నగరాల అభివృద్ధికి ‘బెటర్‌ సిటీస్‌’ | Komatireddy Launches Better Cities Campaign In Nalgonda, Honours Photojournalist For 84 Awards, More Details Inside | Sakshi
Sakshi News home page

నగరాల అభివృద్ధికి ‘బెటర్‌ సిటీస్‌’

Aug 21 2026 9:10 AM | Updated on Aug 21 2026 12:34 PM

Better Cities Campaign Nalgonda Komatireddy Venkatm Reddy Bajrang Prasad Awards

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తెలంగాణ: నగరాల అభివృద్ధి, ప్రజల హక్కులు, యువత భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో జాతీయ యువజన కాంగ్రెస్‌ చేపట్టిన “బెటర్‌ సిటీస్‌’ ప్రచారానికి నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. “మేరా షహర్‌.. మేరా హక్‌’, “మెహనత్‌ కే హాత్‌’నినాదాలతో చేపట్టిన ఈ ప్రచారానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండలోని ఇందిరాభవన్‌లో ఆవిష్కరించారు.

మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడంతోపాటు నగరాల అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడమే “బెటర్‌ సిటీస్‌’ ప్రచారం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.  యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గుమ్ముల మోహన్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు, 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ మామిడి కార్తీక్, యువజన కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, మండల అధ్యక్షుడు కె.వి.ఆర్‌. సతీష్, కంచర్ల ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు.

భజరంగ్‌ అవార్డులు సాధించడం గర్వకారణం
నల్లగొండ టౌన్‌: ఫొటోగ్రఫీలో విశేష ప్రతిభ కనబరుస్తూ సాక్షి ఫొటో జర్నలిస్టు కంది భజరంగ్‌ ప్రసాద్‌ జాతీయ రాష్ట్ర స్థాయిలో 84 అవార్డులు సాధించడం గర్వకారణమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.


భజరంగ్‌కు కేక్‌ తినిపిస్తున్న మంత్రి కోమటిరెడ్డి

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అవార్డులు సాధించిన భజరంగ్‌ ప్రసాద్‌ను గురువారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించి మాట్లాడారు. కార్యక్రమంలో నల్లగొండ మేయర్‌ బుర్రి చైతన్య, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ అష్రఫ్‌ అలీ, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌ గౌడ్, కార్పొరేటర్లు అల్లి సుభాష్, కేసాని వేణుగోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement