భారత జట్టులోకి పునరాగమనం చేసిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇరగదీస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా గెలవడంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌దే కీలక పాత్ర.
విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ డకౌట్ అయినా.. ఇషాన్ (Ishan Kishan) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 10 ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 77 పరుగులు సాధించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో పాక్ (IND Beat PAK)ను చిత్తు చేయగా.. ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఈ జార్ఖండ్ డైనమైట్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ ఇషాన్ తాతయ్య అనురాగ్ పాండే ANIతో పేర్కొన్న విషయం తెలిసిందే.
అదితి వాడి గర్ల్‌ఫ్రెండ్
‘‘ఇషాన్ ఎవరిని ఎంచుకున్నా ఆ అమ్మాయితోనే అతడి వివాహం జరిపించేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదితి వాడి గర్ల్‌ఫ్రెండ్. ఆమె ఒక మోడల్. పిల్లలు కోరుకున్నది అందించడంలోనే పెద్దలకు సంతృప్తి, సంతోషం లభిస్తాయి’’ అని అనురాగ్ పాండే పేర్కొన్నారు. దీంతో ఇషాన్ త్వరలోనే పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి.
#WATCH | Aurangabad, Bihar | Grandfather of Indian Cricketer Ishan Kishan, Anurag Pandey says, "...We are ready to accept whoever Ishan Kishan wants to marry. Aditi is his girlfriend...She is a model...One should accept what makes children happy..." (14.03) pic.twitter.com/narb5aZHtx
— ANI (@ANI) February 14, 2026
ఆయన ముసలివారు!.. వాడికి పెళ్లి వయసు రాలేదు!
ఈ విషయంపై ఇషాన్ కిషన్ తల్లి సుచిత్రా దేవి స్పందించారు. ఇషాన్ వివాహం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ మేరకు IANSతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెళ్లి చేసుకునే సమయం కాదు. ఆటపై మరింతగా దృష్టి పెట్టాల్సిన తరుణం. తనకు ఇంకా పెళ్లి వయసు రాలేదు.
వాళ్ల తాతయ్య ముసలివారు అవుతున్నారు కదా!.. వృద్ధులకు మనుమల విషయాల పట్ల ఉత్సుకత కాస్త ఎక్కువగానే ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తున్న వాటిని చూసే ఆయన అలా మాట్లాడారు. అంతకు మించి ఏమీలేదు’’ అని సుచిత్రా దేవి కొట్టిపారేశారు.
కష్టపడి.. రీఎంట్రీ
కాగా 27 ఏళ్ల ఇషాన్ కిషన్ క్రమశిక్షణారాహిత్యం వల్ల దాదాపు మూడేళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి ఇటీవలే టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్, వికెట్ కీపర్‌గా భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసి.. అతడికి చెక్ పెట్టాడు.
ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్.. అదితి హుండియా అనే మోడల్‌తో ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమె రాజస్తాన్‌కు చెందిన వారని సమాచారం. ఇక వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఇప్పటికే సూపర్-8 చేరిన విషయం తెలిసిందే.
Patna, Bihar: On India beating Pakistan by 61 runs in the ICC Men’s T20 World Cup 2026 match, Indian cricketer Ishan Kishan's mother, Suchitra Devi says, "Many congratulations to the Indian cricket team on their victory. Heartfelt congratulations to the entire team for such a… pic.twitter.com/luxVYzbd7H
— IANS (@ians_india) February 15, 2026


