భారత మహిళల వన్డే జట్టులోకి ప్రతీక | Pratik Rawal included in Indian womens ODI team | Sakshi
Sakshi News home page

భారత మహిళల వన్డే జట్టులోకి ప్రతీక

Feb 18 2026 4:19 AM | Updated on Feb 18 2026 4:19 AM

Pratik Rawal included in Indian womens ODI team

న్యూఢిల్లీ: ఆ్రస్టేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల జట్టులో అదనంగా మరో ప్లేయర్‌ను జోడించారు. చీలమండ గాయం నుంచి కోలుకున్న ఓపెనర్‌ ప్రతీక రావల్‌ ఈనెల 24 నుంచి బ్రిస్బేన్‌లో ఆ్రస్టేలియాతో మొదలయ్యే వన్డే సిరీస్‌లో భారత జట్టులోకి వచ్చింది. గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ ప్రతీక గాయపడింది. ఆ తర్వాత ప్రతీక మిగతా టోర్నీకి దూరం కాగా...ఆమె స్థానంలో షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. 

ఈనెల 24న బ్రిస్బేన్‌లో తొలి వన్డే తర్వాత... 27న హోబర్ట్‌లో రెండో వన్డే, అదే వేదికగా మార్చి 1న మూడో వన్డే జరుగుతాయి. మార్చి 6 నుంచి భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఏకైక టెస్టు పెర్త్‌లో జరుగుతుంది. 25 ఏళ్ల ప్రతీక భారత్‌ తరఫున 24 వన్డేలు ఆడి 1110 పరుగులు సాధించింది. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలున్నాయి.  

భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్ ), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్ ), షఫాలీ వర్మ, రేణుక సింగ్‌ ఠాకూర్, నల్లపురెడ్డి శ్రీచరణి, క్రాంతి గౌడ్, స్నేహ్‌ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, కాశ్వీ గౌతమ్, అమన్‌జోత్‌ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్‌ డియోల్, ప్రతీక రావల్‌.

Advertisement
 
Advertisement
Advertisement