breaking news
Nalgonda District Latest News
-
నల్లొండలో దారుణం.. ఇద్దరు బాలికల కిడ్నాప్ యత్నం!
తెలంగాణ: నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసేందుకు ఓ ఆటో డ్రైవర్ యత్నించిన ఘటన కలకలం రేపింది. తమను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన బాలికలు.. నడుస్తున్న ఆటోలో నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది.వివరాల్లోకి వెళ్తే.. శాలిగౌరారం మండలం ఊట్కూరుకు వెళ్లేందుకు ఇద్దరు బాలికలు నకిరేకల్‌లో ఆటో ఎక్కారు. వారిని ఊట్కూరుకు తీసుకెళ్తానని నమ్మించిన డ్రైవర్.. అటువైపు వెళ్లకుండా కేతేపల్లి మండలం ఇనుపాముల గుట్ట వైపు ఆటోను మళ్లించాడు. ఈ క్రమంలో మరో వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడాడు.ఫోన్లో ఆటో డ్రైవర్ మాట్లాడిన మాటలు విన్న బాలికలు అప్రమత్తమయ్యారు. ఇద్దరు అమ్మాయిలు దొరికారని, ఇనుపాముల గుట్ట వద్దకు రావాలని అతడు మరో వ్యక్తికి చెప్పినట్లు సమాచారం. దీంతో తమను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భయపడిన బాలికలు.. కదులుతున్న ఆటోలో నుంచి రోడ్డుపైకి దూకారు. ఈ ఘటనలో ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.బాలికలు రోడ్డుపై పడిపోవడాన్ని గమనించిన వాహనదారులు వెంటనే స్పందించి వారిని కాపాడారు. ఆటో డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలికల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: సాయికృష్ణ మర్మాంగంపై దారుణంగా కొట్టారు -
మంత్రి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
నల్లగొండ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని పంచాలని కోరుతూ ప్రజలకు మంత్రి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అధికారుల కృషి వల్లే అవార్డు : కలెక్టర్ నల్లగొండ : సమాచార హక్కు చట్టాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా అధికారులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, సహాయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల కృషి వల్లే జిల్లాకు అవార్డు వచ్చిందని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా కలెక్టర్ చంద్రశేఖర్ అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కింద కేసులను పరిష్కరించడంలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా హేమలతనల్లగొండ : నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని శుక్రవారం ప్రకటించారు. చైర్‌పర్సన్‌గా బైరెడ్డి హేమలత వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా వడ్డేపల్లి శ్రీరాములు, సభ్యులుగా తిరుమల రాము, కత్తుల కృష్ణయ్య, పిన్నపురెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మర్రి నరసింహ, వడ్డె దామోదర్‌రెడ్డి, షేక్ సయ్యద్, గౌని నరేష్, నల్లగొండ రాణి లింగస్వామి, పల్లెబోయిన లింగయ్య, దేవిరెడ్డి లక్ష్మారెడ్డి, చిట్టిపోలు నాగయ్య, గుండె రమేష్‌బాబు నియమితులయ్యారు. ఈ కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు పదవిలో ఉంటుంది. -
కష్టమొచ్చింది
బతుకమ్మకు చెట్లు పూయలేదు.. చెరువులు నిండలేదుపెద్దవూర : తెలంగాణ ఆడపడుచులకు ఆనందాన్ని తెచ్చిపెట్టే పూల పండుగ బతుకమ్మపై ఈ సారి కరువు ప్రభావం పడింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా తంగేడు, గునుగు, అడవి చేమంతి, పట్టుకుచ్చులు, గుమ్మడి, ముత్యాల, బంతిపూలతో అందంగా బతుకమ్మలు పేర్చి పూల పండుగ జరుపుకుంటారు. ఈ సారి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యంగా కురవడంతో గునుగు, ఇతర పూలు మొగ్గ దశలోనే ఉన్నాయి. ఇక తంగేడు చెట్లకు పూలే కనిపించడం లేదు. దీంతో బతుకమ్మ పేర్చడానికి గునుగు, తంగేడు పూలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు టేకు పూలు తెంపి కట్టలు కట్టి రంగులద్ది బతుకమ్మకు సిద్ధమవుతున్నారు. మరి కొందరు మార్కెట్లో దొరికే బంతి, చేమంతి పూలను కొనుగోలు చేస్తున్నారు. కరువు పరిస్థితులే కారణం కొండ కోనల్లో, బీడు భూముల్లో విరివిగా దొరికే తంగేడు, కొండ చామంతి పూల చెట్లు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయాయి. మెట్టపంటలైన జొన్న, మొక్కజొన్న, పెసర పత్తి చేలలో విరివిగా దొరికే గునుగు, ముత్యాల పూలు కూడా ఈ యేడాది లభించడం లేదు. రైతులు మెట్టపంటల సాగుపై దృష్టిసారించకుండా పోవడంతో పూలకు కరువు వచ్చినట్టయ్యింది. అంతే కాకుండా ఈ యేడాది వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. గతనెలలో నవరాత్రులు ముగించుకున్న వినాయక విగ్రహాలను కూడా భక్తులు తప్పని పరిస్థితుల్లో నీళ్లులేని చెరువుల్లో వదిలేసి వెళ్లడం కరువుకు అద్దం పడుతోంది. ఒకవేళ తాము బతుకమ్మ ఆడినా చెరువులు, కంటల్లో నీళ్లు లేని కారణంగా వాటిని ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. -
కేఎల్ఐ ద్వారా డిండి ప్రాజెక్టు నింపాలి
డిండి : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) ద్వారా డిండి ప్రాజెక్టుకు నీటిని తీసుకురాకపోతే ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన డిండి మండంలోని కామేపల్లి శివారులో ఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించారు. అనంతరం డిండిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో ఉన్న నీరు చివరి దశ వరకు సరిపోతుందా లేదా అనే కనీస అంచనా లేకుండానే నీటిని విడుదల చేశారని విమర్శించారు. ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరిందని, పంట చేతికి రావడానికి ఇంకా 45 రోజుల సమయం పడుతుండటంతో రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి డిండికి నీటిని తీసుకొచ్చి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో డిండిలో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్వీఆర్, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాసరావు, గిరమోని శ్రీను, వెంకటయ్య, మల్లయ్య, చంద్రయ్య, రాములు, శ్రీను, కొండల్రావు, మాదవయ్య, రేణయ్య పాల్గొన్నారు. -
ఇసుక.. ఇష్టారాజ్యం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో పారదర్శకతకు పాతరేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించి అర్హులైన వారికి ఇసుక రీచ్‌లు కేటాయించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా జిల్లాలోని వంగమర్తి ఇసుక రీచ్ కేటాయింపు వ్యవహారం ఉంది. 2021 నుంచి ఒకే కాంట్రాక్టర్‌కు రాష్ట్రస్థాయిలో కేటాయింపులు పొడిగిస్తూ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక, ఇటుకలపహడ్లో రీచ్ కేటాయింపు ఒకచోట ఉంటే.. తవ్వకాలు మరోచోట జరపడం అనుమానాలకు తావిస్తోంది. ఏళ్ల తరబడి అదే కాంట్రాక్టర్? సాధారణంగా ఇసుక రీచ్‌ల కేటాయింపులో ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు, టెండర్లు కీలకం. పోటీ ద్వారా కేటాయింపులు చేపట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు అక్రమాలకు అవకాశం తగ్గుతుంది. అయితే వంగమర్తి ఇసుక రీచ్ విషయంలో 2021 నుంచి ఒకే కాంట్రాక్టర్‌కు కేటాయింపులు పొడిగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి విడతలో నిబంధనల ప్రకారం పొడిగింపులు చేశారా? టెండర్ల ప్రక్రియను ఎందుకు చేపట్టలేదు? ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలపై స్పష్టత లేకుండాపోయింది. రీచ్ ఒకచోట.. తవ్వకాలు మరోచోట! ఇటుకులపహాడ్ ఇసుక రీచ్ వ్యవహారం సైతం అనుమానాలకు తావిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. రీచ్ కేటాయింపు ఒకచోట ఉండగా.. తవ్వకాలు మరోచోట చేపడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటాయించిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ, మైనింగ్, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకుండానే మరోచోట తవ్వకాలకు అనధికారికంగా ఓకే చెప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల పరిధి దాటి తవ్వకాలు జరిగితే పర్యావరణానికి నష్టం వాటిల్లడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించేనా? ఇసుక రీచ్‌ల కేటాయింపులు, తవ్వకాలు, రవాణా, విక్రయాలపై పారదర్శకత ఉండేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉంది. వంగమర్తి రీచ్ కేటాయింపు నుంచి ఇప్పటివరకు జరిగిన పొడిగింపులు, టెండర్ల నిర్వహణ, అనుమతుల వివరాలు, స్టాక్ యార్డ్ నిర్వహణ, ఇసుక తరలింపు లెక్కలపై ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న చర్చ సాగుతోంది. ఇటుకలపహడ్ రీచ్ పరిధిలో తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయి? వాటికి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా? అన్న అంశాలపైనా స్పష్టత లేకుండాపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయాలను నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. స్టాక్ యార్డ్ నిర్వహణ, నిల్వ లెక్కలు, విక్రయాల వివరాలు, రవాణా అనుమతులపై పర్యవేక్షణ అవసరం. అయితే వంగమర్తి రీచ్ పరిధిలో స్టాక్ యార్డ్ నిర్వహించకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. స్టాక్ యార్డ్ నిర్వహణ ఉందా? ఎంత మేరకు ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది? అనుమతించిన పరిమాణంలోనే తవ్వకాలు జరిగాయా? రవాణా, విక్రయాల లెక్కలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేశారా? అన్న అంశాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మూసీ ప్రాజెక్టు పరిధిలో ఇసుకరీచ్‌లు నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయి. ఇటుకులపహాడ్ పరిధిలో 10 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుక తవ్వకాలకు ఏడాది గడువుతో నాలుగేళ్ల కిందట టెండర్ కాగా నేటికి 1.70 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకనే తవ్వారు. ఇటుకులపహాడ్ రీచ్ వద్ద ఇసుక లభ్యత లేకపోవడంతో దానిని వంగమర్తి రీచ్‌కు బదిలీ చేశాం. 10 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు పూర్తయ్యేవరకు రీచ్ కొనసాగుతుంది. నిబంధనల ఉల్లంఘన లేకుండా చూస్తున్నాం. – మదన్మోహన్, టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారిఫ వంగమర్తి ఇసుక రీచ్ కేటాయింపులో నిబంధనల ఉల్లంఘన ఫ 2021 నుంచి ఒకే కాంట్రాక్టర్‌కు పొడిగింపు ఫ టెండర్లు పిలవకుండానే రాష్ట్రస్థాయిలో అప్పగింత ఫ స్టాక్ యార్డ్ నిర్వహణ లేకుండానే తవ్వకాలు ఫ ఇటుకులపహాడ్‌లో రీచ్ కేటాయింపు ఒకచోట, తవ్వకాలు మరోచోట -
తేలిన ‘ఆర్టీసీ’ ఫలితం
రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రధానంగా రెండు బలమైన కూటముల మధ్య హోరాహోరీగా సాగాయి. ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఒక కూటమిగా, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మరో కూటమిగా పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి వెలువడిన ఫలితాల్లో రాష్ట్ర గుర్తింపునకు సంబంధించి తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్‌కు 1,017 ఓట్లు, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు 918 ఓట్లు దక్కాయి. రీజియన్ స్థాయి గుర్తింపునకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌కు 977 ఓట్లు, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు 966 ఓట్లు వచ్చాయి. 98.97 శాతం పోలింగ్ సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన ఈ ఎన్నికలపై ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. రీజియన్ పరిధిలోని ప్రధాన డిపోల్లో ఉదయం నుంచే ఉద్యోగులు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి డిపోల వారీగా శరవేగంగా సాగిన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల సమయానికి ముగిసేసరికి రీజియన్ వ్యాప్తంగా ఏకంగా 98.97 శాతం ఓటింగ్ నమోదైంది. ఆర్టీసీ ఉద్యోగులు తమ ఓటు హక్కును ఎంతో ఉత్సాహంగా వినియోగించుకున్నారు. నల్లగొండ, నార్కట్పల్లిలతో పాటు నల్లగొండ ఆర్ఎం ఆఫీస్‌లో 100 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. రీజియన్ పరిధిలోని మొత్తం 2,036 ఓట్లకు గాను 2,015 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటితో పాటు మిర్యాలగూడలో 1, దేవరకొండలో 4 చొప్పున మొత్తం 5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. రీజియన్ స్థాయిలో ఎస్‌డబ్ల్యూఎఫ్, రాష్ట్రస్థాయిలో ఈయూకి మెజార్టీగట్టి పోటీతో ఉత్కంఠ వాతావరణం.. రీజియన్ స్థాయిలో పోటీ అత్యంత సమీపంలో సాగింది. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కేవలం 11 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో నిలవగా.. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ 99 ఓట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. రెండు ప్రధాన కూటములకు కార్మికుల నుంచి సమాన స్థాయిలో మద్దతు లభించడంతో ఫలితాల సరళి ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. -
నీలగిరిలో చైన్నె షాపింగ్‌మాల్
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది చైన్నె షాపింగ్ మాల్’ శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటి రితికా నాయక్ చేతులు మీదుగా ప్రారంభోత్సవ వేడుక సందడిగా సాగింది. మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్‌డబ్ల్యూసీ కోర్ర లక్ష్మి, షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మర్రి వెంకట్‌రెడ్డి, డైరెక్టర్ కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ యామా కవితా దయాకర్లతో కలిసి నటి రితికానాయక్ జ్యోతి ప్రజ్వలన చేశారు. నటి రితికాను చూసేందుకు యువకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. -
పరిహారం ఇవ్వకుంటే ప్రాణాలు తీసుకుంటాం
నల్లగొండ : తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూములు పెండ్లిపాకల ప్రాజెక్టులో ముంపునకు గురయ్యాయని, పరిహారం అందకుండా మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆరుగురు గిరిజన యువకులు కలెక్టరేట్ వద్ద సెల్ టవర్ ఎక్కారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నచ్చజెప్పి టవర్ నుంచి కిందకు దించారు. కొండమల్లేపల్లి మండలం గాజానగర్ పరిధిలోని 109 ఎకరాల భూమిని తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని గిరిజన కుటుంబాలు చెప్పాయి. ఆ భూమి రికార్డుల్లో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి పేరు ఉండటంతో, కబ్జాలో గిరిజనలు ఉండడంతో భూమి అతని పేరుపై ఉండడంతో వారు ఒక ఒప్పందానికి వచ్చారు. అబ్దుల్ రెహమాన్ 50 ఎకరాలు తీసుకుని, మిగతా భూమి గిరిజనులకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే, ఈ వ్యవహారంలో తమ పక్షాన పెద్దమనిషిగా ఉన్న నేనావత్ జీవన్ అనే ప్రభుత్వ ఉద్యోగి తమను మోసం చేశాడని, ప్రాజెక్టులో పోయిన భూమికి వచ్చే పరిహారాన్ని పంచుకుందామని చెప్పి, జీవన్ తన కుటుంబ సభ్యుల పేరు మీదనే 40 ఎకరాల భూమి ఉన్నట్లుగా తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించి, పరిహారం మొత్తం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడని వారు వాపోయారు. కలెక్టరేట్లో టవర్ ఎక్కిన గిరిజనులు పెండ్లిపాకల ప్రాజెక్టులో భూములు కోల్పోయామని ఆవేదన -
ప్రజా పాలనతోనే సంక్షేమం
గరిడేపల్లి : ప్రజా పాలనతోనే ప్రజలకు సంక్షేమం అందుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ శివారులో రూ.200 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ పాఠశాల నిర్మాణం పూర్తయితే గడ్డిపల్లి ప్రాంతం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 105 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి విద్య పేద బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతి కుటుంబాలకు అందించే విధంగా ఈ పాఠశాలల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అడ్మిషన్లు కూడా జరగాలని పేర్కొన్నారు. అనంతరం నిర్మాణ పనుల ఫొటో గ్యాలరీని ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి సందర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలను రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య : కలెక్టర్
మిర్యాలగూడ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెం గ్రామంలోని సర్వే నంబర్ 214లో గల ప్రభుత్వ భూమిని మంగళవారం ఆయన సందర్శించారు. స్థలానికి సంబంధించిన లేఅవుట్లు, భూ రికార్డులు, మ్యాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తోందని.. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని తెలిపారు. ఒకే ప్రాంగణంలో 2,500 మంది విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో ఉచితంగా నాణ్యమైన విద్యనందించేలా ఈ పాఠశాలల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. భూ సమీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మైనింగ్ ఏడీ రవికుమార్, ఆర్ఐ రామకృష్ణ, కృష్ణయ్య, డిప్యూటీ సర్వేయర్ శ్రీనివాస్‌రెడ్డి, సర్వేయర్లు శ్రీనివాస్, సైదులు, నరసింహ సిబ్బంది ఉన్నారు. -
ఓట్ల తొలగింపునకు నకిలీ కుట్ర!
మిర్యాలగూడ : ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ కార్యక్రమంలో.. ఓటర్ల తొలగింపు ప్రక్రియ ఆందోళన కలిగిస్తోంది. ఓటరు తొలగింపునకు అవసరమైన ఫారం–7ను కొందరు నకిలీవి సృష్టించి కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలో్ల్ ఓట్ల తొలగింపు పేరుతో బోగస్ ఫారం–7 పత్రాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మిర్యాలగూడ పట్టణంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముందస్తుగా ముద్రించిన ఫారం–7 పత్రాలను ఓ జాతీయ పార్టీకి చెందిన నాయకులు ఓటర్ల ఇళ్లకు తిరుగుతూ పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అధికారులు అప్రమత్తమయ్యారు. కుటుంబ సభ్యులు పూరించి ఇవ్వాలి నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తి మరణించినా, వేరే ప్రాంతానికి శాశ్వతంగా తరలివెళ్లినా, లేదా రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నా సంబంధిత కుటుంబసభ్యులు ఫారం–7 నింపి బీఎల్వోకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ వివరాలను బీఎల్వో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆమోదముద్ర వేసి జాబితా నుంచి పేరు తొలగిస్తారు. అయితే ఒక జాతీయ పార్టీకి చెందిన శ్రేణులు తమ కార్యాలయం నుంచే ప్రింటెడ్ పత్రాలను సిద్ధం చేసి, ఒక నిర్ణీత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగారుగడ్డలో ఫారాలు ప్రత్యక్షం మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డ 29వ వార్డులో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఓటర్ల ఇంటికి బోగస్ పత్రాలు చేరడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. సదరు పత్రాల్లో ఓటరు పేరు, ఇంటి నంబర్, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య అత్యంత చిన్న అక్షరాలతో కంటికి కనిపించకుండా ముద్రించారు. మరణం, శాశ్వత స్థానాంతరం, భారతీయ పౌరుడు కాదు వంటి ఐదు కారణాల వద్ద బాక్సులు ఏర్పాటు చేసి అందులో బలవంతంగా టిక్ పెట్టించి ఓటర్ల వద్ద నుంచి సంతకాలు సేకరిస్తున్నారు. వివరాలు సరిగా అర్థంకాక ముందే అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ పత్రాలను బీఎల్వోలకు అందచేసి జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఫ కొందరు ఓటర్లకు ఫారం–7 బోగస్ పత్రాల పంపిణీ ఫ మిర్యాలగూడలోని బంగారుగడ్డలో వెలుగుచూసిన ఫారాలు ఫ ఆందోళనలో ఓటర్లు.. అప్రమత్తమైన అధికారులు -
ఎస్ఎల్బీసీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి
కొండమల్లేపల్లి : ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై వాస్తవాలను వక్రీకరించేలా సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేయొద్దని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 30 టీఎంసీల నీటిని తరలించి సుమారు 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టిన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో టన్నెల్–1, టన్నెల్–2కు పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్ఎల్బీసీ పనులను పూర్తి చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రాజెక్టు చరిత్ర తెలుసుకోకుండా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో ప్రజలకు వివరించాలన్నారు. శ్రీశైలం నుంచి లిఫ్ట్ ద్వారా నీటిని తరలించే విషయంలో మహబూబ్‌నగర్‌కు 1.5టీఎంసీలు, నల్లగొండకు 0.5టీఎంసీలను కేటాయించడం అన్యాయమన్నారు. డిండి ప్రాజెక్టును కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ నిండేవరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించకుండా నియంత్రించాలన్నారు. సమావేశంలో దస్రూనాయక్, సర్పంచ్‌లు తులసీరాంనాయక్, కావటి వెంకటేష్, దీప్లాల్, మాజీ సర్పంచ్ గుండెబోయిన లింగంయాదవ్, రావుల వెంకటయ్య, రమావత్ శ్రీను, రావుల సత్యనారాయణ, బోడ యాదగిరి, హరికృష్ణ, తోటపల్లి వెంకటేష్ తదితరులున్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ -
ఎన్నికల సిబ్బందిని అప్రమత్తం చేశాం
ఫారం–7 బోగస్ పత్రాల పంపిణీపై సమాచారం అందగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కిందిస్థాయి అధికారులు, బీఎల్వోలను అప్రమత్తం చేశాం. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం మరణించిన వారు, వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన వారిని క్షేత్రస్థాయిలో విచారించి కుటుంబసభ్యుల అనుమతితోనే ఓట్లు తొలగిస్తాం. బీఎల్వోలు నేరుగా ఇచ్చే ఫారాలను మాత్రమే ప్రజలు స్వీకరించాలి. ప్రైవేట్ వ్యక్తులు లేదా పార్టీల బీఎల్ఏలు ఇచ్చే ఫారాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. – రమణారెడ్డి, ఆర్డీవో, మిర్యాలగూడ -
ఆర్టీసీలో ప్రచార హోరు
నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్తో పాటు ఇతర సంఘాలు పోటీలు ఉన్నాయి. ఆయా సంఘాలు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయడం, పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదల, కొత్త పే స్కేల్స్ అమలు, ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ పోస్టుల భర్తీ, మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం, కార్మికుల కుటుంబ సభ్యులకు మెరుగైన హెల్త్ కార్డ్స్, ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడం వంటి వాటిపై సంఘాలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. రామగిరి(నల్లగొండ) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికల నిర్వహిస్తుండడంతో నల్లగొండ రీజియన్ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నెల 9న రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుండగా, బుధవారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని డిపోల్లో ప్రధాన సంఘాల నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రీజియన్‌లో పరిధిలో 2,036 మంది ఓటర్లు.. అక్టోబర్ 9న జరగనున్న ఈ ఎన్నికల్లో నల్లగొండ రీజియన్ వ్యాప్తంగా మొత్తం 2,036 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో కండక్టర్లు 957 మంది, డ్రైవర్లు 673 మంది, గ్యారేజ్ సిబ్బంది 211 మంది, ఇతర సిబ్బంది 195 మంది ఉన్నారు. గేట్ మీటింగ్‌లు, కరపత్రాల పంపిణీ.. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి డిపోల్లో ఎన్నికల సందడి పతాక స్థాయికి చేరింది. షిఫ్టులు మారే సమయంలో గ్యారేజీలు, బస్ స్టేషన్లలో గేట్ మీటింగ్‌లు నిర్వహిస్తూ కార్మిక సంఘాల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో వ్యక్తిగతంగా భేటీ అవుతూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం మద్దతు ఉన్న యూనియన్ల నాయకులు డిపోల వారీగా విస్తృత వ్యూహాలు అమలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో కార్మికుల ఇళ్లకు వెళ్లి ఆత్మీయ కలయికలు ఏర్పాటు చేసుకుంటూ చివరి నిమిషం వరకు ప్రతి ఓటునూ దక్కించుకునేందుకు శ్రమిస్తున్నారు. ఫ నేటి సాయంత్రంతో ముగియనున్న ప్రచారం ఫ 2,036 మంది ఓటర్లు, 9న పోలింగ్ -
డిండి.. పీటముడి
బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్ శ్రీ 2026రెడ్‌క్రాస్ బరిలో 32 మందినల్లగొండ టౌన్ : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నల్లగొండ బ్రాంచి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెడ్‌క్రాస్ సొసైటీలో జిల్లా వ్యాప్తంగా 1351 మంది సభ్యులున్నారు. గతంలో రెడ్‌క్రాస్ సొసైటీకి చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి రాష్ట్ర మేనేజిమెంట్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. 2026–29 సంవత్సరానికి గాను 15 మందితో కూడిన మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఈ నెల 3 నుంచి జిల్లా నామినేషన్లు స్వీకరించారు. రెడ్‌క్రాస్ నల్లగొండ బ్రాంచి చరిత్రలో తొలిసారిగా 33 మంది నామినేషన్లను దాఖలు చేశారు. అందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులతో పాటు తొలిసారిగా సేవాభారత్ సభ్యులు కూడా తమ నామినేషన్లు వేశారు. మంగళవారం ఒంటి గంట వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే నామినేషన్ ఉపసంహరించుకోవడంతో 32 మంది బరిలో నిలిచారు. 11న పోలింగ్, ఫలితాలు రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న ఉదయం 8 గంటల నుంచి 3 వరకు జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ భవన్లో నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన 15 మంది సభ్యుల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారితో పాటు రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం ప్రమాణ స్వీకారం ఉంటుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొద్దునకిరేకల్ : విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా నకిరేకల్‌లోని పటేల్ నగర్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద యార్డు క్లీనింగ్ పనులను మంగళవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెరిగిన చెట్లు, కంపచెట్లను సిబ్బంది తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఉన్న కంపచెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ ఏఈ ధర్మతేజతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 8న అండర్–19 కబడ్డీ జట్ల ఎంపికహాలియా : ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్– 19 బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికను ఈనెల 8వ తేదీన హాలియాలోని శ్రీ శ్లోక పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు అండర్–19 స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఇందిర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వెంట పదవ తరగతి ఒరిజినల్ మెమో, రెండు పాస్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని ఎక్కడి నుంచి తీసుకోవాలనే విషయంలో పీటముడి వీడలేదు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రాజెక్టు కథ మరోసారి మొదటికొచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వ్యక్తమైన అభ్యంతరాలు ఈ సమస్యను మరింత జఠిలం చేశాయి. సీఎం రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం సమీక్ష చేసినా ఓ కొలిక్కరాకపోవడం.. ఏదుల నుంచి మొత్తం నీటిని మహబూబ్‌నగర్‌కే తీసుకుంటామని, డిండికి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే తీసుకోవాలంటూ చేసిన ప్రతిపాదనతో ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం డిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది. 2015లో జూన్ 11న రూ.6,194 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉత్తర్వులు (జీవో 107) జారీచేసింది. నల్లగొండ జిల్లాలో 5 రిజర్వాయర్ల నిర్మాణ పనులకు చేపట్టింది. అవి వివిధ దశల్లో ఉన్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్‌ను ఆమోదించడంతో పాటు డిండికి నీటిని ఏదులలో ప్రతిపాదించిన వీరాంజనేయ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని నిర్ణయించింది. శ్రీశైలం ప్రాజెక్టులోని వెనుక జలాల నుంచి అప్రోచ్ ఛానల్ ద్వారా నీటిని తీసుకొని కొంతదూరం వచ్చాక పంప్‌హౌస్ నిర్మించి అక్కడి నుంచి నార్లాపూర్వద్ద నిర్మించే అంజనగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా.., దాని నుంచి ఏదులకు నీటిని తరలించేలా చర్యలు చేపట్టింది. ఏదుల నుంచే 436.41 అడుగుల నీటిమట్టం నుంచి ఇటు డిండికి, అటు మహబూబ్‌నగర్‌కు నీటిని తరలించాలని నిర్ణయించింది. ఏదుల నీటిమట్టం విషయంలో పేచీ. ఏదుల రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 445 అడుగులు. రిజర్వాయర్‌లో 436.41 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాకు, నల్లగొండ జిల్లాకు నీటిని తీసుకునేలా మొదట నిర్ణయించారు. అయితే మహబూబ్‌నగర్ జిల్లా నేతల ఒత్తిడితో గత ఏడాది ఇంజనీర్ల కమిటీ మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. మహబూబ్‌నగర్‌కు 436.41 అడుగుల వద్ద నీటిని తీసుకునే అవకాశం కల్పిస్తూ, డిండికి మాత్రం 440 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు నీటిని తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై నల్లగొండ జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 436 అడుగుల వద్ద మహబూబ్‌నగర్‌కు నీటిని తీసుకుంటే ఏదుల రిజర్వాయర్ నీటిమట్టం 440 అడుగులకు చేరే అవకాశం తక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తమైంది. కాలువల ద్వారా 6 వేల క్యూసెక్కులు రావాల్సిన నీరు 1500కు పడిపోయే ప్రమాదం ఉంది. మహబూబ్‌నగర్ 436 అడుగుల వద్దే నీటిని తీసుకుంటే.. 440 అడుగులకు నీటిమట్టం పెరగకపోవడంతో డిండి ద్వారా నల్లగొండకు నీరు అందే అవకాశం ఉండదని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రతిపాదనను నిలిపివేయాలని అఖిలపక్షాల నేతలు, జిల్లా మంత్రులు ప్రభుత్వాన్ని కోరారు. అప్పట్లో ఈ సమస్యకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.వైటీపీఎస్‌లో రూ.114కోట్లతో టెండర్లుమిర్యాలగూడ : దామరచర్ల మండలంలోని వీర్లపాలెంలో ఐదు యూనిట్లు(ఒక్కో యూనిట్ 800 మెగావాట్ల) సామర్థ్యం గల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాజెక్టు ప్రాంగణంలో రైల్వే సైడింగ్, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కోసం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీజీజెన్కో) రూ.114కోట్ల అంచనా వ్యయంతో కాంట్రాక్ట్ నిర్వహణకు టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు విద్యుత్ సౌధలోని సూపరింటెండెంట్ ఇంజనీర్(జనరేషన్–3) కార్యాలయం నుంచి అధికారిక టెండర్ నోటీసు విడుదల చేశారు. ప్రాజెక్టులోని రైల్వే సైడింగ్ ఆపరేషన్, ట్రాక్ మెయింటెనెన్స్, లోకోమోటివ్స్, సిగ్నలింగ్, ట్రాన్స్మిషన్, సంబందిత పనిముట్లు, వినియోగ వస్తువుల సమగ్ర నిర్వహణ కోసం మూడేళ్ల కాల పరిమితికి గాను కాంట్రాక్టర్ల నుంచి ఓపెన్ టెండర్ల విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. టీజీ జెన్కో యాజమాన్య ప్రాధాన్యతను బట్టి ఈ కాంట్రాక్ట్ కాలాన్ని మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుందని తెలిపారు. నల్లగొండలో ర్యాలీ నిర్వహిస్తున్న ఇండియా కూటమి నేతలు, పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు కైలాష్నల్లగొండ : ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ నినాదంతో ఇండియా కూట మి ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ పట్టణంలో లాంగ్‌మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని ఐటీఐ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై సుప్రీంకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జిల్లాపల్లి పరమేశ్, బోడ స్వామి, గోపగోని మాధవి, సుకన్య, నాగేశ్వర్రావు, పులి పాపయ్య, జగన్నాథం, శ్రీనివాస్‌రెడ్డి, గజ్జి రవి, బొమ్మిడి నాగేష్, బొంగరాల నరసింహ, బీఎన్ చారి, వెంకన్న, అక్కెనపల్లి అంజి, అశోక్ పాల్గొన్నారు. ఫ ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలనే విషయంలో వీడని సందిగ్ధం ఫ సీఎం, మంత్రి చర్చించినా కొలిక్కిరాని అంశం ఫ ఏదుల వద్ద 436 అడుగుల నుంచి నీటిని తీసుకునేందుకు కుదరని ఏకాభిప్రాయం ఫ 440 వద్ద నుంచి తీసుకుంటే నల్లగొండకు ప్రయోజనం అంతంతే ఫ నేరుగా శ్రీశైలం నుంచే తీసుకోవాలనే ప్రతిపాదనపై గందరగోళం -
విద్యారంగంలో మార్పులకు భారీ పెట్టుబడులు
మునగాల: విద్యారంగంలో శాశ్వత మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌరసరఫాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం మునగాల మండలం ఎస్ఎంపేట రెవెన్యూ పరిధిలో రూ.9.60కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక సెంట్రల్ కమ్యూనిటీ కిషెన్ షెడ్ శంకుస్థాపనలో కార్యక్రమంలో వారు పాల్గొని భూమిపూజ నిర్వహించారు. హారేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగే ఈ కిషెన్షెడ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 1029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసించే 60వేల మంది విద్యార్థులకు ప్రతిరోజు పౌష్టిక అల్పాహారం అందించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో హారేకృష్ణ చారిటబుల్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు శ్రీసత్య గౌరచంద్ర దాస స్వామిజీతో పాటు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
వరి చేలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
మిర్యాలగూడ టౌన్ : దామరచర్ల మండల కేంద్రం సమీపంలో గల వరి చేలను కేవీకే కంపసాగర్ శాస్త్రవేత్తలు శనివారం పరిశీలించారు. అనంతరం రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రస్తుతం వరి పైరులో మోగి పురుగులు, నల్లి, తామర పురుగుల ఉత్పత్తి అధికంగా ఉందన్నారు. వీటి నివారణకు ప్లూబెండమేడ్ 39.35 ద్రావణం ఎకరానికి 20 మిల్లీ లీటర్లు, స్పైరోమేసిఫిన్ 200 మిల్లీ లీటర్లతో పిచికారి చేసుకోవాలన్నారు. శాస్త్రవేత్తల వెంట ఏఈఓ రావుల నరేష్, పీఏసీఎస్ సీఈఓ వెంకట్‌రెడ్డి, రైతు సైదిరెడ్డి తదితరులున్నారు. ఈయూ కూటమిని గెలిపించాలిదేవరకొండ : ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కూటమిని గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఈయూ గౌరవాధ్యక్షుడు పల్లా నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. దేవరకొండ డిపో వద్ద శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. అనంతరం ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు, టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కార్మికులు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, రహీమొద్దీన్, తూం బుచ్చిరెడ్డి, కేఎస్ రెడ్డి, వెంకటయ్య, మంగ, జమాల్గౌడ్, రాజు, డి.వి. నారాయణ, రాఘవరెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీపై ముగిసిన శిక్షణరామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌పై నిర్వహించిన రెండు రోజుల ప్రత్యేక శిక్షణ శనివారం ముగిసింది. కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ విభాగాల ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్, ఐబీఎం సంయుక్తంగా ఈ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐబీఎం ప్రాజెక్టు మేనేజర్ సాయి రాఘవేంద్ర, శిక్షకురాలు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ఏఐ టూల్స్ సహాయంతో ఉద్యోగాలు సాధించేలా ప్రాజెక్టులను సిద్ధం చేసుకోవడం, ప్రతిభను చాటేలా రెజ్యుమ్ డిజైన్ చేయడం, రోజువారీ విద్యలో చాట్ జీపీటీ, జెమిని ఏఐలను నైపుణ్యంతో ఎలా ఉపయోగించుకోవచ్చో వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్ మాట్లాడుతూ భవిష్యత్‌లో సాంకేతిక రంగానికి కృత్రిమ మేధస్సే కీలకమని, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. కార్యక్రమంలో ఫిజిక్స్ హెచ్ఓడీ శ్రీనివాస్‌రెడ్డి, కంప్యూటర్ సైన్ హెచ్ఓడీ ఎస్పి.వెంకటరమణ, అధ్యాపకులు వెంకట్‌రెడ్డి, వెంకటేశ్, నగేష్, కిరణ్, రమ్య, రాణి, తులసి, శశికళ, రామ, సంధ్య, పద్మావతి, తేజస్విని తదితరులు పాల్గొన్నారు. -
బొట్టుగూడ విద్యార్థులకు అభినందనలు
రామగిరి (నల్లగొండ) : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిచన మహాత్మాగాంధీ 157వ జయంతి ఉత్సవాల్లో నల్లగొండ బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతిక్ పౌండేషన్ పాఠశాల విద్యార్థులు ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వివేక్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, హనుమంతరావు, కొందండరెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. విద్యార్థులకు గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ గున్న రాజేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యానాలా ప్రభాకర్‌రెడ్డి, కన్వీనర్ గాంధారి ప్రభాకర్, నీరుడు దయాకర్ రెడ్డి, బొమ్మపాల గిరిబాబు, కరుణాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
రైతు సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
అలరించిన ఖవ్వాలినల్లగొండ టౌన్ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. శనివారం నల్లగొండలోని సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు రైతుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతున్నాయని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో పాటు కరువు నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. నాగార్జునసాగర్ ఎడమకాలువ నుంచి నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగి బావులు, కుంటలు నిండి పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, ఎండీ.హాశం, కందాల ప్రమీల, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, దండంపల్లి సత్తయ్య పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ హైవేలపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్, క్రేన్, హెల్పర్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, 26 మంది అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ నిరంతరం రోడ్డు భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. జంక్షన్ల వద్ద ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిర్యాలగూడ–నందిపాడు, చిట్యాల–నార్కట్‌పల్లి, కొండమల్లేపల్లి–ఆలగడప, డిండి–కొండపల్లి, నార్కట్‌పల్లి–వాడపల్లి మార్గాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. దామరచర్ల రైల్వే బ్రిడ్జి, లైటింగ్ ఏర్పాటు చేయాలని, కట్టంగూర్ పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ పరిధిలో రోడ్ల ఆక్రమణలను తొలగించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో ట్రామా కేర్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు సీఎస్ఆర్ నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ శరత్ చంద్రపవార్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోకి లారీల రాకపోకలకు సమయపాలన విధించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. సమావేశంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శ్రీవాణి, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ పాల్గొన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
బీపీ, షుగర్ హై
అలవాటు మారింది.. అనారోగ్యం దరిచేరిందిసాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆధునిక జీవన విధానంలో ప్రజలు ఎక్కువ మొత్తంలో అధిక బరువు, స్థూలకాయం, బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఆహారం, జంక్ ఫుడ్, ఇతర అలవాట్లు ప్రజల అనారోగ్యానికి కారణం అవుతోంది. స్థూలకాయం సమస్య మహిళల్లో అధికంగా పెరుగుతుండగా, పురుషులు ఎక్కువ మంది బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. 2023–24 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే –6 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సర్వే నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాల్లో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయని పేర్కొంది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిస్థితులను వెల్లడించింది. స్థూలకాయంతో బాధ పడుతున్న మహిళలే ఎక్కువ ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే అధిక బరువు (స్థూలకాయం) సమస్యతో బాధపడుతున్న మహిళలు సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 44.4 శాతం మంది ఉండగా, నల్లగొండ జిల్లాలో 38.9 శాతం మంది, యాదాద్రి జిల్లాలో 34.4 శాతం మంది ఉన్నట్లు తేలింది. ● రక్తపోటుతో (బీపీ) బాధపడుతున్న పురుషులు అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నారు. అక్కడ 35.3 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నట్లు తేలింది. సూర్యాపేటలో 30.9 శాతం మంది, నల్లగొండలో 24.5 శాతం మంది బీపీతో బాధపడుతున్న వారు ఉన్నారు. ● మహిళల్లో నల్లగొండలో 22.8 శాతం, సూర్యాపేటలో 26.3 శాతం, యాదాద్రిలో 26.1 మంది హైబీపీతో బాధపడుతున్నారు. సూర్యాపేటలో ఎక్కువ మందికి షుగర్ ● షుగర్ వ్యాధి బారిన పడిన వారు సూర్యాపేట జిల్లాలోనే అత్యధికంగా ఉన్నారు. పురుషుల్లో సూర్యాపేటలో 28.8 శాతం మంది షుగర్ బారిన పడ్డారు. ఇక యాదాద్రి జిల్లాలో 24.6 శాతం మంది, నల్లగొండలో 26 శాతం మంది వీటి బారిన పడ్డారు. ● మహిళల్లో నల్లగొండలో 22.8 శాతం మంది, సూర్యాపేటలో 26.3 శాతం మంది, యాదాద్రిలో 26.1 శాతం మంది షుగర్ బారిన పడ్డారు. నల్లగొండ, యాదాద్రిలో మందుబాబులు ఎక్కువే మత్తు పదార్థాల వాడకం విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో 15 ఏళ్లకు పైబడిన వారిలో సగానికి పైగా మందుబాబులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 54.1 శాతం మంది, నల్లగొండలో 50.4 శాతం మంది, సూర్యాపేటలో 46.5 శాతం మద్యం తాగే వారు ఉన్నారు. ● పొగాకు వాడకంలో నల్లగొండలో పురుషులు 24.7 శాతం మంది ఉండగా, సూర్యాపేటలో 18 శాతం, యాదాద్రిలో 14.5 శాతం మంది పొగరాయుళ్లు ఉన్నట్లు తేలింది. బాల్య వివాహాలు, యుక్త వయస్సులో గర్భధారణ బాల్య వివాహాల విషయంలో నల్లగొండ జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నల్లగొండ జిల్లాలో (20–24 ఏళ్ల మహిళల్లో) 25.2 శాతం మంది 18 ఏళ్ల కంటే ముందే వివాహం చేసుకున్నారు. సూర్యాపేటలో ఇది 17.2 శాతం కాగా, యాదాద్రి భువనగిరిలో చాలా తక్కువగా 11.3 శాతమే నమోదైంది. 15–19 ఏళ్లలోనే గర్భం దాల్చిన వారు నల్లగొండ 10.6 శాతం మంది ఉండగా, సూర్యాపేటలో 9.4 శాతం మంది, యాదాద్రి జిల్లాలో 4.7 శాతం మాత్రమే ఉన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం పిల్లల్లో పోషకాహార లోపం అధికంగానే ఉంది. పోషకాహార లోపంతో ఐదేళ్లలోపు పిల్లల్లో వయస్సుకు తగిన ఎత్తు పెరగని పిల్లలు నల్లగొండ జిల్లాలో 26.2 శాతం మంది ఉన్నారు. సూర్యాపేటలో అత్యధికంగా 29.2 శాతం మంది ఉండగా, యాదాద్రి జిల్లాలో 23.6 శాతం ఉన్నారు. ఐదేళ్లలోపు వయస్సుకు తగిన బరువు లేని పిల్లలు అధికంగానే ఉన్నారు. నల్లగొండలో 29 శాతం మంది ఉండగా, సూర్యాపేటలో 25.9 శాతం, యాదాద్రి జిల్లాలో 31 శాతం మంది ఉన్నట్లు తేలింది. అధిక బీపీ ఉన్న పురుషులు, మహిళల శాతం జిల్లా పురుషులు మహిళలు యాదాద్రి 35.3 26.1 సూర్యాపేట 30.9 26.3 నల్లగొండ 24.5 22.8 ఉమ్మడి జిల్లాలో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లు పెరిగిపోయాయి. అయితే ఆసుపత్రుల్లో ప్రసవాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. సూర్యాపేట జిల్లాలో 100 శాతం, నల్లగొండ జిల్లాలో 98.3 శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 97.9 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరిగాయి. దీంతో మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. సిజేరియన్లు అత్యధికంగానే ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 60.3 శాతం సిజేరియన్లు జరగ్గా, సూర్యాపేట జిల్లాలో 66.3 శాతం, యాదాద్రి భువనగిరి జిల్లాలో 65.4 శాతం, సిజేరియన్ (ఆపరేషన్) ప్రసవాలు జరగడం ఆందోళనకు కారణం అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు సిజేరియన్లు 10–15 శాతం మించడానికి వీల్లేదు. కానీ జిల్లాలో ఇక్కడ 60 శాతానికి పైగా జరగడం చూస్తుంటే అవసరం లేకపోయినా ప్రైవేట్ ఆసుపత్రులు ధనార్జన కోసం ఆపరేషన్లు చేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల మహిళల ఆరోగ్యం దీర్ఘకాలంలో దెబ్బతినడమే కాకుండా, సామాన్య కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. అధిక షుగర్ ఉన్న పురుషులు, మహిళల శాతం జిల్లా పురుషులు మహిళలు సూర్యాపేట 28.8 26.3 యాదాద్రి 24.6 26.1 నల్లగొండ 26 22.8 స్థూలకాయంతో బాధపడుతున్న మహిళల శాతం సూర్యాపేట 44.4 నల్లగొండ 38.9 యాదాద్రి 34.4 ఫ మహిళలను వేధిస్తున్న స్థూలకాయం సమస్య ఫ 60శాతం ప్రసవాలు సిజేరియన్ల ద్వారానే.. ఫ ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6లో వెల్లడి -
చేయూత.. వడబోత!
నల్లగొండ : చేయూత పథకం కింద కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగంగా కొనసాగుతోంది. సెర్ప్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రక్రియలో అక్టోబర్ 3 నాటికి జిల్లా వ్యాప్తంగా 32,993 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 32,991 దరఖాస్తులను ట్యాగ్ చేసి ప్రాసెస్ చేశారు. క్షేత్రస్థాయిలో అర్హత పరిశీలనతో పాటు ఎంపీడీఓల స్థాయిలో ఆమోద ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు త్వరగా అందేలా అధికారులు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. 29 వేలకుపైగా అర్హత.. వీఓల స్థాయిలో జరిగిన క్షేత్ర పరిశీలనలో 29,056 దరఖాస్తులు అర్హమైనవిగా తేలాయి. మరో 3,382 దరఖాస్తులు అనర్హమైనవిగా గుర్తించారు. 462 దరఖాస్తులు హోల్డ్‌లో ఉండగా, 91 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంపీడీఓల స్థాయిలో ఇప్పటివరకు 25,355 దరఖాస్తులకు ఆమోదం లభించింది. 1,570 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరో 5,513 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. నల్లగొండలో అత్యధికంగా దరఖాస్తులు.. మున్సిపాలిటీలు, మండలాల వారీగా పరిశీలిస్తే నల్లగొండ మున్సిపాలిటీలో అత్యధికంగా 2,430 దరఖాస్తులు నమోదయ్యాయి. తర్వాత మిర్యాలగూడ మున్సిపాలిటీలో 1,560, కట్టంగూర్ మండలంలో 1,354, మిర్యాలగూడ మండలంలో 1,351 దరఖాస్తులు వచ్చాయి. నందికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 190 దరఖాస్తులు వచ్చాయి. అడవిదేవులపల్లి, గుడిపల్లి మండలాల్లో 269 దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన, ఆమోద ప్రక్రియ పూర్తయ్యాక అర్హులైన లబ్ధిదారులకు చేయూత పథకం ప్రయోజనాలు అందనున్నాయి. ఫ వివిధ స్థాయిల్లో పింఛన్ దరఖాస్తుల పరిశీలన ఫ అర్హులకు ప్రయోజనం అందించేలా వేగంగా సాగుతున్న ప్రక్రియచేయూత దరఖాస్తుల వివరాలు ఇలా.. వచ్చిన మొత్తం దరఖాస్తులు 32,993 అర్హుత ఉన్నవిగా వీఓలు తేల్చినవి 29,056 ఎంపీడీఓల స్థాయిలో ఆమోదం పొందినవి 25,355 పరిశీలనలో ఉన్నవి 5,513 తిరస్కరించినవి 1,570 -
ఎల్‌నినో ప్రభావంతో ముఖం చాటేసిన వర్షాలు
వర్షపాతం లోటు అధికంగా ఉన్న మండలాలు (మి.మీలలో..) మండలం కురిసింది కురవాల్సింది లోటు శాతం గట్టుప్పల్ 191.5 487.3 61 కేతేపల్లి 260.9 599.6 56 నిడమనూరు 249.3 571.2 56 పీఏపల్లి 178.5 392.1 54 నల్లగొండ 289.1 599.9 52 అనుముల 254.9 498.3 49 తిరుమలగిరిసాగర్ 243.5 480.6 49 చందంపేట 220.5 435 49 నేరెడుగొమ్ము 215.2 397.4 46 తిప్పర్తి 269.9 493.2 45 మాడుగులపల్లి : చింతలగూడెంలో ఎండిన వరి పొలంఫ 27 మండలాల్లో లోటు వర్షపాతం ఫ భారీగా పడిపోయిన భూగర్భ జలాలు ఫ విద్యుత్ సమస్యలతో రైతుల ఇబ్బందులు ఫ 1.90 లక్షల ఎకరాల్లో ఎండిపోయిన పంటలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాను కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. వానాకాలం పూర్తయినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జిల్లాలోని 27 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా గట్టుప్పల్ మండలంలో 61 శాతం వర్షపాతం లోటు వర్షపాతం అత్యధికంగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. మరో 26 మండలాల్లోనూ వర్షపాతం లోటుగానే నమోదైంది. కేవలం ఏడు మండలాలు దామరచర్ల, కొండమల్లేపల్లి, మర్రిగూడ, చింతపల్లి, శాలిగౌరారం, నార్కట్‌పల్లి, చిట్యాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలపైనా తీవ్ర ప్రభావం పడింది. పలు మండలాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోగా, వర్షపాతం లోటుతో ఆయా మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వర్షం లేక.. పంటలు ఎండిపోయి నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 30వ తేదీ ముగిసే సరికి (వానాకాలం సీజన్ ముగిసిన) జిల్లాలోని చాలా మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. వర్షాధార పంటలతో పాటు బోర్లు, బావులపై ఆధారపడిన పంటలకు కూడా నీటి కొరత తప్పలేదు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లలో నీటి లభ్యత కూడా తగ్గుతోంది. వీటికితోడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు, విద్యుత్ కోతలతో బోరు బావుల కింద పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కో మండలంలో 20 శాతం వరకు పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 3,60,795 ఎకరాల్లో వరి సాగు చేయగా, 5,93,440 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. అందులో 1.90 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు వర్షాభావ పరిస్థితులకు తోడు భూగర్భ జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. సెప్టెంబర్ 30 నాటికి జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలమట్టాలు 8 నుంచి 17 మీటర్ల లోతుకు పడిపోయాయి. దామరచర్లలో అత్యధికంగా 17.76 మీటర్ల లోతులో నీటిమట్టం నమోదైంది. గతేడాది సెప్టెంబర్‌తో పోల్చితే 7.35 మీటర్ల మేర క్షీణత ఏర్పడింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే జిల్లాలోని 33 మండలాల్లో అత్యధిక మండలాల్లో నీటిమట్టాలు తగ్గడం గమనార్హం. -
పంచాయతీలకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
మిర్యాలగూడ : గ్రామపంచాయతీల అవసరాలకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) తరుణ్ చక్రవర్తి సూచించారు. శుక్రవారం మండలంలోని బోట్యానాయక్ తండా, గూడూరు గ్రామపంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. 2027–28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్, వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను తయారు చేయాలన్నారు. వీబీజీ రాంజీ పథకం కింద తెలంగాణ జలసిరి పనులను ముమ్మరంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి గ్రామానికి ఊటకుంట, ప్రతి రైతుకు ఫామ్ పాండ్ (పంట కుంట), బోర్‌వెల్స్‌కు రీచార్జ్ గుంతలు నిర్మించాలన్నారు. అలాగే ప్రతి ఆర్సీసీ ఇంటికి రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, కమ్యూనిటీ సోక్ పిట్ వంటి పనులు చేపట్టి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేషగిరిశర్మ, డీపీఓ రాఘవరావు, ఏపీడీ గార్లపాటి జ్యోతిలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ మాతంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
రామగిరి(నల్లగొండ) : భూగర్భ జలాలు తగ్గుతున్న తరుణంలో రైతులు తమ ప్రాంతంలోని నీటి లభ్యతను బట్టి వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)ఉల్లోజు వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని రంగారెడ్డినగర్ గ్రామపంచాయతీ పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయని, రాబోయే రోజుల్లో సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరం వరి సాగు అయ్యే నీటితో సుమారు నాలుగు ఎకరాల్లో ఆరుతడి పంటలను పండించవచ్చని తెలిపారు. రైతులు మినుములు, అలసందలు, పెసర్లు, నువ్వులు, వేరుశనగ వంటి లాభదాయక పంటలను ఎంచుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. యంత్రాల వినియోగంతో ప్రయోజనాలు, వ్యవసాయ శాఖ సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. రాచకాల్వ గండి పూడ్చివేతశాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టులోకి మూసీనది నుంచి వరదనీరు వచ్చే రాచకాల్వకు పడిన గండిని నీటిపారుదలశాఖ అధికారులు పూడ్చివేయించారు. శుక్రవారం పల్లివాడ హెడ్ రెగ్యూలేటర్ నుంచి రాచకాల్వకు వరదనీటిని మళ్లించారు. రాచకాల్వకు పడిని గండిని పూడ్చి న ప్రదేశాన్ని నీటిపారుదలశాఖ ఈఈ సత్యనా రాయణ, ఏఈ విక్రమ్ పర్యవేక్షించారు. వారి వెంట పనుల నిర్వాహకులు చామల వెంకటరమణారెడ్డి, ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఉన్నారు. సోలార్ ప్లాంట్లకు బ్యాంకు రుణాలునల్లగొండ : సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే ప్రతి గృహ విద్యుత్ వినియోగదారుడికి జాతీయ బ్యాంకులు రుణాలు సమకూరుస్తున్నాయని డీఈ (ఆపరేషన్స్) విద్యాసాగర్ తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగంపై శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలు, బ్యాంకుల ద్వారా అందించే రుణ సదుపాయాలు, సోలార్ పవర్ వెండర్ల వివరాలను గృహ విద్యుత్ వినియోగదారులకు వివరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ ఎం.వినోద్‌రెడ్డి, ఏడీఈలు వేణుగోపాలాచార్యులు, శ్రీను, ఏఈలు హరికృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్, వేణు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీల రెఫరీగా గణేష్గట్టుప్పల్ : ఛత్తీస్‌ఘడ్ రాష్టం బిలాయిలో ఈ నెల రెండు నుంచి ఏడో తేదీ వరకు జరిగే జాతీయస్థాయి 45వ సబ్ జూనియర్స్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు రెఫరీగా గట్టుప్పల్‌కు చెందిన ఎరుకల గణేష్ ఎంపికై నట్లు బాల్ బ్యాండింటన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీవీ రమణ, రాష్ట్ర చీఫ్ రిఫరీ ఆర్.వెంకటరామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ ఎంపికపై అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. టి.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి. ఎ. బయ్యన్న, సంయుక్త కార్యదర్శి పి.జంగయ్య హర్షం వ్యక్తం చేశారు. -
మద్యపాన నిషేధంపై గ్రామస్తుల తీర్మానం
తిప్పర్తి : మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తూ శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు తీర్మానించారు. అనంతరం సర్పంచ్ ఉట్కూరి వాణి సందీప్‌రెడ్డితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. బెల్టు షాపులను పూర్తిగా బంద్ చేసేలా తీర్మానించారు. కొత్తపేటలో.. కేతేపల్లి: మండలంలోని కొత్తపేట గ్రామంలో ఈ నెల 9 నుంచి మద్య నిషేధాన్ని అమలు చేస్తూ శుక్రవారం గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యం అమ్మేవారికి గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు పంపిస్తామని, తీర్మానాన్ని ఉల్లఘిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని, సమాచారం అందించిన వారికి రూ.50వేలు బహుమతి అందిస్తామని సర్పంచ్ చింత విజయకృపాకర్ తెలిపారు. తీర్మానం ప్రతులను పోలీసులు, ఎకై ్సజ్ అంధికారులకు అందించారు. సమావేశంలో ఉపసర్పంచ్ నారగోని సంధ్యఉపేందర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి
మిర్యాలగూడ : దేశ రైతాంగ ఉద్యమ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందని, అదే స్ఫూర్తితో ప్రస్తుత రైతాంగ సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలని ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత 36వ రైతు మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో కార్మికులతో ఆయన సమావేశమమై మాట్లాడుతూ.. నల్లగొండ గడ్డ ఎన్నో రైతాంగ పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. రైతాంగ ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ మహాసభలు వేదికగా నిలుస్తాయన్నారు. రైతుల సమస్యలు కేవలం వారికే పరిమితం కాదని, వ్యవసాయంపై ఆధారపడిన కోట్లాది మంది ప్రజల జీవనంతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. మహాసభల విజయవంతం కోసం కార్మికులు, ప్రజలు విరాళాలు అందించి, ప్రచార కార్యక్రమాల్లో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, నంద్యాల వేణుధర్‌రెడ్డి, బద్యానాయక్, ధనావత్ భాగ్యనాయక్, రెడ్యనాయక్, అజ్మీరా హుష్యా, బాలు తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
తప్పుడు ప్రచారం మానుకోవాలి
భానుపురి(సూర్యాపేట) : నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచిన తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తాను టికెట్ అడగలేదని, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేనని, యూటర్న్ తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం నా స్పష్టమైన నిర్ణయమని, పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో స్వీకరిస్తున్నానని తెలిపారు. దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాల గురించి నేను గతంలో చెప్పిన విషయాలను ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలతో ముడిపెట్టి వక్రీకరించడం సరికాదని, పట్టభద్రుల సమస్యలకు బలమైన ప్రాతినిధ్యం వహించడం తన కర్తవ్యం పేర్కొన్నారు. ఇక రెండు పట్టభద్రుల సీట్లు రెడ్లకే ఇవ్వడంతో బీసీ వర్గాల్లో ఆగ్రహం వచ్చిందని, అందుకే కాంగ్రెస్ అభ్యర్థిని మార్చబోతోందని చేస్తున్న ప్రచారానికి కూడా ఎలాంటి ఆధారం లేదని పేర్కొన్నారు. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సష్టించే ఊహాగానాలను ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని, పట్టభద్రుల ఆశీస్సులతో ముందుకు సాగుతానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఫ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి -
వీజీఎఫ్ జామింగ్‌కు పరిష్కారం చూపాలి
మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో బొగ్గు సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న వీజీఎఫ్ల జామింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని టీజీ జెన్కో సీఎండీ హరీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని వైటీపీఎస్ను ఆయన శుక్రవారం సందర్శించి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. కోల్, యాష్ ప్లాంట్లలో కొనసాగుతున్న ఆపరేషనల్ పరిస్థితులు, పరికరాల పనితీరు, ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఆయన పరిశీలించారు. కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్‌లోని క్రషర్ హౌస్‌లో వైబ్రేటింగ్ గ్రిజ్లీ ఫీడర్స్ తరుచుగా జామ్ అవుతున్న అంశాన్ని ఆయన సమీక్షించారు. బొగ్గును క్రషర్‌లోకి పంపిచే క్రమంలో పెద్దరాళ్లు, పెద్ద ముక్కలు, మట్టిని నియంత్రించడానికి ఉపయోగించే వీజీఎఫ్లు జామ్ కావడంతో వాటిని క్లియర్ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని అధికారులు వివరించారు. వీజీఎఫ్లోకి వచ్చిన బొగ్గు, ఇతర పదార్థం సరిగా ముందుకు కదలకుండా ఇరుక్కుపోయి బంకర్లకు బొగ్గు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. ఈ సమస్యకు ప్రధాన కారణాన్ని సాంకేతికంగా గుర్తించి పరిష్కరించేందుకు వీజీఎఫ్ల డిజైన్, కాన్ఫిగరేషన్, ఆపరేటింగ్ పరిస్థితులు, మెటీరియల్ ఫ్లోను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అవసరమైన చోట బీహెచ్ఈఎల్ సాంకేతిక బృందంతో సమన్వయం చేసుకోని తగిన డిజైన్ మార్పులు, ఇంజనీరింగ్ మెరుగుదల చేపట్టాలన్నారు. బంకర్లకు బొగ్గు నిరంతరాయంగా సరఫరా అయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయంగా పనిచేసేలా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో టీజీ జెన్కో థర్మల్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వై.రాజశేఖర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ టీపీసీ పీవీ.శ్రీనివాస్, వైటీపీఎస్ స్టేజ్–1 చీఫ్ ఇంజనీర్ బి.సురేష్, స్టేజ్–2 చీఫ్ ఇంజనీర్ జె.సూర్యనారాయణతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.ఫ జెన్కో సీఎండీ హరీష్‌కుమార్ -
అందరూ గాంధీ బాటలో నడవాలి
నల్లగొండ : మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ గాంధీ బాటలో నడవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన నల్లగొండ రామగిరిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించడంలో ముఖ్యపాత్ర పోషించారని గుర్తు చేశారు. గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బాపూజీ చెప్పారని, వారి ఆదర్శాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం మూసీ దగ్గరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరున మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించిందని తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మహాత్మా గాంధీ బాటలో నడుస్తూ గ్రామపంచాయతీ నిధులను నేరుగా సర్పంచ్ల ఖాతాలో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో కుల, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి భారత స్వతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహానీయుడు మహాత్మాగాంధీ అని చెప్పారు. మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ అహింస, సత్యం అనే ఆయుధాలతో గాంధీ భారతదేశ స్వాతంత్రాన్ని సాధించారని, వారి అడుగుజాడల్లో అందరూ నడవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, తహసీల్దార్ పరశురాం, కార్పొరేటర్ కవిత పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
ఆడపడుచులకు.. చిలుకపచ్చ కోక
నల్లగొండ : బతుకమ్మ పండుగకు మహిళలు చిలుక పచ్చరంగులో మెరిసిపోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా ఏటా అందించే చీరలు ఈ సారి చిలుకపచ్చ రంగులో వచ్చేశాయి. పండుగ మరో 20 రోజులు ఉండగానే ముందస్తుగా జిల్లాకు చీరలు వచ్చాయి. మొత్తం 4 లక్షల చీరలు రావాల్సి ఉండగా.. ఇప్పటికే 2 లక్షల చీరలు వచ్చాయి. వాటిని గోదాముల్లో భద్రపరిచారు. మిగతా చీరలు త్వరలోనే రానున్నాయని అధికారులు చెబుతున్నారు. సద్దుల బతుకమ్మకు రెండ్రోజుల ముందుగానే పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పండుగ కానుక గత ప్రభుత్వ హయాం నుంచి మహిళలకు ఉచితంగా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆడపడుచులకు పండుగ కానుకగా చీరలను ఇవ్వాలని అప్పట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గతంలో రేషన్ కార్డులో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఈ చీరలను అందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి పంపిణీ చేస్తూ వస్తోంది. పాలపిట్ట రంగు నుంచి.. పథకాన్ని ప్రారంభించిన సమయంలో వివిధ రకాల డిజైన్లలో మహిళలకు బతుకమ్మ చీరలు అందించారు. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఒకే విధమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించి.. పాలపిట్ట రంగు చీరలను అందించారు. ఈసారి అందరికీ చిలుకపచ్చ రంగు చీరలు అందించాలని డిజైన్ చేయించింది. సెప్టెంబర్ చివరి నాటికి చీరలను సరఫరా చేసి పండుగకు రెండు, మూడు రోజుల ముందు పంపిణీ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫ బతుకమ్మ పండుగకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం ఫ జిల్లాకు చేరిన 2 లక్షల చీరలు -
పత్తి రైతు చిత్తు..
నాకున్న రెండున్నర ఎకరాలకు తోడు.. మరో ఏడున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేశాను. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో పత్తి చేను ఎదగలేదు. ప్రస్తుతం ఒకటి రెండు కాయలు ఉన్నా.. వాటిని కోతులు పీకేస్తున్నాయి. పత్తి విత్తనాలు, దున్నకం, కౌలు ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.4 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. దిగుబడి మాత్రం ఏమీ లేదు. వ్యవసాయం చేయడానికి ఎద్దులను కూడా కొనుగోలు చేశా.. వాటికి అదనంగా లక్షా ఇరవై వేల రూపాయలు అయ్యింది. చివరికి అప్పుల పాలయ్యాను. – నేలపట్ల హరిబాబు, రైతు పజ్జూరు నేను మూడు ఎకరాల భూమిలో పత్తి సాగు చేశాను. సుమారు రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. వర్షాలు లేక పత్తి చేను పూర్తిగా వాడుబట్టి ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కో మొక్కకు 3, 4 కాయలు కాసి చేను పెరగలేదు. ఎకరానికి ఒక క్వింటా కూడా పత్తి వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి పూర్తిగా పోయినట్టే. ఇప్పుడు పత్తి ఏరితే కూలీలకు చెల్లించే డబ్బులు కూడా రావు. అందుకే వదిలేశాను. –రమేష్, రైతు, వెంకటాద్రిపాలెం, హాలియా మండలం,నల్లగొండ అగ్రికల్చర్ : ఆకాశం వైపు ఆశగా చూసిన రైతన్నకు ఈసారి నిరాశే మిగిలింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పత్తి చేను కళ్ల ముందే వాడిపోతుంటే రైతుల గుండె తరుక్కుపోతోంది. ఎకరానికి పది క్వింటాళ్లైనా వస్తుందనుకున్న దిగుబడి, కనీసం రెండు క్వింటాళ్లు కూడా దాటే పరిస్థితి లేకపోవడంతో పత్తి రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. కూలీ ఖర్చులు కూడా దక్కని దైన్యస్థితిలో.. పండిన పంటను చేనులోనే వదిలేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. 6 లక్షల 40 వేల ఎకరాల్లో పత్తి సాగు జూన్‌లో కురిసిన తొలకరి జల్లులకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఎంతో ఆశతో సుమారు 6 లక్షల 40 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ, జులై నెలలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో చేలు వాడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు మొదటి వారంలో చిరుజల్లులు కురవడంతో రైతుల ఆశలు మళ్లీ చిగురించాయి. అప్పుచేసి మరీ గుంటుకలు తోలి, ఎరువులు వేశారు. పత్తి మొక్కలు కాస్త పెరిగి పూత, కాయ దశకు చేరుకోవడంతో.. ఈ ఏడాదైనా రెండు కాసులు కళ్లజూసి ఆర్థికంగా నిలదొక్కుకుంటామని కలలు కన్నారు. కానీ, ఆ రైతుల ఆశలపై ‘ఎల్‌నినో’ రూపంలో ప్రకృతి కోలుకోలేని దెబ్బకొట్టింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో మొక్కల ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. వారం క్రితం మోస్తరు వర్షాలు కురిసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే కాయ దశలో ఉన్న పత్తి, అకాల వాతావరణ పరిస్థితుల వల్ల పగిలిపోయే దశకు చేరుకుంది. దానికి తోడు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో, చేతికొచ్చిన పత్తి నేలరాలిపోతోంది. పచ్చగా కళకళలాడాల్సిన చేలు వాడుబట్టి పూర్తిగా ఎండిపోతున్నాయి. ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి కష్టమే.. సరైన వర్షాలు కురిస్తే ఎకరానికి 5 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరానికి కనీసం 2 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. వచ్చిన ఆ కాస్త పత్తిని ఏరిద్దామనుకున్నా.. పత్తి తీసే కూలీల ఖర్చే ఎక్కువగా ఉంటోంది. దీంతో ఏం చేయాలో పాలుపోని రైతన్నలు ఆరుగాలం శ్రమించిన పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. జిల్లాలో ఏకంగా 70 శాతానికి పైగా పత్తి రైతుల పరిస్థితి ఇప్పుడు ఇలాగే దయనీయంగా ఉంది. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక ఆందోళన చెందుతున్నారు. ఫ వర్షాభావ పరిస్థితులతో ఎదుగుదల లేని పత్తి చేలు ఫ మూరెడు ఎత్తు పెరిగి మూడు నాలుగు కాయలకే పరిమితం ఫ తీవ్రంగా ఉన్న నష్టపోయిన రైతులు మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన ఏరుకొండ అంజయ్య అనే రైతు తనకున్న ఐదెకాల భూమితో పాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని వానాకాలంలో పత్తి సాగు చేశాడు. కౌలు ఎకరానికి రూ.22 వేలు చొప్పున చెల్లించడంతో పాటు పంట సాగుకు ఎకరానికి రూ.25 వేల చొప్పున ఖర్చు చేశాడు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పత్తి చేను మూరెడు వరకు మాత్రమే పెరిగి ఎదుగుదల నిలిచింది. ఒక్కో మొక్కకు 3, 4 కాయలు పడి అప్పుడే పత్తి పగిలింది. ఎకరానికి రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పత్తి ఏరాలంటే క్వింటాకు 1300 రూపాయల చొప్పున కూలీలకు చెల్లించాల్సి ఉంటుంది. పత్తి అమ్మితే క్వింటాకు రూ.6వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని పెట్టిన పెట్టుబడి చెల్లించిన కౌలు కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడిందని అంజయ్య ఆందోళన చెందుతున్నాడు. పెట్టుబడిపై ఆశలు వదులుకున్నా..ఎనిమిది ఎకరాల్లో పత్తి సాగు చేస్తే రూ.రెండు లక్షల పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు పత్తిని తీస్తే పెట్టుబడి సంగతి దేవుడెరుగు తీసిన కూలీల ఖర్చులు కూడా రావు. అందుకే ఒక్కదాన్నే పత్తిని తీస్తున్నా. వర్షాభావంతో చాలావరకు ఎండిపోయి దెబ్బతింది. ఇప్పుడు పగిలిన ఎంతో కొంత తెంచితే ఇంతటితోనే సరి. పత్తి చేలో పశువులను మేపాల్సిందే. గతేడాది ఇంతే పత్తిసాగు చేస్తే రూ.మూడు లక్షల లాభం వచ్చింది. ఇప్పుడేమో పెట్టుబడిపైనే ఆశలు వదులుకున్నా. – పద్మ ఉట్లపల్లి గుర్రంపోడు మండలం -
వైటీపీఎస్‌లో నిర్వహణ ప్రైవేట్‌కు!
మిర్యాలగూడ : దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ స్టేషన్ (వైటీపీఎస్)లో నిర్వహణ పనులను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీజీజెన్కో) పవర్‌మెక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ప్లాంట్ అవసరాలకు నిత్యం 70వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. సరిపడా బొగ్గు రవాణా జరగకపోవడంతో ఆర్థిక భారం పెరిగి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. ఆ భారాన్ని తప్పించేందుకు టీజీ జెన్కో ప్రైవేటీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. ప్లాంట్‌లోని ఐదు యూనిట్లలో బూడిద, బొగ్గు హ్యాండ్లింగ్ నిర్వహణ, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో సమగ్ర ఆపరేషన్ మెయింటనెన్స్ (ఓఎండీఎం) నిర్వహించేందుకు టెండర్లు ఆహ్వానించగా మూడు సంస్థలు పాల్గొన్నాయి. వాటిలో పవర్‌మెక్ సంస్థ టెండర్ దక్కించుకుంది. ఈ సంస్థ మూడేళ్లపాటు రూ.279.20 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఈ), డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేట్ సర్వీసెస్(బీఎస్ఈ) లిమిటెడ్‌కు సమాచారం అందించారు. పవర్‌ప్లాంట్‌కు బొగ్గు కొరత... యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌కు బొగ్గు కొరత ఏర్పడింది. దీంతో ఉత్పత్తి సగానికి పడిపోయింది. రోజుకు సుమారు 14 ర్యాక్‌ల బొగ్గు (70వేల మెట్రిక్ టన్నులు) అవసరం ఉండగా 5 నుంచి 7 ర్యాక్‌లు మాత్రమే బొగ్గు రావడంతో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బొగ్గు కొరత రాకుండా చూసేందుకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరాకు సింగరేణి, జెన్కో ప్రణాళికను రూపొందించాలని సంబంధిత సీఎండీలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటి నుంచైనా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ప్రతిరోజు 14ర్యాక్‌ల విద్యుత్ సరఫరా కొనసాగిస్తేనే 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఫ పలు విభాగాల్లో పనులు పవర్‌మెక్ సంస్థకు అప్పగింత -
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి
నల్లగొండ టౌన్ : చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే తొలగించాలని, ఎస్ఆర్ ప్రకియను నిలిపివేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం, సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఓటు హక్కు పరిరక్షణలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది ఓటర్లను తొలగించే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గురువారం వామపక్షాల ఆధ్వర్యంలో నల్లగొండలోని స్థానిక సుభాష్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, సయ్యద్‌హాషం, పుచ్చకాయల నర్సిరెడ్డి, గుండెబోయిన నాగేశ్వర్రావు, పబ్బు వీరస్వామి, వెంకటేశ్వర్లు, కెఎస్.రెడ్డి, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించి పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసింది. ఇక ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్న రాకేష్‌రెడ్డి పేరును బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. బీజేపీ.. అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైన వెంటనే ప్రచారం ఊపందుకోనుంది. 2027 మార్చిలో ముగియనున్న పదవీకాలంవరంగల్ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఓటర్ల నమోదు కోసం ఎన్నికల అధికారి, నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ షెడ్యూల్ ప్రకటించారు. ప్రస్తుతం పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రకటించింది. మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడైన సర్వోత్తమ్‌రెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దామోదర్‌రెడ్డి సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం అనారోగ్యంతో ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించింది. మూడు ఉమ్మడి జిల్లాల్లో క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రాకేష్రెడ్డినే మరోసారి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గ్రాడ్యుయేట్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎంపికకు బీజేపీ కసరత్తు బీజేపీ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. ఆశావహుల పేర్లను పరిశీలిస్తోంది. త్వరలోనే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఎమ్మెల్సీ అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేస్తుందని.. అదిష్టానం నిర్ణయానికి నాయకులంతా కట్టుబడి ఉంటామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో మొదలైన సందడి ఈసారి ప్రధాన ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ తమ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్ పేరును ఖరారు చేసింది. ఆయన క్షేత్రస్థాఽయిలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధీరావత్ రవినాయక్ కూడా ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు బాధ్యతను మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఆరుగురు మంత్రులపై పార్టీ అధిష్టానం పెట్టినట్లు తెలుస్తోంది. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి సీతక్క ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతలు తీసుకుని.. మూడు ఉమ్మడి జిల్లాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేయనున్నారు. అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇక ప్రచారంపై దృష్టి పెట్టనుంది. తొలుత పట్టభద్రుల ఓటర్ల నమోదుపై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయనుంది. ఇప్పటికే పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టారు. కాలనీల్లోని గ్రాడ్యుయేట్లకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఫ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ ఫ గెలుపు బాధ్యతను ఆరుగురు మంత్రులపై పెట్టిన అధిష్టానం ఫ బీఆర్ఎస్ నుంచి రాకేష్‌రెడ్డిని అధికారికంగా ప్రకటించడమే తరువాయి.. ఫ ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ శ్రేణులు ఫ అభ్యర్థి ఖరారుపై దృష్టిసారించిన బీజేపీ సాక్షి ప్రతినిధి, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫైల్ పేరు : రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి తల్లిదండ్రులు : రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, వరూధిని చదువు : ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ రాజకీయ పదవులు : 2012 నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పని చేస్తున్నారు. ఏఐసీసీ సభ్యుడిగా, తెలంగాణ పీసీసీ సభ్యుడిగా ఉన్నారు. -
పరిసరాలను పరిశుభ్రతతోనే రక్షణ
నల్లగొండ టూటౌన్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే ఆరోగ్యానికి రక్షణ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. బుధవారం నల్లగొండకు వచ్చిన ఆయన పాతబస్తీ హిందూపూర్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా రోడ్లను ఊడ్చారు. ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకొని స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హనుమాన్‌నగర్‌లోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత డీవీకే రోడ్డులోని చైతన్యపురి కాలనీలో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన తల్లిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వీరెళ్లి చంద్రశేఖర్, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, పోతెపాక లింగస్వామి, సైదులు, పోతెపాక సాంబయ్య, పెరిక మునికుమార్ ఉన్నారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్లే రైతులకు నష్టాలు
రామగిరి(నల్లగొండ) : రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత దుస్థితికి బీఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీల వైఫల్యాలే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లాలోని మేళ్ల దుప్పలపల్లి, తొరగల్లు, చిన మాదారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సదంర్భంగా ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చి, తీరా 3 నుంచి 4 గంటలే ఇస్తోందని మండిపడ్డారు. అరకొర విద్యుత్ సరఫరా వల్ల పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫసల్ భీమా యోజన అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు పరిహారం అందకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి, మండల అధ్యక్షుడు భోగరి అనిల్‌కుమార్, నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, పిల్లి రామరాజుయాదవ్, బండారు ప్రసాద్, మేళ్ల దుప్పలపల్లి సర్పంచ్ కోమటిరెడ్డి సంధ్యారాణి పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి కనగల్ : ఎండిన పంటలకు పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని చిన్నమాదారం వద్ద ఎండిన పొలాలను ఆయన పరిశీలించి గ్రామపంచాయతీ వద్ద రైతులతో ముఖాముఖి మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. అంతకుముందు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి కరెంటు సరఫరా వివరాలను తెలుసుకున్నారు. ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు -
ఆస్పత్రిలో సేవలు మెరుగు పరుస్తాం
నాగార్జునసాగర్ : కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలను మెరుగు పరుస్తామని నల్లగొండ జిల్లా వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ భానుప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన సాగర్ ఏరియా ఆస్పత్రిని సందర్శించి ఓపీ, వివిధ వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు రాత్రి వేళల్లోనూ వైద్యులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరికృష్ణ, ఆర్ఎంఓ అనిత వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మద్యవర్తులను నమ్మొద్దునల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 3వ తేదీన ముగుస్తుందని, నియామకాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మద్యవర్తులను నమ్మి మోసపోవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.రాహుల్ అభ్యర్థులకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుద చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులు, విద్యార్హతలు, ఖాళీల సంఖ్య, రిజర్వేషన్లు, ఇతర నిబంధన ప్రకారం నియామక ప్రక్రియ నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. వాలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలినల్లగొండ టూటౌన్ : పార్లమెంట్లో ఆమోదించిన పెన్షన్ రూల్స్ (వాలిడేషన్) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసిసోయేషన్ జిల్లా అధ్యక్షుడు నూకల జగదీశ్చంద్ర డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్ నకరా తీర్పును గౌరవించి ప్రతి పే కమిషన్‌లో పెన్షన్ రివిజన్‌ను నిర్ధారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏఓ మోతీలాల్‌కు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్, గౌరవాధ్యక్షుడు ఎండీ.అబ్దుల్ ఖాధర్, కుకుడాల గోవర్ధన్, పాతూరి విద్యాసాగర్‌రెడ్డి, గుండాల భిక్షమయ్య, రాపోలు వెంకటేశం, పులి కృష్ణమూర్తి, మిర్యాల కేశవులు, జి.సత్యనారాయణ, పరశురాములు, కంచర్ల అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన శిక్షణరామగిరి(నల్లగొండ) : నాగార్జున ప్రభుత్వ కళాశాలలోని వాణిజ్య, మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, ఐబీఎం స్కిల్స్ బిల్డ్ సంయుక్త సహకారంతో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అంశంపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో బీబీఏ, బీకామ్ విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొని శిక్షణ పొందారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. -
గ్రాడ్యుయేట్స్.. పెరిగేనా!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనకు నోటిఫికేషన్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు ముందడుగు పడింది. ఓటరు జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2027 మార్చిలో ఖాళీ కానున్న ఈ ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుతం ఓటర్ల జాబితాను రూపొందించనున్నారు. ఈ ఏడాది నవంబరు 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించింది. అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం–18 ద్వారా నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు కూడా ప్రస్తుతం ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తగ్గిపోయిన ఓటర్ల సంఖ్య ఈ నియోజకవర్గంలో పట్టభద్రులైన ఓటర్ల సంఖ్య తగ్గుతోంది. 2021 ఫైనల్ జాబితాలో 5,05,565 మంది ఓటర్లు ఉండగా, 2024 మే 27న జరిగిన ఉప ఎన్నిక సమయానికి ఈ సంఖ్య 4,63,839కు తగ్గింది. ఈ రెండు జాబితాల మధ్య ఓటర్ల సంఖ్యలో 41,726 తగ్గుదల నమోదైంది. ఇప్పుడు కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈసారి ఎంతమంది జాబితాలో చేరుతారన్నది ఆసక్తికరంగా మారింది. 2021 జాబితాలో 5.05 లక్షల మంది 2021 ఫైనల్ జాబితా ప్రకారం నియోజకవర్గంలో 731 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పురుష ఓటర్లు 3,32,634, మహిళా ఓటర్లు 1,72,864, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 67 మంది ఉన్నారు. మొత్తం 5,05,565 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లాలోనే 90,826 మంది ఓటర్లు ఉండగా, సూర్యాపేటలో 61,624 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 38,367 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 3,85,996 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2024 ఉప ఎన్నికల్లో 4.63 లక్షలకు తగ్గిన ఓటర్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. 2024 మే 27వ తేదీన జరిగిన ఉప ఎన్నిక నాటికి నియోజకవర్గ పరిధిలో 12 జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓటర్ల సంఖ్య 4,63,839కు తగ్గిపోయింది. అందులో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మహిళలు, ఐదుగురు ట్రా్న్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. ఆ సమయంలో నల్లగొండలో 80,871 మంది ఓటర్లు ఉండగా, సూర్యాపేటలో 51,497 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 34,080 మంది ఓటర్లుగా నమోదయ్యారు. 2024 ఉప ఎన్నికలో మొత్తం 4,63,839 మంది ఓటర్లలో 3,36,013 మంది ఓటు వేశారు. నల్లగొండలోనూ తగ్గుదల.. 2021తో పోలిస్తే 2024 నాటికి నల్లగొండలో పట్టభద్ర ఓటర్ల సంఖ్య 90,826 నుంచి 80,871కు తగ్గింది. అంటే 9,955 మంది తగ్గారు. ఇదే సమయంలో సూర్యాపేటలో 61,624 నుంచి 51,497కు, యాదాద్రి భువనగిరిలో 38,367 నుంచి 34,080కు ఓటర్ల సంఖ్య తగ్గింది. ఫ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ తగ్గిపోతున్న ఓటర్లు ఫ 2021తో పోల్చితే 2024లో 41 వేలకు పైగా తగ్గుదల ఫ ఈసారి పెరుగుతారా.. తగ్గుతారా..తేలాల్సి ఉన్న లెక్క! ఇదీ కొత్త ఓటర్ల జాబితా రూపకల్పక షెడ్యూల్ సెప్టెంబరు 28 : నోటిఫికేషన్ జారీ నవంబర్ 6వ తేదీ వరకు : ఓటరు నమోదు దరఖాస్తులకు చివరి గడువు నవంబర్ 25 : ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు : క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరణ డిసెంబర్ 25వ తేదీలోగా : క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం డిసెంబర్ 30వ తేదీన : తుది ఓటర్ల జాబితా ప్రకటన -
‘ఆరోగ్యశ్రీ’కి నిధుల గ్రహణం
మిర్యాలగూడ అర్బన్ : పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలవాల్సిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకేసింది. ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో నల్లగొండ జిల్లాలోని ప్రధాన ఏరియా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో కీలక వైద్య కేంద్రాలైన మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఏరియా ఆస్పత్రుల్లో నిధుల కొరత కారణంగా ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు) బంద్ చేశారు. చేసిన చికిత్సలకు సంబంధించి గత 20 నెలలుగా ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల కాకపోవడంతో.. ఆపరేషన్లకు అవసరమైన ఖరీదైన పరికరాలు, సర్జికల్ సామగ్రిని కొనుగోలు చేయలేక ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. ప్రైవేట్‌లో దోపిడీ.. ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్న భరోసాతో పెద్దాస్పత్రులకు వస్తున్న నిరుపేద రోగులకు నిరాశే ఎదురవుతోంది. నిధులు లేవనే కారణంతో వైద్యులు ఆపరేషన్ల తేదీలను వాయిదా వేస్తుండటం, కొత్త కేసులను చేర్చుకోకపోవడంతో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందకపోవడంతో గత్యంతరం లేక పేదలు ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా పలు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అంటూనే.. ముందస్తు వైద్య పరీక్షల (డయాగ్నస్టిక్స్) పేరుతో వేల రూపాయలు గుంజుతున్నాయని బాధితులు వాపోతున్నారు. నిధుల్లేక ఆపరేటర్లపై వేటు..? ఆస్పత్రులకు వచ్చే రోగుల వివరాల నమోదు, ఆరోగ్యశ్రీ కార్డుల ధృవీకరణ, చికిత్సల సమన్వయం, ఆపరేషన్ తర్వాత రోగుల పర్యవేక్షణ, బస్సు చార్జీల పంపిణీ వంటి కీలక విధులను డేటా ఎంట్రీ ఆపరేటర్లు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో మొత్తం 14 మంది ఆపరేటర్లు పనిచేస్తుండగా.. ఆస్పత్రులకు వచ్చే ఆరోగ్యశ్రీ నిధుల నుంచే వీరికి వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 20 నెలలుగా నిధులు రాకపోవడంతో వీరికి జీతాలు అందడం లేదు. దీంతో చేసేది లేక ఆపరేటర్లను విధుల నుంచి తొలగించేందుకు వైద్యశాఖ వర్గాలు సిద్ధమైనట్లు సమాచారం.ఫ 20 నెలలుగా విడుదల కాని బిల్లులు ఫ ఏరియా ఆస్పత్రుల్లో నిలిచిన శస్త్రచికిత్సలు ఫ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో పరీక్షల పేరుతో దోపిడీ ఫ ఇబ్బందులు పడుతున్న రోగులు మిర్యాలగూడ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ చికిత్సలు.. నెల చికిత్సలు జనవరి 136 ఫిబ్రవరి 135 మార్చి 140 ఏప్రిల్ 185 మే 134 జూన్ 104 జూలై 115 ఆగస్టు 35 సెప్టెంబర్ 00 జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్య సేవలు అందడం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో ఆపరేషన్లకు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిధుల విడుదల అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. ప్రైవేట్ ఆస్పత్రుల మాదిరిగానే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేసేలా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. – డాక్టర్ భానుప్రసాద్ నాయక్, డీసీహెచ్ఎస్, నల్లగొండ -
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
నల్లగొండ టౌన్ : విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఉన్నతంగా చదివి మంచిస్థాయికి చేరుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.రాహుల్ ఆకాంక్షించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ జూనియర్ కళాశాల, ఒకేషనల్ కళాశాల ప్రాంగణంలో సోమవారం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వాడటం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబం నష్టపోతాయన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ పద్మ, డీపీఓ డాక్టర్ జమీర్, డీఎంఓ డాక్టర్ నగేష్, కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. చౌటుప్పల్ మండల పరిధిలోని తూప్రాన్‌పేట నుంచి ఖైతాపురం మధ్య సోమవారం ట్రాఫిక్ స్తంభించింది. దండుమల్కాపురం గ్రామం వద్ద రోడ్డు మరమ్మత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తూప్రాన్‌పేట నుంచి ఖైతాపురం వరకు ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు చాలా నెమ్మదిగా కదిలాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎగువ భాగంగా నెలకొన్న వాహనాల రద్దీ ప్రభావం దిగువన ఉన్న పట్టణ కేంద్రంపైనా చూపింది. -
జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం!
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలులో ఓ ఖైదీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సోమవారం సాయంత్రం జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బాబురావు పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గుర్తించిన తోటి ఖైదీలు జైలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అతడిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్టమక్ వాష్ నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. జైలర్ తిట్టడంతోనే తాగానన్న ఖైదీ.. బాబురావు మోత్కూరులో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులోకి తంబాకు వచ్చిన ఘటనకు తానే కారణమంటూ జైలర్ అచ్చయ్య తనను తిట్టడంతో మానసిక వేదనకు గురయ్యానని బాబురావు మీడియాకు తెలిపాడు. ఈ కారణంగానే జైలు సూపరింటెండెంట్ బీరువాలో ఉన్న పురుగుల మందును తీసుకుని తాగినట్లు బాబురావు తెలిపాడు. జైలులో కూరగాయలు, ఇతర మొక్కల పెంపకం కోసం పురుగుల మందులను తీసుకొచ్చి భద్రపరిచినట్లు తెలుస్తోంది. అయితే ఖైదీకి ఆ మందు ఎలా అందుబాటులోకి వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం బాబు రావుకు నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అధికారుల వివరణ మరోలా.. బాబురావు ఆత్మహత్యాయత్న విషయాన్ని జైలు అధికారులు మాత్రం ఖండిస్తున్నారు. రెండు రోజులుగా బాబురావు అనారోగ్యంతో ఉన్నాడని, సోమవారం కిందపడిపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని జైలర్ బాలకృష్ణ తెలపడం గమనార్హం. పురుగుల మందు తాగిన ఖైదీ బాబురావు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స జైలర్ అచ్చయ్య తిట్టడంతోనే మనస్థాపానికి గురయ్యానన్న ఖైదీ ఆత్మహత్యాయత్నం చేసుకోలేదు అంటున్న జైలు అధికారులు -
బస్సు డిపో గ్యారేజీలో స్వల్ప అగ్నిప్రమాదం
రామగిరి(నల్లగొండ): నల్లగొండలోని ఆర్టీసీ డిపో గ్యారేజీలో ఆదివారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. గ్యారేజీలో బస్సు మరమ్మతు పనులు చేపడుతున్న సమయంలో అనుకోకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో డిపో ప్రాంగణంలో కలకలం రేగింది. అయితే, అక్కడే ఉన్న గ్యారేజీ సిబ్బంది వెంటనే తేరుకుని గారేజీలో ఉన్న ఫైర్ సేఫ్టీ యంత్రాలను ఉపయోగించి మంటలను ఆర్పారు. సిబ్బంది సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందని, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. లారీ డ్రైవర్‌కు జైలుశిక్షమునగాల: మండల కేంద్రంలోని జాతీయ రహదారి–65పై గల యూటర్న్ వద్ద ఈనెల 25న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడిన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పెద్దపోగు అవినాష్‌ను సోమవారం కోదాడ కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోదాడ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎండి.ఉమర్ సదరు లారీ డ్రైవర్‌కు ఒక్కరోజు జైలుశిక్ష, రూ.రెండువేల జరిమానా విధించినట్లు మునగాల ఎస్ఐ మల్లు సంజీవరెడ్డి తెలిపారు. -
సీఈసీని పదవి నుంచి తొలగించాలి
ఫ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఫ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నానల్లగొండ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ డిమాండ్ చేశారు. సోమవారం డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ ఆధ్వర్యంలో నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ సీఈసీ సామాన్య ఓటర్లను జాబితాల నుంచి తొలగించి బీజేపీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్ల తొలగింపు జరిగిందని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల జాబితాల్లో అవకతవకలు, ‘ఓటు చోరీ’ ఆరోపణలను ప్రస్తావిస్తున్నారని గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ మాట్లాడుతూ ఎన్నికల అధికారి బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. సీఈసీని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందజేసి.. జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు చామల శ్రీనివాస్, జిల్లపల్లి పరమేష్, బోడ స్వామి, ముంతాజ్ అలీ, లింగాల వెంకన్న, దొండ రమేష్, గుడిపాటి లక్ష్మీనారాయణ, అజీజ్, గణేష్, అరుణ, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
కుళాయి.. బిల్లు బకాయి
నగరంలో భవనాలకు, కుళాయి కలెక్షన్లకు పొంతన సరిపోవడం లేదు. కొన్ని నెలల క్రితం సర్వే నిర్వహించి అక్రమంగా పెట్టుకున్న కనెక్షన్లను గుర్తించి క్రమబద్ధీకరించారు. దాంతో గతంలో 19 వేలు ఉన్న కుళాయి కనెక్షన్లు ఇప్పుడు 33 వేలకుపైగా పెరిగాయి. దాంతో డిమాండ్ కూడా పెరిగింది. పాత బకాయిలను మొత్తం వసూలు చేస్తే కార్పొరేషన్‌కు బకాయిలు లేకుండా తాజా ఏరియర్స్ బిల్లులు మాత్రమే ఉంటాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి స్పెషల్ డ్రైవ్ చేపట్టి బకాయిలు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలో కుళాయి బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. తాగు నీరు పుష్కలంగా ఇస్తున్నా ప్రజలు బిల్లులు మాత్రం చెల్లించడంలేదు. ఇప్పటివరకు రూ.27.10 కోట్లు వరకు బకాయిలు ఉన్నాయి. నగరంలోని 48 డివిజన్ల పరిధిలోని కాలనీల్లో మొత్తం 33,247 నల్లా కలెక్షన్లు ఉండగా అందులో వాణిజ్య కనెక్షన్లు 161 ఉన్నాయి. నివాస గృహాలకు అయితే నెలకు రూ.100, వాణిజ్య అవసరాలకు అయితే నెలకు రూ.600 బిల్లులు చెలించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి రెండు దశాబ్దాలుగా కుళాయి బిల్లులపై సరైన పర్యవేక్షణ పెట్టకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ లెక్కల ప్రకారం చూస్తే ప్రస్తుతం నల్లా బిల్లు సంవత్సర డిమాండ్ రూ.4.6 కోట్ల వరకు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.101.43 లక్షల వరకు వసూలైంది. పాత బకాయిలపై స్పెషల్ డ్రైవ్ ఏదీ.. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఖర్చులు పెరుగుతున్న దానికి అనుగుణంగా ఉన్న వనరులను ఉపయోగించుకొని రాబడి పెంచుకోవడంలో సంబంధిత అధికారులు దృష్టి సారించడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఉదయ సముద్రం నుంచి నగరంలోని ఇళ్లకు తాగు నీటి సరఫరా చేస్తున్నా వారి నుంచి కుళాయి బిల్లులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు. పాత బకాయిలు రూ.23.59 కోట్లు పేరుకుపోయినా వాటి వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టడం లేదు. తాగునీటి కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం కుళాయి బిల్లులు కూడా వసూలు చేసుకోలేని స్థితిలో ఉండడంపై సర్వత్రా విమర్శలువస్తున్నాయి. పట్టించుకోని ఇంజనీరింగ్ విభాగం... కుళాయిల కలెక్షన్లు, బిల్లులపై గతంలో సర్వే పలుమార్లు సర్వే నిర్వహించారు. ఎవరు ఎంత బకాయి ఉన్నారు అనే వివరాలతో ఇంటింటికి తిరిగితే బిల్లులు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. పాత బకాయిలను ఇంజనీరింగ్ విభాగం అధికారులు, తాగునీటి సరఫరా సిబ్బంది పట్టించుకోని కారణంగానే బకాయిలు పేరుకుపోయిందనేది బహిరంగ రహస్యమే. నల్లా బిల్లులు నిరంతరం వసూలు చేస్తున్నాం. పాత బకాయిలను కూడా వసూలు చేస్తున్నాం. బకాయిల ను గుర్తించి సిబ్బంది ఇంటింటికి వెళ్లి వసూలు చేస్తున్నారు. నగరవాసులు కుళాయి బిల్లులు తప్పనిసరిగా చెల్లించి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలి. – దిలీప్భార్గవ్, మున్సిపల్ ఏఈఫ నీలగిరి నగరంలో నల్లా బిల్లుల బకాయి రూ.27.10 కోట్లు ఫ బిల్లులు చెల్లించకుండా వినియోగదారుల నిర్లక్ష్యం ఫ సీరియస్‌గా దృష్టి పెట్టని కార్పొరేషన్ యంత్రాంగం -
పేదల కడుపు నింపేలా పనిచేస్తున్నాం
మిర్యాలగూడ : పేదల కడుపు నింపడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన చేపట్టిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లకాలంలో ఏ ఒక్క పేదవారిని కూడా రేషన్‌కార్డులు ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే పేదలందరికీ రేషన్‌కార్డులు ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేదలు దొడ్డు బియ్యం తినలేక నానా అవస్థలు పడ్డారని, కానీ ప్రజా ప్రభుత్వం సన్నబియ్యం అందించి పేదలు కడుపునిండా భోజనం చేసేలా చూస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.48కోట్ల మందికి, మిర్యాలగూడ నియోజకవర్గంలో 2.99లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో సైతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకోవడం తగదన్నారు. సాగర్‌లో నీటి నిల్వ తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బంది రాకుండా చెరువులను నింపుతూ ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకుంటున్నామన్నారు. ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడకుండా నీరందించి ఆదుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం రూ.878 కోట్లతో లిఫ్టు పనులకు శంకుస్థాపన చేసి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.175కోట్లు విడుదల చేసి పనులను వేగవంతం చేశామన్నారు. మిర్యాలగూడలో ఇంటిగ్రేటెడ్ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని, పెండింగ్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పనులను సైతం వేగవంతం చేస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రమణారెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం రాంపతి, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీషనవీన్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఫ ఆయకటు రైతులను ఆదుకుంటాం ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
ప్రకృతి వ్యవసాయంతో అధిక ఆదాయం
గరిడేపల్లి : ప్రకృతి వ్యవసాయంతో తక్కువ వ్యయంతోనే అధిక ఆదాయం పొందవచ్చని కేవీకే శాస్త్రవేత్త సీహెచ్.నరేష్ అన్నారు. సోమవారం జిల్లా వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజ మాన్య సంస్థ (ఆత్మ), హుజూర్నగర్ డివిజన్ ఆధ్వర్యంలో రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ (ఆర్పీఎల్) కార్యక్రమంలో భాగంగా గడ్డిపల్లి కేవీకేలో ప్రకృతి వ్యవసాయంపై సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్చార్జి డి.నరేష్ ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలను సాగు చేసే విధానాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే సమగ్ర వ్యవసాయ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణలో భాగంగా వివిధ పంటలకు ఉపయోగించే ద్రావణాలు, కషాయాలను రైతుల చేత స్వయంగా తయారు చేయించి, వాటిని పంటల్లో వినియోగించే విధానంపై ప్రాయోగిక శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ జి.నివేదిత, ఆర్.రవి, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ పి.అక్షిత్ సాయి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి
నల్లగొండ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెటిట వారం రోజుల్లో పరిష్కరించాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల, డివిజన్ స్థాయిలో ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను కూడా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యను అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో మొత్తం 148 ఫిర్యాదులు అందాయని.. ఇందులో రెవెన్యూ శాఖకు 66, ఇతర శాఖలకు 82 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ దశరథ్, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి -
మహిళా రోగిని నెట్టేసిన వైద్యుడు
కోదాడ: చికిత్స కోసం ఆసుపత్రికికు వచ్చిన రోగి పట్ల ఓ వైద్యుడు అమానుషంగా ప్రవర్తించాడు. వృద్ధ మహిళ అని కూడా చూడకుండా నెట్టివేశాడు. దీంతో సదరు మహిళ కిందపడిపోయి తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో వెళ్లింది. తలకు గాయమై తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆమెను వైద్యశాల సిబ్బందే చికిత్స కోసం ఖమ్మం తరలించారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. రోగి కుమారుడు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం చెరువుతండాకు చెందిన పరింగిని తన కుమారుడు చందుతో కలిసి మఠంపల్లిలో నివాసం ఉంటోంది. తల్లికి ఆయాసం రావడంతో చందు సోమవారం ఉదయం కోదాడ పట్టణంలోని శ్యామల నర్సింగ్‌హోంకు తీసుకొచ్చాడు. పరిశీలించిన వైద్యుడు సైదానాయక్ కొన్ని పరీక్షలు రాశాడు. వాటిని చేయించుకొని రిపోర్టులు తీసుకొని మధ్యాహ్నం వైద్యుడు వద్దకు వెళ్లారు. తాను లంచ్‌కు వెళుతున్నానని చెప్పడంతో ఇంటి వద్ద చిన్నపిల్లలు ఉన్నారని, తాము ఇంటికి వెళ్లాలని మందులు రాయమని బతిమిలాడుతుండగా ఆవేశానికి లోనైనా వైద్యుడు తన తల్లి పరింగినిని నెట్టివేశాడు. దీంతో కిందపడిన ఆమె తలకు తీవ్ర గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు ఆమె కాలు కూడా విరిగిందని కుమారుడు చందు అంటున్నాడు. చికిత్సకు తరలించిన వైద్యశాల సిబ్బందితీవ్ర గాయాలపాలైన పరింగినిని శ్యామల వైద్యశాల సిబ్బందే హుటాహుటీని చికిత్స కోసం స్థానికంగా మరో వైద్యశాలకు తరలించారు. తలకు ఎంఆర్ఐ స్కాన్ చేయడంతో రక్తం గట్టట్టిందని, మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్లాలని చెప్పడంతో శ్యామల నర్సింగ్‌హోం సిబ్బందే ఆమెను అంబులెన్స్‌లో ఖమ్మం తీసుకెళ్లారని బంధువులు తెలిపారు. ప్రస్తుతం సదరు రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న కోదాడ పట్టణ సీఐ శంకర్‌నాయక్ సిబ్బందితో వైద్యశాల వద్దకు వెళ్లి పరిస్థితిని అదుపు చేశాడు. చందు కోదాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. కిందపడి తలకు గాయాలపాలైన రోగి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం జిల్లా కేంద్రానికి తరలింపు కోదాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన బాధిత మహిళ కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు -
బత్తాయిలో వేసవి పంట యాజమాన్య పద్ధతులు
గుర్రంపోడు : కాయల కోతలు ముగిసి విశ్రాంతి దశలో ఉన్న బత్తాయి తోటల్లో వేసవి పంట సాధనకు ఇదే సరైన సమయం. వర్షాకాలంలో వచ్చే కాయలతో పోలిస్తే, వేసవిలో లభించే పంటకు రెండింతల అధిక ధర లభిస్తుంది. ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉన్నందున, రైతులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వేసవిలో అధిక దిగుబడి పొందాలంటే ఈ నెలలోనే చెట్లను వాడుపట్టాలి. తగిన యాజమాన్య మెళకువలు పాటించడం ద్వారా మంచి దిగుబడి, లాభాలు పొందవచ్చని హాలియా ప్రాంతీయ ఉద్యానవన శాఖ అధికారి మురళి రైతులకు సూచిస్తున్నారు. లేత తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు– తోటలను దున్నడం, పాదులు తవ్వడం, ఎండు పుల్లలను తొలగించడం వంటి పనులను పూర్తిచేయాలి. – ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో నీటి తడులు ఆపివేసి చెట్లను వాడుకు గురిచేయాలి. – ప్రతి చెట్టుకు 40 కిలోల పశువుల ఎరువు (లేదా 10 కిలోల వర్మి కంపోస్ట్), 3.5 కిలోల ఆముదం లేదా వేప పిండి, 600 గ్రాముల యూరియా, 900 గ్రాముల సింగిల్ సూపర్ పాస్ఫేట్ మరియు 400 గ్రాముల పొటాష్‌ను పాదులో సమంగా వేయాలి. – ఎరువులు వేసిన తర్వాత తడులు ఇస్తే లేదా మంచి వర్షం కురిస్తే చెట్లు పూతకు వస్తాయి. ఈ పూత ద్వారా వచ్చే కాయలు మే నెలలో కోతకు వస్తాయి. ముదురు తోటల్లో ఇలా.. – ప్రస్తుతం కాపునిస్తున్న ముదురు తోటల్లో ప్రతి చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వేప లేదా ఆముదం పిండి, 750 గ్రాముల యూరియా, 1200 గ్రాముల సింగిల్ సూపర్ పాస్ఫేట్ మరియు 500 గ్రాముల పొటాష్ అందించాలి. – కొత్తగా వచ్చే చిగుర్లు, రెమ్మలను కాపాడుకోవడానికి లీటరు నీటికి 1.5 మి.లీ మోనోక్రోటోఫాస్ మందును పిచికారీ చేయాలి. – లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్, 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 2 గ్రాముల మాంగనీస్ సల్ఫేట్, 2 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము బోరాక్స్, 6 గ్రాముల సున్నం, 10 గ్రాముల యూరియా కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.వర్షాకాలంలో ఆశించే చీడపీడల నివారణ గజ్జి తెగులు: ఆకులు, కొమ్మలపై పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి కాయలు రాలిపోతాయి. నివారణ: 10 లీటర్ల నీటికి 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్, 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి 20 రోజులకు ఒకసారి రెండుసార్లు పిచికారీ చేయాలి. కాయ తొడిమ కుళ్లు తెగులు: తొడిమ చుట్టూ మచ్చ ఏర్పడి కాయలు కుళ్లిపోతాయి. నివారణ: నెలకోసారి గ్రాము కార్బండిజమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దోమకాటు: రాత్రివేళల్లో దోమలు కాయల రసాన్ని పీల్చడం వల్ల కాయలు కుళ్లిపోతాయి. నివారణ : తోటలో రాత్రిపూట లైట్లు పెట్టి, ప్లేట్లలో 1 మి.లీ మలాథియాన్, 1 శాతం చక్కెర, పండ్లరసం కలిపిన విషపు ఎరను ఉంచాలి. అంతరకృషి పనులకు సమయమిదే.. రైతులకు ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారి మురళి సూచన -
సీఎంఆర్‌ను బాయిల్డ్ రైస్‌గా తీసుకోవాలి
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికిరైస్ మిల్లర్స్ వినతి మిర్యాలగూడ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను బాయిల్డ్‌రైస్‌గా తీసుకోవాలని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. సోమవారం మిర్యాలగూడకు వచ్చిన మంత్రిని మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి విన్నవించారు. ప్రసుత వానాకాలం సీజన్ 2026–27 సన్నరకం ధాన్యం మిల్లులకు రావడం ప్రారంభమైందని.. గోదాముల్లో సీఎంఆర్ ధాన్యంతో ఉండడం వల్ల సన్నరకం ధాన్యం నిల్వ చేసుకునేందుకు స్థలం కొరత ఏర్పడుతోందన్నారు. తమ వద్ద ఉన్న సీఎంఆర్ ధాన్యం మొత్తం బాయిల్డ్ రైస్ తీసుకునే విధంగా సహకరించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, వెంకటరమణచౌదరి, బండారు కుశలయ్య, గంజి రాము, గోళ్ల రామశేఖర్, హేమనాద్, పొలిశెట్టి ధనుంజయ పాల్గొన్నారు. -
రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక
నల్లగొండ టూటౌన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈనెల 30న నల్లగొండకు రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 9.15 గంటలకు రాంచందర్‌రావు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి నల్లగొండ మండలంలోని మేళ్ల దుప్పలపల్లి, తొరగల్లు, చిన్న మాధారం గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడుతారని పేర్కొన్నారు. ఎంజీయూలో ప్లేస్మెంట్ డ్రైవ్నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం రెగల్ రెక్స్నార్డ్ సంస్థ సహకారంతో ప్లేస్మెంట్ డ్రైవ్–2026 నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాలకు చెందిన 130 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు తొలిదశలో నిర్వహించిన ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో పాల్గొన్నారు. ప్లేస్మెంట్ నిబంధనల ప్రకారం తదుపరి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపాల్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ హరీష్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ట్రైనింగ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ జి.మారేశ్వరరావు, జయంతి, వై.నాగరాజు, వేణుగోపాల్‌రెడ్డి, రేఖ తదితరులు పాల్గొన్నారు. పోషక విలువలతో ఆరోగ్యంనల్లగొండ : పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎఫ్‌సీఐ నల్లగొండ డీఎం సువీన్ కుమార్ అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎప్సీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్యకర వంటకాల పోటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిల్లెట్స్, పప్పుధాన్యాలు, కూరగాయలు తదితర పోషక ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. స్థానికంగా లభించే పోషక పదార్థాలతో ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేయడం ద్వారా పోషకాహారంపై అవగాహన పెంపొందించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు వివిధ రకాల ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. కార్యక్రమంలో ఏజీఎం రాఘవేంద్రసింగ్, దివ్య, గిరిష్మ, షాహిద్ ఖాన్, రూప, నరేష్, అనుష, వినిత, సుప్రియ, విద్యాసాగర్, సాజిత్, కలైసెల్వి, సతీష్‌రెడ్డి, రంజిత్, శ్రీకాంత్, అజయ్ పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన నాంపల్లి ఆర్ఐ
నాంపల్లి: నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న రాలబండ గోపరాజు సోమవారం ఓ రైతు నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ వెల్లడించారు. నాంపల్లి మండలంలోని ఓ రైతు ఫౌతి చేయించేందుకు నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)గా పనిచేస్తున్న గోపరాజు వద్దకు రాగా ఆయన రూ.20వేలు డిమాండ్ చేశాడు. దీంతో రూ.15వేలు ఇస్తానని సదరు రైతు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సోమవారం విధులు ముగించుకొని హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఎస్బీఐ బ్రాంచి సమీపంలో ఆర్ఐ గోపరాజు అసిస్టెంట్ అయిన ప్రైవేటు వ్యక్తి యాదగిరికి సదరు రైతు రూ.15 వేలు అందజేశారు. అనంతరం యాదగిరి చేతుల నుంచి ఆర్ఐ గోపరాజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడ్డ నిందితులను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పూర్తిస్థాయిలో విచారించారు. ఆర్ఐ గోపరాజుపై ఏ–1, ప్రవేట్ వ్యక్తి అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎదుల యాదగిరిపై ఏ–2గా కేసు నమోదు చేశారు. రాత్రి కావడంతో నిందితులను హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలుకు తరలించారు. మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. అయితే ఆర్ఐ గోపరాజు ఉంటున్న ఎల్బీ నగర్‌లోని తన నివాసంలో ఏసీబీ అధికారులు రైడ్ చేసినట్టు తెలిసింది. రూ.15వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన గోపరాజు ఆర్ఐతోపాటు అతడి అసిస్టెంట్‌పైనా కేసు నమోదు చర్లపల్లి జైలుకు తరలింపు -
రేపు ఇబ్రహీంపేటలో జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
నాగార్జునసాగర్ : ఈ నెల 29వ తేదీన అనుముల మండలం ఇబ్రహీంపేటలో జిల్లా జూనియర్, సీనియర్ మహిళా కబడ్డీ జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.భూలోకరావు, జి.కర్తయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాలికల విభాగంలో 20 సంవత్సరాల లోపు వయస్సు ఉండి 65 కిలోల లోపు బరువు ఉన్నవారు, సీనియర్ విభాగంలో 75 కిలోల లోపు బరువు ఉన్న మహిళా క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ ఎంపికలు మ్యాట్‌పై జరుగుతున్నందున క్రీడాకారులందరూ మ్యాట్ షూతో రావాలని సూచించారు. జూనియర్ విభాగంలో పాల్గొనే బాలికలు తమ వెంట ఎస్ఎస్సీ మెమో, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని కోరారు. మూసీకి కొనసాగుతున్న ఇన్ఫ్లోకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతూ గరిష్ఠ స్థాయికి రెండు అడుగుల దూరంలో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం మూసీ రిజర్వాయర్‌కు 1237 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా నీటిమట్టం 642.60 (గరిష్ట నీటిమట్టం645 అడుగులు)అడుగులకు చేరుకుంది. మూసీ కుడి ప్రధాన కాల్వకు 259 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 329 క్యూసెక్కుల చొప్పున మొత్తం 588 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.79 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభనిడమనూరు : రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో నిడమనూరు మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన షటోకాన్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో తృతీయ స్థానం సాధించారు. బాలికల జూనియర్ విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాలను నాగార్జునసాగర్ విద్యార్థులు సాధించగా, నిడమనూరు మోడల్ స్కూల్ విద్యార్థిని సీహెచ్ రష్మిక తృతీయ స్థానంలో నిలిచింది. కరాటే మాస్టర్ బిందు ప్రోత్సాహంతో పలువురు విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు తొలుత సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేపట్టి, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజలు జరిపించారు. ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం, సాయంత్రం తిరు మాఢ వీధుల్లో జోడు సేవలు జరిపించారు. -
తీరని డబుల్ కల!
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ శివారులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సిద్ధంగా ఉన్నా.. లబ్ధిదారులకు మాత్రం గృహయోగం దక్కడం లేదు. 2017లో 24 బ్లాకుల్లో చేపట్టిన 520 ఇళ్ల నిర్మాణంతో పాటు ఇటీవల మౌలిక వసతుల పనులు కూడా పూర్తయ్యాయి. అయితే, ఇళ్ల నిర్మాణం ప్రారంభించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా నేటికీ లబ్ధిదారులకు కేటాయించ లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వార్డుల వారీగా లాటరీ (డ్రా) పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ ఇళ్లను అప్పగించలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పాత జాబితా ప్రకారమే ఇళ్లు ఇవ్వాలా? లేక మళ్లీ కొత్తగా డ్రా తీయాలా? అనే తర్జనభర్జనలో పడింది. కాగా, ఆ ఇళ్ల నిర్మాణానికి భూమి ఇచ్చిన 40 మందికి నేరుగా ఇళ్లు కేటాయించి, గతంలో డ్రాలో ఎంపికై న వారిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులకు అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్న ప్లాట్లు గుంజుకున్నారు.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వెనుక మరో 253 మంది నిరుపేదల కన్నీటి గాథ దాగి ఉంది. మిర్యాలగూడలోని కిరాణా, వస్త్ర దుకాణాల గుమస్తాలు, టైలర్లు తదితర నిరుపేద కార్మికులు 1995లో ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ అధికారులకు విన్నవించారు. అప్పట్లో రాజకీయ నాయకుల చొరవతో తుంగపాడు శివారు (రైల్వేస్టేషన్ సమీపం)లో 21.05 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే, ఎకరాకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.80 వేల ధరకు రైతులు ఒప్పుకోకపోవడంతో.. 703 మంది కార్మికులు ఒక్కొక్కరు సగటున రూ.5 వేల చొప్పున జమచేసి రైతులకు చెల్లించారు. అనంతరం 1999లో లేఅవుట్ వేసి 703 మందికి 85 చదరపు గజాల చొప్పున పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో 250 మంది వరకు ఇళ్లు కట్టుకోగా, మిగిలిన వారు ఆర్థిక ఇబ్బందులతో బేస్మెంట్లు మాత్రమే వేసుకుని వదిలేశారు. ఇళ్లు పూర్తయినా తప్పని ప్రదక్షిణలు.. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలం దొరక్కపోవడంతో రెవెన్యూ అధికారులు ఈ లేఅవుట్పై కన్నేశారు. ఇళ్లు కట్టుకోలేదన్న కారణంతో 2017లో అప్పటి తహసీల్దార్ 253 మందికి నోటీసులిచ్చి వారి ప్లాట్లను వెనక్కి తీసుకున్నారు. ఆ స్థలంలోనే ప్రస్తుత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని నిర్మించారు. స్థలాలు తీసుకున్నప్పుడే తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని బాధితులు వేడుకున్నారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం పూర్తవడంతో.. 1995లో అప్పులు చేసి రూ.5 వేలు కట్టి స్థలాలు కోల్పోయిన తాము ఆర్థికంగా నష్టపోయామని, తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి న్యాయం చేయాలని కోరుతూ ఆ 253 మంది బాధితులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫ మిర్యాలగూడలో పూర్తయిన 520 రెండు పడకల ఇళ్ల నిర్మాణం ఫ తొమ్మిదేళ్లు గడిచినా లబ్ధిదారులకు దక్కని గృహయోగం ఫ పాత జాబితానా? మళ్లీ డ్రానా? వీడని సందిగ్ధం ఫ 2017లో 253 మంది పేదల ప్లాట్లు తీసుకుని డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం ఫ మాకై నా ఇవ్వాలని కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు కోట్ల రూపాయలు వెచ్చించి రెండు పడకల ఇళ్లు నిర్మించారు. ఇటీవల నిధులు కేటాయించి విద్యుత్, రోడ్లు, వాటర్ ట్యాంక్ వంటి మౌలిక వసతుల పనులు కూడా పూర్తి చేశారు. పనులన్నీ పూర్తయి నెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో ఇళ్ల తలుపులు, కిటికీల అద్దాలు మళ్లీ ధ్వంసమవుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలి. – నాజర్‌అలీ మీర్జా, మిర్యాలగూడ -
ఈసీ రాజీనామా చేయాలి
నల్లగొండ : దేశంలో ఓటు హక్కు ప్రక్రియను నాశనం చేస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో జ్ఞానేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్‌రెడ్డి, నాయకులు శ్యామ్చరణ్రెడ్డి, కొర్ర గౌతమి, కోర్ర రామ్‌సింగ్, గాలి నాగరాజు, మామిడి కార్తీక్, కంచర్ల ఆనంద్‌రెడ్డి, సతీష్, పవన్, రఘుమారెడ్డి, అజార్, రాము యాదవ్, భానుచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
నకిరేకల్ : రెడ్డి కులస్తులంతా సమష్టిగా ఉంటూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రెడ్డి సంఘం సీనియర్ నాయకుడు కందాల పాపిరెడ్డి, రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షుడు ఏమిరెడ్డి నర్సిరెడ్డి, జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు జీనుగు జ్యోతిరెడ్డి పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన రెడ్డి సంఘం, రెడ్డి జాగృతి జిల్లా విస్తృత స్థాయి సమావేశం వారు మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి తదితర రంగాల్లో తగిన అవకాశాలు అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలన్నీ పరిష్కారం కావలంటే రెడ్డి కార్పొరేషన్ లేదా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సూదిని జానకిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు నీరుడు దయాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి ఎడ్ల ఉప్పల్‌రెడ్డి, కందాల నారాయణరెడ్డి, లోకసాని అనితారెడ్డి, సునితారెడ్డి గుత్తా సుమితారెడ్డి, లోకసాని సరితారెడ్డి, పన్నాల రాఘవరెడ్డి, ఎర్ర శంభులింగారెడ్డి, బూత్కురు వెంకట్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, మరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కందాల భిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ఉపకరణాలు
నల్లగొండ : దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. భారతీయ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (ఏఎల్ఐఎంసీఓ) హైదరాబాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని 33 మండలాలకు చెందిన దివ్యాంగుల గుర్తింపు కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు. వివిధ రకాల వైకల్యాలు కలిగిన వారికి వారి అవసరాలకు అనుగుణంగా ఉపకరణాలు అందించేందుకు అర్హులను ఈ శిబిరాల్లో గుర్తించనున్నారు. బ్యాటరీ మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, శ్రవణ యంత్రాలు, చంక కర్రలు, ట్రెయిలీ కిట్లు, స్మార్ట్ కేన్లు, ట్రై సైకిళ్లు తదితర సహాయక పరికరాలను అవసరమైన వారికి అందించేందుకు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. డివిజన్ల వారీగా నాలుగు రోజుల పాటు శిబిరాలు కొనసాగనున్నాయి. డివిజన్ల వారీగా శిబిరాల నిర్వహణ ఫ 28న నల్లగొండ డివిజన్లోని మండలాలకు సంబంధించి నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బ జార్ టీఎన్జీవో భవన్లో శిబిరం నిర్వహిస్తారు. ఫ 29న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని మండలాల దివ్యాంగులకు మిర్యాలగూడలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని రైతు వేదికలో శిబిరం ఏర్పాటు చేస్తారు. ఫ 30న దేవరకొండ డివిజన్లోని మండలాల దివ్యాంగుల కోసం దేవరకొండ గిరిజన భవన్లో శిబిరం నిర్వహించనున్నారు. ఫ అక్టోబర్ 1న చండూర్ డివిజన్లోని మండలాలకు చెందిన దివ్యాంగులకు చండూర్ తహసీల్దార్ కార్యాలయంలో శిబిరం నిర్వహిస్తారు. ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి.. శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం లేదా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో తదితర పత్రాలను తీసుకురావాలి. అర్హత, అవసరాన్ని పరిశీలించిన అనంతరం సంబంధిత దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాల కోసం గుర్తింపు చేపట్టనున్నారు. వైకల్యం కారణంగా నడవడం, వినడం, ఇతర రోజువారీ కార్యకలాపాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సహాయక ఉపకరణాలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా బ్యాటరీ మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వీల్చైర్లు వంటి పరికరాలు కదలిక సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడతాయి. శ్రవణ యంత్రాలు, స్మార్ట్ కేన్, ట్రెయిలీ కిట్లు వంటి పరికరాలు ఆయా వైకల్యాలు కలిగిన వారికి అవసరమైన సహాయాన్ని అందించనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన దివ్యాంగులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. ఫ ప్రత్యేక క్యాంపుల ద్వారా గుర్తింపు ఫ డివిజన్ల వారీగా శిబిరాల నిర్వహణ -
‘పొదుపు’ మహిళలకు రూ.200 కోట్లు
నల్లగొండ టూటౌన్ : పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించేలా ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది మున్సిపాలిటీల్లో వంద శాతానికిపైగా రుణ లక్ష్యాలను అధిగమించారు. దీంతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రుణాల మంజూరుకు జిల్లా ‘మెప్మా’ (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఉన్న 1,475 పొదుపు సంఘాల మహిళలకు రూ.200 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. షరతులు లేకుండా రూ.20 లక్షల వరకు.. నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న మహిళా సంఘాలకు తోడు.. ఈ ఏడాది కొత్తగా మరో 84 సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కొత్త సంఘాలకు సైతం రుణాలు అందించనున్నారు. పొదుపు సంఘాల సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ఆయా పురపాలికల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేశారు. కుటీర పరిశ్రమల స్థాపనకు ఊతం.. నల్లగొండ కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీల పరిధిలో మహిళలు ఆహార శుద్ధి కేంద్రాలు, కుటీర పరిశ్రమలు స్థాపించడంతో పాటు పలు చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరికి ఆర్థిక భరోసా కల్పించేందుకు మెప్మా ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాల మంజూరు కోసం ఇటీవల పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మహిళా సంఘాలకు రుణాలు అందించేందుకు బ్యాంకులు సైతం సిద్ధమయ్యాయి. ఈ రుణాల ద్వారా వేలాది మంది మహిళలకు మెరుగైన జీవనోపాధి లభించనుంది.రుణాల మంజూరు లక్ష్యం ఇలా.. మున్సిపాలిటీ సంఘాలు రుణాలు (రూ.కోట్లలో..) నల్లగొండ(కార్పొరేషన్) 517 61.31 మిర్యాలగూడ 358 50.77 హాలియా 109 16.33 నందికొండ 48 6.25 దేవరకొండ 198 29.90 చండూరు 70 7.34 చిట్యాల 50 6.88 నకిరేకల్ 125 21.89 ఫ అతివలు వ్యాపారం చేసుకునేలా ఆర్థిక సాయం ఫ 2026–27 సంవత్సరానికి ‘మెప్మా’ ప్రత్యేక కార్యాచరణ ఫ నల్లగొండ కార్పొరేషన్, 7 మున్సిపాలిటీల్లో 1,475 సంఘాలకు లబ్ధి ఫ కొత్తగా మరో 84 సంఘాల ఏర్పాటుకు ఆదేశం -
లిఫ్ట్ పనుల్లో పేలుళ్లు.. పొలాల్లో బండరాళ్లు
పెద్దఅడిశర్లపల్లి : అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్) లిఫ్ట్ పనుల్లో భాగంగా చేపట్టిన బ్లాస్టింగ్ సమీప రైతుల పాలిట శాపంగా మారింది. పైప్‌లైన్ నిర్మాణం కోసం గుట్టలు, రాళ్లను పేల్చిన సమయంలో పెద్దపెద్ద బండరాళ్లు ఎగిరి చుట్టుపక్కల పంట పొలాల్లో పడ్డాయి. బ్లాస్టింగ్ జరిగి ఆరు నెలలు గడుస్తున్నా పొలాల్లో పడిన రాళ్లను తొలగించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగు పనులకు తీవ్ర ఆటంకం పొలాల నిండా భారీ బండరాళ్లు ఉండటంతో భూమిని దున్నడం, పంటలు సాగు చేయడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు పొలాల్లో తిరిగేందుకు ఆటంకం కలగడంతో పాటు రాళ్లు తగిలి యంత్ర పరికరాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం పడిన రాళ్లను తొలగించాలని సంబంధిత అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఫ నెలలు గడుస్తున్నా తొలగించని కాంట్రాక్టర్ ఫ ఇబ్బందులు పడుతున్న రైతులుబ్లాస్టింగ్ సమయంలో పొలాల్లోకి పడిన రాళ్లను తొలగించేందుకు త్వరలోనే చర్యలు చేపడుతాం. బండరాళ్లు తొలగించాలని పనులు చేపడుతున్న సంస్థ ప్రతినిధులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం – నాగయ్య, డీఈ, ఏఎమ్మార్పీ బ్లాస్టింగ్ సమయంలో మా పొలాల్లో పడిన బండరాళ్లను తొలగించి, భూములను సాగుకు అనుకూలంగా మార్చాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదు. రాళ్ల వల్ల దుక్కి దున్నేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి త్వరితగతిన రాళ్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలి. – మైలు రాంరెడ్డి, రైతు, పెద్దఅడిశర్లపల్లి -
బాపూజీ ఆశయాలను భావితరాలకు అందించాలి
నల్లగొండ టౌన్ : కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భావితరాలకు అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన నల్లగొండలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి.. మేయర్ బుర్రి చైతన్యతో కలిసి పూలమాలవేసి నివాళి అర్పించి మాట్లాడారు. నీతి, నిజాయితీగా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ న్యాయం, ధర్మం కోసం పోరాడిన గొప్ప పోరాట యోధుడు లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. 1942లో మహాత్మాగాంధీ స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ, అనంతరం తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లా్ష్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ పరమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్పొరేటర్ మామిడి కార్తీక్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టబోతుల సత్యనారాయణ, మిర్యాల యాదగిరి, దుడుకు లక్ష్మీనారాయణ, ఎదుల్ల శ్రీధర్‌రెడ్డి, చిలకరాజు సతీష్, వెంకట మధు, అంజయ్య, దేవయ్య, యాదయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంజీవ, కొండూరు సత్యనారాయణ, రషీద్, రాపోలు పరమేష్, ముదిగొండ వెంకటేశ్వర్లు, నాగిల్ల మురళి, శేఖర్‌రెడ్డి, రణదీవె, భాస్కర్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
మిల్లెట్స్ స్నాక్స్
చిరుధాన్యాల బిస్కెట్స్, ఐస్‌క్రీం ఫ ఇప్పటికే అందుబాటులో మిల్లెట్స్ ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ ఫ పిండి వంటల్లోనూ మిల్లెట్స్‌కు ప్రాధాన్యంచౌటుప్పల్, చిట్యాల :. టిఫిన్లు, ఐస్‌క్రీంలు, పిండి వంటలు అందరికీ ఇష్టమే. చిరుధాన్యాలతో చేసిన టిఫిన్లు ఇప్పటికే అందుబాటులో ఉండగా ప్రస్తుతం ఐస్‌క్రీంలు, స్నాక్స్ తయారవుతున్నాయి. చాలా చోట్ల చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు మిల్లెట్స్‌తో చేసిన బిస్కెట్లు, పిండి వంటలు కూడా అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట శివారులో గల హల్వా అంగడిలో చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ, దోశ, పెసరట్టుతో పాటు సజ్జ, జొన్నలతో చేసిన రకరకాల మిల్లెట్ బిస్కెట్లు, పిండి వంటలు లభిస్తున్నాయి. సాయంత్రం వేళ వేడివేడి మిల్లెట్ స్నాక్స్ ఇక్కడి ప్రత్యేకత. ఆరోగ్యానికి మంచి చేసే స్నాక్స్‌ను ప్రజలు ఇష్టపడి మరీ ఆరగిస్తున్నారు. సాధారణంగా ఐస్‌క్రీమ్ అనగానే పాలు, పండ్లు, చాక్లెట్, వెనిల్లా వంటి రుచులే గుర్తుకొస్తాయి. కానీ, చిరుధాన్యాలతో తయారయ్యే ఐస్‌క్రీమ్‌లు ఇప్పుడు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలో గల ‘విలేజ్ ఆర్గానిక్ హోటల్’లో ఏర్పాటు చేసిన మిల్లెట్స్ ఐస్‌క్రీమ్ స్టాల్లో పిస్తా, ఆల్మండ్, స్ట్రాబెర్రీ, ఓరియో, మ్యాంగో, బనానా, గ్రేప్స్, జాక్‌ఫ్రూట్, కస్టర్డ్ యాపిల్, చాక్లెట్ వంటి పది రకాల ఫ్లేవర్లలో మిల్లెట్స్ ఐస్‌క్రీమ్‌లు లభిస్తున్నాయి. ఆయా ఫ్లేవర్ల ఐస్క్రీంలలో రాగి, జొన్న, సజ్జలు వంటి మిల్లెట్స్‌ను కలిపి అందిస్తున్నారు. వీటిని హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక్కో ఐస్‌క్రీమ్ ధర రూ.130 నుంచి రూ.150 వరకు ఉంది. ఆర్గానిక్ పదార్థాలు, చిరుధాన్యాలతో తయారు చేయడం వల్ల ప్రయాణికులు వీటిని రుచి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
వివేరా హోటల్స్ చైర్మన్‌కు అవార్డు
భువనగిరి/నార్కట్‌పల్లి: వివేరా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డికి విశిష్ట అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారుల వెంట భువనగిరి, నార్కట్‌పల్లి కేంద్రాలుగా 42 ఏళ్లుగా ప్రయాణికులు, అధికారులు, వీఐపీలు, సాధారణ ప్రజలకు నాణ్యమైన ఆహారం, వసతి సౌకర్యాలను అందిస్తున్నందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఈ అవార్డును ప్రకటించింది. అవార్డు అందుకున్న అనంతరం సద్ది వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, తమ హోటల్స్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం గౌరవించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గతంలోనూ తమ సేవలకు గాను వివిధ సందర్భాల్లో 9 సార్లు పురస్కారాలు అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేరా హోటల్స్ మేనేజర్ శివ పాల్గొన్నారు. -
ఆడపిల్లను తక్కువగా చూడకూడదు
– గాయం శ్రీధర్‌రెడ్డి, దీప, మఠంపల్లి మఠంపల్లి : మాది సూర్యాపేట జిల్లా మఠంపల్లి. మాకు ఇద్దరు కుమార్తెలు పెద్దకుమార్తె ప్రణీతారెడ్డి, చిన్నకుమార్తె హర్షితారెడ్డి. మేము గతంలో కువైట్‌లో ఉండే సమయంలో విమానాల్లో ప్రయాణిస్తూ మా కుమార్తెను కూడా ఎయిర్‌హోస్టెస్‌గా చూడాలనుకున్నాం. అందుకే చిన్నకుమార్తె హర్షితారెడ్డిని ఎయిర్‌హోస్టెస్‌ను చేయాలని భావించాం. హర్షితారెడ్డి ప్రాథమిక విద్య మఠంపల్లిలో, ఉన్నత విద్య హైదరాబాద్‌లో సాగింది. మా కుమార్తెను ఎయిర్‌హోస్టెస్‌గా చేయాలనే సంకల్పంతో ఫ్రాంక్ఫెన్ యూనిస్ట్రీట్ హైదరాబాద్‌లో ఎయిర్‌హోస్టెస్ డిపోమా కోర్సులో చేర్పించాం. కోర్సు పూర్తిచేసిన హర్షితారెడ్డి ఇంటర్వ్యూలో సెలక్ట్ అయి ఢిల్లీలో ట్రైనింగ్ పొంది ప్రస్తుతం బెంగుళూరు ఎయిర్ ఇండియాలో హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తోంది. మా పెద్దమ్మాయి ప్రణీతారెడ్డి జర్మనీలో చదువుకుంటోంది. మాకు మగపిల్లలు లేకపోయినా ఆడపిల్లలే అంతకంటే ఎక్కువగా రాణిస్తూ మాకు ఆనందం కలిగిస్తున్నారు. ఈరోజుల్లో ఆడపిల్లలను ఎవరు తక్కువగా చూడకూడదు. మగ పిల్లలకు దీటుగా అమ్మాయిలు రాణిస్తుంటే ఎంతో ఉప్పొంగిపోతున్నాం. -
● వీర వనిత ఐలమ్మ
నల్లగొండ : భూమి.. సమానత్వం కోసం పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా నల్లగొండలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, చోల్లేటి ప్రభాకర్, సంజీవ, కొండూరు సత్యనారాయణ, రాములు, చెన్నయ్య, సత్తయ్య, సునీత, మురళి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భారం కాదు.. ఆభరణం
ఫ రంగం ఏదైనా.. మాదే అందలం అంటున్న అమ్మాయిలు ఫ ఆడపిల్ల భారమనే భావనను తుడిచేస్తున్న యువతులు ఫ మాకు ఆడపిల్లే కావాలని సగర్వంగా చెబుతున్న తల్లిదండ్రులునేడు కూతుళ్ల దినోత్సవం – రొండ్ల రాంరెడ్డి, స్వప్న రాజాపేట : మాది రాజాపేట మండలం కుర్రారం. నేను విద్యుత్ శాఖలో ఉద్యోగిగా, నా భార్య స్వప్న అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్నాం. మాకు ఇద్దరు కూతుళ్లు. వారిని మగవారికి తీసిపోకుండా చదివించాం. పెద్ద కుమార్తె ప్రీతిరెడ్డి జాల గ్రామంలోని జకారియాస్ పాఠశాలలో 6వ తరగతి వరకు, హైదరాబాద్‌లో ఇంటర్‌తో పాటు బీటెక్ చదివించాం. ఆమె ప్రస్తుతం టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఇక చిన్నకుమార్తె శ్రావణిని జాల గ్రామంలోని జకారియాస్ పాఠశాలలో 10వ తరగతి వరకు, హైదరాబాద్‌లో ఇంటర్, ఘట్కేసర్లో బీఫార్మసీ చదివించాం. చిన్నకుమార్తె కరోనా సయమంలో ఎన్నికష్టాలు వచ్చినా, కరోనా బారినపడినా భయపడకుండా యూకేకు వెళ్లి ఎంఫామ్ పూర్తి చేసి మెడికల్ ఫీల్డ్‌లో ఉద్యోగం చేస్తోంది. మా అమ్మాయిలను కొడుకుల్లా భావించి చదివించాం. వారు మాతో స్నేహంగా ఉంటారు. మేము చెప్పినట్టే నడుచుకుంటారు. ఏనాడూ ఎదురు చెప్పలేదు. అబ్బాయిలకంటే కూతుళ్లే నయం మా కూతుళ్లు బంగారం. ఆ దేవుడు మాకు ఆడపిల్లలను ఇచ్చి ఎంతో మేలు చేశాడు.మరికొన్ని కథనాలు 8లో -
జీపీ భవనాలు నిర్మిస్తాం
వెయ్యి కోట్ల రూపాయలతో జీపీలకు పక్కా భవనాలు మంజూరు చేశామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.- 8లోలోపాలు అధికం.. చర్యలు స్వల్పం!సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నగరంలోని ఐకాన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనేక లోపాలు వెలుగు చూసినప్పటికీ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. ఏకంగా 14 అంశాల్లో లోపాలు ఉన్నట్లు జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైనా కఠిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. రాజకీయ ఒత్తిళ్లతో కఠిన చర్యలు పక్కన పెట్టి జరిమానాతోనే సరిపుచ్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రిపై అనేక ఫిర్యాదులు వైద్యంలో లోపాలు, వైద్య పరీక్షల పేరుతో అడ్డగోలు వసూళ్లు, మరణించిన వారికి ఐసీయూలో చికిత్స పేరుతో దండుకోవడం.. ఇలా ఐకాన్ ఆసుపత్రిపై వైద్యారోగ్య శాఖకు పది రాతపూర్వక ఫిర్యాదులు అందాయి. దీంతో గత నెల 11వ తేదీన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాహుల్ ఆధ్వర్యంలోని బృందం తనిఖీ చేసింది. అనంతరం షోకాజ్ నోటీసులు జారీచేసి వివరణ కోరింది. ఆసుపత్రి యాజమాన్యం అరకొరగానే ఇచ్చిన వివరణ, తనిఖీ నివేదిక, ఫిర్యాదులు, ఇతర రికార్డులను పరిశీలించిన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ.. పలు తప్పిదాలను, లోపాలను, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించింది. అయితే ఇన్ని లోపాలు గుర్తించినప్పటికీ చివరకు రూ.5 లక్షల జరిమానాతోనే చర్యలను పరిమితం చేయడం చర్చకు దారితీసింది. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకున్నారని చర్చ సాగుతోంది. అంతేకాదు రెండు నెలల్లో లోపాలను సరిదిద్దుకోవాలంటూ అవకాశం కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రుల లైసెన్సింగ్ అథారిటీ ఆగ్రహం ఆసుపత్రుల లైసెన్సింగ్ అథారిటీ ఐకాన్ ఆసుపత్రి వ్యవహారంలో తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. అడ్డగోలు వసూళ్లు, అవకతవకలు, ఊహించని విధంగా 191 మంది రోగుల మరణాలు, చివరి క్షణంలో ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం, రెఫరల్ ఆసుపత్రులకు పంపించిన రోగుల వివరాలను ఇవ్వకపోవడం వంటి పలు ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని, ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేయాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. దీంతో పెద్ద ఎత్తున పైరవీలు చేసి, రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడంతో లైసెన్స్ రద్దు అంశాన్ని నిలుపుదల చేసి, జరిమానాకే పరిమితమైనట్లు తెలిసింది. తల్లిదండ్రులతో ఎయిర్‌హోస్టెస్ గాయం హర్షితారెడ్డి ఐకాన్‌పై రూ.5 లక్షల జరిమానాతోనే సరిపుచ్చిన యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లతోనే ఆస్పత్రిపై చర్యలు చేపట్టడంలో వైఫల్యం? -
అవకాశం ఇస్తే ఆడపిల్లలు ఏదైనా సాధిస్తారు
– నర్రా శేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు మిర్యాలగూడ టౌన్ : మాది నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడి, నా భార్య కరుణ గృహిణి. మా కుటుంబంలో ఆడ పిల్లలు లేరు. కానీ మాకు ఆడపిల్లే పుట్టాలని అనుకున్నాం. అనుకున్నట్లుగానే ఆడపిల్ల జన్మించింది. ఒక్కరితోనే సరిపెట్టుకుని మంచిగా చదివించి ఉన్నతస్థానంలో నిలపాలని భావించాం. మా ఆలోచనకు తగినట్టుగానే శ్రీజ చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండేది. ఆనాటి నల్లగొండ కలెక్టర్ రిజ్వీని స్ఫూర్తిగా తీసుకొని సివిల్స్ సాధిస్తానని మాతో చెప్పింది. అందుకు మేము శ్రీజకు సహకరించాం. మా కుమార్తె సక్సెస్ చూడాలని అనుకున్నాం. అందులో భాగంగానే.. ఎక్కడా రాజీపడకుండా చదించాం. ఇంటర్ పూర్తయ్యాక చాలా మంది మీ పాపను డిగ్రీ ఎందుకు చదివిస్తున్నారు.. బీటెక్ చదివిస్తే బాగుండేది కదా అని మాతో అన్నారు. కానీ ఎవరెన్ని చెప్పినా మా పాప కోరిన విధంగానే డిగ్రీ చదివించాం. తన లక్ష్యాన్ని సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ, లక్ష్య సాధనలో ముందుకు సాగుతూ గ్రూప్–1 సాధించి మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తోంది. సివిల్ సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది. ఆడపిల్లలకు అవకాశం ఇస్తే ఎంతటి విజయాన్ని అయినా ఇట్టే సాధించగలరని శ్రీజ నిరూపించింది. మా శ్రీజ ఈ స్థాయికి రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది. -
..........
నల్లగొండ టౌన్ : బ్యాంకులు ఆదివారం పనిచేయనున్నాయి. డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు సమ్మె చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో మూడు రోజుల పాటు లావాదేవీలు స్తంభించనున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యం కోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ నెల 27న (ఆదివారం) పని చేయనున్నాయి. ఖాతాదారులు ఆదివారం బ్యాంకు సేవలను ఉపయోగించుకోవచ్చని ఆయా బ్యాంకుల నుంచి వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతున్నారు.విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలినకిరేకల్ : విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని డీఈఓ సుశీందర్‌రావు సూచించారు. నకిరేకల్ మండలం నోముల గ్రామంలోని ప్రాథమిక, జెడ్పీ ఉన్నత పాఠశాలలను శనివారం ఆయన ఆకస్మీకంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం జెడ్పీ హైస్కుల్లో కాంప్లెక్స్ సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈఓ మేక నాగయ్య, కాంప్లెక్స్ హెచ్ఎం మిర్యాల చల్మరాజు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుర పాక ప్రసాద్ ఉన్నారు.ఎంజీయూకు నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలునల్లగొండ టూటౌన్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నల్లగొండ రీజియన్, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలను శనివారం అందజేసింది. ఈ సందర్భంగా ఎస్బీఐ నల్లగొండ డిప్యూటీ జనరల్ మేనేజర్ (బీఅండ్వో) ప్రియబ్రత మిశ్రా, రీజినల్ మేనేజర్ పి.పద్మబాబుగౌడ్ వాహనాలను విశ్వవిద్యాలయానికి అధికారికంగా అప్పగించారు. విశ్వవిద్యాలయం తరఫున రిజిస్ట్రార్ కె.అంజిరెడ్డి వాహనాలను స్వీకరించారు. ఎస్బీఐ అందించిన సీఎస్ఆర్ సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎస్బీఐ అధికారులు, అధ్యాపకులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ (హెచ్ఆర్) శ్రీమన్నారాయణ, చీఫ్ మేనేజర్ (డీవీఏఎస్) కె.శ్రీరామ్, మేనేజర్ (హెచ్ఆర్) అనిల్, అన్నెపర్తి శాఖ మేనేజర్ చైతన్య, ఆకుల రవి, అరుణప్రియ, హరీష్ కుమార్, వసంత, శ్రీదేవి, రమణారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు. -
ఆరు లేన్లుగా హైవే
కోదాడ, చిట్యాల : హైదరాబాద్– విజయవాడ జాతీయరహదారి(ఎన్‌హెచ్–65)ని నాలుగు నుంచి ఆరు లేన్లుగా విస్తరణకు ముందడుగు పడింది. బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానంలో రోడ్డు విస్తరించే పనులకు టెండర్లను ఆహ్వానిస్తూ ఎన్హెచ్ఏఐ ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్హెచ్ఏఐ రూపొందించిన విస్తరణ డీపీఆర్‌కు పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య అప్రైజర్ కమిటీ ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. దీనిని కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్ కమిటీ (సీసీఈఏ) తుది అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఇది లాంఛనమేనని సమాచారం. నవంబర్ 25న టెండర్లు ఖరారు చేయనున్నారు. జాతీయ రహదారి–65ను దండు మల్కాపురం నుంచి ఏపీలోని మచిలీపట్నం వరకు మూడు ప్యాకేజీలుగా విభజించి విస్తరణ పనులు చేయపట్టనుండగా యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం నుంచి ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని మునగచర్ల వరకు మొదటి ప్యాకేజీ కింద రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. మొదటి ప్యాకేజీలోనే.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నందిగామ వరకు మొదటి ప్యాకేజీ కింద పనులు చేపట్టనున్నారు. ఇందులో మొత్తం 181.300 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఇందుకు గానూ రూ. 6,792.52 కోట్ల అంచనా వ్యయంతో ఎన్‌హెచ్ అధికారులు టెండర్లు పిలిచారు. దండుమల్కాపురం నుంచి తెలంగాణ–ఏపీ సరిహద్దుగా ఉన్న కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వరకు 155 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించనున్నారు. పరిమిత సంఖ్యలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు జాతీయ రహదారిపై ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి రోడ్డు విస్తరణతో పాటు సర్వీస్రోడ్లను, అండర్‌పాస్‌లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. రహదారిపైకి రావడానికి 15 నుంచి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ మాత్రమే ఉంటుందని, ఇష్టానుసారంగా రోడ్డుమీదకు రావడానికి వీలుండదని జాతీయ రహదారుల అధికారులు చెబుతున్నారు. రోడ్డు వెంట ఉన్నవారు సర్వీస్ రోడ్డను, రోడ్డు దాటేందుకు అండర్‌పాస్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్లాక్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలలో ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డు నిర్మాణంలో లోపాలను సరిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. దండు మల్కాపురం నుంచి నందిగామ వరకు 60 వెహికిల్ అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టనుండగా .. ఉమ్మడి జిల్లా పరిధిలో అదనంగా మరో 36 అండర్‌పాస్‌లు రానున్నాయి. గుర్తించిన ప్రదేశాలలో పశువులు రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా 10 అండర్‌పాస్‌ల నిర్మాణం చేయనున్నారు. స్మార్ట్ హైవేగా.. ఎన్‌హెచ్–65ను ఆరులేన్లుగా విస్తరించే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఆధారిత హైసెక్యూరిటీ విధానాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఏఐ అనుసంధాన సీసీ కెమెరాలను అమర్చి నిత్యం నిఘాను ఏర్పాటు చేయనున్నారు. ఏఎన్పీఆర్(ఆటోమెటిక్ నంబర్ప్లెట్ రికగ్నేషన్) కెమెరాల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్, ఇతర వివరాలను గుర్తించనున్నారు. ఈ కెమెరాలు ఇన్ఫ్రారెడ్ కాంతి ద్వారా పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాహనాల చిత్రాలను వందశాతం క్లారిటీగా తీయగలుగుతాయి. ఫ రూ. 6,792.52 కోట్లతో 181.3 కి.మీ విస్తరణ ఫ దండుమల్కాపురం– నందిగామ వరకు మొదటి ప్యాకేజీ ఫ ఉమ్మడి జిల్లాలో 155 కి.మీ మేర వెడల్పు ఫ పూర్తిస్థాయిలో అండర్‌పాస్‌లు, సర్వీస్‌రోడ్ల నిర్వహణ జాతీయ రహదారి – 65 విస్తరణకు టెండర్లు2012లో విజయవాడ–హైదరాబాద్ హైవేను నాలుగు లేన్లుగా విస్తరించిన సమయంలోనే 6 వరుసలకు అవసరమయ్యే భూమిని ఎన్‌హెచ్ అధికారులు సేకరించారు. కల్వర్టులు, ప్లైఓవర్లు, వంతెనలు సైతం ఆరు వరుసలకు సరిపోయేలా నిర్మించారు. దాంతో ప్రస్తుతం ఆరు వరుసల రోడ్డు విస్తరణకు భూసేకరణ పెద్దగా అవసరం ఉండదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మొత్తం 25.8 హెక్టార్లు (సుమారు 64 ఎకరాల) భూమిని సేకరించనున్నారు. భూ సేకరణ బాధ్యతను ఉమ్మడి జిల్లాలోని నలుగురు ఆర్డీఓలకు అప్పగించారు. చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాల పరిధిలో 6.32 హెక్టార్ల భూముల సేకరణకు నల్లగొండ ఆర్డీఓ నోటిఫికేషన్ జారీ చేశారు. భువనగిరి, సూర్యాపేట, కోదాడ ఆర్డీఓలు త్వరలోనే భూ సేకరణ నోటిఫికేషన్ జారీచేయనున్నారు. -
రోజూ 4 నుంచి 6 గంటలే విద్యుత్ సరఫరా
నాకున్న ఆరెకరాల్లో వరిసాగు చేశాను. రోజుకు కనీసం 7 గంటలు కూడా కరెంట్ రావడం లేదు. పొలానికి నీరు పారడం లేదు. ఇప్పటికే మూడెకరాల పొలం ఎండింది. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. 12 గంటల పాటు కరెంట్ అందించి పంటలను కాపాడాలి. – ఊరిబండి మల్లయ్య, రైతు, కుక్కడం రోజుకు 10 నుంచి 12 గంటలు విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డివిజన్ వ్యాప్తంగా రోజూ 6 మిలియన్ యూనిట్లు (400 మెగా వాట్స్) సరఫరా చేస్తున్నాం. మరింత విద్యుత్ అవసరం ఉన్నప్పుడు ఉన్నతాధికారుల ఆదేశానుసారం అదనంగా సరఫరా చేస్తాం. – శ్రీనివాసచారి, విద్యుత్ డీఈ, మిర్యాలగూడ మిర్యాలగూడ : ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతుకు నిత్యం కష్టాలే ఎదురవుతున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో బోరుబావుల కింద వరితోపాటు ఇతర పంటలు సాగు చేసిన రైతులకు అప్రకటిత విద్యుత్ కోతలతో నీళ్లందడం లేదు. దీంతో వేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలం అడుగంటి.. సకాలంలో కురవాల్సిన వర్షాలు ఎల్‌నినో ప్రభావంతో ముఖం చాటేశాయి. వర్షపాతం సాధారణం కంటే 20 శాతం లోటు కావడంతో చెరువులు, కుంటలు, జలాశయాలు నిండలేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో రైతులు బోరుబావుల కింద వరితోపాటు ఇతర పంటలు సాగు చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్త బోర్లు వేస్తున్నా చుక్కనీరు పడటం లేదు. పెరిగిన విద్యుత్ డిమాండ్‌తో తప్పని కోతలు రైతులు బోర్లపై ఆధారపడడంతో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. జిల్లాలో సాధారణ విద్యుత్ వినియోగం 14 మిలియన్ యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం అది 19 మిలియన్ యూనిట్లకు చేరింది. అనుమతులు లేకుండా వేస్తున్న కొత్త బోర్లు, మోటార్ల వాడకంతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పడి తరచూ ట్రిప్ అవుతున్నాయి. రైతులకు రోజూ 12 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినప్పటికీ.. కేవలం 4 నుంచి 6 గంటలకే పరిమితం అవుతోంది. రైతుల ఆందోళన బాట నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు కేవలం 15 రోజులు మాత్రమే నీరు విడుదల చేసిన అధికారులు.. మంగళవారం నిలిపివేశారు. వినాయక నిమజ్జనం కోసమని బుధవార మధ్యాహ్నం నుంచి మళ్లీ విడుదల చేస్తున్నారు. అయితే చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్ సమస్యపై రైతులు సబ్స్టేషన్ల వద్ద ధర్నాలకు దిగుతున్నారు. అధికారులు స్పందించి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.ఫ అప్రకటిత విద్యుత్ కోతలతో తడారుతున్న పొలాలు ఫ సబ్స్టేషన్ల వద్ద రైతుల ధర్నాలు ఫ జిల్లా వ్యాప్తంగా బోర్ల కింద 2.50 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు -
ఐకాన్ ఆసుపత్రికి రూ.5 లక్షలు జరిమానా
నల్లగొండ టౌన్: నల్లగొండలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తూ 191 మంది రోగుల మరణానికి కారణమైన ఐకాన్ ఆసుపత్రికి జిల్లా వైద్యారోగ్యశాఖ రూ.5 లక్షల జరిమానా విధించింది. రోగి చనిపోయినా ఐసీయూలో పెట్టి చికిత్స పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ జరిపి ఈ జరిమానా విధించినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. అంతేకాక పరీక్షలు/ఇన్వెస్టిగేషన్ పేరుతో అధిక బిల్లులు వసూలు చేసినట్లు తనిఖీల్లో తేల్చామని పేర్కొన్నారు. నిబంధనల అమలులో లోటుపాట్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు షోకాజు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించామన్నారు. యాజమాన్యం ఇచ్చిన వివరణలతో పాటు వచ్చిన ఫిర్యాదులు, తనిఖీ నివేదిక, అందుబాటులో ఉన్న రికార్డులు, ఇతర సంబంధిత ఆధారాలను జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆ మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. రెండు నెలల్లో లోపాలు సరిదిద్దుకోవాలని, వాటిపై రిజిస్ట్రేషన్ అథారిటీ తనిఖీ నిర్వహించి తగిన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. -
పత్తి సాగులో మెళకువలపై అవగాహన
మునుగోడు : పత్తి సాగు చేసే రైతులు ఎకరం భూమిలో కనీసం 15 వేల మొక్కలను పెంచితే మంచి దిగుబడి పొందవచ్చని కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత డాక్టర్ అనిల్‌కుమార్ సూచించారు. పత్తి సాగులో మెళకువలపై మండలంలోని కొరటికల్ గ్రామంలో రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరానికి 15 వేల మొక్కలు నాటి దిగుబడి తీస్తే పంట కాలపరిమితి తగ్గి అదే భూ మిలో రెండో పంట సాగు చేసే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పద్మజ, కొరటికల్ సర్పంచ్ అద్దంకి రామలింగం, ఉప సర్పంచ్ మందుల అంజయ్య, ఏఈఓ వెంకటేష్ పాల్గొన్నారు. వృద్ధులను గౌరవిద్దాంనల్లగొండ: ప్రతిఒక్కరం వయో వృద్ధులను గౌరవిద్దామని జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ నంద్యాల ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించ తలపెట్టిన వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్, వయోవృద్ధుల హక్కుల పుస్తకాలను శుక్రవారం ఆయన నల్లగొండ కలెక్టరేట్లో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 26న సాంస్కృతిక కార్యక్రమాలు, 27న ఆర్థిక లావాదేవీలపై, సైబర్ నేరాల పట్ల అవగాహన, 28న యోగా సాధన, 29న వృద్దుల చట్టాలపై అవగాహన సదస్సులు ఉంటాయన్నారు. 30న చిన్నారుల చేత తల్లిదండ్రులను, వృద్ధులను గౌరవించాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ప్రతిజ్ఞ చేయించాలన్నారు. అక్టోబర్ 1న వృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో వయోవృద్ధులకు, వారికి సేవలు చేసిన వ్యక్తులకు సన్మానం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లావణ్య కుమారి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, వయోవృద్ధుల సంరక్షణ కేంద్రం కోఆర్డినేటర్ నవీన్, సముద్రాల మల్లికార్జున్, సుదర్శన్‌రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు. పేద విద్యార్థులకు వరం.. ‘బీఆర్ఏఓయూ’ మిర్యాలగూడ టౌన్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏఓయూ) ద్వారా అందిస్తున్న విద్యా కోర్సులు పేద విద్యార్థులకు గొప్ప వరం లాంటివని ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి.ధర్మానాయక్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో బీఆర్ఏఓయూ ప్రవేశాల పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా అధ్యయన కేంద్రం కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దూరవిద్య ద్వారా వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రధానాచార్యులు మలిగిరెడ్డి భీమార్జున్‌రెడ్డి, కో–ఆర్డినేటర్ పి.నాగరాజు, జాక్టో ఎం.వెంకన్న, అధ్యయన కేంద్రం కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
సైబర్ మోసాల నివారణే ట్రాయ్ లక్ష్యం
రామగిరి(నల్లగొండ): టెలికం వినియోగదారుల హక్కులు, సేవలపై అవగాహన పెంచడంతోపాటు సైబర్ మోసాల నివారణే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ సంయుక్త సలహాదారు కేవీ.సురేష్‌బాబు అన్నారు. ట్రాయ్) ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండలోని కాకతీయ డిగ్రీ, పీజీ కళాశాలలో టెలికం వినియోగదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టెలికం రంగాన్ని క్రమబద్ధీకరించడంలో, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంలో ట్రాయ్ నిర్వహిస్తున్న పాత్రను వివరించారు. సేవల నాణ్యత, వేగాన్ని తెలుసుకునేందుకు, అవాంఛిత కాల్స్‌ను అరికట్టేందుకు ట్రాయ్‌కి చెందిన మై కాల్, మై స్పీడ్, డీఎన్డీ యాప్‌లను ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ కె.పరశురామ్ మాట్లాడుతూ ట్రాయ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి.నరసింహారెడ్డి, టెలికం శాఖ (ఏపీ లైసెన్స్ సర్వీస్ ఏరియా) భద్రతా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జి.పాపారావు, డి.ప్రదీప్‌కుమార్, ఎ.క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆదాయం పెరిగేలా చూడాలి
నల్లగొండ: రైతుల ఆదాయం పెరిగేలా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల కార్యదర్శి కె.సురేంద్రమోహన్ అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండ కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రైతులు సబ్సిడీ పథకాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్స్ ఐడీ కచ్చితం చేసినందున యుద్ధ ప్రాతిపదికన నెల రోజుల్లో ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర గోదాముల సామర్థ్యాన్ని పెంచాలని, రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇప్పించాలని తెలిపారు. రైతు ఉత్పాదక సంస్థలను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో 80 ఎఫ్పీఓలు ఉండగా, రూ.3,120 కోట్ల ఎగుమతి వ్యాపారం జరగుతుందని, దాన్ని రూ.5000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని శాస్త్రబద్ధంగా, బాధ్యతాయుతంగా నిర్వహించేలా రైతులను చైతన్యం చేయాలన్నారు. పంట మార్పిడి, సెరికల్చర్, హార్టికల్చర్‌ను ప్రోత్సహించాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు ఎఫ్పీఓల ద్వారా కోల్డ్ స్టేజిలను పెంచాలన్నారు. త్వరలో ప్రారంభం కానున్న వానాకాలం ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల కార్యదర్శి సురేంద్రమోహన్ -
మేము.. మా కూతురు
ప్రతీ తల్లి, తండ్రికి వారి కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. కూతురు ఉన్నత స్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి ఎంతో మురిసిపోతారు. కూతురితో గడిపిన ప్రతీది ఓ తీపిజ్ఞాపకం. అలాంటి తీపి జ్ఞాపకాలు ‘సాక్షి’తో పంచుకోండి. మీ కూతురు గురించి నాలుగు వాక్యాలు రాసి మీ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో పంపండి. మీ పేరు, ప్రాంతం వివరాలను పేర్కొంటూ 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి డాటర్స్ డే (కూతుళ్ల దినోత్సవం) సందర్భంగా 27వ తేదీ సంచికలో ప్రచురిస్తాం.మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 94413 62419 -
మిల్లులకు ఈ సారి ధాన్యం ఇచ్చేదేలే..
నల్లగొండ : ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని ఈసారి నేరుగా మిల్లులకు కేటాయించకుండా గోదాముల్లోనే నిల్వ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్టోబర్ 1నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలనినుంచి ఆదేశాలు రావడంతో జిల్లా యంత్రాంగం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు గోదాములను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మిల్లింగ్‌పై వివాదాల నేపథ్యంలో.. గత యాసంగిలో దొడ్డు ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించడం, దానికి బదులుగా ప్రభుత్వానికి రావాల్సిన రా రైస్ విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ వానాకాలంలో కొనుగోలు చేసే సన్నధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించకుండా నిల్వ చేయాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసి, ప్రభుత్వ అవసరానికి అనుగుణంగా మిల్లింగ్ చేయించుకోవాలనే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అయితే సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించే విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. -
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం
దేవరకొండ: విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాల సాధనకు నిరంతరం శ్రమించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం కొమ్మేపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, కల్పిస్తున్న వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌తో మాడ్లాడి త్వరలోనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. తరగతి గదిలోనే విద్యార్థులు తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల ఉన్నతికే గురుకులాలు కొండమల్లేపల్లి: విద్యార్థుల ఉన్నతికే గురుకులాలు పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం ఆయన కొండమల్లేపల్లి మండలం దంజిలాల్‌తండా ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించారు. పాఠశాలలో అందుతున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం కొండమల్లేపల్లి మండలం వర్ధమానిగూడెంలోని పీల్యతండాలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గుడితండాలో పెండ్లిపాకల రిజర్వాయర్ ముంపు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవరకొండకు వెళ్లారు. ఈ కార్యక్రమాల్లో కమిషన్ సభ్యులు రేణిగుంట ప్రవీణ్, లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డీఎస్పీ శ్రీనివాసరావు, డీటీడీఓ కమలాకర్‌రెడ్డి, ఆర్సీఓ శ్రీనివాసరావు, ఏసీఎంఓ వెంకటేష్ నాయక్, ఏటీడీఏ వెంకటేశ్వర్, కొండమల్లేపల్లి ఎంపీడీఓ స్వర్ణలత, తహసీల్దార్ నరేందర్, ఎంఈఓ ఆర్.నాగేశ్వర్రావు నాయక్, ఎంపీఓ సుధీర్‌కుమార్, సర్పంచులు, ప్రిన్సిపాల్ శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
16 గంటల పాటు విద్యుత్ అందించాలి
దేవరకొండ: వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 16 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని, దీనికి తోడు కరెంటు కోతలు విధిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిహారం చెల్లించాలని కోరారు. ధర్నాలో పల్లా దేవేందర్‌రెడ్డి, తూం బుచ్చిరెడ్డి, వెంకటరమణ, దేప సుదర్శన్‌రెడ్డి, కనకాచారి, వెంకటయ్య, జయరాములు, విజేందర్‌రెడ్డి, శైలేష్, రామస్వామి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మూసీ సమీపంలో ఉన్న శాలిగౌరారం, అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో గురువారం ఉదయం ఎగువ నుంచి మూసీకి 5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టడంతో మూసీకి వస్తున్న ఇన్‌ఫ్లో 2,050 క్యూసెక్కులకు తగ్గిపోయింది. మూసీ గరిష్ట నీటిమట్టం సామర్థ్యం 645 అడుగులు కాగా ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో గురువారం సాయంత్రానికి 641.20 అడుగుల వరకు చేరుకుంది. మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం మూసీ కుడి, ఎడమ కాల్వలకు 295 క్యూసెక్కులు చొప్పున మొత్తం 590 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 30 క్యూసెక్కుల నీరువృథా అవుతుంది. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.35 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. -
94413 62419
ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురితో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : -
నేడు జిల్లాకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక
నల్లగొండ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు ఈనెల 25న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ సభ్యులు శుక్రవారం ఉదయం 10 గంటలకు కొండమల్లేపల్లి మండలం, దంజిలాల్తండాలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలతోపాటు 10.30 గంటలకు పిల్యాతండా, 11 గంటలకు గుడితండా, మధ్యాహ్నం 12.30 గంటలకు దేవరకొండలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనగల్ మండలం రేగట్టే గ్రామానికి చేరుకొంటారని, భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా నుంచి తిరిగి హైదరాబాద్ వెళతారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు గురుకుల విద్యార్థులుహాలియా : హన్మకొండలో ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్న 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. నల్లగొండ జిల్లా అథ్లెటిక్స్ జట్టు ఎంపికల్లో భాగంగా స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన సెలక్షన్స్‌లో గురుకులానికి చెందిన 17మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. వీరిలో అండర్–18 విభాగం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థి దినేష్ (లాంగ్‌జంప్, జావెలిన్ త్రో), ప్రథమ సంవత్సరం విద్యార్థులు నిరంజన్ (షాట్‌ఫుట్), తేజ (జావెలిన్ త్రో) ఎంపికయ్యారు. అలాగే అండర్–16 విభాగంలో తొమ్మిదో తరగతి విద్యార్థి సంపత్ (హైజంప్), తనుష్ (జావెలిన్ త్రో).. అండర్–14 విభాగంలో ఎనిమిదో తరగతి విద్యార్థి నిఖిల్‌సింగ్ (ట్రైయాథ్లాన్–ఏ) రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచి పాఠశాలకు, జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ రవికుమార్, కళాశాల సిబ్బంది ఆకాంక్షించారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రమేష్ రామగిరి(నల్లగొండ) : గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నల్లగొండ మండలం చందనపల్లికి చెందిన సురిగి రమేష్‌గౌడ్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ గల ఆ సంఘం కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్యగౌడ్ చేతులమీదుగా రమేష్‌గౌడ్ నియామక పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గుండాల మల్లేష్ గౌడ్, శంకర్, పెద్ది వెంకటయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ అక్రమాలకు కేరాఫ్ థర్మల్ ప్లాంట్
మిర్యాలగూడ : దామరచర్లలో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ బీఆర్ఎస్ నేతల అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆరోపించారు. దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ వద్ద ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వనరులు లేని దామరచర్ల మండలంలో రాజకీయ లబ్ధికోసమే పవర్‌ప్లాంట్ నిర్మించారని, దానికి అవసరమైన బొగ్గును 250 కి.మీ దూరం నుంచి తీసుకొస్తున్నారని విమర్శించారు. దీనికి గాను ప్రభుత్వంపై ఏటా రూ.40వేల కోట్ల భారం పడుతోందన్నారు. ఏ మొఖం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు పవర్‌ప్లాంట్‌ను సందర్శించారని ప్రశ్నించారు. అనేక ఇబ్బందులున్నా ప్రజాప్రభుత్వం పవర్‌ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయిస్తోందని, సాంకేతిక కారణంగా ఒక యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే దాన్ని బూచి చూపి ప్రజలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టడం తగదన్నారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తమ అనుచరులకు, బంధువులకు కాంట్రాక్టుతోపాటు పరి హారం కింద కోట్ల రూపాయలు ఇప్పించి అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. నాడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో చూపిన ఆస్తులెన్ని తొమ్మిదినరేళ్ల పాలనలో మీరు సంపాదించిన ఆస్తులెన్నో తేల్చుకుందామని సవాలు విసిరారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, నూకల వేణుగోపాల్‌రెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి, పొదిల శ్రీనివాస్, సర్పంచ్‌లు రేణుకశ్రీ, శ్రావణి, పోకల వెంకటేశ్వర్లు, నాయకులు స్కైలాబ్‌నాయక్, ఇంద్రకుమార్, మోయిజ్, బాలునాయక్, టి.సైదులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -
వేలానికి మిగులు ధాన్యం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మిగులు ధాన్యాన్ని వేలం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో గత యాసంగి సీజన్లో ధాన్యం అధిక దిగుబడి రావడంతో ప్రభుత్వం ఎక్కువగా కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ ధాన్యాన్నే కొన్ని మిల్లులకు సామర్థ్యానికి మించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం అప్పగించింది. ప్రస్తుతం అందులో మిగిలిన ధాన్యాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. విక్రయానికి 1.35 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణంగా ప్రభుత్వం ఏటా కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల నుంచి 6.5 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేస్తుంది. గత యాసంగిలో అధిక దిగుబడి రావడంతో 7.74 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందులోని 45 మిల్లులకు కేటాయించిన ధాన్యంలోని 1,35,481 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రస్తుతం విక్రయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 28వ తేదీ వరకు బిడ్లు స్వీకరించనున్నారు. వేలం ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎంపికై న బిడ్డర్లకు ధాన్యాన్ని కేటాయించనుంది. వేలం ధర ఇలా.. ప్రభుత్వం మిగులు ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,389 చొప్పున వేలం వేయాలని నిర్ణయించింది. సాధారణంగా ప్రభుత్వం రైతులనుంచి కొనుగోలు చేసిన ధరనే వేలానికి ఖరారు చేసింది. దీంతో వేలంలో మిల్లర్లు పాల్గొంటారా లేదా అనేది అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికారుల తనిఖీలతో ఆందోళన ఒక పక్క బాయిల్డ్ రైస్ అవకాశం ఇవ్వకపోవడం, మరో పక్క మిల్లుల్లో తనిఖీలు చేయడం మిల్లర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.జిల్లాలో వేలం వేసిన ధాన్యానికి సంబంధించి ఏడు మిల్లులు మాత్రమే ప్రభుత్వానికి రూ.వందల కోట్ల బకాయి పడ్డాయని, కావాల్సివస్తే వాటిల్లో తనిఖీలు చేసుకోవాలని, అందుకు అసోసియేషన్ తరఫున సహకరిస్తామని, అంతేతప్ప తనిఖీల పేరుతో అందరినీ ఇబ్బందులపాలు చేయవద్దని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మిగులు ధాన్యాన్ని వేలం వేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బుధవారం మళ్లీ జిల్లాలో 5 మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ధాన్యం నిల్వ లెక్కలను పోల్చి చూస్తే తేడాలున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. గత బుధవారం కూడా రెండు మిల్లుల్లో లోపాలు ఉన్నట్లు తేలింది. పైగా ర్యాండమైజేషన్ పద్ధతిలో ఏ అధికారి ఏ మిల్లుకు ఏ రోజు వెళ్లాలనేది రాష్ట్ర స్థాయిలోనే పౌర సరఫరాల అధికారులు ప్రణాళికాబద్ధంగా తనిఖీలు చేపడుతుండడంతో మిల్లర్లతో ఆందోళన నెలకొంది. ఫ గత యాసంగిలో సామర్థ్యానికి మించి కేటాయింపు ఫ జిల్లాలో అదనంగా 1,35,481 లక్షల మెట్రిక్ టన్నులు ఫ ఆ ధాన్యమే వేలం వేస్తున్న యంత్రాంగం ఫ 28 వరకు బిడ్ల్ల దాఖలుకు అవకాశం ఫ మిల్లర్లు పాల్గొనడంపై అనుమానాలు యాసంగి ధాన్యం సేకరణ సమయంలో మిల్లర్లు ప్రభుత్వానికి బాయిల్డు రైస్‌కు అవకాశం ఇవ్వాలని విన్నవించుకున్నారు. యాసంగిలో వచ్చిన ధాన్యాన్ని రారైస్‌గా పడితే నూక శాతం అధికంగా ఉంటుందని, క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల రారైస్ ఇవ్వడం సాధ్యం కాదని, తాము నష్టపోతామని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్పట్లో కొంత మేర బాయిల్డ్ రైస్ ఇచ్చేలా అవకాశం కల్పించారు. ఆ తరువాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాట మార్చి పూర్తిగా రారైస్ ఇవ్వాలని చెప్పడంతో మిల్లర్లు సమ్మెబాట పట్టారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌పై పులుముకున్న రాజకీయం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోవడం రాజకీయ రంగు పులుముకుంది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని 4 వేల మెగావాట్ల యాదాద్రి ఽథర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గు కొరత కారణంగా రెండు యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోగా మరో రెండు యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బొగ్గు కొరత, సాంకేతిక కారణాల సాకుతో ఉత్పత్తి నిలిపివేశారని, విద్యుత్ సరఫరా చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, బొగ్గు రవాణా అంశాల్లో గత ప్రభుత్వ హయాంలోనే లోపాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం రాజకీయ రచ్చగా మారింది. బీఆర్ఎస్ శ్రేణుల పరిశీలన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు దామరచర్ల పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించారు. ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి పరిస్థితి, బొగ్గు నిల్వలు, యూనిట్ల పనితీరుపై వివరాలు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వ తీరుపై ఆయన మీడియాలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ సమస్య తీవ్రం అవుతుందని ఆరోపించారు. ఇళ్లకు విద్యుత్ కోతలు, పరిశ్రమలకు జనరేటర్లను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కరెంట్ లేక రైతులు డీజిల్, జనరేటర్లను ఉపయోగించాల్సి వస్తుందంటూ తీవ్రంగా విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి ప్లాంట్‌ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పోటీగా కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులు పవర్ ప్లాంట్‌ను సందర్శించిన విషయం రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో కాంగ్రెస్ నాయకులు కూడా ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్లాంట్‌ను సందర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు, నాయకుల లాభాల కోసమే నిర్మించిందంటూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శించారు. వారికి ఆ ప్లాంట్ లాభాలు తెచ్చే వనరుగా మారిందని అందులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బొగ్గే లేని చోట ఎలా నిర్మించారంటూ విమర్శించడంతోపాటు థర్మల్ పవర్ ప్లాంట్‌లో సాంకేతిక సమస్యను రాజకీయ అంశంగా మార్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలను దుయ్యబట్టారు. ప్రతిపక్ష, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల విమర్శలు, ప్రతి విమర్శలతో పవర్ ప్లాంట్ విద్యుతు ఉత్పత్తి అంశం రాజకీయ రచ్చకు దారితీసింది. ఫ బొగ్గు కొరతతో రెండు యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేత ఫ మరో రెండింటిలోనే కొనసాగింపు ఫ ప్లాంట్‌ను పరిశీలించిన బీఆర్ఎస్ శ్రేణులు ఫ పోటీగా పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు ఫ ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న ఇరు పార్టీల నేతలుమిర్యాలగూడ కేంద్రంగా ఇటీవల సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల అంశంగా రాజకీయ వివాదంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో రైతు దీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. నీటి విడుదల చేయాలని లేకపోతే పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. దీనికి పోటీగా అదేరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం అప్పట్లో చర్చనీయంశంగా మారింది. తాజాగా యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి అంశం కూడా ఇదే తరహాలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరుకు వేదికగా మారింది. -
వాన జోరు.. పులకించిన పైరు!
నల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లా అంతటా జోరువాన కురిసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 21.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అయితే జిల్లాలో 6.40 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా సరైన వర్షాలు లేవు. ఫలితంగా పత్తిచేలు పిందే దశలో సరైన ఎదుగుదల లేని కారణంగా వాడుబట్టాయి. కొన్ని ప్రాంతాల్లో జానెడు ఎత్తులోనే పత్తిచేలు పూత పూసి కాయదశకు చేరుకున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పత్తి పగిలి ఏరే దశలో ఉంది. అయితే ప్రస్తుతం కురిసిన వర్షాలు కొనఊపిరిలో ఉన్న పత్తి చేలకు జీవం పోసినట్లయింది. ఎండితున్న వరిచేలు, ఇతర మెట్టపంటలకు కూడా మేలు జరిగింది. ఈ సీజన్లో తక్కువ వర్షాలు కురుస్తున్నందున పెట్టిన పెట్టుబడులు కూడా చేతికొచ్చే పరిస్థితి కనపడటం లేదని, ఈ నేపథ్యంలో బుధవారం నుంచి గురువారం వరకు కురిసిన వర్షంతో రైతులు ఆనందపడుతున్నారు. కేతేపల్లి, శాలిగౌరారం మండలాల్లో అత్యధికం జిల్లాలోని కేతేపల్లి మండలంలో అత్యధికంగా 69.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా ఆ తర్వాత శాలిగౌరారం మండలంలో 67.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గట్టుప్పల్, కొండమల్లేపల్లి మండలాల్లో 2 మి.మీ. నుంచి 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షమొచ్చినా.. కుంటల్లోకి చేరని నీరు బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లపై వరదనీరు ప్రవహించింది. పలు చోట్ల పత్తిచేలు, వరిపొలాల్లోకి భారీగా నీరు చేరాయి. కానీ ఈ సీజన్లో చాలా రోజుల తర్వాత వర్షం కురడంతో ఇప్పటికే నెర్రెలు బారిఉన్న పొలాలు, భూముల్లోకే వర్షపునీరు ఇంకిపోయింది. దీంతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి వరద నీరు చేరిన దాఖలాలు పెద్దగా కనిపించలేదు. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో పత్తిచేలకు ఎంతో మేలు జరగనుంది. వాడు దశలో ఉన్న చేలకు వర్షం జీవం పోసినట్లయింది. రైతులు అదును చూసుకుని ఎరువులు తెచ్చుకుంటే మంచిది. ఇప్పుడు ఎరువులు పెట్టుకుంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. – వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి ఫ వాయుగుండం కారణంగా అన్ని మండలాల్లో కురిసిన వర్షం ఫ జిల్లాలో 21.7 మి.మీ. సగటు వర్షపాతం నమోదు ఫ వాడుబడిన పత్తిచేలు, వరిపొలాలకు జీవం ఫ ఆనందంలో రైతాంగం -
చరిత్రను అధ్యయనం చేయాలి
రామన్నపేట : విద్యార్థులు చరిత్రను అధ్యయనం చేయాలని ప్రముఖ సాహితీవేత్త తెలుగుశాఖ అధ్యక్షుడు డాక్టర్ తండు కృష్ణకౌండిన్య అన్నారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు గురువారం విష్ణుకుండినుల రాజధానిగా వెలుగొందిన ఇంద్రపాలనగరంలోని చారిత్రక ప్రదేశాలను, పురాతన శివాలయాన్ని సందర్శించారు. ఇంద్రపాలనగరం చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కో ఆర్డినేటర్ డాక్టర్ డి.కిషన్ పరిపాలనా అధికారి జి.కరుణాకర్ అధ్యాపకులు అమర్, నరేష్, రాంబాబు, కిరణ్ పాల్గొన్నారు. -
స్వచ్ఛత సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి
నల్లగొండ : స్వచ్ఛత సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఎఫ్‌సీఐ నల్లగొండ డివిజన్ మేనేజర్ సువీన్కుమార్ అన్నారు. ఆయన గురువారం నల్లగొండలో స్వచ్ఛతా హి సేవ–2026లో భాగంగా ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా జ్ఞానయాత్రలో పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి–పొడి చెత్తగా వేరు చేసి సిబ్బందికి అందించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లను చిన్ననాటి నుంచే అలవరచుకోవాలని సూచించారు. విద్యార్థులు స్వచ్ఛత దూతలుగా మారి పరిశుభ్రత ప్రాముఖ్యతను ఇతరులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలె వెంకటయ్య, ఎఫ్‌సీఐ సీనియర్ అధికారులు పవన్, ఆదిమల్ల శంకర్, కాశిరెడ్డి , ధీరజ్, ఉద్యోగులు షాహిద్, ప్రవీణ్, యమున, మమత, దివ్య, క్రాంతి, అజయ్, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిమజ్జనానికి నీళ్లు అందించలేని ప్రభుత్వం
వేములపల్లి : గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కనీసం నీరు అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. బుధవారం వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాల్వ వద్ద గణేష్ నిమజ్జన ప్రదేశాన్ని మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి పరిశీలించారు. అనంతరం కాల్వలోకి దిగి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. గణేష్ నిమజ్జనం కోసం నీటిని అందుబాటులో ఉంచాల్సిన అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులు, ప్రజల పట్ల, చివరికి దేవుడి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుట్టల సందీప్‌కుమార్, నాయకులు పాలుట్ల బాబయ్య, చిర్ర మల్లయ్యయాదవ్, నిమ్మల నవీన్‌రెడ్డి, నాగవెల్లి శంకర్, యాదగిరి, శేఖర్‌రెడ్డి, కోటయ్య పాల్గొన్నారు. ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలం : కంచర్ల నల్లగొండ : వినాయక నిమజ్జన ఏర్పాట్లలో ప్రభుత్వం, స్థానిక అధికారులు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన నల్లగొండలోని పాతబస్తీలోని మొదటి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు, అధికార యంత్రాంగంతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమజ్జన ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత ప్రాధాన్యత ఉన్న పాతబస్తీ మొదటి విగ్రహ విశిష్టతను తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చీర పంకజ్‌యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మండల అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి -
చివరి వరకు అప్రమత్తతే ప్రధానం : ఎస్పీ
వేములపల్లి : నిమజ్జనం చివరి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. బుధవారం వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాల్వ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కేంద్రాన్ని డీఎస్పీ రవితో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ నిమజ్జన ప్రదేశాన్ని ఆర్డీఓ రమణారెడ్డితో కలిసి పరిశీలించారు. వీరివెంట మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్రావు, తహసీల్దార్ హేమలత, ఎంపీడీఓ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ శ్రీజారెడ్డి, సీఐ పీఎన్డీ ప్రసాద్, విద్యుత్ ఏడీ ఇందిరా, వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు, ఏఈ నాగరాజు, వైద్యాధికారి డాక్టర్ సుచరిత, ఆర్ఐ స్పందన, సర్పంచ్ పుట్టల సందీప్‌కుమార్ ఉన్నారు. -
కనులపండువగా గణేష్ శోభాయాత్ర
ఫ జిల్లాలో ప్రశాంతంగా నిమజ్జనం ఫ తీన్మార్ స్టెప్పులతో అలరించిన యువత ఫ అర్ధరాత్రి వరకు కొనసాగిన వేడుకలు నల్లగొండలోని క్లాక్‌టవర్ సెంటర్ గుండా సాగుతున్న గణేశ్ శోభాయాత్రనల్లగొండ: నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడి నిమజ్జన వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా కనుల పండువగా జరిగాయి. అంతటా గణేష్ శోభాయాత్ర శోభాయమానంగా కొనసాగింది. వేలాది మంది భక్తులు, యువకులు, మహిళలు, చిన్నారుల జయజయధ్వానాలు, గణపతి బప్పా మోరియా నినాదాలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలు, తీన్మార్ స్టెప్పుల నడుమ బొజ్జ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో గణేశుడి శో భాయాత్ర ఆధ్యాత్మికకోలాహలంగా కొనసాగింది. పాతబస్తీలో కలెక్టర్, ఎస్పీ తొలిపూజతో శోభాయాత్ర ప్రారంభం శోభాయాత్ర ప్రారంభం సందర్భంగా నల్లగొండలోని పాతబస్తీలోని మూడో నంబర్ వినాయకుడి వద్ద, హనుమాన్ నగర్‌లోని ఒకటో నంబర్ వినాయక విగ్రహాల వద్ద కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ తొలి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అధికారులు స్వయంగా పాల్గొని పూజలు చేయడం భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మేయర్, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. శాంతి, గణేష్ ఉత్సవ కమిటీల భాగస్వామ్యంతో శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జిల్లావ్యాప్తంగా దాదాపు 8 వేలకుపైగా విగ్రహాలను ప్రతిష్ఠించగా ఇందులో కేవలం నల్లగొండ పట్టణంలో 568 విగ్రహాలు ఉన్నాయి. ఐదు రోజులుగా దాదాపు 6 వేలు విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. వచ్చే మూడు రోజుల్లో మరో 2 వేలు విగ్రహాల నిమజ్జనం పూర్తికానుందని అధికారులు తెలిపారు. నల్లగొండలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిమజ్జన ప్రదేశాల్లో బారికేడ్లు, రాత్రి వేళల్లో లైటింగ్, క్రేన్లు, తాగునీరు, షామియానాలను ఏర్పాటు చేశారు. 10 అడుగుల లోపు విగ్రహాలు అర్జాలబావిలోని వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం చేసేలా క్రేన్లు సిద్ధం చేశారు. 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భారీ విగ్రహాలు సాగర్ ఎడమకాల్వ 14వ మైలు వద్ద నిమజ్జనం చేసేలా మార్గాలను నిర్దేశించారు. 14వ మైలురాయి వద్ద తగినంత నీరు ఉండడంతో నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా కూడా నిమజ్జన ప్రదేశాల్లో వైద్య, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పోలీసుల భారీ బందోబస్తు ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో నల్లగొండ పట్టణంతోపాటు జిల్లా అంతటా భారీ బందోబస్తు నిర్వహించారు. బుధవారం ఒక్కరోజే జిల్లాలోని 8 ప్రధాన నిమజ్జన ప్రదేశాల్లో దాదాపు 2 వేల విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని భావించి ట్రాఫిక్ మళ్లింపు, రూట్ డైవర్షన్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, భక్తులు, యువత, చిన్నారులు పాల్గొన్నారు. నల్లగొండలోని పాతబస్తీలో ఒకటో నంబర్ వినాయక మండపం వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాట భక్తుల తీవ్ర పోటీ నడుమ ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేలంలో పర్వతం అశోక్ లడ్డూను అత్యధికంగా రూ.5.14 లక్షలకు పాటపాడి దక్కించుకున్నాడు. భక్తులు పోటాపోటీగా పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. -
నిమజ్జనం కోసం ఎడమ కాల్వకు నీటి విడుదల
హాలియా (నాగార్జునసాగర్): వినాయక నిమజ్జనం కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికి 14 మైలు వరకు నీరు చేరేందుకు గాను మధ్యాహ్నం 2,765 క్యూసెక్కుల నీటిని వదిలారు. మూడు వేల క్యూసెక్కుల మేరకు నీటిని విడుదల చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. సాగర్ జలాశయం నీటిమట్టం గరిష్టంగా 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 535.80 అడుగులు (179.6902టీఎంసీలు)గా ఉంది. కుడి కాల్వకు నీటిని నిలిపివేశారు. ఎస్సెల్బీసీకి 2,000 క్యూసెక్కులు, వరద కాల్వకు 300 క్యూసెక్కులతో కలిపి మొత్తం 5,065 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. అంతే నీరు ఎగువ నుంచి వచ్చి జలాశయంలో చేరుతుందని అధికారులు తెలిపారు. వ్యవసాయ వ్యర్థాలతో సేంద్రియ ఎరువులునకిరేకల్ : వ్యవసాయ వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని వాటిని పంటలకు వినియోగించుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాదించవచ్చని నాబార్డు డీడీఎం వెంకటేశ్వర్లు అన్నారు. నకిరేకల్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వర్మి కంపోస్ట్ సొల్యూషన్, అగ్రి హబ్ సౌజన్యంతో వ్యవసాయ వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీపై బుధవారం నకిరేకల్ మండలం నెల్లిబండలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు ఐఆర్డీఎస్ అధ్యక్షుడు వాడపల్లి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఏడీఏ విజేయందర్‌రెడ్డి, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజన్ వినయ్‌కుమార్, నెల్లిబండ సర్పంచి ఆడెపు రాఘవులు, ఏఈఓ ఇదాయ తుల్లా, ప్రతినిదులు భూపాల్, శ్రీనివాసులు, వాడపల్లి శ్రీనివాస్, యంపల్ల దశరథరెడ్డి, నంద్యాల అఖిల్‌రెడ్డి, ఓరుగంటి రామ్మూర్తి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా బెజ్జం సాయినల్లగొండ : సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా దామరచర్ల మండలం దిలావర్పూర్ గ్రామ సర్పంచ్ బెజ్జం సాయి నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు పంచాయతీ రాజ్ చాంబర్స్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి నియామకపత్రం అందజేశారు. అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చింతలపూడి భాస్కర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చాట్ల చిరంజీవి నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నియామకానికి కృషిచేసిన సత్యనారాయణరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సేవా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానంనల్లగొండ : అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధులకు సేవలు అందిస్తున్న సంస్థలు, వ్యక్తులకు సేవా పురస్కారాలకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి డి.లావణ్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో లభిస్తాయని పూర్తి చేసిన దరఖాస్తులను అదే కార్యాలయంలో అక్టోబర్ 26 వరకు సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.wdrc.teangana.gov.in వెబ్సైట్ సంప్రదించాలని కోరారు. -
బెనిఫిట్స్ పెంచాలని న్యాయవాదుల ధర్నా
నల్లగొండ: న్యాయవాదులకు రిటైర్మెంట్, డెత్ బెనిఫిట్స్ రూ.25 లక్షలకు పెంచడంతోపాటు జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల స్టైఫండ్ అందించి ఆదుకోవాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐలు జాతీయ కౌన్సిల్ పిలుపు మేరకు బుధవారం నల్లగొండ కోర్టు కాంప్లెక్స్ ఎదుట న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ కేంద్ర న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం–2001ను తక్షణమే సవరించాలన్నారు. న్యాయవాదుల వైద్య సహాయం నిమిత్తం రూ.5 లక్షలు మంజూరు చేయాలన్నారు. ధర్నాలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సతీష్ కుమార్, బి.అశోక్ కుమార్, సీనియర్ న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాస్‌రెడ్డి, ఐలు జిల్లా నాయకులు పి.బ్రహ్మచారి, సత్తయ్య, యాదయ్య, వంశీకృష్ణ, నాగిరెడ్డి, దుర్గాప్రసాద్, సింగం శ్రీనివాస్, ఠాగూర్, లాలయ్య, జమీల్, మసీదున్, బి.గణేష్, సంపత్ కుమార్, జి.కిషోర్ కుమార్, డి.నర్సాజి, పోలగోని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులు నీటిలోకి దిగకుండా చూడాలి : కలెక్టర్
నార్కట్‌పల్లి, చిట్యాల : వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో భక్తులు నీటిలోకి దిగకుండా చూడాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం చెరువు, చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులోని పెద్ద చెరువు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన చోటనే విగ్రహాలు నిమజ్జనం చేయాలన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట నార్కట్‌పల్లి తహసీల్దార్ వేణుగోపాల్‌రావు, ఎంపీడీఓ ఉమేష్, చిట్యాల ఎంపీడీఓ పాండు, నార్కట్‌పల్లి ఏపీఓ సుధాకర్, చిట్యాల డీటీ విజయ, ఎంపీఓ కోటేష్, ఏపీ లింగోటం సర్పంచ్ పనస సరోజవెంకటయ్య, ఉప సర్పంచ్ కొరివి శంకర్, ఆర్ఐలు యాదయ్య, భవాని ఉన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రీకి స్పెషల్ డ్రైవ్
ఈ నెలాఖరు వరకు నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్‌లో రైతులు విధిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకోని రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించవు. అధికారులకు రైతులు సహకరించి వందశాతం రిజిస్ట్రీ పూర్తిచేసేలా చూడాలి. – వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి నల్లగొండ అగ్రికల్చర్ : రైతులందరి చేత ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంగళవారం నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ నెల 30వ తేది వరకు గడువు విధించింది. ఉదయం 8 గంటల వరకు వ్యవసాయ అధికారులు గ్రామాలకు చేరుకుని రిజిష్ట్రేషన్ చేయించని రైతులను గుర్తించి రిజిస్ట్రీ చేయించనున్నారు. దీంతో పాటు మీసేవ కేంద్రాల్లో కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు చేయించుకునే అవకాశం కల్పించారు. 5,68,711 మంది రైతులకు.. కేంద్ర ప్రభుత్వం గతేడాది జనవరిలో ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. ప్రతి రైతు భూమి వివరాలను ఫోన్ నంబర్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఆన్లైన్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 33 మండలాల్లో 5,68,711 మంది రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకాలను కలిగి ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 71 శాతం మంది మాత్రమే రిజిస్ట్రీ పూర్తి చేసుకున్నారు. పథకాలకు రిజిస్ట్రీ ఐడీ తప్పనిసరి ఇక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సబ్పిడీ పథకాలతో పాటుగా యాప్ ద్వారా ఎరువులను పొందాలన్నా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీ తప్పనిసరిగా ఉండాల్సిందే. అదేవిధంగా వానాకాలం, యాసంగి సీజన్లలో పండించిన పంటల అమ్మకాలు, పంట రుణాలను పొందాలన్నా ఫార్మర్ ఐడీ తప్పనిసరి. ఇక రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి కూడా ఫార్మర్ ఐడీని అనుసంధానం చేసే అవకాశం లేకపోలేదు. ఫ ఏడాదిన్నర గడిచినా 71 శాతమే.. ఫ నెలాఖరు వరకు పూర్తిచేయాలని లక్ష్యం ఫ క్షేత్ర స్థాయిలోనే రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు -
యువ ‘ఆపదమిత్ర’శిక్షణ పూర్తి
రామగిరి(నల్లగొండ) : అన్నెపర్తిలోని 12వ బెటాలియన్ టీజీపీఎస్సీ కమాండెంట్ కెబి.రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆపదమిత్ర మొదటి బ్యాచ్ శిక్షణ మంగళవారం ముగిసింది. ముగింపు వేడుకకు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరైన మాట్లాడారు. అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో యువ ఆపద మిత్రలు.. పోలీస్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు తోడుగా నిలిచి ప్రజలకు తగిన సహాయసహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, అత్యవసర రక్షణ పరికరాలతో కూడిన కిట్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి ఎం.గౌతమ్‌రెడ్డి, అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న, ఆర్ఐ రవీందర్ పాల్గొన్నారు.నేడు విద్యాసంస్థలకు సెలవునల్లగొండ : గణేష్ నిమజ్జనం సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రహదారులపై రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, భారీగా విగ్రహాల నిమజ్జనం ఉన్నందున విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ స్థానిక సెలవుకు బదులుగా రాబోయే సాధారణ సెలవు దినమైన 10.10.2026 (రెండవ శనివారం) జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు సాధారణ పనిదినంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ ఉత్తర్వులను జిల్లాలోని విద్యాశాఖ అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని ఆయన సూచించారు. 25న జాబ్మేళానల్లగొండ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 25న ఉదయం 10.30 గంటలకు నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీఐ క్యాంపస్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.సాహితి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగులు అదేరోజు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు. అర్హత, వేతనం, తదితర పూర్తి వివరాలకు 08682 233362 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించొద్దుదేవరకొండ : నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ కె.రాహుల్ హెచ్చరించారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న బాలాజీ ఎక్స్‌రే సెంటర్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. దేవరకొండలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్ల యాజమాన్యాలు తమ రిజిస్ట్రేషన్, అనుమతులు, లైసెన్సును గడువు ముగియక ముందే పునరుద్ధరించుకోవాలని సూచించారు. తనిఖీల్లో ప్రోగ్రాం అధికారి నగేష్, అంజయ్యగౌడ్, విజయప్రసాద్, కలీం, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. చెర్వుగట్టు హుండీ ఆదాయం 39,53,542 నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాననికి భక్తులు విచ్చేసి స్వామి వారికి మొక్కుబడిగా 67 రోజుల్లో సమర్పించిన కానుకల హుండీలను మంగళవారం ఆలయ మహా మండపంలో లెక్కించారు. రూ.39,53,542 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ మోహన్‌బాబు తెలిపారు. అన్నదానం హుండీ ద్వారా రూ.37,771 వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ వరాల రమేష్, ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ, ధర్మకర్తలు యాదయ్య, మల్లేష్, రేగట్టె శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, సంపత్, రఘునాథ్, అనిత, శ్రీను, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
సందర్శనతోనే విజ్ఞానం
పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వల్ల విద్యార్థులకు విజ్ఞానం కలుగుతుందని ప్రేమ్‌కరణ్ రెడ్డి అన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని డీఏఓ, ఏఓలు సూచించారు. - 8లోబుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026నల్లగొండ టూటౌన్ : నవరాత్రులు పూర్తికావడంతో గణపయ్య నిమజ్జలనానికి వేళయింది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా చెరువు, కాల్వల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు గణపయ్యల నిమజ్జనం కోసం నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నల్లగొండ పట్టణంలోని 10 ఫీట్లలోపు విగ్రహాలను ఆర్జాలబావి వల్లభరావు చెరువులో.. అంతకంటే ఎత్తున్న విగ్రహాలను వేములపల్లి వద్ద సాగర్ ఎడమకాల్వలో నిమజ్జనం చేయనున్నారు.. 15 ఫీట్లలోపు వరకు ఉన్న విగ్రహాలు 14వ మైలురాయి వద్ద నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను పోలీస్ యంత్రాంగం ఖరారు చేసింది. ఒకటో నెంబర్ విగ్రహం నుంచి శోభాయాత్ర.. నీలగిరి నగరంలోని పాతబస్తీ హనుమాన్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఒకటో నెంబర్ విగ్రహం వద్ద బుధవారం శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. పాతబస్తీ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, రాష్ట్రపతి రోడ్, పెద్ద గడియారం సెంటర్‌కు చేరుకుంటుంది. నగరంలోని అన్ని కాలనీల పెద్ద విగ్రహాల వాహనాలు అన్ని ఇక్కడికి వస్తాయి. గడియారం సెంటర్ నుంచి రామగిరి, సావర్కర్‌నగర్, పానగల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు శోభాయాత్ర నిర్వహించి అక్కడి నుంచి పెద్ద విగ్రహాలు వేములపల్లి ఎడమకాల్వ వద్దకు, చిన్న విగ్రహాలు వల్లభరావు చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేయనున్నారు. ఇప్పటికే నిమజ్జనం చేసే ప్రాంతాల్లో భారీ కేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేసి క్రేన్లను అందుబాటులో ఉంచారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్లగొండ : గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6,184 గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సుమారు వెయ్యి మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. డీజేలు.. బాణాసంచాకు నో.. శోభాయాత్రలో డీజేలు, బాణాసంచాకు అనుమతి లేదు. మద్యం సేవించి వాహనాలు నడిపితే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు. ‘జీరో యాక్సిడెంట్–జీరో ఇన్సిడెంట్’ లక్ష్యంతో నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన పట్టణ సమీపంలోని వల్లభరావు చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ మంగళవారం రాత్రి పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వారి వెంట ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ఉన్నారు. 10 అడుగుల వరకు ఉన్న విగ్రహాలు ఈ రూట్లో వెళ్తాయినల్లగొండలోని వల్లభరావు చెరువు వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్వల్లభరావు చెరువు, భీమసముద్రం, 14వ మైలు, వేములపల్లి సాగర్ కెనాల్, మిర్యాలగూడ, వాడపల్లి, నాగార్జునసాగర్, ఎడమకాలువ కొత్త బ్రిడ్జి, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, దేవరకొండ కొండబీమనపల్లి, డిండి, పెద్దమునిగల్ సాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు, పికెట్లు, ఫ్లడ్‌లైట్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.ఫ నిమజ్జనం కోసం ఎడమకాల్వకు నీరు విడుదలహలియా : నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు అధికారులు సోమవారం నీటిని నిలుపుదల చేయడంతో గణేష్ నిమజ్జనానికి పెద్ద ఆటకంగా మారింది. ఏటా అనుముల మండలంలోని అలీనగర్ (14వ మైలు రాయి) వద్ద సాగర్ ఎడమ కాలువలో నిమజ్జనం చేస్తుంటారు. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సిద్ధమైయ్యారు. అందుకు అనుగుణంగా అధికారులు కూడా సాగర్ ఎడమకాల్వ వద్ద ఏర్పాట్లు చేశారు. భారీ విగ్రహాలను ఎడమ కాల్వలో నిమజ్జనం చేసేందుకు క్రేన్లను తీసుకొచ్చారు. కానీ ఎడమ కాల్వకు సోమవారం రాత్రి నీటిని నిలిపి వేయడంతో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. కానీ.. మంత్రి, కలెక్టర్ ఆదేశాలతో నీరు విడుదల చేస్తారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. నల్లగొండలోని పెద్ద విగ్రహాలు వేములపల్లికి.. 10 ఫీట్లలోపువి వల్లభరావు చెరువుకు.. -
ఆయుష్ సేవలను విస్తరించాలి
నల్లగొండ టౌన్ : ఆయుష్ సేవలను గ్రామీణస్థాయిలో విస్తరించాలని ఆయుష్ శాఖ రాష్ట్ర రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవినాయక్ అన్నారు. ధన్వంతరి జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఆయుష్ శాఖ కార్యాలయంలో ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలోని హెర్బల్ గార్డెన్లో మొక్కలు నాటి మాట్లాడారు. ఆయుర్వేదంతో పాటు యునాని, హోమియోపతి వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయుష్ వైద్యంలో ఔషధ మొక్కలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రతి ఒక్కరూ ఔషధ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపాలని కోరారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వైద్య సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ సేవలు అందిస్తున్న సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుహాసిని సోలోమోనిని సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ రుచిత, డీపీఎం కళ్యాణ్, ఫార్మసిస్టులు భుజంగరావు, విజయలక్ష్మి, మెర్సీ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల జీవితాన్ని మార్చేది గురువులే..
నల్లగొండ : విద్యార్థుల జీవితాలను మార్చేది గురువులేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు.. జీవిత లక్ష్యాలను నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్లగొండలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానోత్సవానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 10 శాతం తగ్గగా.. నల్లగొండ జిల్లాలో మాత్రం 9 శాతం పెరగడం.. ఇక్కడి ఉపాధ్యాయుల పనితీరుకు నిదర్శనమన్నారు. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపడానికి గల కారణాలపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ఇందులో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నల్లగొండలో రూ.200 కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని తెలిపారు. చదువు మధ్యలోనే మానేసేవారి వివరాలను సేకరించి అందుకు గల కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. సృజనాత్మకతను వెలికితీయాలి.. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమమన్నారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శ్రీపాల్‌రెడ్డి, శంకర్‌నాయక్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య, ఎస్పీ శరత్చంద్ర పవార్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, డీఈఓ సుశీందర్‌రావు, కార్పొరేటర్ గుమ్మల జానకి తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
రైస్ మిల్లర్లకు తనిఖీల గుబులు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం నిల్వల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. రైస్ మిల్లుల్లో ప్రతి బుధవారం తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. తనిఖీలకు వెళ్లే అధికారులను కూడా ర్యాండమైజేషన్ విధానంలో ఎంపిక చేసి, రాష్ట్రస్థాయిలోనే ఖరారు చేయడం ద్వారా ఎక్కడా ముందస్తు సమాచారం లేకుండా తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. గత వారం నిర్వహించిన తనిఖీల్లో పలు రైస్ మిల్లుల్లో నిల్వలు, రికార్డులు, ధాన్యం లెక్కల్లో లోపాలు బయటపడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో మిల్లులపై మరింత నిఘా పెంచారు. లోపాలు ఉంటే నోటీసుల జారీ.. ప్రతి బుధవారం తనిఖీలు నిర్వహించాలన్న నిర్ణయంలో భాగంగా పోయిన బుధవారం జిల్లా అధికారులు పలు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. చిట్యాలలోని రెండు మిల్లుల్లో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అఽధికారి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. వాటిల్లో 2024–25 వానాకాలం, యాసంగి, 2025–26 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఉండాల్సిన దానికంటే తక్కువ ధాన్యం ఉన్నట్లు తేల్చారు. వారికి నోటీసులు జారీ చేశారు. తదుపరి చర్యలుచేపట్టనున్నారు. ఈనెల 23వ తేదీన మరిన్ని మిల్లుల్లో తనిఖీలు చేపట్టనున్నారు. మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలను పరిశీలించడంతోపాటు రికార్డుల్లో నమోదైన వివరాలు, వాస్తవ నిల్వలను సరిపోల్చి చూడనున్నారు. రంగంలోకి తహసీల్దార్లు, డీటీలు.. ఇప్పటివరకు సంబంధిత శాఖల అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలకు అదనంగా ఈసారి నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను కూడా రంగంలోకి దింపుతున్నారు. వారికి కేటాయించిన మిల్లులకు వెళ్లి ధాన్యం నిల్వలను ప్రత్యక్షంగా పరిశీలించడంతోపాటు రికార్డులను తనిఖీ చేయనున్నారు. తనిఖీల్లో ఏవైనా తేడాలు, అక్రమాలు గుర్తిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు నోటీసులు జారీ చేసి, పెద్ద మొత్తంలో తేడాలు ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. తనిఖీలపైనా సూపర్ చెక్ జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు పూర్తి చేశాక వాటికి సంబంధించిన నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఈ తనిఖీలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు సూపర్ చెక్ చేస్తారు. ఆ వివరాలు సరిగా లేకుంటే సదరు ఆ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల జిల్లా స్థాయి అధికారులు నిర్వహించిన తనిఖీల్లో తేడాలు ఉన్నట్లుగా సూపర్చెక్లో తేలింది. వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫ ప్రతి బుధవారం మిల్లుల్లో తనిఖీలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఫ తనిఖీలకు వెళ్లే అధికారులకు రాష్ట్రస్థాయిలోనే ర్యాండమైజేషన్ ఫ జిల్లా అధికారుల తనిఖీలపై ఉన్నతస్థాయిలో సూపర్ చెక్ -
మత్తు రహిత సమాజాన్ని నిర్మించాలి
రామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ ఎన్జీ కళాశాల ఎన్సిసి క్యాడెట్లు మారక ద్రవ్యాల (డ్రగ్స్) వినియోగానికి వ్యతిరేకంగా మంగళవారం నల్లగొండ పట్టణంలో బృహత్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి – ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ చిలుముల సుధాకర్, సుబేదార్ కొమ్ము మల్లయ్య మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి, గంజాయి, ఇతర డ్రగ్స్ నియంత్రణకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. -
భూసేకరణ వేగవంతం చేయాలి
మర్రిగూడ (చింతపల్లి) : డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న చింతపల్లి రిజర్వాయర్ భూసేకరణ పనులతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అధికారులను ఆదేశించారు. దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌రెడ్డి, భూసేకరణ, రెవెన్యూ అధికారులతో పాటు భూములు కోల్పోతున్న చింతపల్లి, నసర్లపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగా డిండి ప్రాజెక్టులో కీలకమైన చింతపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. చింతపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పురోగతి, రైతులకు పరిహారం చెల్లింపు తదితర వివరాలను సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్థియాన్ మావి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వనజారాణి, లీల, చింతపల్లి తహసీల్దార్ విజయలక్ష్మి, ప్రాజెక్టు ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.ఫ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ -
గణపయ్య మునగలే గంగలో..
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వలో గణపయ్య విగ్రహాలు తేలాయి. గణేష్ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను మూడో రోజు నుంచి వేములపల్లి వద్ద సాగర్ ఎడమకాల్వలో భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. సోమవారం రాత్రి కాల్వకు నీటిని నిలిపివేయడంతో ప్రవాహం తగ్గిపోయింది. దీంతో మంగళవారం వేములపల్లి వద్ద కాల్వ అడుగు భాగంలో విగ్రహాలు పైకి తేలాయి. అయితే, బుధవారం పెద్ద ఎత్తున నిమజ్జనాలు ఉండడంతో కాల్వకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. -
ఖమ్మంలో డిప్యుటేషన్ రద్దు, నల్లగొండకు కేటాయింపు
ఖమ్మం సహకారనగర్ : ఖమ్మం జిల్లా పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న జె.నాగలక్ష్మి డిప్యుటేషన్‌ను రద్దుచేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సూర్యాపేట జిల్లాలో డీటీగా జె.నాగలక్ష్మి పోస్టింగ్ ఉండగా, ఇకపై నల్లగొండ జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయానికి డిప్యుటేషన్ కేటాయించారు. ఈమేరకు ఆమెను ఖమ్మంలో వెంటనే రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణనల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగా దాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. పోలీస్‌శాఖను ప్రజలకు చేరువ చేయాలనే పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడల్‌స్కూల్ ఉపాధ్యాయుడికి అవార్డుశాలిగౌరారం : తెలుగు భాషాభివృద్ధికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా శాలిగౌరారం మండలంలోని వల్లాల ప్రభుత్వ మోడల్‌స్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు కుక్కడపు శ్రీనివాసులు ఇన్నోవేషన్ టీచర్ అవార్డును అందుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జఠాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, తెలంగాణ మోడల్‌స్కూల్స్ ఏఎంఓ మంజరీ చేతులమీదుగా శ్రీనివాసులు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులును ఉపాధ్యాయులు అభినందించారు. పచ్చదనం పెంపునకు సహకరించాలిమిర్యాలగూడ అర్బన్ : రైల్వే ప్రయాణికుల రక్షణ కోసం రైల్వే పోలీసులుగా ఎంతగానో కృషి చేస్తున్నామని రైల్వే ఏఎస్ఐ సుబ్బారావు అన్నారు. సోమవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. రైల్వే స్టేషన్లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే కానిస్టేబుళ్లు ఎన్.కె.మీనా, ఆర్.జ్యోతి, ఇతర రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యవసాయ విద్యుత్‌కు ప్రాధాన్యం
చిట్యాల, తిప్పర్తి, మాడుగులపల్లి : వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాలోని చిట్యాల, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల్లో సబ్స్టేషన్లు, రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. తొలుత చిట్యాల మండలం ఆరెగూడెం సబ్‌స్టేషన్‌ను సందర్శించిన వ్యవసాయ విద్యుత్ సరఫరా, ఫీడర్ల స్థితిగతులపై ఆరా తీశారు. సబ్‌స్టేషన్ సమీపంలోని వరి పొలాలను సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడారు. తర్వాత తిప్పర్తి మండలం కేశరాజుపల్లిలో వరి పొలాలను సందర్శించిన బోరుద్వారా సాగునీటి ప్రవాహాన్ని పరిశీలించారు. పొలాల్లోనే రైతులతో ముఖాముఖి సమావేశమై పంటల సాగు పరిస్థితులు, నీటి లభ్యత, విద్యుత్ సరఫరాపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందన్నారు. తర్వాత మాడుగులపల్లి మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, ఎస్ఈ శ్రీనివాసులు, ఆపరేషన్ డీఈ విద్యాసాగర్‌రావు, నల్లగొండ రూరల్ ఏడీఈ ఎల్.శ్రీను, మిర్యాలగూడ రూరల్ ఏడీఈ ఇందిరా, ఏఈలు రవీందర్‌రెడ్డి, శివకుమార్, మణిదీప్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్ -
బాపూజీకి నివాళి
నల్లగొండ టౌన్ : కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నల్లగొండలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి సోమవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు పుట్ట వెంకన్న గౌడ్, కోట్ల సునీత, వీరమల్లు నాగరాజు గౌడ్, కర్నాటి మచ్చ గిరి, నాగరాజు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎవరిని బరిలో ఉంటారన్నది త్వరలోనే తేలనుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ.. పోటీలో నిలిపే అభ్యర్థి విషయంలో ఓ స్పష్టతకు రాగా, కాంగ్రెస్ పార్టీ ఇంకా సర్వేలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విషయంలో ఆలోచనలు చేస్తోంది. ఈ నెల 28వ తేదీన ఓటర్ల జాబితా ఖరారుకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీలో ఆశావహులపై సర్వే ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఆ పార్టీ ఆశావహుల పేర్లతో సర్వే చేస్తోంది. నల్లగొండ జిల్లా నుంచి గుత్తా అమిత్‌రెడ్డి, పున్నా కైలాష్ నేత, సూర్యాపేట జిల్లా నుంచి పటేల్ రమేష్‌రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, వరంగల్ జిల్లా నుంచి సింగారపు ఇందిర, దొమ్మాటి సాంబయ్య, ఖమ్మం జిల్లా నుంచి లోకేష్‌యాదవ్ పేర్లపై చేపట్టిన సర్వే పూర్తి కావచ్చింది. ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి ముందే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థిపై స్పష్టతతో బీఆర్ఎస్ బీఆర్ఎస్ తరఫున పోటీలో ఉండబోయే అభ్యర్థి విషయలో ఆ పార్టీ ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమైన రాకేష్రెడ్డినే బరిలో నిలిపే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటన చేయలేదు. అనధికారికంగా రాకేష్‌రెడ్డికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ పోటీలో నిలిపే అభ్యర్థి విషయంలో బీజేపీ ఇంకా ఆలోచనలు చేస్తోంది. బీజేపీ అభ్యర్థినికి ప్రకటించకపోగా, పార్టీ పరంగానే మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే సీనియర్ నాయకులు గంగిడి మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు పేర్లు బీజేపీ నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరంగల్ నుంచి రాణి రుద్రమ కూడా పోటీకి ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వరంగల్ వారికే అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈసారి నల్లగొండ వారికే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది.ఫ వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సర్వే ఫ ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చిన బీఆర్ఎస్ ఫ బరిలో ఎవరిని నిలుపాలన్న దానిపై బీజేపీ సమాలోచన ఫ ఓటర్ల జాబితా షెడ్యూల్ జారీతో పెరిగిన రాజకీయ వేడి బీఆర్ఎస్ నుంచి ఓసీ అభ్యర్థిని పోటీలో నిలిపే అంశంపై స్పష్టత రాగా, కాంగ్రెస్, బీజేపీలో బీసీ అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈ స్థానంలో ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలుపాలన్న విషయంలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ స్థానంలో బీసీని పోటీలో నిలిపితే వరంగల్ – ఖమ్మం – నల్లగొండ స్థానంలో ఓసీకి ఇవ్వాలని, ఇక్కడ బీసీకి ఇస్తే, అక్కడ ఓసీ అభ్యర్థిని బరిలో దింపాలని రెండు పార్టీలు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. -
నిమజ్జనానికి సిద్ధం
నల్లగొండ టూటౌన్ : వినాయక నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నెల 23వ తేదీన గణేష్ నిమజ్జన శోభాయాత్ర కోసం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 10 ఫీట్లలోపు ఉన్న విగ్రహాలను ఆర్జాలబావి వల్లభరావు చెరువులో, 10 ఫీట్లకు పైన ఉన్న వాటిని ఎడమ కాల్వ 14వ మైలు, వేములపల్లి వద్ద నిమజ్జనం చేయనున్నారు. శోభాయాత్ర ముందస్తు ఏర్పాట్లను మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో చేపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 8వేల వరకు విగ్రహాలు ఏర్పాటు చేయగా.. ఒక్క నల్లగొండ నగరంలోనే 563 విగ్రహాలు ఉన్నాయి. నల్లగొండలో ఏర్పాటు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆర్జాలబావి వల్లభరావు చెరువ వద్ద బారికేడ్లు, క్రేన్లు, లైటింగ్, మైకులు, షామియానా, తాగునీరు ఏర్పాటు చేశారు. ఇందుకోసం నగరపాలక సంస్థ అధికారులు సుమారు రూ.75 లక్షలతో టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. వల్లభరావు చెరువు వద్ద మూడో రోజు నుంచే విగ్రహాలను నిమజ్జనం చేస్తుండడంతో రెండు క్రేన్లను ఉంచారు. నల్లగొండలోని దేవరకొండ రోడ్డు సెయింట్ ఆల్ఫోన్సెస్ స్కూల్ వద్ద నిర్మిస్తున్న ఫుట్ఓవర్ బ్రిడ్జి భారీ విగ్రహాలకు అడ్డు తగులనుంది. బ్రిడ్జి వద్ద 20 ఫీట్ల ఎత్తు ఉండడంతో భారీ విగ్రహాలు వెళ్లే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. దాంతో వన్‌టౌన్ పరిధిలోని పాతబస్తీ హనుమాన్‌నగర్ ఒకటో నంబర్ విగ్రహం నుంచి ప్రారంభం కానున్న శోభాయాత్ర నుంచి వచ్చే భారీ విగ్రహాలు, టూ టౌన్ ప్రాంతంలోని భారీ విగ్రహాలు కూడా వేములపల్లి వద్ద ఉన్న సాగర్ ఎడమకాల్వలో నిమజ్జనం చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. జిల్లా కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించే ప్రధాన రహదారుల్లో మరమ్మతు పనులు చేపట్టారు. గడియారం సెంటర్ నుంచి పానగల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు గుంతలు పూడ్చి ప్యాచ్ వర్క్ చేశారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో శోభాయాత్రకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేస్తున్నారు. పాతబస్తీలో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనం, శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. శోభాయాత్ర జరిగే మార్గంలో మంచినీటి సౌకర్యం, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా వసతులు సమకూరుస్తున్నాం. – వంశీకృష్ణ, నీలగిరి కమిషనర్ రేపే గణేష్ శోభాయాత్ర ఫ వల్లభరావు చెరువు, సాగర్ ఎడమకాల్వకు తరలనున్న గణపయ్యలు ఫ నిమజ్జన ప్రదేశాల్లో భారీ క్రేన్లు, లైటింగ్ -
ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా అధికారులతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని, ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్‌లో రెవెన్యూ శాఖకు 54, ఇతర శాఖలకు 75.. మొత్తం 125 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమస్యల పరిష్కారానికి డివిజన్, మండల కేంద్రాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 9వ రాష్ట్రీయ పోషణ మహాపై రూపొందించిన పోసర్ట్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఆదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఆర్ఓ దశరథ పాల్గొన్నారు. సర్ దరఖాస్తులను వారంలో పరిష్కరిస్తాం నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులన్నిటిని వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు తదితర అంశాలను వివరించారు. ఎస్ఐఆర్కు సంబంధించిన పనులన్నింటినీ అక్టోబర్ 2వ తేదీలోగా పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
పందిరి సాగుకు ప్రోత్సాహం
యూనిట్‌కు రూ.50 వేల సబ్సిడీ ఫ కూరగాయల సాగుకు పెంచేలా ప్రభుత్వాల నిర్ణయం ఫ యాసంగిలోనూ సబ్సిడీ ఇవ్వనున్న ఉద్యానశాఖ నల్లగొండ అగ్రికల్చర్ : కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. భవిష్యత్‌లో కూరగాయలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మల్చింగ్ షేడ్ నెట్, శాశ్వత పందిళ్లు, బిందుతుంపర సేద్యం వంటి సదుపాయాలకు రాయితీ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం కూరగాయలు సాగు తగ్గటంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడులు చేసుకోవడం ద్వారా ధరలు మండిపోయి ప్రజలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీ ఇచ్చి పందిరి కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది. 7,700 ఎకరాల్లో కూరగాయల సాగు ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా కూరగాయల సాగు కూడా చేపట్టాలని ప్రభుత్వం సూచించినా.. రైతులు అత్యధికంగా పత్తి, వరి పంటలు వైపే మొగ్గు చూపారు. ఆరుతడి పంటలు అంతంత మాత్రమే ఉండగా అందులో కూరగాయలు సాగు పెద్దగా లేదు. వానాకాలం సీజన్లో ఇప్పటికే ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 7,700 ఎకరాల్లో కూరగాయల సాగు చేయించారు. వారికి అవసరమైన సబ్సిడీని ఆయా రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అందించారు. అరెకరం ఒక యూనిట్.. పందిరి కూరగాయల సాగుకు కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రాయితీ అందించనున్నాయి. పందిరి కూరగాయలకు సంబంధించి తీగజాతి కూరగాయలు ప్రధానంగా బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ, దొండకాయ, చిక్కుడుకాయతో పాటు ఇతర తీగజాతి కూరగాయల సాగుకు యూనిట్‌కు రూ.50,000 చొప్పున సబ్సిడీ అందించనున్నాయి. అరెకరాన్ని ఒక యూనిట్‌గా నిర్ధారించారు. ఒక్కో రైతుకు ఐదు ఎకరాల వరకు సబ్సిడీ ఇస్తారు అంటే ఐదు యూనిట్లకు రూపాయలు రూ.2.50 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. వచ్చే యాసంగిలో ఈ పథకాన్ని అమలు చేసేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాసంగిలో కూడా.. ఈ యాసంగిలో కూడా సబ్సిడీ అందించడం ద్వారా రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించేలా ఉద్యానవన శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా టమాటా, వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, ఉల్లి, దోసకాయతో పాటు చామ గడ్డ, ఆలుగడ్డ, మునుగకాయలు, తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, చుక్కకూర వంటి ఆకుకూరలను కూడా సాగు చేసేలా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే యాసంగి సీజన్లో కూరగాయల సాగును విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా వానాకాలంలో 7700 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాం. యాసంగిలో కూడా రైతులు సబ్సిడీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని కూరగాయల సాగును పెంచాలి. – టి.శేఖర్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి -
స్క్రీనింగ్ టెస్ట్‌కు 2,250 మంది
నల్లగొండ : పోలీస్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్‌కు జిల్లావ్యాప్తంగా 2,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్షలో ప్రతిభ చూపిన 500 మంది అభ్యర్థులను ఎంపిక చేసి నల్లగొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. మెయిన్ ఎగ్జామ్‌కు అవసరమైన శిక్షణతోపాటు సబ్జెక్ట్ నిపుణులతో బోధన, మోడల్ టెస్టులు, సందేహాల నివృత్తి, పరీక్ష విధానంపై అవగాహన కల్పించనున్నామని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థుల శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు అవుట్డోర్, ఇండోర్ శిక్షణ కూడా అందించనున్నట్లు తెలిపారు. అవసరమైన వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశమని ఎస్పీ తెలిపారు. ఫ పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ కోసం నిర్వహణ ఫ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ శరత్చంద్ర పవార్ -
పంటల నమోదు ముమ్మరం
డిజిటల్ క్రాఫ్ బుకింగ్ సర్వేకు రైతులు సహకరించాలి. సర్వేయర్లు గ్రామానికి వచ్చిన వెంటనే వారిని పంట పొలాల వద్దకు తీసుకుపోయి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలి. లేకపోతే ప్రభుత్వం సన్నాలకు ప్రకటించిన బోనస్ వర్తించదు. పంటల నమోదుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే అవకాశం ఉంది. – ఉల్లోజు వినోద్‌కుమార్, డీఏఓ ఫ జిల్లావ్యాప్తంగా 11.40 లక్షల ఎకరాల్లో పంటల సాగు ఫ ఇప్పటి వరకు 5.50 లక్షల ఎకరాల్లో సర్వే పూర్తి ఫ 540 మంది ప్రైవేట్ సర్వేయర్లతో నిర్వహణనల్లగొండ టౌన్ : వానాకాలం పంటల నమోదు సర్వే ముమ్మరంగా సాగుతోంది. ఏఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో.. సర్వే నంబర్ల వారీగా వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పంట కొనుగోళ్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్‌ను అందించేందుకు గాను డిజిటల్ సర్వేను క్షేత్రస్థాయిలో చేపట్టింది. దీనికి గాను జిల్లాలోని 540 రెవెన్యూ గ్రామాల వారీగా ప్రైవేట్ సర్వేయర్లను జిల్లా వ్యవసాయశాఖ నియమించింది. ప్రతి సర్వేయర్‌కు 4,500 సర్వే నంబర్లను కేటాయించింది. గత నెల 25న ప్రారంభించిన ఈ సర్వేను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతుల ఇబ్బందులు తొలగించేందుకే.. ఈ వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 11.40 లక్షల ఎకరాలలో వరి, పత్తి, కంది, వేరుశనగ, పెసర తదితర సంటలను రైతులు సాగు చేశారు. రైతులు డిజిటల్ క్రాప్ సర్వేలో పంటలను నమోదు చేయించుకోకపోతే వారు పండించిన పంటలను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వారి ఇబ్బందులను తొలగించేందుకే పంటల నమోదు ప్రక్రియను చేపట్టారు. దీంట్లో భాగంగా డిజిటల్ సర్వే చేసే సర్వేయర్ల వద్ద ఉన్న ఫోన్లకు వ్యవసాయ శాఖ లాగిన్ ఇచ్చింది. ఒక్కో రైతుకు సంబంధించిన డిజిటల్ సర్వే నమోదు చేస్తే సర్వేయర్‌కు రూ.7 చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఆయా సర్వేయర్లు వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లి ఆ గ్రామ రైతుల పంట చేలలో ఉండి డిజిటల్ క్రాప్ బుకింగ్ యాప్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. 20 మీటర్లలోపు ఉంటేనే బుకింక్ చేసే అవకాశం ఉంటుంది. అంతకు దూరంగా ఉండి నమోదు చేస్తే ఆన్లైన్లో నమోదు కాదు. దీంతో సర్వేయర్లు విధిగా క్షేత్రస్థాయిలోనే రైతుల పంట పొలాల్లోనే వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది సర్వే నంబర్లలో సాగు చేసిన మొత్తం 5.50 లక్షల ఎకరాల పంటల సర్వే పూర్తయింది. ఈ నెలాఖరు వరకు సర్వే పూర్తి చేసేందుకు యంత్రాంగం ముందుకు సాగుతోంది. -
ఎఫ్ఎల్ఎన్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : జిల్లాలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఎఫ్ఎల్ఎన్ సెల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు రెండు నెలల ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈఓ సుశీందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనె 22న సాయంత్రం 5 గంటలలోపు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి జిల్లా బెస్ట్ టీచర్ అవార్డుకనగల్ : మండలంలోని చిన్నమాదారం జెడ్పీ హెచ్‌ఎస్‌లో పనిచేస్తున్న బాలసాహితీ వేత, ఆంగ్ల ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డిని జిల్లా బెస్ట్ టీచర్ అవార్డుతో ఆదివారం నల్లగొండలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో లయన్స్ క్లబ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు సన్మానించారు. అలాగే 40మంది ఉపాధ్యాయులు, 20మంది ఇంజనీర్లను సన్మానించారు. కార్యక్రమంలో లయన్ గవర్నర్ కేవీ.ప్రసాద్, సతీష్ కోడె, లయన్ వెంకటేశ్వరరావు, లయన్ పిచ్చయ్య, సుధారాణి పాల్గొన్నారు. ‘సంతపురి’ మృతి.. కళా రంగానికి తీరనిలోటురామగిరి(నల్లగొండ) : తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకై న పాత్ర పోషించిన ప్రముఖ కవి, రచయిత, సామాజిక కార్యకర్త సంతపురి నారాయణరావు మరణం సాహిత్య, కళారంగాలకు తీరని లోటని పలువురు ప్రముఖులు అన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల నల్లగొండ జిల్లాలోని కవులు, రచయితలు, తెలంగాణ ఉద్యమ నాయకులు క్లాక్ టవర్ సెంటర్లో ఆయన చిత్రపటం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ప్రముఖ సాహితీవేత్తలు వేణు సంకోజు, మేరెడ్డి యాదగిరిరెడ్డి, గుండె వెంకటేశ్వర్లు, భువనగిరి దేవేందర్, బక్క పిచ్చయ్య, పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, బండారు శంకర్, తోట నరసింహాచారి, పన్నాల గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు చేయాలినల్లగొండ : ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో ఫీజులు, సీట్ల నియంత్రణకు ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయాలని డెమొక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (డేటా) సంఘం నాయకులు అన్నారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ మొహినొద్దీన్, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటదాసు, హైకో ర్టు న్యాయవాది పద్మారావు, రాములు, నాగలక్ష్మి, పి.రజిత, సీహెచ్.సుధాకర్ పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి మహిళా ఫుట్‌బాల్ పోటీలకు అనుమతినల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి మహిళా ఫుట్‌బాల్ పోటీల నిర్వహణకు రాష్ట్ర కమిటీ అనుమతి ఇచ్చిందని ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కమిటీ బాధ్యులు డాక్టర్ రఫత్ అలీ, జీపీ. పాల్గుణ నుంచి అనుమతి పత్రం పొందినట్లు తెలిపారు. -
కంప్యూటర్ విద్యతోనే ఉపాధి అవకాశాలు
నల్లగొండ టౌన్ : కంప్యూటర్ విద్యతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని టీజీఎంఎస్సీ, సీసీసీ డైరెక్టర్ తారిఖ్ అన్వర్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని బహదూర్ ఖాన్ మందిరంలో విద్యార్థులుకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. అనంతరం హైదరాబాద్ ఫుల్ స్టాక్ అకాడమీ డైరెక్టర్ ఐజాజ్ అహ్మద్, విద్యావేత్త లతీఫ్ మాట్లాడుతూ కంప్యూటర్ పరిజ్ఞానం, కృత్రిమ మేధ, ఉపాధి ఆధారిత కోర్సులు, ఉద్యోగ అవకాశాలపై వివరించారు. తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ (హైదరాబాద్), ఇదారా–ఏ–ఇకామత్ ఖానా బహదూర్ ఖాన్ (నల్లగొండ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ అదనపు కార్యక్రమ సంచాలకురాలు డాక్టర్ సారా సుత్తారి, మైనారిటీ సంక్షేమ శాఖ మాజీ సంచాలకుడు ఎంజే.అక్బర్, సెట్విన్ జిల్లా సమన్వయకర్త కొండపల్లి రేణుక, ఇదారా–ఏ–ఇకామత్ ఖానా బహదూర్ ఖాన్ అధ్యక్షుడు షాహిద్ అహ్మద్, మహమ్మద్ షఫీ నవాజ్ ఖాన్, ఖాజా ఫరీదుద్దీన్, మహమ్మద్ షఫీయుద్దీన్, ఎం.ఏ.బారీ, ముబారిజుద్దీన్ సాబేర్, జాహెద్ హుస్సేన్, ముంతాజ్ ఖురేషీ, మసీఉద్దీన్, జాఫర్, మొహితుల్లా, ఇంజినీర్ జునైద్ హష్మీ, హాఫిజ్ వ ఖారీ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
చెత్తపై సమరం..
సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026నల్లగొండ : జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ‘స్వచ్ఛత స్వభావం–స్వచ్ఛ భారత్, వికసిత భారత్’ నినాదంతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛతా హి సేవ–2026’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందిని భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. కలెక్టర్, జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ చైర్మన్ బి.చంద్రశేఖర్ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు కొనసాగుతున్నాయి. చెత్త పేరుకుపోయే ప్రాంతాల ప్రక్షాళన, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలతోపాటు మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, చెరువులు, వాగుల వద్ద పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ, గుట్కా, పాన్‌మసాలా ఉమ్మివేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులతో స్వచ్ఛత సందేశం ఈ నెల 17, 18 తేదీల్లో పాఠశాల విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల సందర్శన, వ్యాసరచన, ఉపన్యాసం, గోడచిత్రాల పోటీలు నిర్వహించారు. పాత పుస్తకాలు, బొమ్మలను సేకరించారు. 19, 20 తేదీల్లో చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి శ్రమదానం ద్వారా శుభ్రపరచడంతోపాటు సుందరీకరణ చేపట్టనున్నారు. 25, 26 తేదీల్లో పాఠశాలలు, పంచాయతీల్లో క్రీడా పోటీల ద్వారా స్వచ్ఛతపై ప్రచారం చేయనున్నారు. గణేష్ నిమజ్జనం అనంతరం ఘాట్లను శుభ్రం చేయడంతోపాటు పూల వ్యర్థాలతో కంపోస్ట్ తయారీకి చర్యలు తీసుకోనున్నారు. 27న పర్యాటక, చారిత్రక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సఫాయి మిత్రలకు ప్రత్యేక శిబిరాలు ఈ నెల 30న ‘సఫాయిమిత్ర సురక్ష–సన్మాన’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాల పంపిణీతోపాటు సన్మానం చేయనున్నారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1న శ్రమదానం అక్టోబర్ 1న ఉదయం 8 గంటలకు ‘ఒక రోజు–ఒక గంట–కలిసికట్టుగా’ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో భారీ శ్రమదానం నిర్వహించనున్నారు. 2న స్వచ్ఛ భారత్ దివాస్ సందర్భంగా గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు, పట్టణాల్లో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నారు. శుభ్రం చేసిన ప్రాంతాల్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కింద మొక్కలు నాటనున్నారు. అధికారులకు బాధ్యతలు ప్రతి గ్రామంలో లైన్ డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుని రోజువారీ కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రతిరోజూ 10 ఉత్తమ ఫొటోలను గ్రూపులో అప్లోడ్ చేయాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సూచించారు. మిషన్ భగీరథ అధికారులు నీటి లీకేజీలను అరికట్టి, గ్రామాల్లోని ఓహెచ్ఎస్ఆర్, జీఎల్ఎస్ఆర్ ట్యాంకులను శుభ్రం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఫ అక్టోబర్ 2వ తేదీ వరకు ‘స్వచ్ఛతా హి సేవ–2026’ ఫ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టిన సిబ్బంది ఫ విద్యార్థులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యం -
మీ ప్రమాణంతో ఉద్యోగుల హాజరు
ఫ సిబ్బంది సమయపాలన పాటించేలా మొబైల్ యాప్ ఫ విధులకు డుమ్మా కొట్టకుండా కార్యాచరణ ఫ ఇక రిజిస్టర్లో సంతకాలు పెట్టే పద్ధతికి స్వస్తి ఫ ఆఫీస్‌లోనే రెండు పూటలా యాప్‌లో ఫొటో దిగాల్సిందే.. నల్లగొండ : ప్రభుత్వ ఉద్యోగుల హాజరు విషయంలో ఇక నుంచి నిబంధనలు మరింత కఠినం కానున్నాయి. విధులకు ఆలస్యంగా రావడం.. గైర్హాజరైనా హాజరైనట్లు రిజిస్టర్లో సంతకాలు చేయడం.. కొన్ని గంటలకే విధులు ముగించుకుని వెళ్లిపోవడం వంటి వాటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీమీ ప్రమాణంశ్రీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులు ఈ యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో యాప్ అమలును పక్కాగా చేపట్టాలని కలెక్టర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో తొలిదశ జిల్లా కలెక్టరేట్లో తొలిదశగా ‘మీ ప్రమాణం’ యాప్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెల 10 నుంచి రెవెన్యూ విభాగానికి చెందిన సిబ్బంది యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకుంటున్నారు. సుమారు వంద మంది వరకు ఉద్యోగులు ప్రస్తుతం ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. త్వరలోనే ఇతర శాఖలకు కూడా దీనిని విస్తరించనున్నారు. 70 ప్రభుత్వ శాఖల్లో.. నల్లగొండ జిల్లాలో మొత్తం 70 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇందులో 48 శాఖలు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కొనసాగుతున్నాయి. మిగిలిన శాఖల కార్యాలయాలు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు జిల్లా కేంద్రానికి సమయానికి రాకుండా ఆలస్యంగా వస్తున్నారు. ఇప్పటివరకు ఉద్యోగుల హాజరు రిజిస్టర్లో సంతకాలు చేసి విధులకు హాజరైనట్లు నమోదు చేసుకునేవారు. ఈ విధానంలో సమయపాలనపై పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉండడంతో కొత్త యాప్‌ను తీసుకొచ్చారు. ఆధార్, జీపీఎస్‌తో అనుసంధానం రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఉద్యోగి ఎంప్లాయ్ ఐడీ, ఈ–మెయిల్, ఆధార్ నంబర్‌తోపాటు కార్యాలయ జీపీఎస్ లొకేషన్ వివరాలను అనుసంధానం చేస్తున్నారు. ప్రతి శాఖ అధిపతికి ప్రత్యేక లాగిన్ అందించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత శాఖల్లో యాప్ ద్వారా హాజరు నమోదు ప్రారంభమవుతుంది కళ్లను బ్లింక్ చేస్తేనే.. ఉద్యోగులు తమ మొబైల్లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని కార్యాలయానికి వచ్చిన తర్వాత లాగిన్ కావాలి. అనంతరం యాప్‌లో నిర్దేశించిన విధంగా ముఖ గుర్తింపు ప్రక్రియలో భాగంగా కళ్లను మూసి తెరవడం (బ్లింక్) చేయాలి. అప్పుడే హాజరు నమోదవుతుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలా హాజరు నమోదు చేయడం తప్పనిసరి కానుంది. కార్యాలయ లొకేషన్ ఆధారంగా హాజరు నమోదయ్యేలా వ్యవస్థను రూపొందించారు. ‘మీ ప్రమాణం’ యాప్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ శాఖ అధిపతులను ఆదేశించారు. ఉద్యోగులకు యాప్ పనితీరుపై అవగాహన కల్పించాలని, హాజరు నమోదును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బందికి అమలు చేస్తున్నారు. త్వరలోనే మిగిలిన శాఖలన్నింటిలో అమలు అయ్యేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. -
పంటలెండుతున్నా పట్టించుకోరా..
కనగల్ : తపంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం కనగల్ మండలం తేలకంటిగూడెం గ్రామంలో పంటలు ఎండిన రైతులు భైరగోని పెద్ద లింగయ్య, యాదయ్య పరామర్శించి ధైర్యం చెప్పా రు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌లో విద్యుత్ సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాజ లాలు అందుబాటులో ఉన్నా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయో ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 21 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి ఎందుకు నిలిపివేశారు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. నీళ్లు, బొగ్గు లేదని చెబుతూ విద్యుత్, సాగునీటి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లి కార్జున్రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, గోన రవీందర్రావు, మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, పార్టీ నాయకులు అయితగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి -
రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలి
కొత్త వాటిని రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని పీఆర్ చాంబర్స్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి కోరారు. - 8లోస్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని పంచాయతీల్లో పారిశుద్ధ్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్డ్ ప్రకారం పంచాయతీల్లోని ప్రభుత్వ పాఠశాలలు, దేవాలయాల ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నాం. యాత్రికులు వచ్చే ప్రాంతాల్లో కూడా స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. – వనం తరుణ్ చక్రవర్తి, డీపీఓ -
నేడు కోదాడలో మెగా జాబ్‌మేళా
కోదాడ : కోదాడ పట్టణంలో శనివారం నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలోని పట్టణంలోని సీసీ రెడ్డి విద్యానిలయంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు జాబ్‌మేళా కొనసాగనుంది. అభ్యర్థులు పేర్ల నమోదుకు అధికారులు క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. శుక్రవారం రాత్రి వరకు 50 వేల మందికి పైగా అభ్యర్థులతో పాటు 354 కంపెనీలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. శనివారం ఉదయం వరకు నమోదు చేసుకొనే అవకాశం ఉండడంతో ఈ సంఖ్య 60 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. హాజరు కానున్న ప్రముఖులు కోదాడలో శనివారం జరిగే మెగా జాబ్‌మేళాకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ హాజరు కానున్నట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మెగా జాబ్‌మేళాలో పాల్గొనే వారందరికీ మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఈ మేరకు విద్యాలయం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని వేర్వేరు ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ మళ్లింపు కోదాడలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించను న్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను బైపాస్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు. ఖమ్మం క్రాస్‌రోడ్డులో దుకాణాలను మూసివేయిస్తున్నారు. జాబ్‌మేళా పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఇందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. జాబ్‌మేళా నిర్వహించే సీసీరెడ్డి విద్యానిలయాన్ని శుక్రవారం సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ఎమ్మెల్యే పద్మావతి పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఫ 50 వేలకుపైగా అభ్యర్థులు, 354 కంపెనీలు రిజిస్టర్ -
పకడ్బందీగా వానాకాలం ధాన్యం సేకరణ
నల్లగొండ : వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో 2026–27 వానాకాలం ధాన్యం సేకరణపై అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ధాన్యం సేకరణ పూర్తిగా ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే నిర్వహిస్తామన్రాఉ. గోదాముల నిర్వహణ, హమాలీల నియామకం, రవాణా సౌకర్యాలను ప్రభుత్వ శాఖలే చూసుకోవాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం సన్నధాన్యంతోపాటు, 2.50 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత సీజన్లో తాలు, రవాణా, హమాలీ తదితర సమస్యలు ఎదురయ్యాయని ఈసారి అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అభ్యుదయ రైతు రాంరెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీసీవో మమత, పౌర సరఫరాల డీఎం రాంపతినాయక్, డీఏఓ వినోద్‌కుమార్, డీఎస్ఓ వెంకటేష్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
చేయూత దరఖాస్తులు 32,987
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం రెండోసారి గడువు ఇవ్వడంతో అర్హులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని 33 మండలాలు, 8 మున్సిపాలిటీల పరిధిలో 32,987 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తవుతుండగా.. తర్వాత అర్హతల పరిశీలన చేయనున్నారు. గడువు పొడిగింపుతో పెరిగిన సంఖ్య చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం మొదట ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. తరువాత సెప్టెంబరు 15వ తేదీ వరకు పొడిగించింది. దీంతో జిల్లాలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే.. ఆన్లైన్లో నమోదైన దరఖాస్తుల ఆధారంగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతున్నారు. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దరఖాస్తుదారుల వయస్సు, కుటుంబ పరిస్థితులు, వృత్తి, ఇతర అర్హతలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తించనున్నారు. పరిశీలన తరువాతే తుది జాబితా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్ మంజూరయ్యే అవకాశం ఉండదు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హతలను నిర్ధారించిన తరువాతే తుది జాబితా సిద్ధం చేయనున్నారు. దీంతో దరఖాస్తుదారులంతా అర్హుల జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. 25వ తేదీలోగా పరిశీలన పూర్తయిన అనంతరం అర్హుల జాబితాను ప్రకటించనున్నారు. పట్టణాల్లో నల్లగొండ టాప్ పట్టణ ప్రాంతాల్లో నల్లగొండ మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా 2,426 దరఖాస్తులు వచ్చాయి. మిర్యాలగూడ మున్సిపాలిటీ నుంచి 1,560 దరఖాస్తులు నమోదయ్యాయి. మరోవైపు నందికొండ మున్సిపాలిటీ నుంచి అత్యల్పంగా 190 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మండలాల్లో కట్టంగూర్ ముందంజ గ్రామీణ మండలాల వారీగా చూస్తే కట్టంగూర్ 1,354 దరఖాస్తులతో ముందంజలో ఉంది. మిర్యాలగూడ మండలం నుంచి 1,351, శాలిగౌరారం నుంచి 1,279, మునుగోడు నుంచి 1,257 దరఖాస్తులు నమోదయ్యాయి. దీంతో ఈ మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ కీలకంగా మారనుంది.ఫ 25వ తేదీలోగా క్షేత్రస్థాయి పరిశీలన ఫ ఆ తర్వాత అర్హుల జాబితా ప్రకటన పింఛన్ల దరఖాస్తుల వివరాలు ఇలా.. కేటగిరీ దరఖాస్తుల సంఖ్య వితంతు 15,277దివ్యాంగులు 9,085గీత కార్మికులు 4,416ఒంటరి మహిళలు 2,955చేనేత కార్మికులు 1,254మొత్తం 32,987 -
అంతర్జాతీయ ప్రమాణాలతో బస్టాండ్
నల్లగొండ : అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునీకరిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో బస్టాండ్ ఆధునీకరణపై ఆయన సమీక్షించారు. బస్టాండ్ నమూనాను కన్సల్టెన్సీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. నమూనాలో పలు మార్పులు చేయాలని ప్రతినిధులకు మంత్రి సూచించారు. నల్లగొండ బస్టాప్ ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుందని.. అందుకు అనుగుణంగా బస్సుల రాకపోకలు సులభతరం అయ్యేలా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్, ప్లాట్‌ఫారాలు, వెయిటింగ్ హాల్స్, పార్కింగ్, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీకి లాభం కలిగించేలా గ్రౌండ్, మొదటి అంతస్తులో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలని, ప్రజలకు వినోదాన్ని అందించేందుకు రెండవ అంతస్తులో మల్టిఫ్లెక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీపై విద్యుత్ భారం పడకుండ బస్టాండ్ పైభాగంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. దసరాకు రెండు రోజుల ముందు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. నిర్మాణ సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. బస్టాండ్ ఆధునీకరణ తరువాత షాపుల ద్వారా ఆర్టీసీకి రూ.85 లక్షల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
ప్రజా ఆకాంక్షకు ప్రాధాన్యం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను కొనసాగిస్తూ, సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరులకు నివాళులర్పించి, జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అమరుల త్యాగాలతో విముక్తి సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని మంత్రి పేర్కొన్నారు. 1948లో ఇదే రోజున ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందన్నారు. సోనియాగాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. 2014 తర్వాత పదేళ్ల పాలనను ప్రజలు చూశారని, 2023 డిసెంబర్లో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. వెయ్యి రోజుల పాలనలో సంక్షేమాన్ని విస్తరించడంతోపాటు సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఎంజీయూలో కొత్త కోర్సులు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులు ప్రారంభించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో 4,862 ఇళ్ల గృహ ప్రవేశాలు జరిగాయని వెల్లడించారు. నీటిపారుదల, ఎత్తిపోతల పథకాల కోసం జిల్లాలో 2,062.34 ఎకరాల భూసేకరణ చేసి రూ.442 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. భూభారతి పోర్టల్ ద్వారా జిల్లాలో 1,60,517 దరఖాస్తులు స్వీకరించగా 99.21 శాతం పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. 40 గ్రామాల్లో భూముల రీ–సర్వే ప్రారంభమైందని, 11 గ్రామాల్లో పూర్తయిందని, 5,463.27 ఎకరాల విస్తీర్ణాన్ని సర్వే చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్రపవార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట ఫ రుణమాఫీతో రైతులకు లబ్ధి ఫ మహాలక్ష్మి పథకంతో ప్రయోజనం ఫ ప్రజా పాలన దినోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిరైతులకు చేయూతనిస్తూ రూ.2 లక్షల పంట రుణమాఫీ చేశామన్నారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 8.70 కోట్ల మందికి ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,53,602 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరిందన్నారు. గృహజ్యోతి పథకం కింద 2,55,182 మందికి రూ.209.53 కోట్ల సబ్సిడీతో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశామని, రూ.2.50 కోట్లతో నీలగిరి మహిళా మార్ట్ నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. 924 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.82.88 కోట్ల రుణాలు, 2,409 గ్రూపులకు రూ.3.70 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. -
గణేష్ నిమజ్జనానికి నీళ్లేవి?
నల్లగొండ టూటౌన్ : వినాయక నవరాత్రులు జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్నాయి. కానీ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో నల్లగొండ నగరం పరిధిలోని చెరువుల్లో నీరులేదు. దీంతో గణేష్ నిమజ్జనం ఎక్కడ చేయాలనే దానిపై ఇప్పటివరకు యంత్రాంగం ఒక నిర్ణయానికి రాలేదు. నీలగిరి నగరంలో 563 గణపతి విగ్రహాలు, మండలంలో 265 విగ్రహాలు ఉన్నాయి. మొత్తం 828 విగ్రహాలు ఉన్నాయి. తొలుత చర్లపల్లిలోని భీమ సముద్రంలో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాలని భావించారు. కానీ అక్కడ సరిపడా నీరు లేదు. వల్లభరావు చెరువులోనూ మునగవు.. పానగల్ సమీపంలోని అద్దంకి బైపాస్ రోడ్డు వద్ద ఆర్జాలబావి వల్లభరావు చెరువులో నీరు నిండుగా ఉంటేనే ఆరు, ఏడు ఫీట్ల ఎత్తు విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయడానికి వీలుగా ఉంటుంది. కానీ నగరంలో 15 ఫీట్లకు పైగా ఎత్తు ఉన్న గణపతి విగ్రహాలు కూడా పలు కాలనీల్లో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు నిమజ్జనం చేసినప్పుడు మునగాలంటే కనీసంగా 20 ఫీట్ల లోతు చెరువులో నీరుండాలి. 14వ మైలు వద్దకే.. గణేష్ నిమజ్జనం కోసం ముందస్తుగానే ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు ప్రతిష్టంబన నెలకొంది. ప్రస్తుతం 14వ మైలు వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వలో నీరు ప్రవహిస్తోంది. కానీ నీటిని ఎన్ని రోజుల వరకు విడుదల చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 14 మైలు ఎడమకాల్వలో తప్ప మరో దారి లేదని భక్తులు చెబుతున్నారు. ఫ భీమ సముద్రంలో నీళ్లులేవు.. ఆర్జాలబావి చెరువులో పెద్ద విగ్రహాలు మునగవు ఫ నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో 563 విగ్రహాలు ఫ 14వ మైలు వద్దనే నిమజ్జనానికి అవకాశంభక్తులకు ఇబ్బంది కలగొద్దుహాలియా : భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అలీనగర్ (14వ మైలురాయి) సమీపంలో వినాయక నిమజ్జనం నిర్వహించే సాగర్ ఎడమ కాలువ వద్ద ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. కాలువలో ఈనెల 22 నుంచి 25 వరకు నీరు తగ్గకుండా ఒకేస్థాయిలో ఉండేలా చూడాలని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి కావాల్సిన క్రేన్లు, వాహనాలు, ఇతర సామగ్రిని ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, డీఎస్పీ రవి, సీఐ రాఘవరావు పాల్గొన్నారు. -
ఎంజీయూ పీజీ ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3 బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి గురువారం విడుదల చేశారు. పీజీ 4వ సెమిస్టర్లో మొత్తం 1265 మంది విద్యార్థులకు 967 మంది, (76.44శాతం), బ్యాక్‌లాగ్‌లో మొదటి సెమిస్టర్లో 427 మంది విద్యార్థులకు 158 మంది (37శాతం), 2వ సెమిస్టర్లో 382 మందికి 65 మంది (17.02శాతం), 3వ సెమిస్టర్లో 34 మంది విద్యార్థులకు 168 మంది (48.84శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు సీఈఓ జి.ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను ఎంజీయూ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారులు డి.సంధ్యారాణి, కళ్యాణి, ప్రవళిక పాల్గొన్నారు. అమృత్ భారత్ పనుల్లో వేగం పెంచాలి మిర్యాలగూడ అర్బన్ : అమృత్ భారత్ నిదులతో రైల్వేస్టేషన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణ అన్నారు. గురువారం మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండవ ఫ్లాట్‌ఫారంపై ఉన్న సిగ్నల్ ఫొటోలు పని చేయకపోవడంతో తక్షణమే వాటిని మరమ్మతు చేయించాలని ఆదేశించారు. గూడ్స్ షెడ్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని అవసరమైతే అదనపు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నడికుడి – బీబీనగర్ రెండు లేన్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. -
ప్రజా పాలన వేడుకలకు ముస్తాబు
● జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ : తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా నల్లగొండలోని పోలీస్ పరేడ్ అన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఆయన ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి పోలీస్ పరేడ్ మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని పేర్కొన్నారు. కుట్టు మిషన్లకు దరఖాస్తులునల్లగొండ : జిల్లాలోని వెనుకబడిన తరగతుల (బీసీ) కులాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం’ ప్రారంభించినట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఎ.సంజీవయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన వారు సెప్టెంబర్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన మహిళలు tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసి.. ఆ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని గ్రామీణ ప్రాంతాల వారు సంబంధిత ఎంపీడీఓలకు, పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కమిషనర్లకు సెప్టెంబర్ 30లోగా సమర్పించాలని పేర్కొన్నారు. -
జలవనరుల సద్వినియోగంపై దృష్టిపెట్టాలి
నల్లగొండ : ఎల్‌నినో దృష్ట్యా భూగర్భ జలవనరుల సద్వినియోగంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన భూగర్భ జల వనరుల అంచనా జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భూగర్భ జలా లు క్లిష్టమైన పరిస్థితులున్న ప్రాంతాలు, ఎక్కువ వినియోగం ఉన్న మండలాల్లో తక్షణమే నీటి సంరక్షణ చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల్లో వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం భూగర్భ జల వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతికుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీవోలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ -
ఇచ్చట దుకాణాలు ఉచితం!
నల్లగొండ టూటౌన్ : ప్రకాశం బజారులోని వస్త్రలత బజారులో నిర్మించిన చేపల మార్కెట్ దుకాణాలకు అద్దె వసూలు చేయడం లేదు. ఆ దుకాణాలకు అద్దె నిర్ణయించకపోవడంతో ఉచితంగా వ్యాపారులకు ఇచ్చారా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దానికి పక్కనే మటన్ మార్కెట్ నూతన భవనం నిర్మాణం చేపట్టి ఒక్కో దుకాణానికి నెలకు రూ.3 వేల అద్దె ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. కానీ చేపల మార్కెట్లోని దుకాణాలకు అద్దె వసూలు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రూ.అరకోటి ఆదాయం కోల్పోయిన మున్సిపాలిటీ.. చేపల మార్కెట్లో నిర్మించిన ఎనిమిది దుకాణా లకు సరిపడా తాగునీటిని సైతం మున్సిపల్ కార్పొరేషన్ అందిస్తోంది. దాదాపు 16 ఏళ్లకు పైగానే వాటిల్లో చిరు వ్యాపారం చేస్తున్నారు. ఎంతో ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ ఎనిమిది దుకాణాలకు బయటి మార్కెట్ ప్రకారం అయితే అద్దె ఎక్కువగానే ఉంటుంది. మటన్ షాపుల ప్రకారం ఒక్కో దుకాణానికి నెలకు రూ.3 వేలు నిర్ణయిస్తే ఏడాదికి మొత్తం దుకాణాలకు రూ.2,88,000 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన గత 16 ఏళ్ల నుంచి మున్సిపాలిటీ రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం కోల్పోయింది. అసలే ఆదాయం సరిగా లేదని చెబుతూ ఉన్న ఆదాయ వనరులను కూడా పట్టించుకోకపోవడంతో వెనుక ఉన్న ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చేపల మార్కెట్ దుకాణాలకు అద్దె నిర్ణయించి వసూలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ నీలగిరిలో చేపల మార్కెట్లో అద్దె వసూలు చేయని యంత్రాంగం ఫ పక్కనే ఉన్న మటన్ మార్కెట్ దుకాణాలకు రూ.3 వేలు అద్దె ఫ ఆదాయం కోల్పోతున్న మున్సిపల్ కార్పొరేషన్ -
రజాకార్ల దాష్టీకానికి బలైన 30 మంది యువకులు
చిట్యాల : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో గుండ్రాంపల్లి గ్రామం రజాకార్ల దాడులకు ప్రధాన కేంద్రం. సయ్యద్ మక్బూల్ ఆధ్వర్యంలో రజాకార్లు సాగించిన దౌర్జన్యాలను ఈ ఊరంతా ఏకమై ఎదుర్కొంది. కొండవీటి గురునాథరెడ్డి, కొండవీటి జగన్మోహన్రెడ్డి, గుత్తా సీతారాంరెడ్డి వంటి నాయకుల నేతృత్వంలో గ్రామస్తులు పోరాట జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో తిరుగుబాటును అణచివేయడానికి రజాకార్లు సాగించిన అమానుషకాండ గుండ్రాంపల్లి చరిత్రలో అత్యంత విషాదకర ఘట్టం. విప్లవకారులుగా భావించిన ఆ గ్రామానికి చెందిన 30 మందికి పైగా యువకులను బంధించి, ఎడ్లబండికి కట్టి ఊరి నడిబొడ్డున ఉన్న (ప్రస్తుతం ఏపూరుకు వెళ్లే దారిలో) బావిలో పడేసి సజీవంగా సమాధి చేశారు. ఆ తర్వాత జరిగిన పలు దాడుల్లో మరో వంద మందికి పైగా పోరాటయోధులు అమరులయ్యారు. నాటి పోరాటానికి సాక్ష్యంగా నిలిచిన ఆ చారిత్రక బావి పైనే నిర్మించిన అమరవీరుల స్థూపం నేటికీ జ్ఞాపకంగా నిలిచిపోయింది. చరిత్రను కాపాడుకోవాలంటున్న కొత్త తరం.. గుండ్రాంపల్లి గ్రామాభివృద్ధితో పాటు చారిత్రక ప్రాధాన్యాన్ని కూడా కాపాడుకోవాలని నేటి యువత భావిస్తోంది. నాటి పోరాట స్ఫూర్తితో ఆ గ్రామ యువతతో పాటు గ్రామస్తులంతా రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో, ఇరవై ఏళ్ల క్రితమే యువత స్వచ్ఛందంగా గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. ఈ గ్రంథాలయ స్ఫూర్తితో ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల్లో మరో 30కి పైగా గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా, ఈ గ్రామం జాతీయ రహదారిపై ఉండటంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. పోరాట చరిత్రయే మా వారసత్వం అన్నట్లుగా.. ప్రజా సమస్యలపై నిలదీసే తత్వంతో ఈ గ్రామ యువత చైతన్యవంతంగా ఉంటుంది. ఫ సాయుధ పోరాట అమరుల త్యాగాలను స్మరించుకుంటున్న నేటి తరం ఫ ప్రజా సమస్యలపై నేటికీ తగ్గని యువకుల పోరాట స్ఫూర్తి ఫ నేడు హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన రోజు నిజాంకు నవాబుకు, రాజ కార్లకు వ్యతిరేకంగా పోరా టం చేసిన గుండ్రాంపల్లి గ్రామ చరిత్రకు తగిన గుర్తింపును ప్రభుత్వాలు ఇవ్వాలి. పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చటంతో పాటు ఏటా సెప్టెంబర్ 17న మా గ్రామంలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలి. – అనుముల శ్రీనివాస్, స్థానికుడు మా గుండ్రాంపల్లి గ్రామానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. నాటి రైతాంగ సాయుధ పోరాటంతో పాటు తెలంగాణ మలిదశ ఉద్యమంలో సైతం మా గ్రామంలో యువత ముందుంది. మా గ్రామ పంచాయతీకి ప్రత్యేక నిధులను కేటాయించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సహకరించాలి. – బత్తుల లక్ష్మీప్రసన్న, స్థానికురాలు గ్రామాన్ని సందర్శించిన ప్రముఖులు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 2017 జూలైలో గుండ్రాంపల్లి గ్రామాన్ని సందర్శించారు. నాటి పోరాటంలో అమరులైన వీరుల కుటుంబాలను ఆయన సత్కరించారు. 2017 ఆగస్టులో ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ ఈ గ్రామాన్ని సందర్శించారు. వీరితో పాటు సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ జాతీయ నాయకులు ఎన్.గిరిప్రసాద్, ధర్మభిక్షం, గద్దర్, మాజీ సీఎం కేసీఆర్, మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సాంబశివుడు తదితరులు గతంలో ఈ గ్రామాన్ని పలుమార్లు సందర్శించి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. -
వైభవంగా ముత్యాలమ్మ రథయాత్ర
రామగిరి (నల్లగొండ) : రామగిరి ముత్యాలమ్మ అమ్మవారి రథయాత్ర శనివారం రాత్రి వైభవంగా సాగింది. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రథయాత్రలో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఎలిజాల అంజయ్య, మునాస్ వెంకన్న తదితరులున్నారు. -
వానల్లేవు.. కరెంట్ రాదు
నీళ్లులేక నిలువునా ఎండుతున్న వరి, పత్తి కాలం కాటేసింది.. కరెంటు కష్టాలు తోడయ్యాయి.. వెరసి అన్నదాత ఆశలు ఆవిరయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు వట్టిపోవడంతో గుక్కెడు నీళ్లు లేక పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. దిక్కుతోచని స్థితిలో పంటను పశువులకు వదిలేస్తున్నారు. పత్తి చేనులో దిగాలుగా కూర్చున్న ఈ మహిళా రైతు సపావట్ సుకన్య. చందంపేట మండలం బిల్డింగ్‌తండాకు చెందిన ఈమె తనకున్న ఆరెకరాల్లో పత్తి సాగు చేశారు. ఎల్‌నినో కారణంగా వర్షాలు లేకపోవడంతో పత్తి చేను వాడు పట్టింది. గతంలో అదే చేనులో 65 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పుడు పెట్టుబడి మొత్తంగా రూ.2లక్షలు ఖర్చయిందని, ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతోంది. ఫ అడుగంటిన భూగర్భ జలాలు.. వట్టిపోతున్న బోర్లు ఫ లోవోల్టేజీ, కరెంటు కోతలతో మరిన్ని కష్టాలు ఫ చేలను పశువులకు వదిలేస్తున్న రైతులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుని సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు కురవక, చెరువులు, కుంటల్లో నీరు లేక, భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు వట్టిపోతున్నాయి. అక్కడక్కడా పని చేస్తున్న బోర్లతో మిగిలిన పంటను కాపాడుకుందామనుకుంటే విద్యుత్ కోతలు, లోవోల్టేజీ సమస్యలు శాపంగా మారాయి. గంటల తరబడి కరెంటు కోసం ఎదురుచూడాల్సి రావడం, వచ్చినా మళ్లీ మధ్యలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో పొలాలకు నీరందడం లేదు. దీంతో చాల పాంత్రాల్లో ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. అనధికార విద్యుత్ కోతలు జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. గతంలో 18 గంటలు ఇచ్చిన విద్యుత్ సరఫరాను కుదించారు. ఎప్పుడు ఇస్తారో.. ఎప్పుడు కోత పెడతారో తెలియని పరిస్థితి నెలకొంది. మునుగోడు డివిజన్లో జూన్‌లో 18 గంటల త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వగా.. ప్రస్తుతం తగ్గించేశారు. చండూరు, జిల్లాలోని ఇతర మండలాల్లో ఏడెనిమిది గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్ష ఎకరాల్లో ఎండిన పంటలు జిల్లాలో ఈ వానాకాలంలో 4,39,617 ఎకరాల్లో వరి, 6,01,459 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఇతర పంటలు కలుపుకొని 10,76,573 ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కలు తేల్చింది. ప్రస్తుతం నల్లగొండ, కనగల్, మునుగోడు మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు ఎండిపోయాయి. ఇతర మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా మొత్తంగా జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. కనగల్ మండలం బుడుమర్లపల్లిలో బీటలువారిన వరి చేను, చందంపేట మండలం బిల్డింగ్‌తండాలో వర్షాలు లేక వాడుపట్టిన పని చేను -
ధాన్యం నిల్వకు స్థలాల గుర్తింపు
నల్లగొండ : వానాకాలం సీజన్లో ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో నిల్వ సామర్థ్యం సరిపోకపోవడంతో ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తిస్తున్నారు. ధాన్యం నిల్వకు అనువుగా ఉన్న ప్రైవేట్ గోదాంలు, మార్కెట్ యార్డులు, మూతపడిన ఫంక్షన్ హాళ్లు, వినియోగంలో లేని ఇండస్ట్రియల్ భవనాలు, రైతువేదికలు, మార్కెట్ యార్డుల్లోని ఖాళీ ప్రదేశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన తర్వాత నిల్వకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఏర్పాట్లు చేయాలన్న ఉద్దేశంతో ఈ కసరత్తు చేపడుతున్నారు. తహసీల్దార్లకు బాధ్యత.. ధాన్యం నిల్వకు అవసరమైన స్థలాల గుర్తింపు బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు తహసీల్దార్లకు కూడా అప్పగించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతువేదికలు, ఇతర అందుబాటులో ఉన్న ప్రదేశాలను వారు పరిశీలిస్తున్నారు. స్థల విస్తీర్ణం, ధాన్యం నిల్వకు అనుకూలత తదితర అంశాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30లోగా నివేదిక.. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల అనంతరం నిల్వకు అవసరమైన స్థలాల గుర్తింపు ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గుర్తించిన స్థలాల వివరాలతో కూడిన నివేదికలను ఈ నెల 30లోగా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు పంపించనున్నారు. తుది నిర్ణయం ఎస్డబ్ల్యూఎస్దే.. అధికారులు గుర్తించిన అన్ని స్థలాలను స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (ఎస్‌డబ్ల్యూఎస్) అధికారులు పరిశీలించి, ధాన్యం నిల్వకు అనువుగా ఉన్న వాటిని తుది ఎంపిక చేయనున్నారు. ఎస్‌డబ్ల్యూఎస్ అధికారులు నిర్ణయించే రేట్ల ప్రకారం ఎంపిక చేసిన స్థలాలకు అద్దె చెల్లించి వినియోగించుకోనున్నారు. ధాన్యం నిల్వకు అవసరమైన స్థలాల తుది నిర్ణయం కూడా సంబంధిత ఎస్‌డబ్ల్యూఎస్ అధికారుల పరిశీలన అనంతరం జరుగుతుంది. ఆరుబయట నిల్వకు చెక్.. గతంలో ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లులకు అప్పగించిన సమయంలో కొన్ని మిల్లుల్లో స్థలం లేకపోవడంతో ధాన్యాన్ని ఆరుబయట లాట్లుగా ఏర్పాటు చేసి టార్పాలిన్లతో కప్పి ఉంచేవారు. వర్షాలు కురిసిన సందర్భాల్లో ధాన్యం కొంత తడిసి దెబ్బతినేది. మరోవైపు మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం రావడం కూడా నిల్వ సమస్యకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి సిద్ధంగా ఉంచనున్నారు.ధాన్యం నిల్వల కోసం స్థలాలను గుర్తించాలని కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నెల చివరిలోగా స్థలాలను గుర్తించి నివేదికను పంపిస్తాం. గుర్తించిన స్థలాలను ఎస్‌డబ్ల్యూఎస్ అధికారులే పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. – రాంపతి, పౌరసరఫరాల శాఖ డీఎం ఫ ధాన్యం కొనుగోళ్లకు ముందే కసరత్తు ఫ మిల్లుల్లో నిల్వ సామర్థ్యం సరిపోక.. ప్రత్యామ్నాయాల గుర్తింపు ఫ ప్రైవేట్ గోదాంలు, మార్కెట్ యార్డులు, రైతువేదికల పరిశీలన -
నాగార్జునసాగర్‌లో బౌద్ధ భిక్షువుల ‘పిండపాత’
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లో విదేశీ బౌద్ధ భిక్షువుల బృందం శనివారం భిక్షాటన (పిండపాత) చేసింది. కొన్నిరోజులుగా థాయిలాండ్, కంబోడియా దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువుల బృందం వర్షావాస కార్యక్రమంలో భాగంగా బుద్ధవనంలో ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటోంది. వారి దిన చర్యలో భాగంగా నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీ, పైలాన్ కాలనీ వీధుల్లో భిక్షాటన చేస్తున్నారు. ఈ సందర్భంగా బౌద్ధ బిక్షువులను స్థానికులు స్వయంగా తమ ఇళ్లకు ఆహ్వానించి ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. వీరి వెంట బుద్ధవనం సిబ్బంది ఉన్నారు. -
లోక్ అదాలత్‌లో 12,283 కేసుల పరిష్కారం
రామగిరి(నల్లగొండ) : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 12,283 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.వసంత్ తెలిపారు. శనివారం జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో లోక్ అదాలత్ ముగిసిన అనంతరం ఆయన నల్లగొండలో మాట్లాడారు. కక్షిదారుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ బెంచీల ద్వారా పలు విభాగాలకు చెందిన మొత్తం 12,283 పెండింగ్, ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరమయ్యాయని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా లభించే తీర్పునకు ఎలాంటి అప్పీలు ఉండదని, ఇరువర్గాలు సామరస్యంగా వివాదాలను ముగించుకోవచ్చని చెప్పారు. మొత్తం 12,283 కేసుల్లో క్రిమినల్ 2,813, సివిల్ 33, మోటార్ వాహన ప్రమాద బీమా 68, ట్రాఫిక్ చలాన్లు 9,281, బ్యాంకు రికవరీ 77, సైబర్ క్రైం 11 కేసులు పరిష్కారమయ్యాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి హిమబిందు, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సతీష్‌కుమార్, బి.అశోక్‌కుమార్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
నా ఖాతాలు బ్లాక్ చేయడం కాంగ్రెస్ కుట్ర: వర్షిత్
నల్లగొండ: బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ఖాతాలు కూడా బ్లాక్ అయినట్లు ఆయన తెలిపారు.ఇటీవల నల్లగొండలో మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై వర్షిత్ రెడ్డి సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు పోస్టు చేశారు. ఈ వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.దీంతో తన సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ అయ్యాయని వర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. తన తల్లిపై దాడి జరిగిన నేపథ్యంలోనే ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు ఆయన తెలిపారు.తన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని వర్షిత్ రెడ్డి ఆరోపించారు. అయితే, ఖాతాలు బ్లాక్ కావడానికి గల కారణాలపై సంబంధిత సోషల్ మీడియా సంస్థల నుంచి అధికారికంగా ఎలాంటి వివరాలు ఇంకా తెలియరాలేదు.ఇదీ చదవండి: 56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ? -
ఆలయ టెండర్లు వివాదాస్పదం
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన దుకాణాల టెండర్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. గతంలో కంటే దేవాదాయ శాఖకు భారీగా ఆదాయం పెరిగినప్పటికీ, టెండర్లను ఖరారు చేయకుండా అధికారులు వాయిదా వేయడంపై టెండర్‌దారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ చైర్మన్, అధికారులకు నచ్చిన వ్యక్తులకు టెండర్లు దక్కకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. టెండర్ లేకుండా ఐదు నెలలు కొనసాగింపు అమ్మవారి ఆలయం వద్ద గతంలో ఉన్న 3 షాపులకు గాను రూ.30 లక్షల ఆదాయం వచ్చింది. ఏప్రిల్ నెలతో ఆ టెండర్ గడువు ముగిసినప్పటికీ, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మునుపటి టెండర్దారుకే మరో ఐదు నెలల పాటు షాపులను కొనసాగించేందుకు అనుమతించారు. ఈ ఐదు నెలల కాలంలో దేవాలయానికి ఎటువంటి ఆదాయం సమకూరలేదని స్థానికులు అంటున్నారు. ఆలయ ఈఓ మోహన్‌బాబును వివరణ కోరగా ఆలయానికి మరింత ఎక్కువ ఆదాయం తీసుకురావాలనే ఉద్దేశంతోనే టెండర్లను వాయిదా వేశామని స్పష్టం చేశారు. ఈ టెండర్ల కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ వరాల రమేష్, ఈఓ మోహన్‌బాబు, ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, గ్రామ సర్పంచ్ నేతగాని కృష్ణ, డైరెక్టర్లు ప్రజ్ఞాపురం సత్యనారాయణ, కమ్మలపల్లి మల్లేశం, రేగట్టే శ్రీనివాస్‌రెడ్డి, ఇరుకుల సంపత్, గద్దగోటి యాదగిరి, కొమ్ము శీను, లక్ష్మయ్య పాల్గొన్నారు. ఫ చెర్వుగట్టు దుకాణాల టెండర్లలో అధిక ఆదాయం వచ్చినా కేటాయింపుల వాయిదా ఫ అనుకూలమైన వారికి దక్కలేదని నిలిపివేసినట్టు ఆరోపణలు -
నేటి నుంచి రైస్ మిల్లుల బంద్
కలెక్టరేట్ వద్ద ధర్నాకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపు నల్లగొండ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద రా రైస్‌కు బదులు బాయిల్డ్ రైస్ తీసుకోవాలని, బాయిల్డ్ రైస్ సరఫరాకు సరిపడా రేక్‌లను ఏర్పాటు చేయాలనే డిమాండ్ల సాధన కోసం రైస్ మిల్లర్లు సమ్మెబాట పట్టారు. ఈ నెల 11వ తేదీ నుంచి రైస్ మిల్లులను బంద్ చేసి సమ్మెకు పోవాలని నిర్ణయించారు. తనిఖీల పేరుతో మిల్లర్లను ఒత్తిడి గురిచేస్తున్న తీరు, మిల్లుల విషయంలో ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మిల్లులను బంద్ చేయాలని రైస్ మిల్లరర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు తెలిపారు. -
‘చేయూత’ దరఖాస్తుల పరిశీలన
నల్లగొండ : చేయూత పింఛన్ల పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం తొలి విడతగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులతో కలిపి ఐదు విభాగాల వారికి చేయూత పింఛన్లు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 15 వరకు గడువు విధించగా జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 30,330 దరఖాస్తులు అందాయి. ఈనెల 25లోగా క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి.. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించేందుకు అధికారులు ఇప్పటికే డీవీఓలను నియమించి, మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో డీవీఓలు పంచాయతీ కార్యదర్శులతో కలిసి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించనున్నారు. ఈ ప్రక్రియ పరిశీలనకు అధికారులు ప్రత్యేకంగా శ్రీచేయూత మొబైల్ వెరిఫికేషన్ యాప్‌శ్రీను అందుబాటులోకి తెచ్చారు. దరఖాస్తుదారుల వివరాల పరిశీలన పూర్తయిన వెంటనే యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా అధికారులు పకడ్బందీగా దరఖాస్తుల పరిశీలను చేపడుతున్నారు. ముగిసిన ఖేలో ఇండియా ఖోఖో పోటీలుకనగల్ : కనగల్ ఎక్స్ రోడ్‌లోని స్ఫూర్తి స్కూల్లో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా ఖోఖో పోటీలు ప్రశాంతంగా ముగిశాయి. 22 జట్లు పాల్గొనగా మొదటి స్థానాన్ని మహాత్మాగాంధీ జ్యోతిరావు ఫూలే జూనియర్ కళాశాల దామరచర్ల జట్టు, రెండవ స్థానాన్ని మహాత్మా జ్యోతిరావు ఫూలే హైస్కూల్ నల్లగొండ, మూడో స్థానాన్ని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల దామరచర్ల, నాలుగో స్థానాన్ని కేజీబీవీ చింతపల్లి జట్లు చేజిక్కించుకున్నాయి. తొలుత పోటీలను కనగల్ సర్పంచ్ నర్సింగ్ మురళీధర్‌గౌడ్ ప్రారంభించగా పాఠశాల కరస్పాండెంట్ నక్కల రమేష్, డైరెక్టర్ అలివేలు జ్యోతి ప్రజ్వలన చేశారు. గెలుపొందిన జట్లకు మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ థామాషాయ, ఉప సర్పంచ్ మండలి చంద్రయ్య, పీడీలు, పీఈటీలు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు. ఫ 25లోగా అర్హుల గుర్తించేందుకు కసరత్తు ప్రారంభం ఫ ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 30,330 ఫ దరఖాస్తుల స్వీకరణకు 15 వరకు గడువు -
19న చిన్నమాదారం సర్పంచ్ ఎన్నికపై ఓట్ల రీకౌంటింగ్
కనగల్ : కనగల్ మండలం చిన్నమాదారం గ్రామ సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన ఓట్లను మరోసారి లెక్కించేందుకు నల్లగొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు నల్లగొండలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో రీకౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ప్రస్తుతం కోర్టు ఆధీనంలో భద్రపరిచారు. రీకౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కోర్టు ఎంపిక చేసిన న్యాయ ప్రతినిధిని అడ్వకేట్ కమిషనర్‌గా నియమించింది. గత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పిండి భాగ్యమ్మపై కాంగ్రెస్ అభ్యర్థి మల్లికంటి సుజాత 11 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఓట్లను తిరిగి లెక్కించాల ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న జరగనున్న రీకౌంటింగ్‌పై కనగల్ మండలంలో ఆసక్తి నెలకొంది. -
జీవో 97ను రద్దుచేయాలి
ఫ పాలిటెక్నిక్ విద్యార్థుల మహా ధర్నా, ర్యాలీ రామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ విద్యలో శక్తి ప్రోగ్రామ్‌ను కలపవద్దని, తక్షణమే జీవో నంబర్ 97ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు మహాధర్నా, భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. శక్తి విధానం వల్ల పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 97 విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
పరిష్కారంలోనూ ముందుంటాం
– జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ నోటీసులు అందుకున్న ఓటర్ల సమస్యల పరిష్కారంలోనూ నల్లగొండ జిల్లాను ముందుంచుతాం. పెండింగ్ నోటీసులను వేగంగా పరిష్కరించడంతోపాటు, అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. ఓటర్లకు సంబంధించిన తప్పిదాలను సరిచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. రాజకీయ పార్టీల వారిని సమన్వయ పరుచుకుంటూ వారి ద్వారా ప్రతి ఒక్కరు ఓటు హక్కును కోల్పోకుండా విచారణకు హజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకటికి రెండుసార్లు సమాచారం ఇచ్చి వచ్చేలా కృషి చేస్తున్నాం. -
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి : కలెక్టర్
నల్లగొండ : వీబీజీ రాంజీ పథకం కింద గ్రామాల అభివృద్ధికి తోడ్పడే పనులు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వీబీజీ రాంజీ పనులపై చర్చించి మాట్లాడారు. పనిచేసే కూలీల సంఖ్య పెంచాలన్నారు. గ్రామసభలో చర్చించి గ్రామానికి అవసరం ఉన్న పనులు చేపట్టాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వచ్చే జూన్ వరకు వర్షాలు వచ్చే అవకాశం లేనందున నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ తరుణ్ చక్రవర్తి, డీఎఫ్ఓ రాజశేఖర్ పాల్గొన్నారు. -
12న జాతీయ లోక్ అదాలత్
రామగిరి(నల్లగొండ) : ఈ నెల 12న నల్లగొండ జిల్లా కోర్టుతో పాటు జిల్లా పరిధిలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.హిమబిందు తెలిపారు. కక్షిదారుల సౌకర్యార్థం నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, నిడమనూరు న్యాయస్థానాల్లో ఈ లోక్ అదాలత్ బెంచ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, రా జీపడే అవకాశం ఉన్న కేసులను లోక్ అదా లత్ ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని కక్షిదారులు, ప్రజలకు పిలుపునిచ్చారు. 13న జిల్లా కబడ్డీ జట్ల ఎంపికనాగార్జునసాగర్ : నల్లగొండ జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక ఈనెల 13వ తేదీ ఉదయం 10గంటలకు నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీ బీసీ స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.భూలోకరావు, జి.కర్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–16 సబ్ జూనియర్ బాలబాలికలు 55 కేజీల విభాగం, అండర్–20 జూనియర్ బాలురు బరువు 75 కిలోలలోపు కలిగి ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్, బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్సీ మెమో తమ వెంట తీసుకురావాలని కోరారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలిపెద్దవూర : ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీఓ) పి.కమలాకర్‌రెడ్డి అన్నారు. గురువారం పెద్దవూర మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పదవ తరగతిలో నూరు శాతం ఫలితాల సాధనకు గాను ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏసీఎంఓ డీ.వీ.నాయక్, ఇన్చార్జ్ ఏటీడీఓ వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ఎం డి.బాలోజీ, హెచ్‌డబ్ల్యూఓ కొల్లు బాలకృష్ణ, ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది ఉన్నారు. దళితులను కించపర్చిన వారిపై ఎస్పీకి ఫిర్యాదుకనగల్ : మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను దళితులు ముట్టడించిన అనంతరం అక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనపై జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బోడ స్వామి, అధికార ప్రతినిధి పెరిక అంజయ్య గురువారం నల్లగొండలో ఎస్పీ శరత్చంద్ర పవార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫామ్‌హౌస్‌ను శుద్ధిచేయడం దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉందని, దళితులపై వివక్షకు పాల్పడుతున్న వారిపై, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలినకిరేకల్ : విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) సుశీందర్‌రావు అన్నారు. నకిరేకల్‌లో జెడ్పీ హైస్కూల్లో స్కూల్ గేమ్స్ఫేడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడాపోటలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం హైస్కూల్లో మధ్యామ్న భోజనాన్ని పరిశీలించారు. టీచర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ నాగయ్య, హైస్కూల్ హెచ్ఎం రాములు, పీడీలు శైలజ, విద్యాసాగర్‌రెడ్డి, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు. -
నీటి బకాయిలు రూ.3.73కోట్లు
దేవరకొండ మున్సిపాలిటీలో పేరుకుపోతున్న నల్లా బిల్లులుదేవరకొండ : దేవరకొండ మున్సిపాలిటీలో నల్లా బకాయిలు భారీగా పేరుకుపోయాయి. సకాలంలో బిల్లులు వసూలు కాకపోవడంతో మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. బకాయిలు చెల్లించని వారికి నోటీసులు జారీ చేయడంతోపాటు, నల్లా కనెక్షన్లు తొలగించేందుకు చర్యలు వేగవంతం చేసింది. పట్టణ పరిధిలోని 20 వార్డుల్లో మొత్తం 6,165 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 2026–27 సంవత్సరానికి గాను రూ.3.85 కోట్ల డిమాండ్ ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.12 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.3.73 కోట్ల బకాయిలు రాబట్టాల్సి ఉంది. పట్టణంలో వాణిజ్య కార్యకలాపాలు, భవన నిర్మాణాలు పెరిగినప్పటికీ.. నల్లా బిల్లుల చెల్లింపులో యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు తెలిపారు. -
అప్పు ఎగ్గొట్టి.. ఫెయిల్ చేస్తానని బెదిరింపు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)లో వసూళ్ల దందా కొనసాగుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో పెట్టాల్సిన అధ్యాపకులు వక్రబుద్ధితో వ్యవహరిస్తున్న విషయం తాజాగా కలకలం రేపుతోంది. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలోని బీటెక్ మూడో సంవత్సరానికి చెందిన ఓ విద్యార్థిని వద్ద అదే డిపార్ట్మెంట్ అధ్యాపకురాలు తన వ్యక్తిగత అవసరం కోసం రూ.30 వేలు బదులుగా తీసుకున్నట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. అవసరానికి తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని సదరు విద్యార్థిని అధ్యాపకురాలిని కోరింది. డబ్బులు అడిగితే నిన్ను సబ్జెక్టులో ఫెయిల్ చేస్తానని అధ్యాపకురాలు విద్యార్థినిపై బెదిరింపులకు పాల్పడడంతో యూనివర్సిటీలో పెద్ద పంచాయితీ జరిగి విషయం కాస్త బయటికి పొక్కింది. అధ్యాపకురాలు, విద్యార్థిని మధ్య వాట్సప్ చాటింగ్‌లో కూడా విద్యార్థిని అధ్యాపకురాలిని గట్టిగానే ప్రశ్నించడం ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగినట్టు కళాశాలలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం యూనివర్సిటీ అధ్యాపకుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ పంచాయితీ వైస్ ఛాన్స్లర్ దగ్గరికి చేరినట్లు సమాచారం. గతంలో పరీక్ష ఫీజు పేరిట రూ.5 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్టు అధ్యాపకుడు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి కొందరు అధ్యాపకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధ్యాపకులు సబ్జెక్టుల్లో ఫెయిల్ కాకుండా తాము చూసుకుంటామని వసూళ్ల దందా నడిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటిపై యూనివర్సిటీ పెద్దలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ కాంట్రాక్టు అధ్యాపకుడు పరీక్ష ఫీజు కోసం వసూలు చేసిన రూ.5 లక్షలతో రెండు నెలల పాటు ఉడాయించిన ఘటన జరిగిన విషయం తెలిసిందే. సదరు అధ్యాపకుడు చేసిన ఘనకార్యంపై యూనివర్సిటీ పెద్ద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కనీసం సస్పెండ్ చేయడం గానీ, పోలీస్ కేసు పెట్టడం లాంటి చర్యలు లేకపోవడంతో డబ్బులు వసూల్ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా యూనివర్సిటీ పెద్దలు స్పందించి యూనివర్సిటీలో జరుగుతున్న డబ్బుల వసూళ్ల దందాపై దృష్టి పెట్టిన అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థిని నుంచి అధ్యాపకురాలు డబ్బులు తీసుకున్న విషయం నా దృష్టికి రాలేదు. విద్యార్థిని, అధ్యాపకురాలి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుని విచారిస్తాం. – హరీష్‌కుమార్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎంజీ యూనివర్సిటీలో ఓ అధ్యాపకురాలి వక్రబుద్ధి ఫ ఇంజనీరింగ్ విద్యార్థిని నుంచి రూ.30 వేలు బదులు పేరిట వసూలు ఫ ఇరువురి మధ్య వాదోపవాదాలు ఫ వీసీ వద్దకు చేరిన డబ్బుల పంచాయితీ ఫ గతంలోనూ పరీక్ష ఫీజులతో ఉడాయించిన కాంట్రాక్టు అధ్యాపకుడు -
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి
నల్లగొండ : వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. 2026 –27 వానాకాలం సీజన్ ధాన్యం సేకరణపై ఆయన తన ఛాంబర్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో నిర్దేశించిన 356 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సెప్టెంబర్ 25 నాటికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం గ్రేడ్ –ఏ ధాన్యానికి రూ.2461, కామన్ రకానికి రూ.2441 మద్దతు ధర ప్రకటించిందని, సన్నధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుందని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతినాయక్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీసీఓ మైకేల్ బోస్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఆర్ఎం కె. శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం నల్లగొండ : జిల్లాలో గుర్తించిన పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి ఆయన మాట్లాడారు. నాలుగు పర్యాటక ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి భూమిని గుర్తించామని తెలిపారు. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లోని వైజాగ్‌కాలనీకి సెలవు రోజుల్లో పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారని, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, రాక్ కై ్లంబింగ్కు అవకాశం ఉందన్నారు. దేవరకొండ కోటలో సౌకర్యాలు మెరుగుపరిస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈనెల 26న ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, టూరిజం అధికారి మహ్మద్ అక్బర్ అలీ పాల్గొన్నారు. మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలి వినాయక నవరాత్రుల సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం నల్లగొండలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ పరిరక్షణ, మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ప్రాణసంకటంగా ప్రైవేట్ వైద్యం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్రంలో ఐకాన్ ఆస్పత్రి దోపిడీపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలిలో ప్రస్తావించారు. దోపిడీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. బుధవారం శాసనమండలిలో స్పెషల్ మెన్షన్ కింద ఎమ్మెల్సీ విజయశాంతి రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ప్రస్తావించారు. మందులు రాసిచ్చేందుకు రూ.1500 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో పేదల ఆరోగ్యాన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్ ఆస్పత్రులు విపరీతమైన దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. అవసరం లేకపోయినా టెస్టులు, చికిత్స చేయడం.. చివరకు చనిపోయినా వెంటిలేటర్‌పై పెట్టి డబ్బులు గుంజుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ డ్రైవర్లతో కుమ్మక్కు ఇటీవల నల్లగొండలో వైద్యారోగ్య శాఖ అధికారులు ఐకాన్ ఆసుపత్రిలో తనిఖీలు చేశారని.. ఆ ఆస్పత్రిని ప్రారంభించిన కొద్దికాలంలోనే 191 మంది అక్కడ మరణించడం ఆందోళనకరమన్నారు. ముఖ్యంగా ఆర్ఎంపీలు, అంబులెన్స్ డ్రైవర్లతో కుమ్ముకై ్క ఆస్పత్రికి వచ్చిన వారిని దోచుకుంటుండడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు కుటుంబీకులు ఆతృతలో ఉండటం, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నా వారి ఆతృతను ఆసరాగా చేసుకొని, ఆస్పత్రి వారు ఇచ్చే కమీషన్ కోసం అంబులెన్స్ డ్రైవర్లు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని చెప్పారు. ఇదే అవకాశంగా ఆస్పత్రి యాజమాన్యం దోచుకుంటోందన్నారు. వైద్యానికి డబ్బులు చెల్లించలేక పుస్తెలు అమ్ముకునే పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై మొత్తం వైద్యారోగ్య శాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టేలా ఆదేశించాలని ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు. ఇందులో వారితోపాటు కలెక్టర్లను కూడా భాగస్వాములను చేసి కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఫ నల్లగొండ ఐకాన్ ఆస్పత్రిపై శాసనమండలిలో సుఖేందర్‌రెడ్డి ప్రస్తావన ఫ ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీపై స్పెషల్ మెన్షన్ కింద ప్రస్తావించిన విజయశాంతి ఫ ఈ సందర్భంగా అభిప్రాయాన్ని వెల్లడించిన మండలి చైర్మన్ గుత్తా ఫ టాస్క్‌ఫోర్స్‌ను నియమించామన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ -
వృథాగా సమీకృత మారె్కట్
సమీకృత మార్కెట్ దుకాణాల కేటాయింపు ప్రక్రియపై మార్కెటింగ్ శాఖ అధికారులకు ఇప్పటికే లేఖ రాశాం. వారి నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. –దిలీప్ భార్గవ్, ఏఈ, మున్సిపల్ కార్పొరేషన్ఫ బీట్ మార్కెట్లో రూ.7.70 కోట్లతో 146 దుకాణాల నిర్మాణం ఫ ప్రారంభోత్సవంపై ఎలాంటి నిర్ణయం తీసుకోని మార్కెటింగ్ శాఖ ఫ చిరు వ్యాపారులకు తప్పని నిరీక్షణ నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలోని రవీంద్రనగర్ కాలనీ బీట్ మార్కెట్లో రూ.7.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సమీకృత మార్కెట్ పనులన్నీ పూర్తయినా ప్రారంభానికి నోచుకోక వృథాగా పడి ఉంది. చిరు వ్యాపారుల జీవనోపాధి కోసం నిర్మించిన ఈ మార్కెట్‌ను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రాంగణమంతా పడావుపడి కనిపిస్తోంది. సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ మార్కెట్లో మొత్తం 146 దుకాణాలను అందుబాటులోకి తెచ్చారు. దీనిని వెంటనే ప్రారంభిస్తే 146 మంది చిరు వ్యాపారులకు ఎంతో మేలు చేకూరనుంది. అంతేకాకుండా, రహదారుల వెంట విక్రయించే పండ్లు, కూరగాయల దుకాణాల వల్ల కలిగే రద్దీ సమస్య కూడా తీరుతుందని పట్టణవాసులు భావిస్తున్నారు. కలెక్టర్ ద్వారా లేఖ.. నగరంలోని వన్‌టౌన్ ప్రాంతం ప్రకాశంబజారులో ఇప్పటికే కూరగాయల మార్కెట్ ఉంది. ప్రస్తుతం టూటౌన్ ప్రాంతంలోనూ ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. నిర్మాణం పూర్తయినందున చిరు వ్యాపారులకు దుకాణాలు కేటాయించాలని మున్సిపాలిటీ అధికారులు గతంలోనే జిల్లా కలెక్టర్ ద్వారా మార్కెటింగ్ శాఖకు లేఖ పంపినప్పటికీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. మొత్తం వ్యయం రూ.7.70 కోట్లు రవీంద్రనగర్‌లోని మార్కెటింగ్ శాఖకు చెందిన బీట్ మార్కెట్ స్థలంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టారు. మొదట్లో దీనిని వెజ్, నాన్–వెజ్ మార్కెట్‌గా నిర్మించాలనుకున్నారు. అయితే సమీపంలో ఆలయం ఉన్నందున నాన్–వెజ్ మార్కెట్‌పై స్థానిక భక్తులు అభ్యంతరం తెలిపారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, దీనిని కేవలం ‘వెజ్ మార్కెట్’గా మారుస్తూ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. అన్ని ఆధునిక హంగులతో నిర్మించేందుకుగాను భారీగా నిధులు వెచ్చించారు. మొదట రూ.4.50 కోట్లతో నిర్మాణం ప్రారంభించగా, ఆ తర్వాత అదనపు పనుల పేరుతో మరో రూ.3.20 కోట్లు కేటాయించారు. ఇలా మొత్తంగా రూ.7.70 కోట్లు ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినప్పటికీ, ప్రజలకు అందుబాటులోకి తేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌ను వినియోగంలోకి తేకపోతే అందులోని మార్బుల్స్, ఇతర విలువైన సామగ్రి పాడైపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ వద్దే పెండింగ్! అన్ని పనులూ పూర్తయిన ఈ మార్కెట్లో కూరగాయలు, పండ్లు, పూలు విక్రయించే అర్హులైన చిరు వ్యాపారులకు దుకాణాలు కేటాయించాల్సి ఉంది. కానీ, మార్కెటింగ్ శాఖ నుంచి స్పందన లేకపోవడంతోనే ఈ మార్కెట్ ప్రారంభం కాకుండా మూలన పడి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి మార్కెట్‌ను ప్రారంభించాలని స్థానిక చిరు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కంప్యూటర్ సైన్స్‌కు గణితమే వెన్నెముక
రామగిరి(నల్లగొండ) : ఆధునిక కంప్యూటర్ సైన్స్‌కు గణితశాస్త్రమే వెన్నెముక అని ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రాజు అన్నారు. కళాశాల గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘మ్యాథమెటిక్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ అండ్ ఆపర్చునిటీస్’ అనే అంశంపై బుధవారం ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్క్రీట్ స్ట్రక్చర్స్, లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ వంటి భావనలు ప్రతి అల్గారిథమ్, సురక్షిత లావాదేవీల వెనుక ఉన్నాయని, విద్యార్థులు గణితాన్ని డిజిటల్ ప్రపంచాన్ని నడిపించే శక్తివంతమైన సాధనంగా అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్ అండర్ గ్రాడ్యుయేట్ పూర్తయిన తర్వాత గణితశాస్త్రంలో అవకాశాలు అనే అంశంపై మాట్లాడారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో గణిత విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు ఇంటర్ డిసిప్లినరీ అభ్యాసంపై దష్టి సారించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒడేలు వంగ అల్గారిథమ్ డిజైన్‌లో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, గ్రాఫ్ థియరీ పాత్ర, క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ సెక్యూరిటీలో గణిత పునాదులు, మెషిన్ లెర్నింగ్‌కు తోడ్పడే లీనియర్ ఆల్జీబ్రా, క్వాంటం కంప్యూటింగ్ అనువర్తనాలపై సుమారు మూడు గంటల పాటు విద్యార్థులకు సవివరంగా వివరించారు. కార్యక్రమంలో కన్వీనర్ టి.శ్రీనివాసులు ఎ.మల్లేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వర్లు, పి.సంతోషి తదితరులు పాల్గొన్నారు.


