breaking news
Nalgonda District News
-
ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డిని శిక్షించాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం కొత్తపేటతండాకు చెందిన గిరిజన యువకుడు సాయిసిద్ధును విచక్షణ రహితంగా కొట్టిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రాష్ట్ర కార్యదర్శి టి.హరికృష్ణ అన్నారు. మంగవారం వారు తండాకు చేరుకుని బాధితుడు సాయిసిద్ధును పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీసులు సాయిసిద్ధును దారుణంగా కొట్టారని, దీంతో నడవలేని స్థితిలో ఉన్నాడని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో పోలీసులు చట్టానికి అతీతంగానే వ్యవహరిస్తున్నారని అన్నారు. గిరిజన యువకుడు సాయిసిద్ధును హింసించిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు అతనికి సహకరించిన ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో తాళ్ల రోహిత్, దిలీప్‌కుమార్, వెంకటనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దశరథ, సభ్యులు గురవయ్య, వెంకటరమణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ మానవహక్కుల వేదిక బృందం -
పలు గ్రామాల్లో పంచాయతీ పోరుకు అభ్యర్థులు కరువు
● అడవిదేవులపల్లి మండలంలోని జిలకరకుంటతండా గ్రామ పంచాయతీ గతంలో ఎస్టీ జనరల్ కాగా ఈ సారి బీసీ మహిళకు రిజర్వు అయింది. ఆ గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం ఒక్కటే ఉంది. ● గోన్యతండా గతంలో ఎస్టీ మహిళ కాగా ఈ సారి బీసీ జనరల్ రిజర్వు అయింది. అక్కడ కేవలం బీసీ సామాజిక వర్గం నుంచి రెండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ● ముదిమాణిక్యం గతంలో జనరల్ మహిళ కాగా ఈ సారి ఎస్టీ జనరల్‌గా రిజర్వేషన్ అయింది. ఈ గ్రామంలో రెండు మాత్రమే ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి. ● దామరచర్ల మండలంలోని తూర్పుతండా బీసీలకు రిజర్వ్ అయ్యింది. ఇక్కడ ఒక్క కుటుంబమే ఉంది. ● మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయింది. గ్రామంలో మొత్తం 1925 మంది ఓటర్లు ఉండగా అందులో కేవలం బానోతు శాంతి, బోడ నవీన్ అనే ఎస్టీలకు మాత్రమే ఓట్లు ఉన్నాయి. ● గజలాపురం గ్రామపంచాయతీ ఎస్టీకి రిజర్వ్ చేశారు. గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉంది. అయితే ఇక్కడ ఎస్టీలకు రెండు వార్డులు కేటాయించారు. ● పెద్దవూర మండలంలో పులిచర్ల గ్రామపంచాయతీ ఎస్టీ మహిళకు కేటాయించారు ఇక్కడ ఎస్టీలకు సంబంధించి ఐదు ఓట్లు మాత్రమే ఉన్నాయి. ● చందంపేట మండలంలోని గుంటిపల్లి బీసీకి రిజర్వ్ అయింది. ఇక్కడ బీసీ కుటుంబం ఒక్కటే ఉంది. మరో కుటుంబంలో భర్త బీసీ, భార్య ఎస్టీ ఉన్నారు. ● దేవరకొండ మండలం దుబ్బతండా గ్రామపంచాయతీ బీసీ మహిళకు రిజర్వు అయింది. అయితే అక్కడ బీసీ మహిళ ఒక్కరే ఉన్నారు. ● వెంకటితండా బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. అయితే అక్కడ మూడే బీసీ ఓట్లు ఉన్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం పేరూర్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. పేరూర్ గ్రామ పంచాయతీలో 792 మంది ఓటర్లలో ఒకే ఒక్క ఎస్టీ పురుషుడికే ఓటు హక్కు ఉంది. అయితే ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళ రిజర్వు అయింది. దీంతో అభ్యర్థేలేని పరిస్థితి నెలకొంది. ఫ రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్‌లే కాదు వార్డుల్లోనూ సభ్యుల్లేరు.. ఫ పలుచోట్ల ఒకటీ రెండు కుటుంబాల వారికే దక్కిన రిజర్వేషన్ ఫ గిరిజనులు ఉండే ప్రాంతాల్లోని సర్పంచ్ పదవులు బీసీలకు రిజర్వు ఫ ఇంకొన్ని చోట్ల ఒకరే అభ్యర్థి ఉండడంతో ఏకగ్రీవానికి అవకాశం ఫ కొన్ని గ్రామాల్లో ఎస్సీలకు అసలు ఒక్క సీటూ రిజర్వు కాలే..సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. జిల్లాలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులతోపాటు వార్డు సభ్యుల కొరత కూడా నెలకొంది. దీంతో అభ్యర్థుల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు వెతుకులాటలో పడ్డాయి. కొన్నిచోట్ల ఒకటీ రెండు కుటుంబాలే ఉన్నా, వారికే ఆ స్థానాలు రిజర్వు అయ్యారు. దీంతో అక్కడ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో బీసీలకు సర్పంచ్ స్థానాలు రిజర్వు కాగా, అక్కడ బీసీ అభ్యర్థులే లేని విచిత్ర పరిస్థితి నెలకొంది. అలాంటి వాటిల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్నది గందరగోళంగా మారింది. అభ్యర్థులే లేకుండా ఎలా ముందుకు వెళతారన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. మరికొన్ని మండలాల్లో ఎస్సీలకు ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ అసలు అభ్యర్థులు లేరు.. దామరచర్ల మండలంలో జైత్రాంతండా, బాండావత్తండా, గోన్యతండా, బాలాజీనగర్‌తండా, మాన్తండా, నూనావత్తండాలే బీసీలకు రిజర్వ్ అయ్యాయి. కానీ ఈ తండాల్లో బీసీ ఓటర్లే లేరు. అక్కడ సర్పంచ్ పదవి నామినేషన్ వేసే వారే లేకుండాపోయారు. అడవిదేవులపల్లి మండలంలోని చాంప్లాతండా గతంలో ఎస్టీ జనరల్ కాగా ఈ సారి బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. అక్కడ ఒక్క బీసీ కూడా లేరు. తిరుమలగిరి(సాగర్) మండలంలో చింతలపాలెం గ్రామపంచాయతీ ఎస్టీ జనరల్‌గా రిజర్వు అయింది. అయితే అక్కడ ఎస్టీలు ఒక్కరూ లేరు. దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము మండలంలో బచ్చాపురం సర్పంచ్ బీసీకి రిజర్వ్ అయింది ఇక్కడ బీసీ కుటుంబాలు ఒక్కటీ లేవు. 2011లో ఒక కుటుంబం ఉండేది. ఇప్పుడు ఆ కుటుంబం కూడా అక్కడ లేదు. ఎస్సీలకు ఒక్క వార్డూ కేటాయించలే.. మాడుగులపల్లి మండలంలోని అభంగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయింది. గ్రామంలో 881 మంది ఓట్లు ఉండగా అందులో ఎస్టీ వారు ఒక్కరు కూడా లేరు. వార్డుల్లో ఎస్టీలకు 3, బీసీలకు 4, జనరల్‌కు ఒక స్థానం కేటాయించగా గ్రామంలో ఎక్కువగా ఉన్న మాల, మాదిగ సామాజికవర్గం కుటుంబాలు ఉన్నప్పటికీ ఎస్సీలకు రిజర్వేషన్లో స్థానం కల్పించలేదు. మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామంలో పది వార్డులు ఉండగా బీసీలకు నాలుగు వార్డులు కేటాయించగా నాలుగు వార్డులు ఎస్టీ, రెండు జనరల్ స్థానాలు కేటాయించారు. పది వార్డుల్లో ఒక్క స్థానం కూడా ఎస్సీలకు కేటాయించలేదు. గ్రామం మొత్తంలో ఇద్దరే ఎస్టీ ఓటర్లు ఉన్నారు. -
రికార్డు స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని తెలంగాణ జెన్కో ప్రధాన విద్యుత్ ఉత్పాదన కేంద్రంలో విద్యుదుత్పాదన సంవత్సర లక్ష్యాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేసినట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్(సీఈ) మంగేష్నాయక్ తెలిపారు. మంగళవారం విద్యుదుత్పాదన ప్రధాన కేంద్రం పవర్ కంట్రోల్ రూమ్‌లో ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యుదుత్పాదన కేంద్రం మెయిన్ పవర్‌హౌస్ 2025–26 ఆర్థిక సంవత్సరపు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1,450 మిలియన్ యూనిట్లు కాగా.. మంగళవారం నాటికి(సెప్టెంబర్ 30) లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్లు లక్ష్యం కాగా.. 540 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1,400 మిలియన్ యూనిట్లు లక్ష్యానికి 1,922 మిలియన్ యూనిట్లు ఉత్పాదన చేసినట్లు తెలిపారు. ఆరు నెలల కాలంలోనే లక్ష్యాన్ని పూర్తి చేయడంపై ఇంజినీర్లను ప్రశంసించారు.ఫ ఏడాది టార్గెట్ ఆరు నెలల్లోనే పూర్తి -
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోడల్ అధికారులతో ఆమె సమావేశమై మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ విధులకు నియమించిన ఉద్యోగుల పూర్తి డేటాను వెంటనే సమర్పించాలని మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి డీఈఓ భిక్షపతిని ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. పొరపాట్లకు తావివ్వ వద్దని గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు శాఖల ద్వారా నిర్వహించే ఇతర పనులను జాప్యం లేకుండా చూడాలన్నారు. ఆయా నోడల్ అధికారులు చేయాల్సిన విధులు, కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతుల కల్పన, కౌంటింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ సిబ్బంది నియామకం వంటి పనులపై నోడల్ అధికారులు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ వెంకయ్య పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో తప్పులు జరగొద్దు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి తప్పలు జరగకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్లగొండలోని ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రెసిడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓ హాండ్ బుక్‌ను చదవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతించిన వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని పేర్కొన్నారు. కేటాయించిన ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని, లేనిపక్షంలో ఎన్నికల నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో శిక్షణ అధికారి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఎన్నికల షెడ్యూల్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు, తదితర అంశాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తున్నామని.. మొదటి విడతలో నల్లగొండ, దేవరకొండ, రెండో విడతలో చండూరు, మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో ఎన్నికల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలకు అనుమతి తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి, మాధవరెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
జిల్లా స్థాయి సాహితీ పోటీలు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లాకు చెందిన సాహితీవేత్త గ్రంథాలయ ఉద్యమకారుడు వట్టికోట ఆళ్వారు స్వామి జయంతి సందర్భంగా జిల్లా స్థాయి సాహితీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహితీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి ఎండీ.హసేనా తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సంబంధించిన అంశాలపై వ్యాస రచన, కవితలు, పాటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు అక్టోబర్ 20వ తేదీలోపు తమ వ్యాసాలు, కవితలు, పాటలను telanganasahithinlg 2024 @gmail.comకు మెయిల్ పంపించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9848228004 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. బుద్ధవనాన్ని సందర్శించిన అమ్రాబాద్ సీసీఎఫ్నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని మంగళవారం అమ్రాబాద్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్(సీసీఎఫ్) సునీల్ హిరామత్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్థూప వనం, మహాస్థూపం అంతర్భాగంలోని ధాన్య మందిరాన్ని సందర్శించి ధ్యానం చేశారు. వీరికి బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రు బుద్ధవనం బ్రోచర్లను అందజేశారు. అనంతరం వీరు సాగర్ జలాశయంలో లాంచీలో విహరించారు. వీరితో పాటు ఒడిశాకు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన మరో అధికారి విశ్వనాథ్ నీల్ అన్వార్ కూడా ఉన్నారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలను, సాగర్ వివరాలను వివరించారు. వారి వెంట ఎఫ్డీఓ సంగీత, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు రమేష్, రవీందర్ ఉన్నారు. వట్టికోట ఆళ్వార్ స్వామి సాహితీ కళాపీఠం ఏర్పాటు రామగిరి(నల్లగొండ): గ్రంథాలయ ఉద్యమకారుడు వట్టికోట ఆళ్వారు స్వామి సాహితీ కళాపీఠాన్ని మంగళవారం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షుడిగా డా.బెల్లి యాదయ్య, గౌరవ సలహాదారులుగా పూజర్ల శంభయ్య, గింజల నరసింహారెడ్డి, అధ్యక్షుడిగా తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మామిడి లింగస్వామి, ఉపాధ్యక్షుడిగా కుంచె నగేష్, కోశాధికారిగా సారంగి వెంకన్న, సంయుక్త కార్యదర్శిగా ముక్కామల జానకిరామ్‌లను ఎన్నుకున్నారు. వారితోపాటు నలుగురు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. -
ఆంజనేయస్వామికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజ నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సిందూరంపాటు పాలతో మన్యసూక్త పారాయణములతో అభిషేకం జరిపారు. అనంతరం సుగంధం వెదజల్లే ద్రవ్యాలు, పూలతో అలంకరించి, నాగవల్లి దళార్చన చేపట్టారు. ఇక ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవలు వంటి పూజలు కొనసాగాయి. -
మోగిన స్థానిక నగారా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 9వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొదటి విడత నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో పంచాతీయ ఎన్నికలను నిర్వహించేలా షెడ్యూలు జారీ చేసింది. దీంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూలు జారీ చేసింది. ఆ తరువాత గ్రామ పంచాయతీల ఎన్నికలను నిర్వహించనుంది. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మొదటి విడతలో 18 మండలాల్లో ఎన్నికలకు వచ్చేనెల 9న నోటిఫికేషన్ జారీ చేసి, 23న ఎన్నికలను నిర్వహించనుంది. రెండో విడతలో 15 మండలాల్లో ఎన్నికలకు వచ్చే నెల 13న నోటిఫికేషన్ జారీ చేసి, 27న పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది. డివిజన్ల వారీగా పల్లెపోరు ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో అక్టోబర్ 31న ఎన్నికలు నిర్వహించనుంది. ఇందుకోసం వచ్చే నెల 17వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక రెండో విడతలో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోఎన్నికలకు వచ్చే నెల 21వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ 4వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది. మూడో విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో ఎన్నికలకు వచ్చే నెల 25వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి, నవంబర్ 8వ తేదీన ఎన్నికలను నిర్వహించనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించనుంది. 353 ఎంపీటీసీ, 33 జెడ్పీటీసీలు జిల్లాలో 353 ఎంపీటీసీ, 33 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలను 1,957 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనుంది. మొదటి విడతలో నల్లగొండ, దేవరకొండ డివిజన్లలోని 196 ఎంపీటీసీ స్థానాలకు 483 గ్రామాలు, 4,152 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించనుంది. ఇందుకోసం 516 ప్రాంతాల్లో 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రెండో విడతలో చండూరు, మిర్యాలగూడ డివిజన్లలోని 157 ఎంపీటీసీ స్థానాలకు 386 గ్రామాలు, 3,342 వార్డుల్లో ఎన్నికలను నిర్వహించనుంది. ఇందుకు 419 ప్రాంతాల్లో 858 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. 869 గ్రామాలు.. 7,494 వార్డులు జిల్లాలో 33 మండలాల పరిధిలోని 869 గ్రామ పంచాయతీలకు, వాటి పరిధిలోని 7,494 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో నల్లగొండ, చండూరు డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లోని 318 గ్రామాలు, 2,870 వార్డులకు ఎన్నికలు జరుగున్నాయి. రెండో విడతలో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాలకు చెందిన 282 గ్రామాలు, 2,418 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలోని 9 మండలాలకు చెందిన 269 గ్రామాలు, 2,206 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. దాదాపు సగం సర్పంచ్ స్థానాలు బీసీలకే.. జిల్లాలోని 869 గ్రామ పంచాయతీల్లో పూర్తిగా గిరిజనులకు కేటాయించినవి పోగా మిగితా 755 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం దాదాపు సగం సర్పంచ్ పదవులు బీసీలకు లభించనున్నాయి. 147 స్థానాలు పూర్తిగా బీసీ మహిళలకు కేటాయించగా, 163 బీసీ జనరల్‌కు కేటాయించారు. ఇలా మొత్తంగా 310 సర్పంచ్ స్థానాలు, 2,638 వార్డులు బీసీలకు దక్కనున్నాయి. 114 గిరిజన గ్రామ పంచాయతీలు తండాలుగా మార్చిన 114 గిరిజన గ్రామ పంచాయతీలన్నీ వారికే రిజర్వు అయ్యాయి. వాటిల్లో 856 వార్డులు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీలతోపాటు రిజర్వేషన్ల కోటా మేరకు అదనంగా మరో 78 పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. వాటి పరిధిలోని 577 వార్డులు గిరిజనులకే దక్కనున్నాయి. దీంతో ఈసారి మొత్తంగా గిరిజన సర్పంచ్ల సంఖ్య 192కు చేరనుండగా, 1,433 వార్డుల సభ్యులు గిరిజనులే ఉండనున్నాయి. ఇక ఎస్సీలకు 153 సర్పంచ్ స్థానాలు, 1,281 వార్డులు లభించనున్నాయి. అన్ రిజర్వుడ్ కేటగిరీలో 214 పంచాయతీలు ఉన్నాయి. అన్ని కేటగిరీల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.73 లక్షల మంది 10,73,506 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 5,30,860 మంది పురుషులు, 5,42,589 మంది మహిళలు, 57 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పార్టీ గుర్తులపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పార్టీ గుర్తులపైనే నిర్వహించనున్నారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ఈవీఎంల మాదిరిగానే బ్యాలెట్ పేపర్లపై కూడా ‘నోటా’ గుర్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, పంచాయతీ ఎన్నికలకు ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట దాకా పోలింగ్ జరుగుతుంది. గంట భోజన విరామం తర్వాత పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, విజేతలను ప్రకటిస్తారు. మరునాడు ఉప సర్పంచ్ల ఎన్నిక ఉంటుంది. ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 11న ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది.ఐదు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఫ వచ్చే నెల 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఫ నవంబర్ 11న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఫ వచ్చే నెల 31, నవంబర్ 4, 8న పంచాయతీలకు.. ఫ పోలింగ్ రోజు సాయంత్రమే ఫలితాలు ఫ అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ మొదటి విడత సర్పంచ్ ఎన్నికల వివరాలు.. డివిజన్ పంచాయతీలు పోలింగ్ కేంద్రాలు నల్లగొండ 214 1,946 చండూరు 104 924 రెండోవిడతలో.. మిర్యాలగూడ 282 2,418 మూడో విడతలో దేవరకొండ 269 2,206 తొలి విడత ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన వివరాలు.. ఎంపీటీసీలు గ్రామాలు వార్డులు పోలింగ్‌కేంద్రాలు 196 483 4,152 1,099 రెండు విడతలో.. 353 869 7,494 1,957 ఎంపీటీసీ స్థానాలు 353 పంచాయతీ వార్డులు 7,494 మొత్తం పోలింగ్స్టేషన్లు 1957 పోలింగ్బాక్స్లు: 9,996 పోలింగ్ సిబ్బంది పీవోలు 2,348, ఓపీవో 10,982 అధికారులు: జెడ్పీటీసీ ఆర్వోలు 39, ఎంపీటీసీ ఆర్వోలు 140, ఏఆర్వోలు 140 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 652 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు 304 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 18 -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
నల్లగొండ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేసే సీపీఎం శ్రేణులను ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థ ల ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్ స్థానాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని తక్షణమే వాటిని సవరించాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి అయిలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలు సవ్యంగా నిర్వహించాలి
నల్లగొండ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ను నిర్వహించారు. దీనికి హాజరైన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మొదటి విడత నల్లగొండ, దేవరకొండ డివిజన్లకు సంబంధించి 18 మండలాలు, రెండవ విడతన చండూరు, మిర్యాలగూడ డివిజన్లకు సంబంధించి 15 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నల్లగొండ, చండూరు డివిజన్లలో 318 గ్రామపంచాయతీలు, రెండవ విడత మిర్యాలగూడ డివిజన్లలో 282 గ్రామపంచాయతీలు, మూడవ విడత దేవరకొండ డివిజన్ పరిధిలోని 269 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు 996 బ్యాలెట్ బాక్స్‌లు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికలపై ఆర్ఓలు, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈనెల 30న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు ఇన్చార్జ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఓ వెంకయ్య, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, ఆర్డీఓలు వై.అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, డీఈఓ భిక్షపతి, ఆర్టీఓ లావణ్య అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రేషన్ డీలర్లకు కమీషన్ ఇప్పించాలి
నల్లగొండ: ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ కమీషన్‌ను వెంటనే ఇప్పించాలని జిల్లా రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి తమకు రావాల్సిన కమీషన్ ప్రభుత్వం నుంచి ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు నాగరాజు పులిచింతల సత్తిరెడ్డి, పగిళ్ల వెంకటేశ్వర్లు, బొల్లా వేణుగోపాలరావు, సముద్రాల యాదయ్య గౌడ్, జనార్దన్, వివిధ ప్రాంతాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్లగొండ: పోలీస్ స్టేషన్లకు వచ్చిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ పోలీసులను ఆదేశించారు. నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌లో 25మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేవించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. -
ఇచ్చిన హామీలు అమలు చేశాం
నల్లగొండ: ఇచ్చిన హామీలు అమలు చేశామని, బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. సోమవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ బీఆర్ఎస్ బాకీ కార్డుల పోస్టర్‌ను విడుదలచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రాజెక్టుల పేరుతో పేదల సొమ్మును దోచుకుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణీ, రైతులకు రుణమాఫీ, ఐదు సంవత్సరాల వడ్డీ బాకీ, నిరుద్యోగులకు నెలకు రూ.3000 బాకీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బాకీలు పడిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న జగదీష్‌రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జగదీష్‌రెడ్డిని గొల్లగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ చేయాలన్నారు. తిప్పర్తిలో ఆరు గ్యారంటీలపై విడుదల చేసిన కార్డుపై నల్లగొండ సెంటర్లో చర్చకు రావాలని జగదీష్‌రెడ్డికి సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సూర్యాపేట సీటు కూడా దక్కదన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కనగల్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, చీదేటి వెంకట్‌రెడ్డి, షబ్బీర్ బాబా, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, కొప్పు నవీన్‌గౌడ్, పిల్లి యాదగిరి యాదవ్, కిన్నెర అంజి, పెరికె చిట్టి, విజయ్ పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే చర్చకు రావాలి ఫ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ -
స్వర్ణగిరిలో సహస్ర కుంకుమార్చన, అక్షరాభ్యాసం
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారిని విద్యాలక్ష్మిగా అలంకరించి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అంతకుమందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. విద్యాలక్ష్మి అమ్మవారి వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న అర్చకులు -
మదర్ డెయిరీకి రూ.50 కోట్లు కేటాయించాలి
సాక్షి,యాదాద్రి: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుల కుప్పగా మారిన మదర్ డెయిరీని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించాలని మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి కోరారు. సోమవారం భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఏడాది కాలంలో మదర్ డెయిరీ అప్పుల పాలైనట్లు బీఆర్ఎస్ నాయకుడు గొంగిడి మహేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే మదర్ డెయిరీని దివాలా దిశకు చేర్చారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్లు వేలాది మంది రైతులు, డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన విచారణలో పదేళ్లలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయన్నారు. మదర్ డెయిరీని ఎన్డీడీబీ టేకోవర్ చేయడానికి సిద్ధంగా ఉందని.. ఒకవేళ అలా జరగకపోతే అప్పుల కింద బ్యాంకు వాళ్లే లాకౌట్ చేస్తారన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లో ఉన్నట్లు తప్పుడు ఆడిట్ రిపోర్టులు తయారు చేసి, బ్యాంకును నమ్మించడానికి అప్పులకు కూడా ఇన్‌కం టాక్స్ కట్టిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. డైరక్టర్ల ఎన్నికల్లో పొత్తు ధర్మం తప్పింది గొంగిడి మహేందర్‌రెడ్డే అన్నారు. తన పార్టీకి చెందిన వ్యక్తిని అదనంగా పోటీలో నిలబెట్టి డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అదనంగా రంగంలో దిగితే షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. డబ్బులు ఇచ్చి, పాల చైర్మన్లకు ఫోన్లు చేసిన గొంగిడి మహేందర్‌రెడ్డి నైతికవిలువలు మర్చిపోయాడన్నారు. గత బీఆర్ఎస్ పాలకవర్గాల బాధ్యతారాహిత్యమే నేటి దుస్థితికి కారణమని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, పుప్పాల నర్సింహులు, కర్నాటి జయశ్రీ ఉప్పల్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వానికి చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి -
22 ఏళ్లు దేశ రక్షణలో..
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన బెల్లంకొండ వేలాద్రి కుమారుడు రవి 22 ఏళ్లు దేశ రక్షణలో ఆర్మీ జవాన్‌గా సేవలందించి మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు. ఆయన 2003లో డిగ్రీ మొదటి సంవత్సరంలోనే ఉండగానే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని ఎంపికయ్యారు. మహరాష్ట్రలోని హేమనగర్లో శిక్షణ పొంది 2005లో ఆర్మీ జవాన్‌గా సైన్యంలో చేరారు. అప్పటి నుంచి జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచలప్రదేశ్లో పనిచేశారు. ఇటీవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో కూడా ఆయన పాల్గొని దేశానికి సేవలందించారు. ప్రస్తుతం అహ్మదానగర్లో పనిచేస్తున్న ఆయన మంగళవారం పదవీ విరమణ పొందనున్నారు. దసరా రోజు అభినందన సభ..రవి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి వస్తున్న సందర్బంగా అక్టోబన్ 2న దసరా రోజు చిలుకూరు మండల కేంద్రంలో ర్యాలీతో పాటు అభినందన సభ నిర్వహించేందుకు గ్రామ యువత, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు పదవీ విరమణ పొందనున్న చిలుకూరుకు చెందిన ఆర్మీ జవాన్ -
భువనగిరిలో నకిలీ నోట్ల కలకలం
భువనగిరి: భువనగిరి పట్టణంలో సోమవారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని ఖిలానగర్‌లో మొబైల్ షాపు నిర్వహిస్తున్న పల్లెర్ల నాగేంద్రబాబు వద్దకు సోమవారం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి.. తన దగ్గర రూ.11వేల నగదు ఉందని, తన బంధువులకు ఫోన్ పే చేయాలని వేడుకున్నాడు. దీంతో నాగేంద్రబాబు తన ఫోన్ ద్వారా సదరు వ్యక్తి చెప్పిన నంబర్‌కు రూ.11వేలు ఫోన్ పే చేయగా.. అతడు రూ.11వేల నగదును నాగేంద్రబాబుకు ఇచ్చాడు. అనంతరం నాగేంద్రబాబు నోట్లను పరిశీలించగా.. అవి దొంగ నోట్లని అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
హత్య కేసులో పది మంది అరెస్ట్
సూర్యాపేటటౌన్ : పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన పది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలోని అన్నాదురై నగర్‌కు చెందిన ఫ్లవర్ డెకరేషన్ చేసే పెద్ది లింగస్వామికి, చారగండ్ల శివకుమార్‌కు ఐదేళ్ల క్రితం ఘర్షణ జరిగింది. ఆ సమయంలో శివకుమార్‌పై హత్యాయత్నం చేసిన పెద్ది లింగస్వామిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి పెద్ది లింగస్వామి శివకుమార్‌పై పగ పెంచుకున్నాడు. ఈ నెల 26న మధ్యాహ్నం చారగండ్ల శివకుమార్, పెద్ది లింగస్వామికి సూర్యాపేట పట్టణంలోని పూల సెంటర్ వద్ద మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో పెద్ది లింగస్వామి తన స్నేహితులు మాతంగి మధు, మరికొంత మందితో కలిసి శివకుమార్‌ను హత్య చేయాలని పథకం వేశాడు. ఈ మేరకు అదే రోజు సాయంత్రం శివకుమార్‌కు మాతంగి మధుతో ఫోన్ చేయించి కుసుమవారిగూడెం వైన్ షాప్ వద్దకు పిలిపించాడు. శివకుమార్ వైన్ షాప్ ఎదురుగా ఉన్న విజయ్ హోటల్ వద్ద రాత్రి 10గంటల సమయంలో మందు తాగుతుండగా.. పెద్ది లింగస్వామి, అతడి స్నేహితుడు మాతంగి మధు, మరికొందరు కలిసి మారణాయుధాలతో శివకుమార్‌ను హత్య చేసి పరారయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పది మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. కాగా హత్యకు గురైన శివకుమార్‌తో పాటు నిందితులపై గతంలో రౌడీషీట్ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ఒక స్కూటర్, మూడు మోటార్ సైకిళ్లు, మూడు కత్తులు, రెండు గొడ్డళ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 12 మందిపై కేసు నమోదు.. ఈ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడైన సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మాతంగి మధు అలియాస్ కర్రీ మధు, పెద్ది లింగస్వామి, సీతారాంపురానికి చెందిన చెవుల నరేష్, జేజేనగర్‌కు చెందిన జక్కి సతీష్, కేసారం గ్రామానికి చెందిన భాషపంగుల సతీష్, సూర రామచంద్రు, తాళ్లగడ్డకు చెందిన నేరెళ్ల శ్రీరాములు, అన్నాదురైనగర్‌కు చెందిన గువ్వల తరుణ్‌కుమార్, కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటేష్, ఇందిరమ్మ కాలనీకి చెందిన జెల్లా ఉదయ్‌కుమార్ అరెస్టయ్యారు. జేజేనగర్‌కు చెందిన జక్కి అనిల్, కృష్ణటాకీస్ దగ్గర గల వర్రె రామకృష్ణ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. రిమాండ్‌కు తరలింపు పరారీలో మరో ఇద్దరు -
ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 5,91,456 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 26 క్రస్ట్ గేట్ల ద్వారా 5,41,516 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదనతో 33,333 క్యూసెక్కులు మొత్తం 5,74849 క్యూసెక్కుల నీటిని దిగువన కృష్ణ నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి కాలువ, ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ కాల్వలకు 16,607 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణా, మూసీ సంగమం వద్ద ఉగ్రరూపం.. మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో టెయిల్‌పాండ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది పొంగుపొర్లుతుండగా గేట్లు ఎత్తారు. దీంతో దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా, మూసీ నదులు కలిసే సంగమం వద్దకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఏర్పాటు చేసిన ఘాట్లతో పాటు విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. మట్టపల్లి క్షేత్రం వద్ద..మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది సోమవారం ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో పాటు మూసీ నది నుంచి వచ్చే వరద నీరు, హాలియా తదితర వాగుల నుంచి వచ్చే వరద నీటితో మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాకుండా పులిచింతల ప్రాజెక్టులో సుమారు 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ పైనుండి వస్తున్న వరద నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మట్టపల్లి వరకు నిల్వ ఉంటూ నిండుకుండను తలపిస్తోంది. ఈ దృశ్యం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే వారిని ఆకట్టుకుంటోంది. నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల వాడపల్లిలో కృష్ణా, మూసీ సంగమం వద్ద నీట మునిగిన పుష్కర ఘాట్లు -
యాదగిరీశుడి సేవలో పాదరాజ మఠం పీఠాధిపతి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి శ్రీసుజయనిధి తీర్థ ముల్బాగల్ స్వామిజీ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠ అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలో ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. యాదగిరిగుట్టలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు యాదగిరిగుట్ట: దసరా పండుగను పురస్కరించుకొని యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద సోమవారం రాత్రి బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి యాదగిరి క్షేత్రానికి భక్తులు వస్తుండటంతో పాటు సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తనిఖీలు చేపట్టినట్లు సిబ్బంది వెల్లడించారు. -
బస్టాండ్‌కు మరమ్మతు చేయాలి
మిర్యాలగూడ : ఆర్టీసీ బస్టాండ్‌కు మరమ్మతు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన బస్టాండ్‌ను తనిఖీ చేశారు. బస్టాండ్‌లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మరమ్మతు పనులను సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. బస్టాండ్‌లో పెచ్చులు ఊడిన చోట త్వరితగతిన మరమ్మతు పనులు చేయాలన్నారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో గౌడ సంఘం భవనానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్, ఉదయ్‌భాస్కర్‌గౌడ్, చౌగాని వెంకన్నగౌడ్, గురుమూర్తి, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, జెర్రిపోతుల రాములుగౌడ్, ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఫ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
మిర్యాలగూడ : మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం 2025– 27 ఎన్నిక ఆదివారం పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో జరిగాయి. ఎన్నికల అధికారిగా రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పందిరి రవీందర్ వ్యవహరించారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరు శ్రీనివాస్, కార్యదర్శి –1గా వెంకటరమణచౌదరి(బాబి), కార్యదర్శి–2గా పొలిశెట్టి ధనుంజయలు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మొత్తం 90 ఓటర్లు కాగా ఉపాధ్యక్ష పదవి కోసం మాశెట్టి శ్రీనివాస్, గోళ్ల రామశేఖర్ పోటీపడగా మాశెట్టి శ్రీనివాస్‌కు 15ఓట్లు, రామశేఖర్‌కు 69ఓట్లు వచ్చాయి. దీంతో రామశేఖర్ విజయం సాధించారు. కోశాధికారి పదవికి చిల్లంచర్ల శ్రీనివాస్, గందె రాము పోటీ పడగా శ్రీనివాస్‌కు 42ఓట్లు, రాముకు 44ఓట్లు వచ్చాయి. దీంతో రాము విజయం సాధించారు. పది డైరక్టర్ల పదవులకు 30 నామినేషన్లు రాగా డ్రా పద్ధతిలో పది మందిని ఎంపిక చేశారు. డైరెక్టర్లుగా గౌరు శంకర్, నీలా పాపారావు, పోతుగంటి గోపి, ఆతుకూరి గురునాథం, గుర్రం వెంకటరత్నం, శ్రీరంగం నర్సయ్య ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి రవీందర్ ప్రకటించారు. నూతన పాలకవర్గాన్ని పలువురు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, గుడిపాటి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు చిల్లంచర్ల విజయ్‌కుమార్, మంచుకొండ వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఫ అధ్యక్షుడిగా గౌరు శ్రీనివాస్, కార్యదర్శిగా వెంకటరమణచౌదరి ఏకగ్రీవం ఫ మిగతా స్థానాలకు ఎన్నికలు -
హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్
తిప్పర్తి : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పుడు గాలికొదిలేసిందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డులను ఆదివారం తిప్పర్తి మండలం కేంద్రంలో ఇంటింటికి పంచారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కర్నాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలని చూస్తోందని.. దానివల్ల నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారతాయన్నారు. ఆ విషయంపై ఇక్కడ ఉన్న అధికార పార్టీకి సోయిలేదని.. బీఆర్ఎస్ పార్టీ తరఫున నల్లగొండ జిల్లా రైతులతో కలిసి చలో అల్మట్టి కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఇరిగేషన్ మంత్రికి ఆల్మట్టిపై సోయిలేదని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నీళ్ల గురించి అవగాహన లేదని విమర్శించారు. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి అమలు చేయడంలో విఫలమయ్యారని.. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, నాయకులు కందుల లక్ష్మయ్య, వనపర్తి నాగేశ్వర్రావు, లొడంగి గోవర్ధన్, సిరసవాడ సైదులు, బైరగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఫ తిప్పర్తిలో ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ -
నేడు రేషన్ డీలర్ల బైక్ ర్యాలీ
నల్లగొండ : రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రావాల్సిన కమిషన్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సోమవారం నల్లగొండలో శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బైక్ ర్యాలీ ఎన్జీ కాలేచి నుంచి ప్రారంభమై కలెక్టరేట్ వరకు సాగుతుందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రేషన్ డీలర్లు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. మూసీకి కొనసాగుతున్న వరదకేతేపల్లి : మూిసీ రిజర్వాయర్‌కు వరద కొనసాగుతోంది. మూసీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఇన్‌ఫ్లో తగ్గింది. శనివారం 39 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఆదివారం 20,936 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో ఆరు క్రస్ట్‌గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 11,231 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 185 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. బీసీ రిజర్వేషన్లకు సీపీఐ మద్దతు చిట్యాల : స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి సీపీఐ మద్దతిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. చిట్యాలలో ఆదివారం ఆయన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా ప్రాతిపధికను 42 శాతం రిజర్వేషన్ అమలు ప్రక్రియకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా.. కొందరు కోర్టుకు వెళ్లడం తగదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవటంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలకు అనుకూలంగానే ట్రిపుల్ ఆర్ అలాయిమెంట్ మార్చారని ఆరోపించారు. చిట్యాల మండలంలో అక్రమంగా మైనింగ్‌పై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్‌కుమార్, బొడిగె సైదులుగౌడ్, అక్బర్, జిల్లా సత్యం, షరీఫ్, జిల్లా యాదయ్య, మునుకుంట్ల నాగయ్య, బాలరాజు, లింగయ్య పాల్గొన్నారు. నృసింహుడి సన్నిధిలో కోలాహలం యాదగిరిగుట్ట రూరల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, సంప్రదాయ పర్వాలు, భక్తజన సందోహంతో యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలు అర్పించి సహస్రనామార్చనతో కొలిచారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహా హోమం, గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టో త్తర పూజలు గావించారు. సాయంత్రం స్వామి వారికి వెండిజోడు సేవోత్సవం నిర్వహించి భక్తుల మధ్య ఊరేగించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి స్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
అతివలకు ఆరోగ్య భరోసా
స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే వైద్య శిబిరాలను మహిళలు, యువతులు, బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ శిబిరాల్లో ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. రక్త పరీక్ష నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. – పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ, నల్లగొండ నల్లగొండ టౌన్: ఒక కుటుంబం శక్తివంతంగా ఉండాలంటే ఆ ఇంట్లోని మహిళ ఆరోగ్యంగా ఉండాలని అంతా చెబుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో మహిళలు, యువతులు, బాలికలు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ (ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం) అనే కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి పీహెచ్సీలో మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వైద్య శిబిరాలు అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు నిర్వహించనున్నారు. మొత్తం 13 వైద్య బృందాలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఆరోగ్య పరీక్షలు, అవగాహన.. సాధారణంగా మహిళలు ఆరోగ్య సమస్యలపై ఇబ్బందులు పడుతుంటారు. దీంతో ఈ వైద్య శిబిరాల్లో అధిక రక్తపోటు, మధుమేహం, చర్మవ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, దంత, రక్తహీనత, సీ్త్ర వ్యాధి సమస్యలు, క్యాన్సర్, గుండె, కిషోర బాలికలు, కౌమార దశలో వచ్చే సమస్యలపై ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ వైద్య శిబిరాల్లో గైనకాలజి, ఈఎన్టీ, డర్మటాలజి, సైకియాట్రి, జనరల్ పిజిషియన్, దంత సంబంధిత వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందిస్తున్నారు. పౌష్టికాహార ఆవశ్యకతను వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పిల్లలు, గర్భిణులకు వ్యాధి నిరోదక టీకాలు వేస్తున్నారు. క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫ పీహెచ్‌సీల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఫ అక్టోబరు 2వ తేదీ వరకు నిర్వహణ ఫ అన్ని రకాల వైద్య పరీక్షలు.. ఉచితంగా మందులు అందజేత -
పానగల్లు ఆలయాలను అభివృద్ధి చేస్తాం
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకుడు, ప్రొఫెసర్ కుతాడి అర్జునరావు అన్నారు. ఆదివారం ఆయన పానగల్‌లోని ఆలయాలను, మ్యూజియంను సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి పురావస్తు శాఖ రూపొందించిన అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. భక్తులు, పర్యాటకులకు ఆలయాల చరిత్ర తెలిసేలా సైన్‌బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆలయ గోడలపై ఉన్న వైట్‌వాష్‌ను వెంటనే శుభ్రం చేసి, శిల్ప సంపద, చరిత్ర భక్తులు, పర్యాటకులు తెలుసుకునేలా చూడాలని సూచించారు. ఆలయ చరిత్ర వివరించడానికి ఒక టూరిస్ట్ గైడ్‌ను నియమించాలన్నారు. అనంతరం జిల్లా పురావస్తు మ్యూజియం తనిఖీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఉపసంచాలకుడు డాక్టర్ పి.నాగరాజు, ఎన్.నర్సింగ్ నాయక్, డాక్టర్ హమ్మద్ షరీఫ్, డాక్టర్ కిషోర్, పల్రెడ్డి వెంకట్‌రెడ్డి, గుండగోని యాదయ్య, కొడిదల ఎల్లయ్య, గుండగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వాడపల్లి ఎస్ఐని సస్పెండ్ చేయాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం కొత్తపేటతండాకు చెందిన గిరిజనుడు సాయిసిద్ధుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎస్పీని ఆదేశించారు. ఆదివారం ఆయన దామరచర్ల మండలం కొత్తపేటతండాకు వెళ్లి బాధితుడు సాయిసిద్ధును పరామర్శించి మాట్లాడారు. సాయిసిద్ధును అకారణంగా కొట్టడమే కాకుండా వారి కుటుంబంపై తీవ్ర పదజాలంతో దూషించడం, థర్డ్ డిగ్రీని ప్రయోగించడం తగదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎస్ఐ ఈ రకంగా ప్రవర్తిస్తే కంచే చేను మేసిన తీరుగా ఉందన్నారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేందుకు చట్టం ఉందని.. కొట్టాల్సిన అవసరం లేదని, కొట్టే అధికారం ఎవరికీ లేదన్నారు. ఈ విషయమై ఎస్సీ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో ఇప్పటికే మాట్లాడానని.. సీఎంతో కూడా మాట్లాడుతానని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులతో చర్చిస్తానని తెలిపారు. ఆయన వెంట ఎస్సీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాథోడ్ రాంబాబు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ, గిరిజన సంక్షేమ అధికారి ఛత్రునాయక్, డీఎస్పీ రాజశేఖర్‌రాజు, తహసీల్దార్ జవహర్లాల్ తదితరులు ఉన్నారు. ఫ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య -
వేల్స్లో లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం
యాదగిరిగుట్ట రూరల్: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ రాజధాని కార్డిఫ్ నగరంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ కార్డిఫ్ హిందూ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కల్యాణోత్సవంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, అర్చకులు కిరణ్కుమార్చార్యులు, దోర్బాల భాస్కర్‌శర్మ బృందం పాల్గొన్నారు. ఈ కల్యాణోత్సవంలో డాక్టర్ వెలగపూడి బాపూజీరావు, అన్నపూర్ణ శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. -
సినిమా సెట్టింగ్లా దుర్గాదేవి మండపం
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం సినిమా సెట్టింగ్‌ను తలపిస్తోంది. మండపం బయట శివపార్వతులు, నందీశ్వరుడి విగ్రహాలతో పాటు మండపం సెట్టింగ్ పైన పలు దేవతా విగ్రహాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అదేవిధంగా ఈ మండపం వద్ద ఉత్సవ నిర్వాహకులు భక్తులకు లక్కీ డ్రా ఆఫర్లు పెట్టారు. రూ.201 చెల్లించి కూపన్ కొనుగోలు చేసిన భక్తులకు అక్టోబర్ 3న నిర్వహించే బంపర్ డ్రాలో మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, రెండో బహుమతిగా కలర్ టీవీ, మూడో బహుమతిగా కుక్కర్ ఓవన్, నాల్గవ బహుమతిగా 3 గ్రాముల సిల్వల్ కాయిన్ అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలం అభంగాపురం గ్రామానికి చెందిన మోర్తాల రాంనర్సిరెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించారు. రాంనర్సిరెడ్డి చిన్నతనంలోనే అతడి తండ్రి శేఖర్‌రెడ్డి మృతిచెందగా.. పట్టుదలతో చదివి గ్రూప్–2, 3 ఉద్యోగాలు సాధించారు. అంతేకాకుండా హైకోర్టు అసిస్టెంట్ ఫలితాల్లో కూడా మెరిట్ పొంది ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. ఒకేసారి మూడు ఉద్యోగాలు పొందిన రాంనర్సిరెడ్డిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. ఏఎస్ఓగా పంచాయతీ కార్యదర్శి..చివ్వెంల : మండల పరిధిలోని రాజుతండా గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న అంగోతు నరేష్ ఆదివారం ప్రకటించిన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 717 ర్యాంకు సాధించి ఏఎస్ఓగా ఎంపికయ్యాడు. చివ్వెంల మండలం ఐలాపురం గ్రామ ఆవాసం అంగోతు తండాకు చెందిన నరేష్ 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం గ్రూప్–2లో ఉత్తీర్ణత సాధించి ఏఎస్ఓగా ఎంపిక కావడం పట్ల తండావాసులు, సహ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఎస్టీ విభాగంలో రాష్ట్రస్థాయి 16వ ర్యాంకు సాధించినట్లు నరేష్ తెలిపాడు.నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్–2 ఫలితాల్లో శాలిగౌరారం మండలంలోని మా దారం కలాన్ గ్రామానికి చెందిన కె.హరిప్రీత్ రెడ్డి కోపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించాడు. గతంలో ఆయన గ్రూప్–4 ఉద్యోగం సాధించి చిట్యాల మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్–2 రాసిన మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం పట్ల ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఆదివారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగాలు సాధించారు. కొందరు ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా గ్రూప్స్‌కు సన్నద్ధమవుతూ విజయం సాధించగా.. మరికొందరు ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ గ్రూప్–2 ఉద్యోగాలు సాధించారు.జూనియర్ అసిస్టెంట్ నుంచి ఎంపీఓగా..కార్యదర్శి నుంచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా..భూదాన్‌పోచంపల్లి : గ్రూప్–2 ఫలితాలలో భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కంచర్ల రాజశేఖర్‌రెడ్డి సచివాలయం సాధారణ పరిపాలన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి మండలంలోని జలాల్పురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరాడు. రాజశేఖర్‌రెడ్డిది స్వస్థలం చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామం. తండ్రి లారీ డ్రైవర్ కాగా, తల్లి గృహిణి. స్థానికంగా జెడ్పీ హైస్కూల్ ఎస్సెస్సీ, చౌటుప్పల్‌లో ఇంటర్, నేతాజీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. గ్రూప్ –2 ఫలితాలలో అసిస్టెంట్ సెక్షన్ఆఫీసర్గా ఉద్యోగం సాధించడం పట్ల ఎంపీడీఓ భాస్కర్, ఎంపీఓ మాజిద్, సూపరిండెంట్ సత్యనారాయణ, తల్లిదండ్రులు, తోటి పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం మైనవారిగూడెం గ్రామానికి చెందిన మైనం సుధాకర్, నాగమణి దంపతుల కుమారుడు మైనం అశోక్ ఆదివారం వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో మండల పంచాయతీ ఆఫీసర్(ఎంపీఓ)గా ఎంపికయ్యారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అశోక్ గతంలో గ్రూప్–4కు ఎంపికై ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్–3లో కూడా ఉద్యోగం సాఽధించారు. ఇంకా ఉన్నతమైన ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నానని, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని అశోక్ తెలిపారు. ఆయను తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా హరిప్రీత్రెడ్డి -
విశిష్ట వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి
రామన్నపేట: సమాజంలోని విశిష్ట వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ చేపట్టిన సేవా పక్షోత్సవంలో భాగంగా ఆదివారం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను, రాజకీయ రంగంలో దివ్యాంగుల పాత్ర అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించిన డాక్టర్ ఎన్. అశోక్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం, బుద్ధ గ్రంథాలయంను కాసం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని అనేక మంది విశిష్ట వ్యక్తులు, ప్రాంతాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. ఆయన వెంట నాయకులు నకిరేకంటి మొగులయ్య, మడూరి ప్రభాకర్‌రావు, మైల నర్సింహ, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, మండల వెంకన్న, తాటిపాముల శివకృష్ణ, వనం అంజయ్య, బండ మధుకర్‌రెడ్డి, నకిరేకంటి మహేష్, చెరుపల్లి శ్రవన్, మొగిలి రమేష్, గూడెల్లి దామోదర్, గంజి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు -
భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
పెద్దవూర: భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం పెద్దవూర మండలం తుంగతూర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని రామన్నగూడెంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నగూడెం గ్రామానికి చెందిన నక్క రాములు, అతడి సోదరికి మధ్య కొంతకాలంగా భూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రామయ్య సోదరి కుమారులైన రామలింగయ్య, శంకరయ్య రామయ్యతో పాటు అతడి భార్య లక్ష్మిపై దాడి చేశారు. దీంతో వారిద్దరి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వృద్ధ దంపతులను చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పెద్దవూర పోలీసులు పేర్కొన్నారు.గాయపడిన రామయ్య, లక్ష్మి వృద్ధ దంపతులకు గాయాలు -
అభివృద్ధి పథంలో సంఘమిత్ర బ్యాంకు
నల్లగొండ టౌన్: సంఘమిత్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని బ్యాంకు ఫౌండర్ అండ్ చైర్మన్ సంగం రామకృష్ణ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన బ్యాంకు 54వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. 1998లో స్థాపించబడిన సంఘమిత్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారుల సేవే పరమావధిగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతుందన్నారు. 983 మంది వాటాదారులతో రూ.160.35 లక్షల వాటా ధనం కలిగి ఉన్నట్లు తెలిపారు. 3138 మంది ఖాతాదారులతో రూ.90.82 కోట్ల డిపాజిట్లు సేకరించామన్నారు. 4395 మందికి రూ.80 కోట్ల మేర వివిధ రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. మొత్తం వ్యాపారం రూ.170.82 కోట్లకు పైబడి ఉందన్నారు. రూ.1.8 కోట్లతో బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ సన్నిదానం చక్రపాణి, డైరెక్టర్లు పున చండికేశ్వర్, కొంగరి భిక్షం, గుండ్ల అంజిరెడ్డి, బండ భిక్షంరెడ్డి, ఎర్రమల లక్ష్మీనర్సు, చెరుపల్లి పద్మ, వీరవల్లి భవాని, చంద్రశేఖర్, సీఈఓ వడ్డె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
సంతానం కలగడం లేదని వివాహిత ఆత్మహత్య
యాదగిరిగుట్ట రూరల్: సంతానం కలగడం లేదని మనోవేదనకు గురైన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం యాదగిరిగుట్ట సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరుకు చెందిన గుంటెకాపుల అశ్విని (30)కి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన కళ్లెపల్లి రాఘవేందర్‌తో 2015లో వివాహం జరిగింది. వివాహం జరిగి పదేళ్లు అవుతున్నా వారికి సంతానం కలుగలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సంతానం కోసం డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో మనోవేదనకు గురైన అశ్విని గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో వంగపల్లిలోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి అశ్వినిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి గుంటెకాపుల శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపారు. సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్‌కు ఉత్తమ అవార్డు రామగిరి: ఫొటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో నల్లగొండ సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ కంది భజరంగ్ ప్రసాద్‌కు ఉత్తమ ఫొటో జర్నలిస్ట్‌గా అవార్డు లభించింది. ఆదివారం ఏపీలోని గుంటూరు జిల్లా మోదుకూరు వేమన సాహిత్య వికాస భవనంలో ఆంధ్ర లయోలా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సింగారెడ్డి మెల్కియార్, అకాడమీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, విజువల్ కమ్యూనికేషన్ హెచ్ఓడీ గడ్డం రాయప్ప, పురావస్తు పరిశోధకులు డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి చేతులమీదుగా భజరంగ్ ప్రసాద్ అవార్డు అందుకున్నారు. -
చికిత్స పొందుతూ మృతి
మోత్కూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన చేకూరి మల్లేషం భార్య విజయనిర్మల అలియాస్ మమత(48) ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి కారులో ఆరెగూడెం వస్తుండగా.. భువనగిరి మండలం కుమ్మరిగూడెం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన మమతను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
18 గేట్ల ద్వారా ‘పులిచింతల’ నీటి విడుదల
మేళ్లచెరువు : ఎగువన ఉన్న నాగార్జున సాగర్‌తోపాటు మూసీ ప్రాజెక్టులు, టెయిల్‌పాండ్ గేట్లు ఎత్తడంతో చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చిచేరుతుంది. ఆదివారం రాత్రి వరకు 6,00,685 క్యూసెక్కుల వరద రాగా ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో 18 గేట్లను 4 నుంచి 5 మీటర్ల మేర పైకెత్తి అవుట్‌ఫ్లోగా 6,08,541 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్కో 16,600 క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ 4 యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. -
అట్టహాసంగా గృహప్రవేశాలు
కనగల్ : మండల పరిధిలోని తెలకంటిగూడెంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలోకి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. లబ్ధిదారులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామానికి 107 ఇళ్లు మంజూరు కాగా.. 10 ఇళ్ల నిర్మాణం పూర్తికావడంతో గృహ ప్రవేశం చేశారని మంత్రి తెలిపారు. తేలకంటిగూడెం గ్రామానికి వారం, పది రోజుల్లో రేషన్‌దుకాణం ఏర్పాటు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తేలకంటిగూడెం నుంచి ధర్వేశిపురం కలిపే రహదారి వరకు తారు రోడ్డును రూ.25 కోట్లతో మంజూరు చేశామన్నారు. గ్రామంలో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు మంజూరు చేశామని తెలిపారు. అనంతరం ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ సుమలత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, కూసుకుంట్ల రాజిరెడ్డి, గుండెబోయిన భిక్షం, బోగారి రాంబాబు, బిల్లపాటి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
రామగిరి(నల్లగొండ) : ఇళ్లు లేని పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ మండలంలోని అన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన 69 మంది లబ్ధిదారులకు శనివారం ఆయన డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు గుడిసెల్లో నివాసం ఉండొద్దని.. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తున్నామన్నారు. అన్నారెడ్డిగూడెం గ్రామానికి 17 ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పొందిన లబ్ధిదారులు ఆ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్, రంగులు వేసుకోవాలని, దీపావళిలోపు గృహప్రవేశాలు చేయాలని, ఇందుకుగాను ప్రతి ఇంటికి తన వంతుగా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అన్నారెడ్డిగూడెం నుంచి తొరగల్లు వరకు రూ.2 కోట్లతో రోడ్డు వేయనున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ మాట్లాడుతూ రూ.5 లక్షల 4 వేలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పారదర్శకంగా కేటాయించామన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ పీపీ రాజ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆఫీజ్ ఖాన్, తహసీల్దార్ పరశురాం, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
మార్కెట్‌కు దసరా జోష్
గత నెలతో పోల్చితే ఈ నెలలో కార్ల విక్రయాలు బాగా పెరిగాయి. జీఎస్టీ రేట్ల మా ర్పు, దసరా పండుగ రెండూ కలిసి వచ్చాయి. జీఎస్టీ తగ్గించడంతో ఒక కారుపై సుమారు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు రేట్లు తగ్గాయి. – పి.క్రాంతికిరణ్, హుండాయ్ జనరల్ మేనేజర్ రామగిరి(నల్లగొండ), సూర్యాపేట అర్బన్ : దసరా పండుగ వేళ వివిధ వ్యాపార మార్కెట్లలో సందడి నెలకొంది. ముఖ్యంగా జీఎస్టీ స్లాబ్‌లను కుదించి తాజాగా కొత్త సంస్కరణలు తేవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికితోడు పండుగ సందర్భంగా వివిధ షోరూమ్‌లు, షాపింగ్ మాల్స్ భారీ డిస్కౌంట్లతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో కొత్త వస్త్రాలు, వాహనాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు చేసేందుకు వినియోగదారుల ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయా మార్కెట్లలో పండుగ అమ్మకాలు జోరందుకున్నారు. జీఎస్టీలో రెండు స్లాబ్‌లు.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో పేద, మధ్యతరగతి వర్గాలతోపాటు చిరు ఉద్యోగులకు ఊరట లభించింది. ఇప్పటివరకు 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబ్‌లు అమలులో ఉండగా తాజా సంస్కరణలతో 5, 18 శాతం వరకు ఒకటి, 40 శాతం వరకు రెండో స్లాబ్‌గా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో కార్లు, టీవీలు, బైక్‌లు, కుక్కర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడంతో వాటి అమ్మకాలు జోరందుకున్నాయి. ధరల తగ్గుదల ఇలా.. జీఎస్టీ కొత్త స్లాబ్‌లు అమలులోకి రావడంతో వ్యాపారాలు జోరందుకున్నాయి. టీవీలపై గతంలో ఉన్న 28 శాతం జీఎస్టీ నుంచి 18 శాతానికి కుదించడంతో 34 నుంచి 65 ఇంచుల సైజులో ఉన్న టీవీల ధరలు రూ.4వేల నుంచి రూ.6వేల వరకు తగ్గాయి. ఏసీలపై 18 శాతానికి మార్చడంతో టన్నున్నర నుంచి రెండు టన్నుల కెపాసిటీ ఏసీలపై రూ.5వేల నుంచి రూ.9వేల వరకు ధరలు దిగి వచ్చాయి. 12 శాతం ఉన్న ప్రెషర్ కుక్కర్ జీఎస్టీ 5శాతానికి మారడంతో రూ.200 నుంచి రూ.400 వరకు ధరలు తగ్గాయి. ద్విచక్ర వాహనాలపై ఇప్పటి వరకు 28 శాతం జీఎస్టీ ఉండగా ప్రస్తుతం 18 శాతం స్లాబ్‌కు మార్చడంతో 125 సీసీ నుంచి 155 సీసీ వరకు రూ.9వేల నుంచి రూ.17వేల వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో బైక్‌ల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. ఇక జీఎస్టీ మార్పుతో చిన్న కార్ల రేట్లు తగ్గించగా, భారీ కార్లు, లగ్జరీ వాహనాలపై పెంచింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. దీంతో చిన్న కార్ల ధరలు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు తగ్గాయి. ఎలక్ట్రికల్ వాహనాలకు 5 శాతం పాత జీఎస్టీనే కొనసాగుతోంది. రేట్లు తగ్గడంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఈసారి వాహనాల కొనుగోలు పెరిగిందని షోరూమ్ యజమానులు చెబుతున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్లు.. దసరా పండుగ వేళ వివిధ షాపింగ్ మాల్స్, ఆన్లైన్ స్టోర్స్ అన్నీ స్పెషల్ క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించాయి. ఫ్యామిలీ షాపింగ్, పండుగ డెకరేషన్ కోసం కొత్త ఐటెమ్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. మొబైల్స్‌ను ఆన్లైన్లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పండుగ షాపింగ్‌తో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోతున్నాయి. కాస్త ఉపశమనమే.. జీఎస్టీ సంస్కరణలతో కుక్కర్లు, టీవీల ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు సైతం వాటిని సులభంగా కొనుగోలు చేయగలిగే అవకాశం లభించింది. ఈ మార్పు చిరు ఉద్యోగులు, కూలీలు, స్వయం ఉపాధి చేసుకునే వర్గాలకు ఉపశమనమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలాలపై మాత్రం 40 శాతం పన్ను కొనసాగింపుపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.ఫ జీఎస్టీ స్లాబ్‌ల కుదింపుతో కాస్త తగ్గిన ధరలు ఫ ఊపందుకున్న వ్యాపారాలు ఫ పండుగ ఆఫర్లతో పెరిగిన వాహన కొనుగోళ్లు ఫ తగ్గిన ధరలతో చిరు ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు ఊరట -
నేడు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు
మిర్యాలగూడ : మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ప్రతి రెండేండ్లకోసారి సెప్టెంబర్ చివరి ఆదివారం పాలకవర్గానికి ఎన్నిక నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. 2025–27 నూతన కార్యవర్గ ఎన్నికల్లో 90 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి –1, 2, కోశాధికారి పదవులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 10గంటలకు మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఎన్నికల అధికారిగా కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ పందిరి రవీందర్ వ్యవహరించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల నామినేషన్ల ప్రక్రియ, మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 3గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. ఏ స్థానానికి ఎవరెవరు పోటీ చేస్తారో అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మహిళలంతా సంఘాల్లో చేరాలినకిరేకల్ : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నందురు వారంతా స్వయం సహాయక సంఘాల్లో చేరాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్‌రెడ్డి సూచించారు. నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలోని నర్సరీని శనివారం ఆయన సందర్శించారు. నర్సరీ నిర్వహణ బాగుండడంతో ఫీల్డ్ అసిస్టెంట్ రమాదేవి, వన సేవక్ రాజేష్‌ను సన్మానించారు. ఆయన వెంట ఏపీడీ లక్ష్మీ నర్సింహ, ఏపీఓ రమణయ్య, టీఏలు స్వాతి, రమణ, యాదగిరి, రాధా, కృష్ణ ఉన్నారు. మదర్ డెయిరీ డైరెక్టర్‌గా మూడోసారి.. చిట్యాల : మదర్ డెయిరీ డైరెక్టర్‌గా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన కర్నాటి జయశ్రీ మూడోసారి విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్‌లోని మదర్ డెయిరీ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో మహిళ కోటా స్థానానికి ఆమె డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సొసైటీ అధ్యక్షులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారుకనగల్ : మండలంలోని ధర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారిని లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి అర్చకులు పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, సిబ్బంది చంద్రయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్‌రెడ్డి, అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమారాచార్యులు పాల్గొన్నారు. -
రైతుల భూములు లాక్కోవద్దు
నల్లగొండ టౌన్ : రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని కోల్పోతే పరిహారం ఏం ఇస్తారో ఇప్పటికీ చెప్పడం లేదన్నారు. అందుకే భూమిని ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని చెప్పారు. రైతుల ఆమోదం లేకుండా భూమిని తీసుకోవడం సరి కాదన్నారు. రైతులకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నారి ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ, దండెంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, కొండ అనురాధ, రైతులు పాల్గొన్నారు. -
మూసీ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు పోతున్న వరదనీరు భీమారం వద్ద వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద కేతేపల్లి : నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుకు శనివారం వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మది క్రస్ట్‌గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్, జనగాం, ఆలేరు, వరంగల్ తదిరత ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బిక్కేరు, వసంతవాగు, మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుయి. ఆయా వాగుల ద్వారా శనివారం సాయంత్రం వరకు మూసీ రిజర్వాయర్‌లోకి 41,324 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో 643.70 అడుగుల వద్ద నీరు ఉంది. మూసీకి ఇన్‌ఫ్లో భారీగా వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు ఎనిమిది క్రస్ట్ గేట్లను ఎనిమిది అడుగులు, ఒక గేటును ఆరు అడుగులు (మొత్తం 9గేట్లు) పైకెత్తి 44,547 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భీమారం వద్ద నిలిచిన రాకపోకలు.. మూసీ ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తడంతో కేతేపల్లి మండలం భీమారం–సూర్యాపేట మధ్య భీమారం శివారులో మూసీవాగుపై నిర్మించిన లోలెవల్ వంతెన వరదనీటిలో మునిగిపోయింది. వంతెన మీదుగా నాలుగు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో మిర్యాలగూడ నుండిచి వయా భీమారం మీదుగా సూర్యాపేటకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సూర్యాపేట – మిర్యాలగూడ పట్టణాల మధ్య నడిచే ఆర్టీసీ బస్సులను అధికారులు వయా ఉప్పలపహాడ్, కొప్పోలు గ్రామాల మీదుగా దారి మళ్లించారు. వంతెనపైకి వాహనాలు వెళ్లకుండా కేతేపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు పికెట్ ఏర్పాటు చేశారు. వంతెనపై వరద ప్రవాహాన్ని తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ సతీష్ పరిశీలించారు.ఫ ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తివేత -
తొలిరోజు ఒక్క టెండర్
నల్లగొండ : మద్యం దుకాణాలకు టెండర్‌దాఖలు ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు శుక్రవారం ఒక టెండర్ దాఖలయ్యింది. మిర్యాలగూడ పట్టణ పరిధిలోని 45వ షాపునకు ఒక టెండర్ వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా ఎస్సీలకు 14, ఎస్టీలకు 4, గౌడ సామాజిక వర్గానికి 34 షాపులను కేటాయించారని.. వాటికి ఆయా కులస్తులు కుల ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. నల్లగొండకు నేడు మంత్రి కోమటిరెడ్డి రాక నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 9గంటలకు మంత్రి క్యాంపు కార్యాలయం(ఇందిరా భవన్)లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. 11గంటలకు ఏటీసీ సెంటర్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు నల్లగొండలోని అశోక గార్డెన్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను అందిస్తారు. 1.30 గంటలకు కనగల్ మండలం తేలకంటిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. అవార్డు అభినందనీయంనల్లగొండ : జల సంచయ్ జల్ బాగిదారి (జేఎస్జేబీ) జాతీయ అవార్డుల్లో దక్షిణ భారత జోన్లో టాప్ 3 స్థానాలు తెలంగాణ రాష్ట్రం కై వసం చేసుకోవడం, నల్లగొండ జిల్లాకు అవార్డు రావడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాకు విజయం అందించిన అధికారులు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఏఎమ్మార్పీ డీఈగా మహేష్కుమార్నల్లగొండ : ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) డివిజన్–6 డివిజనల్ ఇంజనీర్‌గా మహేష్‌కుమార్ శుక్రవారం నల్లగొండలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు. -
జోరు వాన.. పారిన వరద
ఫ పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు ఫ తిరుమలగిరిలో అత్యధికంగా 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదునల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు, పొంగిపొర్లడంతో పాటు పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరి, పత్తి చేలల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పంట పొలాలకు, పత్తి చేలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 52.3 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా తిరుమలగిరిసాగర్‌లో 12.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వర్షపాతం ఇలా.. త్రిపురారం మండలంలో 97.1మిల్లీమీటర్లు, పెద్దవూర 86.4, అడవిదేవులపల్లి 83.2, మిర్యాలగూడ 79.9, అనుముల హాలియా 79.8, చిట్యాల 26.8, నార్కట్‌పల్లి 27.3, కట్టంగూర్ 34.7, శాలిగౌరారం 20.2, నకిరేకల్ 35.1, కేతేపల్లి 23.4, తిప్పర్తి 53.3, నల్లగొండ 45.3, కనగల్ 58.0, మునుగోడు 43.7, చండూరు 53.0, మర్రిగూడ 38.3, చింతపల్లి 24.0, నాంపల్లి 36.4, గుర్రంపోడు 59.2, నిడమనూరు 55.4, మాడ్గులపల్లి 61.5, వేములపల్లి 74.5, దామరచర్ల 52.1, పీఏపల్లి 57.3, నేరడుగొమ్ము 39.3, కొండమల్లేపల్లి 59.9, దేవరకొండ, 30.6, గుండ్లపల్లి 34.6, చందంపేట 39.5, గట్టుప్పల్ 26.5, గుడిపల్లి 63.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పొంగిన వాగులు పెద్దవూర: మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మండలం నుంచి ప్రవహించే పెద్దవాగు పొంగి పొర్లింది. పెద్దవూర, పోతునూరు, సంగారం, నాయినివానికుంట, చింతపల్లి, శిర్సనగండ్ల, వెల్మగూడెం తదితర గ్రామాలలోని చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. పలు కల్వర్టు పైనుంచి వరద పొంగిపొర్లడంతో వాహనదారులకు ఇబ్బంది పడ్డారు.తిరుమలగిరి సాగర్ : వరి చేల మీదుగా ప్రవహిస్తున్న వరద పెద్దవూర : అలుగు పోస్తున్న పెద్దవూర చెరువు మూసీ తొమ్మిది గేట్లు ఎత్తివేత కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు హైదరాబాద్ నుంచి భారీగా వరద వచ్చే అవకాశాలు ఉండటంతో శుక్రవారం రాత్రి అధికారులు ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తారు. హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో అక్కడి అధికారులు ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి వదిలారు. వరద ఉధృతి భారీగా పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన మూసీ అధికారులు ఏడు క్రస్ట్‌గేట్లను 2 అడుగులు, 2 క్రస్టు గేట్లను 3 అడుగులు(మొత్తం 9గేట్లు) పైకెత్తి 13వేల క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 313 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా 644 మేర అడుగుల మేర నీరు ఉందని అధికారులు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి: మూసీ గేట్లు ఎత్తి భారీగా వరద నీటిని వదులుతున్న నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని మూసీ తీర ప్రాంతం వెంట ఉన్న 41 గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ సూర్యాపేట డివిజన్–1 ఈఈ వెంకటరమణ సూచించారు. మూసీ వాగు వెంట మోటార్లు అమర్చుకుని వ్యవసాయం చేసుకునే వారు వాటిని తొలగించి ఎగువ ప్రాంతాలకు తరలించుకోవాలన్నారు. గొర్రెల, పశువుల కాపర్లు, రైతులు, జాలర్లు మూసీ వాగులోకి వెళ్లవద్దని సూచించారు. -
కాంగ్రెస్‌లో మదర్ డెయిరీ మంటలు!
సాక్షి, యాదాద్రి: నల్లగొండ– రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమాఖ్య లిమిటెడ్ (నార్ముల్ మదర్ డెయిరీ) పాలకవర్గ ఎన్నికలు కాంగ్రెస్‌లో చిచ్చు రగిల్చాయి. మూడు డైరెక్టర్ల స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్నేహపూర్వక పొత్తు కుదర్చుకోవడంతో అధికార పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మూడు చోట్ల గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్తో పొత్తు ఎందుకని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ విరుచుకుపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకున్ని మీరు ఏ విధంగా గెలిపిస్తారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బీర్ల అయిలయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఎమ్మెల్యే సామేల్‌కు ఫోన్ చేసి విషయంపై వాకబు చేశారు. అయితే పోటీలో ఉన్న మోతె పూలమ్మ, పిచ్చిరెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీస్ చర్చనీయాంశంగా మారింది. పిచ్చిరెడ్డి సైతం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు. 308 మంది పాల చైర్మన్లు మూడు డైరెక్టర్ స్థానాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 308 మంది పాలసొసైటీ చైర్మన్లు ఓటింగ్‌లో పాల్గొంటారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ చైర్మన్లను శుక్రవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ సమీపంలోకి క్యాంపులకు తరలించారు. శనివారం ఉదయం క్యాంప్‌ల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ అనంతరం మధ్యాహ్నం ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఒక మహిళ, రెండు జనరల్ స్థానాలకు ఐదుగురు పోటీ పడుతున్నారు. వీరిలో మహిళ, ఒక జనరల్ డైరెక్టర్ స్థానాలకు కాంగ్రెస్, ఒక డైరెక్టర్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ గెలిచేలా ఇరు పార్టీల నాయకులు ఒప్పందం చేసుకున్నారు. పోటీలో ఉన్నదీ వీరే.. కర్నాటి జయశ్రీ, గంట్ల రాధిక, మోతె పూలమ్మ, సూధగాని విజయ, కుంచాల ప్రవీణ్‌రెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, శీలం వెంకటనర్సింహారెడ్డి, సందిల భాస్కర్ గౌడ్. మూడు డైరెక్టర్ల స్థానాలకు నేడు ఎన్నికలు ఫ స్నేహపూర్వక పొత్తు కుదర్చుకున్న అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం ఫ కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒకటి ఫ పొత్తుపై తుంగతుర్తి ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి పాడి రైతుల భవిష్యత్ కోసమే బీఆర్ఎస్తో పొత్తుకు దిగినట్లు చైర్మన్ గుడిపాటి చెబుతున్నారు. నార్మాక్స్‌ను ఎన్డీడీబీకి అప్పగించేందుకు బీఆర్ఎస్ సహకరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఈనెల జరిగే జనరల్ బాడీ సమావేశంలో ఎన్డీడీబీకీ అప్పగిస్తూ పాలక వర్గం తీర్మానం చేసి ఇవ్వాల్సి ఉంది. పాలకవర్గంలో బీఆర్ఎస్ డైరక్టర్లు ఉన్నారు. అయితే తమకు ఒక స్థానం ఇస్తే తీర్మానంలో సహకరిస్తామని ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎస్కు ఒక స్థానం కేటాయించినట్లు చైర్మన్ సాక్షితో చెప్పారు. -
ప్రభుత్వానికి ధన్యవాదాలు
బీసీలు రిజర్వేషన్ల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వం కామారెడ్డి ప్రకటనకు కట్టుబడి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీఓ తేవడం హర్షించదగ్గ విషయం. ఆ జీఓ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. ఎవరూ కోర్టుకు వెళ్లకముందే షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలి. విద్యా, ఉద్యోగుల్లో కూడా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి. – చక్రహరి రామరాజు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు -
తెలంగాణ వీరవనిత.. చాకలి ఐలమ్మ
నల్లగొండ : తెలంగాణలో తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని సాగర్ రోడ్డులో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, చొల్లేటి ప్రభాకర్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ పీడీ, బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి రాజ్‌కుమార్, బీసీ సంఘాల నాయకులు కొండూరు సత్యనారాయణ, రామరాజు పాల్గొన్నారు. -
ఎన్నికలను సవ్యంగా నిర్వహించాలి
నల్లగొండ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సవ్యంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలపై శుక్రవారం ఉదయాదిత్య భవన్లో స్టేజ్ 1, స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో సొంత నిర్ణయాలను తీసుకోవద్దని, తప్పులు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రతి ఉద్యోగి ఎన్నికల సంఘం జారీచేసిన హ్యాండ్‌బుక్‌ను, నియమ, నిబంధనలను పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు. ఎన్నికల విధులకు నియమించే ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, టీఏ, డీఏ చెల్లిస్తామన్నారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, గృహ నిర్మాణ పీడీ రాజ్‌కుమార్, డాక్టర్ రమేష్, మాస్టర్ ట్రైనర్ బాలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
బంగారు ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 586.70 అడుగులు ఇన్‌ఫ్లో : 2,93,744క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 2,73,169 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 33,130 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : 9,019 క్యూసెక్కులు ఎడమకాల్వ ద్వారా : నిల్ ఏఎమ్మార్పీకి : 2,400 క్యూసెక్కులు వరద కాల్వకు : 300 క్యూసెక్కులు- 10లో -
నేలవాలుతున్న వరిచేలు
ఫ అధిక వర్షంతో వాలిపోతున్న పొలాలు ఫ నాన్ఆయకట్టులో కోత దశకు వచ్చిన చేలు ఫ పొలంలోనే వర్షం నీటిలో తడుస్తున్న గింజలు ఫ గింజలు మొలకెత్తే ప్రమాదముందని రైతుల్లో ఆందోళన నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో ఇటీవల కురుస్తున్న అధిక వర్షాల కారణంగా వేలాది ఎకరాలలో వరిచేలు నేలవాలుతున్నాయి. జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 5,05160 ఎకరాల్లో వరిసాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. నాన్‌ఆయకట్టు ప్రాంతాలైన దేవరకొండ, నల్లగొండ, చండూరు, మునుగోడు వ్యవసాయ డివిజన్లలో జూన్, జూలై మాసాల్లో వరినాట్లు వేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే వరిచేలు గింజలు ఎర్రబారి కోత దశకు వచ్చాయి. ఈ తరుణంలో పదిహేను రోజులుగా వరుసగా వర్షాలు కురవడంతో వేలాది ఎకరాల్లో వరిచేలు పూర్తిగా అడ్డంపడి నేలవావాలినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరికోత మిషన్లు వెళ్లేందుకు వీలుకాక.. చేలు నేలవారి వర్షం నీటిలో తడుస్తుండడంతో వరి గింజలు మొలకెత్తే ప్రమాదం పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. వరికోతలు కోయాలంటే నీరు నిలిచి ఉండడంతో పొలాల్లోకి మిషన్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. నేలవాలిన వరిని కోయాలంటే చైన్ మిషన్ ద్వారా కోయించాల్సి ఉంటుంది. చైన్ మిషన్‌తో కోయించాలంటే గంటకు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందని దీంతో తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రబారిన వరిచేను వర్షాల కారణంగా పూర్తిగా అడ్డంపడిపోయింది. పొలంలో నీరు నిలిచిన కారణంగా వరిగింజలు మొలకెత్తుతాయని భయంగా ఉంది. కోయాలన్నా మిషన్ పొలంలోకి వెళ్లే పరిస్థితి లేదు. – జానపాటి రాజేంద్రప్రసాద్, రైతు గుండ్లపల్లి, నల్లగొండ మండలం -
ఓటు చోర్‌పై నేటి నుంచి సంతకాల సేకరణ
నల్లగొండ: బీజేపీ ఓటు చోర్‌పై జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి కాంగ్రెస్ ఆధ్యర్యంలో సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. గురువారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు చోర్‌పై ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ మాత్రం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ అక్కడ ఓటు చోర్కి పాల్పడుతుందని పేర్కొన్నారు. బీజేపీ ఓటు చోర్‌పై అన్ని గ్రామాలు, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో సంతకాలు, అభిప్రాయ సేకరణ చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
సన్న బియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు
నల్లగొండ: రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంచులను అందుబాటులోకి తీసుకొచ్చింది. నల్లగొండ జిల్లాకు 4.65 లక్షల సంచులు కేటటాయించి మండల స్థాయి గోదాములకు పంపించింది. ఈ సంచులను జిల్లాలోని రేషన్ కార్డుదారులకు అక్టోబర్ 1 నుంచి రేషన్ తోపాటు అందజేయనున్నారు. రేషన్ కార్డుపై అందరికీ సన్న బియ్యం–ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం అనే నినాదంతో ఈ సంచులను ప్రభుత్వం తయారు చేయించింది.సీసీ కెమెరాలతోనే భద్రతగుర్రంపోడు : సీసీ కెమెరాలతోనే ప్రజలకు భద్రత పక్కాగా ఉంటుందని, ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో దాతలు, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాల వల్ల అవాఛంనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. అంతకుముందు ఎస్పీ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఎస్పీ వెంట దేవరకొండ ఏఎస్పీ పి.మౌనిక, సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ పసుపులేటి మధు తదితరులు ఉన్నారు.30 వరకు చేయూత పింఛన్ల పంపిణీనల్లగొండ: జిల్లాలో చేయూత పింఛన్ల పంపిణీ గురువారం ప్రారంభమైందని, ఈ నెల 30 తేదీ వరకు లబ్ధిదారులకు అందజేస్తామని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు వారి పరిధిలోని పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రూ.16 చిల్లరతో సహా పింఛన్ మొత్తం అడిగి తీసుకోవాలని కోరారు.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామకృష్ణనల్లగొండ టౌన్ : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నల్లగొండ పట్టణానికి చెందిన మేడే రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి, అధ్యక్షుడు యానం విజయ్‌కుమార్‌తోపాటు రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
యూరియా కష్టాలు తీర్చాలని రాస్తారోకో
అడవిదేవులపల్లి : యూరియా కష్టాలు తొలగించాలని కోరుతూ గురువారం అడవిదేవులపల్లిలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు స్థానిక మిర్యాలగూడ ప్రధాన రోడ్డుపై చెట్టు కొమ్మలు అడ్డంగా వేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొన్ని రోజులుగా యూరియా కోసం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్దకు వస్తున్నా అందరికీ దొరకడం లేదని వాపోయారు. ఇప్పటికై నా మండల రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. టోకెన్ల కోసం తెల్లవారుజామునుంచే బారులు త్రిపురారం : రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. వరిపైరుకు యూరియా వేసే అదును దాటిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం త్రిపురారం పీఏసీఎస్‌కు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు టోకెన్ల కోసం స్థానిక రైతు వేదిక వద్ద ఉదయం 4 గంటల నుంచే క్యూకట్టారు. రైతులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు సమక్షంలో టోకెన్లు పంపిణీ చేశారు. అనంతరం యూరియా పంపిణీ చేయగా అందని చాలా మంది రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. త్రిపురారం : రైతు వేదిక వద్ద టోకెన్ల కోసం బారులుదీరిన రైతులు అడవిదేవులపల్లి : రాస్తారోకో చేస్తున్న రైతులు -
ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా పట్టించుకోరా..
ఫ మెడికల్ కళాశాల ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన ఫ నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని వేడుకోలు నల్లగొండ టౌన్ : ఏజెన్సీ నిర్వాహకులు తమకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని నల్లగొండ మెడికల్ కళాశాలలో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి విధులను బహిష్కరించి మెడికల్ కళాశాల ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేస్తున్నారు. వీరు చేపట్టిన ధర్నా గురువారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు నారబోయిన ప్రశాంత్, రాజు మాట్లాడుతూ అతి తక్కువ వేతనాలలో తాము విధులు నిర్వహిస్తున్నామని, అయినా నెలనెలా వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. జీతా లే కాకుండా ఆరు నెలలుగా ఏజెన్సీ నిర్వాహకులు తమకు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు చేయడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి దసరాకు తమ నాలుగు నెలల వేతనాలను ఇప్పించాలని వేడుకుంటున్నారు. కార్యక్రమంలో మఽధుమురళి, అండాలు, చంద్రమ్మ, మంగమ్మ పాల్గొన్నారు. -
జల సంరక్షణలో జాతీయ అవార్డు
నల్లగొండ : జల సంరక్షణ– ప్రజల భాగస్వామ్యం (జల్ సంచయ్ ఔర్ జన్ భాగీదారీ) పథకాన్ని పక్కాగా అమలు పర్చినందుకు నల్లగొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించింది. మన జిల్లాతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు జాతీయ అవార్డు దక్కింది. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పోటీపడిన జిల్లాల్లో తొలి మూడు స్థానాలను తెలంగాణ జిల్లాలే దక్కించుకోగా ఇందులో నల్లగొండ ఉండడం విశేషం. ఈ పురస్కారం కింద రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం లభించనుంది. నీటి సంరక్షణ కోసం జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో కేంద్రం నిధులతో చెక్ డ్యాములు, పాంపాండ్స్, ఇంకుడు గుంతలు, ఫిష్ పాండ్స్, గుట్టలపై కందకాలు, పార్కులేషన్ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టినందుకు ఈ అవార్డు దక్కింది. జాతీయ అవార్డు సాధించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆయా జిల్లాల అధికారులు, ప్రజలను అభినందించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాకు ఇలాంటి అవార్డు రావడం మొదటిసారి అని, ఈ ఘనత ఉపాధి హామీ సిబ్బందికే దక్కుతుందని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
మద్యం టెండర్లకు నోటిఫికేషన్
నల్లగొండ: రెండేళ్ల పాటు కొత్త మద్యం దుకాణాల కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో జిల్లా కలెక్టర్ మద్యం షాపులను కేటాయించనున్నారు. జిల్లాలో 154 మద్యం దుకాణాలు ఉండగా నూతన మద్యం పాలసీ ప్రకారం రిజర్వేషన్ పద్ధతిన ఎస్సీలకు 14, ఎస్టీలకు 4, గౌడలకు 34 షాపులను కేటాయించారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు సమక్షంలో గురువారం కలెక్టరేట్లో డ్రా తీశారు. ఎవరికి ఏయే షాపులు అనేది శుక్రవారం ప్రకటించనున్నారు. నేటి నుంచి దరఖాస్తులు నూతన మద్యం దుకాణాలకు ఈనెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను జిల్లా కలెక్టర్ కేటాయించనున్నారు. రెండేళ్ల పాటు దుకాణాలకు లైసెన్స్ కొత్త మద్యం దుకాణాలకు రెండేళ్ల పాటు లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వారంతా డిసెంబర్ 1 నుంచి వాటిని తెరవాల్సి ఉంటుంది. అప్పటి నుంచి 2027 నవంబర్ 30వ తేదీ వరకు లైసెన్స్ కాల పరిమితి గడువు ఉండనుంది. ఈ సారి పెరిగిన టెండర్ ఫీజు టెండర్లో పాల్గొనేవారు రూ.3 లక్షలు టెండర్ దరఖాస్తు కింద చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు రుసుమును ప్రభుత్వం రూ.3 లక్షలకు పెంచింది. ఎన్ని దుకాణాలకు టెండర్లు వేస్తే ఒక్కోదానికి రూ.3 లక్షల చొప్పున డీడీ చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ మూడు చోట్ల ఉండనుంది. నల్లగొండలోని రామగిరిలో గల ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో, హైదరాబాద్ నాంపల్లిలోని ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫ రెండేళ్ల కాల పరిమితికి విడుదల చేసిన ప్రభుత్వం ఫ నేటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఫ అక్టోబర్ 23 డ్రా పద్ధతిన దుకాణాల కేటాయింపు ఫ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకటించిన కలెక్టర్ ఫ ఈ సారి టెండర్ ఫీజు రూ.3లక్షలు ఫ డిసెంబర్ 1న ప్రారంభించనున్న కొత్త వైన్స్ కొత్త మద్యం దుకాణాల కోసం ఒక్కొక్కరు ఎన్నింటికై నా టెండర్లు వేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. డ్రాలో ఒక్కరికే ఎన్ని దుకాణాలు వెళ్లినా కేటాయించబడతాయి. నల్లగొండలో 2 చోట్ల, హైదరాబాద్‌లో నాంపల్లి కమిషనర్ కార్యాలయంలో టెండర్ల స్వీకరణ ఉంటుంది. హైదరాబాద్‌లో ఉండేవారు అక్కడే టెండర్ దాఖలు చేయవచ్చు. –బి.సంతోష్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
భూభారతి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
నల్లగొండ: రెవెన్యూ సదస్సులు, భూభారతిలో వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అక్టోబర్ 4న రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం అసైన్డ్, వక్ఫ్, ఎండోమెంట్స్ భూములు తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్టీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
జెడ్పీ చైర్మన్ పీఠం ఎస్సీ రిజర్వ్?
నల్లగొండ : నల్లగొండ జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ అయినట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలోనే ఖరారు చేశారు. రొటేషన్ పద్ధతిలో ఈసారి నల్లగొండ స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేసినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశానుసారం జెడ్పీటీసీ, ఎంపీపీతో పాటు ఎంపీటీసీల రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. అదే విధంగా పంచాయతీ, వార్డుల వారీ రిజర్వేషన్ల జాబితాను కూడా సిద్ధం చేసింది. ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్ జాబితాను జెడ్పీ అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. ఎంపీటీసీల రిజర్వేషన్ల జాబితాను బుధవారం ఆర్డీఓలు సీల్డ్ కవర్లో కలెక్టర్‌కు సమర్పించారు. ఆయా జాబితాను ఆమోదం నిమిత్తం కలెక్టర్ ప్రభుత్వానికి పంపనున్నారు. పెరిగిన బీసీ స్థానాలు మంగళవారం జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ప్రక్రియను జిల్లా అధికారులు పూర్తి చేయగా.. బుధవారం ఎంపీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 33 చొప్పున ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలుండగా అందులో ఎస్సీ, ఎస్టీలకు పాత పద్ధతిలోనే (ఎస్సీలకు 6, ఎస్టీలకు 5) రిజర్వేషన్ చేశారు. బీసీలకు మాత్రం గతంలో 4 స్థానాలు ఉండగా.. ఈసారి 42 శాతం రిజర్వేషన్ ప్రకారం అవి 14 స్థానాలకు పెరగనున్నాయి. దీంతో బీసీలకు అదనంగా 10 జెడ్పీటీసీ, 10 ఎంపీపీ స్థానాలు దక్కనున్నాయి. 16 చొప్పున ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు వారికి దక్కుతాయి. మిగిలిన సీట్లు అన్ రిజర్వుడు కేటగిరిగా పరిగణిస్తారు. బీసీలకు 148 ఎంపీటీసీలు రిజర్వ్ బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు అవుతుండటంతో ఎంపీటీసీ స్థానాలు కూడా బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వ్ అయ్యాయి. గత 2019 ఎన్నికల్లో 349 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో ఎస్టీలకు 52, ఎస్సీలకు 61, బీసీలకు 50 సీట్లు కేటాయించి 186 సీట్లు అన్ రిజర్వుడుగా ప్రకటించారు. ఇప్పుడు 4 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దాంతో ఎంపీటీసీల సంఖ్య 353కు చేరింది. ఈసారి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథావిదిగానే ఉంటాయి. బీసీలకు మాత్రం 148 స్థానాలు దక్కనున్నాయి. అంటే గతంలో కంటే 98 సీట్లు బీసీలకు అధికంగా రిజర్వ్ కానున్నాయి. అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. అయితే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అంతా జిల్లా స్థాయిలో ఖరాారు చేసి.. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. జీఓ విడుదలయ్యే వరకు ఈ వివరాలను గోప్యంగా ఉంచనున్నారు. ఫ ఖరారైన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఫ కలెక్టర్ వద్దకు చేరిన జాబితాలు ఫ ప్రభుత్వం నుంచి జీఓ వచ్చాక ప్రకటించే అవకాశం ఫ రాష్ట్రస్థాయిలోనే జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ -
నర్సరీ పరిశీలన
నాంపల్లి : మండలంలోని తుంగపాడ్ గ్రామంలో నర్సరీని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. మొక్కలు మంచిగా ఉండడంతో నిర్వాహకులను అభినందించారు. గ్రామంలో రైతు మల్లయ్య మునగ తోటను పరిశీలించారు. సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో మార్కెటింగ్ సౌకర్యం ఉన్నందున రైతులు మునగ తోటలు ఎక్కువగా వేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ ఝాన్సీ, ఏపీఓ గుంటుక వెంకటేశం, ఏపీఎం శోభారాణి, లింగయ్య, భాస్కర్, నాగయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల భద్రతకు చట్టం తేవాలినకిరేకల్ : న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి కోరారు. నకిరేకల్‌లో న్యాయవాది కొండ యాదగిరి కార్యాలయంలో బుధవారం జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులపై వరుస దాడులు జరుగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇలాంటి దాడులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ యాదగిరి, సీనియర్ న్యాయవాదులు యాదాసు యాదయ్య, బచ్చుపల్లి ప్రకాష్‌రావు, ఎండీ హఫీజ్, మంగ సైదులు, నూక మల్లేష్, రాజు, గఫార్ తదితరులు పాల్గొన్నారు. -
బధిర విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మిర్యాలగూడ : బధిర విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 126 మంది బధిర విద్యార్థులకు ప్రభుత్వం దివ్యాంగుల శాఖ ద్వారా మంజూరు చేసిన రూ.10లక్షల విలువైన స్మార్ట్ఫోన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌లో రాణించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, వెంకట్‌రెడ్డి, బాలయ్య, ప్రిన్సిపాల్ రేపాల శ్రీనివాస్, రామకృష్ణ, స్వామి, మధుకర్, బంటు వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ -
గులాబీ, హస్తం.. దోస్తీ!
సాక్షి, యాదాద్రి: మదర్ డెయిరీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది.రాష్ట్రంలో కత్తులు దూసుకుంటున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం ఇక్కడ ఒక్కటయ్యాయి. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న మూడు డైరెక్టర్ల స్థానాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, ఒక చోట బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకునేలా ఇరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. బద్ద శత్రువులుగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం చర్చనీయాంశంగా మారింది. బరిలో తొమ్మిది మంది ఖాళీ అయిన డైరెక్టర్ల స్థానాల్లో మరోసారి తుంగతుర్తి నియోజకవర్గానికి రెండు, నకిరేకల్‌కు ఒకటి దక్కింది. ఈసారి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు అవకాశం లభించలేదు. మూడు డైరెక్టర్ల స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు ముగ్గురు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు మరో ఆరుగురు మొత్తం తొమ్మిది మంది బరిలో ఉన్నారు. ఆరుగురు అభ్యర్థులను బుజ్జగించి పనిలో రెండు పార్టీలు ప్రయత్నిస్తుండగా తాము తప్పుకునేది లేదని వారు పట్టుబడుతున్నారు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే నకిరేకల్ నియోజకవర్గానికి దక్కిన మహిళా డైరెక్టర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు నలుగురు పోటీ పడుతున్నారు. గంట్ల రాధిక, కర్నాటి జయశ్రీ, మోతె పూలమ్మ, సూధగాని విజయ నామినేషన్దాఖలు చేశారు. వారికి ఎన్నికల అధికారులు గుర్తులు కూడా కేటాయించారు. వీరిలో భువనగిరి ఎంపీ, నకిరేకల్ ఎమ్మెల్యేలు వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. గుంట్ల రాధికకు ఎంపీ చామలకిరణ్‌కుమార్‌రెడ్డి మద్దతు ఇస్తుండగా, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కర్నాటి జయశ్రీకి డైరెక్టర్ కోసం పట్టుబడుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థుల్లో ఎవరికి పార్టీ మద్దతు లభిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. రెండు స్థానాలకు ఐదుగురు పోటీ తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని రెండు జనరల్ డైరెక్టర్ స్థానాలకు ఐదుగురు పోటీ పడుతున్నారు. వీరిలో మంచాల ప్రవీణ్‌రెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి, ఽశీలం వెంకట నర్సింహారెడ్డి, సందిల భాస్కర్‌గౌడ్ పోటీలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ తరఫున మంచాల ప్రవీణ్‌రెడ్డికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం మేరకు బీఆర్ఎస్కు ఒక డైరెక్టర్ స్థానాన్ని కాంగ్రెస్ ఒదులుకుంది. మోత్కూరుకు చెందిన రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి పేరును బీఆర్ఎస్ సూచించింది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ జోక్యంతో లక్ష్మీనరసింహారెడ్డి పేరు ఖాయం చేశారు. బీఆర్ఎస్ తరఫున ఆలేరు నియోజకవర్గం నుంచి సందిల భాస్కర్‌గౌడ్ కోసం ఆ పార్టీ నాయకత్వం చివరి వరకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అయినప్పటికి భాస్కర్ బరిలో ఉన్నారు. ఆలేరు, భువనగిరి పరిధిలో అత్యధిక ఓట్లు అత్యధికంగా ఓట్లు ఉన్న ఆలేరు, భువనగిరి నియోజవర్గాల నుంచి తమకు లబ్ది ఓటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే పార్టీ బలపర్చిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నాయకుడొకరుచెప్పారు. వ్యతిరేకంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేయడానికి వెనుకాడమని మదర్ డైయిరీ చైర్మన్ చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతో డైరెక్టర్ స్థానాలకు నామినేషన్‌న్ వేసిన వారి పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. ఉపసంహరణ గడువు ముగిసి గుర్తుల కేటాయింపు తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ముగ్గురు పేర్లు రెండు పార్టీల ప్రతినిధులు ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందు ఒప్పందం కుదిరితే పార్టీ నిర్ణయం మేరకు విత్‌డ్రా జరిగేది. ఇప్పుడు ఉపసంహరించుకోవడానికి వీలులేక వారంతా పోటీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఆరు డైరెక్టర్ స్థానాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. పోటాపోటీగా క్యాంపులు నిర్వహించాయి. అయితే చివరికి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సారి కూడా పోటీకి రెండు పార్టీలు సిద్ధపడ్డాయి. దీంతో పూర్తిస్థాయిలో విత్ డ్రాల కోసం ప్రయత్నించలేదు. అయితే ఓటింగ్‌కంటే ముందే పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. మదర్ డెయిరీ ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం ఫ మూడు డైరెక్టర్ స్థానాల పంపకం ఫ కాంగ్రెస్ మద్దతుదారులకు రెండు, బీఆర్ఎస్ మద్దతుదారులకు ఒకటి ఫ 27వ తేదీన పోలింగ్ ఫ బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు మదర్డైయిరీ పాలకవర్గం డైరెక్టర్ల స్థానాలకు ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు. ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు పార్టీలు పాల సొసైటీ చైర్మన్లను 26వ తేదీన క్యాంపునకు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. పాల సొసైటీల్లో వివిధ పార్టీలకు చెందిన చైర్మన్లు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు కాకుండా పోటీలో ఉన్న మరో ఆరుగు అభ్యర్థులు ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో ఉన్న పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీలో ఉంటానని ప్రకటించారు. ఇంకా మోతె పూలమ్మ, శీలం వెంకట నర్సింహరెడ్డి బరిలో ఉన్నారు. -
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
నల్లగొండ : పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. బుధవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని, సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సమర్థమైన సేవలు అందించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, డీసీఆర్బీ డీఎస్పీ రవికుమార్, సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
దేవరకొండ : ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోజూ నమోదయ్యే ఓపీ వివరాలు, సిబ్బంది పనితీరు వంటి వివరాలు ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలని మాతాశిశు మరణాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఆమె వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, కమిషనర్ సుదర్శన్ ఉన్నారు. సమయపాలన పాటించాలిఅధికారులు సమయపాలన పాటించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం చందంపేట మండలంలోని గాగిళ్లాపురం గ్రామంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఆమె పరిశీలించారు. అనంతరం చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఆర్టీసీ.. ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తోంది
నల్లగొండ : హిందువుల పండుగలు వచ్చిన ప్రతిసారి ప్రయాణికులను ఆర్టీసీ నిలువు దోపిడీ చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు 50 శాతం అదనంగా వసూలు చేస్తోందన్నారు. ప్రజాపాలన పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల పాలిట కష్టాలు తెచ్చే ప్రభుత్వంగా మారిందన్నారు. నల్లగొండ కాంగ్రెస్ అడ్డా అని గొప్పలు చెప్పే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని విమర్వించారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నేత గోలి మధుసూదన్‌రెడ్డి, పకీరు మోహన్‌రెడ్డి, మిర్యాల వెంకటేశం, బీపంగి జగ్జీవన్, పిండి పాపిరెడ్డి, కిషన్, దాసరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర, జిల్లా నూతన కార్యవర్గాలను మంగళవారం నల్లగొండలోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా యానం విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఇటికాల రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మేడే రామకృష్ణ, కోశాధికారిగా ఉడావత్ లచ్చిరామ్‌నాయక్, అసోసియేట్ అధ్యక్షులుగా బొడ్డు హుస్సేన్, జి.లింగయ్య, ఉపాధ్యక్షుడిగా ఆర్.కిషన్‌నాయక్‌ను ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఈసం రాంబాబు, ప్రధాన కార్యదర్శిగాజి. జగదీశ్వర్, చండూరు మండల అధ్యక్షుడిగా వేముల సైదులు, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొంపెల్లి భిక్షం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్వాయి వెంకటయ్య, జటావత్ చంద్రుడు నాయక్, వెంకటయ్య, నామ నాగయ్య, బోయ రాము, అయోధ్య, ఉపేందర్, కరుణాకర్, గోపాల్, యాదయ్య పాల్గొన్నారు. -
మూసీకి పోటెత్తిన వరద
కేతేపల్లి : మూసీ రిజర్వాయర్‌కు మంగళవారం ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది క్రస్ట్‌గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంగళవారం ఉదయానికి ఇన్‌ఫ్లో 12,184 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో నీటిమట్టం 645 అడుగుల గరిష్ట స్థాయికి చేరువలో ఉండటంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం తెరిచిన నాలుగు క్రస్ట్‌గేట్లకు అదనంగా మంగళవారం మరో ఐదు క్రస్ట్‌గేట్లను (మొత్తం 9 గేట్లు) రెండు అడుగుల మేర ఎత్తి 11,737 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి, ఎమమ ప్రధాన కాల్వలకు 390 క్యూసెక్కుల నీటిని విడుద ల చేస్తున్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో 4.17 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.ఫ ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తివేత -
అకడమిక్ కౌన్సిలర్ల నియామనికి దరఖాస్తులు
నల్లగొండ : డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అకడమిక్ కౌన్సిలర్ల నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎన్జీ కాలేజీ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అధ్యయన కేంద్రాల్లో వివిధ సబ్జెక్టుల్లో బోధించడానికి అనుభవం ఉండి పీజీలో 55 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు braou. online.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అక్టోబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సిబ్బంది సంక్షేమానికి కృషి : ఎస్పీనల్లగొండ : సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. వర్షాకాలం, చలికాలంలో హోం గార్డులు, స్పెషల్ పార్టీ సిబ్బంది ఇబ్బంది పడకుండా వారికి ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్, కిట్ బ్యాగ్స్, జంగిల్ ప్యాచ్‌లను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, హోం గార్డ్ ఆర్ఐ శ్రీను, అడ్మిన్ ఆర్ఐ సంతోష, ఆర్ ఎస్ఐలు కళ్యాణ్‌రాజ్, రాజీవ్ పాల్గొన్నారు. యూరియా అధిక ధరలకు అమ్మొద్దుతిప్పర్తి : రైతులకు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ అన్నారు. తిప్పర్తి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీని మంగళవారం ఆయన పరిశీలించారు. రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రైతులకు సరిపడా యూరియా అందిస్తామని.. రైతులు అధైర్య పడొద్దని పేర్కొన్నారు. ఆయన వెంట ఏఓ సన్నిరాజు తదితరులు ఉన్నారు. నర్సరీలను సక్రమంగా నిర్వహించాలిమర్రిగూడ, చండూరు : నర్సరీలను సిబ్బంది సక్రమంగా నిర్వహించాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి, శివన్నగూడెం, చండూరు మండలంలోని దోనిపాముల వద్ద నర్సరీలను పరిశీలించారు. బ్లాక్ ప్లాంటేషన్‌ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. నర్సరీలో మొక్కలు ఎండిపోయిన, పాడైపోయిన మొక్కలను వెంటనే తొలగించి కొత్త విత్తనాలు నాటి ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం శివన్నగూడెం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీఓలు జయరాజు, శ్రీనివాస్, ఏపీఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మీరే నా బలం... బలగం
నల్లగొండ: మీరే నా లీడర్లు... మీరే నా క్యాడర్... మీరే నా బలం... బలగం. నన్ను 30 ఏళ్లుగా అక్కున చేర్చుకున్నారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనిది అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా నిలిచిందన్నారు. అభివృద్ధిలో నల్లగొండను ఆదర్శంగా నిలుపుతామన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. గ్రామీణ రోడ్లన్నీ డబుల్ రోడ్లుగా మారుస్తానని విద్య వైద్యంలో మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రోడ్లు, కాల్వలు, కాలేజీలు, ఆసుపత్రి, ప్రాజెక్టులు ఏది చూసినా నల్లగొండ మోడల్‌గా నిలిచే విధంగా చేస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 100 శాతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలైందని అది మునిగిపోయే నావ అని ఏనాడో చెప్పానన్నారు. జిల్లాలో ఓ లీల్లీపుట్ ఉండు. ఎప్పుడు గెలిచినా ఆయనకు 2వేల లోపే మెజార్టీ అని భవిష్యత్‌లో ఇక గెలవడన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. శ్రీశైలం ఎడమగట్టు సొరంగాన్ని (ఎస్ఎల్బీసీని) నూతన టెక్నాలజీతో 2027లోపు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే జిల్లా సశ్యశ్యామలం అవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి, గడ్డం అనూప్‌రెడ్డి, జూకూరి రమేష్, సంపత్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, సైదులు, అబ్బగోని రమేష్‌గౌడ్, కూసుకుంట్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కాంగ్రెస్ పార్టీకి అడ్డా.. నల్లగొండ ఫ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి ఫ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
యూరియా కోసం రైతుల తిప్పలు
కేతేపల్లి: యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కేతేపల్లిలోని పీఏసీఎస్ కేంద్రానికి సోమవారం రాత్రి 440 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న మండలంలోని దాదాపు అన్ని గ్రామాల రైతులు మంగళవారం ఉదయమే కేతేపల్లిలోని పీఏసీఎస్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. టోకెన్ల కోసం ఆధార్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్‌లతో లైన్లో నిల్చున్నారు. గ్రామానికి 35 చొప్పున రైతులకు టోకెన్లు అందజేసిన అధికారులు.. ఒక్కో రైతుకు కేవలం ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. రైతులు భారీ సంఖ్యలో ఉండడంతో పూర్తిస్థాయిలో రైతులకు యూరియా సరిపోలేదు. చాలా మంది రైతులు యూరియా బస్తాలు అందక నిరాశగా వెనుదిరిగారు. -
తెలంగాణలో ప్రతిపక్షం కరువైంది
మునుగోడు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసాలు, అవినీతి, అక్రమాలను ఎండగట్టేందుకు అవసరమైన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో కరువైందని, అందువల్లే సీఎం రేవంత్‌రెడ్డి తన ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగిస్తున్నాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పింఛన్ రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు ఇతర పింఛన్‌దారులకు రూ.4 వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మునుగోడులో నిర్వహించిన సభకు ఆయన హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 లక్షల మంది పింఛన్‌దారులకు పింఛన్ పెంచుతామని మాట ఇచ్చి 21 నెలల కాలంగా పెంచకుండా మోసపూరిత పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఇలా ఇచ్చిన హామీని అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రశ్నించకపోగా 21 నెలల కాలంగా అసెంబ్లీకి, ప్రజల్లోకి రాకుండా అసమర్థ ప్రతిపక్ష నేతగా మిగిలాడన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ పేద కుటుంబాలకు చెందినవారైతే పింఛన్‌దారులపై వారికి జాలి, దయ కలిగేదన్నారు. తాను పేద కుటుంబంలో జన్మించి రిక్షా తొక్కి, ఆ తరువాత ఆటో, ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసి పేదరికలో పెరిగి ఎదిగినవాడినని.. అందుకే పింఛన్‌దారుల కోసం పోరాడుతున్నాని చెప్పారు. 2003 నుంచి గుండెజబ్బు కలిగిన పేదల బిడ్డలకు ఉచితంగా ఆపరేషన్లు చేయాలని తమ సంఘం ద్వారా పోరాడితే అప్పటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తాను 2004లో అధికారంలోకి వచ్చాక పేదలు అందరికీ ఆరోగ్యశ్రీ పథకం అందించారని గుర్తుచేశాడు. అంతే కాకుండా వికలాంగుల, వృద్ధుల పింఛన్ పెంపు కోసం 2007 నుంచి ఎమ్మార్పీఎస్ ఆందోళనలు చేపడుతుంటే రూ.75 ఉన్న పింఛన్ రూ.4 వేలకు చేరిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలని అక్టోబర్ 6 నుంచి నవంబర్ 6 వరకు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు చేపడుతామన్నారు. నవంబర్ 20న 20 లక్షల మందితో చలో హైదరబాద్ చేపడుతామన్నారు. ఈ సభలో వికలాంగుల సంఘం నాయకులు మత్స్యగిరి, తలారి సహదేవులు, మేతరి రాములు, శోభ, లింగయ్య, ఎమ్మార్పీస్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి శంకర్, జిల్లా నాయకులు పందుల మల్లేష్, సంపత్‌కుమార్, పందుల అంజి, వెంకన్న, యాదయ్య, లక్ష్మణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వాలి
నల్లగొండ టౌన్: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డబుల్‌బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల సాధన పోరాట కమిటీ కన్వీనర్ అవుట రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం డబుల్ బెడ్రూమ్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాటరీ ద్వారా ఎంపికై న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొన్నిరోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గంజి నాగరాజు, సిరాజుద్దీన్, విశాలాక్షి, ప్రశాంతి, గిరిజ, రాజేష్, విజయలక్ష్మి, అనురాధ, జహంగీర్, రవి, సుల్తాన్, ఇలియాస్, వెంకటమ్మ, రజని, యాదమ్మ పాల్గొన్నారు. -
16.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
● అత్యధికంగా గుర్రంపోడు మండలంలో 43.2 మిల్లీమీటర్లు నల్లగొండ అగ్రికల్చర్: జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుర్రంపోడు మండలంలో 43.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నార్కట్‌పల్లిలో 41.3, మర్రిగూడ 35.8, వేములపల్లి 34.8, తిప్పర్తి 30.7, నల్లగొండ 30.1, మునుగోడు 32.6, మిర్యాలగూడ 30.9, చందంపేట 26.4, కట్టంగూర్ 22.4, చింతపల్లి 21.1, గట్టుప్పల్ 19.3, మాడ్గులపల్లి 19.9, కేతేపల్లి 18.8, దేవరకొండ 15.3, త్రిపురారం 15.6, నకిరేకల్ 14.2, తిరుమలగిరి సాగర్ 13.5, చిట్యాలలో 13.5, నిడమనూరు 13.0, శాలిగౌరారం 10.6, మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాకనల్లగొండ: నల్లగొండకు మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి మంగళవారం ఉదయం 10 గంటలకు నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం మర్రిగూడ బైపాస్‌లోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. నేడు మునుగోడుకు మంద కృష్ణ మునుగోడు: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెంఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మునుగోడులో నిర్వహించే సభకు మంద కృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు ఆ సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి శంకర్ తెలిపారు. సోమవారం మునుగోడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కుల సాధనకు నిర్వహించే సభకు మండలంలోని అన్ని రకాల పెన్షన్ దారులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు పందుల మల్లేష్, పందుల సంపత్ కుమార్, వెంకన్న, బోయపర్తి యాదయ్య, ఎర్రసాని గోపాల్, పందుల పర్వతాలు, పోలే రాజు, పరమేష్, శ్రీను, వికలాంగుల హక్కుల పోరాట సమితి దొమ్మాటి సత్యనారాయణ పాల్గొన్నారు. భూసేకరణ పూర్తిచేయాలినల్లగొండ: జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. దసరా పండుగకు ముందే అన్ని జాతీయ రహదారుల భూ సేకరణ పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ అశోక్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, జాతీయ రహదారుల సంస్థ ఈఈ మురళి పాల్గొన్నారు. ఆర్డీఓ అశోక్‌రెడ్డికి ఇన్చార్జ్ సీపీఓ బాధ్యతలు నల్లగొండ: నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డికి జిల్లా ప్లానింగ్ అధికారిగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సీపీఓ సుబ్బారావు పదవీ విరమణ పొందడంతో సూర్యాపేట సీపీఓకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన నల్లగొండకు సక్రమంగా రాకపోవడంతో సీపీఓ ఇన్చార్జ్ బాధ్యతలను నల్లగొండ ఆర్డీఓకు అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు. -
పెరిగిన యూరియా వినియోగం
నల్లగొండ అగ్రికల్చర్: జిల్లాలో రైతులు యూరియా వినియోగాన్ని పెంచారు. వానాకాలం సీజన్‌కు జిల్లాకు 70వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. దాని ప్రకారంగా జిల్లాకు మూడు నెలల్లో 67,500 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. ఇంకా జిల్లాకు 2500 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. అయితే జిల్లాలో వానాకాలం సీజన్లో 5,64,585 ఎకరాల్లో పత్తి, 5,05,160 ఎకరాల్లో వరి, కంది, జొన్న, పెసర, వేరుశనగ ఇతర పంటలు కలిపి మొత్తం 10,73,162 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. సాగు చేసిన లెక్కల ప్రకారం ఎకరానికి రెండు బస్తాల యూరియా చొప్పున వాడినా మొత్తం 43 వేల మెట్రిక్ టన్నులతో పాటు ఇతర పండ్ల తోటలు, కూరగాయల సాగుకు మరో 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైనా మొత్తం 53వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనాలు వేసి అదనంగా యూరియాను కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో 70 వేల మెట్రిక్ టన్నులు అవసరంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే 67,500 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినప్పటికీ యూరియా కోసం రైతులు బారులుదీరుతున్నారు. నాన్ ఆయకట్టు ప్రాంతంలో జూలై మొదటి వారంలోనే వర్షాలు కురవడంతో పత్తి గింజలను పెట్టుకున్నారు. అదేవిధంగా బోరు బావుల కింద వరినాట్లు కూడా వేసుకున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో జిల్లాకు వచ్చిన యూరియా నాన్ ఆయకట్టు ప్రాంతంలోని రైతులకు సరిపోయింది. ఆగస్టులో నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటి విడుదల చేయడం, వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఆయకట్టులో ఒకే సారి వరినాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో యూరియా డిమాండ్ బాగా పెరిగి రైతులు యూరియా కోసం బారులుదీరుతున్నారు. సెప్టెంబర్‌లో ప్రతిరోజు జిల్లాకు యూరియా దిగుమతి అయినప్పటికీ యూరియా వినియోగం పెరిగి రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. ప్రైవేట్ వ్యాపారుల కృత్రిమ కొరత జిల్లాలోని కొందరు ప్రైవేట్ వ్యాపారులు యూరియా కృత్రిమ కొరతను సృషించి రైతులకు ఎక్కువ ధరకు విక్రయించారు. యూరియా 60 శాతం ప్రభుత్వ కేంద్రాలకు 40 శాతం యూరియాను ప్రైవేట్ వ్యాపారులకు కేటాయిస్తారు. ప్రభుత్వ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరగా ప్రైవేట్ దుకాణాల వద్ద అంతగా రైతులు బారులుదీరలేదు. కేవలం వారి రెగ్యులర్ రైతులకు మాత్రం రూ.400ల నుంచి రూ.450 వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. వరికి ఎకరానికి 2 బస్తాల యూరియా వినియోగించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నప్పటికీ రైతులు ఏకంగా ఎకరానికి 4 నుంచి 5 బస్తాల యూరియాను వినియోగించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనికి తోడు కొందరు రైతులు ముందస్తుగా వచ్చే సీజన్‌కు కూడా కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంటున్నట్లు సమాచారం. దీంతో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూరియాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రైతులు అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి. ఎక్కువ మొతాదులో యూరియా వాడితే పంటకు నష్టమే కాని లాభం ఉండదు. నిల్వ ఉంచుకుంటే యూరియా పనికిరాదు. – పాల్వాయి శ్రవన్‌కుమార్, డీఏఓ ఫ మోతాదుకు మించి వాడిన రైతులు ఫ 70వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేసిన వ్యవసాయ శాఖ ఫ మూడు నెలల్లో 67,500 మెట్రిక్ టన్నులు సరఫరా ఫ అయినా యూరియా కోసం బారులుదీరుతున్న రైతులు -
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
నల్లగొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 37 మంది వినతిపత్రాలు సమర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. సంబంధిత ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. కాలనీల్లో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్నల్లగొండ: దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ సంబరాల్లో మహిళలు, యువతులపై వేధింపులు, ఈవ్ టీజింగ్ చేయకుండా పోలీస్ నిఘా పెట్టామని పేర్కొన్నారు. జిల్లాలో 200 దుర్గాదేవి విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపారు. మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాలు ఏర్పాటు చేసిన కాలనీల్లో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండపాల వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాత్రి సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాత్రి 10 గంటలలోపు స్పీకర్లు బంద్ చేయాలని సూచించారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
నల్లగొండ: గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం ప్రజలు పెద్దఎత్తున కలెక్టరేట్‌కు తరలి వచ్చారు. భూ సమస్యలు, పెన్షన్లు, ఇతర సమస్యలపై మొత్తం 72 వినతులు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ స్వీకరించారు. ఫ 72 వినతులు సమర్పించిన అర్జీదారులు తమ భూమిని బ్లాక్ లిస్టులో చేర్చారని, అందులో నుంచి తొలగించాలని నల్లగొండ మండలం, చందనపల్లి గ్రామానికి చెందిన గాదె రాజారాంరెడ్డి కలెక్టరేట్‌ను ఆశ్రయించాడు. తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారని, తన భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయిందని తెలిపాడు. తనకున్న భూమిలో తన మూడో కుమార్తెకు 4.13 ఎకరాల భూమిని గతంలో అమ్మానని, ఇంకా 2 ఎకరాల 34 కుంటల భూమి తన పేరుతో ఉందని పేర్కొన్నాడు. మిగతా కుమార్తెలు తాను అమ్మిన భూమిని బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు, తన పేరున ఉన్న భూమిని కూడా బ్లాక్ లిస్టులో పెట్టారని, దానిని తొలగించాలని విన్నవించాడు. దేవరకొండలోని సర్వే నంబర్ 405లో దర్గా భూములు ఆక్రమించుకుంటున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దేవరకొండకు చెందిన దర్గా హక్కుదారులు సయ్యద్ సిద్దిక్ అలీ, కాదర్, అంజద్‌అలీ, ఉస్మాన్ అలీ, సాబేర్, బషీర్, ఫయాజ్‌లు కలెక్టరేట్‌ను ఆశ్రయించారు. నిర్మాణం చేసే వారిని ఆపమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని, వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలని వినతిపత్రం అందజేశారు. -
ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు
● ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య సూర్యాపేటటౌన్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని, హక్కులను పోరాడి సాధించుకుందామని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తూ జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్‌ను ఆదివారం ఆయన పరామర్శించి మాట్లాడారు. అధికారులు ఇప్పుటికై నా స్పందించి త్వరగా పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు శివశంకర్, జిల్లా జేఏసీ అధ్యక్షుడు చీకూరి అశోక్ కుమార్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎండి జహీర్, ఉపాధ్యక్షులు కల్లేపల్లి దశరథ, జాయింట్ సెక్రెటరీ బొజ్జ నిరణ్కుమార్, మీడియా కన్వీనర్ పోలెపాక నవీన్ కుమార్, సభ్యులు అరవింద్, అరుణ్ కుమార్, భిక్షం, సైదులు, అరవింద్ కుమార్, కొత్తపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు. -
వంద పడకల ఆస్పత్రి నిర్మాణంలో వేగం పెంచాలి
కోదాడ: కోదాడలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంబంధింత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం రాత్రి ఆయన ఆస్పత్రి పనులను పరిశీలించి మాట్లాడారు. గతంలో ఉన్న పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా తానే మార్చానని, ఇప్పుడు వంద పడకల ఆస్పత్రిగా కూడా తాను మంత్రిగా ఉన్న సమయంలోనే మంజూరు చేయించానని అన్నారు.రాష్ట్రంలో 3 సిటీ స్కాన్ యంత్రాలు మంజూరైతే రెండింటిని కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఏర్పాటు చేయించానన్నారు. సీటీ స్కాన్ యంత్రాల నిర్వహణకు అవసరమైన రేడియాలజిస్ట్‌లను, టెక్నిషియన్లను త్వరలో నియమిస్తామని అన్నారు. దీంతో పాటు కోదాడలో నవోదయ విద్యాలయంతో పాటు చిలుకూరులో యంగ్ ఇండియా స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలను అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్ధానంలో ఉంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ పడకల సంఖ్యను పెంచడానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మంత్రికి ఆస్పత్రి సిబ్బంది బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోతె లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.244 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ లిఫ్ట్ ద్వారా మోతె, నడిగూడెం, మునగాల మండలాల్లో 46,712 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, ఇరిగేషన్ అధికారులు రమేష్‌బాబు, శివధర్మతేజ, ఆర్అండ్బీ సీఈ సీతారామయ్య, డీసీహెచ్ఎస్ వెంకటేశ్వర్లు, డాక్టర్ దశరథ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ చూసేందుకు వచ్చి వ్యక్తి గల్లంతు
నాగార్జునసాగర్:కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చిన వ్యక్తి కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. ఈ ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చింతల్ ప్రాంతానికి చెందిన దిరిసెల రాంబాబు(45) ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అతడు తన భార్య సుహాసిని, ఇద్దరు కుమారులతో కలిసి నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చారు. మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో కలిసి సాగర్ అందాలను తిలకిస్తూ, ఫొటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. అనంతరం స్నానాలు చేసేందుకు గాను సాగర్ డ్యాం దిగువన విద్యుదుత్పాదన కేంద్రానికి వెళ్లే దారిలోని శివాలయం పుష్కరఘాట్‌లోకి దిగారు. ఈ క్రమంలో రాంబాబు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న భార్య, కుమారులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న సాగర్ ఎస్ఐ ముత్తయ్య ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆది వారం రాత్రి వరకు కూడా రాంబాబు ఆచూకీ లభించలేదు. -
విహారయాత్రకు వెళ్తూ మృత్యు ఒడిలోకి..
