టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఆస్ట్రేలియా వైదొలగడంతో సూపర్-8 దశలో టీమిండియా ప్రత్యర్దులు ఖరారయ్యారు. సూపర్-8 గ్రూప్-1లో భారత్‌తో పాటు జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. గ్రూప్-1 మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయి.
భారత్ తమ తొలి సూపర్-8 మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
భారత రెండో సూపర్-8 మ్యాచ్ ఫిబ్రవరి 26న జరుగనుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లో భారత్ జింబాబ్వేను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.
భారత్ తమ మూడో సూపర్-8 మ్యాచ్‌ను మార్చి 1న ఆడుతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ వెస్టిండీస్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతుంది.
గ్రూప్-1లో మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా..
-ఫిబ్రవరి 23- జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ (ముంబై, రాత్రి 7 గంటలకు)
-ఫిబ్రవరి 26- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (అహ్మదాబాద్, మధ్యాహ్నం 3 గంటలకు)
-మార్చి 1- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికా (ఢిల్లీ, మధ్యాహ్నం 3 గంటలకు)
మరోవైపు సూపర్-8 గ్రూప్-2 బెర్త్‌ల్లో ప్రస్తుతానికి మూడు ఖరారయ్యాయి. రేపు (ఫిబ్రవరి 18) జరుగబోయే మ్యాచ్‌లో నమీబియాపై గెలిస్తే.. పాక్ నాలుగో బెర్త్ దక్కించుకుంటుంది. సూపర్-8 గ్రూప్-2లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్-2 మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. గ్రూప్-2కు సంబంధించి కూడా పలు సూపర్-8 మ్యాచ్‌లు ఖరారయ్యాయి.
-ఫిబ్రవరి 22న ఇంగ్లండ్-శ్రీలంక (పల్లెకెలె, మధ్యాహ్నం 3 గంటలకు)
-ఫిబ్రవరి 25న న్యూజిలాండ్-శ్రీలంక (కొలొంబో, రాత్రి 7 గంటలకు)
-ఫిబ్రవరి 27న ఇంగ్లండ్-న్యూజిలాండ్ (కొలొంబో, రాత్రి 7 గంటలకు)
గ్రూప్-1, గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ మ్యాచ్‌లు మార్చి 4, 5 తేదీల్లో జరుగుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు మార్చి 8న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్, ఫైనల్‌కు వేదికలు ఇంకా ఖరారు కాలేదు.


