T20 WC: ఆస్ట్రేలియా అవుట్‌.. సూపర్‌-8కు జింబాబ్వే | T20 WC 2026 IRE vs ZIM Match Abandoned, ZIM in Super 8 AUS Eliminated | Sakshi
Sakshi News home page

T20 WC: ఆస్ట్రేలియా అవుట్‌.. సూపర్‌-8కు జింబాబ్వే

Feb 17 2026 5:45 PM | Updated on Feb 17 2026 6:23 PM

T20 WC 2026 IRE vs ZIM Match Abandoned, ZIM in Super 8 AUS Eliminated

ఊహించిందే జరిగింది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. లీగ్‌ దశలోనే ఇంటిబాట పట్టింది. గ్రూప్‌-బి నుంచి ఐర్లాండ్‌- జింబాబ్వే మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ రద్దయిపోయింది.

ఆస్ట్రేలియా ఎలిమినేట్‌
శ్రీలంకలోని పల్లెకెలెలో వర్షం తెరిపినివ్వక పోవడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్‌ వచ్చింది. దీంతో జింబాబ్వే పాయింట్ల సంఖ్య ఐదుకు చేరగా... ఆస్ట్రేలియా ఎలిమినేట్‌ అయింది.

మొత్తంగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్‌ టోర్నీలో ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇందులో భాగంగా గ్రూప్‌-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్‌, ఒమన్‌ వంటి పసికూనలతో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా పోటీలో ఉన్నాయి.

ఐదు పాయింట్లతో అర్హత 
ఇక ఆది నుంచి అదరగొట్టిన శ్రీలంక ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్‌-బి నుంచి సూపర్‌-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. రెండో స్థానం కోసమైనా పోరాడాలని అనుకున్న ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.

తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన ఆస్ట్రేలియా.. తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సోమవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ చిత్తుగా ఓడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్‌ ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.

మ్యాచ్‌ రద్దు కావడంతో
మరోవైపు.. జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా ఐర్లాండ్‌తో జరగాల్సిన మూడో మ్యాచ్‌ రద్దు కావడంతో జింబాబ్వేకు మరో పాయింట్‌ వచ్చింది. నెట్‌రన్‌రేటు పరంగానూ జింబాబ్వే పటిష్ట స్థితి (+1.984)లో నిలిచింది. ఫలితంగా శ్రీలంకతో కలిసి జింబాబ్వే సూపర్‌-8కు అర్హత సాధించగా.. మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలోని  ఆస్ట్రేలియా అవమాన భారంతో నిష్క్రమించింది.

ఇక గ్రూప్‌-బి తదుపరి నామమాత్రపు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆఖరిగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడుతుంది. మరోవైపు జింబాబ్వే గురువారం శ్రీలంకను ఢీకొడుతుంది.

ఆఖరి బెర్తు ఎవరిదో?
ఇదిలా ఉంటే.. గ్రూప్‌-ఎ నుంచి టీమిండియా సూపర్‌-8కు చేరగా.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ అర్హత సాధించాయి. ఆఖరి బెర్తు కోసం గ్రూప్‌-ఎ నుంచి పాకిస్తాన్‌, అమెరికా బరిలో ఉన్నాయి. కాగా గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో పాక్‌ను వెనక్కి నెట్టి అమెరికా సూపర్‌-8కు చేరిన విషయం తెలిసిందే.

చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్‌.. ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement