టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే, శ్రీలంక జట్ల చేతిలో ఓటమి.. కంగారూలను సూపర్-8కు దూరం చేసింది. పల్లెకెలెలో మంగళవారం జరగాల్సిన జింబాబ్వే- ఐర్లాండ్ (ZIM vs IRE) మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
లీగ్ దశలోనే
పేలవ ప్రదర్శనకు మూల్యం చెల్లిస్తూ కంగారూలు లీగ్ దశలోనే అవమానకర రీతిలో ఇంటిబాట పట్టగా.. జింబాబ్వే సగర్వంగా సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (Sikandar Raza)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సమిష్టిగా రాణించి
‘‘ఆఫ్రికా సబ్ రీజియనల్ క్వాలిఫైయర్స్‌లో మేము గ్రూప్-బిలో కెన్యా, రువాండా, టాంజానియా వంటి జట్లతో తలపడ్డాము. ఆ సమయంలో మా లక్ష్యం గెలుపు ఒక్కటే. లేదంటే జట్టు మొత్తం తమను తాము నిందించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పాను.
అక్కడ సమిష్టిగా రాణించి ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టాము. ఇప్పుడు సూపర్-8కు కూడా అర్హత సాధించాము. ఈ ఆనందాన్ని తప్పక సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే, పెద్దగా సంబరాలు చేసుకోవడం లేదు.
మా లక్ష్యంలో మొదటి దశను మేము దాటాము. తదుపరి మేము శ్రీలంకతో మ్యాచ్ ఆడబోతున్నాం. ఆ మ్యాచ్ నామమాత్రమే అయినా గెలుపుపై గురిపెట్టాము. నేను, మా కోచ్ వారి బలాబలాల గురించి డేటాను పరిశీలిస్తున్నాం. అందుకు తగ్గట్లుగా మా వ్యూహాలు సిద్ధం చేసుకుంటాము.
అండర్‌డాగ్‌గా బరిలోకి
ఆ మ్యాచ్‌లోనూ గెలిచేందుకు వందకు వంద శాతం ప్రయత్నిస్తాం. సూపర్-8కు అర్హత సాధించినంత మాత్రాన మా లక్ష్యంలో ఎలాంటి మార్పూ ఉండదు. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి ఈ స్థాయికి చేరడం ఎవరికైనా సంతోషమే. అయితే, ప్రతిరోజూ కొత్తదే. కఠినంగా శ్రమిస్తేనే ఆశించిన ఫలితం వస్తుంది’’ అని సికిందర్ రజా పేర్కొన్నాడు.
కాగా గ్రూప్-బి నుంచి ఐర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియాలను ఎలిమినేట్ చేసి శ్రీలంక, జింబాబ్వే సూపర్-8కు చేరుకున్నాయి. ఇరుజట్లు గురువారం లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో ముఖాముఖి తలపడతాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక.
చదవండి: IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!
This is what it means! 🤩
Zimbabwe qualify for the Super 8s with a game to spare, knocking out Australia. Sikandar Raza leads the celebrations with the fans. 👏
ICC Men’s #T20WorldCup | #SCOvNEP | LIVE NOW 👉 https://t.co/8SrC1cprbz pic.twitter.com/cqXeLv8ZtI— Star Sports (@StarSportsIndia) February 17, 2026


