ఆస్ట్రేలియా ఇంటికి... జింబాబ్వే ముందుకు... | Zimbabwe qualified for the Super 8s of the latest T20 World Cup with 5 points | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఇంటికి... జింబాబ్వే ముందుకు...

Feb 18 2026 4:14 AM | Updated on Feb 18 2026 4:14 AM

Zimbabwe qualified for the Super 8s of the latest T20 World Cup with 5 points

వర్షంతో జింబాబ్వే–ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దు 

సూపర్‌–8కు సికందర్‌ రజా బృందం

పల్లెకెలె: ఆ్రస్టేలియాకు షాక్‌. అప్పుడు జింబాబ్వే సంచలనంతో షాక్‌ ఇస్తే, ఇప్పుడు వానొచ్చి మరో షాక్‌ ఇచ్చింది. జింబాబ్వే–ఐర్లాండ్‌ల మ్యాచ్‌ జరగకుండా వరుణుడు అడ్డుపడటంతో ఈ లీగ్‌ మ్యాచ్‌ రద్దయ్యింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయించారు. ఫలితంగా సికందర్‌ రజా సారథ్యంలోని జింబాబ్వే 5 పాయింట్లతో తాజా టి20 ప్రపంచకప్‌లో సూపర్‌–8కు అర్హత సంపాదించింది. ఆఖరి మ్యాచ్‌ మిగిలుండగానే ఆ్రస్టేలియా మెగా ఈవెంట్‌ నుంచి లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. 

2009 తర్వాత టి20 ప్రపంచకప్‌లో తదుపరి దశకు అర్హత పొందకుండా గ్రూప్‌ దశలోనే ఆ్రస్టేలియా వెనుదిరగడం ఇదే ప్రథమం. గ్రూప్‌ ‘బి’లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఐర్లాండ్, జింబాబ్వేల మధ్య మ్యాచ్‌ జరగాల్సింది. భారీ వర్షం వల్ల మ్యాచ్‌ ఎంతకీ మొదలవలేదు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మ్యాచ్‌ జరిగే అవకాశమే లేకపోవడంతో ఫీల్డ్‌ అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నట్లు... టీమిండియాకు సూపర్‌–8లో ముందుగా ఎదురుపడే ప్రత్యర్థి కూడా జింబాబ్వేనే! ఈ నెల 26న చెన్నైలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. 

పరాభవాల ప్రభావంతో... 
ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆ్రస్టేలియా ఈ ప్రపంచకప్‌లో మాత్రం సూపర్‌–8 చేరేందుకు ఇతర జట్ల ఫలితాలపై అధారపడాల్సిన స్థితికి వచ్చింది. జింబాబ్వే, శ్రీలంక చేతుల్లో ఓడిన కంగారూ ఒక్క ఐర్లాండ్‌పై గెలిచి 2 పాయింట్లతో ఉంది. శుక్రవారం ఒమన్‌తో జరిగే నామమాత్రమైన మ్యాచ్‌లో గెలిస్తే 4 పాయింట్లతో ఆసీస్‌ ఇంటికి పయనమవుతుంది. 

పది టి20 ప్రపంచ కప్‌లలోనూ ఆడిన ఆస్ట్రేలియా లీగ్‌ దశలో నిష్క్ర మించడం ఇది రెండోసారి మాత్రమే. 2007లో సెమీఫైనల్‌ చేరిన ఆసీస్‌... 2009లో గ్రూప్‌ దశలో వెనుదిరిగింది. 2010లో రన్నరప్‌గా నిలిచింది. 2012లో సెమీఫైనల్లో ఓడింది. 2014, 2016లలో సూపర్‌–10లో ఓyì.... 2021లో తొలిసారి విజేతగా అవతరించింది. 2022లో సూపర్‌–12లో, 2024లో సూపర్‌–8లో వెనుదిరిగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement