breaking news
Australia vs Zimbabwe
-
ఆస్ట్రేలియాను వణికించిన జింబాబ్వే.. ఒక్క వికెట్ తేడాతో
హరారే వేదికగా జింబాబ్వే-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డే అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. చివరి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ ఉత్కంఠ పోరులో ఒక్క వికెట్ తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలకు జింబాబ్వే బౌలర్లు చుక్కలు చూపించారు. జోష్ ఇంగ్లిస్ (103) సెంచరీతో కదం తొక్కినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ఒకానొక దశలో 232 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పదని అంతా భావించారు.ఈ సమయంలో 9వ స్థానంలో క్రీజులోకి వచ్చిన పేసర్ నాథన్ ఎల్లిస్ (36 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. ఎల్లిస్ తొలి బంతికే సిక్స్ బాది విజయాన్ని ఖాయం చేశాడు. కాగా 49వ ఓవర్లో ఎల్లిస్ ఇచ్చిన క్యాచ్‌ను మధెవెరే జారవిడవడమే జింబాబ్వే ఓటమికి కారణమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 4 వికెట్లతో రాణించాడు.అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రాజా (81 నాటౌట్), క్రైగ్ ఎర్విన్ (59), ఇన్నోసెంట్ కైయా (55) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. -
జింబాబ్వే ప్లేయర్ ప్రపంచ రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలోనే
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే వెటరన్ బ్యాటర్, మాజీ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ అద్భుత హాఫ్ సెంచరీతో రాణించాడు. ఐదో స్థానంలో మైదానంలోకి దిగిన ఎర్విన్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. మొత్తంగా 79 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఎర్విన్ వన్డే క్రికెట్లో ఒక ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న జట్ల తరఫున వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఎర్విన్ చరిత్ర సృష్టించాడు. 41 సంవత్సరాల 32 రోజుల వయస్సులో ఎర్విన్ ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ సీనియర్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ పేరిట ఉండేది. నబీ 40 ఏళ్ల 286 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, తాజాగా ఎర్విన్ దానిని అధిగమించాడు.వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కులు వీరేక్రెగ్ ఎర్విన్ (జింబాబ్వే): 41 ఏళ్ల 32 రోజులు (వర్సెస్ ఆస్ట్రేలియా, 2026)మహ్మద్ నబీ (అఫ్గానిస్థాన్): 40 ఏళ్ల 286 రోజులు (వర్సెస్ బంగ్లాదేశ్, 2025)మిస్బా ఉల్ హక్ (పాకిస్థాన్): 40 ఏళ్ల 283 రోజులు (వర్సెస్ దక్షిణాఫ్రికా, 2015)జియోఫ్రీ బాయ్‌కాట్ (ఇంగ్లండ్): 40 ఏళ్ల 226 రోజులు (వర్సెస్ ఆస్ట్రేలియా, 1981)క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్): 40 ఏళ్ల 155 రోజులు (వర్సెస్ శ్రీలంక, 1985)చరిత్రలో తొలిసారి!ఈ మ్యాచ్‌లో ఎర్విన్ రికార్డుతో పాటు మరొక అరుదైన రికార్డు నమోదైంది. జింబాబ్వే తుది జట్టులో క్రెగ్ ఎర్విన్, సికందర్ రజా, బ్రెండన్ టేలర్, గ్రేమ్ క్రీమర్ రూపంలో ఏకంగా నలుగురు 40 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు బరిలోకి దిగారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక జట్టు తరఫున ఒకే మ్యాచ్‌లో నలుగురు 40 ప్లస్ ఏళ్ల ప్లేయర్లు ఆడటం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.చదవండి: IND vs WI: విండీస్ టీమ్‌లో మరో పూరన్.. ఈ కొత్త 'పూరన్' మామూలోడు కాదు! -
హెడ్ తుఫాన్ సెంచరీ.. రికార్డు స్కోర్ సాధించిన ఆస్ట్రేలియా!
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు జూలు విదిల్చారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (84 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112) భారీ సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ మిచెల్ మార్ష్ (53), కూపర్ కొన్నోలీ (78) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఆఖరిలో ఆలివర్ పీక్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41) మెరుపులు మెరిపించాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ మూడు, స్పిన్నర్ వెల్లింగ్టన్ మసకద్జా రెండు వికెట్లు తీశారు.విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్ ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో జింబాబ్వేపై అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు మాట్ రెన్షా (86 బంతులు) పేరిట ఉండగా.. తాజా మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని హెడ్ దానిని అధిగమించాడు. అంతేకాకుండా వన్డేల్లో జింబాబ్వేపై ఆస్ట్రేలియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. గతంలో 2014లో ఇదే హరారే మైదానంలో ఆసీస్ చేసిన 350 పరుగుల రికార్డును ప్రస్తుత మ్యాచ్‌తో తిరగరాశారు.చదవండి: AUS vs ZIM: ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ! -
ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ!
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో హెడ్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. తొలి వన్డేలో ఘోరంగా విఫలమైన హెడ్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆతిథ్య జట్టును బౌలర్లను ఉతికారేశాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ ప్రేక్షకులను అలరించిన హెడ్.. కేవలం 75 బంతుల్లోనే తన 8వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 84 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ఈ ఇన్నింగ్స్‌తో హెడ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో జింబాబ్వేపై అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాట్ రెన్షా పేరిట ఉండేది. హరారేలో జరిగిన తొలి వన్డేలో రెన్షా 86 బంతుల్లో శతకం సాధించగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఆ రికార్డును హెడ్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 45 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 295 పరుగుల భారీ స్కోర్ సాధించింది.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, ఇన్నోసెంట్ కైయా, బ్రెండన్ టేలర్(వికెట్ కీపర్), క్రెయిగ్ ఎర్విన్, సికందర్ రజా(కెప్టెన్), వెస్లీ మాధవెరె, బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, న్యూమాన్ న్యామ్హురి, బ్లెస్సింగ్ ముజరబానీఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, కూపర్ కానలీ, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, మాట్ రెన్షా, ఆలివర్ పీక్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, బిల్లీ స్టాన్లేక్చదవండి: SA vs AUS: సౌతాఫ్రికాకు ఊహించని షాక్! ఇక అంతే సంగతి? -
రెన్షా శతకం, ఇల్లిస్ విజృంభణ.. తొలి వన్డే ఆసీస్‌దే..!
జింబాబ్వేలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుపుతో బోణీ కొట్టింది. హరారే వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో మ్యాట్ రెన్షా, బౌలింగ్‌లో నాథన్ ఇల్లిస్ సత్తా చాటి ఆసీస్‌ను గెలిపించారు.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా (109) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. కూపర్ కన్నోల్లీ (51) కూడా రాణించాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (36), ఒలివర్ పీక్ (30), అలెక్స్ క్యారీ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ట్రవిస్ హెడ్ (4), జోష్ ఇంగ్లిస్ (4), జేవియర్ బార్ట్లెట్ (5) నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లలో న్యుమ్యాన్ న్యామ్హురి (5-62) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. బ్రాడ్ ఈవాన్స్ 2, కెప్టెన్ సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే తడబడింది. నాథన్ ఇల్లిస్ (5-31) విజృంభించడంతో 45.1 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, రెన్షా, ఆడమ్ జంపా, కూపర్ కన్నోల్లీ తలో వికెట్ తీసి, జింబాబ్వే పతనంలో పాలుపంచుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ ఎర్విన్ (59), కెప్టెన్ సికందర్ రజా (57) అర్ద సెంచరీలతో పోరాడినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. వీరికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఈ సిరీస్‌లో రెండో వన్డే సెప్టెంబర్ 18న ఇదే హరారే వేదికగా జరుగనుంది.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన బుమ్రా -
ఆసీస్‌పై 5 వికెట్ల ప్రదర్శన.. రికార్డులు కొల్లగొట్టిన జింబాబ్వే బౌలర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే యువ పేసర్ న్యూమన్ న్యామ్హురి సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. తద్వారా ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి జింబాబ్వే పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు.అలాగే ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో జింబాబ్వే బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు స్పిన్నర్ ర్యాన్ బర్ల్ ఈ ఘనత సాధించాడు.మరో ఘనతన్యామ్హురి తాజా ప్రదర్శనతో మరో ఘనత కూడా సాధించాడు. వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడైన (20 ఏళ్ల 239 రోజులు) జింబాబ్వే బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ల్యూక్ జోంగ్వే (20 ఏళ్ల 330 రోజులు) పేరిట ఉండేది.ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుల జాబితాలో న్యామ్హురి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ (18 ఏళ్ల 266 రోజులు) అగ్రస్థానంలో ఉండగా.. అదే దేశానికి చెందిన సక్లైన్ ముష్తాక్ (19 ఏళ్ల 352 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. న్యామ్హురి ఐదేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులకే పరిమితమైంది. న్యామ్హురి వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్ 300కు పైగా స్కోర్ చేయలేకపోయింది. న్యామ్హురి తన స్పెల్‌లో కీలక వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, జేవియర్ బార్ట్లెట్, ఆలివర్ పీక్లతో పాటు సెంచరీ సాధించిన మ్యాట్ రెన్షాను (109) ఔట్ చేశాడు.రెన్షాతో పాటు ఆసీస్ ఇన్నింగ్స్‌లో కూపర్ కన్నోల్లీ (51) కూడా రాణించాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (36), ఒలివర్ పీక్ (30), అలెక్స్ క్యారీ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ట్రవిస్ హెడ్ (4), జోష్ ఇంగ్లిస్ (4), జేవియర్ బార్ట్లెట్ (5) నిరాశపరిచారు. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జింబాబ్వేలో పర్యటిస్తుంది.ఇదీ చదవండి: సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్ -
శతక్కొట్టిన రెన్షా.. ఆస్ట్రేలియా భారీ స్కోర్
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 15) తొలి వన్డే జరుగుతుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.మిడిలార్డర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా (109) తన కెరీర్లో తొలి వన్డే శతకంతో కదంతొక్కడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ (294-4) చేసింది. రెన్షాతో పాటు ఆసీస్ ఇన్నింగ్స్‌లో కూపర్ కన్నోల్లీ (51) కూడా రాణించాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (36), ఒలివర్ పీక్ (30), అలెక్స్ క్యారీ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ట్రవిస్ హెడ్ (4), జోష్ ఇంగ్లిస్ (4), జేవియర్ బార్ట్లెట్ (5) నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లలో న్యుమ్యాన్ న్యామ్హురి (5-62) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. బ్రాడ్ ఈవాన్స్ 2, కెప్టెన్ సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టాడు.ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో జింబాబ్వే వెటరన్ వికెట్‌కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండిన ఓ భారీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్లో సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన ఆటగాడిగా అవతరించాడు. సచిన్ తన వన్డే కెరీర్‌ను 22 ఏళ్ల 91 రోజుల పాటు కొనసాగించగా.. టేలర్ 22 ఏళ్ల 148 రోజుల తర్వాత కూడా తన వన్డే కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్ -
ZIM vs AUS: ట్రవిస్ హెడ్‌కు దిమ్మతిరిగే షాక్!
