అఫ్గనిస్తాన్‌ కొత్త హెడ్‌కోచ్‌గా అతడే.. ఏసీబీ ప్రకటన | Afghanistan Appointed New Head Coach After Jonathan Trott Departs After Recent T20 World Cup, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

అఫ్గనిస్తాన్‌ కొత్త హెడ్‌కోచ్‌గా అతడే.. ఏసీబీ ప్రకటన

Feb 25 2026 2:44 PM | Updated on Feb 25 2026 4:15 PM

Afghanistan Appointed New head coach after Jonathan Trott departs

అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు కొత్త హెడ్‌కోచ్‌ వచ్చాడు. తాజా టీ20 ప్రపంచకప్‌ వరకు అఫ్గన్‌ జట్టుకు ఇంగ్లండ్‌ మాజీ ప్లేయర్‌ జొనాథన్‌ ట్రాట్‌ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, టోర్నీ అనంతరం అతడు పదవి నుంచి దిగిపోయాడు.

ట్రాట్‌ స్థానంలో
ఈ క్రమంలో ట్రాట్‌ స్థానంలో కొత్త హెడ్‌ కోచ్‌గా రిచర్డ్‌ పైబస్‌ను నియమించినట్లు అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ACB) తెలిపింది. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి పైబస్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. 

‘అఫ్గనిస్తాన్‌ జాతీయ జట్టుకు రిచర్డ్‌ పైబస్‌ను కొత్త హెడ్‌ కోచ్‌గా నియమించాం. శ్రీలంకతో సిరీస్‌ నుంచి అతడు జట్టుతో చేరతాడు’ అని ఏసీబీ పేర్కొంది. 

కోచ్‌గా మంచి రికార్డు
ఇక ఇంగ్లండ్‌కు చెందిన పైబస్‌ ఒకే ఒక్క లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌ ఆడాడు. అయితే, ఆటగాడిగా పెద్దగా అనుభవం లేకపోయినా... కోచ్‌గా మంచి రికార్డు ఉంది. పైబస్‌ 2013 నుంచి 2019 వరకు వెస్టిండీస్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అతడు విండీస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా ఉన్న సమయంలోనే కరీబియన్‌ జట్లు పురుషుల, మహిళల, అండర్‌–19 వరల్డ్‌కప్‌ ట్రోఫీలు సాధించాయి. 

సూపర్‌-8 చేరకుండానే
కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, యూఏఈ, కెనడాలతో తలపడ్డ అఫ్గనిస్తాన్‌.. నాలుగింటికి రెండే మ్యాచ్‌లు గెలిచింది. తద్వారా సూపర్‌-8 చేరకుండానే నిష్క్రమించింది. గత ఎడిషన్‌లో అఫ్గన్‌ జట్టు అనూహ్య రీతిలో సెమీస్‌ చేరిన సంగతి తెలిసిందే.

చదవండి: T20 WC 2026: పాక్‌ జట్టులో కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement