హార్దిక్‌ పాండ్యా ఫెయిల్‌.. గర్ల్‌ఫ్రెండ్‌ రియాక్షన్‌ వైరల్‌ | IND Vs SA, Hardik Pandya Girlfriend Mahieka Sharma Clapping Reaction After His Dismissal, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

IND Vs SA: దారుణంగా విఫలమైన హార్దిక్‌ పాండ్యా.. గర్ల్‌ఫ్రెండ్‌ రియాక్షన్‌ వైరల్‌

Feb 23 2026 1:40 PM | Updated on Feb 23 2026 1:55 PM

IND vs SA: Mahieka Reaction After Hardik Pandya Dismissal Goes Viral

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా తొలి పరాజయం నమోదు చేసింది. కీలక సూపర్‌-8 దశలో మొదటి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. తద్వారా సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

అహ్మదాబాద్‌ వేదికగా సఫారీలతో ఆదివారం తలపడ్డ సూర్యకుమార్‌ సేన.. 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.

ధనాధన్‌ దంచికొట్టి..
డెవాల్డ్‌ బ్రెవిస్‌ (29 బంతుల్లో 45), డేవిడ్‌ మిల్లర్‌ (35 బంతుల్లో 63), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (24 బంతుల్లో 44 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టి ప్రొటిస్‌ జట్టును ఈ మేరకు పటిష్ట స్థితిలో నిలిపారు. భారత బౌలర్లలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మూడు, అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీయగా.. వరుణ్‌ చక్రవర్తి, శివం దూబే తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

దారుణంగా విఫలమైన హార్దిక్‌ పాండ్యా
ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి ఏకంగా 45 పరుగులు సమర్పించుకుని.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అదే విధంగా లక్ష్య ఛేదనలోనూ హార్దిక్‌ బ్యాట్‌తో విఫలమయ్యాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన హార్దిక్‌.. 17 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.

చప్పట్లు కొట్టిన మహీక
సఫారీ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో.. భారీ షాట్‌కు యత్నించి స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చిన హర్దిక్‌ పాండ్యా పెవిలియన్‌ చేరాడు. ఈ సందర్భంగా హార్దిక్‌ ప్రేయసి మహీక శర్మ వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. హార్దిక్‌ అవుట్‌ కాగానే లేచి నిలబడిన మహీక చప్పట్లు కొడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

గర్ల్‌ఫ్రెండ్‌ బర్త్‌డే వేడుకలలో..
ఈ నేపథ్యంలో మహీకకు అసలు క్రికెట్‌ గురించి తెలుసా? అంటూ ట్రోల్స్‌ వస్తున్నాయి. అయితే, హార్దిక్‌ అభిమానులు మాత్రం.. అతడిని నిరాశ చెందవద్దని చెప్పేందుకే ఆమె క్లాప్‌ చేసిందని అంటున్నారు. కాగా భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్న కొన్నాళ్లకే మహీకతో తాను ప్రేమలో ఉన్నట్లు హార్దిక్‌ పాండ్యా వెల్లడించాడు.

ఆమె వల్లే గొప్పగా ఆడుతున్నా
ఇక అప్పటి నుంచి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది ఈ జంట. ఈ క్రమంలో మహీక వల్లే తాను గొప్పగా ఆడుతున్నానని.. ఆమె రాకతో జీవితం మారిందని హార్దిక్‌ ప్రశంసలు కురిపించడం విశేషం. అయితే, తాజా మ్యాచ్‌లో మాత్రం అతడు దారుణంగా విఫలం కావడం గమనార్హం.

ఈ మ్యాచ్‌కు ముందు మహీక బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తూ వేడుకల్లో మునిగిపోయాడు హార్దిక్‌. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో భారత్‌ 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

చదవండి: T20 WC 2026: టీమిండియా కొంప‌ముంచిన గంభీర్‌.. నెటిజ‌న్లు ఫైర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement