లక్నో జట్టు కొత్త జెర్సీతో... | LSG unveils a new Jersey | Sakshi
Sakshi News home page

లక్నో జట్టు కొత్త జెర్సీతో...

Feb 28 2026 8:42 AM | Updated on Feb 28 2026 9:57 AM

LSG unveils a new Jersey

లక్నో: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2026 సీజన్‌ కోసం లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు కొత్త హంగులతో సిద్ధమవుతోంది. ఇటీవలే టీమ్‌ కొత్త లోగోను ప్రకటించిన యాజమాన్యం ఇప్పుడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఎరుపు ప్రధాన రంగుగా ఉంటూ దానిపై నీలి రంగు నిలువు గీతలు హైలైట్‌ చేస్తూ జెర్సీని ముస్తాబు చేశారు. 

ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ బార్సిలోనా ఎఫ్‌సీ పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌ తాజా సీజన్‌తో తమ టీమ్‌కు ‘జేకే సూపర్‌ సిమెంట్‌’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు కూడా ఫ్రాంచైజీ ప్రకటించింది. గత మంగళవారం టీమ్‌ కొత్త లోగోను కూడా ప్రదర్శించారు. మరింత బలంగా, మరింత ఎత్తుకు అంటూ తమ టీమ్‌ ఆలోచనను వివరిస్తూ ఏనుగు, గరుడ చిత్రాలతో ఈ లోగోను సిద్ధం చేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement