T20 WC: కివీస్‌, లంకకు భారీ షాక్‌!.. పాక్‌కు గుడ్‌న్యూస్‌? | Is Another Washout Likely In Super 8 T20 WC NZ Vs SL Clash In Colombo, Semifinal Destiny At Risk | Sakshi
Sakshi News home page

NZ vs SL: కివీస్‌, శ్రీలంకలకు భారీ షాక్‌!.. పాక్‌కు గుడ్‌న్యూస్‌?

Feb 25 2026 3:24 PM | Updated on Feb 25 2026 5:08 PM

T20 WC NZ vs SL: Is Another Washout Likely in Colombo If That Happen

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షార్ఫణం అయ్యాయి. లీగ్‌ దశలో పల్లెకెలె వేదికగా ఐర్లాండ్‌- జింబాబ్వే మ్యాచ్‌ వాన కారణంగా టాస్‌ పడకుండానే రద్దైంది. ఇక సూపర్‌-8 దశలో కొలంబో వేదికగా పాకిస్తాన్‌- న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌ కూడా వర్షం వల్ల మొదలుకాకుండానే ముగిసిపోయింది.

ఫలితంగా సెమీస్‌ రేసులో కీలకమైన సూపర్‌-8 దశలో ఇరుజట్లకు చెరో పాయింట్‌ వచ్చింది. దీంతో తదుపరి మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

కివీస్‌, లంకకు భారీ షాక్‌!
సూపర్‌-8 గ్రూప్‌-2లో భాగంగా కివీస్‌ బుధవారం కొలంబో వేదికగా శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే న్యూజిలాండ్‌ సెమీస్‌ అవకాశాలు మెరుగుపడతాయి. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే సూచనలు ఉన్నాయి. 

ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం..  మ్యాచ్‌ ఆరంభ సమయం (రాత్రి 7 గంటల) నుంచి తొమ్మిది గంటల వరకు వాన పడేందుకు 14 శాతం అవకాశాలు ఉన్నాయి.

రాత్రి 10, 11 గంటల ప్రాంతంలో వర్షం పడేందుకు 49- 58 శాతం అవకాశాలు ఉన్నాయి. దీంతో కివీస్‌- శ్రీలంక మ్యాచ్‌ రద్దయిపోయేందుకు ఎక్కువ ఛాన్సులు కనిపిస్తున్నాయి. 

ఒకవేళ వర్షం తెరిపినిస్తే ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కివీస్‌ జట్టుకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం. ఒకవేళ మ్యాచ్‌ రద్దైతే.. తదుపరి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తప్పక గెలవాలి. లేదంటే పాకిస్తాన్‌తో పోటీలో వెనుకబడే అవకాశం ఉంది.

పాక్‌కు ఒక రకంగా శుభవార్తే!
కాగా గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌.. శ్రీలంక, పాకిస్తాన్‌లను ఓడించి ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. రెండో స్థానం కోసం కివీస్‌, పాక్‌ మధ్య పోటీ నెలకొంది. కివీస్‌ శ్రీలంకతో పాటు ఇంగ్లండ్‌ను కూడా ఓడిస్తే నేరుగా సెమీస్‌ చేరుకుంటుంది.

అలా కాక ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. పాక్‌కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇక పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే.. శ్రీలంక, ఇంగ్లండ్‌ చేతుల్లో న్యూజిలాండ్‌ తప్పక ఓడిపోవాలి. అదే విధంగా శ్రీలంకపై పాక్‌ గెలవాల్సి ఉంటుంది. 

అలా కాకుండా.. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ తదుపరి ఒక్కో మ్యాచ్‌లో గెలిస్తే.. పాయింట్ల సంఖ్య (3) సమానం అవుతుంది. అలాంటపుడు నెట్‌రన్‌రేటు కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు.. శ్రీలంక రేసులో ఉండాలంటే న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌లపై భారీ విజయాలు సాధించాలి.

కాగా వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. కొన్నిరోజులుగా కొలంబో, పల్లెకెలెలో వర్షం పడటం.. శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడే జట్లకు ఇబ్బందికరంగా మారింది. 

చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement