క్రికెట్‌కు బ్రేక్‌.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్‌ సూర్యవంశీ | Vaibhav Suryavanshi to prepare for 10th board exams before IPL 2026 | Sakshi
Sakshi News home page

Vaibhav Suryavanshi: క్రికెట్‌కు బ్రేక్‌.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్‌ సూర్యవంశీ

Feb 14 2026 11:09 AM | Updated on Feb 14 2026 11:24 AM

Vaibhav Suryavanshi to prepare for 10th board exams before IPL 2026

నిన్న‌టివ‌ర‌కు మైదానంలో బౌల‌ర్ల‌ను బెంబేలెత్తించిన‌ భార‌త యువ‌ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ ఇప్పుడు క్లాస్‌రూమ్‌లో కూర్చుని ప‌రీక్ష‌లు రాసేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలకు అత‌డు హాజ‌రు కానున్నాడు.  బిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో వైభవ్‌ ఈ పరీక్షలు రాయనున్నాడు.

వైభవ్ సూర్యవంశీ మా పాఠశాలలో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కానున్నాడు. అత‌డికి ఇప్ప‌టికే అడ్మిట్ కార్డ్ అందించాము. ఉపాధ్యాయులు, విద్యార్థులు, త‌ల్లిదండ్రులు వైభ‌వ్ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతడు ఇంకా విద్యార్ధి కాబట్టి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదు. అందరితో కలిసే పరీక్షలు రాయనున్నాడు. అందుకు తగ్గట్టు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోడార్ స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ సిన్హా  పేర్కొన్నారు.

కాగా 14 ఏళ్ల వైభ‌వ్ ఐపీఎల్‌-2025లో రాజ‌స్తాన్ త‌ర‌పున కేవ‌లం 15 బంతుల్లో సెంచ‌రీ సాధించి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. ఆ త‌ర్వాత కూడా భార‌త్-ఎ జ‌ట్టు, అండ‌ర్-19 జ‌ట్టు త‌ర‌పున సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశాడు. ఇటీవ‌ల జ‌రిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో సైతం దుమ్ములేపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో 175 పరుగులతో సత్తాచాటిన వైభ‌వ్‌.. భార‌త్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపాడు. మొత్తంగా 439 పరుగులు చేసిన వైభవ్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గా నిలిచాడు.
చ‌ద‌వండి: వారెవ్వా జింబాబ్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement