నల్లగొండ: 22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు. సమగ్ర విచారణ చేస్తామని అన్నారు. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండొచ్చని చెప్పారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బాధితులకు న్యాయం చేస్తాం. దరఖాస్తుల అవసరం లేదు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. పొరపాటున జరిగిందా? కావాలనే చేశారా? అనేది విచారణ చేస్తాం. యాదగిరిగుట్టలో 42 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని సీఎంకు నాలుగు నెలల క్రితమే చెప్పాను. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండొచ్చు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం. 30 శాతం కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుంది.
సీఎం అమెరికా టూర్ తర్వాత దీనిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం. మా ప్రభుత్వం మంచితనాన్ని కొంతమంది అధికారులు దుర్వినియోగం చేసి ఉండొచ్చు. తప్ప ఎవరిదో తేలితే వాళ్లను ఏం చేయాలో తేలుతుంది. 22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోను. ప్రతిపక్షాల విమర్శలు అర్థం లేనివి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు.