జింబాబ్వేతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రవిస్ హెడ్ పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కేవలం ఒక ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప స్కోరుకే అవుటైన ఆసీస్ ఓపెనర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.మూడు వన్డేల సిరీస్‌కాగా వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ను మంగళవారం మొదలుపెట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.క్లీన్ బౌల్డ్ఈ క్రమంలో రెండో ఓవర్లో జింబాబ్వే పేసర్ బ్రాడ్ ఎవాన్స్ బంతితో రంగంలోకి దిగగా.. రెండో బాల్‌కు ఫోర్ బాది హెడ్ తన పరుగుల ఖాతా తెరిచాడు. అయితే, అదే ఓవర్లో ఐదో బంతికే ఎవాన్స్ అద్భుత బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో షాట్‌కు యత్నించిన హెడ్ బౌల్డ్ అయి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.భారీ అంచనాలతో బరిలోకి దిగిన మొత్తంగా ఐదు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో హెడ్ షాట్ సెలక్షన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆసీస్ ఓపెనర్‌గా ట్రవిస్ హెడ్ అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో మరో ఓపెనర్, ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. తద్వారా హెడ్‌తో పాటు ఈ జాబితాలో చేరిపోయాడు.A familiar dismissal for Travis Head!😬He edges one onto the stumps — and Brad Evans strikes! 🎯🔥#ZIMvAUS #Australia #Zimbabwe #ODI #Harare #TravisHead pic.twitter.com/C2qqleXPM5— lightningspeed (@lightningspeedk) September 15, 2026జింబాబ్వే గడ్డ మీద అత్యల్ప వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన ఆసీస్ ఓపెనర్లు👉ట్రవిస్ హెడ్- 4 పరుగులు (హరారే, 2026)👉ఆడం గిల్‌క్రిస్ట్- 14 పరుగులు(బులవాయో, 1999)👉మాథ్యూ హెడెన్- 34 పరుగులు (బులవాయో, 2003)👉మిచెల్ మార్ష్- 36 పరుగులు (హరారే, 2026)👉బ్రాడ్ హాడిన్- 46 పరుగులు (హరారే, 2014).చదవండి: టీమిండియాలో కొందరు కోహ్లిని వ్యతిరేకించారు: భువీ -
ఆసీస్ జట్టు ప్రకటన.. వన్డే వరల్డ్‌కప్ నుంచి అతడు అవుట్
సౌతాఫ్రికా, జింబాబ్వేతో వన్డే సిరీస్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. వన్డే ప్రపంచకప్-2027 ప్రణాళికల్లో భాగంగా ఆడబోయే ఈ సిరీస్ నుంచి మార్నస్ లబుషేన్‌ను తప్పించింది. తద్వారా మెగా ఈవెంట్లో అతడి సేవలు అవసరం లేదనే సంకేతాలు ఇచ్చింది.కీలక పాత్రకాగా సౌతాఫ్రికాలో జన్మించిన లబుషేన్.. 2022 నుంచి ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. భారత్‌లో 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఆసీస్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, గత కొంతకాలంగా లబుషేన్ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు.ఫామ్‌లేమితో సతమతంగత రెండేళ్లుగా లబుషేన్ పేలవ ఆట తీరు కనబరుస్తున్నాడు. ఈ 32 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ సగటు 2024 నుంచి 21.87గా ఉంది. అత్యుత్తమ స్కోరు 77 నాటౌట్. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా, జింబాబ్వేలతో వన్డేలు ఆడబోయే పదిహేడు మంది సభ్యులతో కూడిన జట్టు నుంచి లబుషేన్‌ను తప్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయం గురించి ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ నుంచి మాత్రమే లబుషేన్‌ను తప్పించామని స్పష్టం చేశాడు. అతడు జట్టుకు ఎంతో సేవ చేశాడని.. కానీ ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా అతడిపై వేటు వేయక తప్పలేదని పేర్కొన్నాడు.టెస్టుల్లోనూ స్థానం గల్లంతేనా?అయితే, టెస్టుల్లోనూ లబుషేన్ స్థానం గల్లంతేనా అన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు. కాగా ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టుల్లోనూ లబుషేన్ నిరాశపరచగా.. తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2027 వేదికలైన సౌతాఫ్రికా, జింబాబ్వేలతో వారి స్వదేశంలో ఆడటం తమకు సానుకూలాంశంగా మారుతుందని బెయిలీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.కమిన్స్, స్టార్క్ ఆ సిరీస్‌లో మాత్రమేఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో వన్డేలకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఎంపికయ్యారు. అయితే, జింబాబ్వేతో సిరీస్‌కు మాత్రం వారు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో అన్క్యాప్డ్ ప్లేయర్ జోయెల్ డేవిస్‌తో పాటు ఒలివర్ పీక్, కూపర్ కన్నోలిలకు అవకాశం ఇచ్చారు.కాగా ఆఫ్రికా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా సెప్టెంబరు 15 నుంచి జింబాబ్వేతో మూడు... సెప్టెంబరు 24 నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడుతుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఈ టూర్‌ను ప్లాన్ చేశారు.జింబాబ్వే, సౌతాఫ్రికాతో సిరీస్‌లకు ఆస్ట్రేలియా వన్డే జట్టుమిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్ (సౌతాఫ్రికా సిరీస్‌కు మాత్రమే), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోలి, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సెన్, ఒలివిక్ పీక్, మాథ్యూ రెన్షా, బిల్లీ సాన్లేక్, మిచెల్ స్టార్క్ (సౌతాఫ్రికా సిరీస్‌కు మాత్రమే), ఆడం జంపా.షెడ్యూల్జింబాబ్వేతో వన్డే సిరీస్👉హరారే వేదికగా- సెప్టెంబరు 15, 18, 20సౌతాఫ్రికాతో వన్డే సిరీస్👉డర్బన్‌లో తొలి వన్డే- సెప్టెంబరు 24👉జొహన్నస్‌బర్గ్‌లో రెండో వన్డే- సెప్టెంబరు 27👉పొచెఫ్స్ట్రూమ్లో మూడో వన్డే- సెప్టెంబరు 30.చదవండి: IND vs AFG: టీమిండియాలోకి ఊహించని ప్లేయర్! -
