గ్యారీ సోబర్స్‌కి కార్బన్‌ కాపీ ఈ పిల్లాడు! | Vaibhav Sooryavanshi a carbon copy of Gary Sobers: Ex England star | Sakshi
Sakshi News home page

గ్యారీ సోబర్స్‌కి కార్బన్‌ కాపీ ఈ పిల్లాడు: ఇంగ్లండ్‌ మాజీ స్టార్‌ ప్రశంసలు

Feb 11 2026 4:05 PM | Updated on Feb 11 2026 4:14 PM

Vaibhav Sooryavanshi a carbon copy of Gary Sobers: Ex England star

భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీపై ఇంగ్లండ్‌ మాజీ బ్యాటర్‌ మార్క్‌ బుచర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. పద్నాలుగేళ్ల ఈ పిల్లాడిని దిగ్గజ గ్యారీ సోబర్స్‌తో పోల్చాడు. కాగా ఫార్మాట్‌లకు అతీతంగా ధనాధన్‌ దంచికొడుతూ క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వైభవ్‌.

ధనాధన్‌
హర్యానాకు చెందిన ఈ కుర్రాడు గతేడాది ఐపీఎల్‌లో సత్తా చాటాడు. అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత అండర్‌-19 జట్టు తరఫున అదరగొట్టాడు. యూత్‌ వన్డేలు, యూత్‌ టెస్టుల్లో విధ్వంసకర శతకాలు బాది రికార్డులు నెలకొల్పాడు.

ఫైనల్లోనూ భారీ శతకం
ఇక ఇటీవల ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 ఫైనల్లోనూ ఇంగ్లండ్‌పై భారీ శతకం (175) బాది టీమిండియాకు టైటిల్‌ అందించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మార్క్‌ బుచర్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆట తీరు తనకు వెస్టిండీస్‌ లెజెండ్‌ గ్యారీ సోబర్స్‌ను గుర్తుకు తెస్తోందన్నాడు.

గ్యారీ సోబర్స్‌కి కార్బన్‌ కాపీ
విజ్డన్‌ క్రికెట్‌ వీక్లీ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. “వైభవ్‌ను చూడగానే నాకు తొలుత గ్యారీ సోబర్స్‌ జ్ఞప్తికి వచ్చాడు. విధ్వంసకర రీతిలో బ్యాట్‌ను స్వింగ్‌ చేయడం.. ఆ టైమింగ్‌, పరిపూర్ణత సూపర్‌. అతడి హ్యాండ్‌ స్పీడ్‌, క్రీజులో కదిలే విధానం అన్నీ ఆ దిగ్గజం మాదిరే ఉంటాయి.

అచ్చం సోబర్స్‌ లాగే అతడు బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తరంలోని ఆటగాడు కూడా ఇలా సోబర్స్‌ను నాకు గుర్తుచేయలేదు. అయితే, వైభవ్‌ మాత్రం తన బ్యాటింగ్‌ తీరుతో నన్ను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాట్‌ స్వింగ్‌ కోసం అతడు కాళ్లను కదిలించే విధానం సూపర్‌’’ అని మార్క్‌ బుచర్‌ వైభవ్‌ సూర్యవంశీని కొనియాడాడు. 

చదవండి: పాక్‌ స్పిన్నర్‌కు అశ్విన్‌ మద్దతు.. నెటిజన్స్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement