ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. తొలుత బ్యాటింగ్ చేయ‌నున్న పాక్‌ | T20 WC 2026: Big Change In Playing XI As Pakistan Opt To Bat vs England | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. తొలుత బ్యాటింగ్ చేయ‌నున్న పాక్‌

Feb 24 2026 6:46 PM | Updated on Feb 24 2026 7:19 PM

 T20 WC 2026: Big Change In Playing XI As Pakistan Opt To Bat vs England

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు తెర లేచింది. ఈ మెగా టోర్నీ సూప‌ర్‌-8లో భాగంగా పల్లెకెలె వేదిక‌గా పాకిస్తాన్‌,ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో పాక్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫహీమ్ అష్రాప్ స్ధానంలో షాహీన్ అఫ్రిది తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇంగ్లండ్ మాత్రం ఎటువంటి మార్పులు చేయ‌లేదు.

తుది జ‌ట్లు
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్‌), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
 

Advertisement
 
Advertisement
Advertisement