బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 23 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆ జట్టు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్ట్ మ్యాచ్ డార్విన్ వేదికగా ఆగస్ట్ 13-17 మధ్య తేదీల్లో జరుగుతుంది. రెండో టెస్ట్ మెక్‌కే వేదికగా ఆగస్ట్ 22-26 మధ్య జరుగనుంది.
బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా మధ్య ఇది నాలుగో టెస్ట్ సిరీస్ ఆవుతుంది. ఇందులో ఆరు మ్యాచ్‌లు జరగ్గా ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. 2017లో మీర్పూర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆసీస్‌పై సంచలన విజయం సాధించింది.
కాగా, బంగ్లాతో హోం సిరీస్‌తోనే 2026-27 సీజన్ ఆసీస్ టెస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ సిరీస్ తర్వాత ఆసీస్ మూడు టెస్ట్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఆతర్వాత నవంబర్ నుంచి 2027 జనవరి మధ్యలో న్యూజిలాండ్ జట్టు నాలుగు టెస్ట్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
జనవరి, ఫిబ్రవరి మాసాల్లో భారత్‌లో 5 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగనుంది. అనంతరం మార్చిలో ఇంగ్లండ్‌తో ఎంసీజీలో 150వ వార్షికోత్సవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.
సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్
అక్టోబర్ 9-13: తొలి టెస్ట్, డర్బన్
అక్టోబర్ 18-22: రెండో టెస్ట్, గ్వెబెర్హా
అక్టోబర్ 27-31: మూడో టెస్ట్, కేప్‌టౌన్
ఈ పర్యటనలో ఆసీస్ మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆ మ్యాచ్‌లు సెప్టెంబర్ 24 (డర్బన్), 27 (జోహనెస్‌బర్గ్), 30 (పోచెఫ్‌స్ట్రూమ్) తేదీల్లో జరుగుతాయి.
ఇంగ్లండ్‌తో 150వ వార్షికోత్సవ టెస్ట్
2027, మార్చి 11-15: ఏకైక టెస్ట్, ఎంసీజీ
ఆసీస్‌లో న్యూజిలాండ్ పర్యటన.. భారత్‌లో ఆసీస్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ దశలోనే వైదొలిగిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆ జట్టు పునఃదర్శనం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌తోనే ఉంటుంది. ఈ మధ్యలో ఆ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్, పాకిస్తాన్ లీగ్ తదితర ప్రైవేట్ లీగ్‌లతో పాటు దేశవాలీ టోర్నీల్లో ఆడతారు.


