Super-8
-
స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆరంభం నుంచి అద్భుత ఆట తీరు కనబరిచిన వెస్టిండీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. సూపర్-8 దశలో జింబాబ్వేపై ఘన విజయం సాధించి సెమీస్ రేసులోకి దూసుకవచ్చిన విండీస్.. కీలక మ్యాచ్‌లలో మాత్రం చేతులెత్తేసింది.విండీస్ అవుట్తొలుత సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన కరేబియన్ జట్టు.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా భారత్ సెమీస్‌కు దూసుకువెళ్లగా.. వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్.. వెస్టిండీస్ సారథి షాయీ హోప్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అతడొక స్వార్థ పరుడు.. తుదిజట్టులో అతడికి చోటు దండగ అంటూ ఘాటుగా విమర్శించాడు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు వేయడం సరికాదని చురకలు అంటించాడు.స్వార్థపరుడు..‘‘ప్రతి మ్యాచ్‌లో కేవలం స్వార్థం కోసం మాత్రమే అతడు ఆడతాడు. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత.. తప్పునంతా పావెల్, హోల్డర్లపై నెట్టేసేందుకు ప్రయత్నించాడు. ఆఖర్లో సరిగ్గా ఆడలేదంటూ వారిని నిందించాడు.నిజానికి నీ చెత్త బ్యాటింగ్‌తో నువ్వే వెస్టిండీస్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికావు. కానీ నిన్ను నువ్వు ఎప్పుడూ నిందించుకోవు. నిన్ను కెప్టెన్‌గా నియమించడమే వెస్టిండీస్ క్రికెట్ చేసిన అతి పెద్ద తప్పు.తుదిజట్టులో ఉండటమే దండగఅసలు తుదిజట్టులో షాయీ హోప్ ఉండటమే దండగ. అతడు కేవలం ఆదేశాలు ఇవ్వడానికి మాత్రమే ముందుంటాడు. బ్యాట్‌తో రాణించలేడు. అతడికి బదులు వేరొకరిని జట్టులోకి తీసుకుంటే బాగుండేదేమో! నీ బదులు రొమారియో షెఫర్డ్‌ను ఓపెనర్‌గా పంపి ఉంటే బాగుండేది హోప్’’ అంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్ షాయీ హోప్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా కోల్‌కతాలో భారత్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన విండీస్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్, వికెట్ కీపర్ షాయీ హోప్ 33 బంతులు ఎదుర్కొని 32 పరుగులే చేయగలిగాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ రోస్టన్ ఛేజ్ 25 బంతుల్లో 40 పరుగులతో రాణించాడు.సంజూ శాంసన్ ధనాధన్ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు. ఫలితంగా 20 ఓవర్లలో విండీస్ 195 పరుగులు స్కోరు చేయగలిగింది.అయితే, సంజూ శాంసన్ (50 బంతుల్లో 97 నాటౌట్) విజృంభణ కారణంగా టీమిండియా 192. ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది.చదవండి: IND vs WI అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు: గంభీర్Varun strikes, and Eden Gardens erupts! 🌪️The bowling change does the trick for #TeamIndia as skipper Shai Hope walks back! ☝️ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/rPIjxyNNaS— Star Sports (@StarSportsIndia) March 1, 2026 -
టీమిండియా ‘ప్రపంచ’ రికార్డు.. పాకిస్తాన్‌తో సమంగా
వెస్టిండీస్‌తో సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత జట్టు సమం చేసింది.సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిశ్రీలంకతో కలిసి వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్.. లీగ్ దశలో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.వరుస విజయాలతో సెమీస్కుఅయితే, తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే (IND vs ZIM)ను భారీ తేడాతో ఓడించి సెమీ ఫైనల్ రేసులో ముందుకు వచ్చిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్ (IND vs WI)ను చిత్తు చేసి బెర్తును ఖరారు చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.విండీస్ బ్యాటర్లలో రోవ్‌మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37) అజేయ ఇన్నింగ్స్‌తో అలరించగా.. ఓపెనర్ రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సంజూ స్పెషల్ఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) జట్టును విజయతీరాలకు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచి గెలుపును ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026పాక్ ప్రపంచ రికార్డు సమంకాగా టీమిండియా టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ చేరడం ఇది ఆరోసారి. తద్వారా పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. ఇక ఇదే ఎడిషన్‌లో అందరి కంటే ముందే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్ సైతం ఆరోసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టి.. పాక్, భారత్ సరసన నిలిచింది. ఇక గురువారం నాటిమ్యాచ్‌లో ఫైనల్ బెర్తు కోసం టీమిండియా ఇంగ్లండ్ మధ్యమ్యాచ్ జరుగుతుంది. ఇందుకు ముంబై వేదిక.టీ20 ప్రపంచకప్ టోర్నీలో అత్యధికసార్లు సెమీ ఫైనల్ చేరిన జట్లు ఇవే👉పాకిస్తాన్- ఆరుసార్లు (2007, 2009, 2010, 2012, 2021, 2022)👉టీమిండియా- ఆరుసార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026)👉ఇంగ్లండ్- ఆరుసార్లు (2010, 2016, 2021, 2022, 2024, 2026చదవండి: ఇది సరిపోతుందా బాస్!.. విమర్శలకు సంజూ ’స్టైల్’ కౌంటర్ -
అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు: గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సంజూ శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్ అంటూ ఆకాశానికెత్తాడు. సరైన సమయంలో రాణించి తన విలువను మరోసారి చాటుకున్నాడని కొనియాడాడు.టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు ఫామ్‌లేమితో సతమతమైన సంజూ (Sanju Samson)తుదిజట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్‌గా అతడి స్థానాన్ని ఇషాన్ కిషన్ (Ishan Kishan) భర్తీ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం కాగా సంజూ తొలిసారి వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడాడు.బాధ్యతాయుత ఇన్నింగ్స్‌అనంతరం సూపర్-8లో జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆడిన సంజూ.. తాజాగా వెస్టిండీస్‌తో ఆదివారం నాటి కీలక మ్యాచ్‌లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అదిరిపోయే ఆట తీరుతో జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చాడు.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026కోల్‌కతా వేదికగా సహచర ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమైన వేళ సంజూ.. 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సంజూను ప్రశంసలతో ముంచెత్తాడు.అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు‘‘సంజూ మంచి ఆటగాడు అని అందరికీ తెలుసు. అయితే, కొన్నిసార్లు విఫలమైనా అతడికి మద్దతుగా నిలవడం అవసరం. మేము అదే పని చేశాము. అందుకు తగ్గట్లుగానే జట్టుకు అతడి అవసరం ఉన్న కీలక సమయంలో రాణించాడు.అతడి పూర్తి స్థాయి నైపుణ్యాలను ఈరోజు ప్రదర్శించి.. జట్టుకు విజయం అందించాడు. అతడు వరల్డ్‌క్లాస్ ప్లేయర్ అని నేను తరచూ చెబుతూ ఉంటాను. సంజుకు గొప్ప ప్రతిభ ఉంది. ఇప్పటి నుంచి అతడి నుంచి ఇలాంటి ఇంకెన్నో ఇన్నింగ్స్ చూడాలని కోరుకుంటున్నా’’ అని గంభీర్ సంజూను కొనియాడాడు.ఐదు వికెట్ల తేడాతో విజయంకాగా వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 199 పరుగులు సాధించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికాతో పాటు సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ముంబై వేదికగా గురువారం సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.As soon as Sanju Samson smashed a match winning SIX, just look at the Celebration of Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Suryakumar Yadav and Jay Shah 💥- Most trolled and most hated Sanju Samson delivered at the biggest stage 👏🏻#INDvsWI pic.twitter.com/tYJmi4fxwC— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 1, 2026 -
ఇది సరిపోతుందా బాస్!.. విమర్శలకు సంజూ ’స్టైల్’ కౌంటర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభానికి ముందు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు టీమిండియా స్టార్ సంజూ శాంసన్. మెగా టోర్నీకి సన్నాహకంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుస వైఫల్యాలతో సతమతమయ్యాడు.ఈ సిరీస్‌లో సంజూ చేసిన పరుగులు 10, 6, 0, 24, 6. దీంతో వరల్డ్‌కప్ జట్టులో ఓపెనర్‌గా అతడి స్థానం గల్లంతైంది. ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మకు జోడీగా ఐసీసీ ఈవెంట్లో వరుస అవకాశాలు అందిపుచ్చుక్నునాడు.ఉద్దేశపూర్వకంగానే!అయితే, అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా నమీబియాతో తొలిసారి బరిలో దిగాడు సంజూ. ఆ మ్యాచ్‌లో 8 బంతుల్లో 22 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... తదుపరి జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్‌లో 15 బంతుల్లో 24 రన్స్ రాబట్టగలిగాడు. పొరపాట్లను పునరావృతం చేస్తూ షార్ట్ బంతుల్ని తప్పుగా అంచనా వేసి అవుటైన నేపథ్యంలో మరోసారి సంజూపై విమర్శల వర్షం కురిసింది.మరోవైపు.. అతడి అభిమానులు మాత్రం.. మిగతా వాళ్లకు ఇచ్చినట్లుగా సంజూకు అవకాశాలు ఇవ్వడం లేదని మద్దతుగా నిలిచారు. ఈ కేరళ స్టార్‌ను ఉద్దేశపూర్వకంగా ప్రతీసారి పక్కన పెడుతున్నారని భారత జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు. అయితే, వరుస విమర్శల తర్వాత అప్పుడప్పుడు అవకాశాలు పొందుతున్నా సంజూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేక ప్రతీసారి చేతులెత్తేయం ప్రతికూలాంశంగా పరిణమించింది. ఏదో కారణంతో అదృష్టవశాత్తూ చాన్స్ దక్కినా దానిని అతడు వాడుకోలేకపోతున్నాడనే అపవాదు పడింది. ముందుగా చెప్పినట్లు ఈ వరల్డ్ కప్‌లో కూడా ఆడిన రెండు మ్యాచ్‌లలో విఫలం కావడం ఇందుకు కారణం.ఒకే ఒక అర్ధ సెంచరీ...నిజానికి 2024 నవంబర్‌లో సౌతాఫ్రికాపై సెంచరీ తర్వాత శాంసన్ 18 ఇన్నింగ్స్‌లు ఆడితే ఒకే ఒక అర్ధ సెంచరీ... అదీ బలహీన జట్టు ఒమన్‌పై వచ్చింది. వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికైన తర్వాత కూడా కివీస్‌తో సిరీస్‌లో వైఫల్యంతో తన స్థానాన్ని అతను ఇషాన్ కిషన్‌కు కోల్పోవాల్సి రావడం గమనార్హం.కెరీర్‌కు కొత్త ఊపుఇలాంటి స్థితిలో ఆదివారం వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సంజూ ఇన్నింగ్స్ అతడి కెరీర్‌కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి ఎప్పటికీ గుర్తుంచుకునే ప్రదర్శన నమోదు చేశాడు.విండీస్‌తో మ్యాచ్‌లో అన్ని రకాల షాట్లతో సంజూ చెలరేగాడు. ఈసారి 20.. 30... దాటిన తర్వాత అతడు వికెట్ పారేసుకోలేదు. అకీల్ హొసీన్ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లతో జోరు మొదలు పెట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ షెఫర్డ్ ఓవర్లో వరుసగా 6, 4 బాది 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. This team! 🥹💙🫂Next Stop: Semi-finals 🚀ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026టీమిండియాను సెమీస్‌కు చేర్చిటీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఛేదనలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన సంజూ... ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో 6, 4తో మ్యాచ్‌ను ముగించాడు. టీమిండియాను సెమీ ఫైనల్‌కు చేర్చి చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 97 పరుగులు నాటౌట్‌గా నిలిచిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.కాగా 2024లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడైన సామ్సన్‌కు నాడు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశమే రాలేదు. ఇప్పుడు అసలు సమరంలో సత్తాను ప్రదర్శించిన అతను ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సెమీస్, ఆపై ఫైనల్లో కూడా అద్భుతం చూడవచ్చు. చదవండి: మూడు పరుగులతో సెంచరీ మిస్!.. అత్యంత గొప్ప రోజు.. సంజూ ఎమోషనల్ -
T20 WC 2026: అత్యంత గొప్ప రోజు.. సంజూ ఎమోషనల్
‘‘నా జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఇదొకటి. ఇదే (ఆట) నా ప్రపంచం. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే.. దేశం కోసం ఆడాలనే కల కన్నాను. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూశాను. నా కెరీర్లో ఎన్నో ఎత్తు పళ్లాలు ఉన్నాయి.ఒక్కోసారి నా మీద నాకే సందేహం కలిగేది. నేనసలు ఆడగలనా.. ఒకవేళ ఆడితే ఎలా ఉంటుంది. అనుకున్న విధంగా రాణించగలనా.. ఇలా ఎన్నెన్నో సందేహాలు. అయితే, ఆ దేవుడి మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ఈరోజు ఆయన నన్ను దీవించాడు. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. టీ20 ఫార్మాట్లో నాకెంతో అనుభవం ఉంది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గత మ్యాచ్‌లలో వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయాను. అయితే, ఈ రోజు భాగస్వామ్యాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి సారించాను. బంతిని చూస్తూ ఆడాను. ఈరోజు నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాను’’ అంటూ టీమిండియా స్టార్ సంజూ శాంసన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.టీ20 ప్రపంచకప్-2026లో భారత్ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లడంలో సంజూదే కీలక పాత్ర. టీ20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా పేరొందిన వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియాను గెలిపించాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు వరుస కడుతున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలకడగా బ్యాటింగ్ చేశాడు.This team! 🥹💙🫂Next Stop: Semi-finals 🚀ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంజూ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా విండీస్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. కాగా గత కొన్ని రోజులుగా సంజూ ఫామ్‌లేమితో సతమతమయ్యాడు. ఫలితంగా ఓపెనర్‌గా స్థానం కోల్పోయాడు.అయితే, గత మ్యాచ్ (జింబాబ్వే)తో మళ్లీ తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. తాజాగా వెస్టిండీస్‌పై అదరగొట్టి తన విలువ చాటుకున్నాడు. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో మెరిసి అభిమానులను ఖుషీ చేశాడు.భారత్ వర్సెస్ వెస్టిండీస్ స్కోర్లువేదిక- ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతాటాస్- భారత్.. తొలుత బౌలింగ్వెస్టిండీస్ స్కోరు- 195/4(20)భారత్ స్కోరు- 199/5 (19.2)ఫలితం- ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 97 పరుగులు నాటౌట్). -
T20 WC 2026: విండీస్‌ను చిత్తు చేసి సెమీ ఫైనల్లో టీమిండియా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సూపర్-8 దశలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ (IND Beat WI)ను ఓడించి టైటిల్ దిశగా కీలక ముందడుగు వేసింది. కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.195 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ షాయీ హోప్ (33 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) రాణించాడు.మిగిలిన వారిలో షిమ్రన్ హెట్‌మైర్ (12 బంతుల్లో 27) ధనాధన్ దంచికొట్టగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (9 బంతుల్లో 14) రాణించాడు. ఆఖర్లో రోవ్‌మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు.నిరాశపరిచిన అభిషేక్, ఇషాన్భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (11 బంతుల్లో 10) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (6 బంతుల్లో 10) సైతం నిరాశపరిచాడు.సంజూ బాధ్యతాయుత ఇన్నింగ్స్కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 18) చేతులెత్తేయగా.. తిలక్ వర్మ (15 బంతులలో 27) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. ఇలాంటి దశలో ఓపెనర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026 అయితే విజయానికి 10 బంతులలో 17 పరుగులు అవసరమైన వేళ హార్దిక్ పాండ్యా (14 బంతులలో 17) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో శివం దూబే సంజూకు జతయ్యాడు. దూబే 4 బంతులలో 8 పరుగులు చేయగా.. సంజూ ఆఖరి ఓవర్లో సిక్సర్, ఫోర్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలోఈ మ్యాచ్‌లో సంజూ మొత్తంగా 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం అందించాడు. ఇక మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. -
గెలిచి ఇంటికి పాక్... సెమీస్‌కు న్యూజిలాండ్
పల్లెకెలె: శ్రీలంకతో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది...మ్యాచ్ గెలవడం మాత్రమే కాకుండా లంకను 147 పరుగుల వరకే పరిమితం చేసి ఉంటే పాక్ సెమీఫైనల్‌కు చేరేది. కానీ తారిఖ్ వేసిన 16వ ఓవర్ ఐదో బంతికి షనక సింగిల్ తీయడంతో లంక స్కోరు 148 పరుగులకు చేరింది. దాంతో పాక్ ఆశలు గల్లంతయ్యాయి. ‘గ్రూప్ 2’లో పాక్‌కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. లంకపై మ్యాచ్‌లో చివరకు 5 పరుగుల తేడాతో గెలిచినా పాక్ టోర్నీనుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాహిబ్జాదా ఫర్హాన్ (60 బంతుల్లో 100; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు శతకం సాధించగా, ఫఖర్ జమన్ (42 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి పోరాడి ఓడింది. కెప్టెన్ షనక (31 బంతుల్లో 76 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) విరుచుకుపడగా, పవన్ రత్నాయకే (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఫర్హాన్, ఫఖర్ ధనాధన్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్‌లు ధనాధన్ ఆరంభమిచ్చారు. ఇద్దరు పోటీ పడి బౌండరీలు, సిక్స్‌లు బాదుతూ పాక్ స్కోరును వాయువేగంతో పెంచారు. పవర్‌ప్లేలో 64/0 స్కోరు చేసిన పాకిస్తాన్... పదో ఓవర్ ముగియక ముందే 100కు చేరుకుంది. ఫర్హాన్ 32 బంతుల్లో, ఫఖర్ 27 బంతుల్లో అర్ధసెంచరీలు సాధించారు. ఓవర్‌కు 10 పైచిలుకు రన్‌రేట్ నమోదు చేసిన పాక్ 14వ ఓవర్లలోనే 150 పరుగుల మార్క్ దాటింది. 16వ ఓవర్ వేసిన చమీర ఎట్టకేలకు ఫఖర్‌ను బౌల్డ్ చేసి 176 పరుగుల ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. తర్వాత పాక్ వికెట్లు పేకమేడలా కూలాయి. నాఫే (2), షాదాబ్ (7), నవాజ్ (0), కెప్టెన్ సల్మాన్ (0) ఇలా వరుసగా బ్యాటర్లంతా విఫలమయ్యారు. మరో వైపు 59 బంతుల్లో ఫర్హాన్ సెంచరీ పూర్తయింది. ఆశలు రేపిన షనక భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య లంక తడబడింది. నిసాంక (3), మిశార (26), అసలంక (25) వేగంగా ఆడేందుకు యత్నించి వికెట్లు పారేసుకున్నారు. దీంతో విజయానికి ఆమడ దూరంలో నిలిచింది. అయితే రత్నాయకే రాణించగా, కెప్టెన్ షనక అనూహ్యంగా ఆఖరి ఓవర్లో చెలరేగి గెలుపు ఆశలు పెంచాడు. 6 బంతుల్లో 28 పరుగుల అసాధ్యమైన సమీకరణం ఉండగా... షాహిన్ అఫ్రిది చివరి ఓవర్లో షనక వరుసగా 4, 6, 6, 6లతో 22 పరుగులు పిండుకున్నాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో స్టేడియమంతా మునివేళ్లపై నిలబడింది. కానీ ఒత్తిడికి గురైన షనక ఆ రెండు బంతులకు పరుగు తీయలేకపోవడంతో పాక్ గెలుపు ఖాయమైంది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (సి) లియనాగే (బి) మదుషంక 100; ఫఖర్ (బి) చమిర 84; ఖాజా నాఫే (సి) అసలంక (బి) మదుషంక 2; షాదాబ్ రనౌట్ 7; నవాజ్ (సి) తీక్షణ (బి) షనక 0; సల్మాన్ (సి) తీక్షణ (బి) షనక 0; ఉస్మాన్ నాటౌట్ 8; షాహిన్ అఫ్రిది (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 4; నసీమ్ షా రనౌట్ 1; అబ్రార్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–176, 2–179, 3–198, 4–199, 5–199, 6–203, 7–207, 8–210. బౌలింగ్: మదుషంక 4–0–33–3, చమిర 4–0–48–1, తీక్షణ 4–0–35–0, షనక 4–0–42–2, వెల్లలాగే 3–0–37–0, లియనాగే 1–0–14–0. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) నవాజ్ (బి) నసీమ్ షా 3; మిశార (బి) అబ్రార్ 26; అసలంక (బి) అబ్రార్ 25; రత్నాయకె (సి) అయూబ్ (బి) అఫ్రిది 58; మెండిస్ (బి) అబ్రార్ 3; లియనాగే (బి) నవాజ్ 5; షనక నాటౌట్ 76; వెలలాగే నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–8, 2–33, 3–75, 4–94, 5–101, 6–162. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–48–1, నసీమ్ షా 4–0–36–1, అబ్రార్ 4–0–23–3, ఉస్మాన్ 4–0–43–0, నవాజ్ 2–0–21–1, షాదాబ్ 2–0–33–0. -
వాళ్లతో బౌలింగ్ చేయిస్తావా?: సాంట్నర్‌పై సౌతాఫ్రికా లెజెండ్ ఫైర్
ఇంగ్లండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతులెత్తేసింది. వ్యూహాలను అమలు చేసే క్రమంలో తడబడి ఓటమిని ఆహ్వానించింది. ఫలితంగా సెమీస్ చేరేందుకు మరో మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితి తెచ్చుకుంది. 159 పరుగులుకొలంబో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టిమ్ సీఫర్ట్ (35), ఫిన్ అలెన్ (29) ఫర్వాలేదనిపించగా.. గ్లెన్ ఫిలిప్స్ (39) రాణించాడు. మిగతా వారు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కివీస్ 159 పరుగులు చేయగలిగింది.ఆదిలోనే ఎదురుదెబ్బలుఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు తీయగా.. లియామ్ డాసన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను కివీస్ బౌలర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (2), జోస్ బట్లర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (26)ను ఫిలిప్స్ తొందరగానే పెవిలియన్‌కు పంపాడు.ఆఖర్లో అంతా తలకిందులుఇక జేకబ్ బెతెల్ (21), సామ్ కర్రాన్ (24) నిరాశపరచగా.. టామ్ బాంటన్ (33) రాణించాడు. ఇలాంటి తరుణంలో కివీస్‌కు గెలుపు అవకాశాలు మెరుగు కాగా.. విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ముఖ్యంగా 18వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో 22 పరుగులు పిండుకున్నారు. ఇక 19వ ఓవర్లో సాంట్నర్ బౌలింగ్‌లో 16 పరుగులు రాబట్టారు. ఇక ఆఖరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. హెన్రీ బౌలింగ్‌లో రెండు సింగిల్, ఫోర్ బాది పని పూర్తి చేశారు.మొత్తంగా జాక్స్ 18 బంతుల్లో 32, రెహాన్ అహ్మద్ 7 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచి.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ను గెలిపించారు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర మూడు, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో ఫలితం తారుమారు కావడంతో కివీస్‌కు చేదు అనుభవం తప్పలేదు. శ్రీలంకతో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోతేనే న్యూజిలాండ్ సెమీస్ చేరగలదు.వాళ్లతో బౌలింగ్ చేయిస్తావా?ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆఖరి రెండు ఓవర్లలో కివీస్ అనుసరించిన వ్యూహాన్ని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఘాటుగా విమర్శించాడు. ‘‘18వ ఓవర్లో.. గెలుపు దోబూచులాడుతున్న వేళ.. ఇద్దరు కుడిచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్న సమయంలో.. ఆఫ్ స్పిన్నర్లను ప్రయోగిస్తారా? ఇంతకంటే జోక్ ఉంటుందా?’’ అంటూ కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌కు గ్రేమ్ స్మిత్ చురకలు అంటించాడు.చదవండి: T20 WC: పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై వేటు! -
IND vs WI: విండీస్‌ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా తాడోపేడో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలిచింది. వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. లేదంటే ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు చేదు అనుభవం తప్పదు.ఇంగ్లండ్, సౌతాఫ్రికా రైట్రైట్నాలుగు గ్రూపుల టాపర్లుగా టీమిండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే సూపర్-8 దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం టాపర్లన్నింటినీ గ్రూప్-1లో చేర్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC).ఇక లీగ్ దశలో ఆయా గ్రూపులలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లను గ్రూప్-2లో చేర్చింది. ఈ క్రమంలో గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.మిగిలిన రెండు స్థానాల కోసంమరోవైపు.. మిగిలిన రెండు స్థానాల కోసం టీమిండియా- వెస్టిండీస్... పాకిస్తాన్- న్యూజిలాండ్ రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాటి పాక్- శ్రీలంక మ్యాచ్ గ్రూప్-2 నుంచి మరో సెమీ ఫైనలిస్టును తేల్చనుండగా.. ఆదివారం జరిగే భారత్- విండీస్ మ్యాచ్‌తో నాలుగో సెమీ ఫైనలిస్టు ఎవరో తేలుతుంది.వెస్టిండీస్‌పై తప్పక గెలవాలికోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై తప్పక గెలిస్తేనే టీమిండియా సెమీస్ చేరుకుంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా మలిచిన ఈ పిచ్‌పై ఫామ్ పరంగా ఇరుజట్లు సమానంగా కనిపిస్తుండటంతో పరుగుల వరద ఖాయం. పైచేయి సాధించిన వారిదే సెమీస్ బెర్తు.సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?అయితే, పటిష్ట టీమిండియా విండీస్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరితే.. ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంటుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో గురువారం (మార్చి 5)న జరిగే రెండో సెమీస్ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ బృందంతో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. అంతా సజావుగా సాగి విండీస్‌పై గెలిచి.. ఇంగ్లండ్‌తో భారత్ సెమీస్ ఆడితే ముఖాముఖి రికార్డు ప్రకారం టీమిండియాదే పైచేయిగా ఉండటం సానుకూలాంశం.టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్- ఇంగ్లండ్ ఇప్పటికి ఐదుసార్లు తలపడగా.. భారత్ మూడు సార్లు, ఇంగ్లండ్ రెండుసార్లు గెలిచాయి. అయితే, ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంగ్లండ్ సూపర్-8లో హ్యాట్రిక్ విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉండగా.. భారత్ ఇంకా బెర్తు ఖరారు చేసుకోలేక ఒత్తిడిలో ఉంది. UPDATE: సామ్సన్ ఆట... సెమీస్ బాట...చదవండి: IND vs ZIM: అభిషేక్ డిఫెన్స్ ఆశ్చర్యపరిచింది -
సంజూది చెత్త టెక్నిక్.. కోచ్‌ల మాట వినడు: భారత మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ తర్వాత భారత ఓపెనింగ్ జోడీ మారిపోయింది. వరుస వైఫల్యాల కారణంగా సంజూ శాంసన్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్‌గా స్థానం కోల్పోయాడు. కివీస్‌తో సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చి అదరగొట్టిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. అభిషేక్ శర్మకు జోడీగా సంజూ స్థానాన్ని భర్తీ చేశాడు.రెండో అవకాశంఅయితే, నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ (Abhishek Sharma) అనారోగ్యం కారణంగా దూరం కాగా.. సంజూకు ఇషాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో అతడు 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్లీ బెంచ్‌కే పరిమితమైన సంజూ (Sanju Samson).. సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.ఘనంగా ఆరంభించిచెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జింబాబ్వేతో మ్యాచ్‌లో సంజూ 15 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, రెండు సిక్స్‌లు బాది 24 పరుగులు చేశాడు. అయితే, బ్లెసింగ్స్ ముజర్బానీ బౌలింగ్‌లో షార్ట్ బంతిని తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. ర్యాన్ బర్ల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో సంజూ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.ఈ నేపథ్యంలో మరోసారి సంజూ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడంటూ అభిమానులు సైతం విమర్శించారు. భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా ఇదే మాట అంటున్నాడు. సంజూ టెక్నిక్ తప్పుగా ఉందని.. ఇప్పటికైనా పొరపాటు సరిచేసుకోవాలని సూచించాడు.మరోసారి తన టెక్నిక్ తప్పని నిరూపించాడు‘‘చెపాక్‌లో సంజూను ఆడించడం వల్ల చెన్నై ప్రేక్షకులు సంతోషించారు. అందుకు తగ్గట్లుగానే అతడు మంచి ఆరంభమే అందుకున్నాడు. కానీ మరోసారి తన టెక్నిక్ తప్పని నిరూపించాడు.లెగ్ సైడ్ దిశగా వచ్చిన బంతిని ఆడేందుకు పక్కకు జరిగి మూల్యం చెల్లించాడు. మూడు స్టంప్స్‌ను ప్రత్యర్థి బౌలర్‌కు చూపి ఈజీ టార్గెట్ అయ్యాడు. క్రికెట్లో ఓనమాలు దిద్దినపుడే ప్రతి ఆటగాడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. మూడు స్టంప్స్ బౌలర్‌కు కనిపించేలా ఎప్పుడూ ఓ బ్యాటర్ ఎప్పుడూ తప్పు చేయకూడదు.కోచ్‌ల మాట వింటాడో లేదో!అలా చేయడం ప్రాథమిక తప్పిదం. అసలు అతడు కోచ్‌ల మాట వింటాడో లేదో నాకు తెలియదు. నిజానికి టీమిండియాలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత కోచ్ ఉన్నాడు. కాబట్టి అతడు ఎవరి మాట విని ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. టెక్నికే తప్పుగా ఉంటే.. ఆటలో ఇంకేం ముందుకు వెళ్లగలవు?.. ఈ టోర్నీలో అతడు టెక్నిక్ సరి చేసుకోవడం కష్టమే అనిపిస్తోంది’’ అంటూ ఘాటుగా సంజూను విమర్శించాడు బద్రీనాథ్.కాగా కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ గత ఏడాది కాలంగా భారత టీ20 ఓపెనర్‌గా రాణించాడు. అయితే, ఇటీవలి కాలంలో అతడు ఫామ్ కోల్పోయాడు. కివీస్‌తో సిరీస్‌లో సంజూ చేసిన పరుగులు 10, 6, 0, 24, 6. గత కొంతకాలంగా అతడు షార్ట్ బంతుల్ని తప్పుగా అంచనా వేసి అవుట్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బద్రీనాథ్ సంజూ టెక్నిక్ సరిగ్గా లేదంటూ చివాట్టు పెట్టాడు.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
టీ20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ 'హ్యాట్రిక్'
కొలంబో: న్యూజిలాండ్‌తో ‘సూపర్ ఎయిట్స్’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. స్పిన్‌కు బాగా అనుకూలిస్తూ బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై ఇది అంత సులువు కాదనిపించింది. కానీ ఫిలిప్స్ వేసిన 18వ ఓవర్లో జాక్స్, రేహన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో సహా 22 పరుగులు రాబట్టి లెక్కను సులువు చేశారు. తర్వాతి 9 బంతుల్లో మరో 22 పరుగులు సాధించి మ్యాచ్‌ను ముగించారు. దాంతో ‘సూపర్ ఎయిట్స్’లో ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలిచి ఇంగ్లండ్ అగ్రస్థానంతో ముగించగా... గెలిస్తే నేరుగా సెమీస్ చేరే అవకాశాన్ని కివీస్ పోగొట్టుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), టీమ్ సీఫెర్ట్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. టామ్ బాంటన్ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (18 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ప్రదర్శన కనబర్చారు. ఓపెనర్లు మినహా... తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 64 పరుగులు జోడించి ఓపెనర్లు సీఫెర్ట్, ఫిన్ అలెన్ (19 బంతుల్లో 29; 3 సిక్స్‌లు) కివీస్‌కు శుభారంభం అందించారు. ఆర్చర్ ఓవర్లో సీఫెర్ట్ వరుసగా 4, 4, 6 బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు చేసింది. అయితే రెండు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఫిలిప్స్ ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు సాధించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన రేహన్ అహ్మద్ తన తొలి బంతికే రచిన్ రవీంద్ర (11)ను అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో కివీస్ మిడిలార్డర్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో జట్టు 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్ (2), బట్లర్ (0) మరోసారి విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (24 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), బెతెల్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) కలిసి కీలక పరుగులు జోడించారు. వీరిద్దరి తర్వాత బాంటన్ బాధ్యత తీసుకోగా, స్యామ్ కరన్ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. అయితే ఈ ఇద్దరినీ కూడా తక్కువ వ్యవధిలో అవుట్ చేసి కివీస్ విజయంపై ఆశలు పెంచుకుంది. కానీ జాక్స్, రేహన్ అహ్మద్ (7 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి అంతా మార్చేశారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అభేద్యంగా 44 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్వదేశానికి మ్యాట్ హెన్రీ... కొలంబో: న్యూజిలాండ్ ప్రధాన పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమయ్యాడు. తన భార్య హాలీ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆ సమయంలో కుటుంబంతో ఉండేందుకు హెన్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత అతను న్యూజిలాండ్‌కు బయల్దేరాడు. జట్టు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నేడు జరిగే పాక్, శ్రీలంక మ్యాచ్ ఫలితం తర్వాత కివీస్ సెమీస్‌కు చేరితే హెన్రీ మళ్లీ తిరిగి వచ్చి జట్టుతో కలుస్తాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 35; అలెన్ (సి) బెతెల్ (బి) జాక్స్ 29; రచిన్ (సి) బెతెల్ (బి) రేహన్ 11; ఫిలిప్స్ (బి) జాక్స్ 39; చాప్మన్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 15; మిచెల్ (సి) జాక్స్ (బి) డాసన్ 3; సాంట్నర్ (నాటౌట్) 9; మెక్‌కోన్‌కీ (బి) రేహన్ 14; హెన్రీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–97, 4–123, 5–133, 6–135, 7–152. బౌలింగ్: ఆర్చర్ 3–1–24–0, డాసన్ 4–0–32–1, కరన్ 1–0–10–0, రషీద్ 4–0–28–2, జాక్స్ 4–0–23–2, బెతెల్ 1–0–13–0, రేహన్ 3–0–28–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సీఫెర్ట్ (బి) హెన్రీ 2; బట్లర్ (సి) సీఫెర్ట్ (బి) ఫెర్గూసన్ 0; బ్రూక్ (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 26; బెతెల్ (సి) ఫిలిప్స్ (బి) రచిన్ 21; బాంటన్ (సి) చాప్మన్ (బి) రచిన్ 33; కరన్ (సి) ఫిలిప్స్ (బి) రచిన్ 24; జాక్స్ (నాటౌట్) 32; రేహన్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–50, 4–58, 5–100, 6–117. బౌలింగ్: హెన్రీ 2.3–0–19–1, ఫెర్గూసన్ 2–0–14–1, సాంట్నర్ 4–0–29–0, మెక్‌కోన్‌కీ 1–0–13–0, ఫిలిప్స్ 4–0–43–1, రచిన్ 4–0–19–3, సోధి 2–0–21–0. -
T20 WC: రింకూ సింగ్ సంచలన నిర్ణయం!
టీమిండియా స్టార్ రింకూ సింగ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అతడి తండ్రి ఖాంచంద్ సింగ్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాటంలో ఓడి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.తండ్రి పాడె మోస్తూ..దీంతో రింకూ సింగ్ (Rinku Singh) హుటాహుటిన స్వస్థలానికి పయనమయ్యాడు. భారత జట్టును వీడి.. చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్కు చేరుకున్నాడు. కన్నీళ్లను దిగమింగుకుని తండ్రి పాడె మోస్తూ.. సోదరులతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశాడు.ఈ నేపథ్యంలో రింకూ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుట్టెడు దుఃఖంలోనూ తిరిగి టీమిండియాతో చేరేందుకు అతడు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి రింకూ సన్నిహితులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ నుంచి అలీఘర్కు రింకూ రోడ్డు మార్గంలో వచ్చాడు. తండ్రి అంత్యక్రియలకు అతడు హాజరయ్యాడు.आंखों में आंसू, कंधे पर पिता की अर्थी…क्रिकेटर रिंकू सिंह के पिताजी के निधन की खबर बेहद दुखद है। इस कठिन घड़ी में रिंकू और उनके परिवार के साथ पूरे देश की संवेदनाएं हैं।ईश्वर दिवंगत आत्मा को शांति दे और परिवार को यह दुःख सहने की शक्ति प्रदान करे। 🙏#RinkuSinghFatherDemise pic.twitter.com/PUSPVIAt3l— Dinesh Kumar (@DineshRedBull) February 27, 2026రింకూ తిరిగి జట్టుతో చేరతాడుతన నలుగురు అన్మదమ్ములతో కలిసి రింకూ కార్యక్రమం పూర్తి చేశాడు’’ అని చెప్పారు. మరోవైపు.. రింకూ అన్న మాట్లాడుతూ.. ‘‘మా నాన్న అంత్యక్రియల కోసమే రింకూ ఇక్కడికి వచ్చాడు. కార్యక్రమం పూర్తైంది. కోల్‌కతాలో మ్యాచ్ కోసం రింకూ తిరిగి జట్టుతో చేరతాడు’’ అని స్పష్టం చేశాడు.కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలనికాగా టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో టీమిండియా ఆదివారం కీలక మ్యాచ్ ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంతటి కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని రింకూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.బ్యాట్ ఝులిపించనేలేదుఇక లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే రింకూ ఇప్పటి వరకు మెరుగ్గా ఆడనేలేదు. లీగ్ దశలో నాలుగు.. సూపర్-8లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌తో కలిపి మొత్తంగా 24 పరుగులే చేయగలిగాడు. అయితే, కొన్నిసార్లు ఏకంగా అతడిని ఎనిమిదో స్థానంలో ఆడించడం కూడా ప్రభావం చూపింది. కాగా జింబాబ్వేతో గురువారం నాటి మ్యాచ్‌కు రింకూ అందుబాటులో ఉన్నా.. అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది యాజమాన్యం. చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది టీమిండియా.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
T20 WC 2026: జట్టును వీడనున్న న్యూజిలాండ్ స్టార్
న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ జట్టును వీడనున్నాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్ అనంతరం స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ ధ్రువీకరించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో సెమీస్ చేరడమే లక్ష్యంగా న్యూజిలాండ్ ముందుకు సాగుతోంది. సూపర్-8లో తొలుత పాక్‌తో కివీస్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దై పోయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది.నెట్ రన్‌రేటు పరంగానూఇక తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దసున్ షనక బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి నెట్ రన్‌రేటును భారీగా మెరుగుపరచుకుంది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకలతో కూడన గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.రెండో బెర్తు కోసం న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య పోటీ నెలకొనగా.. కివీస్ మూడు పాయింట్లతో ముందంజలో ఉంది. ఇక శుక్రవారం ఇంగ్లండ్‌తో తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిచిందంటే న్యూజిలాండ్ నేరుగా సెమీస్ చేరుతుంది.ఈ నేపథ్యంలో కొలంబో వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ జట్టును వీడనున్నాడు. తమ రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ విషయం గురించి కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘మ్యాట్, హోలీల రెండో సంతానం కోసం మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.ఆ కుటుంబానికి ఇది అత్యంత కీలకమైన, ఆనందాయకమైన సమయం. వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం. ఇక జట్టు విషయానికొస్తే.. గతం సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు అదృష్టం మా వైపు ఉంటుందనే అనుకుంటున్నాం.మ్యాట్‌తో పాటు మాకు కూడా స్టార్లు కలిసి రావాలి. ఈ టోర్నీ తుది దశలో అతడు తప్పక జట్టుతో చేరతాడు’’ అని పేర్కొన్నాడు. తమ జట్టు తప్పక సెమీస్ చేరుతుందని.. అప్పటికి మ్యాట్ హెన్రీ మళ్లీ జట్టుతో కలుస్తాడని వాల్టర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మార్చి 4న తొలి సెమీ ఫైనల్.. మార్చి 5న రెండో సెమీస్ మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
Tilak Varma: నాకే చోటు లేదా?.. మెరుపులతో ఇరగదీశాడు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ తిలక్ వర్మ తనదైన మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్‌లోనూ వన్‌డౌన్‌లో దిగాడు. అయితే, ఐదు మ్యాచ్‌లలోనూ తిలక్ వర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.తిలక్ ప్రదర్శన ఇలా..ముఖ్యంగా ఈ హైదరాబాదీ బ్యాటర్ స్ట్రైక్‌రేటుపై విమర్శలు వచ్చాయి. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై తిలక్ వర్మ వరుసగా.. 25, 25 , 25, 31 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.టాపార్డర్ నుంచి తీసేశారు!అయితే, తాజాగా జింబాబ్వేతో గురువారం నాటి సూపర్-8 మ్యాచ్‌లో మాత్రం తిలక్ వర్మ ఇరగదీశాడు. నిజానికి ఈ మ్యాచ్‌కు ముందు ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్లాండర్లే (ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ) ఉన్న కారణంగా.. ఒకరిపై వేటు తప్పదనే విశ్లేషణలు వినిపించాయి.ఊహించినట్లుగానే టాపార్డర్ మారింది. అభిషేక్ శర్మకు జోడీగా.. ఓపెనర్‌గా రైట్ హ్యాండర్ సంజూ శాంసన్ తిరిగి రాగా.. ఇషాన్‌ను వన్‌డౌన్‌లో ఆడించారు. అయితే, ఊహించని రీతిలో తిలక్ వర్మను లోయర్ ఆర్డర్‌కు పంపించారు. ఐపీఎల్లో ఆడిన అనుభవం ఇప్పటికే తిలక్‌కు ఉంది.16 బంతుల్లోనే ఇక జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ వర్మ మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్ట్రైక్‌రేటు 275. ఇలా మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం ఫలించి.. తిలక్ వర్మ విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.డౌన్ ఆర్డర్‌కు పంపడం మంచిదైందిఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తిలక్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘‘తిలక్ వర్మను డౌన్ ఆర్డర్‌కు పంపి టీమిండియా మంచి పని చేసింది. లోయర్ ఆర్డర్లో అతడు బ్యాటింగ్ చేయడం నేను ఇప్పటికే చూశాను.నిజానికి ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక రావడం వల్ల.. టాపార్డర్‌తో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఐదు, తిలక్ ఆరో స్థానంలో రావడం వారితో పాటు జట్టుకు మేలు చేసింది. నిజానికి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌ను ఐదు, హార్దిక్‌ను ఏడో స్థానంలో సూర్య పంపడం చూసి నేను షాకయ్యాను. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో తిలక్, హార్దిక్‌లను సరైన స్థానాల్లో ఆడించి ఫలితం రాబట్టారు’’ అని సంజయ్ మంజ్రేకర్ టీమిండియా నాయకత్వ బృందాన్ని అభినందించాడు. కాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా 72 పరుగుల తేడాతో గెలిచి.. సెమీస్ అవకాశాలు మెరుగుపరచుకుంది.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
అదేం బౌలింగ్?.. అతడు అవసరమా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియా ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశలో పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై వేదికగా పసికూన జింబాబ్వేను 72 పరుగులతో చిత్తు చేసింది. తద్వారా రెండు పాయింట్లు సాధించడంతో పాటు.. నెట్‌రన్‌రేటును మెరుగుపరుచుకుంది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది భారత్.ఏకంగా 256 పరుగులుఇక గురువారం నాటి మ్యాచ్‌లో చెపాక్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించడంతో భారత బ్యాటర్లు చెలరేగిన విషయం తెలిసిందే. జింబాబ్వే బౌలింగ్‌ను చితక్కొడుతూ టీమిండియా ఏకంగా 256 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే సైతం ఈ బ్యాటింగ్ పిచ్‌పై 184 పరుగులు చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత బౌలింగ్ వ్యూహంపై పెదవి విరిచాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ శివం దూబే (Shivam Dube)తో ఎందుకు బౌలింగ్ చేయించారో అర్థం కాలేదన్నాడు. కాగా జింబాబ్వే (IND vs ZIM)తో మ్యాచ్‌లో దూబే రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకుని.. ఒకే ఒక్క వికెట్ తీశాడు. నోబాల్, వైడ్లతో ప్రత్యర్థికి అదనపు పరుగులు ఇచ్చుకున్నాడు.ఇది బ్యాటింగ్ పిచ్‌ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అసలు ఈ మ్యాచ్‌లో బౌలింగ్ గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇది బ్యాటింగ్ పిచ్. అలాంటపుడు టీమిండియా ఆరో బౌలింగ్ ఆప్షన్ గురించి ఎందుకు ఆలోచించిందో అర్థం కాలేదు.ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడో చూశారా?అసలు దూబే ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడో చూశారా? అతడు సిక్స్త్ స్టంప్ మీదకు బాల్ వేస్తున్నాడు. ఇలాంటి బౌలింగ్ నేనెప్పుడూ చూడనేలేదు. టీమిండియా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే బరిలోకి దిగింది. ఒకవేళ దూబే వంటి వాళ్లతో బౌలింగ్ చేయించాలనుకుంటే ముందుగా ప్రాక్టీస్ చేయించాలి.ఇది కేవలం నెట్‌రన్‌రేటును మెరుగుపరచుకోవడం గురించి కాదు. ముందుగా మ్యాచ్ గెలవాలి. అప్పుడే పాయింట్లు వస్తాయి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. ఏదేమైనా భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుందని.. అప్పుడు అవసరమైతే ఆరో బౌలింగ్ ఆప్షన్‌ను వాడుకోవచ్చని చిక్కా సూచించాడు.చదవండి: T20 WC 2026: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ రోజు వర్షం పడితే..? -
జింబాబ్వే చిత్తు.. టీమిండియా సెమీస్ ఆశలు సజీవం
టీ20 వరల్డ్‌కప్-2026లో టీమిండియా తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. జింబాబ్వేను 72 పరుగుల తేడాతో సూర్య సేన చిత్తు చేసింది. ఈ కీలక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఇండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిలక్ వర్మ(16 బంతుల్లో 44), ఇషాన్ కిషన్(38), సూర్యకుమార్ యాదవ్(33), సంజూ శాంసన్(24) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్ సికందర్ రజా తలా ఒక వికెట్ పడగొట్టారు.బెన్నెట్ ఒంటరి పోరాటం..255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ రియాన్ బెన్నెట్ ఒంటరి పోరాటం చేశాడు. 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 97 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. కెప్టెన్ సికిందర్ రజా(31) ఫర్వాలేదన్పించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా.. స్ట్రైక్‌రేటు పరంగా అత్యంత అరుదైన ఘనత సాధించింది. జింబాబ్వేతో గురువారం నాటి సూపర్-8 మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ సేన ఈ ఫీట్ నమోదు చేసింది.మెరుపులుచెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ ఓడిన టీమిండియా.. జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌గా తిరిగి వచ్చిన సంజూ శాంసన్ (Sanju Samson) 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేటు 160. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి.. 183కు పైగా స్ట్రైక్‌రేటుతో 55 పరుగులు సాధించాడు.వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు చేయగా.. స్ట్రైక్‌రేటు 158.33గా నమోదైంది. మరోవైపు.. ధనాధన్ దంచికొట్టిన కెప్టెన్ సూర్యకుమార్ 13 బంతుల్లో 253కు పైగా స్ట్రైక్‌రేటుతో 33 పరుగులు రాబట్టాడు.𝙈𝙖𝙥𝙤𝙨𝙖 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙡𝙡, 𝙎𝙆𝙔 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙧𝙩𝙝𝙚𝙧. 🚀Total control from Suryakumar Yadav as he steers India forward!ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/QZBUsVXD6e— Star Sports (@StarSportsIndia) February 26, 2026అతడి స్ట్రైక్‌రేటు 275ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుని.. 217కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేయగా.. తిలక్ వర్మ 16 బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 275గా ఉండటం విశేషం. హార్దిక్, తిలక్ ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టపోయి.. 256 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది.టీమిండియా ప్రపంచ రికార్డుఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డు సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో... ఓ జట్టులోని ఆరుగురు లేదంటే అంతకంటే ఎక్కువ మంది బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్‌రేటుతో.. ఇరవైకి పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, కెప్టెన్ సికందర్ రజా, టినోటెండా మపోసా తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకికాగా మొదటిసారి 2007లో ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా.. 2024లో రెండోసారి టైటిల్ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ లీగ్ దశలో సత్తా చాటింది. అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-8కు చేరుకుంది.అయితే, సూపర్-8 తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో పాటు తదుపరి వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలిస్తేనే సూర్యసేనకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్! -
IND vs ZIM: హార్దిక్, తిలక్ విధ్వంసం.. భారత్ భారీ స్కోరు
జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించింది. బ్యాటర్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. దీంతో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక గెలవాల్సిన పరిస్థితి.అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీఇలాంటి దశలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో సంజూ శాంసన్ (24) నిరాశపరచగా.. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55) చాన్నాళ్ల తర్వాత బ్యాట్ ఝులిపించాడు. అభి అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) 24 బంతుల్లో 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.హార్దిక్, తిలక్ విధ్వంసంకెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు (13 బంతుల్లో 33) మెరిపించగా.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya), తిలక్ వర్మ దంచికొట్టారు. హార్దిక్ 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 50 పరుగులతో అజేయంగా నిలవగా.. తిలక్ వర్మ 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హార్దిక్ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించగా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 256 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్ సికందర్ రజా తలా ఒక వికెట్ పడగొట్టారు.రికార్డు స్కోరుకాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు టోర్నీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగానూ భారత్ నిలిచింది. తాజాగా భారత్ జింబాబ్వేతో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. 2007లో శ్రీలంక కెన్యా మీద ఆరు వికెట్ల నష్టానికి 260 రన్స్ రాబట్టింది.చదవండి: T20 WC: మారవా?.. సంజూ శాంసన్ విఫలం𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత.. ఎట్టకేలకు
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్‌లో ఈ లెఫ్టాండర్ బ్యాట్ ఝులిపించాడు. ఇరవై ఆరు బంతుల్లోనే అర్ధ శతకం బాది సత్తా చాటాడు.ఆది నుంచి దారుణంగా విఫలంటీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్ శర్మ ఆది నుంచి దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ తర్వాత కడుపు నొప్పి వల్ల నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూఅనంతరం జట్టులోకి తిరిగి వచ్చిన అభిషేక్ శర్మ పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లతో మ్యాచ్‌లలోనూ డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం జట్టులో కొనసాగించగా.. సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు చేసి నిష్క్రమించాడు.దీంతో అభిషేక్ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తుదిజట్టు నుంచి తప్పించి.. అతడికి కాస్త బ్రేక్ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.A well-constructed half-century for #AbhishekSharma! 👏His first in the ICC Men’s T20 World Cup and what an occasion to bring it up! 💙ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/vIVUWHYhSe— Star Sports (@StarSportsIndia) February 26, 2026అర్ధ శతకంతోజింబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ.. ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా కెరీర్లో తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న ఈ పంజాబీ బ్యాటర్‌కు.. ఐసీసీ ఈవెంట్లో ఇదే తొలి ఫిఫ్టీ కావడం విశేషం. అయితే, మపోసా బౌలింగ్‌లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 16, తిలక్ వర్మ 11 పరుగులతో క్రీజులో నిలిచారు. ఓపెనర్ సంజూ శాంసన్ 24, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 38 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య 13 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
T20 WC: మారవా?.. సంజూ శాంసన్ విఫలం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు సంజూ శాంసన్. నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ దూరం కావడంతో.. ఓపెనర్‌గా అతడి స్థానంలో వచ్చాడు. పసికూనతో మ్యాచ్‌లో ఎనిమిది బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) మెరుగ్గా ఆడగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం అతడిని కొనసాగించింది. సంజూను బెంచ్‌కు పరిమితం చేసింది.మరో అవకాశంఅయితే, తాజాగా జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్ సందర్భంగా మరోసారి సంజూ శాంసన్‌కు మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లెఫ్టాండర్ అభిషేక్ శర్మతో కలిసి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గురువారం భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభించాడు. 𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026ఘనంగానే ఆరంభించాడు.. కానీఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్ బాది ఘనంగా ఆరంభించాడు సంజూ. రెండో ఓవర్లోనూ ఓ సిక్సర్ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ మరుసటి ఓవర్లో బౌండరీ రాబట్టాడు. ఇలా మంచి ఫామ్‌లోకి వచ్చిన సంజూ.. నాలుగో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.బ్లెసింగ్ ముజర్బానీ సంధించిన షార్ట్ బాల్‌ను సంజూ గాల్లోకి లేపగా.. డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకు వచ్చి ర్యాన్ బర్ల్ క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా సంజూ శాంసన్ పెవిలిన్ చేరగా.. భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మారవా సంజూ!జింబాబ్వేతో మ్యాచ్‌లో మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాది 24 పరుగులు చేయగలిగాడు. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిమానులు ఉసూరుమంటున్నారు.ఇక తుదిజట్టులో సంజూను చూడటం కష్టమేనని వాపోతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సంజూ వరుసగా విఫలమయ్యాడు. దీంతో ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్ భర్తీ చేశాడు. ఇక జింబాబ్వేతో మ్యాచ్‌తో సంజూ తిరిగి రాగా.. ఇషాన్ వన్‌డౌన్‌లో దిగాడు. పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 80-1(6). ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి ఇషాన్ 15, అభిషేక్ శర్మ 33 పరుగులతో క్రీజులో నిలిచారు. చెన్నై వేదికగా టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్! -
జింబాబ్వేతో మ్యాచ్.. భారత తుదిజట్టులో రెండు మార్పులు
టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ స్ధానంలో అక్షర్ పటేల్, సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. అభిషేక్, సంజూ కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. క్రీమర్ స్థానంలో టినోటెండా మాపోసాకు చోటు దక్కింది.తుది జట్లుజింబాబ్వే: తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవభారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సూపర్-8 దశలో సౌతాఫ్రికా మరో ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియాను 76 పరుగులతో చిత్తు చేసిన సఫారీలు.. తాజాగా వెస్టిండీస్‌ను కూడా చిత్తు చేశారు. తద్వారా సెమీ ఫైనల్ రేసులో ప్రొటిస్ జట్టు ముందుకు దూసుకుపోయింది. అంతేకాదు టీమిండియా సెమీస్ ఆశలను కూడా సజీవం చేసింది.పోటీలో నాలుగుసూపర్-8 దశలో గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా, టీమిండియా, వెస్టిండీస్, జింబాబ్వే బరిలో నిలిచాయి. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా- టీమిండియా తలపడగా.. మార్క్రమ్ బృందం సూర్యకుమార్ సేనను చిత్తుగా ఓడించింది. దీంతో భారత జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.మరోవైపు.. వెస్టిండీస్ తమ తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై ఏకంగా 107 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా రెండు పాయింట్లతో పాటు నెట్‌రన్‌రేటు పరంగా పటిష్ట స్థితిలో నిలిచింది. ఇలాంటి తరుణంలో సౌతాఫ్రికా విండీస్‌ను ఓడిస్తేనే టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగయ్యే పరిస్థితి.టీమిండియాకు సానుకూలాంశంఈ నేపథ్యంలో గురువారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా విండీస్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేయడం.. టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. అహ్మదాబాద్ వేదికగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.నిప్పులు చెరిగిన బౌలర్లుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. విండీస్ బ్యాటర్లలో జేసన్ హోల్డర్ (49), రొమారియో షెఫర్డ్ (52 నాటౌట్) రాణించారు. ప్రొటిస్ బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ, కార్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.మార్క్రమ్ ధనాధన్‌ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 16.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ నష్టపోయి పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో క్వింటన్ డికాక్ (24 బంతుల్లో 47) ఫర్వాలేదనిపించగా.. ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.మార్క్రమ్కు తోడుగా ర్యాన్ రికెల్టన్ (28 బంతుల్లో 45 నాటౌట్) రాణించాడు. వీరిద్దరు కలిసి 49 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. కాగా ఇప్పటికే సూపర్-8లో రెండు గెలిచిన సౌతాఫ్రికా తదుపరి జింబాబ్వేపై కూడా గెలవాలి.అదే విధంగా టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్ జట్లపై తప్పక విజయం సాధించాలి. అలా అయితేనే నెట్‌రన్‌రేటు లెక్కలతో పనిలేకుండా టీమిండియాకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.Is there anything that can stop #AidenMarkram today?! 🤯He is now the highest run-scorer for South Africa in ICC Men’s T20 World Cup history! 🚨ICC Men’s #T20WorldCup | Super 8 #WIvSA | LIVE NOW 👉 https://t.co/IaEbZJRFNR pic.twitter.com/qPhp9R82bA— Star Sports (@StarSportsIndia) February 26, 2026వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లువెస్టిండీస్: 176/8(20)సౌతాఫ్రికా: 177/1(16.1)ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
SA vs WI: హోల్డర్, షెఫర్డ్ ధనాధన్.. విండీస్ స్కోరెంతంటే?
సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ మెరుగైన స్కోరు సాధించింది. ప్రొటిస్ పేసర్లు నిప్పులు చెరగడంతో ఆదిలో తడబడినా.. ఆఖర్లో జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ ధనాధన్ దంచికొట్టడంతో గౌరవప్రదమైన స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది.టీ20 ప్రపంచకప్-2026లో గ్రూప్-1 ప్రస్తుత టాపర్ వెస్టిండీస్- సౌతాఫ్రికా (WI vs SA) మధ్య గురువారం నాటి సూపర్-8 మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.నిప్పులు చెరిగిన ప్రొటిస్ పేసర్లుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు లుంగి ఎంగిడి, కగిసో రబడ షాకులు మీద షాకులు ఇచ్చారు. తొలుత ఓపెనర్లలో కెప్టెన్ షాయీ హోప్ (16)ను పెవిలియన్‌కు పంపిన రబడ.. వన్‌డౌన్ బ్యాటర్ షిమ్రన్ హెట్‌మైర్ (2)ను కూడా అవుట్ చేశాడు.హోల్డర్, షెఫర్డ్ మెరుపులుఅనంతరం ఎంగిడి రోవ్‌మన్ పావెల్ (9), రోస్టన్ ఛేజ్ (2), బ్రాండన్ కింగ్ (21)లను వెనక్కి పంపగా.. కార్బిన్ బాష్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (12), మాథ్యూ ఫోర్డ్ (11) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ బ్యాట్ ఝులిపించారు.హోల్డర్ 31 బంతుల్లో 49 పరుగులు చేయగా.. షెఫర్డ్ 37 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో హోలర్డర్ బాష్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. షెఫర్డ్అర్థ శతకం పూర్తి చేసుకోగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది.మెరుగైన భాగస్వామ్యంహోల్డర్- షెఫర్డ్ కలిసి ఎనిమిదో వికెట్‌కు 57 బంతుల్లో 89 పరుగులు జోడించారు. వీరిద్దరు విజృంభించడంతో 83/7గా ఉన్న విండీస్ స్కోరు.. 176/8కు చేరుకుంది.టీమిండియా భవిష్యత్ సౌతాఫ్రికా చేతిలోగ్రూప్-1 టాపర్ విండీస్‌ను సౌతాఫ్రికా చిత్తుగా ఓడిస్తేనే టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక విండీస్ గెలిస్తే అనధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకునే వీలుంటుంది. అదే సమయంలో.. టీమిండియా సెమీ ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతు అవుతాయి.చదవండి: IND vs ZIM: భారత తుదిజట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు! -
IND vs ZIM: భారత తుదిజట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు!
జింబాబ్వేతో కీలక సూపర్-8 మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య గురువారం చెన్నై వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌కు తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ముందడుగు వేయాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక భారీ విజయం సాధించాలి.లెఫ్ట్-రైట్ కాంబినేషన్ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు విషయంలో యాజమాన్యం ఆచితూచి వ్యవహరిస్తోంది. టాపార్డర్‌లో ముగ్గురు లెఫ్టాండర్లే ఉండటం వల్ల ప్రత్యర్థి జట్టు బౌలర్లు.. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లకు ఈజీ టార్గెట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్‌ను తుదిజట్టులో చోటు ఇవ్వనున్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.ఆ ముగ్గురిపై వేటు!అయితే, ఓపెనింగ్ జోడీగా మాత్రం లెఫ్టాండర్లు ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మను కొనసాగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న మరో లెఫ్టాండర్ తిలక్ వర్మపై వేటు వేసి.. అతడి స్థానంలో అంటే వన్‌డౌన్‌లో కుడిచేతి వాటం బ్యాటర్ సంజూను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అదే విధంగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను ఆడించకుండా మూల్యం చెల్లించిన నేపథ్యంలో.. తిరిగి అతడిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు స్పిన్‌కు అనుకూలమైన చెపాక్ పిచ్‌పై చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో స్థానిక ఆల్‌రౌండర్, చెన్నై చిన్నోడు వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడవచ్చు. అదే విధంగా రింకూ సింగ్‌ను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి జింబాబ్వేతో మ్యాచ్‌లో తిలక్ స్థానంలో సంజూ.. వాషీ స్థానంలో కుల్దీప్.. రింకూ స్థానంలో అక్షర్ పటేల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.సఫారీల చేతిలో భారీ ఓటమితోకాగా గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లోనే భారీ ఓటమిని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్ చేరాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక భారీ విజయాలు సాధించడంతో పాటు.. విండీస్- సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. చదవండి: పతనం అంచుల్లో శ్రీలంక క్రికెట్ -
సౌతాఫ్రికా, విండీస్ ముందున్నాయి.. భారత్ సెమీస్ చేరాలంటే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా లీగ్ దశలో అజేయంగా నిలిచింది. గ్రూప్-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను ఓడించి టాపర్‌గా సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే, కీలక సమయంలో సమిష్టి వైఫల్యంతో సూర్యకుమార్ సేన చేతులెత్తేసింది.అతిపెద్ద పరాజయంసూపర్-8 గ్రూప్-1లో భాగంగా సౌతాఫ్రికా (IND vs SA)తో మ్యాచ్‌లో మరీ దారుణంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. తద్వారా తమ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.అందనంత ఎత్తులో విండీస్మరోవైపు.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా టీమిండియాను 76, వెస్టిండీస్ జింబాబ్వే (WI vs ZIM)ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాలు సాధించాయి. చెరో విజయంతో రెండేసి పాయింట్లు సంపాదించాయి. అయితే, సఫారీల (+3.800)తో పోలిస్తే విండీస్ (+5.350)నెట్‌రన్‌రేటు పరంగా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచి టాపర్‌గా ఉంది.మరోవైపు భారత్ (-3.800) ఘోర పరాజయంతో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో.. అదే విధంగా ఆదివారం విండీస్‌తో మ్యాచ్‌లో తప్పక భారీ తేడాతో గెలవాలి. లేదంటే సెమీస్ చేరకుండానే నిష్క్రమించాల్సి వస్తుంది. గెలుపు ముఖ్యం.. ఆ తర్వాతే ఏదైనాఅయితే, జింబాబ్వేతో మ్యాచ్‌లో నెట్‌రన్‌రేటు కంటే కూడా గెలుపే ముఖ్యంగా ఆడాలని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. ‘‘జింబాబ్వేతో మ్యాచ్‌లో మొదట విజయం గురించి మాత్రమే ఆలోచించాలి. గెలిస్తేనే కదా నెట్‌రన్‌రేటు లెక్కలోకి వచ్చేది. ఇప్పుడు మనకు గెలుపు పాయింట్లు అత్యంత ముఖ్యం.ఏదేమైనా ఇప్పుడు నెట్‌రన్‌రేటు పరంగా వెస్టిండీస్‌ను మనం ఓడించడం అసాధ్యం. టీ20 క్రికెట్లో జింబాబ్వే, వెస్టిండీస్ వంటి జట్లపై 100 పరుగుల తేడాతో విజయాలు సాధించడం కష్టం. కాబట్టి తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలుపు ఒక్కటే మనకు ముఖ్యం. ఆ తర్వాతే నెట్‌రన్‌రేటు గురించి ఆలోచించాలి.ఇంత చెత్తగా ఆడతారా?సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మూడు విభాగాల్లో భారత్ విఫలమైంది. కనీసం ఒక్క బ్యాటర్ కూడా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. అందువల్లే భారీ తేడాతో ఓడి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్నాం. ఏదేమైనా ప్రస్తుతం వెస్టిండీస్, సౌతాఫ్రికా నెట్‌రన్‌రేటు పరంగా మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. మనం మూడు విభాగాల్లో రాణిస్తేనే ముందడుగు వేయగలం’’ అని ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు.చదవండి: IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు! -
షాకులిచ్చిన శ్రీలంక.. సాంట్నర్ ధనాధన్ దంచికొట్టగా..
శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. మిడిలార్డర్ కకావికలమైనా లోయర్ ఆర్డర్ రాణించడంతో గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సూపర్-8 మ్యాచ్‌లో భాగంగా కొలంబో వేదికగా.. టాస్ గెలిచిన శ్రీలంక.. కివీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో కివీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (8)ను దుష్మంత చమీర త్వరగానే పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (13 బంతుల్లో 23)ను మహీశ్ తీక్షణ వెనక్కి పంపగా.. రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 32) తీక్షణ బౌలింగ్‌లో హేమంతకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.పెవిలియన్‌కు క్యూఅయితే, టాపార్డర్ ఓ మాదిరిగా ఆడగా.. మిడిలార్డర్ బ్యాటర్లు మాత్రం పెవిలియన్‌కు క్యూ కట్టారు. గ్లెన్ ఫిలిఫ్స్ (18), డారిల్ మిచెల్ (3) ఇలా వచ్చి అలా వెళ్లగా.. మార్క్ చాప్మన్ డకౌట్ అయ్యాడు.సాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మిచెల్ సాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 47 పరుగులు సాధించాడు. Captain to the rescue! 💪Mitchell Santner's power-hitting pushes New Zealand's fightback. ICC Men’s #T20WorldCup | SUPER 8, #SLvNZ ➡️ LIVE NOW 👉 https://t.co/g4wqt4U8vL pic.twitter.com/p0KW8AcuLA— Star Sports (@StarSportsIndia) February 25, 2026రాణించిన మెకాంచీఇక జేమ్స్ నీషమ్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన మరో బౌలింగ్ ఆల్‌రౌండర్ కోల్ మెకాంచీ సాంట్నర్‌కు తోడుగా రాణించాడు. మెకాంచీ 23 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 168 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర చెరో మూడు వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలగే ఒక వికెట్ దక్కించుకున్నాడు. తుదిజట్లుశ్రీలంకపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంకన్యూజిలాండ్‌టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్ -
IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. అతడిపై వేటు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధమైంది. సూపర్-8 దశలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఇషాన్ హిట్.. అభిషేక్ ఫ్లాప్‌కాగా ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మలకు అవకాశాలు వస్తుండగా.. సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అయితే వరల్డ్‌కప్ టోర్నీలో ఇషాన్ మెరుగ్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో తొలి మూడు మ్యాచ్‌లలోనూ డకౌట్ అయ్యాడు.ఇక సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో టీమిండియా తలపడగా.. ఈసారి ఇషాన్ డకౌట్ కాగా.. అభిషేక్ 15 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. సంజూ లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్‌లో బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.తిలక్ వర్మపై విమర్శలుఇదిలా ఉంటే.. మూడో స్థానంలో ఆడుతున్న తిలక్ వర్మ ఇప్పటి వరకు పెద్దగా బ్యాట్ ఝులిపించనేలేదు. అతడి స్ట్రైక్‌రేటుపై విమర్శలు వస్తున్నాయి. ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్లు ఇషాన్- అభిషేక్.. వన్‌డౌన్‌లో వచ్చే తిలక్.. ఈ ముగ్గురూ లెఫ్టాండ్ బ్యాటర్లే. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు, కెప్టెన్‌కు పని సులువు అయిపోతోంది. వ్యూహాల్లో పెద్దగా మార్పులు లేకుండానే వాళ్లు అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నారు.లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసంఇలాంటి తరుణంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం టీమిండియా టాపార్డర్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో సంజూ శాంసన్‌ను చేర్చే విషయమై చర్చ నడుస్తోంది.సంజూ వస్తాడని సంకేతంజింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా మార్పులు ఉండవచ్చు. మా ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌లో వచ్చే ఆటగాడు కూడా లెఫ్టాండర్ బ్యాటరే కావడం ఇందుకు కారణం. అందుకే ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నాం. అయితే, మ్యాచ్ సమయంలోనే మేము తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని కొటక్ తెలిపాడు.ఎవరిపై వేటు?ఒకవేళ సంజూ గనుక తుదిజట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రింకూ సింగ్ స్థానంలో సంజూను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సంజూను వన్‌డౌన్‌లో ఆడించి.. తిలక్‌ను డిమోట్ చేయడం ఓ ఆప్షన్. అయితే, ఇప్పటికే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించినా రింకూ జట్టుతో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కొటక్ తెలిపాడు.రింకూ, తిలక్, అభిషేక్!అంటే రింకూ జింబాబ్వేతో మ్యాచ్ ఆడటం ఖాయమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో రీసెట్ అయ్యేందుకు.. లెఫ్ట్-రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ కోసం అతడిని పక్కనపెడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. అభిషేక్- ఇషాన్ జోడిని కొనసాగిస్తే.. తిలక్ వర్మపై వేటు వేసి.. సంజూను మూడోస్థానంలోనే ఆడిస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. సితాన్షు కొటక్ చెప్పినట్లు మ్యాచ్ ఆరంభానికి ముందు వరకు భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేయడం ఈసారి కాస్త కష్టమే అనిపిస్తోంది. కాగా చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడిన భారత తుదిజట్టులో ఏకంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ -
ఇలా అయితే పాక్ వరల్డ్‌కప్ గెలవదు: పాకిస్తాన్ కెప్టెన్ భార్య ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. సూపర్-8 దశలో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమిపాలైంది. పల్లెకెలె వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.సెమీస్ అవకాశాలు సంక్లిష్టంఫలితంగా పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా, అతడి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌లో పాక్ ఓటమికి సల్మాన్‌ను బాధ్యుడిని చేస్తూ.. అతడి భార్య, కుమారుడిని అభ్యంతరకర రీతిలో పాక్ జట్టు అభిమానులు తిడుతూ పోస్టులు పెట్టారు.అంతేకాదు.. పాక్ గనుక సెమీస్ చేరకుంటే సల్మాన్‌తో పాటు అతడి కుటుంబం కూడా భూమ్మీద ఉండదంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. ఇలా అయితే పాక్ వరల్డ్‌కప్ గెలవదుఈ నేపథ్యంలో సల్మాన్ అలీ ఆఘా భార్య సబా మంజర్ ట్రోల్స్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘‘పాకిస్తానీ అభిమానులారా!... నన్ను లేదంటే.. మా అమాయకపు చిన్నారి కుమారుడిని దూషించడం ద్వారా మనం ప్రపంచకప్ గెలవలేము’’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.కాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత సల్మాన్‌తో పాటు పాక్ జట్టులోని ఆటగాళ్లందరిపై నెట్టింట తిట్ల వర్షం కురుస్తోంది. ఇక పాక్ అభిమానులకు ఇదేమీ కొత్తకాదు. ముఖ్యంగా 1996 వరల్డ్‌కప్‌లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత.. పాక్ క్రికెటర్ల నివాసాలపై దాడులు జరిగాయి. నాటి కెప్టెన్ వసీం అక్రం ఇంటి మీద కూడా నిరసనకారులు దాడికి దిగారు.సెమీస్‌లో తొలి అడుగు ఇంగ్లండ్దేఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలైన టీ20 ప్రపంచకప్-2026లో సూపర్-8 దశ నడుస్తోంది. గ్రూప్-1 నుంచి టీమిండియా, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక బరిలో ఉన్నాయి.సూపర్-8లో భాగంగా పాక్ తొలుత న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ రద్దైపోయింది. దీంతో ఇరుజట్లకు చెరోపాయింట్ వచ్చింది. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. గత మ్యాచ్‌లో శ్రీలంకపై.. తాజాగా పాక్‌పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది ఇంగ్లండ్.చదవండి: NZ vs SL: కివీస్, శ్రీలంకలకు భారీ షాక్!.. పాక్‌కు గుడ్‌న్యూస్? -
అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం తర్వాత టీమిండియా జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశలో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుదిజట్టు కూర్పు గురించి ముఖ్యంగా.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ల గురించి కొటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.సంజూకు మొండిచేయికాగా ఇషాన్ కిషన్ రాకతో భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా సంజూ శాంసన్ స్థానం గల్లైంతైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ- ఇషాన్ జోడీగా బరిలో దిగారు. అయితే, నమీబియాతో మ్యాచ్‌కు మాత్రం అభిషేక్ గైర్హాజరీలో సంజూ ఓపెనర్‌గా వచ్చాడు.తిలక్ వర్మ ఆట తీరుపై విమర్శలుమరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. అతడి స్ట్రైక్‌రేటు కూడా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌లో తిలక్‌ను తప్పించి సంజూను మూడో స్థానంలో ఆడించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.తిలక్ గురించి బాధ లేదుఈ పరిణామాల నేపథ్యంలో సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి మాకు ఎలాంటి సమస్య లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు చక్కగా ఆడాడు. రెండు, మూడు బౌండరీలు బాదితే అంతా అదే సర్దుకుంటుంది. అతడు బంతులు వృథా చేస్తున్నాడన్న అంశంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు.అభిషేక్ శర్మ గురించి కూడా మేము ఆందోళన చెందడం లేదు. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమి గురించి కూడా పెద్దగా ఆందోళన లేదు. తదుపరి మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం మీదే మేము ప్రస్తుతం దృష్టి సారించాము.సంజూ రావొచ్చుప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను అర్థం చేసుకుని.. సరైన జవాబు ఇచ్చే విధంగా మా బ్యాటర్లు సంసిద్ధం అవుతున్నారు. ప్రణాళిక, సన్నాహకాలపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అతడి (సంజూ) గురించి చర్చ నడుస్తోంది. అయితే, మేము ముందుగానే తుదిజట్టును నిర్ణయించబోము. అతడిని ఆడించే ఆలోచన లేదని మాత్రం చెప్పము’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడిన రింకూ సింగ్ బుధవారం సాయంత్రం టీమ్‌తో కలుస్తాడని తెలిపాడు.సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతోఇదిలా ఉంటే.. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై గెలుపొంది అజేయంగా నిలిచింది టీమిండియా. అయితే, సెమీస్ దిశగా అడుగులు వేసే క్రమంలో ఊహించని రీతిలో సూపర్-8 తొలి మ్యాచ్‌లోనే ఘోరంగా ఓడిపోయింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై నెగ్గితేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: T20 WC 2026: పాక్ జట్టులో కలకలం -
T20 WC: కివీస్, లంకకు భారీ షాక్!.. పాక్‌కు గుడ్‌న్యూస్?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షార్ఫణం అయ్యాయి. లీగ్ దశలో పల్లెకెలె వేదికగా ఐర్లాండ్- జింబాబ్వే మ్యాచ్ వాన కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. ఇక సూపర్-8 దశలో కొలంబో వేదికగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కూడా వర్షం వల్ల మొదలుకాకుండానే ముగిసిపోయింది.ఫలితంగా సెమీస్ రేసులో కీలకమైన సూపర్-8 దశలో ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో తదుపరి మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.కివీస్, లంకకు భారీ షాక్!సూపర్-8 గ్రూప్-2లో భాగంగా కివీస్ బుధవారం కొలంబో వేదికగా శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ఆరంభ సమయం (రాత్రి 7 గంటల) నుంచి తొమ్మిది గంటల వరకు వాన పడేందుకు 14 శాతం అవకాశాలు ఉన్నాయి.రాత్రి 10, 11 గంటల ప్రాంతంలో వర్షం పడేందుకు 49- 58 శాతం అవకాశాలు ఉన్నాయి. దీంతో కివీస్- శ్రీలంక మ్యాచ్ రద్దయిపోయేందుకు ఎక్కువ ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం తెరిపినిస్తే ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కివీస్ జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఒకవేళ మ్యాచ్ రద్దైతే.. తదుపరి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తప్పక గెలవాలి. లేదంటే పాకిస్తాన్‌తో పోటీలో వెనుకబడే అవకాశం ఉంది.పాక్‌కు ఒక రకంగా శుభవార్తే!కాగా గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్.. శ్రీలంక, పాకిస్తాన్లను ఓడించి ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. రెండో స్థానం కోసం కివీస్, పాక్ మధ్య పోటీ నెలకొంది. కివీస్ శ్రీలంకతో పాటు ఇంగ్లండ్‌ను కూడా ఓడిస్తే నేరుగా సెమీస్ చేరుకుంటుంది.అలా కాక ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. పాక్‌కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇక పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. శ్రీలంక, ఇంగ్లండ్ చేతుల్లో న్యూజిలాండ్ తప్పక ఓడిపోవాలి. అదే విధంగా శ్రీలంకపై పాక్ గెలవాల్సి ఉంటుంది. అలా కాకుండా.. న్యూజిలాండ్, పాకిస్తాన్ తదుపరి ఒక్కో మ్యాచ్‌లో గెలిస్తే.. పాయింట్ల సంఖ్య (3) సమానం అవుతుంది. అలాంటపుడు నెట్‌రన్‌రేటు కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు.. శ్రీలంక రేసులో ఉండాలంటే న్యూజిలాండ్, పాకిస్తాన్‌లపై భారీ విజయాలు సాధించాలి.కాగా వరల్డ్‌కప్ టోర్నీకి భారత్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. కొన్నిరోజులుగా కొలంబో, పల్లెకెలెలో వర్షం పడటం.. శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడే జట్లకు ఇబ్బందికరంగా మారింది. Update: NZ Vs SL: న్యూజీలాండ్ చేతిలో శ్రీలంక ఘోర పరాజయంచదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ -
రాణించిన పాక్ బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పల్లెకలే వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.ఓపెనర్ సైమ్ అయూబ్(9), కెప్టెన్ సల్మాన్ అఘా(5) నిరాశపరిచినప్పటికి.. సాహిబ్జాదా ఫర్హాన్(63), ఫఖర్ జమాన్(25), బాబర్ ఆజం(25),షాదాబ్ ఖాన్(23) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లైమ్ డాసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్, జోఫ్రా అర్చర్ తలా రెండేసి వికెట్లు చోప్పున సాధించారు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్ -
ఇంగ్లండ్‌తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న పాక్
టీ20 ప్రపంచకప్-2026లో మరో రసవత్తర పోరుకు తెర లేచింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్,ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో పాక్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫహీమ్ అష్రాప్ స్ధానంలో షాహీన్ అఫ్రిది తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్ -
T20 WC 2026: టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ గ్రూప్-1లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు అదే గ్రూప్‌లో ఉన్న టీమిండియాను భారీ దెబ్బ కొట్టింది. అదేంటని అనుకుంటున్నారా..?ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి 254 పరుగుల భారీ స్కోర్ చేసిన విండీస్.. ఆతర్వాత జింబాబ్వేను 147 పరుగులకే పరిమితం చేసి నెట్ రన్‌రేట్‌ను (5.350) భారీగా కూడగట్టుకుంది. ఈ రన్‌రేటే భారత్ కొంపముంచేలా ఉంది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత మన జట్టు రన్‌రేట్ -3.800లో పడి పోగా.. సౌతాఫ్రికా రన్ రేట్ 3.800 వద్ద కూర్చుంది.ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు చేరే అవకాశాలు రెండు జట్లకు మాత్రమే ఉంటాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి భారీ రన్ రేట్ కూడగట్టుకున్న విండీస్, సౌతాఫ్రికా సెమీస్ రేసులో ముందున్నాయి. భారత్, జింబాబ్వే మైనస్ రన్ రేట్లతో సెమీస్ రేసులో భారీగా వెనుకపడి పోయాయి. భారత్ సెమీస్‌కు చేరాలంటే తదుపరి జరిగే రెండు సూపర్-8 మ్యాచ్‌ల్లో (జింబాబ్వే, విండీస్) భారీ తేడాతో గెలవాలి. ఇలా గెలిచినా సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు.ఎందుకంటే విండీస్ రన్ రేట్ విషయంలో కొండెక్కి కూర్చుంది. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో (సౌతాఫ్రికా, భారత్) ఆ జట్టు ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మరోపక్క భారత్‌పై గెలిచి సౌతాఫ్రికా ఇప్పటికే మరో సెమీస్ బెర్త్‌పై కర్చీఫ్ వేసుకొని కూర్చుంది. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తమ కంటే బలహీనమైన జింబాబ్వే, విండీస్‌తో పోటీ పడుతుంది. ఒకవేళ విండీస్‌తో ఓడినా, జింబాబ్వేపై గెలిస్తే.. మరో సెమీస్ బెర్త్ సౌతాఫ్రికా వశమవుతుంది.ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితి చూస్తే, భారత్‌కు సెమీస్ బెర్త్ దక్కడం చాలా కష్టంగా కనిపిస్తుంది. భారత్ సెమీస్‌కు చేరాలంటే.. జింబాబ్వే, విండీస్‌పై భారీ విజయాలు సాధించడంతో పాటు సౌతాఫ్రికా, వెస్టిండీస్ తలో మ్యాచ్‌లో అయినా ఓడాలి. అప్పుడు కూడా భారత్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి.ఉదాహరణకు సౌతాఫ్రికా విండీస్ చేతిలో ఓడి, జింబాబ్వేపై గెలిస్తే.. వారి ఖాతాలో నాలుగు పాయింట్లతో పాటు మంచి రన్ రేట్ ఉంటుంది. విండీస్ భారత్ చేతిలో ఓడి, సౌతాఫ్రికాపై ఓ మోస్తరు విజయం సాధించినా.. ఆ జట్టు ఖాతాలో కూడా నాలుగు పాయింట్లు, మంచి రన్‌రేట్ ఉంటుంది. ఇలా జరిగి, భారత్.. జింబాబ్వే, విండీస్‌పై విజయాలు సాధించినా.. విండీస్, సౌతాఫ్రికా రన్‌రేట్‌ను అధిగమిస్తుందన్న గ్యారెంటీ లేదు.ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ సెమీస్‌కు చేరాలంటే ఒక్క సమీకరణకు మాత్రమే అధిక అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే.. భారత్.. జింబాబ్వే, విండీస్‌పై భారీ విజయాలు సాధించాలి. మరోపక్క విండీస్.. సౌతాఫ్రికా చేతిలో కూడా ఓడాలి. అప్పుడు సౌతాఫ్రికా, భారత్ సెమీస్‌కు చేరుకుంటాయి.అనుకోవడానికి ఇది బాగానే ఉన్నా, ప్రస్తుతం విండీస్ ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఇది జరిగే పని కాకపోవచ్చు. విండీస్ ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి మాంచి జోష్‌లో ఉంది. తదుపరి వారు ఆడబోయే సౌతాఫ్రికా, భారత్ మ్యాచ్‌ల్లోనూ ఇది కొనసాగవచ్చు. ఇందులో ఏ ఒక్క మ్యాచ్‌లో విండీస్ గెలిచినా భారత్ మూడో పొట్టి ప్రపంచకప్ కల కల్లగా మారిపోతుంది. మొత్తంగా వెస్టిండీస్.. జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచి భారత్ సెమీస్ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసేసింది. ఫిబ్రవరి 26న జరిగే వెస్టిండీస్-సౌతాఫ్రికా మ్యాచ్ తర్వాత సెమీస్ బెర్త్‌లపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా, గ్రూప్-1 నుంచి ఓ సెమీస్ బెర్త్ ఖరారైపోతుంది. రెండో బెర్త్ కోసం సౌతాఫ్రికా, భారత్, జింబాబ్వే పోటీ పడాల్సి ఉంటుంది. విండీస్ చేతిలో భారీ తేడాతో ఓడినా, జింబాబ్వేకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో భారత్, సౌతాఫ్రికాపై ఘన విజయాలు సాధించాలి. అసాధ్యమని చెప్పలేము కానీ, ఇది సాధ్యపడటం మాత్రం చాలా కష్టమే. -
చరిత్ర సృష్టించిన హెట్‌మైర్.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
టీ20 ప్రపంచకప్-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్ విధ్వంసం సృష్టించాడు. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు.జింబాబ్వే బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా కెప్టెన్ సికిందర్ రజాకు అయితే చుక్కలు చూపించాడు. 8వ ఓవర్ వేసిన రజా బౌలింగ్‌లో హెట్‌మైర్ ఏకంగా మూడు సిక్స్‌లతో 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హెట్‌మైర్ కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా హెట్‌మైర్ టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన విండీస్ ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు.వెస్టిండీస్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు. ఇదే టోర్నీలోహెట్‌మైర్ స్కాట్లాండ్పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు కేవలం 19 బంతుల్లోనే ఆర్ధం శతకం బాదేశాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్‌మైర్.. 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సార్లు హెట్‌మైర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రెండు సులువైన క్యాచ్‌లను జింబాబ్వే ఫీల్డర్లు జారవిడిచారు. ఇందుకు జింబాబ్వే భారీ మూల్యం చెల్లించుకోంది. -
అతడొక అద్భుతం.. కానీ: పాక్ మాజీ క్రికెటర్ యూటర్న్
టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మాత్రం తేలిపోతున్నాడు. కెరీర్లో తొలిసారి వరల్డ్‌కప్ ఈవెంట్లో ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.హ్యాట్రిక్ డకౌట్లులీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లతో ఆడిన మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ అభిషేక్ బ్యాటింగ్ శైలిని విమర్శించాడు. కేవలం పవర్ హిట్టింగ్‌పైనే ఆధారపడతాడని.. అతడి టెక్నిక్ సరిగ్గా లేదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా అతడిని ‘స్లాగర్’గా అభివర్ణించాడు.పరుగులు చేయాలనే తొందరలో వికెట్ పారేసుకుంటున్నాడని.. టెక్నిక్‌తో ఆడటం అతడికి చేతకాదని ఆమిర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీమిండియా అభిమానులు అతడిపై ఫైర్ అయ్యారు. అభిషేక్ శర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్ అని.. ఆటగాడి కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమంటూ భారత ఆటగాడికి మద్దతుగా నిలిచారు.మరోసారి విఫలంఇక సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి పోరులో ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 12 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాది 15 పరుగులు చేశాడు. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో కార్బిన్ బాష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఆమిర్ యూటర్న్!ఈ నేపథ్యంలో మహ్మద్ ఆమిర్ మరోసారి అభిషేక్ శర్మ గురించి వ్యాఖ్యలు చేశాడు. తన మాటలను అందరూ అపార్థం చేసుకున్నారంటూ యూటర్న్ తీసుకున్నాడు. ‘‘బౌలర్ వైపు నుంచి నేను అభిషేక్ శర్మ ఆటను విమర్శించాను. అతడి టెక్నిక్ గురించి మాత్రమే నేను మాట్లాడాను.కానీ నేను స్లాగర్ అన్న పదం వాడటం చాలా మందికి నచ్చలేదు. పటిష్ట జట్టు, బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చినపుడు కాస్త ఓపికగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే అభిషేక్ శర్మ బలహీనత ఏమిటో అందరికీ తెలిసిపోయింది. వాళ్లు అతడిని ఈజీగా ట్రాప్ చేయగలరు.అద్భుతమైన నైపుణ్యాలు.. కానీతాజా మ్యాచ్‌లో అతడు పద్నాలుగు పరుగులను ఒకే వైపు నుంచి రాబట్టాడు. అవి కూడా చెత్త బంతుల ద్వారా వచ్చిన పరుగులే. రబడ బౌలింగ్ మొదలుపెట్టాగానే.. అభిషేక్ శర్మ తెల్లముఖం వేశాడు.సీనియర్ ఆటగాడిగా నేను అభిషేక్ శర్మకు ఓ సలహా ఇస్తున్నా. నీ టెక్నిక్ గురించి ప్రత్యర్థులకు తెలిసిపోయింది. కాస్త ఓపికగా ఉండి.. బంతి ఎలా వస్తుందో అర్థం చేసుకుని ఆడితే నువ్వు మళ్లీ మునుపటిలా విజృంభించగలవు.అతడికి అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే, వాటిని అతడు ఎలా ఉపయోగించుకుంటాడన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేను చెప్పాలనుకుంది ఇదే. కానీ చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని మహ్మద్ ఆమిర్ చెప్పుకొచ్చాడు. చదవండి: కెప్టెన్, హెడ్‌కోచ్ ఏం చేస్తున్నారు?.. భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం -
వెస్టిండీస్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే
టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా ముంబై వేదికగా వెస్టిండీస్, జింబాబ్వే జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సూపర్-8 పోరులో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి.జింబాబ్వే జట్టులోకి నగరవ రాగా.. విండీస్ జట్టులోకి రొమారియో షెపర్డ్ వచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఇరు జట్లు కూడా అజేయంగా నిలిచాయి. మరి సూపర్-8లో ఎవరు బోణీ కొడతారో వేచి చూడాలి.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, టోనీ మునియోంగా, తాషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ న్గరవ, బ్లెస్సింగ్ ముజారబానీవెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షామర్ జోసెఫ్ -
సఫారీ బ్యాటర్‌తో సుందర్ ఫైట్.. కారణమిదే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 188 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికల పడింది. లక్ష్య చేధనలో మెన్ ఇన్ బ్లూ 111 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, సఫారీ సూపర్ స్టార్ డేవిడ్ మిల్లర్ మధ్య వాగ్వదం చోటు చేసుకుంది.అసలేమి జరిగిందంటే?సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసేందుకు కెప్టెన్ సూర్యకుమార్ స్పిన్నర్ సుందర్‌ను ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అయితే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్ క్రీజు వదిలి ముందుకు రావడంపై సుందర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అవుట్‌ఫీల్డ్ గ్రాస్ కాస్త తడిగా ఉండడంతో, పరుగు తీసేటప్పుడు జారిపోకుండా ఉండేందుకు మిల్లర్ క్రీజు లైన్ అంచున నిలబడ్డాడు.దీంతో బౌలింగ్ వేసే క్రమంలో సుందర్ మధ్యలోనే ఆగిపోయి, మిల్లర్ క్రీజు దాటుతున్నాడంటూ అంపైర్ క్రిస్ గఫానీకి ఫిర్యాదు చేశాడు. ఇది 'మన్కడింగ్' (రనౌట్)లా అన్పించింది. దీంతో మిల్లర్ అసహనం వ్యక్తం చేస్తూ ఏదో ఉన్నాడు. ఓవర్ ముగిసిన తర్వాత కూడా వారిద్దరి మధ్య మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.The zen masters lost it! Miller vs Sundar explodes 🤬Both are usually the calmest on the field, but this time even they couldn’t keep their cool 🔥 Backing up too far?#INDvsSA #CricketFever #T20WorldCup2026 #Cricket pic.twitter.com/OWStXaB1PY— Cricket Update (@sportshourly) February 23, 2026 మిల్లర్ నేరుగా సుందర్ వద్దకు వెళ్లి సీరియస్‌గా మాట్లాడు. అంపైర్లు వెంటనే జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో సుందర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా విఫలమయ్యాడు. ఈ ఓటమితో భారత్ తమ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. -
మీ వల్లే ఈ ఓటమి: భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం
పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు కనీవినీ ఎరుగని పరాజయం ఎదురైంది. టీ20 వరల్డ్‌కప్-2026 ఈవెంట్లో టీమిండియా అవమానకర రీతిలో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. సూపర్-8 కీలక మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓటమిపాలై.. పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.ఊహించని షాక్ఈ నేపథ్యంలో టీమిండియా నాయకత్వ బృందంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తుదిజట్టులో ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా స్పందించాడు.తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది ఊహించని షాక్. తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది సాధారణ ఓటమి కాదు. వాళ్లు మనల్ని చిత్తు చిత్తుగా ఓడించారు. సౌతాఫ్రికా టీమిండియాపై భారీ విజయం సాధించింది.కెప్టెన్, హెడ్‌కోచ్ ఏం చేస్తున్నారు?ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను సఫారీ బ్యాటర్లు అటాక్ చేసిన తీరు మరీ ఘోరం. ఇందుకు కెప్టెన్, హెడ్‌కోచ్ జవాబుదారులుగా ఉండాలి. యాజమాన్యంతో పాటు ఆటగాళ్లు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టారు.అహంకారం వద్దునెట్ రన్ రేటు గురించి ఆలోచనే లేదు. సెలక్షన్ విషయంలోనూ తప్పులు. మనవాళ్ల బ్యాటింగ్ శైలి ఏమాత్రం సరిగ్గాలేదు. వీటన్నిటికీ యాజమాన్యం సమాధానం చెప్పాలి. జింబాబ్వేతో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య సన్నని రేఖ మాత్రమే ఉంటుంది. టీమిండియా దానిని తుడిచివేసేలా కనిపిస్తోంది’’ అంటూ తీవ్ర స్థాయిలో బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: T20 WC 2026: టీమిండియాలో కలకలం -
మా వాళ్లు అద్భుతం.. విండీస్ ప్రమాదకర జట్టు: మార్క్రమ్
టీమిండియాపై సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో తమను ఓడించి ట్రోఫీ గెలుచుకున్న భారత్‌కు.. తాజా ఎడిషన్‌లో మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. టీ20 వరల్డ్‌కప్-2026 సూపర్-8లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సూర్యకుమార్ సేనను 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.మా వాళ్లు అద్భుతంపొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీల్లో టీమిండియాకు పరుగులపరంగా ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram) హర్షం వ్యక్తం చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు అద్భుత రీతిలో రాణించారని ప్రశంసలు కురిపించాడు. గొప్ప ప్రదర్శనతో టీమిండియాను చిత్తు చేశామని సంతోషం వ్యక్తం చేశాడు.‘‘ఈ వికెట్ భిన్నంగా ఉంది. అయినప్పటికీ మా వాళ్లు పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకుని.. అద్భుతమైన నైపుణ్యాలతో వారి ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతం చేశారు.ఆ భాగస్వామ్యం అత్యంత కీలకంఇక మిల్లర్, బ్రెవిస్ నెలకొల్పిన భాగస్వామ్యం అత్యంత కీలకం. మ్యాచ్‌ను మా వైపు తిప్పేసింది వాళ్లే. లుంగి ఎంగిడి వంటి ప్రమాదకర బౌలర్ మా జట్టులో ఉన్నాడు. మధ్య ఓవర్లలో అతడు మాకు కీలకం. జట్టు ప్రయోజనాల కోసం ఎప్పుడు బౌలింగ్ చేయడానికైనా అతడు సిద్ధంగా ఉంటాడు.టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారితదుపరి మేము వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంటుంది. ఆ జట్టు టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకారి. కాబట్టి టీమిండియాపై విజయాన్ని ఆస్వాదిస్తూనే తదుపరి మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సిద్దమవుతాము. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అనుకున్న ఫలితం రాబడతాము’’ అని మార్క్రమ్ పేర్కొన్నాడు.కాగా టీమిండియాతో సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి.. 187 పరుగులు సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63) యాభై బంతుల్లోనే 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కుప్పకూలిన టీమిండియాఇక లక్ష్య ఛేదనలో భారత్‌ను కట్టడి చేయడంలో సఫారీ బౌలర్లు విజయవంతమయ్యారు. మార్కో యాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. కార్బిన్ బాష్ రెండు, మార్క్రమ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఎంగిడి నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులే ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు.ఈ క్రమంలో 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులు చేసి టీమిండియా కుప్పకూలింది. ఫలితంగా సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో జయభేరి మోగించి సెమీస్ దిశగా తొలి అడుగు వేసింది. ఇక భారత్ తదుపరి గురువారం జింబాబ్వేతో.. సౌతాఫ్రికా వెస్టిండీస్‌తో తలపడతాయి.చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్ -
టీమిండియా ఘోర ఓటమి.. పగలబడి నవ్విన పాక్ మాజీ ప్లేయర్
టీ20 ప్రపంచకప్-2026 లీగ్ స్టేజీలో అజేయంగా నిలిచిన టీమిండియా.. కీలకమైన సూపర్-8లో మాత్రం తమ జోరును కొనసాగించలేకపోయింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది.సూర్యకుమార్ నాయకత్వంలోని భారత జట్టు బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదన్పించినప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ తీశాడు.భారత బ్యాటర్లలో శివమే దూబే(42) ఒక్కడే రాణించాడు. ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనే భారీ విజయం సాధిస్తేనే టీమిండియా సెమీస్ రేసులో ఉంటుంది. ఈ ఘోర ఓటమితో టీమిండియా రన్‌రేట్(-3.800) భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు."ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ అసలు రూపం బట్టబయలైంది. ఈ టోర్నీలో భారత్ ఛేజింగ్‌కు దిగడం ఇదే మొదటిసారి. లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా ఒత్తిడి తట్టుకోలేక చిత్తైంది. ఛేజింగ్‌లో భారత్ తడబడుతుందని నాకు ముందే తెలుసు. ముఖ్యంగా విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాడు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది"అని జియో న్యూస్‌కు వచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ పేర్కొన్నాడు. కాగా టోర్నీకి ముందే భారత్ సెమీఫైనల్ చేరడం కష్టమని అమీర్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ టోర్నీలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అట్టర్ ప్లాప్ అవుతాడని అమీర్ ఇటీవల చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే అభిషేక్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పుడు మ్యాచ్ ఫలితం కూడా అతడు అంచనా వేసినట్లే రావడం అతడు టౌక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాడు. భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ అనంతరం అమీర్ జియో న్యూస్ చానల్లో జరిగిన చర్చలో పాల్గొన్నాడు. యాంకర్ అతడిని జ్యోతిష్యుడు అంటూ పరిచయం చేయగానే అమీర్ పగలబడి నవ్వుతూ “దేవుడా నన్న క్షమించు, నాకు ఏంటి ఇది” అంటూ స్పందించాడు. దీంతో అతడికి భారత్ అభిమానులు గట్టిగా కౌంటరిస్తున్నారు. టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచి సెమీస్‌కు కచ్చితంగా వస్తుందని పోస్టులు పెడుతున్నారు. కాగా టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం జింబాబ్వేతో తలపడనుంది. -
వాళ్లిద్దరు సూపర్.. తిలక్ వర్మ విఫలం: భారత దిగ్గజం
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. చెత్త ప్రదర్శనతో భారీ మూల్యమే చెల్లించారంటూ భారత మాజీ క్రికెటర్లు సూర్యకుమార్ సేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తుదిజట్టు కూర్పు విషయంలో తప్పు జరిగిందంటూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను సైతం విమర్శిస్తున్నారు.ఇదే అతిపెద్ద పరాజయంకాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా.. ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద పరాజయం. ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు బదులు వాషింగ్టన్ సుందర్‌ను ఆడించడం విమర్శలకు దారి తీసింది.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) తనదైన శైలిలో స్పందించాడు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఆడలేదని విమర్శించాడు. ముఖ్యంగా వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ ఆడిన తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు.వారిద్దరు సూపర్‘‘సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis), డేవిడ్ మిల్లర్ అద్భుత రీతిలో భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కించారు. అయితే, టీమిండియా బ్యాటర్లు మాత్రం వారి నుంచి ఏమీ నేర్చుకోలేకపోయారు. వచ్చీ రాగానే బౌండరీ కొట్టాలనే తలంపుతో వికెట్ పారేసుకున్నారు.టీ20 క్రికెట్లో ఇలా ఆడటం సరికాదు. ప్రత్యర్థి జట్టు ఏం చేసిందో చూసిన తర్వాత కూడా ఇలాగే చేస్తారా? వికెట్ అంతగా అనుకూలించకపోయినా వాళ్లు మెరుగ్గా ఆడారు. కానీ మనం.. ఇగోకు పోయాము. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వికెట్లు పోగొట్టుకున్నాం. సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శనతో టీమిండియాను చిత్తు చేసింది.తిలక్ వర్మ నిరాశపరిచాడుఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు. ఇక తిలక్ వర్మ (Tilak varma) విషయానికొస్తే.. అతడు తెలివైన బ్యాటర్. కానీ ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన తీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఓవర్‌కు 9.5 పరుగులు రాబట్టాల్సింది. కానీ మనోళ్లు 15 పరుగులు చేయాలి అన్నట్లుగా తొందరపడ్డారు.తిలక్ ఇంకాసేపు సమయం తీసుకుని క్రీజులో నిలదొక్కుకోవాల్సింది. అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో తిలక్ కాస్తైనా బాధ్యతాయుతంగా ఆడాల్సింది. కానీ అతడు పూర్తిగా విఫలమయ్యాడు’’ అని గావస్కర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.దూబే ఒక్కడేకాగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికా విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 111 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ 15 పరుగులు చేయగలిగాడు. తిలక్ వర్మ రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేసి పెవిలియన్ చేరాడు. మిగిలిన వారంతా కూడా విఫలం కాగా.. శివం దూబే 42 పరుగులతో రాణించడంతో భారత్ వంద పరుగుల మార్కు దాటగలిగింది.చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్ -
హార్దిక్ పాండ్యా ఫెయిల్.. గర్ల్‌ఫ్రెండ్ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా తొలి పరాజయం నమోదు చేసింది. కీలక సూపర్-8 దశలో మొదటి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. తద్వారా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.అహ్మదాబాద్ వేదికగా సఫారీలతో ఆదివారం తలపడ్డ సూర్యకుమార్ సేన.. 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.ధనాధన్ దంచికొట్టి..డెవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45), డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63), ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్) ధనాధన్ దంచికొట్టి ప్రొటిస్ జట్టును ఈ మేరకు పటిష్ట స్థితిలో నిలిపారు. భారత బౌలర్లలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు, అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, శివం దూబే తలా ఒక వికెట్ పడగొట్టారు.𝘿𝙚𝙖𝙩𝙝, 𝙩𝙖𝙭𝙚𝙨, 𝙖𝙣𝙙 𝙑𝙖𝙧𝙪𝙣 𝙥𝙞𝙘𝙠𝙞𝙣𝙜 𝙬𝙞𝙘𝙠𝙚𝙩𝙨! 😌1️⃣8️⃣ consecutive innings with a wicket for Varun Chakravarthy in T20Is (Most by an Indian).ICC Men's #T20WorldCup | SUPER 8 | #INDvSA | LIVE NOW 👉 https://t.co/dZWPZfqfbO pic.twitter.com/AmgTPxI3tU— Star Sports (@StarSportsIndia) February 22, 2026దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యాఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి ఏకంగా 45 పరుగులు సమర్పించుకుని.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అదే విధంగా లక్ష్య ఛేదనలోనూ హార్దిక్ బ్యాట్‌తో విఫలమయ్యాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్.. 17 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.చప్పట్లు కొట్టిన మహీకసఫారీ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో.. భారీ షాట్‌కు యత్నించి స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చిన హర్దిక్ పాండ్యా పెవిలియన్ చేరాడు. ఈ సందర్భంగా హార్దిక్ ప్రేయసి మహీక శర్మ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. హార్దిక్ అవుట్ కాగానే లేచి నిలబడిన మహీక చప్పట్లు కొడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.Hardik Pandya's girlfriend Mahieka Sharma was clapping when Hardik got out 😭 pic.twitter.com/GFJvy5NA23— Tejash (@Tejashyyyyy) February 22, 2026గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే వేడుకలలో..ఈ నేపథ్యంలో మహీకకు అసలు క్రికెట్ గురించి తెలుసా? అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే, హార్దిక్ అభిమానులు మాత్రం.. అతడిని నిరాశ చెందవద్దని చెప్పేందుకే ఆమె క్లాప్ చేసిందని అంటున్నారు. కాగా భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్న కొన్నాళ్లకే మహీకతో తాను ప్రేమలో ఉన్నట్లు హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.ఆమె వల్లే గొప్పగా ఆడుతున్నాఇక అప్పటి నుంచి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది ఈ జంట. ఈ క్రమంలో మహీక వల్లే తాను గొప్పగా ఆడుతున్నానని.. ఆమె రాకతో జీవితం మారిందని హార్దిక్ ప్రశంసలు కురిపించడం విశేషం. అయితే, తాజా మ్యాచ్‌లో మాత్రం అతడు దారుణంగా విఫలం కావడం గమనార్హం.ఈ మ్యాచ్‌కు ముందు మహీక బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తూ వేడుకల్లో మునిగిపోయాడు హార్దిక్. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భారత్ 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులు చేసి ఆలౌట్ అయింది.చదవండి: T20 WC 2026: టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్ -
అతడు MVP.. రింకూ జట్టులో ఎందుకసలు?: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా గ్రూప్ దశలో అజేయంగా నిలిచినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిందన్నది వాస్తవం. తొలుత అమెరికా.. ఆఖర్లో నెదర్లాండ్స్ రూపంలో పసికూనలు.. పటిష్ట సూర్యకుమార్ సేనకు సవాలు విసిరాయి. నమీబియా, పాకిస్తాన్‌లపై మాత్రమే భారత్ ఏకపక్ష విజయం సాధించింది.76 పరుగుల తేడాతో సఫారీల చేతిలో చిత్తుగాఈ నేపథ్యంలో సూపర్-8లో జాగ్రత్తగా ఆడి సమిష్టిగా రాణించకపోతే కష్టాలు తప్పవని టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandra Ashwin) ముందుగానే హెచ్చరించాడు. అందుకు తగ్గట్లుగానే భారత్ సూపర్-8లో తమ తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. సమిష్టి వైఫల్యంతో 76 పరుగుల తేడాతో సఫారీల చేతిలో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా సెమీ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో నిలిచింది.తప్పు చేశారుఅయితే, సౌతాఫ్రికా చేతిలో ఓటమికి ప్రధాన కారణం భారత తుదిజట్టు కూర్పేనని మెజారిటీ మంది విశ్లేషకుల అభిప్రాయం. అశ్విన్ కూడా ఇదే మాట అంటున్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నిర్ణయాలను అశూ తప్పుబట్టాడు. అక్షర్ పటేల్‌ను కాదని.. వాషింగ్టన్ సుందర్‌ని ఆడించి పెద్ద తప్పే చేశారని విమర్శించాడు.‘‘ఐపీఎల్లో మ్యాచ్-అప్‌లకు అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ల కోసం పర్టికులర్‌గా ఓ బౌలర్‌తో వ్యూహాలు అమలు చేసే వీలు ఉంటుంది. అక్కడ మనకు పద్నాలుగు మ్యాచ్‌లు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చు.కానీ ఐసీసీ ఈవెంట్లలో జట్టు ఎంత స్థిరంగా ఉంటే అంత మంచిది. తరచూ మార్పులు చేయడం తగదు. ఎడమచేతి వాటం బ్యాటర్లకు బౌలింగ్ చేయించాలని వాషింగ్టన్ సుందర్‌ను తీసుకురావడాన్ని నేను వంద శాతం సమర్థిస్తాను.అతడు MVP.. అలాంటి వాడినే పక్కనపెడతారా?అదే సమయంలో అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టడాన్ని మాత్రం ఎంతమాత్రం అంగీకరించను. టీ20 క్రికెట్లో అక్షర్ అత్యంత విలువైన ఆటగాడు (MVP). ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిరూపించాడు. ముఖ్యంగా 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లితో కలిసి అక్షర్ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.ఫలితంగా టీమిండియా 170 పరుగుల మార్కు దాటింది. అనుభవజ్ఞుడైన కోహ్లికి అక్షర్ అక్కడ సాయంగా నిలిచాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టి ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించారు.చక్కటి గుణపాఠంఇక రింకూ సింగ్ విషయానికొస్తే.. మీకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. అలాంటపుడు రింకూను ఎనిమిదో స్థానంలోనే పంపడం ఎందుకు?.. ఏదేమైనా వాషీని నేను అగౌరవపరచడం లేదు. కానీ సౌతాఫ్రికా టీమిండియాకు చక్కటి గుణపాఠం నేర్పింది. సన్నద్ధం కాకుండా మ్యాచ్‌కు వస్తే ఇలాగే జరుగుతుంది అని చాటిచెప్పింది’’ అంటూ అశ్విన్ తీవ్ర స్థాయిలో టీమిండియా నాయకత్వ బృందం తీరుపై మండిపడ్డాడు.కాగా సౌతాఫ్రికాతో ఆదివారం నాటి సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ మ్యాచ్‌లో అక్షర్‌కు బదులు తుదిజట్టులో ఆడిన వాషీ.. రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. కేవలం 11 పరుగులే చేయగలిగాడు. ఇక రింకూ సింగ్ డకౌట్ అయ్యాడు. శివం దూబే 42 పరుగులతో టీమిండియా టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: T20 WC 2026: టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్ -
వాళ్ల గురించే నా బాధంతా!: ఇచ్చిపడేసిన సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు తాము సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా తమ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకుంటామని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ఎలా ఉన్నా వ్యూహాలకు తగినట్లు ఆడటంలో తమ బ్యాటర్లు దిట్ట అని సూర్య అన్నాడు.కాగా వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్-8 దశలో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. కాగా గ్రూప్ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లను గెలిచాయి భారత్, సౌతాఫ్రికా.ప్రతికూల అంశాలు ఇవేఅయితే, గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) డకౌట్ కావడం.. భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌లో తడబడటం వంటివి ప్రతికూలాంశాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్‌లతో కూడిన స్పిన్ దళంతో అటాక్ చేసే అవకాశం ఉంది.వాళ్ల గురించే నా బాధంతా!ఈ విషయాల గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా స్పందించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ సరిగ్గా ఆడటం లేదని ఎవరైతే బాధపడుతున్నారో.. ఆ వ్యక్తుల గురించే నేను ఎక్కువగా వర్రీ అవుతున్నా.అతడిని ఎదుర్కొనే ప్రత్యర్థుల గురించే నా బాధంతా!.. గతేడాది అతడు అదరగొట్టాడు. తిరిగి ఫామ్ అందుకుంటాడు. ఇక మా జట్టులో ఓపెనర్లు తప్ప 3-8 మధ్య ప్రతీ బ్యాటర్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ 8-9 ఓవర్ల వరకు వికెట్ పడకపోతే.. శివం దూబే లేదంటే హార్దిక్ పాండ్యా టాప్‌నకు ప్రమోట్ అవుతారు.సమస్య లేదునాతో సహా జట్టులో ప్రతి ఒక్కరి బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంటుంది. రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్ లేదంటే ఇంకెవరైనా బౌలింగ్ చేసినా వారిని ఎదుర్కోగల సత్తా మా వాళ్లకు ఉంది. కాబట్టి బౌలర్లు ఎవరన్న అంశంతో మాకు సంబంధం లేదు. మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తనకంటూ ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. ఎవరి గేమ్‌ప్లాన్ వారికి స్పష్టత ఉంది. కాబట్టి సమస్య లేదు’’ అని సూర్యకుమార్ యాదవ్ తన జట్టు పట్ల ఆత్మవిశ్వాసం కనబరిచాడు.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్! -
ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదే: సౌతాఫ్రికా కోచ్
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ షుక్రి కన్రాడ్ టీమిండియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ సేన ఒత్తిడిలో ఉందని.. ఇదే అదునుగా తాము ఆ జట్టు బలహీనతలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత జట్టు విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్-8కుఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలతో సత్తా చాటి.. సొంతగడ్డపై వరల్డ్‌కప్-2026లో హాట్ ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్-8కు అర్హత సాధించింది. మరోవైపు.. సౌతాఫ్రికా సైతం వరుస విజయాలతో సూపర్-8కు దూసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య (IND vs SA) ఆదివారం అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగనుంది.ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదేఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్‌కోచ్ షుక్రి కన్రాడ్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా వంటి జట్టు గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆ జట్టుపై అంచనాలు భారీగా ఉంటాయి. స్క్రూటినీ కూడా ఎక్కువే. అందుకే వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోతారు.సెమీ ఫైనల్.. ఆపై ఫైనల్ చేరాలనే ఒత్తిడి మిగతావారితో పోలిస్తే వారిపై ఒకింత ఎక్కువగానే ఉంటుంది. దానిని మేము సద్వినియోగం చేసుకుంటాము. ఒత్తిడిలో బలహీనపడే ఆ జట్టుపై పైచేయి సాధించి.. వారి బలహీనతలను ప్రపంచానికి చూపిస్తాం’’ అని పేర్కొన్నాడు. అయితే, పటిష్ట టీమిండియాతో తలపడినపుడు తమపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు. భారత్‌దే ఆధిపత్యంకాగా ఇటీవల సౌతాఫ్రికా భారత్‌లో పర్యటించింది. టీ20 సిరీస్‌లో టీమిండియా చేతిలో 3-1తో ఓడిపోయింది. అయితే, వరల్డ్‌కప్ వంటి టోర్నీలలో ఇలాంటి గత రికార్డుల ప్రభావం ఎక్కువగా ఉండదని కన్రాడ్ పేర్కొనడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్- సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఏడుసార్లు పోటీ పడగా.. టీమిండియా ఐదు, సౌతాఫ్రికా రెండుసార్లు గెలిచాయి.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్! -
NZ vs PAK: పాక్, కివీస్‌లకు బ్యాడ్‌న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతో ఎనిమిది జట్లు ముందడుగు వేశాయి. మిగిలిన పన్నెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. టాప్-8 జట్లతో కీలకమైన సూపర్-8 దశకు శనివారం తెరలేవనుంది.తొలి మ్యాచ్‌లో కివీస్- పాక్ ఢీసెమీస్ రేసులో భాగంగా గ్రూప్-2 నుంచి తొలుత న్యూజిలాండ్- పాకిస్తాన్ (NZ vs PAK) మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇందుకు శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్. ప్రేమదాస స్టేడియం వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ మొదలుకావాల్సి ఉంది.అయితే, కివీస్- పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇటీవల గ్రూప్-బి నుంచి పల్లెకెలెలో జింబాబ్వే- ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాన కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. తాజాగా న్యూజిలాండ్- పాకిస్తాన్ మ్యాచ్‌కు కూడా ఇదే తరహా అనుభవం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.పొంచి ఉన్న వాన ముప్పుఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. కొలంబోలో శనివారం వర్షం పడేందుకు 80- 100 శాతం అవకాశాలు ఉన్నాయి. పగలు 75 శాతం.. రాత్రి 87 శాతం వాన కురిసేందుకు ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రాత్రి ఉరుములతో కూడిన వర్షం పడేందుకు 52 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్ పేర్కొంది.మ్యాచ్ రద్దైతే గనుకఇక కివీస్- పాక్ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు మొదలుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వర్షం వల్ల మ్యాచ్ గనుక రద్దైపోతే ఇరుజట్లకు ఎదురుదెబ్బ తగిలినట్లే. సూపర్-8 మ్యాచ్‌లకు రిజర్వ్‌డే లేదు కాబట్టి.. మ్యాచ్ రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. దీంతో తదుపరి మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సి ఉంటుంది.కాగా సూపర్-8లో గ్రూప్-1 నుంచి భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా తలపడుతుండగా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీలో ఉన్నాయి. సూపర్-8లో తొలి మ్యాచ్‌లో పరస్పరం తలపడుతున్న కివీస్, పాక్... తదుపరి శ్రీలంక, ఇంగ్లండ్‌లతో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది.ఒక్క మ్యాచ్ ఫలితం తేడా వచ్చినా ఇందులో భాగంగా పాకిస్తాన్ ఫిబ్రవరి 24న లండ్‌తో, ఫిబ్రవరి 28న శ్రీలంకతో.. న్యూజిలాండ్ ఫిబ్రవరి 25న శ్రీలంకతో, ఫిబ్రవరి 27న ఇంగ్లండ్‌తో తలపడతాయి. సెమీస్ రేసులో ఒక్క మ్యాచ్ ఫలితం తేడా వచ్చినా భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి శనివారం నాటి మ్యాచ్‌లో తప్పక గెలవాలని అటు న్యూజిలాండ్.. ఇటు పాకిస్తాన్ పట్టుదలగా ఉండగా.. ఫలితం వరుణుడి మీద ఆధారపడి ఉంది.ఫామ్ పరంగా దొందూ దొందేఇదిలా ఉంటే.. కివీస్ జట్టులో టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ మాత్రమే ఇప్పటి వరకు సత్తా చాటారు. మిగిలిన వారి నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన రావాల్సి ఉంది. మరోవైపు.. తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగడం పాకిస్తాన్‌కు సానుకూలాంశంగా పరిణమించింది. కొలంబో పిచ్‌పై వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. శనివారం నాటి మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు కోసం ఇప్పటికే పాక్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఈసారి కూడా పాక్ స్పిన్ దళాన్నే నమ్ముకోనుంది. అయితే, పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ మినహా మరెవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ప్రతికూల అంశం. కాబట్టి ఫామ్ పరంగా ప్రస్తుతం కివీస్- పాక్ ఉజ్జీలుగానే ఉన్నాయని చెప్పవచ్చు.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్! -
T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ టోర్నీ-2026లో టీమిండియా సత్తా చాటుతోంది. లీగ్ దశలో భాగంగా గ్రూప్-ఎ నుంచి టాపర్‌గా సూర్యకుమార్ సేన సూపర్-8కు చేరుకుంది. వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను ఓడించి అజేయంగా తదుపరి దశలో అడుగుపెట్టింది.తొలుత దక్షిణాఫ్రికాతో..ఇక ఇక్కడి నుంచే అసలు సమరం మొదలుకానుంది. గ్రూప్-1లో ఉన్న టీమిండియా.. సూపర్-8లో తొలుత దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఇరుజట్ల మధ్య మ్యాచ్ మొదలుకానుంది.ప్రాక్టీస్‌లో తలమునకలుఈ నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఈ క్రమంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బాదిన షాట్ కారణంగా భారత స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గాయపడినట్లు సమాచారం. హార్దిక్ బాదిన బంతి సిరాజ్ ఎడమ మోకాలికి బలంగా తగిలినట్లు తెలుస్తోంది.గాయపడిన పేసర్దీంతో నొప్పితో విలవిల్లాడిన సిరాజ్ మధ్యలోనే నెట్ సెషన్ నుంచి నిష్క్రమించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెవ్‌స్పోర్ట్స్ షేర్ చేసిన ఈ ఫొటోలలో సిరాజ్ కుంటుతూ మైదానం వీడిన తీరు టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.గాయాల బెడదకాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందు నుంచీ టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్న సంగతి తెలిసిందే. యువ పేసర్, బ్యాట్‌తోనూ అదరగొడుతున్న హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన సిరాజ్.. గ్రూప్ దశలో తొలుత అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జ్వరం వల్ల తుదిజట్టు నుంచి తప్పుకోగా.. సిరాజ్‌కు ఈ అవకాశం వచ్చింది. అమెరికాతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ పేసర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులోకి రావడంతో సిరాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.ఇప్పుడిలా..మరోవైపు.. ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించినప్పటికీ.. తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగానే ఉన్నాడు. ఆఖరిగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడు బరిలోకి దిగాడు.ఇదిలా ఉంటే.. పటిష్ట సౌతాఫ్రికాతో పోరుకు ముందు సిరాజ్ కూడా గాయపడటం గమనార్హం. కాగా సూపర్-8లో భారత్.. సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఎదుర్కొంటుంది. ఈ దశలో సత్తా చాటితేనే సెమీ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.UPDATE: T20 WC 2026: టీమిండియా కొంపముంచిన గంభీర్.. నెటిజన్లు ఫైర్చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్ -
సూపర్-8లో తొలి మ్యాచ్ గెలుస్తాం: సికందర్ రజా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పసికూన జింబాబ్వే అంచనాలకు మించి రాణిస్తోంది. గ్రూప్-బిలో తొలుత ఒమన్‌ను మట్టికరిపించిన రజా బృందం.. ఆ తర్వాత మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని రీతిలో షాకిచ్చింది.గెలుపు గాలివాటం కాదుతదుపరి ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఎలాంటి ఆటంకం లేకుండా సూపర్-8కు అర్హత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియాను ఎలిమినేట్ చేసిన జింబాబ్వే.. లీగ్ దశలో ఆఖరిగా పటిష్ట శ్రీలంకతో తలపడింది. అనూహ్య రీతిలో కొలంబో వేదికగా గురువారం శ్రీలంకను సైతం ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన రజా బృందం.. తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది.ఇక్కడితో ఆగిపోముసగర్వంగా గ్రూప్-బి టాపర్‌గా సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జింబాబ్వే కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సికందర్ రజా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇక్కడితో ఆగిపోము. మా దృష్టి రాబోయే మ్యాచ్‌లపై ఉంది. ప్రస్తుతానికి ఒక్కో మ్యాచ్‌లో ప్రదర్శనను విశ్లేషించుకుంటూ ముందుకు పోతున్నాం.మున్ముందు ఏదైనా సాధ్యమేఅన్ని పరిస్థితులకు తగినట్లుగా సిద్ధమయ్యాం. తమ బాధ్యతలపై జట్టులో అందరికీ స్పష్టత ఉంది. తాజా ప్రదర్శనతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్సాహం పెరిగింది. లీగ్ దశలో మా ప్రదర్శనను బట్టి చూస్తే మున్ముందు ఏదైనా సాధ్యమే. అంచనాలకు భిన్నంగా సాగే సంచలన కథనాలు అందరినీ ఆకర్షిస్తాయి కదా!..మా తొలి మ్యాచ్‌లో గెలవవచ్చు కూడా!సూపర్-8లో మేము మా తొలి మ్యాచ్‌లో గెలవవచ్చు కూడా!.. మా అభిమానుల గుండెల్లో మా స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాము. గ్రూప్ దశలో అజేయంగా నిలవడం గర్వంగా ఉంది. ముందుగా చెప్పినట్లు అండర్డాగ్ స్టోరీస్ అందరికీ ఆకర్షిస్తాయి. 23 నాటి మ్యాచ్ మాకు షో టైమ్’’ అని సికందర్ రజా ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా సూపర్-8లో భాగంగా జింబాబ్వే ఫిబ్రవరి 23న వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది. అనంతరం ఫిబ్రవరి 26న భారత్, మార్చి 1న సౌతాఫ్రికాతో తలపడుతుంది. జింబాబ్వేతో పాటు ఈ ప్రత్యర్థి జట్లన్నీ లీగ్ దశను అజేయంగా ముగించడం విశేషం. చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో జర జాగ్రత్తPure dominance by Zimbabwe. 🇿🇼They keep their unbeaten tag alive as they brush aside Sri Lanka. 👏Next stop: The Super 8s! 🙌ICC Men’s #T20WorldCup | #AFGvCAN | LIVE NOW ➡️ https://t.co/0BcVdzugXC pic.twitter.com/pJSD74tlFs— Star Sports (@StarSportsIndia) February 19, 2026 -
ముగ్గురూ లెఫ్టాండర్లే.. మాకు కష్టమే: టీమిండియా కోచ్
టీమిండియా అజేయంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సూపర్-8 దశకు చేరుకుంది. గ్రూప్-ఎలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను ఓడించి టాపర్‌గా తదుపరి దశకు అర్హత సాధించింది.అయితే, నమీబియా, పాకిస్తాన్‌లపై అలవోకగా విజయం సాధించిన సూర్యకుమార్ సేనకు.. పసికూనలు అమెరికా, నెదర్లాండ్స్ మాత్రం గట్టి సవాలు విసిరాయి. కష్టమ్మీద అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గట్టెక్కింది. నిజానికి ఏకపక్ష విజయాలు సాధిస్తుందనుకున్న మ్యాచ్‌లలోనే టీమిండియా తడబడటం గమనార్హం.ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. అతడికి తోడుగా ఉన్న మరో లెఫ్టాండర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొడుతుండటం సానుకూలాంశం కాగా.. మరో ఎడమ చేతి వాటం బ్యాటర్, వన్‌డౌన్‌లో వచ్చే తిలక్ వర్మ మాత్రం క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో సూపర్-8లో టీమిండియా కఠిన సవాళ్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే సైతం అంగీకరించాడు. టీమిండియా ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కోంటోందని తెలిపాడు.ప్రధానంగా రెండు సమస్యలుటాపార్డర్లో ముగ్గురూ లెఫ్టాండర్ బ్యాటర్లే ఉండటం ఒక సమస్య అయితే.. ఫింగర్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటు మరో సమస్య అని డష్కాటే పేర్కొన్నాడు. ‘‘టాప్-3లో మాకు ఎక్కువగా ఆప్షన్లు లేవు. సంజూ బెంచ్ మీద ఉన్నాడు. కాబట్టి ముగ్గురూ ఎడమచేతి వాటం బ్యాటర్లే కొనసాగుతున్నారు.అయితే, మా బ్యాటర్లలో చాలా మంది ఫింగర్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సూపర్-8లో వెస్టిండీస్, సౌతాఫ్రికా మాపై ఇలాంటి బౌలర్లను ప్రయోగించడం ఖాయమే. అయితే, మాకు అత్యుత్తమ బ్యాటర్లు ఉండటం కలిసి వచ్చే అంశం.14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్పాకిస్తాన్ కూడా గత మ్యాచ్‌లో 14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్ వేయించింది. ఆఫ్ స్పిన్ కంటే ఫింగర్ స్పిన్నే ఎక్కువగా వాళ్లు నమ్ముకున్నారని నేను అంటాను. కొలంబో వంటి స్లో పిచ్‌లపై ఇలాంటివి వర్కౌట్ అవుతాయి.అయితే, మా వాళ్లు అలాంటి చోట సమస్యను అధిగమించారు. కాబట్టి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని డష్కాటే చెప్పుకొచ్చాడు.కాగా ఆఫ్ స్పిన్నర్లు బంతిని టర్న్ చేసే క్రమంలో మణికట్టు కదలికల (కుడి నుంచి ఎడమకు)పై ఆధారపడితే.. ఫింగర్ స్పిన్నర్లు చూపుడు లేదంటే మధ్యవేలును ఉపయోగించి బంతి దిశను మార్చేందుకు ప్రయత్నిస్తారు. ఈ చిన్న తేడా తప్ప రెండు దాదాపుగా ఒకే విధమైన బౌలింగ్ శైలి అని చెప్పవచ్చు. కాగా సూపర్-8లో భారత్ వరుసగా సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లతో తలపడుతుంది.చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్ -
T20 WC: సూపర్-8 షెడ్యూల్ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో లీగ్ దశ తుది అంకానికి చేరుకుంది. ఇరవై జట్లతో మొదలైన ఈ ఐసీసీ ఈవెంట్లో ఆస్ట్రేలియా మినహా అగ్రశ్రేణి జట్లన్నీ సూపర్-8కు చేరుకున్నాయి.సూపర్-8 చేరిన జట్లు ఇవేగ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్... గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8 బెర్తులు ఖరారు చేసుకున్నాయి. కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలైన టీ20 ప్రపంచకప్ పదో ఎడిషన్ లీగ్ దశ గురువారంతో ముగియనుంది.ఎవరు ఎవరితో ఢీ?అయితే, అంతకంటే ముందే అంటే బుధవారమే పాకిస్తాన్ నమీబియాపై గెలవడంతో సూపర్-8 బెర్తులు ఖరారైపోయాయి. గ్రూప్ దశలో నామమాత్రపు మ్యాచ్‌లలో వెస్టిండీస్- ఇటలీ.. శ్రీలంక- జింబాబ్వే.. అఫ్గనిస్తాన్- కెనడా గురువారం తలపడతాయి. మరి సూపర్-8 దశలో ఏ జట్టుకు ఏ జట్టుతో పోటీ? షెడ్యూల్, వేదికలు.. తదితర వివరాలు తెలుసుకుందామా?8️⃣ TEAMS 4️⃣ SEMI-FINAL SPOTSThe race intensifies and the stakes are higher than ever as we enter the Super 8 phase! 🤩 🔥Which four teams will move one step closer to their World Cup dream? Drop your predictions 👇ICC Men's #T20WorldCup SUPER 8 👉 Starts SAT, 21st FEB pic.twitter.com/wsgnCWEXmx— Star Sports (@StarSportsIndia) February 19, 2026 -
T20 WC: ఆస్ట్రేలియా అవుట్.. సూపర్-8కు జింబాబ్వే
ఊహించిందే జరిగింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. గ్రూప్-బి నుంచి ఐర్లాండ్- జింబాబ్వే మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ రద్దయిపోయింది.ఆస్ట్రేలియా ఎలిమినేట్శ్రీలంకలోని పల్లెకెలెలో వర్షం తెరిపినివ్వక పోవడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో జింబాబ్వే పాయింట్ల సంఖ్య ఐదుకు చేరగా... ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది.మొత్తంగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్ టోర్నీలో ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇందులో భాగంగా గ్రూప్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ వంటి పసికూనలతో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా పోటీలో ఉన్నాయి.ఐదు పాయింట్లతో అర్హత ఇక ఆది నుంచి అదరగొట్టిన శ్రీలంక ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్-బి నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. రెండో స్థానం కోసమైనా పోరాడాలని అనుకున్న ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన ఆస్ట్రేలియా.. తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సోమవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ చిత్తుగా ఓడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.మ్యాచ్ రద్దు కావడంతోమరోవైపు.. జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా ఐర్లాండ్‌తో జరగాల్సిన మూడో మ్యాచ్ రద్దు కావడంతో జింబాబ్వేకు మరో పాయింట్ వచ్చింది. నెట్‌రన్‌రేటు పరంగానూ జింబాబ్వే పటిష్ట స్థితి (+1.984)లో నిలిచింది. ఫలితంగా శ్రీలంకతో కలిసి జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధించగా.. మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియా అవమాన భారంతో నిష్క్రమించింది.ఇక గ్రూప్-బి తదుపరి నామమాత్రపు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆఖరిగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడుతుంది. మరోవైపు జింబాబ్వే గురువారం శ్రీలంకను ఢీకొడుతుంది.ఆఖరి బెర్తు ఎవరిదో?ఇదిలా ఉంటే.. గ్రూప్-ఎ నుంచి టీమిండియా సూపర్-8కు చేరగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించాయి. ఆఖరి బెర్తు కోసం గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, అమెరికా బరిలో ఉన్నాయి. కాగా గత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో పాక్‌ను వెనక్కి నెట్టి అమెరికా సూపర్-8కు చేరిన విషయం తెలిసిందే.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్.. ప్రపంచ రికార్డు


