సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్, యాదాద్రి, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించింది. ఇక, ఇప్పటికే హైదరాబాద్‌లో మేఘాలు కమ్ముకున్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల మేరకు.. బుధవారం ఉదయం 8 గంటల వరకు పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, భూపాలపల్లి, హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలలో వర్షాలు భారీగా పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
OVERNIGHT RAIN FORECAST - Till 6 AM 🌧️
Ongoing LIGHT - MODERATE RAINS across Nizamabad, Jagitial, Sircilla, Karimnagar, Peddapalli, Siddipet, Nagarkurnool (Kollapur) will reduce by midnight
Fresh scattered LIGHT - MODERATE RAINS ahead in Hanmakonda, Warangal, Mulugu, Jangaon,…— Telangana Weatherman (@balaji25_t) August 18, 2026
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశమున్నట్టు తెలిపింది. ఇక, మంగళవారం హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మనగర్, పంజాగుట్ట, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఎస్.ఆర్.నగర్, సనత్నగర్, కృష్ణానగర్, మధురానగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మరోవైపు.. ఏపీలోనూ వర్షాలు కురిసే ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచనలను APSDMA స్పష్టం చేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