T20 WC: ఘోర పరాభవం.. స్పందించిన ఆసీస్ కెప్టెన్
మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చేదు అనుభవం ఎదురైంది. గ్రూప్ దశలోనే ‘పటిష్ట’ ఆసీస్ ఇంటిబాట పట్టింది. తొలుత ఐర్లాండ్‌పై గెలిచినా.. అదే జోరు కొనసాగించలేకపోయిన కంగారూలు.. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిపోయారు. ఫలితంగా సూపర్-8 చేరకుండానే నిష్క్రమించిన ఆసీస్.. లీగ్ దశలో చివరగా పసికూన ఒమన్‌ను ఓడించి విజయంతో ముగించింది.ఇదొక చేదు అనుభవంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. ఈసారి తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని.. భారమైన హృదయాలతో ఇంటిబాట పడుతున్నట్లు వెల్లడించాడు. ‘‘సూపర్-8 చేరే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాం. మా డ్రెసింగ్‌రూంలో నిరాశపూరిత వాతావరణం నెలకొంది. ఇదొక చేదు అనుభవం.దురదృష్టవశాత్తూ మేము గత రెండు మ్యాచ్‌లలో ఓడిపోయాము. అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయాము. అదే సమయంలో ప్రత్యర్థులు.. ముఖ్యంగా జింబాబ్వే అద్భుతంగా ఆడింది. ఆ జట్టు చేతిలో ఓడిపోగానే మాపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ విషయంలో వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే.గుణపాఠం నేర్చుకుంటాముఇక్కడి పిచ్ పరిస్థితులను ఎంతమాత్రం నిందించలేము. అన్నింటికీ మేము సన్నద్ధమయ్యే ఇక్కడికి వచ్చాము. మిగతా జట్ల మాదిరే రెండేళ్లుగా మా జట్టు నిర్మాణం జరుగుతోంది. కానీ కీలక సమయంలో మేము వెనకపడ్డాము. ఈ చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకుంటాము.క్రికెట్ ఆస్ట్రేలియా యాజమాన్యం ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తుంది. విఫలమైనపుడు నిరాశ సహజం. అయితే, స్వదేశానికి వెళ్లిన తర్వాత అంతా కూర్చుని లోపాల గురించి చర్చించుకుంటాము. నిజాయితిగా మా తప్పులను విశ్లేషించుకుంటాము. చాలా బాధగా ఉందిఏదేమైనా చాలా బాధగా ఉంది. నిరాశా, నిస్పృహలు కమ్ముకున్నాయి. అయితే, సానుకూల దృక్పథంతో మేము ముందడుగు వేసి తిరిగి పుంజుకుంటాము’’ అని మిచెల్ మార్ష్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.కాగా పల్లెకెలె వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఒమన్‌పై జయభేరి మోగించింది. ఆడమ్ జంపా (4/21), మ్యాక్స్‌వెల్ (2/13), బార్ట్లెట్ (2/27), స్టొయినిస్ (2/16), ఎలిస్ (1/14) ఇలా... బౌలింగ్ దళమంతా కలిసి ఒమన్ బ్యాటర్లను దెబ్బకొట్టింది.మిచెల్ మార్ష్ ధనాధన్ముందుగా ఒమన్ జట్టు 16.2 ఓవర్లలోనే 104 పరుగులకే కుప్పకూలింది. వసీమ్ అలీ (32; 4 ఫోర్లు) రాణించాడు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఆ్రస్టేలియా 9.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (33 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), హెడ్ (19 బంతుల్లో 32; 6 ఫోర్లు) చెలరేగి తొలి వికెట్‌కు 8.1 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్! -
అతడి ఖేల్ ఖతం.. కెరీర్ ముగిసినట్లే: పాంటింగ్
మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఘోర పరాభవం ఎదురైంది. పేలవ ప్రదర్శనతో తేలిపోయిన కంగారూలు.. పసికూన జింబాబ్వేతో పాటు శ్రీలంక చేతిలో ఓటమి పాలయ్యారు. ఫలితంగా కనీసం లీగ్ దశ దాటకుంటానే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో మిచెల్ మార్ష్ బృందంపై ఇంటా బయటా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో భాగమైన ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell) గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మాక్సీ పని అయిపోయిందని.. ఇకపై అతడు ఆసీస్ టీ20 జట్టులో ఉండబోడని జోస్యం చెప్పాడు.అతడి ఖేల్ ఖతం.. కెరీర్ ముగిసినట్లేముఖ్యంగా లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ (LA28 Olympics)లో మాక్సీ పాల్గొనే అవకాశాలు శూన్యమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఐసీసీ షోలో మాట్లాడుతూ.. ‘‘గ్లెన్ మాక్స్వెల్.. నాకైతే అతడి కెరీర్ చరమాంకానికి చేరుకుందని అనిపిస్తోంది. అతడు కచ్చితంగా ఒలింపిక్స్ జట్టులో మాత్రం ఉండడు’’ అని పాంటింగ్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు.దారుణంగా విఫలంఅయితే, కెప్టెన్ మిచెల్ మార్ష్, ట్రవిస్ హెడ్ మాత్రం తప్పక ఒలింపిక్స్‌లో ఆడతారని పాంటింగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా 37 ఏళ్ల గ్లెన్ మాక్స్వెల్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీలో మాక్సీ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 62 పరుగులే చేశాడు.ఇక గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా తొలుత ఐర్లాండ్‌పై గెలిచింది. ఆ తర్వాత జింబాబ్వే, శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. లీగ్ దశలో మిగిలిన నామమాత్రపు మ్యాచ్‌లో ఒమన్‌తో శుక్రవారం ఆసీస్ తలపడుతుంది. ఇందుకు శ్రీలంకలోని పల్లెకెలె వేదిక. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్‌కప్ టోర్నీ ఫిబ్రవరి 7న మొదలైంది. మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుంది.చదవండి: విధ్వంసకర ఓపెనర్ కాదు!.. ‘డకౌట్ల’ అభిషేక్.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు -
T20 WC: అతడిని సెలక్ట్ చేయలేదు.. అనుభవించారు!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీలో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయారంటూ సొంత అభిమానులే విమర్శిస్తున్నారు. కాగా గ్రూప్-బిలో శ్రీలంక, జింబాబ్వే, ఒమన్, ఐర్లాండ్‌లతో కలిసి ఉన్న ఆసీస్.. పసికూన జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడింది.తద్వారా సూపర్-8 అవకాశాలు సంక్లిష్టం కాగా.. మంగళవారం నాటి జింబాబ్వే- ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడంతో ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసీస్ కంటే మెరుగైన స్థితిలో ఉన్న జింబాబ్వే శ్రీలంకతో పాటు సూపర్-8లో అడుగుపెట్టింది.గాయాల బెడదకాగా టోర్నీ ఆరంభానికి ముందు నుంచే కంగారూ జట్టును గాయాల బెడద వేధించింది. ప్రధాన పేసర్లు ప్యాట్ కమిన్స్ (Pat Cummins), జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazlewood) టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.ఇక మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను తొలుత టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేయనేలేదు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు మాత్రం అతడిని హుటాహుటిన రప్పించారు. అయితే, ఈ మ్యాచ్‌లో స్మిత్‌ను ఆడించలేదు. ఈ మ్యాచ్‌లో ఓడిన ఆసీస్.. సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. అతడిని సెలక్ట్ చేయలేదు.. అనుభవించారు!ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఘాటుగా స్పందించాడు. ‘‘బహుశా స్టీవ్ స్మిత్ తాను వచ్చిన విమానంలోనే వెనుదిరిగి ఉంటాడు. ఎందుకంటే వీళ్లు (ఆసీస్) టోర్నీ నుంచి నిష్క్రమించేశారు కదా!అసలు అతడిని ముందుగానే ఎందుకు ఎంపిక చేయలేదో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. బిగ్‌బాష్ లీగ్‌లో అతడు మెరుగైన ప్రదర్శనలు ఇచ్చాడు. అంతేకాదు అతడు స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడగలడు. అయినప్పటికీ స్టీవ్ స్మిత్‌ను ముందుగానే సెలక్ట్ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా తప్పు చేసింది’’ అని మైకేల్ వాన్ విమర్శించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పిచ్‌లపై స్మిత్‌ను ఆడించకుండా.. ఆసీస్ మూల్యం చెల్లించిందని వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఇటీవల దేశీ టీ20 టోర్నీలో సత్తా చాటిన స్మిత్.. బిగ్‌బాష్ లీగ్‌లో 299 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. స్మిత్ ఆసీస్ తరఫున చివరగా 2024 ఫిబ్రవరిలో టీ20 మ్యాచ్ ఆడాడు.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్ -
పెద్దగా సంబరాల్లేవ్!.. మా లక్ష్యం అదే: జింబాబ్వే కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే, శ్రీలంక జట్ల చేతిలో ఓటమి.. కంగారూలను సూపర్-8కు దూరం చేసింది. పల్లెకెలెలో మంగళవారం జరగాల్సిన జింబాబ్వే- ఐర్లాండ్ (ZIM vs IRE) మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.లీగ్ దశలోనేపేలవ ప్రదర్శనకు మూల్యం చెల్లిస్తూ కంగారూలు లీగ్ దశలోనే అవమానకర రీతిలో ఇంటిబాట పట్టగా.. జింబాబ్వే సగర్వంగా సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (Sikandar Raza)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.సమిష్టిగా రాణించి‘‘ఆఫ్రికా సబ్ రీజియనల్ క్వాలిఫైయర్స్‌లో మేము గ్రూప్-బిలో కెన్యా, రువాండా, టాంజానియా వంటి జట్లతో తలపడ్డాము. ఆ సమయంలో మా లక్ష్యం గెలుపు ఒక్కటే. లేదంటే జట్టు మొత్తం తమను తాము నిందించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పాను.అక్కడ సమిష్టిగా రాణించి ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టాము. ఇప్పుడు సూపర్-8కు కూడా అర్హత సాధించాము. ఈ ఆనందాన్ని తప్పక సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే, పెద్దగా సంబరాలు చేసుకోవడం లేదు.మా లక్ష్యంలో మొదటి దశను మేము దాటాము. తదుపరి మేము శ్రీలంకతో మ్యాచ్ ఆడబోతున్నాం. ఆ మ్యాచ్ నామమాత్రమే అయినా గెలుపుపై గురిపెట్టాము. నేను, మా కోచ్ వారి బలాబలాల గురించి డేటాను పరిశీలిస్తున్నాం. అందుకు తగ్గట్లుగా మా వ్యూహాలు సిద్ధం చేసుకుంటాము.అండర్‌డాగ్‌గా బరిలోకిఆ మ్యాచ్‌లోనూ గెలిచేందుకు వందకు వంద శాతం ప్రయత్నిస్తాం. సూపర్-8కు అర్హత సాధించినంత మాత్రాన మా లక్ష్యంలో ఎలాంటి మార్పూ ఉండదు. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి ఈ స్థాయికి చేరడం ఎవరికైనా సంతోషమే. అయితే, ప్రతిరోజూ కొత్తదే. కఠినంగా శ్రమిస్తేనే ఆశించిన ఫలితం వస్తుంది’’ అని సికిందర్ రజా పేర్కొన్నాడు.కాగా గ్రూప్-బి నుంచి ఐర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియాలను ఎలిమినేట్ చేసి శ్రీలంక, జింబాబ్వే సూపర్-8కు చేరుకున్నాయి. ఇరుజట్లు గురువారం లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో ముఖాముఖి తలపడతాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!This is what it means! 🤩Zimbabwe qualify for the Super 8s with a game to spare, knocking out Australia. Sikandar Raza leads the celebrations with the fans. 👏ICC Men’s #T20WorldCup | #SCOvNEP | LIVE NOW 👉 https://t.co/8SrC1cprbz pic.twitter.com/cqXeLv8ZtI— Star Sports (@StarSportsIndia) February 17, 2026 -
T20 WC: ఆస్ట్రేలియా అవుట్.. సూపర్-8కు జింబాబ్వే
ఊహించిందే జరిగింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. గ్రూప్-బి నుంచి ఐర్లాండ్- జింబాబ్వే మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ రద్దయిపోయింది.ఆస్ట్రేలియా ఎలిమినేట్శ్రీలంకలోని పల్లెకెలెలో వర్షం తెరిపినివ్వక పోవడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో జింబాబ్వే పాయింట్ల సంఖ్య ఐదుకు చేరగా... ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది.మొత్తంగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్ టోర్నీలో ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇందులో భాగంగా గ్రూప్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ వంటి పసికూనలతో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా పోటీలో ఉన్నాయి.ఐదు పాయింట్లతో అర్హత ఇక ఆది నుంచి అదరగొట్టిన శ్రీలంక ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్-బి నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. రెండో స్థానం కోసమైనా పోరాడాలని అనుకున్న ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన ఆస్ట్రేలియా.. తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సోమవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ చిత్తుగా ఓడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.మ్యాచ్ రద్దు కావడంతోమరోవైపు.. జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా ఐర్లాండ్‌తో జరగాల్సిన మూడో మ్యాచ్ రద్దు కావడంతో జింబాబ్వేకు మరో పాయింట్ వచ్చింది. నెట్‌రన్‌రేటు పరంగానూ జింబాబ్వే పటిష్ట స్థితి (+1.984)లో నిలిచింది. ఫలితంగా శ్రీలంకతో కలిసి జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధించగా.. మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియా అవమాన భారంతో నిష్క్రమించింది.ఇక గ్రూప్-బి తదుపరి నామమాత్రపు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆఖరిగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడుతుంది. మరోవైపు జింబాబ్వే గురువారం శ్రీలంకను ఢీకొడుతుంది.ఆఖరి బెర్తు ఎవరిదో?ఇదిలా ఉంటే.. గ్రూప్-ఎ నుంచి టీమిండియా సూపర్-8కు చేరగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించాయి. ఆఖరి బెర్తు కోసం గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, అమెరికా బరిలో ఉన్నాయి. కాగా గత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో పాక్‌ను వెనక్కి నెట్టి అమెరికా సూపర్-8కు చేరిన విషయం తెలిసిందే.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్.. ప్రపంచ రికార్డు -
T20 WC: జింబాబ్వే రైట్ రైట్.. అదే జరిగితే ఆసీస్ ఇంటికే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందే ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ గాయాల కారణంగా దూరమయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.దీంతో కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో గెలుపొంది శుభారంభం అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆసీస్ అదే జోరు కొనసాగించలేకపోయింది.జింబాబ్వే చేతిలో ఓటమి.. లంక చేతిలోనూ చిత్తుతమ రెండో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో పసికూన జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది ఆస్ట్రేలియా. తద్వారా జింబాబ్వే గ్రూప్-బి నుంచి సూపర్-8 అవకాశాలు మెరగుపరచుకోగా.. కంగారూ జట్టుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకతో సోమవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆసీస్ సూపర్-8 అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.గ్రూప్-బి నుంచి శ్రీలంక మూడింటికి మూడు గెలిచి సూపర్-8కు చేరగా.. జింబాబ్వే రెండింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్‌రన్‌రేటు (+1.984).పటిష్టస్థితిలో జింబాబ్వే.. అదే జరిగితే ఆసీస్ ఇంటికేమరోవైపు ఆస్ట్రేలియా మూడు ఆడి కేవలం ఒక్కటే గెలిచి.. 2 పాయింట్లతో ఉంది. నెట్‌రన్‌రేటు (+0.414) తదుపరి ఒమన్‌తో ఆసీస్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ఆసీస్ సూపర్-8 అవకాశాలు సజీవంగా ఉంటాయి.అయితే, దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆస్ట్రేలియాను వర్షం గండం వెంటాడుతోంది. ఆసీస్ కంటే పాయింట్లు, నెట్‌రన్‌రేటు పరంగా జింబాబ్వే పటిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో మంగళవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గెలిస్తే జింబాబ్వే ఆరు పాయింట్లతో నేరుగా సూపర్-8 చేరితే ఆసీస్ ఇంటి బాటపడుతుంది.ఒకవేళ ఐర్లాండ్ చేతిలో జింబాబ్వే ఓడితే ఆసీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే, ఐర్లాండ్- జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలెలో వర్షం పడుతున్న కారణంగా ఇరుజట్ల మధ్య మ్యాచ్‌కు టాస్ ఆలస్యమైంది. ఒకవేళ వర్షం తెరిపినివ్వకపోతే మ్యాచ్ రద్దైపోతుంది.ఓడినా మరో అవకాశం కూడా!అదే జరిగితే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు జింబాబ్వే ఖాతాలో పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుతుంది. తద్వారా ఆటోమేటిక్‌గా జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఆసీస్ టోర్నీ నుంచి ఘోర పరాభవంతో లీగ్ దశలోనే నిష్క్రమిస్తుంది. అన్నట్లు జింబాబ్వేకు మరో మ్యాచ్ కూడా మిగిలి ఉంది. శ్రీలంకతో గురువారం జింబాబ్వే తలపడుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఫలితం తేడాగా వచ్చిన జింబాబ్వేకు ఇంకో అవకాశం మిగిలే ఉంటుందన్నమాట. UPDATE: T20 WC: ఆస్ట్రేలియా అవుట్.. సూపర్-8కు జింబాబ్వేచదవండి: గంభీర్‌కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్‌కోచ్ పదవికి గుడ్‌బై? -
ఆసీస్‌కు షాకిచ్చిన ముజరబానీకి బంపరాఫర్!
ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జింబాబ్వే బౌలర్ బ్లెసింగ్ ముజరబానీకి బంపరాఫర్ వచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో వెస్టిండీస్ స్టార్ పేసర్ షమార్ జోసెఫ్ స్థానాన్ని ముజరబానీ భర్తీ చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. షమార్ జోసెఫ్‌పై వేటుకాగా మార్చి 26న పాక్ సూపర్ లీగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. రూ. 1.1 కోట్లకు (పాక్ కరెన్సీలో) కొనుగోలు చేసి షమార్ జోసెఫ్‌పై వేటు వేసింది. ఈ విండీస్ పేసర్ స్థానంలో జింబాబ్వే స్టార్ ముజరబానీని చేర్చుకుంది. అయితే, టెక్నికల్ కమిటీ నుంచి ఇందుకు ఆమోదం లభించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. షమార్ జోసెఫ్‌ను జట్టు నుంచి తొలగించడం పట్ల ఇస్లామాబాద్ యునైటెడ్ నోరు విప్పలేదు. అటు జోసెఫ్ సైతం మౌనంగానే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల పరస్పర అంగీకారంతోనే అతడు తప్పుకొన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది.కారణం అదేనా?కాగా 2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసి.. సత్తా చాటిన షమార్ జోసెఫ్ వ్యక్తిగత ప్రవర్తనతో చిక్కుల్లో పడ్డాడు. అతడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు షమార్ ఆడటాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ అతడితో బంధం తెంచుకోవడం గమనార్హం.ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించిన ముజరబానీఇక జింబాబ్వే రైటార్మ్ పేసర్ బ్లెసింగ్ ముజరబానీకి పాకిస్తాన్ సూపర్ లీగ్ కొత్తేమీ కాదు. 2021లో టైటిల్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. అయితే, గత కొంతకాలంగా అతడు పేలవ ప్రదర్శనతో సతమతమయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో ముజరబానీ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ముజరబానీ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి.. నాలుగు వికెట్లు కూల్చాడు. జోష్ ఇంగ్లిస్ (8), టిమ్ డేవిడ్ (0), మ్యాట్ రెన్షా (65), ఆడం జంపా (2) వికెట్లు తన ఖాతాలో వేసుకుని జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలిచిన జింబాబ్వే.. 2007 తర్వాత టీ20 వరల్డ్‌కప్ తర్వాత రెండోసారి కంగారూ జట్టును ఓడించింది.చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ -
ఈ సెంటిమెంట్ రిపీటైతే టీమిండియాదే వరల్డ్‌కప్..!
టీ20 వరల్డ్‌కప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 13) పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.వాస్తవానికి టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది మొదటిసారి కాదు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్‌లోనే (2007) జింబాబ్వే ఆసీస్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచకప్‌ల పరంగా చూసుకుంటే, జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది కూడా తొలిసారి కాదు. 1983 వన్డే ప్రపంచకప్‌లోనే జింబాబ్వే తొలిసారి ఆసీస్‌ను ఓడించింది. మొత్తంగా జింబాబ్వే తమ క్రికెట్ చరిత్రలో వారికంటే చాలా రెట్లు మెరుగైన ఆస్ట్రేలియాను ఐదు సార్లు ఓడించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో రెండు సార్లు (2007, 2026), వన్డే వరల్డ్‌కప్‌లో ఒకసారి (1983), సాధారణ వన్డేల్లో రెండు సార్లు (2014, 2022) జింబాబ్వే ఆసీస్‌కు షాకిచ్చింది.అయితే జింబాబ్వే ఆసీస్‌పై సాధించిన విషయాల్లో ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. అది భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే అంశం. అదేంటంటే.. జింబాబ్వే ప్రపంచకప్ టోర్నీల్లో ఆసీస్‌పై విజయం సాధించిన తొలి రెండు సందర్భాల్లో భారత్ జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే తొలిసారి ఆసీస్‌పై విజయం సాధించిన సందర్భంలో భారత్ తొలిసారి జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే ఆసీస్‌పై రెండోసారి విజయం సాధించిన సందర్భంలో భారత్ రెండో సారి జగజ్జేతగా నిలిచింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ సెంటిమెంట్ రిపీటైతే, భారత్ మరోసారి జగజ్జేతగా అవతరించడం ఖాయమని టీమిండియా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గూగుల్ ఇండియా కూడా విశ్లేషించింది. తాజా ప్రపంచకప్‌లో ఆసీస్‌పై జింబాబ్వే విజయం సాధించిన తర్వాత ఈ విషయం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈసారి కూడా టీమిండియానే టీ20 ప్రపంచ ఛాంపియన్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ సెంటిమెంట్‌కు అభిమానులు ప్రస్తుత జట్టు బలాన్ని, ఇటీవలి ఫామ్‌ను కూడా జోడిస్తున్నారు. భారత జట్టు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని, గత రెండేళ్లలో టీమిండియా ఫామ్ అద్వితీయంగా ఉందని, పై సెంటిమెంట్‌కు ఈ రెండు కలిస్తే భారత్‌కు తిరుగే ఉండదన్న విషయం స్పష్టమవుతుందని చర్చించుకుంటున్నారు. పై ఫ్యాక్టర్స్ అన్నీ వర్కౌటై భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్ కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ఇన్ని శుభ శకునాల మధ్య భారతీయులను ఓ చెడు శనుకం కూడా పలకరిస్తుంది. అదేంటంటే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉండి, మరోసారి ప్రపంచకప్ గెలవలేదు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఏమైనా వర్కౌటవుతుందేమోనని టీమిండియా ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. -
ఆసీస్‌పై సంచలన విజయం.. జింబాబ్వే బౌలర్ సెంచరీ
టీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచనలం నమోదైంది. పసికూన జింబాబ్వే చేతిలో 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.జింబాబ్వే సాధించిన ఈ చారిత్రక విజయంలో పేస్ బౌలర్ బ్లెసింగ్ ముజరబానీ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కీలక ఆటగాళ్లు జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మ్యాట్ రెన్షా, ఆడమ్ జంపా వికెట్లు తీశాడు. అద్భుతమైన పేస్ వేరియేషన్స్‌తో పట్టిష్టమైన ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకుగానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.ఈ చారిత్రక ప్రదర్శన చేసే క్రమంలో ముజరబానీ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఈ మ్యాచ్‌లో తన చివరి వికెట్‌తో (జంపా) అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా జింబాబ్వే తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా, ఓవరాల్‌గా 35 బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ముజరబానీ ఈ ఘనతను కేవలం 85 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. అతని సగటు 21.08గా.. ఎకానమీ 7.10గా ఉంది. జింబాబ్వే తరఫన టీ20ల్లో సెంచరీ కొట్టిన మరో ఇద్దరు బౌలర్లు రిచర్డ్ నగరవ (111 వికెట్లు), సికందర్ రజా (103 వికెట్లు). మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్‌పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4) సహా బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్షా (65), మ్యాక్స్‌వెల్ (31) విఫలయత్నం చేశారు. -
T20 WC: ఆసీస్‌కు షాకిచ్చిన పసికూన.. సంచలన విజయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ‘పసికూన’ జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. గ్రూప్-‘బి’లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- జింబాబ్వే జట్లు శుక్రవారం నాటి ఉదయం మ్యాచ్‌లో తలపడ్డాయి.ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ అజేయ అర్ధ శకతం (56 బంతుల్లో 64) సాధించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తాడివనాషే మరుమణి 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు.రజా మెరుపు ఇన్నింగ్స్వన్డౌన్లో వచ్చిన ర్యాన్ బర్ల్ (30 బంతుల్లో 35) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.చెలరేగిన ముజర్బానీఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టుకు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. బ్లెసింగ్ ముజర్బానీ జోష్ ఇంగ్లిస్ (8)ను.. బ్రాడ్ ఎవాన్స్ కెప్టెన్ ట్రవిస్ హెడ్ (17)ను వెనక్కి పంపించారు.వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్‌ను ఎవాన్స్ డకౌట్ చేయగా.. ముజర్బానీ సైతం టిమ్ డేవిడ్‌ను పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు. పవర్ హిట్టర్లు ఇద్దరూ డకౌట్ కావడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, గ్లెన్ మాక్స్వెల్ (31)తో కలిసి మ్యాచ్ రెన్షా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.HISTORY MADE IN COLOMBO! 🤯🔥Composure. Belief. Zimbabwe have beaten Australia! 👏💥ICC Men’s #T20WorldCup | #CANvUAE | LIVE NOW 👉 https://t.co/xRf3Nc9OQ0 pic.twitter.com/1BXNa0ftxS— Star Sports (@StarSportsIndia) February 13, 2026ఈ క్రమంలో 34 బంతుల్లో రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 19వ ఓవర్లో ముజర్బానీ బౌలింగ్‌లో రెన్షా (44 బంతుల్లో 65) అవుట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే ఓవర్లో ఆఖరి బంతికి ముజర్బానీ ఆడం జంపా (2)ను కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 29 పరుగులుగా మారింది.146 పరుగులకే ఆలౌట్అయితే, ఆఖరి ఓవర్లో ఎవాన్స్ బౌలింగ్‌లో తొలి బంతికే నాథన్ ఎల్లిస్ ఫోర్ బాదాడు. కానీ ఆ తర్వాత ఎవాన్స్ ఆసీస్‌ను కోలుకోనివ్వలేదు. మూడో బంతికి మాథ్యూ కుహ్నెమన్ రనౌట్ (0) కావడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. జింబాబ్వే విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా జింబాబ్వే 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎవాన్స్ మూడు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మసకజ్ద, ర్యాన్ బర్ల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తొలి ఎడిషన్ 2007లో ఆసీస్‌ను తొలిసారి ఓడించిన జింబాబ్వే.. మళ్లీ ఆసీస్‌పై గెలుపొందడం ఇదే మొదటిసారి.చదవండి: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. నేపాల్‌పై ఇటలీ గెలుపుAND ANOTHER ONE GONE! 🔥Head pushes at it and chops it back onto his stumps! 🎯💥The SIUUU celebration is out in Colombo as Zimbabwe tighten their grip early! 🙌 Is there an upset on the cards?ICC Men’s #T20WorldCup | #AUSvZIM | LIVE NOW 👉 https://t.co/WBa4qbbxs0 pic.twitter.com/kzJ8M8j5ut— Star Sports (@StarSportsIndia) February 13, 2026


