IPL 2025: మ‌ళ్లీ అదే క‌థ‌.. తీరు మార‌ని రిష‌బ్ పంత్‌ | Rishabh Pant trolled for another flop show in do or die match | Sakshi
Sakshi News home page

#Rishabh Pant: మ‌ళ్లీ అదే క‌థ‌.. తీరు మార‌ని రిష‌బ్ పంత్‌

May 19 2025 9:19 PM | Updated on May 19 2025 9:38 PM

Rishabh Pant trolled for another flop show in do or die match

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌తో జ‌రుగుతున్న‌ కీల‌క మ్యాచ్‌లో పంత్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన పంత్‌.. 6 బంతులు ఎదుర్కొని కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

ఎస్ఆర్‌హెచ్ పేస‌ర్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో రిట‌ర్న్ క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియ‌న్‌కు చేరాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా నిలిచిన పంత్‌.. త‌న ధ‌ర‌కు ఏ మాత్రం న్యాయం చేయలేక‌పోయాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడిన పంత్‌.. 12.27 స‌గ‌టుతో కేవ‌లం 135 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

ఈ క్ర‌మంలో పంత్  చెత్త ఆట తీరును ల‌క్నో అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. సోష‌ల్ మీడియాలో పంత్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. పంత్‌ నీవు ఇక మారవా అంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో పంత్‌ ఔటైన అనంతరం మ్యాచ్‌ వీక్షిస్తున్న లక్నో ఓనర్‌ సంజీవ్‌ గోయెంకా తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.  కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధ‌ర‌కు ల‌క్నో కొనుగోలు చేసింది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్‌(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌ల‌తో 65), మార్‌క్ర‌మ్‌(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 61) హాఫ్ సెంచ‌రీలతో రాణించ‌గా.. నికోల‌స్ పూరన్‌(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో  45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో ఇషాన్ మ‌లింగ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. దూబే, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, నితీష్ కుమార్ రెడ్డి త‌లా వికెట్ సాధించారు.
చదవండి: అతడొక అద్బుతం.. గిల్‌ను మించిపోయాడు: జడేజా

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement