క్షతగాత్రులను చూసి.. కాన్వాయ్‌ ఆపి.. | - | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులను చూసి.. కాన్వాయ్‌ ఆపి..

Feb 18 2026 6:54 AM | Updated on Feb 18 2026 6:54 AM

క్షతగ

క్షతగాత్రులను చూసి.. కాన్వాయ్‌ ఆపి..

చిట్యాల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను చూసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వారి దగ్గరకు వెళ్లి వివరాలు అడిగి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి–65పై మంగళవారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. శాలిగౌరారం మండలం బైరవునిబండకు చెందిన రమేష్‌ తన వ్యక్తిగత పనిమీద చిట్యాల మండలం గుండ్రాంపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు సమీపంలోని హోటల్‌లో టిఫిన్‌ చేసిన అనంతరం హైవే దాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకట్‌ అనే యువకుడు బైక్‌పై హైదరాబాద్‌ వైపునకు వెళ్తూ ప్రమాదవశాత్తు రమేష్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదంలో క్షతగాత్రులయిన రమేష్‌, వెంకట్‌ రహదారిపైనే పడి ఉన్నారు. ఇదే సమయంలో నల్లగొండలో పర్యటన ముగించుకుని తన కాన్వాయ్‌తో హైదరాబాద్‌ వెళ్తున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గమనించి క్షతగాత్రుల వద్దకు వెళ్లి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి వారిని చికిత్స నిమిత్తం చౌట్టుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రితోపాటు ఆయన గన్‌మెన్‌లు రహదారిపై ట్రాఫిక్‌జామ్‌ కాకుండా క్లీయర్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిని ఎనిమిది వరుసలుగా విస్తరించేందుకు త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు.

ఫ గుండ్రాంపల్లిలో రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి

ఫ దగ్గరికి వెళ్లి వివరాలు సేకరించి

ఆస్పత్రికి తరలించిన మంత్రి

క్షతగాత్రులను చూసి.. కాన్వాయ్‌ ఆపి..1
1/1

క్షతగాత్రులను చూసి.. కాన్వాయ్‌ ఆపి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement