బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల వైభవ్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్.. తన సంచలన బ్యాటింగ్‌తో వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వణికించాడు.
కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయష్కుడిగా వైభవ్ నిలిచాడు. అతడు 206.56 స్ట్రైక్ రేట్‌తో కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 252 పరుగులు చేశాడు.
దీంతో వైభవ్ “ టాటా కర్వ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్” అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా టాటా మోటార్స్ అతనికి ప్రత్యేక బహుమతిగా కొత్త టాటా కర్వ్ SUV కారును అందించింది. వైభవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను టాటా మోటార్స్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా టాటా కర్వ్ టాప్ మోడల్ ఆన్-రోడ్ ధర ఢిల్లీలో రూ. 22 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు అత్యాధునికమైన డీజిల్ ఇంజిన్ ,డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ వంటి ఫ్యూచర్స్ కలిగి ఉంది.


