషాన్ మలింగ, శివాంగ్ కుమార్ తలా వికెట్ పడగొట్టారు. అయితే సీనియర్ పేసర్ జయ్‌దేవ్ ఉనద్కట్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఉనద్కట్ 3.5 ఓవర్లలో ఏకంగా 50 పరుగులిచ్చాడు. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన సమయంలో ఉనద్కట్ తేలిపోయాడు. ఎస్ఆర్హెచ్కు ఇది రెండో ఓటమి.చదవండి: IPL 2026: సూపర్ డెలివరీ.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది -
సూపర్ డెలివరీ.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది
ఐపీఎల్-2026లో ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్‌ను తన మొదటి ఓవర్లోనే పడగొట్టి ప్రత్యర్థి జట్టును ప్రిన్స్ దెబ్బతీశాడు. ఈ లక్నో స్పీడ్ స్టార్ కిషన్‌ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన డెలివరీకి ఇషాన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ బౌలింగ్ చేసిన ప్రిన్స్ యాదవ్.. మూడో బంతిని గుడ్ లెంగ్త్ ఇన్ స్వింగర్‌గా సంధించాడు. బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన కిషన్, కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్, ప్యాడ్ మధ్య ఉన్న గ్యాప్ నుంచి వెళ్లి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.దీంతో కేవలం ఒక్క పరుగు మాత్రమే కిషన్ పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రిన్స్ యాదవ్ తన 4 ఓవర్ల కోటాలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా ప్రిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.ONE OF THE BEST BALL BY AN INDIAN UNCAPPED STAR - PRINCE YADAV 🥶- The Bharat Arun effect. pic.twitter.com/wD0Bhdvsoq— Johns. (@CricCrazyJohns) April 5, 2026చదవండి: Riyan Parag: ‘ఇదే నా హెచ్చరిక.. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం’ -
ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు!
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సొంతగడ్డపై లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు వర్షం అడ్డు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలుకానున్న మ్యాచ్ మధ్యలో వర్షం పడే చాన్స్ ఉంది. ఆట జరిగే సమయంలో 50 శాతం వర్షం పడే అవకాశాలున్నట్లు వెదర్ రిపోర్ట్ చూపిస్తోంది. ప్రస్తుతానికి ఎండ బాగానే కాస్తున్నప్పటికీ మ్యాచ్ సమయానికి వాతావరణం చల్లబడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించి టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో ఓడిన ఎస్ఆర్హెచ్ రెండో మ్యాచ్‌లో గెలిచి బోణీ చేసింది. మరోవైపు పంత్ సారథ్యంలోని లక్నో మాత్రం తొలి మ్యాచ్‌లో ఓడి ఇంకా బోణీ కోసం ఎదురుచూస్తోంది. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ ఐదో స్థానంలో ఉంటే.. లక్నో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. సొంతగడ్డపై భారీ విజయంతో ముందంజ వేయాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుంటే.. లక్నో మాత్రం ఎలాగైనా ఉప్పల్‌లో గెలిచి ఖాతా తెరవాలని చూస్తోంది. ఇరుజట్లు ముఖాముఖి పోరులో ఆరుసార్లు తలపడితే లక్నో 4 విజయాలు.. ఎస్ఆర్హెచ్ రెండు విజయాలు సాధించాయి. గతేడాది ఇదే ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై లక్నో సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది.చదవండి: అతడిని వదిలి సీఎస్కే తప్పు చేసిందా? -
‘హోం’లో పోరుకు రెడీ!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2026 సీజన్లో హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. హోం టీమ్ సన్‌రైజర్స్ ఉప్పల్ మైదానంలో నేడు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌తో హైదరాబాద్ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడినా... ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి రైజర్స్ జోరు మీదుంది. మరో వైపు లక్నో తాము ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో సొంతగడ్డపైనే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలైంది. 2025 సీజన్లో ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. మార్పుల్లేకుండా... తిరుగులేని బ్యాటింగ్ బలగం ఉన్న సన్‌రైజర్స్ మరోసారి అదే విధ్వంసక ఆటను సొంత గడ్డపై చూపించాలని పట్టుదలగా ఉంది. హెడ్, అభిషేక్ మెరుపు బ్యాటింగ్‌లో చెలరేగితే జట్టుకు తిరుగుండదు. హైదరాబాద్ ఓపెనర్లను లక్నో ఏమాత్రం నిలువరించగలదనేదే ఆసక్తికరం. వీరి తర్వాత అదే ధాటిని కొనసాగించేందుకు ఇషాన్ కిషన్, క్లాసెన్ సిద్ధంగా ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైనా...అనికేత్ వర్మ ప్రతిభావంతుడైన బ్యాటర్. వీరికి తోడు లోకల్ బాయ్ నితీశ్ కుమార్ రెడ్డి ఫామ్‌లోకి రావడం మరో సానుకూలాంశం. కోల్‌కతాలో పోరులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన నితీశ్ తన జోరును కొనసాగించాలని కొనసాగించాలని భావిస్తున్నాడు. ఏడో స్థానంలో వచ్చే సలీల్ కూడా ధాటిగా ఆడగల సమర్థుడు. అన్నింటికి మించి హైదరాబాద్ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు బాగా అనుకూలమే. పరుగుల విషయంలో ఎన్నో రికార్డులు ఈ మైదానంలో బద్దలయ్యాయి. ఈ నేపథ్యంలో రైజర్స్ బ్యాటింగ్ ఏ స్థాయికి చేరుతుందనేది చూడాలి. అయితే బ్యాటింగ్‌తో పోలిస్తే సహజంగానే రైజర్స్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. డేవిడ్ పేన్ ప్రధాన పేసర్ కావడం కాస్త ఆశ్చర్యపరుస్తుండగా...ఉనాద్కట్, మలింగ, దూబే ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చర్చనీయాంశం. పంత్‌పై తీవ్ర ఒత్తిడి... గత సీజన్లో అంతంతమాత్రంగానే ఆడిన లక్నోకు ఈసారి కూడా సరైన ఆరంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో కేవలం 141 పరుగులకే పరిమితమైన ఆ జట్టు ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోలుకొని మళ్లీ దారిలో పడటం టీమ్‌కు ఎంతో కీలకం. ఓపెనర్‌గా వచ్చిన పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు కాబట్టి ఈ సారి కూడా అతను ఓపెనర్‌గా మరో ప్రయత్నం చేయవచ్చు. మార్‡్ష, మార్క్రమ్ తమ స్థాయికి తగినట్లు దూకుడుగా ఆడాల్సి ఉంది. రెండు అగ్రశ్రేణి జట్ల టి20 కెపె్టన్లు అయిన వీరిద్దరు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులు. పూరన్ ఐదో స్థాయిలో బరిలోకి దిగడం జట్టుకు ఏమాత్రం మేలు చేయదు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బదోని కంటే ముందు నాలుగో స్థానం అతను ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఆదుకున్న సమద్ తమ మాజీ జట్టుపై మరో మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. లక్నో పేస్ దళం చాలా పటిష్టంగా ఉంది. షమీ, మొహసిన్, నోర్జే, ప్రిన్స్ జట్టు భారం మోస్తున్నారు. నాణ్యమైన స్పిన్నర్ లేని లోటును టీమ్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.స్వదేశానికి కమిన్స్ సన్‌రైజర్స్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ్రస్టేలియాకు పయనమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతను దానికి స్కానింగ్ చేయించుకునేందుకు స్వదేశానికి వెళ్లాడు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పర్యవేక్షణలో ఈ పరీక్ష జరుగుతుంది. దీని తర్వాత అతని ఫిట్‌నెస్‌పై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే ఐపీఎల్ రెండో దశ పోటీల్లో ఆడతాడా లేదా తేలుతుందని ఆసీస్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.చెన్నై X బెంగళూరు సా.7:30నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారం బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో తమ విజయపరంపరను కొనసాగించేందుకు సిద్ధమైంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో బెంగళూురు తలపడుతుంది. సీజన్ తొలి పోరులో సన్‌రైజర్స్‌ను ఓడించి అమితోత్సాహంతో మొదలు పెట్టిన ఆర్సీబీ సొంత గ్రౌండ్లో అభిమానులకు మళ్లీ గెలుపు సంబరం అందించాలని భావిస్తోంది. మరో వైపు వరుసగా రెండు పరాజయాల తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్న చెన్నై ఎలా రాణిస్తుందనేది చూడాలి. ఆటగాళ్ల వైఫల్యంతో పాటు మైదానంలో ధోని మార్గనిర్దేశనం లేక సీఎస్కే తడబడుతోంది. -
అర్జున్ సంచలన బౌలింగ్.. స్టంప్స్ ఎగిరిపోయాయి
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ నుంచి రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు అర్జున్ను లక్నో కొనుగోలు చేసింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అయితే అర్జున్‌కు లక్నో తుది జట్టులో దక్కలేదు.లక్నో తమ రెండో మ్యాచ్‌లో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో లక్నో షేర్ చేసింది. ఈ వీడియోలో 26 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ తన యార్కర్లతో స్టంప్స్‌ను పడగొడుతూ కనిపించాడు. అతడు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావడంతో బంతిని లోపలికి స్వింగ్ చేస్తూ లెగ్-స్టంప్, ఆఫ్-స్టంప్స్‌ను పడగొట్టిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అర్జున్‌కు తర్వాతి మ్యాచ్‌లో ఆడే అవకాశమివ్వాలని కామెంట్లు పెడుతున్నారు. అయితే మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మోహ్షిన్ ఖాన్, నోర్జే వంటి స్టార్ పేసర్లు ఉండడంతో లక్నో ప్లేయింగ్ ఎలెవన్‌లో అర్జున్‌కు చోటు దక్కడం కష్టంగా మారింది.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్కు షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్Arjun in Arjun mode 🥵 pic.twitter.com/Z3DMHHrhtx— Lucknow Super Giants (@LucknowIPL) April 4, 2026 -
‘సిగ్గుపడుతున్నా.. అతడిపై నిషేధం విధించండి’
లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై బీసీసీఐ నిషేధం విధించాలని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం అనంతరం సంజీవ్ గోయెంకా, రిషబ్ పంత్‌ల మధ్య వాడివేడి సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. వీడియోలో ఇద్దరి మధ్య సంభాషణ వినిపించనప్పటికీ, గోయెంకా ముఖ కవళికలు, పంత్ సమాధానం చెబుతున్న తీరు గమనిస్తే ఎంతో తీవ్రతతో కూడిన చర్చగానే కనిపించింది. తాజాగా లలిత్ మోదీ సంజీవ్ గోయెంకా ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేశాడు. ‘లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ఒక లూజర్, జోకర్. అతని ప్రవర్తన పట్ల నేను సిగ్గుపడుతున్నాను. మ్యాచ్‌లతో క్రికెట్ అభిమానులను అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను తీసుకొచ్చాము. అంతేకానీ క్రికెట్‌కు ఎటువంటి సంబంధం లేని ఒక ఫ్రాంచైజీ ఓనర్ ఆటగాళ్లపై అజమాయిషీ చెలాయించాలని చూడడం ఎంతమాత్రం సరైనది కాదు. ఒకవేళ ఇప్పటికీ నేను ఐపీఎల్ చైర్మన్‌గా ఉండుంటే సంజీవ్ గోయెంకాపై తక్షణమే నిషేధం విధించడంతో, జట్టులో అతని యాజమాన్య హక్కులను శాశ్వతంగా రద్దు చేసేవాడిని. సంజీవ్ గోయెంకా ఒక అవకాశవాది. నిజానికి ఐపీఎల్ నిబంధనల్లో ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకునేందుకు ఒక క్లాజ్‌ను ఏర్పాటు చేశాం. బీసీసీఐ ఆ క్లాజ్‌ను పరిశీలించి సంజీవ్ గోయెంకాపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది. నిజాయితీకి అధిక ప్రాధాన్యమిస్తే మంచిదని నా అభిప్రాయం.’ అని చెప్పుకొచ్చాడు.I told you this guy @DrSanjivGoenka owner of @LucknowIPL is a complete looser and joker of the highest order - i am seriously embarrassed with his behaviour. I created the @IPL for fans and players alike. Not for this to happen every time every year. If I was still Chairman and… https://t.co/5mHzg8RAY1— Lalit Kumar Modi (@LalitKModi) April 2, 2026కనిపించేదంతా నిజం కాదు..అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంజీవ్ గోయెంకా, పంత్ సంభాషణకు సంబంధించిన వీడియోపై లక్నో యాజమాన్యం స్పందించింది. ‘మీ కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. పంత్, గోయెంకాల మధ్య సీరియస్ చర్చ జరుగుతున్న వీడియో క్లిప్పింగ్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో షేర్చేశారు. కానీ అంతకముందు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వీడియోను మీ ముందు ఉంచుతున్నాం. నిజం తెలుసుకోండి’ అంటూ పోస్ట్ చేసింది.లక్నో యాజమాన్యం పోస్ట్ చేసిన వీడియోలో పంత్, గోయెంకాలు మాట్లాడు కోవడానికి ముందు నవ్వుతూ ఒకనొకరు ఆలింగనం చేసుకున్నట్లుగా ఉంది. ఆ తర్వాత ఇద్దరూ మ్యాచ్‌కు సంబంధించి సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అప్పుడు రాహుల్.. ఇప్పుడు పంత్కాగా 2024 సీజన్లో అప్పటి లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కూడా గోయెంకా ఇలాగే ప్రవర్తించిన తీరు అప్పట్లో సంచలనంగా మారింది. బహిరంగంగానే కెప్టెన్‌పై గోయెంకా అసహనం వ్యక్తం చేయడం విమర్శలకు దారి తీసింది. తాజగా పంత్ విషయంలోనూ అలాగే వ్యవహరించాడని భావిస్తున్న తరుణంలో లక్నో ఫ్రాంచైజీ కొత్త వీడియోను రిలీజ్ చేసి అనుమానాలకు తెరదించింది.Not everything you see is the true story, here’s the unfiltered post match vibes, when cameras don’t cut. pic.twitter.com/EiPMWrmlkQ— Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2026చదవండి: ‘నేనైతే ఫుల్ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్ భావోద్వేగం! -
పాపం అర్జున్ టెండూల్కర్.. జట్టు మారినా?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్.. ఐపీఎల్లో అరంగేట్రం చేసి నాలుగేళ్ల అవుతున్నప్పటికి అతడు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య మాత్రం ఐదే ఐదు. అర్జున్ టెండూల్కర్‌ను ఐపీఎల్-2021 వేలంలో ముంబై ఇండియన్స్ తొలిసారిగా రూ.20 లక్షల ప్రైస్‌కు కొనుగోలు చేసింది.అయితే మొదటి రెండు సీజన్లలో (2021, 2022) అతనికి తుది జట్టులో అవకాశం రాలేదు. అనంతరం రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వాంఖడే స్టేడియంలో వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అర్జున్ తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ను ఔట్ చేసి తన తొలి ఐపీఎల్ వికెట్‌ను సాధించాడు. అయితే ఆ తర్వాత అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రతీ సీజన్లోనూ ముంబై అతడిని తమ జట్టులో కొనసాగించేది. కానీ తుది జట్టులో మాత్రం అర్జున్‌కు చోటు దక్కకపోయేది. కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. లేదా నెట్ బౌలర్‌గా అతడిని ఉపయోగించుకునేవారు. అతడు ఆరు సీజన్లలో అతడు ముంబై తరపున కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.అయితే ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. దీంతో అర్జున్ తలరాత మారుతుందని అంతా భావించారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి. లక్నో జట్టు బుధవారం ఏకనా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో తరపున అర్జున్ డెబ్యూ చేస్తాడని అంతా భావించారు. కానీ అతడికి ప్లేయింగ్ లెవెన్‌లో కాదు కాదా, కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ల లిస్ట్‌లో కూడా చోటు దక్కలేదు. లక్నో నలుగురు పేసర్లతో బరిలోకి దిగినప్పటికి, అర్జున్ వైపు మాత్రం లక్నో టీమ్‌మెనెజ్‌మెంట్ మొగ్గు చూపలేదు. అయితే ఈ మ్యాచ్‌లో యువ పేసర్లు ప్రిన్స్ యాదవ్, మోహ్షిన్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వీరితో పాటు సీనియర్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, నోకియా కూడా ఫర్వాలేదన్పించారు. దీంతో ఇప్పటిలో అర్జున్ లక్నో తరపున డెబ్యూ చేసే సూచనలు కన్పించడం లేదు.చదవండి: IPL 2026: ఇంపాక్ట్‌గా వచ్చి ఇరగదీశాడు.. ఎవరీ సమీర్ రిజ్వీ? -
ఇంపాక్ట్‌గా వచ్చి ఇరగదీశాడు.. ఎవరీ సమీర్ రిజ్వీ?
'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నాకు నచ్చదు.. అందుకు నేను బిగ్ ఫ్యాన్ కాదు'.. ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే యాదృచ్చికంగా అదే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఢిల్లీకి తొలి విజయాన్ని అందించింది. ఐపీఎల్-19వ సీజన్లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అయితే ఈ విజయంలో యువ ఆటగాడు సమీర్ రిజ్వీది కీలక పాత్ర. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.సమీర్ సంచలనం..ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో కేవలం 141 పరుగులకే కుప్పకూలింది. లుంగీ ఎంగిడీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, టి. నటరాజన్ తమ బౌలింగ్‌తో లక్నో పతనాన్ని శాసించారు. అయితే 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ సులువుగా సాధిస్తుందని అంతా భావించారు. కానీ లక్నో తరపున అరంగేట్రం చేసిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ.. ఢిల్లీ ఇన్నింగ్స్ మొదటి బంతికే కేఎల్ రాహుల్‌ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత దాదాపు 15 నెలల తర్వాత బరిలోకి దిగిన మొహ్సిన్ ఖాన్.. తన మొదటి ఓవర్లోనే నితీష్ రాణాను ఔట్ చేసి ఢిల్లీని బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. ఆ ఓవర్లో కనీసం ఒక్క పరుగు కూడా అతడు ఇవ్వలేదు. అనంతరం యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో ఒకే ఓవర్లో పాతుమ్ నిస్సంకను, అక్షర్ పటేల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఢిల్లీ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఢిల్లీ మేనెజ్మెంట్ సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపింది. వాస్తవానికి ఆరంభంలో వికెట్లు పడకపోయింటే గత సీజన్లో రాణించిన అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేవాడు. కానీ త్వరగా వికెట్లు పడిపోవడంతో రిజ్వీని ఇంపాక్ట్ సబ్‌గా పంపాల్సి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన రిజ్వీ.. లక్నో పేసర్లను ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించాడు. అతడు తను ఎదుర్కొన్న తొలి 13 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపి ఢిల్లీ తప్పు చేసిందా? అన్న భావన అందరిలోనూ కలిగింది. కానీ ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఆఖరి బంతికి నోకియా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన సమీర్ రిజ్వీ.. ఆ తర్వాత మరి ఆగలేదు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి స్కోర్ బోర్డులో వేగం పెంచాడు. స్పిన్నర్లను ఓ ఆట ఆడుకున్నాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో 3 ఫోర్లు బాదిన సమీర్ రిజ్వీ.. ఐడైన్ మార్క్రమ్ బౌలింగ్‌లో 6,4 బాది 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి అజేయంగా 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొన్న రిజ్వీ.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో ఎవరీ సమీర్ రిజ్వీ అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.ఎవరీ సమీర్ రిజ్వీ?ఐపీఎల్-2024 మినీ వేలంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీని రూ. 8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఒక అన్-క్యాప్డ్ ప్లేయర్ కోసం సీఎస్కే ఇంత భారీ మొత్తం వెచ్చించడం అప్పటిలో సంచలనంగా మారింది. ఐపీఎల్లో తను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన రిజ్వీ.. తర్వాత తన జోరును కొనసాగించలేకపోయాడు. ఆ ఏడాది 8 మ్యాచ్‌లు ఆడిన రిజ్వీ కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు సీఎస్కే అతడిని విడిచిపెట్టింది. ఈ మెగా వేలంలో రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ. 95 లక్షలకే సొంతం చేసుకుంది. గత సీజన్లో అతడు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం 121 పరుగులు చేశాడు. అయినప్పటికి అతడిపై నమ్మకం ఉంచిన ఢిల్లీ యాజమాన్యం తిరిగి రిటైన్ చేసుకుంది. ఇప్పుడు మేనెజ్మెంట్ నమ్మకాన్ని రిజ్వీ నిలబెట్టుకున్నాడు.22 ఏళ్ల సమీర్ రిజ్వీ ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. యూపీ టీ20 లీగ్ అరంగేట్ర సీజన్(2024)లో రిజ్వీ దుమ్ములేపాడు. కాన్పూర్ సూపర్‌స్టార్స్ తరపున ఆడిన రిజ్వీ.. కేవలం 49 బంతుల్లోనే 104 అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే అతడిని సీఎస్కే అంత భారీ ధరకు సొంతం చేసుకుంది. అతడిని అందరూ "రైట్ హ్యాండెడ్ సురేష్ రైనా" అని పిలుస్తారు.రైనా లాగే మిడిల్ ఓవర్లలో వచ్చి వేగంగా పరుగులు రాబట్టడం, భారీ షాట్లు ఆడడం సమీర్ స్పెషాలిటీ. రైనా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఒక స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో రిజ్వీ కూడా నడుస్తున్నాడు. సమీర్ రిజ్వీ ఫస్ట్ క్రికెట్లో యూపీ తరపున ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడాడు. కానీ రెడ్‌బాల్ క్రికెట్లో అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ లిస్ట్-ఎ, టీ20 క్రికెట్లో మాత్రం తన హవాను కొనసాగిస్తున్నాడు.చదవండి: KKR vs SRH: సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్? -
ఢిల్లీ గెలుపు సమీరం
ఐపీఎల్లో మరో మ్యాచ్ స్వల్ప స్కోర్లతో ఉత్కంఠభరితంగా ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో 142 పరుగుల లక్ష్య ఛేదనలో ఒకదశలో 26/4తో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరకు గట్టెక్కింది. యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ముందుండి నడిపించగా, ట్రిస్టన్ స్టబ్స్ అతనికి అండగా నిలిచాడు. అంతకుముందు ఢిల్లీ బౌలర్ల ముందు నిలవలేక టాప్–5లో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో లక్నో ఇన్నింగ్స్ స్వల్ప స్కోరుకే ముగిసింది. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌ల తర్వాత ఒక టీమ్‌కు ‘హోం గ్రౌండ్’లో ఓటమి ఎదురైంది. లక్నో: అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. అబ్దుల్ సమద్ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ఎన్గిడి, నటరాజన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సమీర్ రిజ్వీ (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, ట్రిస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 76 బంతుల్లో అభేద్యంగా 119 పరుగులు జోడించారు. టపటపా... మార్ష్ కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టినా... రిషభ్ పంత్ (7), మార్క్రమ్ (11) విఫలం కావడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 48/2కు చేరింది. ఆ తర్వాత బదోని (0), పూరన్ (8) కూడా విఫలమయ్యారు. కుల్దీప్ చక్కటి బంతితో మార్ష్ ను బోల్తా కొట్టించడంతో సగం ఓవర్ల లోపే లక్నో సగం వికెట్లు చేజార్చుకుంది. 23 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకుంది. ముకుల్ (14) ప్రభావం చూపలేకపోగా, ఈ స్థితిలో సమద్ ఒక్కడే కాస్త పట్టుదలగా నిలబడి కొన్ని పరుగులు సాధించాడు. అయితే నటరాజన్ ఒకే ఓవర్లో సమద్, షమీ (1)లను అవుట్ చేయగా, ఎన్గిడి తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో ఢిల్లీ తడబడింది. మొదటి బంతికే కేఎల్ రాహుల్ (0) వెనుదిరగ్గా... ఐదు పరుగుల వ్యవధిలో నితీశ్ రాణా (15), నిసాంక (1), అక్షర్ పటేల్ (0) అవుటయ్యారు. 4.3 ఓవర్లకే స్కోరు 26/4 కావడంతో క్యాపిటల్స్ కష్టాలు పెరిగాయి. అయితే రిజ్వీ, స్టబ్స్ పట్టుదలగా నిలబడి 17 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. లక్నో ఏకంగా 16 వైడ్లు సహా 20 అదనపు పరుగులిచ్చి ప్రత్యర్థికి ఇతోధిక సహకారం అందించింది. రెండు సిక్సర్లతో మొదలు పెట్టి... 2024 ఐపీఎల్లో రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.8.40 కోట్లకు ఎంచుకుంది. ఈ యూపీ ఆటగాడు దూకుడైన బ్యాటింగ్‌తో ‘కుడిచేతి వాటం సురేశ్ రైనా’గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్లో తాను ఆడిన తొలి 4 బంతుల్లో రెండు సిక్సర్లు బాది ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించినా... ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి 51 పరుగులే చేయగలిగాడు. దాంతో చెన్నై వదులుకోగా, గత సీజన్లో ఢిల్లీ రూ.95 లక్షలకు తీసుకుంది. చివరి మ్యాచ్‌లో 25 బంతుల్లో 58 పరుగులతో జట్టును గెలిపించగా... ఈసారి అదే మొత్తానికి ఫ్రాంచైజీ అతడిని తమతో కొనసాగించింది. ఎట్టకేలకు జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో హీరోలా కీలకమైన హాఫ్ సెంచరీతో తన స్థాయిని పెంచుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌ను కూడా రిజ్వీ తడబడుతూనే ప్రారంభించాడు. తొలి 8 బంతుల్లో అతను సింగిల్ కూడా తీయలేకపోయాడు. తొలి 13 బంతుల్లో చేసినవి 5 పరుగులే! అయితే నోర్జే బౌలింగ్‌లో డీప్ థర్డ్‌మాన్ దిశగా కొట్టిన సిక్స్‌తో అతని జోరు మొదలైంది. షహబాజ్ ఓవర్లో 3 ఫోర్లు బాదిన తర్వాత పరిస్థితికి తగినట్లుగా ఆటను మార్చుకున్నాడు. మార్క్రమ్ ఓవర్లో 6, 4 కొట్టి 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. షమీ తొలి బంతికే... ఐపీఎల్లో తొలిసారి లక్నో జట్టు తరఫున బరిలోకి దిగిన సీనియర్ పేసర్ షమీ వచ్చీ రాగానే ప్రభావం చూపించాడు. మొదటి బంతికే రాహుల్‌ను అతను అవుట్ చేశాడు. ఐపీఎల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే షమీ వికెట్ తీయడం ఇది ఐదోసారి కావడం విశేషం. గతంలో ఏ బౌలర్ మూడుసార్లకు మించి ఈ ఫీట్‌ను నమోదు చేయలేదు.స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) స్టబ్స్ (బి) కుల్దీప్ 35; పంత్ (రనౌట్) 7; మార్క్రమ్ (బి) అక్షర్ 11; బదోని (సి) రాహుల్ (బి) నటరాజన్ 0; పూరన్ (బి) ఎన్గిడి 8; సమద్ (సి) మిల్లర్ (బి) నటరాజన్ 36; ముకుల్ (సి అండ్ బి) కుల్దీప్ 14; షహబాజ్ (నాటౌట్) 15; షమీ (సి) కుల్దీప్ (బి) నటరాజన్ 1; నోర్జే (సి) స్టబ్స్ (బి) ఎన్గిడి 0; మొహసిన్ (సి) ముకేశ్ (బి) ఎన్గిడి 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 141. వికెట్ల పతనం: 1–19, 2–48, 3–49, 4–65, 5–71, 6–105, 7–138, 8–140, 9–141, 10–141. బౌలింగ్: ముకేశ్ కుమార్ 3–0–17–0, ఎన్గిడి 3.4–0–27–3, అక్షర్ 3–0–17–1, నటరాజన్ 4–0–29–3, కుల్దీప్ 4–0–31–1, విప్రాజ్ 1–0–8–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మొహసిన్ (బి) షమీ 0; నిసాంక (సి) పంత్ (బి) ప్రిన్స్ 1; నితీశ్ (సి) సమద్ (బి) మొహసిన్ 15; రిజ్వీ (నాటౌట్) 70; అక్షర్ (బి) ప్రిన్స్ 0; స్టబ్స్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (17.1 ఓవర్లలో 4 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–25, 4–26. బౌలింగ్: షమీ 4–0–28–1, ప్రిన్స్ 3–0–20–2, మొహసిన్ 4–1–19–1, నోర్జే 4–0–39–0, షహబాజ్ 1–0–16–0, మార్క్రమ్ 1–0–13–0, సమద్ 0.1–0–6–0. -
లక్నో బౌలర్ల పోరాటం వృథా.. ఢిల్లీని గెలిపించిన రిజ్వి, స్టబ్స్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.బ్యాటింగ్‌కు పెద్దగా సహకరించని పిచ్‌పై సమీర్ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ (4-0-28-1), మొహిసిన్ ఖాన్ (4-1-19-1), ప్రిన్స్ యాదవ్ (3-0-20-2) అద్బుతంగా బౌలింగ్ చేశారు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు దాన్ని కాపాడుకోలేకపోయారు. అంతకుముందు ఢిల్లీ బౌలర్లు కూడా చెలరేగిపోయి లక్నోను తక్కుక స్కోర్‌కే పరిమితం చేశారు. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు. -
ఐపీఎల్‌లోనూ కొనసాగుతున్న షమీ హవా
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ హవా ఐపీఎల్‌లోనూ కొనసాగింది. 2026 ఎడిషన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ (ఎస్ఆర్హెచ్ నుంచి) అయిన అతను.. ఈ ఫ్రాంచైజీ తరఫున తొలి బంతికే వికెట్ తీసి ఔరా అనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 1) జరుగుతున్న మ్యాచ్‌లో తొలిసారి లక్నో తరఫున బరిలోకి దిగిన షమీ.. 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీశాడు. షమీ దెబ్బకు ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గోల్డన్ డకౌటయ్యాడు.కడపటి వార్తలు అందే సరికి 142 పరుగుల ఛేదనలో ఢిల్లీ తడబడుతుంది. 8 ఓవర్లలో 53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. షమీ తన కోటాలో 3 ఓవర్లు పూర్తి చేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఢిల్లీపై లక్నో బౌలర్లు ముప్పేట దాడి చేస్తున్నారు. షమీ ఓ పక్క.. ప్రిన్స్ యాదవ్ (2-0-14-2), మొహిసిన్ ఖాన్ (2-1-2-1) ఎండ్ నుంచి ఢిల్లీపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలవాలంటే మరో 72 బంతుల్లో 89 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. సమీర్ రిజ్వి (11), ట్రిస్టన్ స్టబ్స్ (12) ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిస్సంక (1), అక్షర్ పటేల్ (0) వికెట్లు ప్రిన్స్ యాదవ్ తీయగా.. నితీశ్ రాణాను (15) మొహిసిన్ ఖాన్ బోల్తా కొట్టించాడు.అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు.దేశవాలీ క్రికెట్లో షమీ హవాటీమిండియా బెర్త్ లక్ష్యంగా షమీ దేశవాలీ క్రికెట్లో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్నాడు. తాజా సీజన్లో అతను రంజీ ట్రోఫీలో 13 ఇన్నింగ్స్‌ల్లో 37 వికెట్లు.. విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 16 వికెట్లు తీశాడు. -
గొయెంకా-రాహుల్ వివాదంపై స్పందించిన షమీ
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, ఆ ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ మధ్య ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో జరిగిన సంఘటనపై ఆ ఫ్రాంచైజీ తాజా రిక్రూటీ మహ్మద్ షమీ స్పందించాడు. తాజాగా ఓ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ, గోయెంకాను సమర్థించాడు.షమీ మాటల్లో.. గొయెంకా గారిని రెండు, మూడు సార్లు కలిశాను. ఎప్పుడూ చాలా లాజికల్‌గా, జట్టు గురించి మాత్రమే మాట్లాడారు. తన జట్టుపై పొజెసివ్‌గా ఉంటే తప్పేముంది. పెట్టుబడి పెట్టాక, ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు ఆశించడం సహజం. తమ డబ్బు వృథా అవుతుందేమో అని ఎవరైనా ఆందోళన చెందుతారు.వివాదం నేపథ్యంఐపీఎల్ 2024 ఎడిషన్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం పాలైంది. 165 పరుగుల లక్ష్యాన్ని SRH కేవలం 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. మ్యాచ్ అనంతరం గోయెంకా మైదానంలో అందరూ చూస్తుండగా కేఎల్ రాహుల్‌ను దండించాడు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఎంత యజమాని అయితే మాత్రం, ఓ కెప్టెన్‌ను అలా పబ్లిక్‌గా విమర్శించడం సరైంది కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు భిన్నంగా షమీ స్పందించడం చర్చనీయాంశమైంది.ఎల్‌ఎస్‌జీలోకి షమీఐపీఎల్ 2026కి ముందు షమీ SRH నుంచి LSGకి ట్రేడ్ అయ్యాడు. SRH ఆయనను IPL 2025లో రూ.10 కోట్లకు కొనుగోలు చేయగా.. అదే ధరకు LSG అతన్ని ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2013లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన షమీ.. Delhi Capitals, Punjab Kings, Gujarat Titans, SRH తరఫున ఆడాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున అతను 2022, 2023 సీజన్లలో వరుసగా 20, 28 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో ఎల్ఎస్జీ ఇవాళ (ఏప్రిల్ 1) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లక్నోలోని ఎఖానా స్టేడియంలో Delhi Capitalsతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో షమీ LSG తరఫున తొలి సారి ఆడబోతున్నాడు. -
లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపులక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌కు సహకరించని పిచ్‌పై సమీర్ రిజ్వి (70 నాటౌట్) అద్బుతంగా ఆది ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) సహకరించాడు. లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసిన ప్రిన్స్4.3వ ఓవర్- ప్రిన్స్ యాదవ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. తొలుత నిస్సంకను ఔట్ చేసిన అతను.. ఆతర్వాత అక్షర్ పటేల్‌ను (0) కూడా పెవిలియన్‌కు పంపాడు. మూడో వికెట్ డౌన్4.2వ ఓవర్-25 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (1) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ3.3వ ఓవర్- 21 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది.మొహిసిన్ ఖాన్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (15) ఔటయ్యాడు.తొలి బంతికే వికెట్ తీసిన షమీ142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. లక్నో తరఫున తొలి బంతికే షమీ వికెట్ తీశాడు. చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నోటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు. ఆరో వికెట్ కోల్పోయిన లక్నో13.1వ ఓవర్- 105 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. ముకుల్ ఛౌదరిని (14) కుల్దీప్ యాదవ్ క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు.పీకల్లోతు కష్టాల్లో లక్నో9.3వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ట్రస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (35) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో.. పూరన్ (8) ఔట్8.5వ ఓవర్- 65 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. బదోని డకౌట్6.3వ ఓవర్- 49 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ బదోని డకౌటయ్యాడు.రెండో వికెట్ డౌన్.. మార్క్రమ్ (11) ఔట్5.5వ ఓవర్- 48 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. పంత్ (7) ఔట్2.6వ ఓవర్- ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. స్ట్రయికర్ మిచెల్ మార్ష్ కొట్టిన బంతి బౌలర్ చేతికి తాకి నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను తాకడంతో పంత్ ఔటయ్యాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 1) జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. లక్నోలోని ఎఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్‌లు: దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, అక్షత్ రఘువంశీఢిల్లీ: KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్‌లు: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్ -
‘బెంచ్ మీద ఉండలేను.. దానికి నేను వ్యతిరేకం’
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో తొలుత సొంత జట్టు ముంబైకి ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆ తర్వాత గోవాకు మారిపోయాడు. అయినప్పటికీ 26 ఏళ్ల అర్జున్ టెండుల్కర్ ఇంతవరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.తండ్రి సచిన్ పదహారేళ్లకే భారత జట్టులో అరంగేట్రం చేసి.. లెక్కకు మిక్కిలి రికార్డులు సాధిస్తే.. అర్జున్ టీమిండియా ఇప్పటికీ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ అతడికి అవకాశాలు కరువయ్యాయి.ఐదు మ్యాచ్‌లు ఆడి..సచిన్ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుతో చాలాకాలం కొనసాగిన అర్జున్ టెండుల్కర్ (Arjun Tendulkar).. ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీయగలిగాడు. చివరగా 2024లో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఈ ఆల్‌రౌండర్.. ఆ తర్వాత మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.లక్నో సూపర్ జెయింట్స్లోకిఈ క్రమంలో 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ అర్జున్ టెండుల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026లో భాగంగా లక్నో బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుండగా.. అర్జున్‌కు తుదిజట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌కు హాజరైన అర్జున్ టెండుల్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడారు కదా! మీరు బాగా బౌలింగ్ చేశారు. స్వింగ్ కూడా బాగుంది. కాబట్టి మరికొన్ని అవకాశాలకు మీరు అర్హులు అని భావించారా?’’ అని హోస్ట్ అర్జున్ టెండుల్కర్‌ను అడిగాడు.బెంచ్ మీద కూర్చోవాలని ఎవరు కోరుకుంటారు?ఇందుకు బదులిస్తూ.. ‘‘ఎవరైనా సరే అలాగే ఫీలవుతారు. బెంచ్ మీద కూర్చోవాలని ఎవరికి మాత్రం ఆశగా ఉంటుంది. అయితే, అవకాశం వచ్చినపుడు కఠినంగా శ్రమించి అద్భుతంగా ఆడటం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది’’ అని అర్జున్ టెండుల్కర్ పేర్కొన్నాడు. అదే విధంగా ఐపీఎల్లో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌పై అభిప్రాయం పంచుకుంటూ.. పదకొండు మంది ఆటగాళ్లతోనే తుదిజట్టు ఉంటే బాగుంటుందని అర్జున్ పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానైతే ఇంపాక్ట్ సబ్ నిబంధనకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు.చదవండి: సిరాజ్ జట్టులో ఎందుకున్నట్లు?.. టీమిండియా దిగ్గజం -
‘స్నేహితుల్లేరు.. మా నాన్న ఫేవరెట్ క్రికెటర్ కాదు’
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రికెటర్లలో తనకు స్నేహితులెవరు లేరని, తన ఆరాధ్య క్రికెటర్ మా నాన్న సచిన్ టెండూల్కర్ ఎంతమాత్రం కాదని అర్జున్ చెప్పడం ఆసక్తిగా అనిపించింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్‌జెయింట్స్‌కు ట్రేడ్ అయిన అర్జున్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు అవకాశం వస్తుందా? రాదా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌కు అర్జున్ టెండూల్కర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘మీరు ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటారు ’ అని అడిగిన ప్రశ్నకు అర్జున్ చాలా ఆసక్తికరంగా బదులిచ్చాడు. ‘గోవాలోని నా ఇంట్లో ఐదు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటితో ఆడుకుంటూ సమయం గడుపుతాను. అదే నా ప్రశాంతతకు అసలు కారణం' అని అర్జున్ వివరించాడు. ఒత్తిడితో కూడిన క్రికెట్ ప్రపంచం నుండి దూరంగా ఉండటానికి ఈ మూగజీవాలు తనకు ఎంతో సహాయం చేస్తాయని తెలిపాడు.సాధారణంగా ఆటగాళ్లకు ఎక్కువగా తోటి క్రికెటర్లే స్నేహితులుగా ఉంటారు. కానీ అర్జున్ మాత్రం తాను ఇందుకు విరుద్ధమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘నాకు నిజంగా క్రికెటర్ స్నేహితులు లేరు. నా ఫ్రెండ్స్‌లో చాలా మందికి క్రికెట్‌తో పెద్దగా పరిచయం కూడా లేదు. అందుకే నేను వారితో కలిసినప్పుడు అస్సలు క్రికెట్ గురించి మాట్లాడను’ అని చెప్పాడు. దీనివల్ల ఆట నుంచి తనకు మంచి విరామం దొరుకుతుందని అభిప్రాయపడ్డాడు.క్రికెట్ దిగ్గజం కుమారుడు కావడంతో అర్జున్ టెండూల్కర్ తరచూ విమర్శలకు గురవ్వడం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ‘విమర్శలంటే మీకు భయమా?’ అని అడిగిన ప్రశ్నకు, అర్జున్ ఏమాత్రం తడబడకుండా.. ‘లేదు, నాకు అస్సలు భయం లేదు’ అని చాలా ధీమాగా సమాధానమిచ్చాడు. ఇక తన ఫేవరెట్ క్రికెటర్ తన నాన్న సచిన్ టెండూల్కర్ కాదని, మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనకు ఆరాధ్య క్రికెటర్ అని పేర్కొనడం విశేషం. అతని బ్యాటింగ్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నాడు.ఇక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడైన అర్జున్ తన తండ్రిలా మాత్రం టీమిండియాలో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. తండ్రి అండతో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు పలు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. IPL-2026 సీజన్‌కు ముందు అర్జున్ టెండూల్కర్‌ను లక్నో ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్లో 5 మ్యాచ్‌లాడిన అర్జున్ టెండూల్కర్ మూడు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాక్Shubhankar: How do you keep yourself so calm and cool?Arjun: I have 5 dogs in Goa & I spend time playing with them.Shubhankar: Do you have friends who are cricketers?Arjun: I don’t really have cricketer friends, most of my friends don’t play cricket.pic.twitter.com/gZJMrcO7Df— Cricketopia (@CricketopiaCom) March 31, 2026 -
LSG vs DC: స్పిన్ X పేస్
లక్నో: ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. గతేడాది ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయిన ఈ రెండు జట్లు బుధవారం తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో పేపర్‌పై భీకరంగా కనిపిస్తోంది. మార్‡్ష, మార్క్రమ్ ఓపెనింగ్ చేయనుండగా... పంత్, పూరన్, బదోనీ, షహబాజ్ మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నారు.గత సీజన్లో ఆకట్టుకున్న స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ మరోసారి కీలకం కానుండగా... పేస్ బౌలింగ్‌లో షమీ, నోర్జే, అవేశ్ ఖాన్, మొహసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ రూపంలో లెక్కకు మిక్కిలి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మరోవైపు అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు కూర్పును సరిచేసుకునే పనిలో ఉంది. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేదెవరో చూడాలి.మిల్లర్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మతో బ్యాటింగ్ బలంగానే ఉండగా... ఆసీస్ స్టార్ పేసర్ స్టార్క్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దేశవాళీల్లో దుమ్మురేపుతున్న అఖీబ్ నబీపై అందరి దృష్టి నిలవనుంది. అక్షర్, కుల్దీప్ స్పిన్ భారం మోయనున్నారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా... అందులో ఢిల్లీ నాలుగు మ్యాచ్‌లు నెగ్గగా... లక్నో మూడింట విజయం సాధించింది. -
‘అదే జరిగితే.. టీమిండియా సెలక్టర్లు పట్టించుకోరు’
గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్. మెగా వేలంలో లక్నో ఫ్రాంఛైజీ రికార్డు స్థాయిలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.కెప్టెన్‌గానూ ఫెయిల్అయితే, ఐపీఎల్-2025లో పంత్ (Rishabh Pant) దారుణంగా విఫలమయ్యాడు. పదమూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్‌గానూ పంత్ ఫెయిలయ్యాడు. అతడి సారథ్యంలో లక్నో గతేడాది పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.టీమిండియా రీఎంట్రీ కష్టమేముఖ్యంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పంత్‌ను ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా పంత్ ఆట తీరు మారకపోతే.. భారత టీ20 జట్టులో అతడు తిరిగి స్థానం దక్కించుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.‘‘రిషభ్ పంత్ విషయంలో విమర్శలు రావడం సరైందే. సంప్రదాయ విరుద్ధ, రిస్కీ షాట్లు ఆడటం అనే చట్రంలో అతడు ఇరుక్కుపోయాడు. ఫామ్‌ను తిరిగి పొందే ప్రయత్నమే చేయడం లేదు. గతేడాది మొత్తం రిస్కీ షాట్లతో విమర్శలు మూటగట్టుకున్నాడు.సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదుటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత టీ20 జట్టుకు అతడు దూరమయ్యాడు. మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందించే పంత్ గురించి ఇప్పుడు సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు.ఓపెనర్-వికెట్ కీపర్‌గా ఓ ఆటగాడు రాణిస్తుంటే (సంజూ), ఓపెనర్- వికెట్ కీపర్ లేదంటే వన్‌డౌన్‌లో ఆడే వికెట్ కీపర్‌గా మరొకరు (ఇషాన్) దుమ్ములేపుతున్నారు. కాబట్టి ఈసారి ఐపీఎల్లో సత్తా చాటితేనైనా తిరిగి జాతీయ జట్టులో పునరాగమనం చేసే అవకాశం అయినా పంత్‌కు దక్కుతుంది. ఏదేమైనా జాతీయ జట్టుకు ఆడటమే ప్లేయర్ అంతిమ లక్ష్యం కదా! యువరాజ్ సింగ్ మార్గదర్శనంలో పంత్ ప్రాక్టీస్ చేయడం శుభసూచకం. ఈసారైనా పంత్ ఉత్తమంగా రాణించాలి. లేదంటే భవిష్యత్ కష్టమే’’ అని ఆకాశ్ చోప్రా జియోహాట్‌స్టార్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్-2026 షురూ కానుంది.చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే? -
‘జెయింట్స్’ స్థాయి పెరిగేనా!
ఐపీఎల్లో ఆలస్యంగా అడుగు పెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి రెండు సీజన్లలో ‘ప్లే ఆఫ్స్’కు చేరి ఆకట్టుకుంది. అయితే గత రెండు సీజన్లలో జట్టు ఆటతీరు పేలవంగా ఉంది. వరుసగా రెండేళ్లు కూడా టీమ్ ఏడో స్థానానికే పరిమితమైంది. 2025లో రికార్డు మొత్తంతో కొత్త కెప్టెన్‌గా వచ్చిన రిషభ్ పంత్ చివరి మ్యాచ్ మినహా టోర్నీ అంతా విఫలం కాగా... ఇతర ఆటగాళ్లు కూడా అదే బాటలో ఉండటం జట్టును దెబ్బ తీసింది. ఐపీఎల్లో ఐదో సీజన్ ఆడబోతున్న లక్నో ఈసారైనా తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తుందో లేదో వేచి చూడాలి. – సాక్షి క్రీడా విభాగం తొలి ఎనిమిది మ్యాచ్‌లలో ఐదు విజయాలు, తర్వాతి ఆరు మ్యాచ్‌లలో ఒకే ఒక్క గెలుపు! గత ఏడాది ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి. టోర్నీని మెరుగ్గా ఆరంభించినా ఆ తర్వాత అంతా గతి తప్పింది. ఈసారి అది పునరావృతం కారాదని జట్టు పట్టుదలగా ఉంది. మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, అవసరం అనుకుంటే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ కనిపించే టీమ్ యాజమాని సంజీవ్ గోయెంకా అంచనాలు, ఆశలకు అనుగుణంగా రాణించడంలో మాత్రం టీమ్ విఫలమవుతోంది. తొలి సీజన్ తర్వాత టీమ్ కిట్‌ను పూర్తిగా మార్చిన మేనేజ్మెంట్ మూడు సీజన్లు దానిని కొనసాగించింది. ఏదైనా నమ్మకాల వల్ల కావచ్చు 2026 సీజన్ కోసం కూడా చాలా మార్పులు చేసింది. టీమ్ జెర్సీని పూర్తిగా మార్చేయడంతో పాటు లోగోను కూడా కొత్తగా డిజైన్ చేయించింది. మైదానంలో ఈ ‘సెంటిమెంట్’లు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది ఆసక్తికరం. పంత్‌పై ఆశలు... టాప్–3 విదేశీ ఆటగాళ్లతో లక్నో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. మిచెల్ మార్‡్షతో పాటు మార్క్రమ్ ఓపెనింగ్ చేస్తాడు. వీరిద్దరు మంచి ఆరంభాన్ని అందిస్తే పూరన్ అదే ధాటిని కొనసాగించగలడు. పంత్ మూడో స్థానంలో ఆడటంపై చర్చ జరిగినా... ఈ ముగ్గురు బ్యాటర్లను చూస్తే పంత్‌కు నాలుగో స్థానమే ఖాయంగా కనిపిస్తోంది. పేసర్లతో ఫుల్... షమీ, నోర్జే, మయాంక్, అవేశ్, మొహసిన్, అర్జున్ టెండూల్కర్, నమన్ తివారి, ఆకాశ్ సింగ్, ప్రిన్స్, అర్షిన్, మార్‡్ష... రెగ్యులర్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు కలిపి ఏకంగా 11 పేస్ బౌలింగ్ ప్రత్యామ్నాయాలు లక్నోకు అందుబాటులో ఉన్నాయి. స్పిన్ బలహీనం... ఐపీఎల్లో చాలా మ్యాచ్‌లలో స్పిన్నర్లు కీలక ప్రభావం చూపించడం ఖాయం. సూపర్ జెయింట్స్ హోమ్ గ్రౌండ్ లక్నో కూడా సగటు భారత పిచ్‌ల తరహాలో పేస్కంటే కూడా స్పిన్‌కే కొంత అనుకూలిస్తుంది. కానీ ఈ విషయంలో లక్నో బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాన స్పిన్నర్‌గా లంక ఆటగాడు హసరంగను జట్టు ఎంచుకుంది. అతనిపైనే ప్రధానంగా భారం ఉంది. లక్నో జట్టు వివరాలు: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మిచెల్ మార్‡్ష, పూరన్, ఇన్‌గ్లిస్, బ్రీట్కే, హసరంగ, నోర్జే, హిమ్మత్, ముకుల్, అక్షత్, సమద్, షహబాజ్, అర్షిన్, బదోని, షమీ, అవేశ్ , సిద్ధార్్థ, దిగ్వేశ్ రాఠీ, ఆకాశ్ సింగ్, ప్రిన్స్, అర్జున్ టెండూల్కర్, నమన్ తివారి, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్. -
పంత్‌ను తీసేద్దామనుకున్నారా?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడికి అంత ధర చెల్లించడం అదే తొలిసారి. అంతేకాదు కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే పంత్ మాత్రం గత సీజన్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. పంత్ తాను ఆడిన 14 మ్యాచ్‌ల్లో 269 పరుగులు మాత్రమే చేయడమే గాక కెప్టెన్‌గా జట్టును ప్లేఆఫ్స్ చేర్చడంలోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో పంత్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలన్న ఆలోచన లక్నో సూపర్‌జెయింట్స్‌కు కలిగినట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. బ్యాటింగ్‌లో విఫలమైన పంత్ అటు కెప్టెన్‌గానూ విఫలం కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేయాలని లక్నో యాజమాన్యం భావించిందట. ఖండించిన గోయెంకా..అయితే ఒక్క సీజన్‌కే పంత్‌ను తప్పించడం సరికాదని మళ్లీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలనుకున్నట్లు వచ్చిన వార్తలను తాజాగా లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఖండించారు. పంత్ నిరాశజనక ప్రదర్శన చేసినప్పటికీ అతన్ని జట్టు నుంచి తొలగించాలని ఎన్నడూ అనుకోలేదని తెలిపారు. ‘నిజానికి గత సీజన్లో పంత్ కెప్టెన్ాా బాగానే చేశాడు. కానీ జట్టుకు కీలకమైన నలుగులు బౌలర్ల సేవలు కోల్పోతే అతడు మాత్రం ఏమి చేయగలడు. దీంతో పంత్ తన జట్టులో ఉన్న పరిమిత వనరులను ఉపయోగించుకొనే జట్టును సమర్థంగా నడిపించాడు. రిషబ్ పేలవ ప్రదర్శనతో జట్టు నుంచి తొలగిస్తారని ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలు చూసి నేను చాలాసేపు నవ్వుకున్నా. సోషల్ మీడియా కేవలం తమ వ్యూస్‌ను పెంచుకోవడం కోసమే ఇలాంటి కల్పిత వార్తలను సృష్టించే పనిలో పడ్డాయి. పంత్ చాలా అద్భుతమైన ఆటగాడు. ప్రతీ విషయంలో సూటిగా స్పష్టంగా ఉంటాడు. ఫ్రాంచైజీ కోసం నూటికి నూరుశాతం కష్టపడతాడు. బ్యాటర్‌గా విఫలమైనా కెప్టెన్సీకి వంద శాతం న్యాయం చేశాడు. ఒక ఆటగాడి నుంచి అంతకంటే ఎక్కువగా ఆశించలేము. ’ అని చెప్పుకొచ్చారు. ఇక పంత్ ఐపీఎల్లో 125 మ్యాచ్‌లాడి 3,553 పరుగులు సాధించాడు.రాహుల్‌తో విభేదాలు..2022లో ఐపీఎల్లో గుజరాత్ ఐటాన్స్తో కలిసి అరంగేట్రం చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ తొలి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరుకుంది. కేఎల్ రాహుల్ కూడా జట్టును సమర్థంగా నడిపించాడు. అయితే 2024 సీజన్లో కేఎల్ రాహుల్, ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దీనికి తోడు ఆ సీజన్లో లక్నో లీగ్ దశకే పరిమితమైంది. దీంతో కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయడంతో పాటు కొత్త ఆటగాళ్లను తీసుకున్నారు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.చదవండి: అభిమానుల కన్నీటి పర్యంతం -
లక్నో సూపర్‌జెయింట్స్ కథ మారేనా?
ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ కొత్తగా ప్రవేశించాయి. తమ తొలి సీజన్లోనూ గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపిస్తే.. లక్నో ప్లేఆఫ్స్‌కు చేరి ఆకట్టుకుంది. 2023 సీజన్లోనూ లక్నో జట్టు మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరినప్పటికీ తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది. 2024 సీజన్లో లీగ్ దశకే పరిమితమైన లక్నో 2025లో కెప్టెన్‌ను మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత సీజన్లోనూ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈ సీజన్లో మాత్రం గత అనుభవాలను తిరగరాస్తూ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటాలని పంత్ సేన పట్టుదలతో ఉంది. అదొక్కటే ఊరట!మిగతా జట్లతో పోలిస్తే ప్లేయర్ల గాయాల బాధ లేకపోవడం ఒకింత ఊరటనిచ్చే అంశమని చెప్పొచ్చు. షమీ, నోర్ట్జే, మోసిన్ ఖాన్, ఆవేశ్‌ఖాన్, మయాంక్ యాదవ్ లాంటి పేసర్లు ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించగలరు. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో లక్నో బలాలు, బలహీనతలపై ఒక లుక్కేద్దాం.లక్నో జట్టులో హార్డ్హిట్టర్లకు కొదువలేదు. పొట్టి ఫార్మాట్లో తమ దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చే శక్తి ఉన్న ప్లేయర్లు లక్నో సొంతం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌పై తమదైన ఆటతీరుతో ముద్రవేసిన మార్కరమ్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లక్నోకు కొండంత బలం. వీరిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్న మ్యాచ్ ఫలితం మారినట్లే.విదేశీ ప్లేయర్లే బలం..ఇటీవలి టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన మార్కరమ్.. మిచెల్ మార్ష్‌తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశముంది. మరోవైపు గత రెండు సీజన్లలో 499, 524 పరుగులతో జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన నికోలస్ పూరన్ లక్నోకు అదనపు ఆకర్షణ. అవసరమైతే కీపర్‌గా సేవలందించేందుకు సిద్ధంగా ఉండే పూరన్..మిడిలార్డర్‌తో పాటు ఆఖర్లో మెరుపులు మెరిపించడంలో దిట్ట. ఇక కెప్టెన్ పంత్ ఫామ్ కొంత ఆందోళన కల్గిస్తున్నది. గత సీజన్లో ఘోరంగా విఫలమైన పంత్ ఈసారైనా మెరుపులు మెరిపిస్తాడని ఫ్రాంచైజీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఇంగ్లిస్, నోర్ట్జే, హసరంగ వంటి ప్లేయర్లను వేలంలో తీసుకున్న లక్నో..వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ, అర్జున్ టెండూల్కర్లను ట్రేడ్ ద్వారా ఎంపిక చేసుకుంది. అయితే 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన షమీ దేశవాళీ సీజన్లో దుమ్మురేపాడు.షమీ కథేంటి?తన సూపర్ స్వింగ్‌తో అటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో పాటు రంజీల్లోనూ అదరగొట్టాడు 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఇస్పటి నుంచే ప్లేయర్ల ఎంపికపై దృష్టి పెట్టిన బీసీసీఐ..షమీని పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది చూడాలి. జట్టులో కొంత మందికి గాయాల బెడద తోడు ఫిట్నెస్ సమస్యలు జట్టుకు ప్రతికూలంగా మారనున్నాయి. మిస్టరీ స్పిన్నర్ హసరంగకు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్వోసీ మంజూరు కాలేదు. మరోవైపు దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ నోకియా తరుచూ గాయాల పాలు అవుతుండటం జట్టుకు ఆందోళన కల్గిస్తున్నది. బౌలింగ్ పరంగా పేపర్ మీద బలంగా కనిపిస్తున్న లక్నోకు ఫిట్నెస్ పెద్ద సమస్యగా మారింది. షమీ, ఆవేశ్‌ఖాన్, మయాంక్ యాదవ్ పూర్తి సీజన్ జట్టుకు అందుబాటులో ఉంటారా అన్నది అనుమానమే. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.చదవండి: బెదిరింపులకు లొంగని 11 ఏళ్ల చిన్నది! -
అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు
ఐపీఎల్ 2026 సీజన్‌కు మరో వారం రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నారు. రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ సన్నద్ధతకు ముందు అయోధ్యలోని రామజన్మ భూమిని దర్శించుకుంది. శనివారం కెప్టెన్ రిషభ్ పంత్, ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా సహా క్రికెటర్లు అయోధ్య బాలరాముడి దీవెనలు అందుకున్నారు. ఐపీఎల్ 19వ సీజన్ ఘనంగా ఆరంభించాలని రాముడిని కోరుకుంటున్నట్లు లక్నో ఫ్రాంచైజీ తెలిపింది.ఈ సందర్భంగా శనివారం తమ టీమ్ అయోధ్య రాముడిని దర్శించుకున్న ఫోటోలను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది.‘రాముడికి ప్రార్ధనలు చేయడం కొత్తమే కాదు. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న వేళ.. మా జట్టు ఆటగాళ్లందరు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ రాముడి ఆశీర్వాదం ఉంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయి’ అని సంజీవ్ గొయెంకా ఏఎన్ఐతో తెలిపాడు.ఐపీఎల్లో మూడుసార్లు ఫ్లే ఆఫ్స్ వరకూ పరిమితమైన లక్నో సూపర్ జెయింట్స్ గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచింది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆరే విజయాలతో నాకౌట్‌కు ముందే నిష్క్రమించింది. అయితే.. ఈసారి కొత్త జెర్సీతో ఆడనున్న లక్నో మైదానంలో చెలరేగిపోవాలనుకుంటోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 11న మ్యాచ్‌తో లక్నో టోర్నీలో అడుగు పెట్టనుంది. -
మా నాన్నలా కాదు కానీ..!: అర్జున్ టెండుల్కర్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్. అంతర్జాతీయ క్రికెట్లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా ఏకంగా వంద సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇలాంటి ఇంకెన్నో చిరస్మరణీయ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెజెండరీ బ్యాటర్.ఇప్పటికీ గుర్తింపు అంతంతమాత్రమేఇక సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ కూడా తండ్రి బాటలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కానీ ఇప్పటికీ తగినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడీ 26 ఏళ్ల ఆల్‌రౌండర్. దేశీ క్రికెట్లో తొలుత ముంబైకి ఆడిన అర్జున్.. తర్వాత గోవాకు మారిపోయి అక్కడ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఇక ఐపీఎల్లో తండ్రి సచిన్ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ (MI) తరఫున 2023లో అరంగేట్రం చేశాడు అర్జున్. ఇప్పటికి మొత్తంగా ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు అర్జున్ను వదిలేసిన ముంబై.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు అతడిని ట్రేడ్ చేసింది.ఈసారి లక్నో తరఫున అయినా అవకాశాలు అందిపుచ్చుకోవాలని అర్జున్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్‌తో అర్జున్ సంభాషించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో పంత్.. అర్జున్ టెండుల్కర్ బ్యాట్ బరువు గురించి అడుగగా..మా నాన్నలా కాదులే!.. ‘‘1220 గ్రాముల బరువు ఉండవచ్చు. ఇంతకంటే తక్కువ బరువున్న బ్యాట్‌తో నేను ఆడలేను. మా నాన్న అయితే 1301-1315 గ్రాముల బరువున్న బ్యాట్ వాడేవారు. నేను అలా కాకుండా 1220 గ్రాముల బరువు ఉన్నది వాడతాను. బ్యాట్ ఎలా ఉన్నా బంతిని బాదడమే అంతిమ లక్ష్యం’’ అని అర్జున్ సమాధానం ఇచ్చాడు.పెళ్లైన మరుసటి రోజే వచ్చేశావా?ఇక ఆట పట్ల అర్జున్ టెండుల్కర్ అంకిత భావం గురించి రిషభ్ పంత్ ప్రస్తావిస్తూ.. ‘‘యువరాజ్ సింగ్ పాజీతో కలిసి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా! పెళ్లైన మరుసటి రోజే నెట్స్‌కి వచ్చేశావు. క్రికెట్ పట్ల నువ్వు అత్యంత ఆసక్తిగా, ఉత్సుకతతో ఉన్నావు సోదరా!’’ అని పేర్కొన్నాడు.కాగా మార్చి 5న సానియా చందోక్‌తో.. అర్జున్ టెండుల్కర్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మార్చి 28 నుంచి ఐపీఎల్-2026 ఆరంభం కానుంది. లక్నో తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్!Already loving this new Rishabh-Arjun bond 🥹❤️💙 pic.twitter.com/pa79YqebbU— Lucknow Super Giants (@LucknowIPL) March 18, 2026 -
రోహిత్ బాటలో రిషబ్ పంత్!
టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 18వ సీజన్లో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇందులో భాగంగా బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన పంత్ బరువు తగ్గే విషయమై భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను అనుసరిస్తున్నాడు. గతంలో రోహిత్ శర్మ కూడా తన బరువు తగ్గే క్రమంలో కఠినమైన డైట్ పాటించాడు. తాజాగా పంత్ కూడా బరువు తగ్గేందుకు మిత ఆహారం మాత్రమే తీసుకుంటున్నాడు. ఇక పంత్ ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా పంత్ వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘పంత్.. మీరు ఎంత బరువు తగ్గారో చెప్పగలరా?’ అని మీడియా ప్రశ్నించింది. అందుకు పంత్ ‘ఆ విషయం మాత్రం అడగొద్దు’ అంటూ బదులిచ్చాడు. ఒకవైపు గాయాలు, మరోవైపు ఫామ్‌లేమీ పంత్‌ను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ద్వారా తిరిగి గాడిలో పడేందుకు టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సలహాలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా యూవీ పంత్‌కు పలు సలహాలు, బ్యాటింగ్ నైపుణ్యానికి సంబంధించి మెలుకువలు అందించాడు. అయితే గతంలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు కూడా ఇదే తరహాలో ఫామ్ కోల్పోయినప్పుడు యూవీ ఇలాగే సాయం చేశాడు. 2025 ఐపీఎల్లో రూ. 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన లక్నో యాజమాన్యం ఈ ఏడాది అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌కు ముందు వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కోసం బీసీసీఐ పంత్‌ను పరిగణలోకి తీసుకుంది. కానీ అనూహ్యంగా పంత్ గాయపడడంతో జితేశ్ శర్మ పేరు తెర మీదకు వచ్చింది. కానీ అతను కూడా గాయంతో బాధపడుతుండడంతో ఆ అవకాశం ఇషాన్ కిషన్‌ను వరించింది. గతేడాది ఐపీఎల్లో పంత్ లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున 14 మ్యాచ్‌లాడి 269 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్థసెంచరీ ఉండడం విశేషం. ఇక ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.చదవండి: బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి! -
సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా మార్క్రమ్
ఇంగ్లండ్ ది హాండ్రడ్ లీగ్ వేలంలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్క్రమ్పై కాసుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. సుమారు రూ. 2.5 కోట్ల భారీ ధరకు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ఓవర్సీస్ ప్లేయర్‌గా మార్క్రమ్ నిలిచాడు.అయితే మార్క్రమ్ ఇప్పటికే ఐపీఎల్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు హాండ్రడ్ లీగ్‌లోనూ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో జతకట్టాడు. మొత్తం మూడు లీగ్‌లలో సూపర్ జెయింట్స్ తరపున ఆడనున్నాడు.ఇక ఇది ఇలా ఉండగా.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్‌గా మార్క్రమ్ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఐడైన్ ఇప్పటికే సౌతాఫ్రికా లీగ్ డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. మార్క్రమ్ కెప్టెన్సీ స్కిల్స్‌పై మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు."మా మూడు జట్లలోనూ మార్క్రమ్ ఉండడం చాలా సంతోషంగా ఉంది. అతడొక అద్బుతమైన ఆటగాడు. ఐడైన్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతడిని వేలంలో దక్కించుకున్నందుకు గర్వపడుతున్నాము" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాంగర్ పేర్కొన్నాడు. కాగా గత సీజన్లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ వ్యవహరించాడు. ఇప్పుడు మార్క్రమ్ రాకతో మాంచెస్టర్ కెప్టెన్సీలో మార్పు చోటు చేసుకోనుంది. -
లక్నో జట్టు కొత్త జెర్సీతో...
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొత్త హంగులతో సిద్ధమవుతోంది. ఇటీవలే టీమ్ కొత్త లోగోను ప్రకటించిన యాజమాన్యం ఇప్పుడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఎరుపు ప్రధాన రంగుగా ఉంటూ దానిపై నీలి రంగు నిలువు గీతలు హైలైట్ చేస్తూ జెర్సీని ముస్తాబు చేశారు. ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనా ఎఫ్‌సీ పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి. ఐపీఎల్ తాజా సీజన్‌తో తమ టీమ్‌కు ‘జేకే సూపర్ సిమెంట్’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు కూడా ఫ్రాంచైజీ ప్రకటించింది. గత మంగళవారం టీమ్ కొత్త లోగోను కూడా ప్రదర్శించారు. మరింత బలంగా, మరింత ఎత్తుకు అంటూ తమ టీమ్ ఆలోచనను వివరిస్తూ ఏనుగు, గరుడ చిత్రాలతో ఈ లోగోను సిద్ధం చేశారు. -
మరో సూపర్ జెయింట్.. పేరు మార్చుకున్న మరో ఫ్రాంచైజీ
ఫ్రాంచైజీ క్రికెట్లోకి మరో సూపర్ జెయింట్ వచ్చింది. హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా మారింది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఇప్పటికే రెండు సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్. ఈ రెండు సహా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఆర్పీఎస్జీ గ్రూప్ ఆధినేత సంజీవ్ గొయెంకా చేతుల్లో ఉన్నాయి.మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా రూపాంతరం చెందిన తర్వాత కొత్త లోగోను గురువారం ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో ఇంగ్లండ్ స్టార్ వికెట్‌కీపర్ జోస్ బట్లర్ (పురుషుల హండ్రెడ్), అదే దేశానికి చెందిన స్పిన్ బౌలర్ సోఫీ ఎక్ల్స్టోన్ (మహిళల హండ్రెడ్)ను రిటైన్ చేసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. బట్లర్ మరో సూపర్ జెయింట్‌లోనూ (డర్బన్ సూపర్ జెయింట్స్) భాగంగా ఉన్నాడు.లక్నో, డర్బన్ సూపర్ జెయింట్స్ లోగోల్లోని బ్రాండింగ్‌కి భిన్నంగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లోగోలో ఏనుగు ప్రతీక ఉండటం గమనించదగ్గ విషయం. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా మాట్లాడుతూ.. మాంచెస్టర్ ఒక గొప్ప క్రీడా నగరం. సూపర్ జెయింట్స్ కుటుంబంలో భాగమవ్వడం గర్వకారణం. జోస్ బట్లర్ వంటి ఆటగాళ్లు మా జట్టులో ఉండటం ఆనందదాయకమిని పేర్కొన్నారు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ బట్లర్, ఎక్లెస్టోన్‌తో పాటు మరికొంత మందిని కూడా రీటైన్ చేసుకుంది. పురుషుల విభాగంలో హెన్రిచ్ క్లాసెన్, నూర్ అహ్మద్‌ను తిరిగి దక్కించుకుంది. కొత్తగా పురుషుల విభాగంలో లియామ్ డాసన్.. మహిళల విభాగంలో మెగ్ లాన్నింగ్, స్మృతి మంధనను జట్టులోకి తీసుకుంది.కాగా, మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా రూపాంతరం చెందక ముందు మరో రెండు హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీల పేర్లు మారాయి. ముంబై ఇండియన్స్ ఓనర్షిప్లో నడిచే ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఎంఐ లండన్‌గా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్షిప్లో నడిచే నార్తర్న్ సూపర్‌చార్జర్స్ సన్‌రైజర్స్ లీడ్స్‌గా రూపాంతరం చెందాయి.జులై 21 నుంచి ప్రారంభం ది హండ్రెడ్ లీగ్ 2026 పురుషులు, మహిళల విభాగాల్లో జులై 21 నుంచి ప్రారంభం కానుంది. అన్ని ఫ్రాంచైజీలకు జనవరి చివరి వరకు నాలుగు ప్రీ-ఆక్షన్ సైనింగ్‌లకు అవకాశం ఉంది. ప్రధాన ఆక్షన్ మార్చిలో జరగనుంది. -
'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్‌పై కాసుల వర్షం కురిసింది. కేవలం నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలిసినప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 8.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.ఇంగ్లిష్ కోసం లక్నోతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తీవ్రంగా శ్రమించింది. కాగా ఇంగ్లిస్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ కారణంగా అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనని, కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని ముందుగానే ప్రకటించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ అతడిని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి విడిచిపెట్టింది.హనీమూన్ వాయిదా?అయితే ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడంతో కేవలం నాలుగు మ్యాచ్‌ల ఆడాలన్న తన నిర్ణయాన్ని ఇంగ్లిష్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న వివాహం తర్వాత వెంటనే హనీమూన్‌కు వెళ్లాలనుకున్న ప్లాన్‌ను వాయిదా వేసి..నేరుగా లక్నో క్యాంప్‌లో చేరాలని అతను భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయినప్పటికి అతడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. ఇదే విషయంపై పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ నెస్ వాడియా స్పందించారు. ఇంగ్లిష్ తీరును అతడు తప్పుబట్టాడు."మేము జోష్ ఇంగ్లిష్‌ను రిటైన్ చేసుకోవాలనుకున్నాము. కానీ అతడు రిటెన్షన్ గడువు ముగియడానికి కేవలం 45 నిమిషాల ముందు తన వ్యక్తిగత కారణాల గురించి తెలియజేశాడు. తన పెళ్లి, హానీమూన్ కారణంగా కేవలం మూడు మ్యాచ్‌లకే మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పాడు. అందుకే అతడిని వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఏమాత్రం ప్రొఫెషన్లిజం కాదు. కానీ నేను అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతడు అద్భుతమైన ఆటగాడు. ఆస్ట్రేలియా తరపున కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. మరి ఇప్పుడు ఐపీఎల్లో అన్ని మ్యాచ్‌లు ఆడుతాడో లేదో చూద్దం" అని వాడియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో ఇంగ్లిష్‌ను రూ. 2.60 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగొలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం అతడు చేశాడు. 11 మ్యాచ్‌లు ఆడి 162.57 స్ట్రైక్ రేట్‌తో 278 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు అతడు ఏకంగా రూ.8.60 కోట్లు అందుకోనున్నాడు. అంటే దాదాపు 230.77% పెరుగుదల అనే చెప్పాలి.చదవండి: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో -
కావ్య మారన్ సంచలన నిర్ణయం!?
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు భారీ ట్రేడ్ డీల్‌కు రంగం సిద్దమైంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ట్రేడ్ చేసుకోనున్నట్లు సమాచారం. ఎస్ఆర్హెచ్-ఎల్ఎస్జీ మధ్య రూ. 10 కోట్ల 'ఆల్-క్యాష్ డీల్' (నగదు రూపంలో మాత్రమే చెల్లించి) ఫైనల్ అయినట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది.గత ఏడాది సీజన్ మెగా వేలంలో షమీని రూ. 10 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. అయితే ఈ రైట్ ఆర్మ్ పేసర్ మాత్రం తన స్ధాయికి తగ్గప్రదర్శన చేయలేకపోయాడు. 9 మ్యాచ్‌లలో 11.23 ఎకానమీ రేటుతో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇది అతడి ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత దారుణమైన ప్రదర్శన.దీంతో అతడిని మినీ వేలంలో విడిచిపెట్టేందుకు సన్‌రైజర్స్ ఓనర్ కావ్యమారన్ సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. అంతలోనే షమీని తమ జట్టులోకి తీసుకునేందుకు సన్‌రైజర్స్ యాజమాన్యంతో లక్నో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తమ జట్టులో సీనియర్ పేసర్ ఒక్కరు కూడా లేకపోవడంతో ఈ ట్రేడ్ డీల్ కోసం ఎల్ఎస్జీ ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. లక్నో జట్టులో మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ వంటి యువ పేసర్లు ఉన్నప్పటికి.. వారు ఫిట్నెస్ సమస్యలతో సతమవుతున్నారు. తాజాగా లక్నో చేసిన పోస్ట్ కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేసిన ఫోటోను లక్నో పోస్ట్ చేసింది. అయితే అందులో షమీ కన్పించకుండా ఎల్ఎస్జీ జాగ్రత్త పడింది.ఆ నలుగురికి టాటా బైబై..ఇక లక్నో సూపర్ జెయింట్స్ మినీ వేలంలో తమ పర్స్ విలువను పెంచుకోవడానికి నలుగురు ఆటగాళ్లను విడుదల చేయాలని నిర్ణయించుకుందంట. డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, షామర్ జోసెఫ్‌లను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో లక్నో పర్స్ విలువ రూ.27.25 కోట్లు పెరగనుంది. కాగా ఐపీఎల్-2026 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్‌ను ఫ్రాంచైజీలు శనివారం (నవంబర్ 15)సాయంత్రం లోపు బీసీసీఐకి సమర్పించాలి.చదవండి: ‘అసలే అతడు మరుగుజ్జు కదా!’.. బుమ్రా వ్యాఖ్యలపై స్పందించిన సౌతాఫ్రికా కోచ్! -
ముంబై ఇండియన్స్‌లోకి శార్థూల్ ఠాకూర్..
ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు ఆటగాడిని ట్రేడ్ చేసిన మొదటి జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ నిలిచింది. లక్నో తమ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్ చేసింది. ఇరు జట్ల మధ్య ఒప్పందం అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు ఐపీఎల్ మెనెజ్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది."ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్.. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. రెండు ఫ్రాంచైజీ మధ్య ట్రేడ్ డీల్ విజయవంతమైంది. గత సీజన్లో గాయపడిన ఆటగాడి స్ధానంలో శార్ధూల్‌ను రూ.2 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే మొత్తాన్ని ముంబై చెల్లించేందుకు సిద్దమైంది" అని ఐపీఎల్ మెనెజ్‌మెంట్ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ డీల్ పూర్తిగా ఆల్ క్యాష్ డీల్ (All-Cash Deal) ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ డీల్‌కు ఒక్కరోజు ముందు శార్దూల్‌కు బదులుగా అర్జున్ టెండూల్కర్‌ను ఇచ్చిపుచ్చుకునేందుకు లక్నో, ముంబై ఇండియన్స్ సిద్దమయ్యాయి అని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి రూమర్సే తాజా ప్రకటనతో రుజువయ్యాయి. కాగా ఐపీఎల్-2025 వేలంలో ఠాకూర్‌ను ఏ జట్టు కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అయితే లక్నో పేసర్ మోహ్సిన్ ఖాన్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్దానంలో శార్ధూల్‌కు ఆడే అవకాశం లభించింది.రూ. 2 కోట్ల బెస్ప్రైస్కు లక్నో అతడిని దక్కించుకుంది. ఐపీఎల్ 18వ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన శార్ధూల్.. 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక శార్ధూల్ ట్రేడ్ విషయాన్ని ముంబై ఇండియన్స్ కూడా ధ్రువీకరించింది. "డ్రీమ్స్ సిటీ అయిన ముంబైకి స్వాగతం అని ముంబై ఇండియన్స్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. కాగా ఠాకూర్ ముంబై నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. శార్ధూల్ 2015లో పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. అతడు ఎక్కువ సీజన్ల పాటు సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే శార్ధూల్ ముంబై ఇండియన్స్ తరపున ఆడనుండడం ఇదే తొలిసారి. ఇక ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను నవంబర్ 15లోపు బీసీసీఐకి సమర్పించాలి.చదవండి: ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే -
IPL 2026: రేపే 'డెడ్‌లైన్'
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండగానే ఫ్రాంచైజీలన్నీ తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఆటగాళ్ల రిటెన్షన్‌కు నవంబర్ 15 డెడ్‌లైన్ కావడంతో మార్పులు చేర్పుల విషయంలో తలమునకలై ఉన్నాయి. మరో పక్క ట్రేడ్ డీల్స్ విషయంలోనూ చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి.సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ను వీడి సీఎస్కేలో చేరడం.. రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ సీఎస్కే నుంచి రాయల్స్‌కు ట్రేడ్ కావడం దాదాపుగా ఖరరాపోయింది. మరి కొంత మంది ఆటగాళ్ల విషయంలోనూ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి.కేఎల్ రాహుల్ కోసం కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేకేఆర్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కోసం ముంబై ఇండియన్స్ ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ సైతం ఓ కీలక ఆటగాడిని ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక, ఫ్రాంచైజీలు వేలంపై దృష్టి సారిస్తాయి. వేలంలో ఎవరెవరిని తీసుకోవాలో ఇప్పటి నుంచే ఓ ప్లాన్ వేసుకుంటున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. అర్జున్ టెండూల్కర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ యత్నిస్తున్నట్లు సమాచారం.ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడి కోసం ప్రయత్నించే అవకాశం ఉందన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.కాగా, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మెగా టోర్నీ మే 31న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. మినీ వేలం డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో జరిగే అవకాశం ఉంది.చదవండి: హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
ఆసీస్ దిగ్గజానికి కీలక పదవి
ఐపీఎల్ 2026కి ముందు ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీకి (Tom Moody) కీలక పదవి దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఫ్రాంచైజీ మూడీని గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. ఈ పదవి చేపట్టాక మూడీ ఎల్ఎస్జీతో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్, హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఆధారిత ఫ్రాంచైజీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తాడు.గతంలో ఈ పదవిలో టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ ఉండేవాడు. జహీర్ తప్పుకున్న తర్వాత మూడీని ఈ పదవి వరించింది. మూడో రానున్న ఐపీఎల్ సీజన్లో రిషబ్ పంత్ (కెప్టెన్), జస్టిన్ లాంగర్ (హెడ్ కోచ్), కేన్ విలియమ్సన్ (స్ట్రాటజిక్ అడ్వైజర్), భరత్ అరుణ్ (బౌలింగ్ కోచ్), లాన్స్ క్లూసెనర్‌తో (అసిస్టెంట్ కోచ్) కలిసి పని చేస్తాడు. మూడీకి కోచింగ్‌తో పాటు ఫ్రాంచైజీ మేనేజ్మెంట్లో అపార అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని క్యాష్ చేసుకునేందుకే ఎల్ఎస్జీ మూడీని తమ ఫ్రాంచైజీల గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. మూడీ పర్యవేక్షణలో (కోచ్‌గా) సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి, ఏకైక టైటిల్ (2016) సాధించింది.మూడీ ప్రొఫైల్..2000 సంవత్సరం ప్రారంభంలో ఆటకు వీడ్కోలు పలికిన మూడీ.. 2005-07 మధ్యలో శ్రీలంక జాతీయ జట్టుకు కోచ్‌గా పని చేశాడు. అతని జమానాలో శ్రీలంక 2007 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది.అదే ఏడాది మూడీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు.అంతర్జాతీయ స్థాయిలో కోచ్‌గా రాణించిన మూడీ.. 2008-10 మధ్యలో ఐపీఎల్లో Kings XI Punjab (ఇప్పుడు Punjab Kings) జట్టుకు కోచ్‌గా సేవలందించాడు.2013లో Sunrisers Hyderabad ఫ్రాంచైజీలో హెడ్ కోచ్‌గా చేరి, 2016లో ఆ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. 2019 వరకు అదే బాధ్యతలు నిర్వహించిన మూడీ.. 2020 డిసెంబర్లో అదే ఫ్రాంచైజీకి Director of Cricketగా తిరిగి వచ్చాడు.చదవండి: జైస్వాల్ సూపర్ సెంచరీ -
ఆ జట్టు హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్!?
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు తమ కోచింగ్ స్టాప్‌లో సమూల మార్పులు చేసేందుకు సిద్దమైంది. మొన్నకు మొన్న మెంటార్ జహీర్ ఖాన్‌పై వేటు వేసిన లక్నో యాజమాన్యం.. ఇప్పుడు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ను తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆండీ ఫ్లవర్ తర్వాత లక్నో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన లాంగర్.. భారత ఆటగాళ్లతో సరైన బంధాన్ని ఏర్పరచుకోలేకపోయారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్‌ను తమ హెడ్ కోచ్‌గా నియమించాలని లక్నో భావిస్తున్నట్లు సమాచారం.హెడ్ కోచ్‌గా యువరాజ్..?ఇన్సైడ్ స్పోర్ట్ కథనం ప్రకారం.. లక్నో ఫ్రాంచైజీ మెనెజ్‌మెంట్ తమ జట్టు ప్రధాన కోచ్‌గా భారత క్రికెట్ దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుందంట. యువరాజ్ సింగ్‌తో ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. యువీ ఇప్పటివరకు ఏ ప్రొఫెషనల్ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేయకపోయినా.. అబుదాబి టి10 లీగ్‌లో మాత్రం మెంటార్‌గా వ్యవహరించాడు. అయితే పంజాబ్‌కు చెందిన ఎంతో మంది యువ ఆటగాళ్లను మాత్రం తన అనుభవంతో యువీ తీర్చిదిద్దాడు. ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రియాన్ష్ ఆర్య వంటి సంచలన ప్లేయర్లు యువరాజ్ శిష్యులే. ఒకవేళ యువరాజ్ నిజంగా కోచ్‌గా వస్తే లక్నో తలరాత మారినట్లే.ఇక ఇది ఇలా ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ ఇటీవల కొన్ని కొత్త నియమాకాలు చేపట్టింది. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ వ్యూహాత్మక సలహాదారుగా (Strategic Advisor), బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కార్ల్ క్రోవ్ లక్నో జట్టులోకి చేరారు. కాగా గత సీజన్లో పంత్ సారథ్యంలోని లక్నో జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది.చదవండి: స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్!.. వరుడు ఎవరంటే? -
సంజీవ్ గోయెంకా స్పెషల్ రిక్వెస్ట్..? రిషబ్ పంత్ టీమ్‌లోకి కేన్ విలియమ్సన్
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్(LSG) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(Kane Williamson)తో ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే విలియమ్సన్ లక్నో జట్టులో ప్లేయర్‌గా కాదు.. స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా చేరనున్నాడంట. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఓనర్ సంజీవ్ గోయెంకా సూచన మెరకు లక్నో టీమ్ మెనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఐపీఎల్-2022 సీజన్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్.. ఇప్పటివరకు నాలుగు ఎడిషన్లను పూర్తి చేసుకుంది. కానీ యాజమాన్యం అంచనాలను అందుకోవడంలో సూపర్ జెయింట్స్ విఫలమైంది. మొదటి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కి చేరిన లక్నో.. ఆ తర్వాతి రెండు ఎడిషన్లలో ఏడో స్ధానానికి పరిమితమైంది. మొదట గౌతమ్ గంభీర్, మోర్నే మోర్కెల్ కోచింగ్ స్టాఫ్‌లో ఉండగా ఇప్పుడు జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్‌గా ఉన్నారు. అయితే గత సీజన్లో తమ జట్టు మెంటార్‌గా పనిచేసిన టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌పై ఎల్ఎస్జీ వేటు వేసింది. అంతేకాకుండా ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు తమ బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ భరత్ అరుణ్‌ను లక్నో నిమమించింది. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కార్ల్ క్రోవ్ లక్నో స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.గత రెండు సీజన్లలో గ్రూపు స్టేజికే పరిమితమైన తమ జట్టును కేన్ మామ తన అనుభవంతో విజయం పథంలో నడిపిస్తాడని లక్నో భావిస్తోంది. లక్నోలో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మార్క్రమ్, మార్ష్, పంత్, పూరన్ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికి.. బౌలింగ్ యూనిట్ మాత్రం వారికి తలనొప్పిగా మారింది. గత సీజన్లో మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ వంటి పేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కనీసం కేన్ రాకతో నైనా లక్నో తలరాత మారుతుందో లేదో వేచి చూడాలి. విలియమ్సన్ చివరగా ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు.చదవండి: IND vs AUS: ఆసీస్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! మ్యాచ్ విన్నర్‌కు నో ఛాన్స్? -
ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! టీమిండియా లెజెండ్‌పై వేటు?
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ సపోర్ట్ స్టాప్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ జట్టు మెంటార్, టీమిండియా పేస్ బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్‌పై వేటు వేసేందుకు లక్నో యాజమాన్యం సిద్దమైనట్లు తెలుస్తోంది.గత ఐపీఎల్ సీజన్లో లక్నో దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుసగా రెండో సీజన్లోనూ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో లక్నో విఫలమైంది. 14 మ్యాచ్‌లలో కేవలం ఆరింట మాత్రమే విజయం సాధించిన సూపర్ జెయింట్స్.. పాయింట్ల పట్టికలో ఏడో స్ధానంతో సరిపెట్టుకుంది.కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీతో జత కట్టిన తర్వాత లక్నో కోచింగ్ స్టాప్‌లో జహీర్ చేరాడు. ఆ ఏడాది సీజన్‌నూ లక్నో ఏడో స్ధానంతో ముగించింది. జహీర్ మెంటార్‌గా ఉంటూనే లక్నో బౌలింగ్ కోచ్ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు.అయితే జాక్ మెంటార్షిప్ పట్ల లక్నో మెన్జ్మెంట్ ఆసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి వీడ్కోలు పలికి మరొకరిని నియమించాలని సూపర్ జైంట్స్ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఇప్పటికే లక్నో కొత్త బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్ ఎంపికయ్యాడు. త్వరలో కొత్త మెంటార్‌ను కూడా లక్నో నియమించనుంది. అంతేకాకుండా ఆర్పీస్జీ గ్రూపు ఆద్వర్యంలో ఉన్న అన్ని జట్లను పర్యవేక్షించేందుకు కొత్త క్రికెట్ డైరెక్టర్‌ను కూడా నియమించేందుకు సంజీవ్ గోయోంకా సిద్దమైనట్లు తెలుస్తోంది.మరోవైపు భారీ అంచనాలు పెట్టుకున్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ సైతం రాణించలేకపోయాడు. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ మినహా మిగితా మ్యాచ్‌లలో పంత్ విఫలమయ్యాడు. కాగా పంత్‌ను రూ. 27 కోట్ల రికార్డు ధరకు లక్నో ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన బ్రెవిస్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు -
IND vs ENG: 500కు పైగా పరుగులు చేశాడు.. సంకుచిత బుద్ధి!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మరోసారి విమర్శల పాలైంది. ‘‘ఇంత సంకుచిత బుద్ధి ఎందుకు?. అసలు మిమ్మల్ని ఎవరు ఆ పోస్టు పెట్టమన్నారు’’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విషయం ఏమిటంటే.. టీమిండియా ఇటీవల ఇంగ్లండ్ (IND vs ENG)తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ ఆడిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్ గడ్డ మీద జరిగిన ఈ ఐదు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 2-2తో సమం చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే బ్యాటర్‌గా చిరస్మరణీయ రికార్డులు సాధించిన శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడు. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్‌లతో పాటు పేసర్లు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా అదరగొట్టారు.నిలకడగా రాణించిన ఏకైక ఆటగాడుఅయితే, ఈ సిరీస్ ఆసాంతం నిలకడగా రాణించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఐదు టెస్టుల్లో కలిపి 53.20 సగటుతో ఈ కర్ణాటక ఆటగాడు 532 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.హెడింగ్లీలో తొలి టెస్టులో 137 పరుగులు సాధించిన కేఎల్ రాహుల్.. లార్డ్స్‌లో 100 పరుగులు చేశాడు. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో 55, ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో 90 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ (754), జో రూట్ (537) తర్వాత మూడో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.రాహుల్ ఫొటో లేకుండానే..అసలు విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో శుక్రవారం ఓ పోస్టు పెట్టింది. ‘‘యుగాల పాటు నిలిచిపోయే ఫొటో ఆల్బమ్’’ అంటూ టీమిండియా ఆటగాళ్లతో కూడిన ఫొటోలను షేర్ చేసింది. అయితే, ఇందులో ఎక్కడా కేఎల్ రాహుల్ లేడు.ఒక్కటీ దొరకలేదా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ లక్నో యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఇలా చేయడం అస్సలు బాలేదు. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది.ఓపెనర్‌గా వచ్చి కొత్త బంతిని ఎదుర్కొని 500కు పైగా పరుగులు చేసిన ఆటగాడి ఫొటో మాత్రం మీకు దొరకలేదా?’’ అంటూ దొడ్డ గణేశ్ ప్రశ్నించాడు. నెటిజన్లు ఇందుకు స్పందిస్తూ.. ‘‘అంతే సార్.. వాళ్లకు గొప్పగా ఆడినవాళ్లు కనబడరు. అయినా లక్నోకు ఇలా చేయడం అలవాటే. వాళ్ల ఓనర్ సంజయ్ గోయెంకానే వారికి ఆదర్శం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.గతేడాది లక్నోను వీడిన రాహుల్కాగా ఐపీఎల్-2022 సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎల్ఎస్జీకి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మూడేళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన అతడు రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. అయితే, గతేడాది లక్నో పేలవ ప్రదర్శన నేపథ్యంలో సంజీవ్ గోయెంకా అందరిముందే కేఎల్ రాహుల్‌ను తిట్టడం విమర్శలకు దారితీసింది. అనంతరం రాహుల్ జట్టును వీడి.. ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.అయితే, టీమిండియా తరఫున అతడు గొప్పగా చాటినా లక్నో తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసే ఫొటోల్లో అతడిపై వివక్ష చూపించడం.. వారి సంకుచిత బుద్ధికి నిదర్శనం అని కేఎల్ రాహుల్ అభిమానులు మండిపడుతున్నారు.చదవండి: చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్This is getting embarrassing. Couldn’t get a picture of an opener who played the new ball and scored 500+ runs 🤷♂️ https://t.co/fGhFFuOWi3— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 8, 2025 -
హండ్రెడ్ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇవే..!
ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రైవేట్ క్రికెట్ లీగ్ ప్రారంభమైన ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు అక్కడ వాలిపోతారు. ప్రస్తుతం వరల్డ్‌లో సూపర్ హిట్ అయిన ప్రతి లీగ్‌లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు పాతుకుపోయారు. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్, యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికాలో జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్, అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్.. ఇలా మెజార్టీ శాతం క్రికెట్ లీగ్‌ల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్ల హవా నడుస్తుంది.తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్ లీగ్‌లోనూ కాలు మోపారు. ఈ లీగ్‌లో వారు ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 5) హండ్రెడ్ లీగ్ ఐదో ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఏ ఫ్రాంచైజీలను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు కొనుగోలు చేశారో ఓ లుక్కేద్దాం.ఓవల్ ఇన్విన్సిబుల్స్: ఈ ఫ్రాంచైజీని ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇన్విన్సిబుల్స్లోని 49 శాతం వాటాను ముకేశ్ అంబానీ సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. మిగతా 51 శాతం వాటాను సర్రే కౌంటీ క్లబ్ తమ వద్దనే ఉంచుకుంది. ఈ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇన్విన్సిబుల్స్‌కు సామ్ కర్రన్ నాయకత్వం వహించనున్నాడు.సథరన్ బ్రేవ్: ఈ ఫ్రాంచైజీని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యమైన జీఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. ఇందులో 49 శాతం వాటాను డీసీ మేనేజ్మెంట్ సొంతం చేసుకుంది. మిగతా 51 శాతం వాటాను హ్యాంప్‌షైర్ కౌంటీ క్లబ్ రీటైన్ చేసుకుంది. ఈ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా జేమ్స్ విన్స్ వ్యవహరిస్తాడు.నార్త్రన్ సూపర్ ఛార్జర్స్: ఈ ఫ్రాంచైజీని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అయిన సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వాటాను కావ్యా మారన్ సంస్థ రూ. 1,094 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ జట్టుకు ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో డేవిడ్ మిల్లర్, డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.మాంచెస్టర్ ఒరిజినల్స్: ఈ ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా కొనుగోలు చేశాడు. అతని నేతృత్వంలోని ఆర్పీఎస్జీ గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్లోని 70 శాతం వాటాను దక్కించుకుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ వ్యవహరిస్తాడు. -
పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) ప్రశంసలు కురిపించారు. దూకుడైన ఆటకు మారుపేరంటూ పంత్ బ్యాటింగ్ తీరును కొనియాడారు. అదే సమయంలో.. భారత ఓపెనింగ్ బ్యాటర్, లక్నో మాజీ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను కూడా సంజీవ్ గోయెంకా ప్రశంసించడం విశేషం.రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలుకాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టులో రిషభ్ పంత్ శతకాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతులు ఎదుర్కొన్న ఈ ఐదో నంబర్ బ్యాటర్.. 12 ఫోర్లు, ఆరు సిక్సర్ సాయంతో.. 75కు పైగా స్ట్రైక్‌రేటుతో 134 పరుగులు సాధించాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ పంత్ దంచికొట్టాడు. 140 బంతుల్లోనే 118 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్‌రేటు 84.29. తన అద్భుత శతక ఇన్నింగ్స్‌ల ద్వారా టీమిండియా పటిష్ట స్థితిలో నిలవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు.అమోఘం.. రాహుల్‌కు కంగ్రాట్స్ ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని తమ కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘అమోఘం! రెండు వరుస సెంచరీలు.. దూకుడుకు మారుపేరుగా, బెదురులేని.. అద్భుత ఇన్నింగ్స్.టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్‌గా చరిత్ర.. సూపర్’’ అంటూ క్లాప్ ఎమోజీలు జత చేశారు. అదే సమయంలో మరో శతక వీరుడు కేఎల్ రాహుల్ పేరును కూడా గోయెంకా ప్రస్తావించడం వైరల్‌గా మారింది. ‘‘సెంచరీ చేసిన కేఎల్ రాహుల్‌కు కూడా శుభాకాంక్షలు’’ అని గోయెంకా ట్వీట్ చేశారు.కాగా 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో జట్టుకు మూడేళ్ల పాటు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో వరుసగా రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. కానీ 2024లో మాత్రం రాహుల్ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు.రాహుల్‌పై ఫైర్.. ఫ్రాంఛైజీని వీడిన స్టార్ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా మైదానంలో బహిరంగంగా రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ పరిణామం తర్వాత అంటే.. 2025 మెగా వేలానికి ముందు రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడాడు.అనంతరం ఆక్షన్‌లో భాగంగా లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్‌ను కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది. అయితే, బ్యాటర్, కెప్టెన్‌గా ఈ సీజన్లో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి పంత్ కేవలం 269 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉండటం చెప్పుకోదగ్గ అంశం.గెలుపునకు పది వికెట్ల దూరంలోఇక పంత్ సేన తాజా ఎడిషన్‌లో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. మరోవైపు.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ పదమూడు మ్యాచ్‌లు ఆడి.. ఓ శతకం సాయంతో 539 పరుగులు సాధించడం విశేషం.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. భారత బౌలర్లు రాణించి పది వికెట్లు కూలిస్తే.. గిల్ సేనకు శుభారంభం లభిస్తుంది. మరోవైపు.. భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ మంగళవారం 350 పరుగులు చేయాలి. చదవండి: ‘లక్ష్మణ్‌ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
దిగ్వేష్ సింగ్ అద్భుతం.. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు! వీడియో వైరల్
దిగ్వేష్ సింగ్ రాఠీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన దిగ్వేష్.. ప్రదర్శనకంటే తన నోట్‌బుక్ సెలబ్రేషన్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే ఆ సెలబ్రేషన్స్‌కు గాను ఈ యువ స్పిన్నర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.అద్బుతమైన టాలెంట్ ఉన్నప్పటికి శ్రుతిమించిన సెలబ్రేషన్స్ అతడి కొంపముంచాయి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అతడిపై బీసీసీఐ రెండు సార్లు జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. రాఠీ ఓవరాల్‌గా 13 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాము. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అతడి అద్బుత బౌలింగ్ సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. ఎంప్రెస్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి21న ఏబీ రైజింగ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో దిగ్వేష్... సహగల్ క్రికెట్ క్లబ్ తరపున వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో ఫ్రాంచైజీ అభిమానులతో పంచుకుంది. ఆ మ్యాచ్‌లో దిగ్వేష్ మొత్తంగా 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టు పతనాన్ని శాసించాడు. 264 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఏబీ రైజింగ్ జట్టు 151 పరుగులకే కుప్పకూలింది.Digvesh Rathi. 5 stars 🌟 🌟🌟🌟🌟pic.twitter.com/tF4Nw0Gj0Q— Lucknow Super Giants (@LucknowIPL) June 16, 2025 -
రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్-2025 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. అయితే ఓటమి బాధలో ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ పంత్‌కు రూ. 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ ఎడ్వైజరీ కమిటీ విధించింది. అలాగే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానాగా చెల్లించాలని సదరు కమిటీ ఆదేశించింది.ఈ ఏడాది సీజన్లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం ఇది మూడో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జరిమానా విధించారు. "లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్‌కు జరిమానా విధించాం. ఏకానా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మూడో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పంత్ కు రూ. 30 లక్షలు ఫైన్ వేశాము ’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. సీజన్ ఆరంభం నుంచి విఫలమైన పంత్.. తమ ఆఖరి మ్యాచ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. రిషబ్ 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.చదవండి: IND Vs ENG: బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్‌కు మళ్లీ పిలుపు -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆసాధరణ ప్రదర్శన కనబరిచింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ క్వాలిఫయర్-1కు ఆర్హత సాధించింది. లక్నో నిర్ధేశించిన 228 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది.ఆర్సీబీ బ్యాటర్లలో స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ(33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 85 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. విరాట్ కోహ్లి(30 బంతుల్లో 10 ఫోర్లతో 54), మయాంక్ అగర్వాల్(23 బంతుల్లో 41 నాటౌట్), సాల్ట్(30) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆకాష్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సీజన్లో తొలి సెంచరీతో చెలరేగగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు.ఆర్సీబీ సరికొత్త చరిత్ర..ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఒక ఐపీఎల్ సీజన్లో ప్రత్యర్ధి జట్లతో వాటి హోం గ్రౌండ్స్‌లో జరిగిన అన్నీ మ్యాచ్‌లలోనూ గెలుపొందిన తొలి టీమ్‌గా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్‌ను ఓడించిన ఆర్సీబీ.. ఆ తర్వాత సీఎస్కే, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత మైదానాల్లోనే చిత్తు చేసింది.చదవండి: IND vs ENG: బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్‌కు మళ్లీ పిలుపు -
జితేశ్ జితాదియా
లక్నో: సొంతగడ్డపై విజయగర్వంతో సీజన్‌ను ముగించే భారీ స్కోరునే లక్నో చేసింది... ఛేదనలో సాల్ట్, లివింగ్‌స్టోన్, కోహ్లిలాంటి విలువైన వికెట్లను తీసింది. 52 బంతుల్లో 105 పరుగుల సమీకరణం బెంగళూరుకు క్లిష్టంగా అనిపించింది... అయితే కెప్టెన్ జితేశ్... మయాంక్‌తో కలిసి చేసిన బ్యాటింగ్ మ్యాజిక్ మ్యాచ్‌నే మార్చేసింది. ఇంకో 8 బంతులు మిగిలుండగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సీజన్లో తొలి సెంచరీతో కదం తొక్కగా, మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు) చెలరేగారు. చితగ్గొట్టిన పంత్ మార్ష్ తో ఇన్నింగ్స్ ఆరంభించిన బ్రిట్జ్కీ (14) మూడో ఓవర్లో నిష్క్రమించాడు. తర్వాత రిషభ్ పంత్ రావడంతో లక్నో ప్రతీ ఓవర్లోనూ పండగ చేసుకుంది. యశ్ దయాళ్ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదడం ద్వారా పంత్ ప్రతాపం మొదలైంది. పవర్‌ప్లే తర్వాత ఓ వైపు మార్ష్, ఇంకోవైపు రిషభ్ ధనాధన్ షోతో ఓవర్‌కు సగటున పది పరుగుల రన్‌రేట్ నమోదైంది. దీంతో 9.5 ఓవర్లో జెయింట్స్ 100 స్కోరును చేరుకుంది.ముందుగా పంత్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో సిక్సర్‌తో మార్ష్ 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆ ఓవర్లో రిషభ్ కూడా ఫోర్, సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన మార్ష్ ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 152 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యానికి తెరపడింది. అతని మరుసటి ఓవర్లో బౌండరీతో పంత్ 54 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం, జట్టు 200మార్క్ దాటడం జరిగిపోయాయి. మెరుపు భాగస్వామ్యం... సాల్ట్, కోహ్లిలు పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరుబోర్డును పరుగు పెట్టించారు. 4 ఓవర్లలోనే స్కోరు 50కి చేరింది. కానీ పవర్‌ప్లే ఆఖరి ఓవర్లోనే సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత కోహ్లికి జతయిన రజత్ పటిదార్ (14) ఫోర్, సిక్సర్ బాదాడు. కానీ రూర్కే ఒకే ఓవర్లో అతన్ని, లివింగ్‌స్టోన్ (0)ను అవుట్ చేసి బెంగళూరును కష్టాల్లో పడేశాడు. కోహ్లి తన మార్క్ షాట్లతో చెలరేగిపోవడంతో రన్‌రేట్ లక్ష్యాన్ని కరిగించేంత వేగంగా దూసుకెళ్లింది. 9.1 ఓవర్లోనే ఆర్సీబీ స్కోరు వందను దాటేసింది. కోహ్లి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ధాటిని కొనసాగించే ప్రయత్నంలో కొట్టిన షాట్ మిడాఫ్‌లో బదోని చేతికి చిక్కడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడు జట్టు స్కోరు 11.2 ఓవర్లలో 123/4. కాగా గెలుపు సమీకరణం 52 బంతుల్లో 105 చాలా కష్టమైంది.మయాంక్, కెప్టెన్ జితేశ్ శర్మల మెరుపులకు తోడు... లక్నో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్, సులువైన రనౌట్పట్ల రూర్కే అశ్రద్ధ వెరసి... పరుగులు, బౌండరీలు అలవోకగా రావడంతో చూస్తుండగానే లక్ష్యం దిగొచ్చింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు మయాంక్, జితేశ్‌లు కేవలం 44 బంతుల్లోనే 107 పరుగులు జోడించడం విశేషం! స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 67; బ్రిట్జ్కీ (బి) తుషార 14; పంత్ నాటౌట్ 118; పూరన్ (సి) యశ్ దయాళ్ (బి) షెఫర్డ్ 13; సమద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–25, 2–177, 3–226. బౌలింగ్: తుషార 4–0–26–1, కృనాల్ పాండ్యా 2–0–14–0, యశ్ దయాళ్ 3–0–44–0, భువనేశ్వర్ 4–0–46–1, సుయశ్ 3–0–39–0, షెఫర్డ్ 4–0–51–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) దిగ్వేశ్ (బి) ఆకాశ్ 30; కోహ్లి (సి) బదోని (బి) అవేశ్‌ఖాన్ 54; పటిదార్ (సి) సమద్ (బి) రూర్కే 14; లివింగ్‌స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రూర్కే 0; మయాంక్ నాటౌట్ 41; జితేశ్ నాటౌట్ 85; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–61, 2–90, 3–90, 4–123. బౌలింగ్: ఆకాశ్ 4–0–40–1, విల్ రూర్కే 4–0–74–2, దిగ్వేశ్ రాఠి 4–0–36–0, షాబాజ్ 3–0–39–0, అవేశ్‌ఖాన్ 3–0–32–1, బదోని 0.4–0–9–0. ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’క్వాలిఫయర్–1 (మే 29)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచిఎలిమినేటర్ (మే 30)గుజరాత్ X ముంబైవేదిక: ముల్లాన్‌పూర్ , రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025, LSG VS RCB: విధ్వంసకర శతకం.. పల్టీ కొట్టిన పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శన కారణంగా ముప్పేట దాడిని ఎదుర్కొన్న పంత్ ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్‌లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఆది నుంచే దూకుడుగా ఆడిన పంత్.. 54 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్లో పంత్‌కు ఇది రెండో సెంచరీ. సెంచరీ పూర్తి చేసిన అనంతరం పంత్ ఆనందంతో పల్టీ కొట్టాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, వీడియోలు సోషల్‌మీడియాలో వైరవలవుతున్నాయి.Coldest IPL hundred celebration 🥶pic.twitter.com/WDHHIvLVv6— CricTracker (@Cricketracker) May 27, 2025ఎట్టకేలకు పంత్ తనపై పెట్టిన పెట్టుబడికి (రూ. 27 కోట్లు) న్యాయం చేశాడని నెటిజన్లు అంటున్నారు. ఈ సీజన్లో పంత్ చాలా దారుణమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ పేలవ ప్రదర్శన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ చాలా మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాక ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్‌లో పంత్ సెంచరీతో సత్తా చాటాడు.ఇటీవలికాలంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. ఐపీఎల్లో పంత్ చివరిగా 2018 సీజన్లో సెంచరీ చేశాడు. నాడు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నేటికి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌గా చలామణి అవుతుంది. తాజా శతకంతో పంత్ తనలో చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు.ఆర్సీబీతో మ్యాచ్‌లో పంత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ సీజన్లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్‌ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం గుజరాత్, ఆర్సీబీ పోటీలో ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. -
LSG Vs RCB: బెంగళూరుకు ‘ఆఖరి’ చాన్స్
లక్నో: ఐపీఎల్ లీగ్ దశ ఆఖరి అంకానికి చేరింది. 66 రోజులుగా జరుగుతున్న లీగ్ దశకు నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫలితంతో తెరపడుతుంది. ఈ సీజన్లో ఎప్పుడో నాలుగు జట్లు ‘ప్లే ఆఫ్స్’ చేరాయి. అలాగని ఈ మ్యాచ్ పూర్తిగా నామమాత్రమని కొట్టిపారేయడానికి వీలు లేదు. ఎందుకంటే ‘ప్లే ఆఫ్స్’ చేరిన నాలుగు జట్లలో ఒకటైన ఆర్సీబీ సేఫ్ జోన్ టాప్–2లో నిలిచేందుకు ఇదే ఆఖరి అవకాశం. ఈడెన్ గడ్డపై మార్చి 22న మొదలైన ఐపీఎల్లో కోల్‌కతాపై గెలిచి శుభారంభం చేసిన బెంగళూరు... ఇప్పుడు మరో పరాయిగడ్డ లక్నోలోనూ సూపర్ జెయింట్స్‌పై గెలిచి టాప్–2లో చేరాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ సీజన్లో ఎలాగూ ముందంజ వేయలేకపోయిన లక్నో... కనీసం సొంత ప్రేక్షకుల మధ్య విజయంతో ముగింపు పలకాలనే పట్టుదలతో ఉంది. మిడిలార్డర్ మెరిపిస్తే... బెంగళూరు జట్టులో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, కోహ్లి మంచి ఆరంభాన్నే ఇస్తున్నారు. హైదరాబాద్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో ఓపెనింగ్ వికెట్‌కు 7 ఓవర్లలో 80 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్లు రజత్ పాటీదార్, జితేశ్ శర్మ, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లు తీవ్రంగా నిరుత్సాహపరిచారు. వీళ్లందరూ మూకుమ్మడిగా విఫలమవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. లేదంటే 200 పైచిలుకు లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించేంది. ఇక బౌలర్లు గత మ్యాచ్‌లో విరివిగా పరుగులు సమర్పించుకున్నారు. యశ్ దయాళ్, ఇన్‌గిడి, షెఫర్డ్, సుయశ్లు తేలిపోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు అనుకూలతనిచ్చింది. అయితే టాప్–2లో నిలిపే కీలకమైన పోరులో సమష్టిగా బాధ్యత కనబరిస్తే ఆర్సీబీకి ఢోకా ఉండదు. తడాఖా చూపేనా లక్నో ప్లే ఆఫ్స్‌కు మాత్రమే దూరమైంది. అంతమాత్రాన పోరాటానికి విరామమివ్వలేదు. గత రెండు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే ఈ విషయమే అర్థమవుతుంది. సొంతగడ్డపై లక్నో 205 పరుగులు చేసింది. కానీ సన్‌రైజర్స్ దూకుడుతో ఓడింది. ఇక గుజరాత్ గడ్డ అహ్మదాబాద్‌పై టైటాన్స్‌పై 235 పరుగులు చేసి గెలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ సులువుగా 200 పైచిలుకు పరుగులు చేసిన లక్నో బ్యాటింగ్ దుర్భేధ్యంగా ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు మిచెల్ మార్‡్ష, మార్క్రమ్, మిడిలార్డర్లో నికోలస్ పూరన్ ఫామ్‌లో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగుతున్నారు. లక్నో బ్యాటింగ్‌కు అండ, దండా ఈ ముగ్గురే! బౌలింగ్ విభాగానికి వస్తే రూర్కే, అవేశ్ ఖాన్లు నిలకడగా వికెట్లు తీస్తున్నారు. ఒక మ్యాచ్ సస్పెన్షన్‌తో గత మ్యాచ్‌కు దూరమైన స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడం కలిసొచ్చే అంశం. అతని ప్రవర్తన పక్కనబెడితే స్పిన్‌తో బ్యాటర్లను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నేటి మ్యాచ్‌లో వీళ్లందరూ ఆశించిన మేర రాణిస్తే విజయంతో బైబై చెప్పడం ఏమంత కష్టం కానేకాదు. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు కలిసొచ్చే పిచ్ ఇది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోరు సాధ్యమైంది. ఇందులో ఒకసారైతే 206 లక్ష్యఛేదన సులువైంది. టాస్ నెగ్గిన జట్టు మొదట ఫీల్డింగ్‌కే మొగ్గుచూపుతుంది.. మంగళవారం వర్ష సూచనైతే లేదు. తుది జట్లు (అంచనా) బెంగళూరు: రజత్ పాటీదార్ (కెపె్టన్), సాల్ట్, కోహ్లి, మయాంక్, జితేశ్, రొమారియో షెఫర్డ్, కృనాల్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, ఇన్‌గిడి. లక్నో: రిషభ్ పంత్ (కెపె్టన్), మార్క్రమ్, మిచెల్ మార్‡్ష, పూరన్, ఆయుశ్ బదోని, సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్, అవేశ్‌ఖాన్, ఆకాశ్‌దీప్, విల్ రూర్కే. -
వారి ఆట అద్భుతం.. మేం కూడా నిరూపించుకున్నాం: పంత్
ఐపీఎల్-2025లో లక్నోసూపర్ జెయింట్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో.. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టింది. గుజరాత్ జట్టును 33 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది. లక్నో విజయంపై కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు.మ్యాచ్ ముగిసిన అనంతరం, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. విజయం పట్ల కచ్చితంగా సంతోషంగా ఉంది. ఓ జట్టుగా మేము మంచి క్రికెట్ ఆడగలమని నిరూపించాం. టోర్నమెంట్లో మాకు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినా రేసులో లేము. కానీ అది ఆటలో భాగం. ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. టాప్ త్రీలో చోటు సంపాదించడం ఎప్పుడూ సులభం కాదు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పిదాలు చేశాం. మరికొంత మెరుగు కావాల్సి అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ఓటమి ద్వారా జట్టులో కొన్ని లోపాలు, సానుకూల అంశాలను తెలుసుకున్నాం. పవర్‌ప్లేలో మేము బాగా బౌలింగ్ చేశాం. కానీ, అనుకున్న ప్రకారం వికెట్టు సాధించలేకపోయాం. మా బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. వారిని 210 దగ్గర ఆపాలనుకున్నాము. 210కి 230 మధ్య భారీ తేడా ఉంటుంది. 240 పరుగులను ఛేదించడం ఎప్పుడూ సులభం కాదు. రూథర్‌ఫోర్డ్, షారుఖ్ బ్యాటింగ్ మాకు పెద్ద పాజిటివ్ అంశం. ప్లేఆఫ్‌లోకి వెళ్లే క్రమంలో మళ్లీ పుంజుకుని విజయం సాధిస్తామని తెలిపాడు.ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (117; 64 బంతుల్లో 10×4, 8×6) మెరుపు శతకం సాధించడంతో ఎల్ఎస్జీ 2 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. నికోలస్ పూరన్ (56 నాటౌట్; 27 బంతుల్లో 4×4, 5×6), మార్క్రమ్ (36; 24 బంతుల్లో 3×4, 2×6) కూడా రాణించారు. అనంతరం ఛేదనలో గుజరాత్ 9 వికెట్లకు 202 పరుగులే చేయగలిగింది. షారుఖ్ ఖాన్ (57; 29 బంతుల్లో 5×4, 3×6) టాప్‌స్కోరర్. ఎల్ఎస్జీ బౌలర్లలో ఒరూర్క్ (3/27), ఆయుష్ బదోని (2/4) రాణించారు. 13 మ్యాచ్‌ల్లో గుజరాత్‌కిది 4వ ఓటమి కాగా.. లక్నో ఆరో విజయం నమోదు చేసింది. ఈ సీజన్లో నిలకడకు మారుపేరుగా నిలిచిన సాయి సుదర్శన్ (21) ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. -
LSG Vs GT: గుజరాత్‌కు లక్నో షాక్
అహ్మదాబాద్: ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ తదుపరి లక్ష్యం టాప్–2లో చేరడం. ఈ ప్రయత్నానికి లక్నో సూపర్‌జెయింట్స్ అడ్డొచ్చింది. గురువారం జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 235 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (64 బంతుల్లో 117; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతక్కొట్టగా, నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 202 పరుగులు చేసి ఓడింది. షారుఖ్ ఖాన్ (29 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రూథర్‌ఫర్డ్ (22 బంతుల్లో 38; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. క్యాన్సర్ అవగాహన–ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతీ సీజన్ తరహాలోనే ఈ సారి కూడా ఒక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ లావెండర్ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. ఓపెనింగ్ ధాటితో... ఓపెనర్లు మార్ష్, మార్క్రమ్ జోడీ లక్నోకు శుభారంభం ఇచ్చింది. గుజరాత్ బౌలర్లపై మార్ష్ విరుచుకుపడటంతో 5.3 ఓవర్లో లక్నో స్కోరు ఫిఫ్టీ దాటింది. మరోవైపు నుంచి మార్క్రమ్ (24 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా షాట్లతో పరుగుల వేగం పెంచాడు. ఈ క్రమంలో మార్ష్ 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ మార్క్రమ్ను కిషోర్ అవుట్ చేసి 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. రషీద్‌ఖాన్‌పై మార్ష్ పిడుగల్లే చెలరేగాడు. అతను వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో వరుసగా 6, 4, 6, 4, 4, 1లతో ఏకంగా 25 పరుగుల్ని రాబట్టాడు. మార్ష్ సెంచరీ, పూరన్ ఫిఫ్టీ మార్‡్షతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ పూరన్ కూడా ధాటిగా ఆడటంతో ప్రతీ ఓవర్‌కు 10 పైచిలుకు రన్‌రేట్‌తో పరుగులు వచ్చాయి. మార్ష్ 56 బంతుల్లో సెంచరీ సాధించాడు. కాసేపటికే పూరన్ కూడా 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి వీరవిహారంతో లక్నో 17.4 ఓవర్లలో 200 మార్క్ దాటింది. డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడేక్రమంలో మార్ష్ అవుట్‌కాగా... రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పూరన్‌తో పంత్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు. షారుఖ్ పోరాడినా... కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆరంభం నుంచే దంచేందుకు దిగిన టాపార్డర్ బ్యాటర్లు అంతే వేగంగా వికెట్లు పారేసుకున్నారు. సాయి సుదర్శన్ (21; 4 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (20 బంతుల్లో 35; 7 ఫోర్లు), బట్లర్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిష్క్రమించడంతో లక్నో శిబిరం సంబరం చేసుకుంది. కానీ రూథర్‌ఫర్డ్, షారుఖ్ ఖాన్లు ధనాధన్ షోకు శ్రీకారం చుట్టడంతో లక్నో గుండెల్లో గుబులు రేగింది. చెరోవైపు నుంచి రూథర్‌ఫొర్డ్, షారుఖ్‌లు సిక్స్‌లు, ఫోర్లతో విజృంభించారు. అంతే... 16 ఓవర్లు గడిచేసరికి స్కోరు 182/3కి చేరింది. 24 బంతుల్లో 54 పరుగుల సమీకరణం గుజరాత్‌ను ఆశల పల్లకిలో ఉంచింది. రూథర్‌ఫొర్డ్, షారుఖ్ నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 86 పరుగులు జోడించారు. అయితే 17వ ఓవర్లో రూథర్‌ఫర్డ్, తెవాటియా (2), మరుసటి ఓవర్లో అర్షద్ ఖాన్ (1) అవుట్ కావడంతో లక్నో కు ఊరట లభించింది. 22 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న షారుఖ్ ఖాన్ పోరాటం సరిపోలేదు. స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) షారుక్ (బి) సాయి కిషోర్ 36; మార్ష్ (సి) రూథర్‌ఫొర్డ్ (బి) అర్షద్ 117; పూరన్ నాటౌట్ 56; రిషభ్ పంత్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 235. వికెట్ల పతనం: 1–91, 2–212. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 3–0–36–1, రబడ 4–0–45–0, ప్రసి«ద్‌కృష్ణ 4–0–44–0, సాయి కిషోర్ 3–0–34–1, రషీద్ ఖాన్ 2–0–36–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) మార్క్రమ్ (బి) రూర్కే 21; గిల్ (సి) సమద్ (బి) అవేశ్ 35; బట్లర్ (బి) ఆకాశ్ సింగ్ 33; రూథర్‌ఫర్డ్ (సి)సబ్–బిష్ణోయ్ (బి) రూర్కే 38; షారుఖ్ (సి) సబ్–బిష్ణోయ్ (బి) అవేశ్ 57; తెవాటియా (సి) హిమ్మత్ (బి) రూర్కే 2; అర్షద్ (సి) రూర్కే (బి) షాబాజ్ 1; రషీద్ ఖాన్ నాటౌట్ 4; రబడా (బి) బదోని 2; సాయి కిషోర్ (బి) బదోని 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–46, 2–85, 3–96, 4–182, 5–186, 6–193, 7–197, 8–200, 9–202. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3.1–0–29–1, ఆకాశ్‌దీప్ 4–0–49–0, రూర్కే 4–0–27–3, అవేశ్‌ఖాన్ 3.5–0–51–2, షాబాజ్ 4–0–41–1, బదొని 1–0–4–2. ఐపీఎల్లో నేడుబెంగళూరు X హైదరాబాద్‌వేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో -
మార్ష్ సూపర్ సెంచరీ.. గుజరాత్‌పై లక్నో విజయం
ఐపీఎల్-2025లో లక్నోసూపర్ జెయింట్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది.టైటాన్స్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫన్ రూథర్‌ఫర్డ్(38),బట్లర్(33), శుబ్‌మన్ గిల్(35) తమవంతు ప్రయత్నం చేశారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. బదోని రెండు, ఆకాష్ మహారాజ్ సింగ్,అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.మార్ష్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(56), మార్క్రమ్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ఆర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో పూరన్ చెలరేగాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ వచ్చిన పూరన్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు.కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్..4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పూరన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు 50 పరుగులు చేసిన ప్లేయర్‌గా పూరన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024 సీజన్లో హెడ్ నాలుగు సార్లు 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో తన ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా హాఫ్ సెంచరీతో హెడ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన పూరన్.. 46.45 సగటుతో 511 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: టీమిండియా బౌలర్లకు వార్నింగ్.. సెంచరీతో చెలరేగిన డకెట్ -
మిచెల్ మార్ష్ విధ్వంసకర సెంచరీ.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లను మార్ష్ ఊతికారేశాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఆస్ట్రేలియన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. బౌలర్లను ఎంతమందిని మార్చినా మార్ష్ నుంచి వచ్చిన సమాధానమే ఒక్కటే. లక్నో ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మార్ష్ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 56 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను మార్ష్ అందుకున్నాడు. మార్ష్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. కాగా ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.మార్ష్ సాధించిన రికార్డులు ఇవే..👉ఒకే సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా మార్ష్ నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో మార్ష్ ఇప్పటివరకు 560 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్(616) అగ్రస్ధానంలో ఉన్నాడు. 👉అదేవిధంగా ఒక సీజన్లో లక్నో తరపున అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన కేఎల్ రాహుల్ రికార్డును మార్ష్ సమం చేశాడు. ఐపీఎల్-2022 సీజన్లో రాహుల్ 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేయగా.. ఈ ఏడాది సీజన్లో మార్ష్ కూడా సరిగ్గా ఆరు సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. మార్ష్ మరో హాఫ్ సెంచరీ చేస్తే రాహుల్‌ను అధిగమిస్తాడు.𝗠𝗔𝗜𝗗𝗘𝗡 𝗜𝗣𝗟 𝗖𝗘𝗡𝗧𝗨𝗥𝗬 𝗙𝗢𝗥 𝗠𝗔𝗥𝗦𝗛! 💯As rightly said in the Bhojpuri commentary box, it’s been a "𝘿𝙖𝙣𝙙𝙞 𝙈𝙖𝙧𝙨𝙝" in Ahmedabad! 😁Will his knock prove to be a hurdle in Gujarat Titans' #Race2Top2 tonight? 🤔Watch the LIVE action in Bhojpuri ➡… pic.twitter.com/fmKMj5z25j— Star Sports (@StarSportsIndia) May 22, 2025 -
గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో..
IPL 2025 GT vs LSG Live Updates: ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి.గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో..గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది.టైటాన్స్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫన్ రూథర్‌ఫర్డ్(38),బట్లర్(33), శుబ్‌మన్ గిల్(35) తమవంతు ప్రయత్నం చేశారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. బదోని రెండు, ఆకాష్ మహారాజ్ సింగ్,అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.గుజరాత్ నాలుగో వికెట్ డౌన్..రూథర్‌ఫర్డ్ రూపంలో గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రూథర్‌ఫర్డ్.. ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 23 బంతుల్లో 54 పరుగులు కావాలి. క్రీజులో షారుఖ్ ఖాన్(49) ఉన్నాడు.దూకుడు పెంచిన షారుఖ్, రూథర్‌ఫర్డ్14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో షారుఖ్ ఖాన్(27),రూథర్ ఫర్డ్(25) ఉన్నారు.గుజరాత్ మూడో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన బట్లర్.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.గుజరాత్ రెండో వికెట్ డౌన్శుబ్మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన గిల్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.గుజరాత్ తొలి వికెట్ డౌన్..సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. విలియం ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(24), జోప్ బట్లర్(20) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్..33 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(15), సాయిసుదర్శన్(16) ఉన్నారు.గుజరాత్ ముందు భారీ టార్గెట్..అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాటన్స్తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(56), మార్క్రమ్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ఆర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీ..లక్నో బ్యాటర్ మిచెల్ మార్ష్ తొలి ఐపీఎల్ సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాఛ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. కేవలం 56 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో మార్ష్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 16 ఓవర్లకు లక్నో స్కోర్: 180/115 ఓవర్లకు లక్నో స్కోర్: 160/115 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(89), పూరన్(29) ఉన్నారు.లక్నో తొలి వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన మార్క్రమ్.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(51), పూరన్(6) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు..6 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(28), మార్ష్(22) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు..3 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(8), మార్క్రమ్(15) ఉన్నారు.ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నామాత్రపు మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి మద్దతుగా లావెండర్ జెర్సీతో బరిలోకి దిగింది.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, విలియం ఒరూర్కేగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ -
IPL 2025 GT vs LSG: టాప్2లో నిలవాలని...
అహ్మదాబాద్: ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ చేరుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టు... ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై దృష్టి పెట్టింది. ఐపీఎల్ 18వ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 3 పరాజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకొని ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ దక్కించుకున్న మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ నేడు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో తలపడనుంది. 2022, 2023లలో ఫైనల్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్... ఈసారి కూడా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిస్తే ఫైనల్‌కు చేరేందుకు అదనంగా మరో అవకాశం ఉండటంతో... ప్రస్తుతానికి టైటాన్స్ దానిపైనే దృష్టి పెట్టింది. మరోవైపు ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్ చివర్లో అయినా మెరిపించాలని భావిస్తోంది. ఈ సీజన్లో టైటాన్స్ ఓడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి లక్నో చేతిలో ఉండటంతో దానికి సొంతగడ్డపై బదులు తీర్చుకోవాలని కూడా చూస్తోంది. గుజరాత్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీదుంటే... లక్నో జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. మరి టైటాన్స్ అదే ఊపుతో మరింత ముందుకు దూసుకెళ్తుందా లేక... లక్నో పరాజయాల బాట వీడుతుందా చూడాలి! ముగ్గురు మొనగాళ్లు... ఈ సీజన్లో టైటాన్స్ ఆధిపత్యానికి ప్రధాన కారణం... టాప్–3 ఆటగాళ్లే. కెపె్టన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్, ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ కలిసికట్టుగా కదంతొక్కడంతోనే గుజరాత్ జట్టు వరుస విజయాలు సాధించగలిగింది. సాయి సుదర్శన్ 56.09 సగటుతో 617 పరుగులు చేయగా... గిల్ 60.10 సగటుతో 601 పరుగులు సాధించాడు. బట్లర్ 500 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు జట్టు భారాన్ని మోస్తూ మెరుగైన ఆరంభాలు అందిస్తుండటంతో... టైటాన్స్ భారీ స్కోర్లు చేయగలుగుతోంది. ఈ త్రయం 16 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేసిందంటే వీరి ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ ముగ్గురితో పాటు రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా రూపంలో మిడిలార్డర్ బలంగా ఉండగా... బౌలింగ్‌లో కూడా మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాదీ పేసర్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రబడ, రషీద్ ఖాన్, సాయి కిషోర్ రూపంలో బౌలింగ్ దళం మెరుగ్గా ఉంది. అయితే గుజరాత్ బలం, బలహీనత రెండు టాపార్డరే కావడం గమనార్హం. టాప్–3 ఆటగాళ్లు విఫలమైతే మిడిలార్డర్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడేవాళ్లు కనిపించడం లేదు. లక్నోతో లీగ్ మ్యాచ్‌లో ఇది నిరూపితమైంది. 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసిన టైటాన్స్... గిల్, సుదర్శన్, బట్లర్ అవుటైన తర్వాత 180/6కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కీలక ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు ముందు మిడిలార్డర్‌ను పరీక్షించుకోవాల్సిన అవసరముంది. సీజన్లో అన్నీ మ్యాచ్‌లు ఆడిన ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశాలు కూడా ఫ్రాంఛైజీ పరిశీలిస్తోంది.తీవ్ర ఒత్తిడిలో పంత్ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రిషభ్ పంత్... సీజన్ చివరికి వచ్చేసరికి తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. అంచనాల భారాన్ని మోయలేకపోతున్న పంత్... అటు బ్యాటర్‌గా, ఇటు కెపె్టన్‌గా విఫలమవుతున్నాడు. మిచెల్ మార్‡్ష, మార్క్రమ్, నికోలస్ పూరన్ రూపంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నా... జట్టు విజయాలు సాధించలేకపోవడానికి పంత్ ప్రదర్శనే ప్రధాన కారణం. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకున్నా... పంత్ ఆటతీరు మాత్రం మారడం లేదు.పట్టుమని పది నిమిషాలు కూడా క్రీజులో నిలవకుండానే పేలవ షాట్ ఆడి పెవిలియన్ చేరడం పరిపాటిగా మారింది. ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడిన పంత్ 12.27 సగటుతో 135 పరుగులే చేశాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమితోనే ‘ప్లే ఆఫ్స్’చేరే అవకాశాలు కోల్పోయిన ఎల్ఎస్జీ... ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి మెరుగైన స్థానంతో సీజన్‌ను ముగించాలని భావిస్తోంది. ఆయుశ్ బదోని, అబ్దుల్ సమద్ నిలకడలేమితో ఇబ్బంది పడుతుంటే... బౌలర్లను గాయాల బెడద వెంటాడుతోంది. ప్రధాన పేసర్లు గాయాల బారిన పడటంతో ప్రత్యామ్నాయాలు లేక మేనేజ్మెంట్ చిక్కులు ఎదుర్కొంటోంది. మయాంక్ యాదవ్ అందుబాటులో లేకపోగా... అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు గత మ్యాచ్‌లో హద్దులు దాటినందుకు స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీపై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు.తుది జట్లు(అంచనా)గుజరాత్ టైటాన్స్: గిల్ (కెప్టెన్ ), సాయి సుదర్శన్, బట్లర్, రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రబడ, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ. లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్ ), మార్ష్ , మార్క్రమ్, పూరన్, బదోని, అబ్దుల్ సమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆకాశ్‌దీప్, అవేశ్ ఖాన్, షాబాజ్ నదీమ్, రూర్కె. -
IPL 2025: చరిత్ర సృష్టించిన లక్నో ప్లేయర్లు.. ఐపీఎల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి..!
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. లీగ్‌లో మునుపెన్నడూ జరగని విధంగా ఈ సీజన్లో లక్నోకు చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటారు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో ఒకే ఫ్రాంచైజీకి చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి.నిన్న (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్ త్రయం ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఈ ఘనత సాధించింది. సీజన్ ప్రారంభం నుంచి భీకర ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సత్తా చాటారు. ఈ మ్యాచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మార్ష్ (61), మార్క్రమ్ (61), పూరన్ (45) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందే పూరన్ 400 పరుగులు పూర్తి చేయగా.. మార్క్రమ్, మార్ష్ ఈ మ్యాచ్‌లో 400 పరుగుల మైలురాయిని తాకారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పూరన్ నాలుగు అర్ద సెంచరీల సాయంతో 455 పరుగులు చేయగా.. మార్ష్ 11 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు.. మార్క్రమ్ 12 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 409 పరుగులు చేశారు. ఈ సీజన్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో పూరన్ 9, మార్ష్ 10, మార్క్రమ్ 12 స్థానాల్లో ఉన్నారు.ఈ సీజన్లో ముగ్గురు విదేశీ బ్యాటర్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా లక్నో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడం సోచనీయం. నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్, మార్ష్, మార్క్రమ్ సత్తా చాటినా లక్నో గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో లక్నో తరఫున ఈ ముగ్గురు మినహా బ్యాటింగ్‌లో ఎవ్వరూ రాణించలేదు. అడపాదడపా బదోని బ్యాట్‌కు పని చెప్పాడు. మిడిలార్డర్లో పంత్ ఘోరంగా విఫలం కావడం.. సరైన్ ఫినిషర్ లేకపోవడం ఈ సీజన్లో లక్నో కొంపముంచాయి. బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ పర్వాలేదనిపించినా వీరికి సహకరించే బౌలర్లే కరువయ్యారు. రవి బిష్ణోయ్ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. పేసర్ ఆకాశ్‌దీప్ తేలిపోయాడు. మరో పేసర్ ప్రిన్స్ యాదవ్ అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సీజన్ ప్రారంభ మ్యాచ్లకంతా దూరంగా ఉండిన మయాంక్ యాదవ్ రెండు మ్యాచ్‌లు ఆడి తిరిగి గాయపడ్డాడు. వీటన్నిటికి మించి రిషబ్ కెప్టెన్సీలో లోపాలు ఈ సీజన్లో లక్నో ఖేల్ ఖతం చేశాయి. మార్క్రమ్, మార్ష్, పూరన్ ఫామ్ మినహా ఈ సీజన్లో లక్నో గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సీజన్లో లక్నోకు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు (మే 22న గుజరాత్‌తో, మే 27న ఆర్సీబీతో) మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవడం తప్ప లక్నో చేయగలిగిందేమీ లేదు. -
IPL 2025: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిన్న (మే 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊరట పొందే విజయం సాధించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌కు ఒరిగిందేమీ లేనప్పటికీ.. లక్నో ప్లే ఆఫ్స్ ఆశలను మాత్రం ఆవిరి చేసింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సన్‌రైజర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్టేడియంలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లక్నో నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ స్టేడియంలో 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి (నాలుగు ప్రయత్నాల్లో).మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో పూరన్ (26 బంతుల్లో 45) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. రిషబ్ పంత్ (7) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మిగతా బ్యాటర్లలో ఆయుశ్ బదోని 3, అబ్దుల్ సమద్ 3, శార్దూల్ ఠాకూర్ 4, ఆకాశ్‌దీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు.ఓపెనర్లు అందించిన శుభారంభానికి ఈ మ్యాచ్‌లో లక్నో ఇంకాస్త భారీ స్కోర్ సాధించి ఉండాల్సింది. అయితే చివరి ఓవర్లలో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోయారు. నితీశ్ రెడ్డి వేసిన చివరి ఓవర్లో లక్నో మూడు వికెట్లు (2 రనౌట్లు) కోల్పోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, నితీశ్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష్ దూబే తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా గొడవ పడిన అభిషేక్, దిగ్వేశ్ మ్యాచ్ పూర్తయ్యాక ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. రాజీవ్ శుక్లా ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాడు. -
SRH Vs LSG: లక్నోను ముంచిన సన్‌రైజర్స్
లక్నో: ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట ఇదివరకే ముగిసింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి వారి ‘ప్లే ఆఫ్స్’ ఆశల్ని కూడా ముంచింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో లక్నోపై జయభేరి మోగించింది. ముందుగా లక్నో నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్రమ్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), పూరన్ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. ఇషాన్ మలింగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్లాసెన్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. దిగ్వేశ్ రాఠి 2 వికెట్లు తీశాడు. సెంచరీ భాగస్వామ్యం మిచెల్ మార్ష్ దూకుడుతో లక్నో ఆట మొదలైంది. కమిన్స్ తొలి బంతికి 4, నాలుగో బంతికి 6 కొట్టాడు. ఇదే జోరుతో హర్ష్ దూబే రెండో ఓవర్లో మార్ష్ మరో సిక్స్ బాదాడు. మూడో ఓవర్లో బౌండరీతో మార్క్రమ్ టచ్‌లోకి వచ్చాడు. నాలుగో ఓవర్ తొలి బంతికే మార్క్రమ్ అవుటవ్వాల్సింది. క్రీజు వదిలి ఆడిన అతన్ని ఇషాన్ కిషన్ స్టంపౌట్ చేయలేకపోయాడు. ఇలా బతికిపోయిన మార్క్రమ్ 6, 4లతో రెచి్చపోయాడు. దీంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. మార్ష్ దంచే పనిలో ముందున్నాడు. హర్షల్, ఇషాన్ మలింగ ఓవర్లలో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఓపెనింగ్ జోడీ పవర్‌ప్లేలో 69 పరుగులు చేసింది. కాసేపటికే మార్ష్ 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 9వ ఓవర్లో మార్క్రమ్కు మరోమారు లైఫ్ వచి్చంది. జీషాన్ బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను డీప్ ఎక్స్ట్రా కవర్లో అనికేత్ వదిలేశాడు. దీంతో అదే ఓవర్లో లక్నో 100 పరుగులు దాటింది. తర్వాత ఎట్టకేలకు మార్ష్ వికెట్ తీసిన హర్ష్ దూబే 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. లక్నో కెపె్టన్ రిషభ్ పంత్ (7) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాన్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. రెండు లైఫ్‌లను సది్వనియోగం చేసుకున్న మార్క్రమ్ 28 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. పూరన్ మధ్యలో పడిపోయిన రన్‌రేట్ పెంచేందుకు బ్యాట్ ఝుళిపించాడు. హర్షల్ 16వ ఓవర్లో సిక్స్ బాదిన మార్క్రమ్ అదే ఓవర్లో బౌల్డయ్యాడు. నితీశ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన పూరన్‌తో పాటు శార్దుల్ (4)కూడా రనౌటయ్యారు. సమద్ (3)ను బౌల్డ్ చేయగా... ఆకాశ్ దీప్ (6) సిక్స్‌తో జట్టు స్కోరు 200 దాటింది. 20వ ఓవర్లో నితీశ్ 20 పరుగులిచ్చాడు. అభిషేక్ అదరహో రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు 23/1. అప్పటికి అభిషేక్ ఒక పరుగే చేశాడు. ఆకాశ్‌దీప్ మూడో ఓవర్ నుంచి అతని విధ్వంసం మొదలైంది. 4, 6 బాదిన అభిషేక్ తర్వాతి రూర్కే ఓవర్లోనూ దీన్ని రిపీట్ చేశాడు. దీంతో 3.3 ఓవర్లోనే జట్టు స్కోరు 50కి చేరింది. అవేశ్ ఖాన్ బౌలింగ్‌కు దిగితే వరుస బౌండరీలతో జోరు కనబరచడంతో పవర్‌ప్లేలో హైదరాబాద్ 72/1 స్కోరు చేసింది. ఆ తర్వాత ఓవర్ వేసిన రవి బిష్ణోయ్‌కి అభిషేక్ చుక్కలు చూపించాడు. 6, 6, 6, 6లతో 26 పరుగులు రాబట్టాడు. మూడో సిక్స్ బాదేసరికే 18 బంతుల్లో అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. మరుసటి ఓవర్లో అభిషేక్ జోరుకు దిగ్వేశ్ రాఠి బ్రేక్ వేశాడు. ఈ సందర్భంగా రాఠి, అభిషేక్ మాటామాట పెంచుకున్నారు. అంపైర్లు సముదాయించి పంపారు. 35 బంతుల్లోనే 82 పరుగుల ధనాధన్ రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్లాసెన్‌లు ధాటిని కొనసాగించడంతో సన్‌రైజర్స్ లక్ష్యంవైపు దూసుకెళ్లింది. కిషన్ అవుటయ్యాక ‘దంచే’పనిని క్లాసెన్, కమిందు మెండిస్ (21 బంతుల్లో 32 రిటైర్డ్‌హర్ట్; 3 ఫోర్లు) చక్కబెట్టారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరు పెవిలియన్‌కు చేరినా... మిగతా లాంఛనాన్ని అనికేత్ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) పూర్తి చేశారు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) మలింగ (బి) హర్ష్ 65; మార్క్రమ్ (బి) హర్షల్ 61; పంత్ (సి అండ్ బి) మలింగ 7; పూరన్ (రనౌట్) 45; బదోని (సి) నితీశ్ (బి) మలింగ 3; సమద్ (బి) నితీశ్ 3; శార్దుల్ (రనౌట్) 4; బిష్ణోయ్ (నాటౌట్) 0; ఆకాశ్‌దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–115, 2–124, 3–159, 4–169, 5–194, 6–199, 7–199. బౌలింగ్: కమిన్స్ 4–0–34–0, హర్ష్ దూబే 4–0–44–1, హర్షల్ పటేల్ 4–0–49–1, ఇషాన్ మలింగ 4–0–28–2, జీషాన్ అన్సారి 2–0–22–0, నితీశ్ 2–0–28–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అథర్వ తైడే (సి) దిగ్వేశ్ (బి) రూర్కే 13; అభిషేక్ (సి) శార్దుల్ (బి) దిగ్వేశ్ 59; కిషన్ (బి) దిగ్వేశ్ 35; క్లాసెన్ (సి) పంత్ (బి) శార్దుల్ 47; కమిందు (రిటైర్డ్‌హర్ట్) 32; అనికేత్ (నాటౌట్) 5; నితీశ్ రెడ్డి (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.2 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–17, 2–99, 3–140, 4–195. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 3–0–33–0, రూర్కే 2.2–0–31–1, దిగ్వేశ్ రాఠి 4–0–37–2, అవేశ్ ఖాన్ 3–0–25–0, రవి బిష్ణోయ్ 1–0–26–0, మార్క్రమ్ 1–0–14–0, శార్దుల్ 4–0–39–1. -
ఎస్ఆర్హెచ్ చేతిలో చిత్తు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో ఔట్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంత్ టీమ్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.అభిషేక్ శర్మ విధ్వంసం.. అనంతరం 206 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్లాసెన్(47), ఇషాన్ కిషన్(35), మెండిస్(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రెండు, విలియం ఓ రూర్క్ వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
టీమిండియా వెటరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా ( బంతులు పరంగా) 150 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్‌గా హర్షల్ నిలిచాడు. 2381 బంతుల్లో ఈ ఫీట్‌ను పటేల్ అందుకున్నాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను పటేల్ నమోదు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ(2444 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మలింగ రికార్డును హర్షల్ పటేల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో హర్షల్ పటేల్(117) రెండో స్దానంలో నిలిచాడు. తొలి స్ధానంలో మలింగ(105) కొనసాగుతున్నాడు.ఐపీఎల్లో బంతులు పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..2381- హర్షల్ పటేల్2444- లసిత్ మలింగ2543- చాహల్2656- డ్వైన్ బ్రావో2832- జస్ప్రీత్ బుమ్రామ్యాచ్ల పరంగా అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..లసిత్ మలింగ- 105హర్షల్ పటేల్- 117యుజ్వేంద్ర చాహల్-118రషీద్ ఖాన్- 122జస్ప్రీత్ బుమ్రా- 124 -
IPL 2025: మళ్లీ అదే కథ.. తీరు మారని రిషబ్ పంత్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. 6 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ పేసర్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్‌కు చేరాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్.. తన ధరకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 12.27 సగటుతో కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు.ఈ క్రమంలో పంత్ చెత్త ఆట తీరును లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. పంత్ నీవు ఇక మారవా అంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో పంత్ ఔటైన అనంతరం మ్యాచ్ వీక్షిస్తున్న లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.చదవండి: అతడొక అద్బుతం.. గిల్‌ను మించిపోయాడు: జడేజా -
IPL 2025: లక్నోను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..
IPL 2025 LSG vs DC Live Updates:లక్నోను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్..ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమించింది. 206 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్లాసెన్(47), ఇషాన్ కిషన్(35), మెండిస్(32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రెండు, విలియం ఓ రూర్క్, శార్ధూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించారు.16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 179/316 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ విజయానికి 24 బంతుల్లో 27 పరుగులు కావాలి.ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్(35) రూపంలో సన్‌రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్..అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. దిగ్వేష్ సింగ్ రాఠీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు సన్ రైజర్స్ స్కోర్: 117/2అభిషేక్ శర్మ ఫిప్టీలక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 6వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అభిషేక్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. అభిషేక్ 59 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 7 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న అభిషేక్, కిషన్..4 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ఇషాన్ కిషన్(11) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్..206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన ఆధర్వ తైడే.. విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోర్: 23/1చెలరేగిన లక్నో బ్యాటర్లు..ఐపీఎల్-2025లో ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు.లక్నో మూడో వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 61 పరుగులు చేసిన మార్క్రమ్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో.. 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.15 ఓవర్లకు లక్నో స్కోర్: 146/215 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(53), నికోలస్ పూరన్(16) ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్..రిషబ్ పంత్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన పంత్.. ఇషాన్ మలింగ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 12 ఓవర్లకు లక్నో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మారక్రమ్(49), రిషబ్ పంత్(7) ఉన్నారు.లక్నో తొలి వికెట్ డౌన్.. మార్ష్ ఔట్మిచెల్ మార్ష్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 65 పరుగులు చేసిన మార్ష్.. హర్ష్ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(2), మార్క్రమ్(48) ఉన్నారు.6 ఓవర్లకు లక్నో స్కోర్: 69/06 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(26), మార్ష్(41) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న మార్ష్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(18), మార్క్రమ్(1) ఉన్నారు.ఐపీఎల్-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ లక్నోకు చాలా కీలకం. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో పంత్ టీమ్ తప్పక గెలవాల్సిందే. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆరెంజ్ ఆర్మీ.. తమ ఆఖరి మ్యాచ్‌లలో గెలిచి పరువు నెలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కరోనా కారణంగా దూరమయ్యాడు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కేసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ -
LSG Vs SRH: రైజర్స్ గాడిన పడేనా!
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు నామమాత్రమైన పోరుకు సిద్ధమైంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో రైజర్స్ తలపడనుంది. ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్... మెరుగైన స్థానంతో ఈ సీజన్‌కు ముగింపు పలకాలని భావిస్తోంటే... పడుతూ లేస్తూ సాగుతున్న లక్నో జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలని తహతహలాడుతోంది. రిషభ్ పంత్ సారథ్యంలోని లక్నో జట్టు గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడింది. ఈ నేపథ్యంలో తెగించి పోరాడేందుకు రెడీ అవుతోంది. పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న లక్నో సారథి పంత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అనుకోని విరామం తర్వాతైనా పంత్ విజృంభిస్తాడా చూడాలి. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లాడిన లక్నో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లతో ఉంది. మరోవైపు ‘ఆరెంజ్ ఆర్మీ’ 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 ఓటములు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 7 పాయింట్లతో ఉంది. బౌలింగ్ మెరుగైతేనే! తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి ప్రత్యర్థులను హడలెత్తించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేక పరాజయాలతో సహవాసం చేసింది. ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్న కమిన్స్ బృందం... ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అయినా కాస్త మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. గతేడాది ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు గెలుచుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈసారి పేలవ ప్రదర్శన చేస్తుంటే... తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత జట్టుకే భారంగా మారాడు. అభిషేక్ శర్మ అడపాదడపా మెరుపులు తప్ప నిలకడలేమితో ఇబ్బంది పడుతుంటే... సీజన్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ట్రావిస్ హెడ్ కోవిడ్–19 సోకడంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో అభిషేక్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా... సచిన్ బేబీకి తుది జట్టులో చోటు దక్కనుంది. మిడిలార్డర్లో క్లాసెన్, నితీశ్, అనికేత్, మెండిస్ కీలకం కానున్నారు. ఇక ఈ సీజన్లో లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీతో పాటు కమిన్స్, ఉనాద్కట్ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరముంది. పంత్‌పైనే అందరి చూపు పది రోజుల విరామం తర్వాత బరిలోకి దిగుతున్న లక్నో జట్టు పంత్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో 10 ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పంత్... 12.8 సగటుతో 128 పరుగులు చేశాడు. కనీసం 100 బంతులు ఎదుర్కొన్న వారిలో పంత్‌దే అతితక్కువ సగటు, స్ట్రయిక్ రేట్. ఈ గణాంకాలు చాలు ఈ సీజన్లో పంత్ ఎంతలా తడబడుతున్నాడో అర్థం చేసుకునేందుకు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అయితే అబ్దుల్ సమద్, ఆయుశ్ బదోనీ తర్వాత ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్సీ రేసులో ముందు వరసలో ఉన్న పంత్ ఈ మ్యాచ్‌లోనైనా చెలరేగుతాడా చూడాలి. మార్క్రమ్, మార్‡్ష, పూరన్, మిల్లర్ రూపంలో నలుగురు భీకర బ్యాటర్లు లక్నోకు అందుబాటులో ఉండగా... మిల్లర్ ఫామ్‌లేమీ మేనేజ్మెంట్ను ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్‌లో లక్నో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆరంభంలో మెరిపించిన శార్దుల్ ఠాకూర్ ప్రభావం చూపలేకపోతుండగా... మయాంక్ యాదవ్ గాయాలతో సతమతమవుతున్నాడు. విఘ్నేశ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్ కలసి కట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్‡్ష, పూరన్, బదోని, మిల్లర్, సమద్, రవి బిష్ణోయ్, శార్దుల్ ఠాకూర్, విగ్నేశ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్. సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సచిన్ బేబీ, క్లాసెన్, నితీశ్ రెడ్డి, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ఉనాద్కట్, హర్శల్ పటేల్, షమీ, జీషాన్ అన్సారీ. -
మయాంక్ యాదవ్‌కు మళ్లీ గాయం.. లక్నో జట్టులోకి కివీ స్పీడ్ స్టార్
టీమిండియా స్పీడ్ స్టార్, లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మరోసారి గాయపడ్డాడు. మయాంక్ యాదవ్ వెన్ను గాయం కారణంగా ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ గురువారం ధ్రువీకరిచింది. కాగా మయాంక్ ఈ ఏడాది సీజన్ మధ్యలో గాయం నుంచి కోలుకుని లక్నో జట్టులో చేరాడు.ఈ క్రమంలో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన యాదవ్‌కు తన వెన్నుగాయం తిరగబెట్టింది. దీంతో అతడు మళ్లీ బెంగళూరులోని ఏన్సీఎకు వెళ్లనున్నాడు. తరుచూ గాయాల బారిన పడతుండడంతో అతడి కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. ఇక మయాంక్ యాదవ్ స్ధానాన్ని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ విలియం ఓరూర్క్తో లక్నో భర్తీ చేసింది. కివీ పేసర్‌ను రూ. 3 కోట్ల రిజర్వ్ ధరకు సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఓ రూర్క్ న్యూజిలాండ్ జట్టులో ప్రస్తుతం కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. భారతగడ్డపై న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంలో రూర్క్ది కీలక పాత్ర. ఈ క్రమంలోనే అతడితో లక్నో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా గాయపడిన లాకీ ఫెర్గూసన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించింది. మరో న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ కైల్ జామీసన్ పంజాబ్ తమ జట్టులోకి తీసుకుంది. జామీసన్ గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఆర్ధరంతరంగా ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్.. తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ -
టెస్టుల్లో అద్భుతం.. కానీ వన్డే, టీ20లలో మాత్రం వేస్ట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) బ్యాటింగ్ తీరుపై భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ (Sanjay Bangar)విమర్శలు గుప్పించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని అన్నాడు. వన్డే, టీ20 క్రికెట్లో సరైన షాట్ల ఎంపిక విషయంలో ఇప్పటికీ అతడు తడబడుతుండటం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నాడు.అత్యంత ఖరీదైన ఆటగాడిగాఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ ఉత్తరాఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ చరిత్ర సృష్టించాడు.చెత్త ప్రదర్శనఅయితే, ఆట విషయంలో మాత్రం పంత్ తుస్సుమనిపించాడు. ఇప్పటి వరకు పది ఇన్నింగ్స్ 12.80 సగటుతో.. 99.22 స్ట్రైక్‌రేటుతో 128 పరుగులే చేశాడు. పంత్ ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టిన నాటి (2016) నుంచి అతడి కెరీర్లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శన అని చెప్పవచ్చు.టెస్టుల్లో అద్బుతం.. కానీ వన్డే, టీ20లలో మాత్రం వేస్ట్!లక్నో కెప్టెన్‌గా ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా పంత్ విఫలం కావడం తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ‘‘వైట్ బాల్ క్రికెట్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడంలో పంత్ తడబడుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.50, 20 ఓవర్ల ఫార్మాట్లో అతడి ఆట గొప్పగా లేదు. అయితే, టెస్టు క్రికెట్లో మాత్రం అతడొక అద్భుతమైన బ్యాటర్. సంప్రదాయ ఫార్మాట్లో అతడి ఆటకు పేరు పెట్టే పనేలేదు.కానీ ఈ ఐపీఎల్ సీజన్లో అతడు అవుటైన విధానం చూస్తుంటే.. స్కూప్ షాట్లు ఆడేందుకు అతడు విఫలయత్నం చేసిన తీరును గమనించవచ్చు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.వారం పాటు వాయిదా అదే విధంగా.. రిషభ్ పంత్ బ్యాటింగ్ టెక్నిక్ సరిగా లేదని సంజయ్ బంగర్ ఈ సందర్భంగా విమర్శించాడు. తనలోని అత్యుత్తమ బ్యాటర్ ఆడే విధానాన్ని పంత్ మర్చిపోయాడని.. అందుకే ఇలా విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్-2025లో పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. ఐదు గెలిచి.. ఆరింట ఓడింది. తద్వారా పది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.టీమిండియా తరఫున ఇలా..టెస్టుల్లో రిషభ్ పంత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటికి 43 మ్యాచ్‌లు ఆడి 2948 పరుగులు చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఆరు టెస్టు సెంచరీలు ఉన్నాయి.అయితే, వన్డేల్లో 31 మ్యాచ్‌లలో కలిపి పంత్ కేవలం 871 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 76 అంతర్జాతీయ టీ20లలో కలిపి 1209 పరుగులు సాధించగలిగాడు. ఇక ఐపీఎల్లో మొత్తంగా 122 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 3412 రన్స్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు.చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు! -
IPL 2025: ఐపీఎల్ వాయిదా.. టికెట్ల డబ్బులు రీఫండ్
పాకిస్తాన్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. త్వరలోనే కొత్త షెడ్యూల్, వేదికలను ఖారారు చేస్తామని భారత క్రికెట్ బోర్డు తెలిపింది.దీంతో మే 9(శుక్రవారం) నుంచి మ్యాచ్‌లు ఆగిపోనున్నాయి. ఐపీఎల్ నిరవధిక వాయిదా పడడంతో ఆయా ఫ్రాంచైజీలు అభిమానులకు టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేయడం ప్రారంభించాయి. షెడ్యూల్ ప్రకారం..ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడాల్సింది. కానీ వాయిదా పడడంతో టిక్కెట్ల డబ్బులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేస్తామని వెల్లడించింది. కాగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అర్ధాంతంగా రద్దు అయ్యింది. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లో యూఏఈలో నిర్వహించే అవకాశముంది. -
RCB Vs LSG: ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ లక్ష్యంగా...
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో రెండు భిన్నమైన జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు సమీపించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో తలపడుతుంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన లక్నో జట్టు సొంతగడ్డపై జరగనున్న పోరులో సత్తా చాటాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే లక్నో ‘ప్లే ఆఫ్స్’ ఆశలు గల్లంతయ్యే అవకాశమున్న నేపథ్యంలో... సమష్టిగా కదం తొక్కేందుకు రెడీ అయింది. ఈ సీజన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముందుకు సాగుతున్న ఆర్సీబీ 11 మ్యాచ్‌లాడి 8 విజయాలు, 3 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు లక్నో 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లతో ఉంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే లక్నో జట్టు ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన లక్నో సారథి రిషభ్ పంత్ ఏమాత్రం ప్రభావం చూపెట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్ స్థానాల్లో మార్పు చేసుకున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. మరి ఈ మ్యచ్‌లో బెంగళూరు విజయం సాధించి ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ ఖరారు చేసుకుంటుందా లేక లక్నో పోటీలో నిలుస్తుందా చూడాలి! ఒత్తిడిలో పంత్ బృందం ఈ సీజన్లో లక్నో విజయాల్లో టాప్–3 కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్క్రమ్, మిచెల్ మార్ష్ , నికోలస్ పూరన్ రాణిస్తుండటంతో ఆ జట్టుకు మంచి ఆరంభాలు లభిస్తున్నాయి. పూరన్ 11 మ్యాచ్‌ల్లో 410 పరుగులు చేయగా... మార్క్రమ్ 348 పరుగులు చేశాడు. మార్ష్ 10 మ్యాచ్‌ల్లో 378 పరుగులు కొట్టాడు. మిడిలార్డర్లో ఆయుశ్ బదోని కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. అతడు 326 పరుగులు చేయగా... భారీ ఆశలు పెట్టుకున్న పంత్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ సీజన్లో పంత్ 12.80 సగటుతో కేవలం 128 పరుగులే చేశాడు. ధాటిగా ఆడగల సత్తాఉన్న పంత్ 99.22 స్ట్రయిక్‌రేట్ మాత్రమే నమోదు చేశాడు. చావో రేవో తేల్చుకునేందుకు బరిలోకి దిగాల్సిన పరిస్థితుల్లో పంత్ మాట్లాడుతూ... ‘మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ‘ప్లే ఆఫ్స్’ రేసులో ఉంటాం. ఇప్పుడు మా ముందు ఉన్న లక్ష్యం అదే. టాపార్డర్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ప్రతి మ్యాచ్‌లో వాళ్లపైనే భారం వేయడం కూడా తగదు’ అని పంత్ అన్నాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ భారీగా పరుగులు ఇచ్చుకుంటుండగా... ఫీల్డింగ్‌లోనూ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. మరి కీలక పోరులో నెగ్గాలంటే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో లక్నో మెరవాల్సిన అవసరముంది. ఫుల్ ఫామ్‌లో విరాట్... లీగ్ ఆరంభం నుంచి బరిలోకి దిగుతున్నా... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఆర్సీబీ... ఈ సీజన్లో తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శనతో నిలకడగా విజయాలు సాధిస్తోంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫుల్ ఫామ్‌లో ఉండటం బెంగళూరుకు ప్రధాన బలం. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో విరాట్ 63.13 సగటుతో 505 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. అందులో 7 అర్ధశతకాలు ఉన్నాయి. ఆరంభంలో కోహ్లి ఇన్నింగ్స్‌లో స్థిరత్వాన్ని తెస్తే... రజత్ పాటీదార్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా దాన్ని కొనసాగిస్తున్నారు. ఆఖర్లో టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ వంటి హిట్టర్లు ఉండటం ఆ జట్టు భారీ స్కోర్లు చేయగలుగుతోంది. అయితే ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు దేవదత్ పడిక్కల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసుకుంది. చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో షెఫర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు దేవదత్ పడిక్కల్ గాయం కారణంగా దూరవడంతో ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ కీలకం కానున్నారు.తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్ష్ , పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, దిగ్వేశ్ రాఠీ, ఆకాశ్ సింగ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, జాకబ్ బెథెల్, మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఇన్‌గిడి, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ. -
ఆ ముఖంలో నవ్వే లేదు.. రహానే, కోహ్లి కావాలేమో?
ఐపీఎల్-2025 (IPL 2025)లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) విఫలమవుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌గా, బ్యాటర్‌గా వరుస మ్యాచ్‌లలో నిరాశపరుస్తున్నాడు. ఇప్పటికి మొత్తంగా పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న పంత్.. కేవలం 128 పరుగులు రాబట్టగలిగాడు.ఇదే అత్యంత చెత్త ప్రదర్శన2016లో ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టిన పంత్ కెరీర్లో ఇప్పటికి ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. ఈ నేపథ్యంలో మేటి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్ క్రిస్ట్ పంత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆ ముఖంలో నవ్వే లేదు.. ‘‘అతడిని చూసిన ప్రతిసారీ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తూ ఆడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఈసారి తను అలా లేడు. ఆ ముఖంలో నవ్వు లేదు.. సహచర ఆటగాళ్లతో సరదాగా ఉన్నట్లు కనిపించడం లేదు.. ప్రశాంతవదనంతో ఉన్నాడా అంటే అదీ లేదు.కొత్త ఫ్రాంఛైజీ తరఫున కెప్టెన్సీ భారమా లేదంటే ప్రైస్ ట్యాగ్ అతడి నెత్తి గుదిబండగా మారిందా అర్థం కావడం లేదు. ఇది అతడు కానే కాదని వంద శాతం చెప్పగలను. అతడి ఆటలో మునుపటి మెరుపు, చురుకుదనం కనిపించడం లేదు’’ అని క్రిక్‌బజ్ షోలో గిల్‌క్రిస్ట్ అన్నాడు.రహానే, కోహ్లి కావాలేమో?ఇందుకు అదే షోలో పాల్గొన్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్ బదులిస్తూ.. ‘‘పంత్ విషయంలో మీరు ఇచ్చిన చెప్పిన మాటల్ని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నా. అతడు సొంతగడ్డపై.. చుట్టూ భారత క్రికెటర్లు ఉంటే మాత్రమే అతడు ఆటను ఆస్వాదిస్తాడా?వారి కంపెనీని మాత్రమే ఎంజాయ్ చేస్తాడా? ఎందుకంటే ఇప్పుడు అతడి చుట్టూ ప్రధానంగా నలుగురూ విదేశీ బ్యాటర్లే ఉన్నారు. పంత్ సహచరులతో సంతోషంగా లేడని అంటున్నారా?అజింక్య రహానే, విరాట్ కోహ్లి తన జట్టులో ఉంటే పంత్ మారిపోతాడా? అంటే సమాధానం చెప్పలేము. ఏదేమైనా పంత్ మునుపటిలా మాత్రం లేడన్నది వాస్తవం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మెగా వేలం-2025లో రూ. 27 కోట్లకు లక్నో పంత్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు.పది జట్ల స్థానాలు ఇలాఈ సీజన్లో ఇప్పటికి 128 పరుగులు చేసిన పంత్ అత్యధిక స్కోరు 63. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం ఐదే గెలిచి.. ఆరు ఓడిపోయింది.తద్వారా పది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ఆర్సీబీ 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండి.. ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ రెండు, ముంబై ఇండియన్స్ మూడు, గుజరాత్ టైటాన్స్ నాలుగు, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆరో స్థానంలో ఉన్న కేకేఆర్, ఏడో స్థానంలో ఉన్న లక్నో కూడా సాంకేతికంగా ఇంకా రేసులో ఉన్నాయి.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ -
IPL 2025: ఈ పంత్ మనకొద్దు, పీకి పడేయండి సార్..! విసుగెత్తిపోయిన లక్నో అభిమానులు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ సీజన్లో అతను ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 128 పరుగులు (99.22 స్ట్రయిక్ రేట్‌తో) మాత్రమే చేశాడు. నిన్న (మే 4) పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 18 పరుగులు చేసి అసాధారణ రీతిలో ఔటయ్యాడు.Bat goes in the air 🎙️🎙️pic.twitter.com/ySjmdC9qMm— CricTracker (@Cricketracker) May 4, 2025అజ్మతుల్లా బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించగా.. బ్యాట్ ఓ పక్క, బంతి ఓ పక్క గాల్లోకి లేచాయి. శశాంక్ సింగ్ క్యాచ్ పట్టడంతో పంత్ నిరాశగా పెవిలియన్‌కు వెనుదిరిగాడు. పంత్ విచిత్ర రీతిలో ఔటైన అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా కూడా చాలా దిగాలుగా, కోపంగా కనిపించాడు. Sanjiv Goenka Reaction After Rishabh Pant wicket 🥵#LSGvsPBKS #PBKSvsLSG pic.twitter.com/jUeuVlqz6n— MAHIPAL GURJAR (@Chikugurjar83) May 4, 2025ఈ పంత్ ఇక మారడా అన్నట్లు హావభావాలు పెట్టాడు. గొయెంకా ఎక్స్‌ప్రెషన్స్‌ను సోషల్‌మీడియాలో అభిమానులు మీమ్స్‌గా వాడుకుంటున్నారు. గొయెంకా ఓపిక నశించింది. ఇక పంత్‌కు బడిత పూజే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరోవైపు పంత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో లక్నో అభిమానులు విసుగెత్తిపోయారు. ఈ పంత్ మనకొద్దు, తక్షణమే జట్టు నుంచి తొలగించండంటూ లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకాను అభ్యర్థిస్తున్నారు. పంత్‌పై రూ. 27 కోట్ల పెట్టుబడి సుద్ద దండగ అని కామెంట్లు చేస్తున్నారు. If you were Sanjiv Goenka, what would you have done?1. Release Rishabh Pant and invest 27cr into other players in auction2. Release Rishabh Pant and and buy him back for a cheaper price3. Reinvest 27 cr for another season? pic.twitter.com/xtPQ4jhOla— Dinda Academy (@academy_dinda) May 4, 2025కాగా, ఈ సీజన్ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డుల్లోకెక్కాడు. అయితే ఈ సీజన్లో పంత్ తీసుకున్న డబ్బుకు కనీస న్యాయం కూడా చేయలేకపోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో ఘెరంగా విఫలమై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. 2016లో అరంగేట్రం చేసిన తర్వాత ఐపీఎల్లో పంత్ ఇంత ఘోరమైన ప్రదర్శనలు ఎప్పుడూ చేయలేదు.ఈ సీజన్లో పంత్ కెప్టెన్‌గానూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. తొలి 6 మ్యాచ్‌ల్లో టాపార్డర్ ఆటగాళ్లు చెలరేగడంతో లక్నో 4 విజయాలు సాధించింది. అయితే గడిచిన ఐదు మ్యాచ్‌ల్లో టాపార్డర్ అంతంతమాత్రంగా ఆడుతుండటంతో పంత్ కెప్టెన్సీ లోపాలు బయటపడ్డాయి. చివరి ఐదు మ్యాచ్‌ల్లో లక్నో నాలుగింట ఓడింది. పంత్ జట్టును గెలిపించే ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేకపోయాడు. పైగా బ్యాటింగ్ ఆర్డర్లో తనను తాను వెనక్కు పంపుకోవడం లాంటి చెత్త నిర్ణయాలు తీసుకున్నాడు. ఛాంపియన్ జట్టుకు కావాల్సిన అన్ని వనరులు ఉన్నా పంత్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా ఇంతలా విఫలమవుతున్న పంత్‌పై యజమానిగా గొయెంకాకు కోపం రావడం సహజమే. పైగా పంత్ కోసం అతను కేఎల్ రాహుల్ లాంటి గొప్ప ప్లేయర్‌ను కాదనుకున్నాడు. లక్నో అభిమానుల బాధలోనూ అర్దముంది. జట్టు బాగాలేకపోతే ఏదో అనుకునే వారు. అన్నీ బాగున్నా జట్టును విజయపథంలో నడిపించలేకపోతే అది కెప్టెన్ వైఫల్యమే అవుతుంది. అందుకే వారు ఈ స్థాయిలో పంత్‌పై రియాక్ట్ అవుతున్నారు. కాగా, నిన్న (మే 4) రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. టాపార్డర్ ఘోరంగా విఫలం కావడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రతిఘటించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగలిగింది.ఈ ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లక్నో ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ఇతర జట్ల జయాపజయాలపై వారి ఫేట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం లక్నో రన్ రేట్ (-0-469) కూడా చాలా తక్కువగా ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో ఈ ఒక్క జట్టు రన్‌రేట్ మాత్రమే మైనస్‌లో ఉంది. లక్నో ఒక వేళ మూడు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే భారీ తేడాతో గెలవాలి. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు (11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) ఉన్నాయి. పంజాబ్ చేతిలో ఓటమితో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. -
పంజాబ్ పరాక్రమం
ధర్మశాల: ఐపీఎల్లో ఎప్పుడో 2014లో ఫైనల్ చేరిన పంజాబ్ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ‘టాప్–4’లో నిలిచేందుకు మరింత చేరువైంది. సమష్టి ప్రదర్శనతో చెలరేగిపోతున్న జట్టు ఆదివారం జరిగిన పోరులో 37 పరుగులతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (15 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), జోష్ ఇన్‌గ్లిస్ (14 బంతుల్లో 30; 1 ఫోర్, 4 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో పోరాడినా విజయానికి అది సరిపోలేదు. సమష్టిగా చెలరేగి... తొలి ఓవర్లోనే ప్రియాన్షి ఆర్య (1) అవుట్ కావడం మినహా ఇన్నింగ్స్ ఆసాంతం పంజాబ్ హవానే సాగింది. బరిలోకి దిగిన మిగతా ఆరుగురు బ్యాటర్లూ మెరుపు షాట్లతో దూకుడు ప్రదర్శించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. మయాంక్ తొలి ఓవర్లో ఇన్‌గ్లిస్ వరుసగా 3 సిక్సర్లతో చెలరేగిపోగా... అతని రెండో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 2 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. ప్రభ్‌సిమ్రన్ 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిడాఫ్‌లో సులువైన క్యాచ్ వదిలేసి పూరన్ పెద్ద తప్పిదం చేశాడు! పవర్‌ప్లేలో పంజాబ్ 66 పరుగులు చేసింది. 30 బంతుల్లో ప్రభ్‌సిమ్రన్ వరుసగా మూడో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. శ్రేయస్ కూడా కొన్ని చక్కటి షాట్లతో స్కోరు వేగం తగ్గకుండా చూడగా, వధేరా (16) కూడా ధాటిగా ఆడాడు. 16 ఓవర్లలో జట్టు స్కోరు 171/4. అవేశ్ వేసిన 18వ ఓవర్లో శశాంక్ 2 ఫోర్లు...ప్రభ్‌సిమ్రన్ వరుసగా 6, 4 6 బాదడంతో మొత్తం 26 పరుగులు లభించాయి. చివరి 4 ఓవర్లలో పంజాబ్ 65 పరుగులు రాబట్టింది. ఛేదనలో లక్నో పూర్తిగా తడబడింది. ఆరంభంతోనే చక్కటి బౌలింగ్‌తో 3 వికెట్లు తీసిన అర్ష దీప్ సింగ్ ప్రత్యరి్థని దెబ్బ కొట్టాడు. తన రెండో ఓవర్లో మిచెల్ మార్‡్ష (0), మార్క్రమ్ (13)లను వెనక్కి పంపిన అర్‡్షదీప్, తన తర్వాతి ఓవర్లో పూరన్ (6)ను కూడా అవుట్ చేయడంతో లక్నో కష్టాల్లో పడింది. రిషభ్ పంత్ (18) తన వైఫల్యాన్ని కొనసాగించగా, డేవిడ్ మిల్లర్ (11) కూడా ప్రభావం చూపలేకపోయాడు.స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్షి (సి) మయాంక్ (బి) ఆకాశ్ 1; ప్రభ్‌సిమ్రన్ (సి) పూరన్ (బి) రాఠీ 91; ఇన్‌గ్లిస్ (సి) మిల్లర్ (బి) ఆకాశ్ 30; శ్రేయస్ (సి) మయాంక్ (బి) రాఠీ 45; వధేరా (బి) ప్రిన్స్ 16; శశాంక్ (నాటౌట్) 33; స్టొయినిస్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 236. వికెట్ల పతనం: 1–2, 2–50, 3–128, 4–162, 5–216. బౌలింగ్: ఆకాశ్ సింగ్ 4–0–30–2, మయాంక్ యాదవ్ 4–0–60–0, అవేశ్ ఖాన్ 4–0–57–0, దిగ్వేశ్ రాఠీ 4–0–46–2, ప్రిన్స్ యాదవ్ 4–0–43–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) అర్ష దీప్ సింగ్ 13; మార్‡్ష (సి) వధేరా (బి) అర్ష దీప్ సింగ్ 0; పూరన్ (ఎల్బీ) (బి) అర్ష దీప్ సింగ్ 6; పంత్ (సి) శశాంక్ (బి) అజ్మతుల్లా 18; బదోని (సి) అర్ష దీప్ సింగ్ (బి) చహల్ 74; మిల్లర్ (సి) శశాంక్ (బి) అజ్మతుల్లా 11; సమద్ (సి) అండ్ (బి) 45; అవేశ్ (నాటౌట్) 19; ప్రిన్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–15, 2–16, 3–27, 4–58, 5–73, 6–154, 7–188. బౌలింగ్: అర్ష దీప్ సింగ్ 4–0–16–3, యాన్సెన్ 4–0–31–1, అజ్మతుల్లా 4–0–33–2, చహల్ 4–0–50–1, వైశాక్ 3–0–49–0, స్టొయినిస్ 1–0–17–0. -
IPL 2025: లక్నోపై సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ మరో అద్బుత విజయం నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. లక్నో బౌలర్లను పంజాబ్ బ్యాటర్లు ఊతికారేశారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభ్సిమ్రాన్ సింగ్(91) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(45), శశాంక్ సింగ్(33), ఇంగ్లిష్(30) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.బదోని ఒక్కడే..అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్నో బ్యాటర్లలో అయూష్ బదోని(74) ఒంటరి పోరాటం చేయగా.. అబ్దుల్ సమద్(45) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఒమర్జాయ్ రెండు, జాన్సెన్, చాహల్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్దానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించేందుకు కింగ్స్ అడుగు దూరంలో నిలిచారు. -
క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ సరసన ప్రభ్‌సిమ్రన్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్ (PBKS vs LSG)తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చితక్కొడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే, దురదృష్టవశాత్తూ శతకానికి తొమ్మిది పరుగుల దూరంలో ప్రభ్‌సిమ్రన్ ఆగిపోయాడు.అయితేనేం.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్బుత ఆట తీరుతో క్రిస్ గేల్, కేఎల్ రాహల్ (KL Rahul)సరసన నిలిచాడు. గతేడాది నిలకడైన ప్రదర్శన కనబరిచిన ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు భారీ ధరకు అట్టిపెట్టుకుంది. అతడి కోసం పర్సు నుంచి నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించింది.అందుకు తగ్గట్లుగానే ప్రభ్‌సిమ్రన్ ఈసారీ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా లక్నోతో మ్యాచ్‌లోనూ అతడు బ్యాట్ ఝులిపించాడు. మొత్తంగా 48 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 91 పరుగులు సాధించాడు.అయితే, దిగ్వేశ్ రాఠీ బౌలింగ్‌లో నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ప్రభ్‌సిమ్రన్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక అతడికి ఈ సీజన్లో ఇది ఓపెనర్‌గా వరుసగా మూడో అర్ధ శతకం కావడం విశేషం. తద్వారా పంజాబ్ కింగ్స్ తరఫున ఒకే సీజన్లో ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ప్రభ్‌సిమ్రన్ చేరిపోయాడు.ఇక ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచింది. ఒకటి వర్షం కారణంగా రద్దైంది. ఈ క్రమంలో 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా లక్నోతో మ్యాచ్‌లోనూ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకుపోతుంది.మరోవైపు.. ఈ సీజన్లో ఇప్పటికి (ఈ మ్యాచ్‌తో కలిపి) పదకొండు ఇన్నింగ్స్ ఆడిన ప్రభ్‌సిమ్రన్ 437 పరుగులు సాధించాడు. తద్వారా పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికి నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. ఇక లక్నోతో ఆదివారం నాటి మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 236 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో పాటు జోష్ ఇంగ్లిస్ (14 బంతుల్లో 30), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 45), శశాంక్ సింగ్ (15 బంతుల్లో 33 నాటౌట్), మార్కస్ స్టొయినిస్ (5 బంతుల్లో 15) దంచికొట్టారు.ఒక సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఓపెనర్‌గా వరుసగా అత్యధిక అర్ధ శతకాలు సాధించింది వీరేక్రిస్ గేల్ (2018)- మూడుకేఎల్ రాహుల్ (2018)- మూడుకేఎల్ రాహుల్ (2019)- మూడుకేఎల్ రాహుల్ (2020)- మూడుప్రభ్సిమ్రన్ సింగ్ (2025*) మూడు.Sent the ball to enjoy the view 🏔😍Shashank Singh and Prabhsimran Singh with an entertaining partnership tonight 💪Scorecard ▶ https://t.co/YuAePC273s#TATAIPL | #PBKSvLSG pic.twitter.com/9WqFWRd3zt— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
IPL 2025: లక్నోపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
Punjab kings vs Lucknow super giants live updates: లక్నోపై పంజాబ్ కింగ్స్ ఘన విజయంఐపీఎల్-2025లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 37 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్నో బ్యాటర్లలో అయూష్ బదోని(74) ఒంటరి పోరాటం చేయగా.. అబ్దుల్ సమద్(45) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా చేతులేత్తేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఒమర్జాయ్ రెండు, జాన్సెన్, చాహల్ తలా వికెట్ సాధించారు.అయూష్ బదోని హాఫ్ సెంచరీ..పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అయూష్ బదోని హాఫ్ సెంచరీ సాధించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి బదోని(67) తన అద్బుత ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 18 ఓవర్లు ముగిసేసరికి లక్నో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.14 ఓవర్లకు లక్నో స్కోర్: 126/514 ఓవర్లు ముగిసే సరికి లక్నో 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో బదోని(40), అబ్దుల్ సమద్(29) ఉన్నారు.కష్టాల్లో లక్నో.. 74 పరుగులకే 5 వికెట్లు237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 74 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రిషబ్ పంత్(18), డేవిడ్ మిల్లర్(11) వరుసగా పెవిలియన్‌కు చేరారు.అర్ష్‌దీప్ ఆన్ ఫైర్..లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిప్పులు చేరుగుతున్నాడు. లక్నో తొలి మూడు వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. లక్నో టాప్ బ్యాటర్లు మార్ష్, మార్క్రమ్, పూరన్‌ను అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో 3 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.లక్నో తొలి వికెట్ డౌన్..237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 2.1 ఓవర్లకు లక్నో స్కోర్: 15/1చెలరేగిన పంజాబ్ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ ఎంతంటేధర్మశాల వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(91) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా.. శ్రేయస్ అయ్యర్(45), శశాంక్ సింగ్(33), ఇంగ్లిష్(30) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు.పంజాబ్ నాలుగో వికెట్ డౌన్నేహాల్ వధేరా రూపంలో పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన వధేరా.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 16 ఓవర్లకు పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో ప్రబ్సిమ్రాన్ సింగ్(74), శశాంక్(2) ఉన్నారు.పంజాబ్ మూడో వికెట్ డౌన్..శ్రేయస్ అయ్యర్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన అయ్యర్.. దిగ్వేష్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్సిమ్రాన్ సింగ్(51), వధేరా(5) ఉన్నారు.పంజాబ్ రెండో వికెట్ డౌన్జోష్ ఇంగ్లిష్ రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన ఇంగ్లిష్.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(9), ఫ్రబ్ సిమ్రాన్(35) ఉన్నారు.పంజాబ్ తొలి వికెట్ డౌన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ప్రియాన్ష్ ఆర్య.. ఆకాష్ మహారాజ్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో జోష్ ఇంగ్లిష్(23), ప్రభ్సిమ్రాన్ సింగ్(2) ఉన్నారు.ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆకాష్ మహరాజ్ సింగ్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ జట్టులోకి మార్కస్ స్టోయినిష్ తిరిగొచ్చాడు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, ఆకాష్ మహరాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్పంజాబ్ కింగ్స్(ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ -
'ముంబై మంచి రిథమ్‌లో ఉంది.. ప్రతీ జట్టు భయపడాల్సిందే'
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరంభంలో వరుస ఓటుములతో తడబడిన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.ముంబైకి ఇది వరుసగా ఐదో విజయం కావడం గమనార్హం. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై ఇడియన్స్ మూడో స్ధానానికి చేరుకుంది. ఈ క్రమంలో ముంబై జట్టుపై టీమిండియా మాజీ ప్లేయర్ పీయాష్ చావ్లా ప్రశంసల వర్షం కురిపించాడు. ముంబై జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ప్రతీ జట్టు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు."ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా వంతు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ముంబై ఇండియన్స్ మంచి రిథమ్‌లో ఉంది. ముంబై ఇటువంటి రోల్లో ఉన్నప్పుడు, కచ్చితంగా ఇతర జట్లు వారిని చూసి భయపడాలి. ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో మొదటి నుంచి చివరి వరకు అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ర్యాన్ రికెల్టన్ ఈ రోజు మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విల్ జాక్స్ బంతితో ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుతం ముంబై సరైన ట్రాక్‌లో ఉందని లక్నో మ్యాచ్ అనంతరం చావ్లా పేర్కొన్నాడు. -
ఇలా ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు: రిషభ్ పంత్ అసహనం!
ఐపీఎల్-2025 (IPL 2025)లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఆటగాడిగా పూర్తిగా విఫలమవుతున్నాడు. చెత్త బ్యాటింగ్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు అతడు నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 0, 15, 2, 2, 21, 63, 3, 0, 4.98.21 స్ట్రైక్‌రేటుతో మొత్తంగా కలిపి కేవలం 110 పరుగులు చేశాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్రకెక్కిన పంత్ నుంచి ఇలాంటి ఆట తీరు అస్సలు ఊహించనిది. దీంతో అభిమానులు సైతం అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే, కెప్టెన్‌గా మాత్రం రిషభ్ పంత్ ప్రదర్శన బాగానే ఉంది. అతడి సారథ్యంలో ఇప్పటి వరకు పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న లక్నో ఐదింట గెలిచింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఐదో పరాజయం నమోదు చేసింది.ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిదిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రిషభ్ పంత్‌కు అతడి ఫామ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది.పరిస్థితులు మనకు అనుకూలంగా లేనపుడు మన నైపుణ్యాలపై మనకే సందేహాలు తలెత్తుతాయి. అయితే, అలాంటి భావనలను దరిచేయనీయకూడదు. జట్టు బాగా ఆడుతున్నపుడు.. ఆ విషయంపైనే ఎక్కువగా దృష్టి సారించాలి.ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదుక్రికెట్ అంటేనే జట్టుగా ఆడాల్సిన ఆట. అవును.. ఒక్క ఆటగాడి వల్ల కూడా ప్రభావం ఉంటుంది. మ్యాచ్ దిశ మారిపోతుంది. కానీ ప్రతిసారి ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదనుకుంటా’’ అని పంత్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.కాగా హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన పోరులో ముంబై 54 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది.విల్ జాక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోలక్నో ఆటగాళ్లలో ఆయుశ్ బదోని (22 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. విల్ జాక్స్ బౌలింగ్‌లో కర్ణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పెవిలియన్ చేరాడు.ఇదిలా ఉంటే.. ముంబౌ బౌలర్లలో బుమ్రా 4, బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన విల్ జాక్స్ (29, 2/18) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో అత్యధికంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసి పంత్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే.చదవండి: వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు ఆ పిచ్చి లేదు: సంజనా𝙂𝙖𝙢𝙚. 𝙎𝙚𝙩. 𝘿𝙤𝙣𝙚 ✅@mipaltan make it 5⃣ in 5⃣ and are marching upwards and onwards in the season 📈Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/zW7EuWhU7j— IndianPremierLeague (@IPL) April 27, 2025 -
IPL 2025: ఇదేమి ఆట బ్రో.. పంత్ నీవు ఇక మారవా? ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్.. చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ముంబై స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన పంత్.. 12.22 సగటుతో కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్ ఆట తీరును లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇంత చెత్త ప్రదర్శనను చూడలేదంటూ నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. పంత్ నీవు ఇక మారవా? అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. కానీ ధరక తగ్గ న్యాయం పంత్ చేయలేకపోతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..ముంబై ఇండియన్స్ చేతిలో 54 పరుగుల తేడాతో లక్నో ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా..ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు.Rishabh Pant, absolute garbage performance. If you have any shame, return the 27 crore.#MIvsLSG #MIvLSG pic.twitter.com/JEeboJpQWJ— Chintan (@CricketChintan) April 27, 2025 -
LSG Vs MI: లక్నోపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
LSG vs MI Live Updates: ముంబై ఘన విజయంవాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు.అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. బుమ్ బుమ్ బుమ్రా.. ఒకే ఓవర్లో మూడు వికెట్లుజస్ప్రీత్ బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 16వ ఓవర్ వేసిన బుమ్రా ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. 18 ఓవర్లు ముగిసే సరికి లక్నో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.బదోని ఔట్..అయూష్ బదోని రూపంలో లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన బదోని.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో డేవిడ్ మిల్లర్(24), సమద్(1) ఉన్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.లక్నో నాలుగో వికెట్ డౌన్..మిచెల్ మార్ష్(34) రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్‌లో మార్ష్ ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. లక్నో విజయానికి 42 బంతుల్లో 93 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్..లక్నో సూపర్ జెయింట్స్ 7వ ఓవర్లో రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 7 ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో తొలి బంతికి పూరన్(27) ఔట్ కాగా.. మూడో బంతికి రిషబ్ పంత్(24) పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.లక్నో తొలి వికెట్ డౌన్..216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఐడైన్ మార్క్రమ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజులో పూరన్(6), మార్ష్(13) ఉన్నారు.సూర్య, రికెల్టన్ హాఫ్ సెంచరీలు.. లక్నో టార్గెట్ ఎంతంటే?వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది.ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.ముంబై ఐదో వికెట్ డౌన్157 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 174/5ముంబై నాలుగో వికెట్ డౌన్తిలక్ వర్మ రూపంలో ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(44), హార్దిక్ పాండ్యా(5) ఉన్నారు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జాక్స్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(15) ఉన్నారు.ముంబై ఇండియన్స్ రెండో వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన రికెల్టన్.. దిగ్వేష్ రతి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 115/26 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో అదరగొట్టింది. తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. రికెల్టన్ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) జోరు మీద ఉన్నాడు. అతనికి జతగా విల్ జాక్స్ (3) క్రీజ్‌లో ఉన్నాడు. వరుసగా 2 సిక్సర్లు బాది ఔటైన రోహిత్ శర్మటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ (12) అదే ఓవర్లో ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 33/1గా ఉంది. రికెల్టన్ (19), జాక్స్ క్రీజ్‌లో ఉన్నారు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో లక్నో స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మయాంక్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. సాంట్నర్ స్థానంలో కర్ణ్ శర్మ.. విజ్ఞేశ్ పుథుర్ స్థానంలో కార్బిన్ బాష్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మలక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ -
IPL 2025: ముంబై ఇండియన్స్‌తో కీలక మ్యాచ్‌కు ముందు లక్నో టీమ్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.ఈ మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు శుభవార్త తెలిసింది. గాయం కారణంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్పీడ్ గన్ మయాంక్ యాదవ్.. నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడని సమాచారం. మయాంక్ రీఎంట్రీపై ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ సోషల్‌మీడియా వేదికగా హింట్ ఇచ్చింది. వీడియోను రిలీజ్ చేస్తూ ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో ఓ భయంకరమైన శైలిని చూస్తారని సందేశాన్ని ఇచ్చింది.Kal dikhega tabadtod andaz 👊💥 pic.twitter.com/xl0YU6vhY2— Lucknow Super Giants (@LucknowIPL) April 26, 2025మయాంక్ రాకతో ఎల్ఎస్జీ పేస్ విభాగం మరింత పటిష్టమవుతుంది. ఇప్పటికే ఆ జట్టు పేస్ విభాగం ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్‌లతో స్ట్రాంగ్‌గా ఉంది. మయాంక్ జట్టులో చేరితే మరో పేసర్ ప్రిన్స్ యాదవ్‌పై వేటు పడే అవకాశం ఉంది. వెన్ను గాయం కారణంగా మయాంక్ ఈ సీజన్ తొలి అర్ద భాగానికి దూరంగా ఉన్నాడు. రాజస్థాన్, ఢిల్లీ మ్యాచ్‌లకు ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో ఉన్నప్పటికీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.మయాంక్ గత ఐపీఎల్ సీజన్లో 150 కిమీ పైగా వేగంతో బంతులు సంధించి వెలుగులోకి వచ్చాడు. గత సీజన్ ప్రదర్శనల కారణంగా మయాంక్ టీమిండియాలో సైతం చోటు దక్కించుకున్నాడు. భారత జట్టుకు ఆడుతూ సత్తా చాటిన మయాంక్.. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను వెన్ను మరియు కాలి బొటన వేలు సమస్యలతో బాధపడుతూ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత కీలక తరుణంలో మయాంక్ రీఎంట్రీ లక్నో టీమ్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది. మయాంక్ తన స్పీడ్‌తో ఫలితాలను తారుమారు చేయగలడు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో లక్నో, ముంబై ఇండియన్స్ తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 4న జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబైపై లక్నో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), మార్క్రమ్ (53) అర్ద సెంచరీలతో రాణించగా.. బదోని (30), మిల్లర్ (27) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హార్దిక్ పాండ్యా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం ఛేదనలో ముంబై గెలుపు దరిదాపుల్లోకి వచ్చి ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. దిగ్వేశ్ రాఠీ (4-0-21-1) ముంబైని ఇబ్బంది పెట్టాడు. నమన్ ధీర్ (46), సూర్యకుమార్ యాదవ్ (67) ముంబైని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖర్లో హార్దిక్ తిలక్ వర్మను రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపాడు. అతని స్థానంలో వచ్చిన సాంట్నర్ ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్లో హార్దిక్ ఓవరాక్షన్ చేసి తిలక్‌కు బదులుగా వచ్చిన సాంట్నర్‌కు స్ట్రయిక్ ఇవ్వలేదు. చివరి ఓవర్‌ను ఆవేశ్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. -
ప్రతీకార పోరు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఆరంభంలో పరాజయాలు ఎదురైనా... ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో గెలుపు బాట పట్టిన ముంబై మరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ వైపు మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా మంచి టచ్‌లో ఉంది. అయితే ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మంచి జోరు మీద ఉంది. ఓవరాల్‌గా రెండు జట్లు 9 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 4 పరాజయాలతో 10 పాయింట్లతో ఉన్నాయి. అయితే ఇరు జట్లు గెలిచిన ఐదు మ్యాచ్‌ల్లోనూ... వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం... సమష్టి కృషికి నిదర్శనం. ముంబై తరఫున అశ్వని కుమార్, కరణ్ శర్మ, విల్ జాక్స్, రోహిత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ ఈ అవార్డు దక్కించుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ తరఫున శార్దుల్ ఠాకూర్, దిగ్వేశ్ రాఠీ, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్, అవేశ్ ఖాన్ గెలుచుకున్నారు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. లక్నో 203 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో ముంబై 191 పరుగులకే పరిమితమైంది. ఈ పోరులోనే భారీ షాట్లు ఆడలేక తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మరి రెండో మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. జోరు సాగిస్తేనే... హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావడంతో... ముంబై కష్టాలు తీరిపోయాయి. సీజన్ ఆరంభంలో పరాజయాలతో సతమతమైన ముంబై.. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రోహిత్ దంచికొడుతూ శుభారంభాలు అందిస్తుండగా... మిడిలార్డర్లో సూర్యకుమార్ తన విలువ చాటుకుంటున్నాడు. రికెల్టన్, విల్ జాక్స్ కూడా మంచి టచ్‌లో ఉండగా... తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ రూపంలో ముంబైకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. వీరంతా కలిసి కట్టుగా కదంతొక్కితే భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. సొంతగడ్డపై మ్యాచ్ జరగనుండడం ముంబైకి కలిసి రానుంది. ఇక బౌలింగ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ పేస్ భారం మోయనుండగా... విగ్నేశ్, సాంట్నర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. టాపార్డర్‌పైనే భారం... లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో ఐదు విజయాలు సాధించిందంటే... వారి టాప్–3 ఆటగాళ్లు రాణించడమే దానికి ప్రధాన కారణం. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ ఈ ముగ్గురూ దంచికొడుతుండటంతో... లక్నో భారీ స్కోర్లు చేస్తోంది. ముఖ్యంగా పూరన్ ఈ సీజన్లో 200 పైగా స్ట్రయిక్‌రేట్‌తో 377 పరుగులు చేశాడు. మార్క్రమ్, మార్ష్ కూడా ధాటిగా ఆడుతున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్లో లయ దొరకబుచ్చుకోలేకపోతున్న పంత్ 9 మ్యాచ్‌ల్లో 106 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఆయుశ్ బదోనీ, అబ్దుల్ సమద్ ఫర్వాలేదనిపిస్తుండగా... డేవిడ్ మిల్లర్ రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో శార్దుల్, అవేశ్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠీ కీలకం కానున్నారు.తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, బౌల్ట్, బుమ్రా, విగ్నేశ్. లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్ష్, పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. -
LSG VS DC: ఆ కారణం చెప్పి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు: పంత్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 22) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ, ఎల్ఎస్జీ తలపడ్డాయి. లక్నో హోం గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. మార్క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) తొలి వికెట్‌కు 10 ఓవర్లలో 87 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చినా ఆ ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు సరిగ్గా ఆడకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆఖర్లో ఆయుశ్ బదోని (21 బంతుల్లో 36) బ్యాట్ ఝులిపించడంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. మార్క్రమ్ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన పంత్ ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు రావడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్‌గా కూడా విఫలమైన పంత్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్లో లక్నోకు ఢిల్లీ చేతిలో ఇది రెండో ఓటమి. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది.నిన్నటి మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చాలా బాధగా కనిపించాడు. ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 20 పరుగులు తక్కువ చేశామని తెలుసు. ఈ మైదానంలో టాస్ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. తొలుత బౌలింగ్ చేసే జట్టుకు వికెట్ నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఛేజింగ్ సమయంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. ఈ పిచ్‌పై ఇది ఎప్పుడూ జరిగేదే. దీన్ని సాకుగా చూసి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు.బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కు వెళ్లడంపై స్పందిస్తూ.. వికెట్ తీరును సద్వినియోగం చేసుకుంటాడని సమద్‌ను ముందుగా పంపాము. మిల్లర్‌ను సైతం అదే ఉద్దేశంతో నా కంటే ముందు బరిలోకి దించాము. వికెట్ తీరు ముందు ఇవేవి వర్కౌట్ కాలేదు. తదుపరి మ్యాచ్‌లపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు. బృంద సభ్యులందరం కలిసి కూర్చుంటాము. అప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్‌పై డిస్కస్ చేస్తాము. ఈ ఓటమిని ఇక్కడే మరచిపోయే ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తాము. ఈ మ్యాచ్‌లో ఓడినా లక్నో పాయింట్ల పట్టికలో మరో స్థానం కిందికి దిగజారలేదు. అయితే రన్‌రేట్ మాత్రం మైనస్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు -0-054 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో (10 పాయింట్లు) కొనసాగుతుంది. గుజరాత్, ఢిల్లీ చెరి 12 పాయింట్లతో టాప్-2లో ఉండగా.. ఆర్సీబీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
LSG VS DC: పంత్‌పై మండిపడుతున్న అభిమానులు.. గొయెంకాకు సరైన శాస్తి జరిగింది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చెత్త ప్రదర్శన కొనసాగుతుంది. నిన్న (ఏప్రిల్ 22) ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. ఈ సీజన్లో పంత్‌కు ఇది రెండో డకౌట్.ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో పంత్ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ చెత్త ఆటతీరు, కెప్టెన్‌గా తీసుకున్న చెత్త నిర్ణయాలు నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో కొంపముంచాయి. ఓపెనర్లు మార్క్రమ్, మార్ష్ మంచి ఆరంభం ఇచ్చినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించారు.వరుస వైఫల్యాల నేపథ్యంలో పంత్ భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా రాహుల్ లాంటి ఆణిముత్యాన్ని వదులుకుని పంత్ లాంటి చెత్తను రూ. 27 కోట్లకు కొనుక్కున్నాడని కామెంట్లు చేస్తున్నారు. రాహుల్‌ను కాదనుకుని ఎంతో నమ్మకంతో కెప్టెన్సీ కూడా కట్టబెడితే ఇదేనా వెలగబెట్టేదని మండిపడుతున్నారు. పంత్‌కు 27 లక్షలు కూడా దండగే అని అంటున్నారు. ఈ దెబ్బతో పంత్ పని అయిపోయిందని చర్చించుకుంటున్నారు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో పంత్ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గా కూడా ఘోరంగా విఫలమయ్యాడు. మార్క్రమ్ ఔటైన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రాకుండా పెద్ద తప్పిదమే చేశాడు. మూడో స్థానంలో కాకపోయినా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా లక్నో ఓ మోస్తరుకు మించి భారీ స్కోరే చేసేది. బ్యాటింగ్‌లో విఫలం కావడంతో పంత్ ఫీల్డింగ్ సమయంలో చాలా చిరాకుగా ఉన్నాడు. సహచరులపై అరుస్తూ కనిపించాడు. బౌలర్లను సరిగ్గా రొటేట్ చేయలేకపోయాడు. ఫలితంగా రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ రెచ్చిపోయారు.రాహుల్ గత సీజన్లో లక్నో యజమాని సంజీవ్ గొయెంకా చేతిలో ఎదురైన అవమానానికి నిన్నటి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు. రాహుల్ గొయెంకాకు బ్యాట్‌తో బుద్ది చెప్పడమే కాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు రివెంజ్ తీర్చుకున్నాడు. గొయెంకా కరచాలనం చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేయగా రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఆ సమయంలో గొయెంకా పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ. లోలోపల రాహుల్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కు బెంబేలెత్తిపోయుంటాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్
గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా తన పట్ల వ్యవహరించిన తీరుకు నాటి లక్నో కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీపై విజయానంతరం గొయెంకా కరచాలనం చేస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. రాహుల్ చర్యకు గొయెంకా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటబ్బా రాహుల్ ఇలా ప్రవర్తించాడని అనుకున్నారు.THE COMEBACK MAN - KL RAHUL. 🦁 pic.twitter.com/EQ67LvjLVl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2025అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత సీజన్లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా రాహుల్‌ను బహిరంగంగా అవమానించాడు. అందరి ముందు నిలదీశాడు. గొయెంకా చర్యకు మనసు నొచ్చుకున్న రాహుల్ లక్నోను వీడి ఢిల్లీ పంచన చేరాడు. ఇప్పుడు అవకాశం రావడంతో లక్నో ఓనర్‌కు తన ఆటతీరుతోనే బుద్ది చెప్పాడు. తనను ఘోరంగా అవమానించిన గొయెంకాపై వారి సొంత మైదానంలోనే ప్రతీకారం తీర్చుకున్నాడు. Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్‌తో మ్యాచ్ ముగించి గొయెంకాకు తానేమి చేయగలనో నిరూపించాడు. ఈ సీజన్లో లక్నోపై ఢిల్లీకి ఇది రెండో విజయం. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో రాహుల్ ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచే గొయెంకాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన రాహుల్.. నిన్న అవకాశం రావడంతో తన దెబ్బను రుచి చూపించాడు. ఈ సీజన్లో రాహుల్ మాంచి కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 323 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ ఓ భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఎల్ఎస్జీలో రాహుల్ ప్రస్తానంలక్నో ఐపీఎల్ అరంగేట్రం నుంచి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. తొలి రెండు సీజన్లలో (2022, 2023) ఆ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే గత సీజన్లో రాహుల్ లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. గత సీజన్లో నెమ్మదిగా ఆడుతున్నాడని కూడా రాహుల్‌పై విమర్శలు వచ్చాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
ఢిల్లీ మళ్లీ...
దాదాపు నెల రోజుల క్రితం... వైజాగ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది... ఇప్పుడు ప్రత్యర్థి వేదికపై సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ మళ్లీ ఆధిక్యం ప్రదర్శిస్తూ లక్నోపై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. క్యాపిటల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సూపర్ జెయింట్స్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా క్యాపిటల్స్ అలవోకగా మరో 13 బంతుల ముందే విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ఆడని రాహుల్... ఈసారి హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్‌కు ఇరుసుగా నిలిచాడు. తనను గత ఏడాది అవమానించిన పాత జట్టు లక్నో వేదికపై సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించి సంతృప్తిగా నిలబడ్డాడు. లక్నో: తొలి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్క్రమ్ (33 బంతుల్లో 52; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మిచెల్ మార్ష్(36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆయుష్ బదోని (21 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముకేశ్ కుమార్ (4/33) లక్నోను పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిషేక్ పొరేల్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... కెప్టెన్ అక్షర్ పటేల్ (20 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ల శుభారంభం... తొలి వికెట్‌కు 59 బంతుల్లో 87 పరుగులు భాగస్వామ్యం... ఈ సమయంలో లక్నో స్థితి చూస్తే భారీ స్కోరు ఖాయమనిపించింది. అయితే ఓపెనర్లు మార్క్రమ్, మార్ష్ఇచ్చిన ఈ ఘనారంభాన్ని ఆ తర్వాత జట్టు వృథా చేసుకుంది. పవర్‌ప్లేలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఓపెనర్లు 6 ఓవర్లు ముగిసేసరికి 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో స్కోరును 51 పరుగులకు చేర్చారు. ఆ తర్వాత చమీరా ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, స్టార్క్ చక్కటి బంతితో పూరన్ (9)ను బౌల్డ్ చేశాడు. అనంతరం ముకేశ్ ఒకే ఓవర్లో సమద్ (2), మార్ష్ లను అవుట్ చేయడంతో లక్నో కష్టాలు పెరిగాయి. 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయాక పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. అయితే ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన బదోని కాస్త ప్రభావం చూపించాడు. ముకేశ్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. వరుసగా వికెట్లు పడుతున్నా... సమద్, మిల్లర్ (14 నాటౌట్), బదోని తర్వాత ఇన్నింగ్స్‌లో మరో రెండు బంతులు ఉండగా ఏడో స్థానంలో రిషభ్ పంత్ (0) బ్యాటింగ్‌కు రావడం ఆశ్చర్యం కలిగించింది. టాస్ సమయంలో కుడి చేతికి కట్టుతో కనిపించిన పంత్ సమస్యేమీ లేదని చెప్పాడు. కీలక భాగస్వామ్యం... శార్దుల్ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో 15 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ ఛేదన మొదలైంది. కరుణ్ నాయర్ (15) తొందరగానే అవుటైనా... పొరేల్, రాహుల్ కలిసి చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించడంతో పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు సాధించింది. రవి బిష్ణోయ్ ఓవర్లో 2 సిక్స్‌లతో 16 పరుగులు రాబట్టి ఢిల్లీ ధాటిని పెంచింది.33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పొరేల్ వెనుదిరిగాడు. పొరేల్, రాహుల్ రెండో వికెట్‌కు 49 బంతుల్లో 69 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత రాహుల్, అక్షర్ కలిసి సునాయాసంగా జట్టును గెలుపు దిశగా నడిపించారు. రాహుల్, అక్షర్ మూడో వికెట్‌కు 36 బంతుల్లో అభేద్యంగా 56 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) స్టబ్స్ (బి) చమీరా 52; మార్ష్(బి) ముకేశ్ 45; పూరన్ (బి) స్టార్క్ 9; సమద్ (సి) అండ్ (బి) ముకేశ్ 2; మిల్లర్ (నాటౌట్) 14; బదోని (బి) ముకేశ్ 36; పంత్ (బి) ముకేశ్ 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–87, 2–99, 3–107, 4–110, 5–159, 6–159. బౌలింగ్: అక్షర్ 4–0–29–0, స్టార్క్ 4–0–25–1, ముకేశ్ 4–0–33–4, చమీరా 3–0–25–1, విప్రాజ్ 1–0–14–0, కుల్దీప్ 4–0–33–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) మిల్లర్ (బి) మార్క్రమ్ 51; కరుణ్ నాయర్ (బి) మార్క్రమ్ 15; రాహుల్ (నాటౌట్) 57; అక్షర్ (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–36, 2–105. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 2–0–28–0, దిగ్వేశ్ రాఠీ 4–0–24–0, ప్రిన్స్ 2.5–0–23–0, మార్క్రమ్ 3–0–30–2, అవేశ్ ఖాన్ 3–0–19–0, రవి బిష్ణోయ్ 3–0–36–0. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ xముంబై వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 5000 పరుగుల మైలు రాయిని అందుకున్న క్రికెటర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. కేవలం 130 ఇన్నింగ్స్‌లలోనే కేఎల్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(135) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో వార్నర్ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఐదు వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఐదో క్రికెటర్‌గా రాహుల్ నిలిచాడు. రాహుల్‌కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నోపై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. -
చెలరేగిన కేఎల్ రాహుల్.. లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగితా లక్నో బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.మార్క్రమ్ హాఫ్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం అందించినప్పటికి, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమకావడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.లక్నో బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా..మిచెల్ మార్ష్(45), ఆయూష్ బదోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీరా తలా వికెట్ సాధించారు. -
IPL 2025 LSG vs DC: లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
IPL 2025 LSG vs DC Live Updates: ఐపీఎల్-2025లో ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి.లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయంఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఐడైన్ మార్క్రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగితా లక్నో బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్(51) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ బౌలింగ్‌లో పోరెల్ ఔటయ్యాడు. ఢిల్లీ 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(40), అక్షర్ పటేల్(17) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ160 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(50), రాహుల్(28) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..కరుణ్ నాయర్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన నాయర్.. మార్క్రమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 3.4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 36/1నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నోఎక్నా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా..మిచెల్ మార్ష్(45), ఆయూష్ బదోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీరా తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు లక్నో స్కోర్: 130/414వ ఓవర్లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో తొలి బంతికి అబ్దుల్ సమద్ ఔట్ కాగా.. ఆఖరి బంతికి మిచెల్ మార్ష్(45) క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో మిల్లర్(11), బదోని(10) పరుగులతో ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్నికోలస్ పూరన్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన పూరన్.. స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.లక్నో తొలి వికెట్ డౌన్..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన దుష్మాంత చమీరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు లక్నో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది.మార్క్రమ్ ఫిప్టీ..లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మార్క్రమ్, మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్(32), మార్క్రమ్(50) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న లక్నో.. మూడు ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో మర్క్రమ్(13), మిచెల్ మార్ష్(6) ఉన్నారు.ఐపీఎల్-2025లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. సెకెండ్ రౌండ్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓ మార్పుతో బరిలోకి దిగింది. మోహిత్ శర్మ స్దానంలో దుష్మాంత చమీరా తుది జట్టులో వచ్చాడు. లక్నో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ -
ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏప్రిల్ 19న జైపూర్ వేదికగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయినట్లు రాజస్తాన్ క్రికెట్ సంఘం అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో రాజస్తాన్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిందంటూ బిహానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం స్పందించింది. తమపై చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తమని రాయల్స్ ఫ్రాంచైజీ సీనియర్ అధికారి దీప్ రాయ్ ఖండించారు."అడ్ హాక్ కమిటీ కన్వీనర్ చేసిన అన్ని ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహిరంగంగా చేసే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు తప్పుదారి పట్టించడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్, రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (RMPL), రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, బీసీసీఐ ఖ్యాతి, విశ్వసనీయతకు తీవ్ర నష్టం కలిగించాయి. అవి క్రికెట్ సమగ్రతను కూడా దెబ్బతీశాయి" అని రాయల్స్ ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రాయల్స్ యాజమాన్యం.. బిహానీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి, క్రీడా కార్యదర్శికి లేఖ రాశారు.అసలేమి జరిగిందంటే?లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ అనుహ్యంగా రెండు పరుగులతో తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 180 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగల్గింది. ఆఖరి ఓవర్లో తమ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా రాజస్తాన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.చదవండి: ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఆరోపణలు -
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఆరోపణలు
ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం కలకలం రేపుతుంది. ఏప్రిల్ 19న రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) తాత్కాలిక కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించాడు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైందని ఆయన అన్నాడు.ఈ మ్యాచ్‌పై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు నుంచి రాయల్స్ కదలికలపై అనుమానాలు ఉన్నాయని తెలిపాడు. అంతకుముందు రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్‌పై కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా రాయల్స్ గెలిచి ఉండాల్సిందని అన్నాడు. రాయల్స్ యాజమాన్యం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను పూర్తి పక్కకు పెట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని తెలిపాడు.2013 సీజన్లో రాయల్స్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడటంతో 2016, 2017 సీజన్లలో రాయల్స్‌పై నిషేధం విధించారన్న విషయాన్ని గుర్తు చేశాడు. అప్పట్లో రాయల్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండు సీజన్ల నిషేధం విధించారు.జైదీప్ ఆరోపణలు ఎలా ఉన్నా, ఏప్రిల్ 19న జరిగిన రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌పై సగటు క్రికెట్ అభిమానికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సులువగా గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో రాయల్స్ ఓడిపోవడాన్ని చాలా మంది ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. ఆ మ్యాచ్‌లో రాయల్స్ గెలుపుకు చివరి ఓవర్లో కేవలం 9 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో వికెట్లు కూడా ఉన్నాయి. క్రీజ్‌లో విధ్వంసకర ఆటగాళ్లు ధృవ్ జురెల్, హెట్‌మైర్ ఉన్నారు. అయినా రాయల్స్ చివరి ఓవర్లో 6 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ చివరి ఓవర్‌ను ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడో బంతికి డేంజరెస్ హెట్మైర్ను ఔట్ చేసి లక్నోకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఇక్కడ ఆవేశ్ ప్రతిభను ముమ్మాటికి ప్రశంసించాల్సిందే. 18వ ఓవర్లోనూ అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్‌ను ఔట్ చేశాడు. జనాలు ఆవేశ్ టాలెంట్‌ను ప్రశంశిస్తూనే, ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనుకుంటున్నారు. -
2 పరుగుల తేడాతో గెలుపొందిన లక్నో సూపర్ జెయింట్స్
-
లక్నో ‘సూపర్’ విక్టరీ
జైపూర్: ఆఖరి ఓవర్... ఆఖరి బంతిదాకా ఇరు జట్లతోనూ దోబూచులాడిన విజయం చివరకు లక్నో సూపర్‌జెయింట్స్‌ను వరించింది. రాజస్తాన్ రాయల్స్ 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుతం చేశాడు. 6 పరుగులే ఇచ్చి ప్రమాదకర హిట్టర్ హెట్మైర్ను అవుట్ చేశాడు. దీంతో ఉత్కంఠ రేపిన పోరులో సూపర్‌జెయింట్స్ 2 పరుగులతో అనూహ్యంగా రాయల్స్‌పై గెలిచింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మార్క్రమ్ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుశ్ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, ఆఖరి ఓవర్లో సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్స్‌లు) చెలరేగాడు. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి ఓడింది. యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. మార్క్రమ్, బదోని ఫిఫ్టీ–ఫిఫ్టీ పవర్‌ప్లే ముగియక ముందే హిట్టర్లు మార్ష్ (4), పూరన్ (11), పవర్ ప్లే తర్వాత కెపె్టన్ రిషభ్ పంత్ (3) అవుటవడంతో లక్నో 54 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్ మార్క్రమ్, ఆయుశ్ బదోని సూపర్‌జెయింట్స్ స్కోరు భారాన్ని మోశారు. ఇద్దరు వేగంగా ఆడటంతో జట్టు పరుగుల జోరందుకుంది. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న మార్క్రమ్ నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించాక అవుటయ్యాడు. కాసేపటికి బదోని 33 బంతుల్లో బదోని అర్ధ సెంచరీ చేసిన వెంటనే నిష్క్రమించాడు. సమద్ 4 సిక్సర్లతో... 19 ఓవర్లలో 153/5 వద్ద ఓ మోస్తరు స్కోరు చేసిన లక్నో శిబిరంలో ఆఖరి ఓవర్ ఆనందం నింపింది. సందీప్ వేసిన 20వ ఓవర్లో మిల్లర్ (7 నాటౌట్) సింగిల్ తీసివ్వగా తర్వాత సమద్ 6, 6, 2, 6, 6లతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో సూపర్‌జెయింట్స్ స్కోరు 180కి చేరింది. జైస్వాల్ శ్రమించినా... యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కొత్త కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఇద్దరి ఓపెనర్ల వేగం రాజస్తాన్‌ను లక్ష్యం వైపు నడిపించింది. తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించాక వైభవ్ ఆటను మార్క్రమ్ ముగించగా, నితీశ్ రాణా (8)ను శార్దుల్ పెవిలియన్ చేర్చాడు.తర్వాత జైస్వాల్‌కు జతయిన కెపె్టన్ రియాన్ పరాగ్ రన్‌రేట్ తగ్గకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన జైస్వాల్ దూకుడు పెంచాడు. లక్ష్యానికి చేరువైన దశలో 18వ ఓవర్లో జైస్వాల్, పరాగ్‌లను అవుట్ చేసిన అవేశ్...ఆఖరి ఓవర్లో హెట్‌మైర్ (12)కు చెక్ పెట్టాడు.స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) హెట్‌మైర్ (బి) ఆర్చర్ 4; మార్క్రమ్ (సి) పరాగ్ (బి) హసరంగ 66; నికోలస్ పూరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 11; రిషభ్ పంత్ (సి) జురేల్ (బి) హసరంగ 3; ఆయుశ్ బదోని (సి) దూబే (బి) తుషార్ 50; మిల్లర్ నాటౌట్ 7; సమద్ నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–16, 2–46, 3–54, 4–130, 5–143. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–32–1, తీక్షణ 4–0–32–0, సందీప్ శర్మ 4–0–55–1, తుషార్ దేశ్‌పాండే 4–0–26–1,హసరంగ 4–0–31–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) అవేశ్ 74; వైభవ్ (స్టంప్డ్) పంత్ (బి) మార్క్రమ్ 34; నితీశ్ రాణా (సి) అవేశ్ (బి) శార్దుల్ 8; రియాన్ పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 39; జురేల్ నాటౌట్ 6; హెట్‌మైర్ (సి) శార్దుల్ (బి) అవేశ్ 12; శుభమ్ నాటౌట్ 3 ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–85, 2–94, 3–156, 4–161, 5–175. బౌలింగ్: శార్దుల్ 3–0–34–1, అవేశ్ ఖాన్ 4–0–37–3, దిగ్వేశ్ రాఠి 4–0–30–0, మార్క్రమ్ 2–0–18–1, ప్రిన్స్ 4–0–39–0, రవి బిష్ణోయ్ 3–0–19–0. 14 ఏళ్ల 23 రోజుల వయసులో... ఐపీఎల్ వేలం సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. లీగ్ బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ తన తొలి బంతికే సిక్స్ బాది సంచలన రీతిలో మొదలు పెట్టాడు. ఎక్స్ట్రా కవర్ దిశగా ఆ షాట్‌ను అద్భుతంగా ఆడిన అతని సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చెలరేగిపోతున్న దశలో అనూహ్యంగా స్టంపౌట్ కావడంతో వైభవ్ తట్టుకోలేకపోయినట్లున్నాడు. కన్నీళ్లతో అతను నిష్క్రమించాడు! బిహార్‌కు చెందిన ఈ ప్రతిభాశాలి ఇప్పటికే భారత అండర్–19 జట్టు తరఫున ఆడటంతో పాటు 5 రంజీ మ్యాచ్‌లలో కూడా బరిలోకి దిగాడు. వేలంలో వైభవ్‌ను రాజస్తాన్ రూ.1.10 కోట్లకు తీసుకుంది. ఐపీఎల్లో నేడుపంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్ ,మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ముంబై X చెన్నై వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో రాయల్స్ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో యశస్వి జైస్వాల్ (74), వైభవ్ సూర్యవంశీ (34), రియాన్ పరాగ్ (39) అద్భుతంగా ఆడినప్పటికీ.. రాయల్స్ ఒత్తిడికి చిత్తై గెలుపు వాకిట బోర్లా పడింది. రాయల్స్ ఈ సీజన్లో ఇలా ఓడటం ఇది రెండో సారి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ రాయల్స్ గెలుస్తుందనుకుంటే సూపర్ వరకు వెళ్లి ఓటమిపాలైంది. ఆవేశ్ ఖాన్ (4-0-37-3) ఒంటిచేత్తో రాయల్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. -
RR VS LSG: ఐపీఎల్లో సంచలనం
ఐపీఎల్లో సంచలనం నమోదైంది. ఓ కుర్రాడు కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అరంగేట్రం చేయనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సూర్యవంశీకి ముందు ఈ రికార్డు ప్రయాస్ రే బర్మన్ పేరిట ఉండేది. బర్మన్ 2019 సీజన్లో ఆర్సీబీ తరఫున 16 ఏళ్ల 157 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. బర్మన్ తర్వాత ఐపీఎల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడి రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ పేరిట ఉంది. ముజీబ్ 2018 సీజన్లో 17 ఏళ్ల 11 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.అత్యంత పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్, 2019 17వ 11వ తేదీ - ముజీబ్ ఉర్ రెహమాన్, 2018 17y 152d - రియాన్ పరాగ్, 2019 17y 179d - ప్రదీప్ సాంగ్వాన్, 2008లక్నో, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా రాయల్స్ కెప్టెన్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ మ్యాచ్‌లో లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆకాశ్‌దీప్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. రాయల్స్ తరఫున సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు.తుది జట్లు..రాజస్థాన్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికెట్‌కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్ -
IPL 2025: రాయల్స్‌పై లక్నో విజయం
రాయల్స్‌పై లక్నో విజయంఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో రాయల్స్ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్స్17.6వ ఓవర్- ఆవేశ్ ఖాన్ ఒకే ఓవర్లో జైస్వాల్, రియాన్ పరాగ్‌ను (39) ఔట్ చేశాడు. రాయల్స్ గెలవాలంటే 12 బంతుల్లో మరో 20 పరుగులు చేయాలి.మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్17.1వ ఓవర్- 52 బంతుల్లో 74 పరుగులు చేసిన జైస్వాల్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్9.6వ ఓవర్- 94 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్ (52), రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్8.4వ ఓవర్- మార్క్రమ్ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) స్టంపౌటయ్యాడు.ధాటిగా ఆడుతున్న రాయల్స్ ఓపెనర్లు181 పరుగుల ఛేదనలో రాయల్స్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. యశస్వి జైస్వాల్ 24 బంతుల్లో 40.. వైభవ్ సూర్యవంశీ 12 బంతుల్లో 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 6 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 61/0గా ఉంది. తొలి మ్యాచ్‌లోనే దంచికొడుతున్న వైభవ్ సూర్యవంశీరాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే దంచి కొడుతున్నాడు. 7 బంతుల్లోనే ఫోర్, 2 సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. సూర్యవంశీకి జతగా వచ్చిన యశస్వి జైస్వాల్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) కూడా ధాటిగా ఆడుతున్నాడు. ఫలితంగా రాయల్స్ 3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో సమద్ విధ్వంసం.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన లక్నోసందీప్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో అబ్దుల్ సమద్ పేట్రేగిపోయాడు. నాలుగు సిక్సర్లు సహా 27 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ దక్కించుకున్నారు. హాఫ్ సెంచరీ పూర్తి అయిన వెంటనే ఔటైన బదోని17.3వ ఓవర్- తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆయుశ్ బదోని ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. బదోని 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 18 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 146/5గా ఉంది. మిల్లర్ (4), సమద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో15.5వ ఓవర్- 130 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్‌లో రియన్ పరాగ్ సూపర్ క్యాచ్ పట్టడంతో మార్క్రమ్ (66) ఔటయ్యాడు. బదోనికి (46) జతగా మిల్లర్ (3) క్రీజ్‌లోకి వచ్చాడు. 17 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 139/4గా ఉంది.మార్క్రమ్ ఫిఫ్టి.. 100 దాటిన లక్నో స్కోర్10.3వ ఓవర్- సందీప్ శర్మ బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి మార్క్రమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 12 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 105/3గా ఉంది. మార్క్రమ్ 60, బదోని 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పంత్ మరోసారి..!7.4వ ఓవర్- ప్రస్తుత సీజన్లో పంత్ (9 బంతుల్లో 3) మరోసారి విఫలమయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం లక్నో స్కోర్ 54/3గా ఉంది. మార్క్రమ్ (34), బదోని క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. డేంజరస్ పూరన్ ఔట్5.2వ ఓవర్- 46 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో ఇన్ ఫామ్ బ్యాటర్ నికోలస్ పూరన్ (11) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. మార్ష్ ఔట్2.2వ ఓవర్- టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (4) ఔటయ్యాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా రాయల్స్ కెప్టెన్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆకాశ్‌దీప్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. రాయల్స్ తరఫున సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అతడి వయసు 14 ఏళ్ల 23 రోజులు.తుది జట్లు..రాజస్థాన్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికెట్‌కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్ -
పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్త.. తండ్రైన జహీర్ ఖాన్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యాడు. అతడి భార్య, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సాగరిక- జహీర్ దంపతులు బుధవారం సోషల్ మీడియా వెల్లడించారు.చిన్నారి పేరేమిటంటేఈ మేరకు ‘‘ఆ దేవుడి దివ్యాశీసులతో.. మా వెలకట్టలేని సంతోషానికి, చిన్నారి కుమారుడికి స్వాగతం పలుకుతున్నాం’’ అని పేర్కొన్నారు. తమ కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్ చేయగా.. జహీర్- సాగరికలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి తదితరులు లవ్ సింబల్‌తో విషెస్ తెలియజేశారు.పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్తకాగా కొన్నాళ్లపాటు సాగరికతో ప్రేమలో మునిగితేలిన జహీర్ ఖాన్.. 2017లో ఇరు కుటుంబాల సమ్మతంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన గత ప్రేమ (ఈశా శర్వాణి) తాలుకు చేదు జ్ఞాపకాలను చెరిపి.. జీవితంలో నవ వసంతం తెచ్చిన సాగరికతో ఎనిమిదేళ్లుగా కలిసి అడుగులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు తమ ప్రేమకు గుర్తుగా కుమారుడి రాకతో ఈ జంట కుటుంబం పరిపూర్ణమైంది. View this post on Instagram A post shared by Sagarika Z Ghatge (@sagarikaghatge)దిగ్గజ పేసర్‌గా నీరాజనాలుమహారాష్ట్రకు చెందిన 46 ఏళ్ల జహీర్ ఖాన్.. లెఫ్టార్మ్ మీడియం పేసర్. 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పద్నాలుగేళ్ల కెరీర్లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20లలో 17 వికెట్లు కూల్చి.. దిగ్గజ పేసర్‌గా వెలుగొందాడు. లక్నో మెంటార్‌గాఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఐపీఎల్లో కొనసాగిన జహీర్ ఖాన్.. క్యాష్ రిచ్ లీగ్‌లో 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం.. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో లక్నో ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని నాలుగు గెలిచింది. చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’కెప్టెన్‌గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయి -
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
ఐపీఎల్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మరో చారిత్రక మైలురాయిని అందుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 200 డిస్మిసల్స్‌ను (క్యాచ్‌లు లేదా స్టంపింగ్స్) పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా (ఫీల్డర్ లేదా వికెట్ కీపర్) చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 14) లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆయుశ్ బదోనిని స్టంపౌట్ (రవీంద్ర జడేజా బౌలింగ్‌లో) చేయడంతో ఈ ఘనత సాధించాడు. 𝙀𝙖𝙨𝙞𝙡𝙮 𝘿𝙤𝙣𝙚 😎Dismissal No.2⃣0⃣0⃣ for MS Dhoni Wicket No.2⃣ for Ravindra Jadeja tonight 🎥 @ChennaiIPL fans have plenty to celebrate here 💛Updates ▶ https://t.co/jHrifBkT14 #TATAIPL | #LSGvCSK | @msdhoni | @imjadeja pic.twitter.com/UHwLwpJ4XK— IndianPremierLeague (@IPL) April 14, 2025ఈ మ్యాచ్‌లో ధోని మరో ఇద్దరిని ఔట్ చేయడంలో కూడా భాగమయ్యాడు. పతిరణ బౌలింగ్‌లో వైడ్‌బాల్‌ను కలెక్ట్ చేసుకుని అద్భుతమైన డైరెక్ట్ త్రోతో (నాన్ స్ట్రయికర్ ఎండ్) అబ్దుల్ సమద్‌ను రనౌట్ చేసి.. ఆ మరుసటి బంతికే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. పంత్ క్యాచ్‌తో ఐపీఎల్లో ధోని డిస్మిసల్స్ సంఖ్య 201కి చేరింది. ధోని తన 270వ ఇన్నింగ్స్‌లో డిస్మిసల్స్ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.Thala doing it all tonight, in his own style😎What a precise underhand throw that was by Dhoni 🔥#LSGvsCSK #LSGvCSK #CSKvLSG pic.twitter.com/kIuPayt8t4— Aditya Singh Rawat (@Catslayer_999) April 14, 2025ఐపీఎల్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన ఆటగాళ్లు (ఫీల్డర్ లేదా వికెట్ కీపర్)201* - ఎంఎస్ ధోని (155 క్యాచ్‌లు, 46 స్టంపింగ్‌లు)182 - దినేష్ కార్తీక్126 - ఏబీ డివిలియర్స్124 - రాబిన్ ఉతప్ప118 - వృద్ధిమాన్ సాహా116 - విరాట్ కోహ్లీలక్నో మ్యాచ్‌లో తొలుత అద్భుతమైన వికెట్‌కీపింగ్‌తో అదరగొట్టిన ధోని ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. 11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేసి సీఎస్కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా (3-0-24-2), పతిరణ (4-0-45-2), నూర్ అహ్మద్ (4-0-13-0), ఖలీల్ అహ్మద్ (4-0-38-1), అన్షుల్ కంబోజ్ (3-0-20-1) రాణించడంతో నామమాత్రపు స్కోర్‌కే (166/7) పరిమితమైంది.లక్నో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్ (8), మార్క్రమ్ (6) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.అనంతరం 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే.. తొలి 15 ఓవర్ల వరకు (115/5) పరాజయం దిశగా సాగింది. ధోని రాకతో సీఎస్కేలో గెలుపు జోష్ వచ్చింది. ధోని వచ్చీ రాగానే ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అప్పటివరకు నిదానంగా ఆడిన శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధోని అండతో గేర్ మార్చాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 3 బంతులు మిగిలుండగానే సీఎస్కేను విజయతీరాలకు చేర్చారు.సీఎస్కే ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు షేక్ రషీద్ (27), రచిన్ రవీంద్ర (37) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రాహుల్ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7), విజయ్ శంకర్ (9) నిరాశపరిచారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ సింగ్ రాఠీ (4-0-23-1), రవి బిష్ణోయ్ (3-0-18-2), మార్క్రమ్ (4-0-25-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. శార్దూల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్, ఆవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. -
కొంప ముంచిన పంత్ నిర్ణయం!.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..
ఐపీఎల్-2025 (IPL 2025)లో వరుస విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే, డెత్ ఓవర్లలో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీసుకున్న నిర్ణయాలే లక్నో ఓటమికి ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి.49 బంతుల్లో 63 రన్స్లక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై (LSG vs CSK)తో తలపడ్డ పంత్ సేన.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఐడెన్ మార్క్రమ్ (6) విఫలం కాగా.. మిచెల్ మార్ష్ (30) ఫర్వాలేదనిపించాడు. అయితే, ఇన్ఫామ్ బ్యాటర్ నికోలస్ పూరన్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో నాలుగో స్థానంలో ఆడిన పంత్ 49 బంతుల్లో 63 రన్స్ చేయగా.. ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) అతడికి సహకారం అందించారు. ఫలితంగా లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.చెన్నై బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ (నాలుగు ఓవర్లలో 13 రన్స్) పొదుపుగా బౌలింగ్ చేశాడు. పేసర్లలో మతీశ పతిరణ రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు చెన్నై తడబడింది.శివం దూబేతో కలిసి ధోనిఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఓ మోస్తరుగా ఆడగా.. రాహుల్ త్రిపాఠి (9), రవీంద్ర జడేజా (7) పూర్తిగా విఫలమయ్యారు. వీరిద్దరు లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఇలాంటి తరుణంలో శివం దూబేతో కలిసి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.రవి బిష్ణోయిని కాదని.. ఈ క్రమంలో ఆఖరి నాలుగు ఓవర్లలో చెన్నై విజయానికి 44 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఒత్తిడిలో కూరుకుపోయిన లక్నో సారథి పంత్ బౌలింగ్ చాయిస్ విషయంలో తప్పటడుగు వేశాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసిన రవి బిష్ణోయిని కాదని.. పేస్ ద్వయం ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్‌ను నమ్ముకున్నాడు.ఇక దూబే (37 బంతుల్లో 43), ధోని (11 బంతుల్లో 26) వారి బౌలింగ్‌లో పరుగులు పిండుకుని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే చెన్నైని విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయి పంత్ నిర్ణయంపై స్పందించాడు.నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..‘‘నేను పంత్‌తో ఏమీ మాట్లాడలేదు. అయితే, వికెట్ స్వభావాన్ని బట్టి నన్ను పిలుస్తాడేమోనని రెండు, మూడు సార్లు అతడికి దగ్గరగా వెళ్లాను. కానీ తన ప్రణాళికలు వేరేగా ఉన్నాయి. కాబట్టి నన్ను పట్టించుకోలేదేమో!ఇలాంటి కీలక సమయంలో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా తనకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి. మా కంటే అతడే గొప్పగా పరిస్థితులను అంచనా వేయగలడు. అందుకే తన నిర్ణయం సరైందనే భావనతో ముందుకు వెళ్లి ఉంటాడు.ఏదైమైనా మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నేను, రాఠి, మార్క్రమ్ ఉన్నాం. కాబట్టి అదనపు స్పిన్నర్ అవసరం లేదు. ఇక మహీ భాయ్ గురించి చెప్పేదేముంది?!.. బంతి తన ఆధీనంలో ఉందంటే దానిని బౌండరీకి తరలించడమే తరువాయి’’ అని రవి బిష్ణోయి పరోక్షంగా పంత్ నిర్ణయాన్ని విమర్శించాడు.కాగా లక్నో బౌలర్లలో స్పిన్నర్లు రవి బిష్ణోయి మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దిగ్వేశ్ సింగ్ రాఠీ, మార్క్రమ్ ఒక్కో వికెట్ తీయగా.. పేసర్లలో ఆవేశ్ ఖాన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.చదవండి: MS Dhoni On POM Award: ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది The IMPACT player does it with MAX IMPACT 🤩Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025 -
హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలు
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇందుకు తగ్గట్టుగానే క్రికెటర్ల బ్రాండింగ్ మార్కెట్ అధికంగా ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని వారి వ్యక్తిగత సంపాదన కూడా పెరుగుతోంది. దానికితోడు కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల బ్రాండ్ ప్రమోషన్ల కోసం భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు. దాంతో చాలామంది క్రికెటర్లు దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే చందంతో వయసురీత్యా ఎక్కువ రోజులు క్రికెట్లో కొనసాగకపోవచ్చనే భావన, భవిష్యత్తుపై భరోసాను దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తులను కూడబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీమ్ లక్నో సుపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలతోపాటు తాను ఎండార్స్ చేస్తున్న బ్రాండ్ల సంగతుల గురించి తెలుసుకుందాం.భారత మోస్ట్ స్టైలిష్, నిలకడైన క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా ఆకట్టుకునే ఆర్థిక పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. 2025 నాటికి ఆయన సందప నికర విలువ రూ.100 కోట్లు (సుమారు 12 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ వేతనాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యక్తిగత పెట్టుబడులు సహా పలు వనరుల నుంచి ఆయనకు సంపద సమకూరుతుంది.రాహుల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో గ్రేడ్-ఏ ఒప్పందంలో భాగంగా సంవత్సరానికి రూ.5 కోట్లు వరకు సంపాదిస్తున్నాడు.గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్ ప్రతి సీజన్‌కు సరాసరి రూ.16 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ తరఫున ఆడుతున్నారు.పూమా, రెడ్ బుల్, భారత్ పే, బోట్, టాటా నెక్సాన్, బియర్డో, క్యూర్.ఫిట్, నుమి.. వంటి ప్రధాన బ్రాండ్లను రాహుల్ ప్రమోషన్ చేస్తున్నారు. ఇది అతని ఆదాయానికి గణనీయంగా దోహదం చేస్తుంది.మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ మోడళ్లతో సహా హై-ఎండ్ కార్ల సేకరణతో పాటు బెంగళూరులో ఆయనకు లగ్జరీ ప్రాపర్టీలు ఉన్నాయి.ముంబైలోని కార్టర్ రోడ్లో సుమారు రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. రాహుల్-అతియా శెట్టి దంపతులకు బెంగళూరులో విలాసవంతమైన నివాసం కూడా ఉంది.ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..మెటామాన్ అనే పెర్ఫ్యూమ్స్, జువెలరీ బ్రాండ్‌కు రాహుల్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు. అందులో తాను పెట్టుబడి కూడా పెట్టారు.అర్బన్ ఫ్యాషన్ బ్రాండ్ గల్లీ లైవ్ ఫాస్ట్‌కు రాహుల్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.బోల్డ్ ఫిట్ అనే అథ్లెట్ దుస్తుల తయారీ కంపెనీలో రాహుల్ ఇన్వెస్ట్ చేశారు.రాహుల్ నిలకడైన గేమింగ్ ప్రదర్శన, నాయకత్వ బాధ్యతలు, బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల తన నికర విలువ క్రమంగా అధికమవుతోంది. భారత్‌లో క్రికెట్‌కు కమర్షియల్ అప్పీల్ పెరగడంతో రాబోయే కాలంలో తన సంపాదన మరింత పెరుగుతుందని తెలుస్తుంది. -
ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది: ధోని
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2025 (IPL 2025)లో గెలుపు బాట పట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs CSK)పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. తమ పరాజయ పరంపరకు బ్రేక్ వేసింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సీజన్లో రెండో గెలుపు నమోదు చేసింది.రిషభ్ పంత్ తొలిసారిలక్నోలోని ఏకనా స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు రాణించడంతో లక్నోను 166 పరుగులకు కట్టడి చేయగలిగింది. లక్నో ఆటగాళ్లలో ఓపెనర్ మిచెల్ మార్ష్ (30), ఆయుశ్ బదోని (22), అబ్దుల్ సమద్ (20) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సీజన్లో తొలిసారి బ్యాట్ ఝులిపించాడు. 49 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. ఇక సీఎస్కే బౌలర్లలో మతీశ పతిరణ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.పొదుపుగా బౌలింగ్ చేసిన నూర్మిగతా వాళ్లలో నూర్ అహ్మద్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. ఇక లక్నో విధించిన లక్ష్యాన్ని ధోని సేన 19.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు షేక్ రషీద్ (19 బంతుల్లో 27), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించగా.. శివం దూబే (37 బంతుల్లో 43 నాటౌట్) నిలకడగా ఆడాడు. ఆఖర్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి దూబేతో కలిసి జట్టు గెలుపును ఖరారు చేశాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తూ వివిధ కారణాల వల్ల మేము ఆరంభ మ్యాచ్‌లలో విఫలమయ్యాం. సొంత మైదానం చెపాక్‌లో ఓటములు చవిచూశాం.ఘనమైన భవిష్యత్తుఇలాంటి సమయంలో ఇతర వేదికపై గెలవడం కాస్త ఊరట కలిగించే అంశం. జట్టులో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపిన విజయం ఇది. పవర్ ప్లేలో మేము ఈసారి కూడా ఇబ్బందిపడ్డాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం.అయినప్పటికీ తిరిగి పుంజుకున్నాం. ఈరోజు మా బౌలర్లు, బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. షేక్ రషీద్ మాతో చాన్నాళ్లుగా ప్రయాణం చేస్తున్నాడు. నెట్స్‌లో స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటున్నాడు. ఈరోజు అతడు మ్యాచ్ ఆడాడు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో గొప్పగా రాణించగల సత్తా అతడికి ఉంది.ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సిందిఇక ఈరోజైతే నాకు.. ‘నాకు ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు?’ అని అనిపించింది. నిజానికి నూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు కదా!’’ అని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను నూర్ అహ్మద్‌కు ఇచ్చి ఉంటే బాగుండేదని ధోని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడింది. తాజాగా లక్నోపై గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివర్లోనే కొనసాగుతోంది.ఐపీఎల్ 2025: లక్నో వర్సెస్ చెన్నై👉లక్నో స్కోరు: 166/7 (20)👉చెన్నై స్కోరు: 168/5 (19.3)👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో లక్నోపై చెన్నై గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహేంద్ర సింగ్ ధోని.చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు.. The IMPACT player does it with MAX IMPACT 🤩Shivam Dube 🤝 MS Dhoni with a match-winning partnership 💛@ChennaiIPL are 🔙 to winning ways 😎Scorecard ▶ https://t.co/jHrifBlqQC #TATAIPL | #LSGvCSK pic.twitter.com/AI2hJkT9Dt— IndianPremierLeague (@IPL) April 14, 2025 -
CSK Vs LSG: చెన్నై గెలిచిందోచ్...
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు కాస్త ఊరట... వరుసగా ఐదు పరాజయాల తర్వాత పూర్తిగా ఆట మరచినట్లు కనిపించిన జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి లక్నోను ఆ జట్టు వేదికపైనే స్పిన్‌తో కట్టడి చేసిన సీఎస్కే ఆ తర్వాత మరో మూడు బంతులు మిగిలి ఉండగా లక్ష్యం చేరింది. బౌలింగ్‌లో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించగా, బ్యాటింగ్‌లో శివమ్ దూబే రాణించాడు. అన్నింటికి మించి మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగా క్రీజ్‌లోకి వచ్చిన ధోని తడబాటు లేకుండా, దూకుడుగా ఆడి జట్టుకు అవసరమైన ‘విలువైన’ పరుగులు సాధించడం మరో సానుకూలాశం. మరోవైపు ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీద కనిపించిన లక్నో సమష్టి వైఫల్యంతో ఓటమిని ఆహా్వనించింది. లక్నో: ఐపీఎల్లో ఎట్టకేలకు మూడు వారాల విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) గెలుపు రుచి చూసింది. సోమవారం జరిగిన పోరులో సీఎస్కే 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెపె్టన్ రిషభ్ పంత్ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, మిచెల్ మార్‡్ష (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. శివమ్ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలుపు దిశగా నడిపించగా, ఎమ్మెస్ ధోని (11 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 28 బంతుల్లో అభేద్యంగా 57 పరుగులు జోడించారు. పంత్ హాఫ్ సెంచరీ... తొలి ఓవర్లోనే మార్క్రమ్ (6) అవుట్ కాగా, టోర్నీ ప్రస్తుత టాప్ స్కోరర్ నికోలస్ పూరన్ (8) కూడా విఫలం కావడంతో లక్నోకు సరైన ఆరంభం లభించలేదు. ఖలీల్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి మార్‡్ష జోరు ప్రదర్శించగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 80 స్ట్రయిక్‌రేట్‌తో 40 పరుగులే చేసిన పంత్ ఈ మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో మార్‡్షను జడేజా వెనక్కి పంపగా... ఒవర్టన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన ఆయుశ్ బదోని (17 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా జడేజా బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అప్పటి వరకు మెరుగ్గానే ఆడిన పంత్‌ను చెన్నై స్పిన్నర్లు పూర్తిగా కట్టిపడేశారు. ముఖ్యంగా నూర్ బౌలింగ్‌లో 15 బంతులు ఆడిన పంత్ 10 బంతుల్లో సింగిల్ కూడా తీయలేకపోయాడు! అయితే ఆ తర్వాత పతిరణ ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో 42 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. చివరి 3 ఓవర్లలో లక్నో 45 పరుగులు సాధించింది. కీలక భాగస్వామ్యం... 2023 సీజన్ నుంచి చెన్నై జట్టుతో ఉన్న ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ (19 బంతుల్లో 27; 6 ఫోర్లు)కు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. కొన్ని చక్కటి షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను, శార్దుల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టడం విశేషం. అయితే అవేశ్ ఓవర్లో భారీ షాట్ ఆడే క్రమంలో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్‌లో రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 37; 5 ఫోర్లు) కూడా వేగంగా ఆడటంతో పవర్‌ప్లేలో చెన్నై 59 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో జట్టు రచిన్, త్రిపాఠి (9), జడేజా (7), విజయ్‌శంకర్ (9) వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. విజయానికి 30 బంతుల్లో 56 పరుగులు కావాల్సిన స్థితిలో దూబే, ధోని జత కలిశారు. తాను ఆడిన తొలి బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్ బాది ధోని దూకుడు ప్రదర్శించడంలో ఒత్తిడి కాస్త తగ్గింది. చివరి 2 ఓవర్లలో 24 పరుగులు అవసరమయ్యాయి. శార్దుల్ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ సహా 19 పరుగులు రాబట్టి విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న చెన్నై... మరో మూడు బంతుల్లో లాంఛనం పూర్తి చేసింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) త్రిపాఠి (బి) అహ్మద్ 6; మార్‡్ష (బి) జడేజా 30; పూరన్ (ఎల్బీ) (బి) కంబోజ్ 8; పంత్ (సి) ధోని (బి) పతిరణ 63; బదోని (స్టంప్డ్) ధోని (బి) జడేజా 22; సమద్ (రనౌట్) 20; మిల్లర్ (నాటౌట్) 0; శార్దుల్ (సి) రషీద్ (బి) పతిరణ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–6, 2–23, 3–73, 4–105, 5–158, 6–158, 7–166. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–38–1, అన్షుల్ కంబోజ్ 3–0–20–1, ఒవర్టన్ 2–0–24–0, జడేజా 3–0–24–2, నూర్ అహ్మద్ 4–0–13–0, పతిరణ 4–0–45–2. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) పూరన్ (బి) అవేశ్ 27; రచిన్ (ఎల్బీ) (బి) మార్క్రమ్ 37; రాహుల్ త్రిపాఠి (సి అండ్ బి) రవి బిష్ణోయ్ 9; జడేజా (సి) మార్క్రమ్ (బి) రవి బిష్ణోయ్ 7; శివమ్ దూబే (నాటౌట్) 43; విజయ్‌శంకర్ (సి) అవేశ్ (బి) దిగ్వేశ్ రాఠీ 9; ధోని (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–52, 2–74, 3–76, 4–96, 5–111. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–56–0, ఆకాశ్‌దీప్ 1–0–13–0, దిగ్వేశ్ రాఠీ 4–0–23–1, అవేశ్ ఖాన్ 3.3–0–32–1, రవి బిష్ణోయ్ 3–0–18–2, మార్క్రమ్ 4–0–25–1. ఐపీఎల్లో నేడుపంజాబ్ X కోల్‌కతా వేదిక: ముల్లాన్‌పూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రఫ్పాడించిన ధోని.. చెన్నై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించాడు.ధోని కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా 167 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది. రచిన్ రవీంద్ర(37), షేక్ రషీద్(27) పరుగులతో రాణించారు.లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. దిగ్వేష్, మార్క్రమ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.49 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్ష్(30), బదోని(22) రాణించారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా,పతిరానా తలా రెండు వికెట్లు సాధించగా.. ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ ఒక్క వికెట్ పడగొట్టారు.చదవండి: IPL 2025: ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు.. -
IPL 2025: ధోని మెరుపులు.. లక్నోపై సీఎస్కే విజయం
LSG vs CSK Live Updates: సీఎస్కే ఘన విజయంఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించాడు. ధోని కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే(43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా 167 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో చేధించింది. 18 ఓవర్లకు స్కోర్: 143/518 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(26), ధోని(20) ఉన్నారు. 16 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 127/516 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో శివమ్ దూబే(19), ధోని(9) ఉన్నారు. సీఎస్కే విజయానికి 24 బంతుల్లో 44 పరుగులు కావాలి.సీఎస్కే నాలుగో వికెట్ డౌన్..జడేజా రూపంలో సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జడేజా.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.రవీంద్ర ఔట్..రచిన్ రవీంద్ర రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. మార్క్రమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.సీఎస్కే తొలి వికెట్ డౌన్..షేక్ రషీద్ రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన షేక్ రషీద్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర(25), రాహుల్ త్రిపాఠి(5) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న సీఎస్కే167 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో షేక్ రషీద్(22), రచిన్ రవీంద్ర (15) ఉన్నారు.రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే?ఎక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతులు ఎదుర్కొన్న పంత్.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్ష్(30), బదోని(22) రాణించారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా,పతిరానా తలా రెండు వికెట్లు సాధించగా.. ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ ఒక్క వికెట్ పడగొట్టారు.రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..రిషబ్ పంత్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. లక్నో వేదికగా సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. 55 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 18 ఓవర్లు ముగిసే సరికి లక్నో నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.లక్నో మూడో వికెట్ డౌన్..మిచెల్ మార్ష్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన మార్ష్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(29), బదోని(20) ఉన్నారు.లక్నో రెండో వికెట్ డౌన్..నికోలస్ పూరన్ రూపంలో లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన పూరన్.. కాంబోజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు 42 పరుగులు చేసింది. క్రీజులో పంత్(6), మార్ష్(22) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నో..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 6 పరుగులు చేసిన మార్క్రమ్.. ఖాలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది.ఐపీఎల్-2025లో ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు డెవాన్ కాన్వే, అశ్విన్ దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో షేక్ రషీద్, ఓవర్టన్ వచ్చారు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీచెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, MS ధోని(కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ -
IPL 2025: పంత్ టీమ్‌కు గుడ్ న్యూస్.. స్పీడ్ గన్ వచ్చేస్తున్నాడు
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్, యువ సంచలనం మయాంక్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. గాయం నుంచి కోలుకున్న మయాంక్.. మంగళవారం(ఏప్రిల్ 15) లక్నో జట్టులోకి చేరనున్నట్లు తెలుస్తోంది.బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (CoE) వైద్య బృందం మయాంక్‌కు ఆదివారం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించింది. అందులో యాదవ్ ఉత్తీరణత సాధించాడు. దీంతో అతడికి ఐపీఎల్లో ఆడేందుకు క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ మంజారు చేసింది. ఈ ఏడాది సీజన్లో లక్నో విజయాలు సాధిస్తున్నప్పటికి బౌలింగ్ మాత్రం అంతంత మాత్రమేగా ఉంది. ఇప్పుడు మయాంక్ తిరిగి రావడంతో లక్నో బౌలింగ్ విభాగం పటిష్టంగా మారనుంది. ఇక గతేడాది సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. తన అద్భుతమైన ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అయితే తరుచుగా గాయాల బారిన పడడంతో మయాంక్ ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన యాదవ్.. 7 వికెట్లు పడగొట్టాడు. గాయాలతో సతమతవుతున్నప్పటికి లక్నో మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రూ.11 కోట్లకు అతడిని లక్నో రిటైన్ చేసుకుంది. లక్నో తమ తదుపరి మ్యాచ్‌లో సోమవారం ఎక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా మయాంక్ దూరం కానున్నాడు. ఏప్రిల్ 19న రాజస్తాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. -
CSK Vs LSG: చెన్నై కోలుకునేనా!
లక్నో: వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు... ‘హ్యాట్రిక్’ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌తో పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి పోరులో గెలుపొందగా... ఆ తర్వాత వరుసగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకొని లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై... తిరిగి గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టోర్నీకి దూరం కాగా... గత మ్యాచ్‌లోనే ‘మాస్టర్ మైండ్’ మహేంద్రసింగ్ ధోని జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే పరాజయాలతో డీలా పడ్డ జట్టును అతడి సారథ్యం కూడా గట్టెక్కించలేకపోయింది. కోల్‌కతాతో జరిగిన పోరులో బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో చెన్నై ఘోర పరాజయం మూటగట్టుకుంది. వాటన్నింటిని పక్కన పెట్టి తిరిగి సత్తా చాటాలని ధోనీ సేన భావిస్తోంది. మరోవైపు రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సీజన్లో 6 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 2 పరాజయాలు నమోదు చేసుకుంది. గత మూడు మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్‌లపై గెలిచి లక్నో ఫుల్ జోష్‌లో ఉంది. మరి లక్నో జోరును అడ్డుకొని చెన్నై విజయాల బాట పడుతుందా చూడాలి! హిట్టర్లతో దట్టంగా... గత మూడు మ్యాచ్‌ల్లోనూ పవర్‌ప్లే వికెట్లు కోల్పోని లక్నో జట్టు... హిట్టర్లతో దట్టంగా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల గుజరాత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేని మిచెల్ మార్ష్... చెన్నైతో పోరులో బరిలోకి దిగడం ఖాయమే. మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌తో లక్నో టాపార్డర్ శత్రుదుర్బేధ్యంగా ఉంది. గత కొన్నాళ్లుగా కేవలం సిక్స్‌లు కొట్టడమే తన లక్ష్యం అన్నట్లు చెలరేగిపోతున్న పూరన్‌ను అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు కత్తి మీద సామే!ఈ సీజన్లో సీఎస్కే ప్లేయర్లంతా కలిసి 32 సిక్స్‌లు బాదితే... పూరన్ ఒక్కడే 31 సిక్స్‌లు కొట్టాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగుతున్న ఈ విండీస్ వీరుడు మరోసారి చెలరేగితే లక్నో జైత్రయాత్ర కొనసాగినట్లే. రిషబ్ పంత్, ఆయుశ్ బదోనీ, అబ్దుల్ సమద్‌లతో మిడిలార్డర్ బలంగా ఉండగా... డేవిడ్ మిల్లర్ ఫినిషింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక అనూహ్యంగా జట్టులోకి వచ్చిన పేస్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకుంటుండగా... యువ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ... ‘సంతకం’ సంబరాలు కొనసాగించాలని చూస్తున్నాడు. అవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్, రవి బిష్ణోయ్‌తో లక్నో బౌలింగ్‌లో మంచి వైవిధ్యం ఉంది. లోపాలు దిద్దుకుంటేనే! చెన్నైకు ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు. నిలకడ కనబర్చలేకపోతున్న ఆ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర రూపంలో మంచి ఓపెనర్లు ఉన్నా... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించే వారు కరువయ్యారు. రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో అశ్విన్ తర్వాత క్రీజులోకి వస్తున్న ధోని... గతంలో మాదిరిగా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం కనబర్చ లేకపోతున్నాడు. ఇతర జట్లలో దేశీయ ఆటగాళ్లు చెలరేగుతుంటే... చెన్నైలో ఆ బాధ్యత తీసుకునే ప్లేయర్లు కనపించడం లేదు. కోల్‌కతాతో జరిగిన చివరి మ్యాచ్‌లో అయితే చెన్నై మరీ పేలవ ఆటతీరు కనబర్చింది. ప్లే ఆఫ్స్ రేసులో ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఆటగాళ్లంతా సమష్టిగా సత్తాచాటాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడని సీఎస్కే... మరో పరాజయం మూటగట్టుకుంటే ఇక కోలుకోవడం కష్టమే. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న చెన్నై బ్యాటర్లు... దిగ్వేశ్ రాఠీ, రవి బిష్ణోయ్‌లను ఎలా ఎదుర్కంటారనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. తుది జట్లు (అంచనా) లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్ ), మార్క్రమ్, మిచెల్ మార్ష్, పూరన్, పంత్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దుల్, ఆకాశ్‌దీప్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్ ), కాన్వే, రచిన్, త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అశ్విన్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరణ. -
పంత్ నీవు ఇక మారవా.. రూ. 27 కోట్లు దండగ! ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఎక్నా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన పంత్ కేవలం 21 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పంత్.. ఆ తర్వాత కూడా తనకు అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పంత్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన రిషబ్.. 8 సగటుతో కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్ ఆట తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. రూ.27 కోట్ల దండుగ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా గతేడాది జరిగిన మెగా వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను లక్నో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది సీజన్లో పంత్ చేసిన స్కోర్లు..ఢిల్లీ క్యాపిటల్స్: 0 (6)సన్‌రైజర్స్ హైదరాబాద్: 15 (15)పంజాబ్ కింగ్స్: 2 (5)ముంబై ఇండియన్స్: 2 (6)కోల్‌కతా నైట్ రైడర్స్: బ్యాటింగ్ చేయలేదుగుజరాత్ టైటాన్స్: 21 (18)ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్‌పై 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటర్లలో పూరన్(61), మార్క్రమ్(28) హాఫ్ సెంచరీలతో మెరిశారు.చదవండి: IPL 2025: సెన్సేషనల్ సుదర్శన్.. ఆరు మ్యాచ్‌లలో 4 హాఫ్ సెంచరీలు -
IPL 2025: పూరన్ సిక్సర్ల సునామీ.. గుజరాత్‌ను చిత్తు చేసిన లక్నో
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, సిక్స్), సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56; 7 ఫోర్లు, సిక్స్) రాణించారు.వాస్తవానికి ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోర్ సాధించాల్సి ఉండింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ క్రీజ్‌లో ఉండగా గుజరాత్ స్కోర్ 12 ఓవర్లలో 120గా ఉండింది. అయితే వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది.తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న లక్నో బౌలర్లు అద్భుతంగా పుంజుకుని గుజరాత్‌ను ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితం చేశారు. రూథర్‌ఫోర్డ్ 22 (19 బంతుల్లో 3 ఫోర్లు), బట్లర్ 16 (14 బంతుల్లో 2 ఫోర్లు), షారుక్ ఖాన్ 11 నాటౌట్ (6 బంతుల్లో సిక్సర్), సుందర్ 2 (3 బంతుల్లో), తెవాటియా డకౌటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన లక్నో..మార్క్రమ్ (31 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్), పూరన్ (34 బంతుల్లో 61; ఫోర్, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోవడంతో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి సిక్సర్ల సునామీ సృష్టించాడు. మిచెల్ మార్ష్ గైర్హాజరీలో (కూతురు అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు) ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ (18 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 21) ఓ మోస్తరుగా రాణించాడు. బదోని సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 2, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సందర్ తలో వికెట్ తీశారు. -
LSG VS GT: డబుల్ సెంచరీ కొట్టిన శార్దూల్ ఠాకూర్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ 60, సాయి సుదర్శన్ 56 పరుగులతో రాణించారు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోర్ సాధించాల్సి ఉండింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ క్రీజ్‌లో ఉండగా గుజరాత్ స్కోర్ 12 ఓవర్లలో 120గా ఉండింది. అయితే వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది. ఈ దశలో లక్నో బౌలర్లు అద్భుతంగా పుంజుకుని గుజరాత్‌ను ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితం చేశారు. రూథర్‌ఫోర్డ్ 22, బట్లర్ 16, షారుక్ ఖాన్ 11 (నాటౌట్), సుందర్ 2, తెవాటియా డకౌటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనకు దిగిన లక్నో 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ గైర్హాజరీలో రిషబ్ పంత్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. పంత్ 17, మార్క్రమ్ 38 క్రీజ్‌లో ఉన్నారు.శార్దూల్ డబుల్ సెంచరీఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్ టీ20ల్లో 200 వికెట్లు పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన శార్దూల్ 3, 4 బంతులకు వరుసగా రూథర్‌ఫోర్డ్, తెవాటియా వికెట్లు తీశాడు. టీ20ల్లో 200 వికెట్లు తీసిన 18వ భారత బౌలర్‌గా, ఓవరాల్‌గా 103వ బౌలర్‌గా శార్దూల్ రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ 467 మ్యాచ్‌ల్లో 637 వికెట్లు తీశాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 316 మ్యాచ్‌ల్లో 365 వికెట్లు తీశాడు.టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-3 బౌలర్లురషీద్ ఖాన్- 637డ్వేన్ బ్రావో- 631సునీల్ నరైన్- 579టీ20ల్లో 200 వికెట్లు తీసిన భారత బౌలర్లు..చహల్-365పియూశ్ చావ్లా- 319భువనేశ్వర్ కుమార్- 315అశ్విన్- 315బుమ్రా- 295అమిత్ మిశ్రా- 285హర్షల్ పటేల్- 248అక్షర్ పటేల్- 239హర్భజన్ సింగ్- 235జయదేవ్ ఉనద్కత్- 234రవీంద్ర జడేజా- 227సందీప్ శర్మ- 219అర్షదీప్ సింగ్- 213మహ్మద్ షమీ- 209కుల్దీప్ యాదవ్- 208ఉమేశ్ యాదవ్- 202హార్దిక్ పాండ్యా-200శార్దూల్ ఠాకూర్- 200 -
LSG VS GT: మిచెల్ మార్ష్ ఎందుకు ఆడటం లేదు.. ఈ హిమ్మత్ సింగ్ ఎవరు..?
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఓ కీలక మార్పుతో బరిలోకి దిగుతుంది. స్టార్ ఆటగాడు, ఇన్ ఫామ్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.కారణం ఏంటి..?నేటి మ్యాచ్‌కు మార్ష్ వ్యక్తిగత కారణాల చేత దూరంగా ఉన్నాడని టాస్ సందర్భంగా లక్నో కెప్టెన్ పంత్ చెప్పాడు. మార్ష్ కూతురు లైలా అనారోగ్యంతో బాధపడుతుందని పంత్ పేర్కొన్నాడు. మార్ష్ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.మార్ష్ ప్రస్తుత సీజన్లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. మార్ష్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 53.00 సగటున, 180.27 స్ట్రయిక్‌రేట్‌తో 265 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మార్ష్ ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీలు చేశాడు. పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో మాత్రమే మార్ష్ డకౌటయ్యాడు.ఈ సీజన్లో మార్ష్ చేసిన స్కోర్లు..ఢిల్లీపై 72 (36)హైదరాబాద్‌పై 52 (31)పంజాబ్‌పై 0 (1)ముంబైపై 60 (31)కేకేఆర్‌పై 81 (48)మార్ష్ స్థానాన్ని భర్తీ చేసిన ఈ హిమ్మత్ సింగ్ ఎవరు..?గుజరాత్‌తో మ్యాచ్‌లో మార్ష్ స్థానాన్ని భర్తీ చేస్తున్న హిమ్మత్ సింగ్ ఢిల్లీకి చెందిన కుడి చేతి వాటం విధ్వంసకర బ్యాటర్. నేటి మ్యాచ్‌లో హిమ్మత్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. హిమ్మత్కు టీ20ల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 47 మ్యాచ్‌ల్లో 28.65 సగటున 132.51 స్ట్రైక్ రేట్‌తో 917 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ హాఫ్ బ్రేక్‌తో సత్తా చాటగలడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌తో హిమ్మత్ వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్ మెగా వేలంలో లక్నో హిమ్మత్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. నేటి మ్యాచ్‌లో హిమ్మత్ ఓపెనింగ్ లేదా మిడిలార్డర్లో రావచ్చు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిలకడగా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (23 బంతుల్లో 35; 4 ఫోర్లు, సిక్స్), శుభ్‌మన్ గిల్ (31 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్) తమ సహజ శైలిలో ఆడుతున్నారు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 88/0గా ఉంది.తుది జట్లు..లక్నో: ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్‌కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్ -
IPL 2025: గుజరాత్‌పై లక్నో విజయం
గుజరాత్‌పై లక్నో విజయంఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, సిక్స్), సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించారు.అనంతరం ఛేదనకు దిగిన లక్నో..మార్క్రమ్ (31 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్), పూరన్ (34 బంతుల్లో 61; ఫోర్, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోవడంతో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బదోని సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 2, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సందర్ తలో వికెట్ తీశారు.పూరన్ ఔట్15.2వ ఓవర్- 155 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పూరన్ (61) ఔటయ్యాడు.23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్23 బంతుల్లో 6 సిక్సర్లు, బౌండరీ సాయంతో పూరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో గెలవాలంటే 42 బంతుల్లో మరో 41 పరుగులు మాత్రమే చేయాలి. పూరన్ 51, బదోని 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో11.1వ ఓవర్- 123 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్దిద్ కృష్ణ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (58) ఔటయ్యాడు. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మార్క్రమ్181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్ మార్క్రమ్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. మార్క్రమ్ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (8 ఫోర్లు, సిక్స్) పూర్తి చేశాడు. పంత్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. పూరన్ కేవలం 16 బంతుల్లో 5 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. 10 ఓవర్లలో లక్నో స్కోర్ 114/1గా ఉంది. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. పంత్ ఔట్6.2వ ఓవర్- 65 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో సుందర్‌కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ (21) ఔటయ్యాడు.టార్గెట్ 181.. 6 ఓవర్లలో 61 పరుగులు చేసిన లక్నో181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ధాటిగా ఆడుతుంది. ఓపెనర్లు పంత్ (17), మార్క్రమ్ (38) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 61/0గా ఉంది. టార్గెట్ 181.. ఓపెనర్‌గా పంత్.. రెచ్చిపోయి ఆడుతున్న మార్క్రమ్181 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్‌గా రిషబ్ పంత్ బరిలోకి దిగాడు. మార్క్రమ్కు జతగా పంత్ క్రీజ్‌లో ఉన్నాడు. పంత్ 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా ఉన్న మార్క్రమ్ 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 33 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ గైర్హాజరీలో పంత్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 49/0గా ఉంది.లక్నో బౌలర్ల అద్బుత ప్రదర్శన.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన గుజరాత్టాస్ ఓడి లక్నో ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ 60, సాయి సుదర్శన్ 56 పరుగులతో రాణించారు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోర్ సాధించాల్సి ఉండింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ క్రీజ్‌లో ఉండగా గుజరాత్ స్కోర్ 12 ఓవర్లలో 120గా ఉండింది. అయితే వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నమ్మదించింది. ఈ దశలో లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్‌ను ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితం చేశారు. రూథర్‌ఫోర్డ్ 22, బట్లర్ 16, షారుక్ ఖాన్ 11 (నాటౌట్), సుందర్ 2, తెవాటియా డకౌటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్16.4వ ఓవర్- 145 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. దిగ్వేశ్ రాఠీ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (16) ఔటయ్యాడు. రూథర్‌ఫోర్డ్‌కు (6) జతగా షారుక్ ఖాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ఇన్నింగ్స్ 14వ ఓవర్లో గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి సాయి సుదర్శన్ (56), ఆఖరి బంతికి వాషింగ్టన్ సుందర్‌ను (2) రవి బిష్ణోయ్ ఔట్ చేశారు. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 127/3గా ఉంది. బట్లర్ (3), రూథర్‌ఫోర్డ్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్12.1వ ఓవర్- 120 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో మార్క్రమ్ బౌండరీ లైన్ వద్ద అద్బుతమైన క్యాచ్ పట్టడంతో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. సాయి సుదర్శన్‌కు (55) జతగా జోస్ బట్లర్ క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన గిల్, సుదర్శన్.. 11 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ ఎంతంటే..?11 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 109/0గా ఉంది. గిల్ (53), సాయి సుదర్శన్ (51) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. నిలకడగా ఆడుతున్న గిల్, సాయి సుదర్శన్.. 7 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?7 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 66/0గా ఉంది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (30), శుభ్‌మన్ గిల్ (34) నిలకడగా ఆడుతున్నారు. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ ఓపెనర్లుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (15), సాయి సుదర్శన్ (11) ఆచితూచి ఆడుతున్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. లక్నోలోని అటల్ బిహారి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఓ కీలక మార్పుతో బరిలోకి దిగుతుంది. స్టార్ ఆటగాడు, ఇన్ ఫామ్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. వ్యక్తిగత కారణాల చేత మార్ష్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని స్థానాన్ని హిమ్మత్ సింగ్ భర్తీ చేయనున్నాడు. గుజరాత్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. కుల్వంత్ కేజ్రోలియా స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.ప్రస్తుత సీజన్లో గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. లక్నో ఐదింట మూడు గెలిచి ఆరో స్థానంలో ఉంది.తుది జట్లు..లక్నో: ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్‌కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్