శాలిగౌరారం: శాలిగౌరారం మండలం తిరుమలరాయినిగూడెం గ్రామానికి చెందిన యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్‌పై విహారయాత్రకు వెళ్తూ వికారాబాద్ జిల్లా మన్నెగూడ మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం తిరుమలరాయినిగూడెం గ్రామానికి చెందిన నూనెముంతల సాయికుమార్(27) నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్లో గుండె స్టంట్ మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి విధులకు వెళ్లిన సాయికుమార్ సాయంత్రం విధులు ముగియగానే హైదరాబాద్‌లో చదువుకుంటున్న అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు అయితగోని శివమణి వద్దకు బైక్‌పై వెళ్లాడు. అక్కడి నుంచి వారిద్దరు కలిసి వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు, వాటర్‌ఫాల్స్ చూసేందుకు బైక్‌పై రాత్రి బయల్దేరారు. మరో అరగంటలో అనంతగిరికి చేరుకుంటారనగా.. వారి బైక్‌ను వికారాబాద్ జిల్లా మన్నెగూడ మండలం కండ్లపల్లి గ్రామ పరిధిలో రాత్రి 11 గంటల సమయంలో గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందగా.. శివమణి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొంత సమయం తర్వాత శివమణి తేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. వెంటనే సాయికుమార్, శివమణి తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి వెళ్లారు. శివమణిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆదివారం సాయంత్రం సాయికుమార్ మృతదేహం తిరుమలరాయునిగూడెంకు చేరుకోగా రాత్రి అంత్యక్రియలు జరిగాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో నూనెముంతల శంకర్, యల్లమ్మ దంపతుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాదంలో శాలిగౌరారం మండల యువకుడు మృతి వికారాబాద్ జిల్లాలో ఘటన -
నేటి నుంచి శరన్నవరాత్రోత్సవాలు
యాదగిరిగుట్ట: దేవీ శరన్నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయాలు, ఊరూరా మండపాలు ముస్తాబయ్యాయి. సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలను మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి, వివిధ ఆకృతుల్లో అమ్మవార్లను ప్రతిష్ఠింపజేయడానికి సిద్ధమయ్యారు. భక్తులు దుర్గాదేవి మాలధారణ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.● ఈ సారి 11రోజుల పాటు ఉత్సవాలు..ప్రతి ఏటా దేవీ శరన్నవరాత్రోత్సవాలు 9 రోజులు మాత్రమే జరుగుతుంటాయి. కానీ ఈ సారి 11 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. చవితి తిధి రెండు రోజులు వచ్చిన కారణంగా 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని అర్చకులు చెబుతున్నారు. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపురసుందరి దేవిగా, 2వ రోజు గాయత్రీ దేవిగా, 3వ రోజు అన్నపూర్ణ దేవిగా, 4వ రోజు కాత్యాయని దేవిగా, 5వ రోజు మహాలక్ష్మిగా, 6వ రోజు లలితా త్రిపురసుందరి దేవిగా, 7వ రోజు మంగళచండీ దేవిగా, 8వ రోజు సరస్వతి దేవిగా, 9వ రోజు దుర్గాదేవిగా, 10వ రోజు మహిషాసురమర్ధినిగా, 11వ రోజు రాజరాజేశ్వరీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఆయా అమ్మవారి ఆలయాల్లో వారి వెసులుబాటును బట్టి అలంకారాలను చేస్తారు.● యాదగిరి కొండపై..యాదగిరి కొండపైన గల శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు సోమవారం ఉదయం శ్రీకారం అర్చకులు చుట్టనున్నారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు రూ.1,116, ఒక్క రోజు సప్తశతి పారాయణం చేయుటకు రూ.116, లక్ష కుంకుమార్చనకు రూ.116 రుసుము చెల్లించి పూజల్లో పాల్గొనవచ్చునని ఈఓ వెంకట్రావ్ వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా శివాలయంలో నిర్వహించే రుద్ర హోమాన్ని 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రద్దుచేసినట్లు పేర్కొన్నారు.● తూర్పు రాజగోపురం చెంత శమీ పూజఆశ్వయుజ శుద్ధ దశమిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5.30గంటల సమయంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారం యాదగిరీశుడి ఆలయ తూర్పు రాజగోపురం ముందు శమీ పూజ నిర్వహించనున్నారు. -
బృందావనపురం.. పంటల సాగులో ఆదర్శం
నడిగూడెం: నడిగూడెం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావనపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఎప్పటికప్పుడు పంట మార్పిడిని అవలంబిస్తూ భిన్న పంటలను సాగు చేస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బృందావనపురం గ్రామానికి చెందిన చిన్న, సన్నకారు రైతులు పలువురు ప్రస్తుత సీజన్లో ముందుగా పెసర సాగు చేపట్టారు. ఆ పంట పూర్తవ్వగానే అర ఎకరం, ఎకరం విస్తీర్ణంలో బంతి సాగు చేపట్టారు. బంతి 120 నుంచి 140 రోజుల పంట కావడంతో.. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల నాటికి డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో బంతి సాగు చేపట్టారు.ప్రైవేట్ హైబ్రిడ్లు, పొట్టి రకం, పొడవు రకం, ముద్ద రకం, పసుపు, నారింజ రకాలను సాగు చేశారు. నారును ఏపీలోని కృష్ణాజిల్లా చిల్లకల్లు ప్రాంతం నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. బంతి నారు నాటి రెండు నెలలు తర్వాత పూలు పూస్తాయి. బతుకమ్మ పండుగకు నడిగూడెం, బృందావనపురం, వేణుగోపాలపురం, కరివిరాల, చెన్నకేశ్వాపురం, వెంకట్రాంపురం, కాగితరామచంద్రాపురం, సిరిపురం, నారాయణపురం, శ్రీరంగాపురం, వల్లాపురం, చాకిరాల, రత్నవరం, రామాపురం గ్రామాలకు చెందిన ప్రజలు బృందావనపురం వచ్చి బంతి పూలు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం సీజన్ ఆరంభమవ్వడంతో కిలో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు.కనువిందు చేస్తున్న బంతి తోటలుబృందావనపురం నుంచి కాగితరామచంద్రాపురం రహదారి వెంట పలు చోట్ల బంతి తోటలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. ఆ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతున్నాయి. ఎరుపు, పసుపు రంగుల్లో బంతి తోటలు కనిపిస్తుండడంతో పలువురు ప్రయాణికులు ఫొటోలు దిగుతున్నారు.రెండేళ్లుగా బంతి సాగుచేస్తున్నా..నాకున్న వ్యవసాయ భూమిలో గత రెండేళ్లుగా బంతి సాగు చేస్తున్నా. ఈ సారి భిన్నంగా మల్చింగ్ పద్ధతిలో సాగు చేపట్టాను. ఇప్పుడే సీజన్ ప్రారంభమైంది. కిలో బంతి పూలు రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నాం.– చాపల సురేష్, యువ రైతు, బృందావనపురంప్రభుత్వం ప్రోత్సహించాలిగత నాలుగేళ్లుగా పంట మార్పిడి అవలంబిస్తున్నా. మా లాంటి చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసి ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఒకే రకంగా కాకుండా పలు రకాలను సీజన్‌కు అనుగుణంగా సాగు చేస్తున్నాను. మా ప్రాంత నేలలు కూడా అనుకూలంగా ఉన్నాయి.– మేకపోతుల వెంకన్న, రైతు, బృందానపురం -
రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చాలి
సంస్థాన్ నారాయణపురం, నల్లగొండ టూటౌన్: ప్రభుత్వం విడుదల చేసిన రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ వలన తీవ్రంగా నష్టపోతున్నామని భూములు కోల్పోతున్న రైతులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. సంస్థాన్ నారాయణపురం మండల రైతులు ఆదివారం బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వారిని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా అలైన్మెంట్ చేయడం వల్ల తాము భూములు కోల్పోయి రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చిందని భూనిర్వాసితులు వాపోయారు. మార్కెట్ ధర ఎకరం కోట్ల రూపాయలు పలుకుతుంటే నామామాత్రంగా నష్టపరిహరం ఇచ్చి మా భూములు లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి 40కి.మీ. దూరంలో రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మించాల్సి ఉండగా.. సంస్థాన్ నారాయణపురం మండలంలో కేవలం 28కి.మీ. వరకే తీసుకుని అలైన్మెంట్ ఇచ్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి అలైన్‌మెంట్‌ను మార్చాలని కోరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, ఎన్. రాంచందర్‌రావు మాట్లాడుతూ.. తగిన న్యాయం జరిగేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు దోనూరి వీరారెడ్డి, మండల అధ్యక్షుడు సుర్వి రాజు, రైతులు పల్లె పుష్పారెడ్డి, పల్లె శేఖర్‌రెడ్డి, గాజుల భగత్, పల్లె భాస్కర్‌రెడ్డి, గాజుల అంజయ్య, బద్దుల వెంకటేష్, కొలను మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ప్రొఫెసర్ కోదండరాంకు వినతి..గట్టుప్పల్: గట్టుప్పల్, మర్రిగూడ మండలాలకు చెందిన రీజినల్ రింగ్‌రోడ్డు భూనిర్వాసితులు తమకు అండగా ఉండాలని కోరుతూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఆది వారం కలిసి వినతి పత్రం అందజేశారు. రీజినల్ రింగ్‌రోడ్డు కొత్త అలైన్మెంట్ వల్ల కార్పొరేట్ కంపెనీలు, భూస్వాములకు లాభం జరుగుతుందని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృషష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు భూనిర్వాసితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె వినయ్‌కుమార్, ఆశన్న, భూనిర్వాసితుల నాయకులు భీమగాని మహేష్‌గౌడ్, పల్లె శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, పుష్పారెడ్డి, మల్లేశం, వాసు తదితరులు పాల్గొన్నారు. -
పేద, మధ్య తరగతికి దన్ను
భువనగిరి: జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) స్లాబ్‌ల కుదింపుతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. షాంపూలు, సబ్బులు, ఏసీలు, టీవీలు, సిమెంట్ వంటి రోజువారీ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దీని వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ, మధ్య తరగతి వినియోగదారులు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జీఎస్టీ విధింపులో నాలుగు స్లాబ్‌లు ఉండగా వాటిని రెండింటికి కుదించారు. పేదలు, రైతులు, మహిళలు, యువత వినియోగించే వస్తువులు, 12 రకాల సేవలు, 18 శాతం ఉన్న వాటిని 5 శాతం స్లాబ్‌లోకి మార్చారు. ఇందులో అనేక రకాల నిత్యావసర వస్తువులు సైతం ఉన్నాయి. దీంతో కుటుంబ ఖర్చు తగ్గనున్నాయి. కుటుంబ ఖర్చులే కాకుండా వ్యక్తిగత ఖర్చు సైతం సుమారు 10 శాతం ఆదా అయ్యే అవకాశం ఉంది. కొత్త స్లాబ్‌లు సోమవారం నుంచి అమలులోనికి రానున్నాయి.రైతులు, మహిళలకు లబ్ధిసాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలపై ప్రభుత్వం ఇప్పటికే రాయితీలను వర్తింపజేస్తోంది. కొంతకాలంగా వ్యవసాయ వస్తువులపై రాయితీలు తగ్గిపోవడమే కాకుండా పన్నుల వడ్డింపు పరిధిలోకి వెళ్లాయి. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రైతుకు వచ్చే నికర లాభం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. దీంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలుపై పన్ను భారం తగ్గనుంది. రైతులు వినియోగించే ట్రాక్టర్ల టైర్లు, విడిభాగాలు, కొన్నిరకాల పురుగుల మందులు, సూక్ష్మపోషకాలు, స్ప్రింకర్లు, డ్రిప్ పైపులు, వ్యవసాయ పరికరాల కొనుగోలు ఖర్చులు తగ్గనున్నాయి. 18 నుంచి 12 శాతం స్లాబ్‌లోని వాటిని ఐదు శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. కుట్టు మిషన్లు, వాటి విడిభాగాలు, మహిళలు, చిన్నారుల కోసం వినియోగించే పలు రకాల వస్తువులపై కూడా పన్ను భారం తగ్గనుంది. విద్యార్థులకు సంబంధించి మ్యాప్‌లు, చార్టులు, గ్లోబ్‌లు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, నోట్‌బుక్స్ వంటి వాటిపై 12 శాతం నుంచి సున్నా శాతానికి పన్ను భారం తగ్గనుంది. నిత్యావసర వస్తువులలో తల నూనెలు, షాంపులు, టూత్‌పెస్ట్, సబ్బులు, టూత్ బ్రెష్, షేవింగ్ క్రీం, వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, మిక్చర్, వంటసామగ్రి వంటి ఉన్నాయి. అంతేకాకుండా టీవీలు, చిన్న, మధ్య శ్రేణి కార్లు, బైకులు, వైద్య పరికరాలు, విద్యార్థులకు అవసరమైన వస్తువులపై కూడా పన్ను భారం తగ్గనుంది.కుటుంబ ఖర్చులు ఆదా అవుతాయిమహిళలు వినియోగించే కుట్టు మిషన్లు, వాటి విడిభాగాలతో పాటు చిన్న పిల్లలు ఉపయోగించే పలు రకాల వస్తువులపై పన్ను భారం తగ్గనుంది. పలు గృహోపకరణాలపై జీఎస్టీ తగ్గటం వల్ల కుటుంబ ఖర్చులు సుమారు 10 శాతం వరకు ఆదా అవుతుంది. రైతులు, మహిళలు, చిన్నారుల సైతం ఈ విధానం వల్ల ప్రయోజనం కలగనుంది.– శ్రావణి, గృహిణి, భువనగిరిరైతులకు ప్రయోజనం చేకూరుతుందిజీఎస్టీ తగ్గింపుతో లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై పన్ను భారం తగ్గనుంది. రైతులు వినియోగించే ట్రాక్టర్ల టైర్లు, విడిభాగాలు, కొన్ని రకాల పురుగు మందులు, సూక్ష్మపోషకాలు, స్ప్రింకర్లు, డ్పిప్ పైపులు కొనుగోలు చేయడంలో ఖర్చు ఆదా అవుతాయి.– కస్తూరి సత్యనారాయణ, రైతు, వలిగొండ -
చెర్వుగట్టు క్షేత్రంలో లక్ష పుష్పార్చన
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా అర్చకులు లక్ష పుష్పార్చన నిర్వహించారు. గట్టుపైన రాత్రి నిద్ర చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చెర్వుగట్టుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి ప్రత్యేకంగా ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సురేశ్‌శర్మ, సతీష్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ అర్చక బృందం, వేద పండితులు ప్రత్యేకంగా మహా మండపంలో లక్ష పుష్పార్చన, సహస్రనామార్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, శివసత్తులు ఆలయం వద్ద బతుకమ్మ ఆడారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో గట్టుపైకి వాహనాలను అనుమతించలేదు. పూజల్లో దేవాలయ ఈఓ నవీన్‌కుమార్, సూపర్వైజర్ తిరుపతిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, నర్సిరెడ్డి, వెంకటయ్య తదితరులు ఉన్నారు. -
పథకాల అమలులో తెలంగాణ నంబర్‌వన్
ఫ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫ హుజూర్నగర్ నియోజవర్గంలో ఎత్తిపోతల పథకాల పనుల పరిశీలనహుజూర్నగర్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌లోని ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, దివ్యాంగుల జీవన భృతి చెక్కులు, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 425 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించామన్నారు. నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద ఇప్పటివరకు 3 వేల మందికి రూ 13.31 కోట్లు పంపిణీ చేశామన్నారు. అనంతరం జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఆర్అండ్బీ అతిథి గృహం, ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం, ఫణిగిరి గుట్ట వద్ద సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు, ఐటీఐ కళాశాల, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భవనాల నిర్మాణ పనులను పరిశాలించారు. పనుల పురోగతిపై సమీక్షంచారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఆర్డీఓ శ్రీనివాసులు, ఏఎంసీ చైర్పర్సన్ రాధిక అరుణ్ కుమార్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జునరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్లు, అధికారులు, నాయకులు ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, అజీజ్‌పాష, ఏ.హరిబాబు, జక్కుల మల్లయ్య, కె.ఉపేందర్, కె.మహేష్ పాల్గొన్నారు. చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద నిర్మాణంలో ఉన్న ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా నామకరణం చేస్తున్నట్లు మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన హుజూర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్, దొండపాడులో నిర్మిస్తున్న రాజీవ్‌గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరగనుందని పేర్కొన్నారు. -
జీజీహెచ్‌లో సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) ఐసీయూ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ కె.భార్గవ్‌ను విధుల నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటివరకు జీతాలు రాలేదని ప్రజావాణిలో తనకు దరఖాస్తు సమర్పించగా విచారణ చేసినట్లు పేర్కొన్నారు. ఆల్ఫా స్వయం శక్తి సంఘం కాంట్రాక్ట్ పీరియడ్ ఈ సంవత్సరం మార్చి 31తో ముగిసిందని, అయితే 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ఏజెన్సీకి కేటాయించడం, అదే ఏజెన్సీని రెన్యువల్ చేసే విషయమై సీనియర్ అసిస్టెంట్ కె.బార్గవ్ జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఎలాంటి ఫైల్ సమర్పించలేదని విచారణలో తేలిందని పేర్కొన్నారు. దీంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం చేసిన భార్గవ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశామని తెలి పారు. క్రమశిక్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని కలెక్టర్ వెల్లడించారు. సాగర్‌లో పర్యాటకుల సందడినాగార్జునసాగర్ : సాగర్ కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో ఆ అందాలను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులతో నాగార్జునసాగర్ పరిసరాల్లో ఆదివారం సందడి నెలకొంది. కృష్ణాతీరంతో పాటు ఎత్తిపోతల, బుద్ధవనం అనుపు తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు. లాంచీల్లో నాగార్జునకొండకు వెళ్లారు. బుద్ధవనంలో ధాన్యం చేశారు. 24.2 మి.మీ సగటు వర్షపాతం నమోదు నల్లగొండ టౌన్ : జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24.2 మిల్లీ మీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా కనగల్ మండలంలో 74.5 మిల్లీమీటర్లు, వేములపల్లిలో 70.5, తిప్పర్తి మండలంలో 63.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శాలిగౌరారం 41.3 మి.మీ, నకిరేకల్ 51.5, కేతేపల్లి 40.1, నల్లగొండ 45.1, మునుగోడు 17.4, చండూరు 52.6, మర్రిగూడ 15.4, చింతపల్లి 25.1, గుర్రంపోడు 19.8, అనుముల హాలియా 14.9, త్రిపురారం 23.1, మాడ్గులపల్లి 38.4, మిర్యాలగూడ 41.1, దామరచర్ల 54.1, అడవిదేవులపల్లి 9.5, తిరుమలగిరిసాగర్ 12.7, పెద్దవూర 10.2, పీఏపల్లి 8.2, నేరడుగొమ్ము 4.8, కొండమల్లేపల్లి 6.0, దేవరకొండ 9.2, గుండ్లపల్లి 2.7, చందంపేట 4.7, గట్టుప్పల్ 14.3, గుడిపల్లిలో 8.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి నల్లగొండ : టెట్ ఉత్తీర్ణులు కావాలనే నిబంధన నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశం కోరారు. ఆదివారం నల్లగొండలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమిటీ సమావేశంలో మాట్లాడారు. 20 నుంచి 30 సంవత్సరాల బోధన అనుభవం కలిగిన ఉపాధ్యాయులను టెట్ ఉత్తీర్ణులు అయితేనే ఉద్యోగంలో కొనసాగుతారని లేనిపక్షంలో ఉద్యోగం నుంచి వైదొలగాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉపసంహరించుకోవాలన్నారు. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు అప్పటి నిబంధనలే వర్తింపజేయాలన్నారు. 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ వర్తించేలా కోర్టు తీర్పుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకులు, ఉపాధ్యక్షులు గోపి, ఏడుకొండలు, పుష్ప, ఎం.నాగయ్య, జగతి, టి.వెంకటేశ్వర్లు, కుమారి, అంజయ్య, ఎండీ.ఖుర్షద్ మియా తదితరులు పాల్గొన్నారు. -
పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ
మిర్యాలగూడ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తన తుదిశ్వాస వరకు పోరాడిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్‌బాపూజీ అని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్‌తో కలిసి బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ అందించిన సేవలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ కష్టాలు
రేషన్ డీలర్లకు ఏప్రిల్ నెల నుంచి అందని కమీషన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కమీషన్ విడుదల చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దశల వారీగా జిల్లా కలెక్టర్లకు, పౌర సరఫరాల అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. అక్టోబరు 1 నుంచి సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్నామని చెబున్నారు. అందులో బాగంగా ఈ నెల 23న హైదరాబాద్‌లో తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ఐదుగురు సభ్యులు పాల్గొననున్నారు. ప్రభుత్వం వెంటనే కమిషన్ విడుదల చేయకపోతే 1 నుంచి సమ్మెలోకి వెళ్లాలని ఈ సమావేశంలో తీర్మాణం చేసుకుని వెళ్లనున్నట్లు సంఘ నాయకులు చెబుతున్నారు. నల్లగొండ: రేషన్ డీలర్లకు ఆరు నెలలుగా కమీషన్ అందడం లేదు. ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు సుమారు ఉమ్మడి జిలా వ్యాప్తంగా రూ.6 కోట్ల కమీషన్ డీలర్లకు అందాల్సి ఉంది. కమీషన్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో వారు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 23న తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి సమ్మె నిర్ణయం ప్రకటించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి.. రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందజేసినందుకు ప్రభుత్వం క్వింటాకు రూ.140 చొప్పున డీలర్‌కు కమీషన్ చెల్లిస్తుంది. ఇందులో రూ.90 కేంద్రం చెల్లిస్తుండగా.. రూ.50 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తున్నాయన్న విషయం ఇప్పటి వరకు డీలర్లకు తెలియదు. డీలర్లంతా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పని చేస్తున్నందున ప్రభుత్వం నుంచి విడుదల కావడంతో డీలర్లు కమిషన్ తీసుకునేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద క్వింటాకు రూ. 50 చొప్పున ఇప్పటికే విడుదల చేసింది. కానీ కేంద్రం నుంచి రావాల్సిన మిగతా రూ.90 చొప్పున కమీషన్ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వ అధికారులు మాత్రం కేంద్రం నుంచి ఎప్పుడో విడుదల చేశామని చెబుతున్నారు. దీంతో రేషన్ డీలర్లంతా తమకు వెంటనే కమీషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ కేంద్రం ఇవ్వలేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఫ దసరా పండుగ నేపథ్యంలో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ఫ లేదంటే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సమ్మెకు వెళ్లే యోచన ఫ 23న హైదరాబాద్‌లో సమావేశం.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటన జిల్లా కార్డులు షాపులు నల్లగొండ 5,28,309 991సూర్యాపేట 3,58,778 600యాదాద్రి 2,41,262 380 -
నాణ్యమైన విద్యనందించాలి
మాడుగులపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలోని కేజీబీవీని ఆమె ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, చదువులో వెనుకబడిన గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. దసరా సెలవులు రావడంతో తమ సొంతూళ్లకు వెళ్తున్న విద్యార్థినులు, వారి తల్లులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఓ వసంత, సిబ్బంది సునీత తదితరులు ఉన్నారు. -
కుంభకోణాలకు కేరాఫ్.. కాంగ్రెస్ పార్టీ
మిర్యాలగూడ టౌన్ : కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మిర్యాలగూడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కాపర్ అమ్ముకొని రూ.200 కోట్లు, యూరియాను దారిమల్లించి రూ.300 కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాధినేని శ్రీనివాస్‌రావు, కనపర్తి సత్యప్రసాద్, బంటు సైదులు, సజ్జల నాగిరెడ్డి, కన్మంతరెడ్డి అశోక్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జువ్వాది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి -
మైనార్టీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి ఆర్థిక సాయం అందజేసేందుకు ప్రవేశపెట్టిన రేవంత్ అన్నకా సహారా – మిస్కీనో కే లియే, ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఫఖీర్, దుదేకుల, అట్టడుగు ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారై ఉండాలని పేర్కొన్నారు. అర్హులు https://tgobmms. cgg.gov. వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఎంపీడీఓల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నికనల్లగొండ : మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) సంఘం జిల్లా కార్యకర్గాన్ని శనివారం నల్లగొండలోని జెడ్పీ కార్యాలయంలో ఈసీఓ బి.శ్రీనివాసరావు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.యాకూబ్‌నాయక్, ప్రధాన కార్యదర్శిగా బి.యాదగిరి, ఉపాధ్యక్షులుగా జి.జ్యోతిలక్ష్మి, కోశాధికారిగా ఎస్ఆర్కే శర్మ, కార్యవర్గ సభ్యులుగా జె.వెంకటేశ్వరరావు, నవీన్, జయలక్ష్మి ఎన్నికయ్యారు. నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులునల్లగొండ : పాఠశాలలకు విద్యా శాఖ దసరా సెలవులను ప్రకటించింది. నేటి నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 13 రోజులు సెలవులను ఇస్తోంది. అక్టోబర్ 4వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. పెట్రోల్ బంకుల్లో తనిఖీలునల్లగొండ : నల్లగొండ పట్టణంలో గల పలు పెట్రోల్ బంకుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంక్‌ల్లో మౌలిక సదుపాయాలు లేకపోతే నిర్వాహకులపై కేసుల నమోదు చేస్తామని హెచ్చరించారు. వినియోగదారులకు అసౌకర్యాలు కలిగిస్తే ఉపేక్షించబోమన్నారు. బంక్ యజమానులు వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులకు గురి చేసినా పౌరసరఫర శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ ఎన్పోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్, సయ్యద్ ముబీన్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల సీజ్పెద్దవూర : స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి చెందిన సంఘటనలో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశానుసారం మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలను మండల విద్యాధికారి తరి రాములు శనివారం సీజ్ చేశారు. శుక్రవారం డీఈఓ భిక్షపతి పాఠశాలలో విచారణ చేపట్టారు. విచారణ నివేదికను అనుసరించి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పాఠశాలను సీజ్ చేశారు. బస్సు డ్రైవర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఓపెన్ అడ్మిషన్లకు 26 వరకు గడువు
రామగిరి(నల్లగొండ) : డాక్టర్ బిఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన వస్తోందని.. అడ్మిషన్ల ప్రక్రియ గడువు ఈ నెల 26వ తేదీ పొడిగించామని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ తెలిపారు. నల్లగొండలోని యూనివర్సిటీ రీజినల్ సెంటర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అతి తక్కువ ఫీజుతో దేశంలో ఏ యూనివర్సిటీ అందించని విధంగా బీఆర్ఓయూ బీఏ, బీకాం, బీఎస్‌స్సీ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సుల్లో చదువుకునేదుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు చదువుతోపాటు, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్ ద్వారా ఏటా 5 వేల మంది గ్రామీణ గిరిజన విద్యార్థుల కోసం స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆన్‌లైన ద్వారా దరఖాస్తు చేసుకొని అనంతరం మీరు ఎంచుకున్న స్టడీ సెంటర్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్న తరువాత ట్యుషన్ ఫీజు చెల్లించాలని సూచించారు. సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్‌కుమార్, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ కోఆర్డినేటర్ సుంకరి రాజారామ్, కౌన్సిలర్లు పున్న అంజయ్య, శ్రీకాంత్, మహేష్ పాల్గొన్నారు. -
పత్తి కొనుగోలుకు 24 కేంద్రాలు
నల్లగొండ అగ్రికల్చర్ : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు మార్కెటింగ్‌శాఖ సన్నద్ధమవుతోంది. జిన్నింగ్ మిల్లులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే కొనుగోలు కేంద్రాలను తెరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది మాదిరిగానే జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాలు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. తొలకరి వర్షాలకు విత్తిన పత్తి చేతికొస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో సీసీఐ కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. కాగా, జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను గుర్తించిన మార్కెటింగ్ శాఖ అధికారులు వాటిలో ఉన్న మౌలిక వసతులపై ఇటీవల ఆరా తీశారు. జిన్నింగ్ మిల్లుల్లో ఉన్న సౌకర్యాలు, కంప్యూటర్లు, వేబ్రిడ్జి తదితర అంశాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఈసారి నూతన విధానంలో.. సీసీఐకి పత్తిని అమ్ముకునే రైతులు ఈ ఏడాది నుంచి ప్రత్యేకంగా తయారుచేసిన శ్రీకపాస్ కిసాన్శ్రీశ్రీ అనే యాప్‌లో ఆన్లైన్ విధానంలో తొలుత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. నచ్చిన మిల్లు, నచ్చిన సమయానికి పత్తిని విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోలుకు అనుమతిస్తారు. దీని ద్వారా మిల్లుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యవసాయశాఖ అధికారుల సహకారంతోనైనా, రైతులు స్వయంగానైనా ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ యాప్ వల్ల రైతులు రోజుల తరబడి నిరీక్షించకుండా నిర్దేశిత సమయానికి కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకెళ్లి విక్రయించవచ్చు. ఏ కారణం చేతనైనా నిర్ధేశించిన రోజు పత్తి తీసుకెళ్లనట్లయితే స్లాట్ రద్దువుతుంది. అంతేకాకుండా నిజమైన రైతులు మాత్రమే సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే అవకాశం ఉంటుంది. 5,64,585 ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ ఏడాది 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. మంచి అదునైన వర్షాలు కురవడంతో పత్తి చేలు మంచి ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల చొప్పున సగటున దిగుబడి వచ్చినా సుమారు 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. గతేడాది 24 సీసీఐ కేంద్రాల ద్వారాా సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఈసారి పత్తి దిగుబడి పెరుగుతుందని.. ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉంటే రూ.8,110 మద్దతు ధర దక్కనుంది. సీసీఐ కేంద్రాలు ఇక్కడే.. ఫ దేవరకొండ వ్యవసాయ మార్కెట్ పరిధిలో శివగణేష్ కాటన్ ఇండస్ట్రీస్ చిన్న అడిశర్లపల్లి, తిరుమల కాటన్ ఇండస్ట్రీ బ్రాహ్మణపల్లి, హైద్రాబాద్ కాటన్ ఇండస్ట్రీ చెన్నారం, సాంభశివ కాటన్, జిన్నింగ్ మిల్ చిల్కమర్రి. శ్రీ తిరుమల కాటన్ ఇండస్ట్రీస్ చిల్కమర్రి. ఫ నల్లగొండ వ్యవసాయ మార్కెట్ పరిధిలో లలితా పరమేశ్వరి కాటన్ ఇండస్ట్రీస్ కొప్పోల్, సత్యనారాయణ కాటన్ ఇండస్ట్రీస్ రామలింగాలగూడెం. ఫ నకిరేకల్ పరిధిలో వెంకటకృష్ణ కాటన్ ఇండస్ట్రీస్ నెల్లిబండ, తైల్ ఫైబర్స్ పామనగుండ్ల, శ్రీనాత్ కాటన్ ఫైబర్స్ అయిటిపాముల. ఫ చిట్యాల పరిధిలో వరలక్ష్మి కాటన్ లిమిటెడ్, కృష్ణా కాటన్ మిల్ చిట్యాల. ఫ చండూరు పరిధిలో మంజిత్ ఫైబర్ బంగారిగడ్డ, కార్తికేయ కాటన్ ఇండస్ట్రీ మునుగోడు, సరళ బాలజీ కాటన్ ఇండస్ట్రీ మునుగోడు, శివరామ కాటన్ ట్రేడర్స్ కొంపెల్లి. ఫ మాల్ వెంకటేశ్వరనగర్ పరిధిలో వెంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీస్, లక్ష్మీ నరసింహా ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీ శివసాయి కాటన్ జిన్నింగ్ మిల్, విష్ణుసాయి కాటన్ ఇండస్ట్రీస్, హరిహర కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్, పద్మావతి కాటన్ ఇండస్ట్రీస్, ఓంసాయి కాటన్ ఇండస్ట్రీస్. ఫ శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ పరిధిలో టీఆర్ఆర్ కాటన్ మిల్స్ మాధారం. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుకు మార్కెటింగ్‌శాఖ కసరత్తు ఫ ఈ ఏడాది 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా ఫ క్వింటాకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించిన కేంద్రం ఫ స్లాట్ బుకింగ్ విధానంలో కొనుగోళ్లు -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
వేములపల్లి : పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం వేములపల్లి పీహెచ్‌సీని ఆమె ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీహెచ్‌సీలోని వైద్యులు, ఆర్బీఎస్కే బృందాలు, అంగన్వాడీలు తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు నిరంతరం ఆరోగ్య పరీక్షలను నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. ఆమె వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ కేస రవి, మండల వైద్యాధికారి సుచరిత, ముస్తాక్‌అహ్మద్, ఎంపీడీఓ దండ జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ హేమలత, శాంతాకుమారి, ఆర్ఐ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
స్కూల్ బస్సులకు ప్రాక్సిమిటీ మిర్రర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఇటీవల జరిగిన స్కూల్ బస్ ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. పది రోజుల వ్యవధిలో రెండు స్కూల్ బస్‌ల కింద ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో జిల్లాలో సంచలనం సృష్టించింది. దీంతో ప్రమాదాల నివారణకు రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. స్కూల్ బస్సులకు ప్రాక్సిమిటీ మిర్రర్లు (కుంభాకార దర్పణాలు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్కూల్ బస్సు 360 డిగ్రీల్లో కనిపించేలా అద్దాలు బిగించుకోవాలని రవాణా శాఖ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది. బస్సు పూర్తిగా కనిపించేలా.. ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి స్కూల్ బస్‌కు కుడి, ఎడమ పక్కన, ముందుభాగం, వెనుక భాగం కనిపించేలా ప్రాక్సిమిటీ మిర్రర్లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. బస్సులకు ముందు భాగంగా సైడ్‌కు ఉండే ఈ అద్దాల్లో బస్‌కు ఉన్న చక్రాలు, బంపర్, రోడ్డు అంతా కనిపిస్తుంది. దాంతో అక్కడకు పిల్లలు వస్తే డ్రైవర్‌కు అద్దంలో చూస్తే కనిపిస్తుంది. డ్రైవింగ్ సీటుకు ముందు బస్ బయట నుంచి పెద్ద మిర్రర్‌ను ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా బస్ ముందు ఎవరైనా చిన్న పిల్లలు వెళ్లినా అద్దంలో నుంచి డ్రైవర్‌కు కనిపిస్తుంది. నెల రోజుల్లో ఏర్పాటు చేయాల్సిందే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,649 స్కూల్ బస్సులు ఉండగా, అందులో కాలం చెల్లినవి, మరో ఒకటీ రెండు నెలల్లో కాలం చెల్లే బస్సులు, మూసివేసిన పాఠశాలలకు చెందినవి 54 ఉన్నాయి. వాటిని మినహాయించి మిగతా 1,595 స్కూల్ బస్‌లకు ప్రాక్సిమిటీ మిర్రర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో నల్లగొండ జిల్లాలో 699, సూర్యాపేట జిల్లాలో 522, యాదాద్రి భువనగిరి జిల్లాలో 337 ఉన్నాయి. వీటికి నెల రోజుల్లోగా ప్రత్యేకంగా ఆయా అద్దాలను బిగించాలని రవాణ శాఖ ఆయా పాఠశాలల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. రెండురోజుల కిందట ఆయా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు నల్లగొండ ఎంవీఐ లావణ్య తెలిపారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు సంఘటనల్లోనూ ప్రమాదానికి కారణమైన బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయని వెల్లడించారు. స్కూల్ బస్‌లను ఎప్పటికప్పుడు ఫిట్నెస్తో పాటు మిర్రర్లు అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు రవాణ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ కోసం వచ్చిన ఎంవీఐలు, స్థానిక రవాణా శాఖ సిబ్బందితో కలిపి 13 బృందాలను రవాణ శాఖ ఏర్పాటు చేసింది. స్కూల్ బస్సుల వల్ల పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎంతో విలువైన పిల్లల ప్రాణాలను కాపాడేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకంగా అద్దాలను బిగించేలా చర్యలు చేపడుతున్నాం. బస్సు చుట్టూ అన్ని వైపులా కనిపించేలా, పిల్లలు పూర్తిగా బస్సుకు దూరంగా వెళ్లారా? లేదా? అన్నది డ్రైవర్ ఆయా అద్దాల్లో చూసుకొని వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం. – వాణి, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ బస్సు 360 డిగ్రీల్లో కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఫ ఇటీవల జిల్లాలో స్కూల్ బస్సుల కింద పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత ఫ ప్రమాదాల నివారణ పై దృష్టిపెట్టిన రవాణా శాఖ యంత్రాంగం ఫ నెల రోజుల్లోగా మిర్రర్లు ఏర్పాటు చేయాలని ఆదేశం ఫ బస్సుల ఫిట్నెస్, ఇతర అంశాలపై తనిఖీలకు ప్రత్యేక బృందాల ఏర్పాటు -
ఎంజీయూలో 32 అంశాలకు ఆమోదం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన అకాడమిక్ సెనేట్ సమావేశంలో 32 అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా డీన్ల నియామకం, పీహెచ్డీ ఎర్లీ సబ్మిషన్, వన్‌టైం చాన్స్ పరీక్షల నిర్వహణ, బడ్జెట్ ఆమోదం లాంటివి మొత్తంగా 32 అంశాలపై సభ్యులు చర్చించి ఆమోదించారు. సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మహమూద్ అలీ, రిజిస్ట్రార్ అలువాల రవి, పూర్వ వీసీలు గంగాధర్, ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, ప్రొఫెసర్ భాగ్యనారాయణ, పూర్వ రిజిస్ట్రార్లు కన్మంతరెడ్డి నరేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ ధర్మానాయక్, జి.ఉపేందర్‌రెడ్డి, మద్దిలేటి, ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
టెయిల్‌పాండ్‌ను సందర్శించిన కేఆర్ఎంబీ చైర్మన్
అడవిదేవులపల్లి : అడవిదేవులపల్లి సమీపంలో గల టెయిల్‌పాండ్‌ను శుక్రవారం కృష్ణానది జలాల బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ బిపి.పాండే సందర్శించారు. టెయిల్‌పాండ్‌కు సంబంధించిన వివరాలను డ్యాం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువనున్న నాగార్జునసాగర్ జలాశయం నుంచి వస్తున్న నీరు ఎంత మేరకు పులిచింతలకు విడుదల, విద్యుత్ ఉత్పాదన, గేట్ల సామర్థ్యంను అడిగి తెలుసుకున్నారు. శనివారం పులిచింతల ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఆయన వెంట కమిటీ సభ్యులు కమల్, జెన్కో ఎస్ఈ వెంకటరమణ, శ్రీనివాసులు, ఈఈ సుబ్రహ్మణ్యం, జయశంకర్, గిరిబాబు, మహముద్, మల్లేష్ తదితరులు ఉన్నారు. -
బాధితులకు భరోసా సెంటర్ అండ : ఎస్పీ
నల్లగొండ : లైంగిక వేధింపులకు గురైన మహిళలకు భరోసా సెంటర్ అండగా ఉంటుందని ఎస్పీ శరత్‌చంద్రపవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని భరోసా సెంటర్‌ను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. లైంగికదాడులు, వేధింపులకు గురవుతున్న బాలికలు, మహిళల పట్ల సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించి పని చేయాలని ఆదేశించారు. పోక్సో కేసులపై బాధితులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం భరోసా కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. సిబ్బంది విధులపై పూర్తి వివరాలు అడిగి.. పలు సూచనలు చేశారు. వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడిన వారికి జైలు శిక్ష తప్పదన్నారు. జిల్లాలో 19 పోక్సో కేసుల్లో 20 మంది నిందితులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ కరుణాకర్, భరోసా సెంటర్ సిబ్బంది అంజలి, గౌస్, నళిని పాల్గొన్నారు. -
రోజూ ఎదురుచూసుడే..
పెద్దవూర : యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. పెద్దవూర మండల కేంద్రంలో ఒకేరోజు మూడుసార్లు రోడ్డెక్కారు. శ్రీరాంనాయక్ అనే రైతు తాను నాలుగైదు రోజులుగా యూరియా కోసం వస్తున్నా ఒక్క బస్తా దొరకలేదని మండల కేంద్రంలోని కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో మిర్యాలగూడెం, సాగర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి శ్రీరాంనాయక్‌ను రోడ్డుపై నుంచి పంపించి వేశారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి చొరవ తీసుకుని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, కలెక్టర్‌తో మాట్లాడి మాధ్యాహ్నానికి రెండు లారీల్లో యూరి యా తెప్పించారు. అంతకుముందే ఓ లారీ యూరి యా ఉండడంతో శుక్రవారం ఒక్కరోజే 1320 బస్తాల యూరియాను ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లింగా రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ మండలానికి రానంత యూరియా పెద్దవూరకు తెప్పించినట్లు తెలిపారు. మండలానికి ఇప్పటికే 1600 టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. ఫ యూరియా కోసం రైతుల ఆందోళన ఫ పంట దిగుబడి తగ్గుతుందని ఆవేదన -
విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేసిన కేటీఆర్
రామగిరి(నల్లగొండ) : మండలంలోని అన్నెపర్తి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని విజయలక్ష్మికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ల్యాప్‌టాప్ అందజేశారు. విజయలక్ష్మి తండ్రి లింగయ్య ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో విద్యార్థిని చదువుకు అండగా ఉండేలా శుక్రవారం ల్యాప్‌టాప్ అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకల అరవింద్‌రెడ్డి, నాయకులు హరీష్‌రెడ్డి, పొగాకు గట్టయ్య, బాకి నాగయ్య, మామిడి స్వామి పాల్గొన్నారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి మునుగోడు : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘స్వస్తినారి స్వస్తిక్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ సీ్త్రలలో అనారోగ్యలను తగ్గించేందుకు ప్రత్యేక నిపుణుల చేత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య పరీక్షలు చేసి అవసరమైనవారికి మందులు ఇవ్వడంతో పాటు శస్త్ర చికిత్సల ద్వారా నయం చేస్తామన్నారు. ఈ వైద్య శిబిరానికి 101 మంది మహిళలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ యుగేందర్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్లు వింద్యావల్లి, నర్మద, మాధురి, సిబ్బంది పాల్గొన్నారు. అవసరం మేరకే యూరియా కొనాలిరామగిరి(నల్లగొండ) : రైతులు ప్రస్తుతం పంటకు అవసరం ఉన్న మేరకు మాత్రమే యూరియా కొనుగోలు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌కుమార్ సూచించారు. శుక్రవారం నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి రైతు వేదిక వద్ద యూరియా విక్రయాన్ని ఆయన పరిశీలించారు. యూరియా సరఫరా నిరంతరం జరుగుతుందని రాబోయే పంటలకు ఇప్పుడే కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. దాని వల్ల ప్రస్తుతం అవసరం ఉన్న రైతులు ఇబ్బందులు పడతారన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బోధన అభ్యసనలో టీఎల్ఎం తప్పనిసరి
నల్లగొండ : బోధన అభ్యసన ప్రక్రియలో టీఎల్ఎం తప్పనిసరని డీఈఓ భిక్షపతి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని డైట్ కళాశాలలో జిల్లాస్థాయి బోధనాభ్యాస సామగ్రి మేళా (టీఎల్ఎం)లో ఆయన మాట్లాడారు. టీఎల్‌ఎంతో బోధన సులభమని, ఈ ప్రక్రియ విద్యార్థులకు పాఠాలపై ఆసక్తి పెంచేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ మేళాలో సుమారు 342 మంది ఉపాధ్యాయులు పాల్గొని భాషా పాఠాలు, అక్షరమాల, పదబంధాలు, కథాచిత్రలు, గణితం, పర్యావరణం, జంతువులు, పక్షులు, సైన్స్ ప్రయోగాలు తదితర అంశాలతో రూపొందించిన టీఎల్ఎంలు ప్రదర్శించారు. ఈ మేళాలో ఉత్తమ ప్రదర్శనలు చేసిన 8 మంది ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీఈఓ తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికై న వారికి సర్టిపికెట్లు, మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ రామచంద్రయ్య, డైట్ లెక్చరర్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.ఫ డీఈఓ భిక్షపతి -
నిల్వ చేసిన యూరియా పంపిణీ
మిర్యాలగూడ : మండలంలో యూరియా పక్కదారి పట్టించుందుకు చేసిన యత్నాన్ని రైతులు, అధికారులు భగ్నం చేశారు. మండలంలోని గూడూరు గ్రామపంచాయతీ పరిధిలోని బోట్యానాయక్తండాలోని ఓ ఫర్టిలైజర్ షాపునకు సంబంధించిన గోదాములో 222 బస్తాల యూరియాను గురువారం దిగుమతి చేసినట్లు సమాచారం. వాటిని వెంటనే రైతులకు పంపిణీ చేయాల్సి ఉన్నా.. గురువారం సాయంత్ర వరకు ఇవ్వకుండా నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న రైతులు అధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం అధికారులు అక్కడికి చేరుకుని యూరియాను రైతులకు పంపిణీ చేశారు. కాగా యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించిన డీలర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఇన్చార్జి ఏడీఏ సైదానాయక్ తెలిపారు. -
నివేదిక పంపించాం
డిండితోపాటు చెర్కుపల్లిలోని ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో యాసంగి సీజన్లో వేరుశనగ పంట సాగుకుగాను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే సాగు పనులు ప్రారంభిస్తాం. – వాసు, ఏడీఏ, విత్తనోత్పత్తి కేంద్రం, డిండి మండలంలో రెండు చోట్ల ఏర్పాటు చేసిన ప్రభుత్వ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో వివిధ పంటలు సాగుచేయాలి. మేలురకం విత్తనాలు సబ్సిడీపై అందించాలి. తద్వారా రైతులు అధిక ప్రయోజనం పొందుతారు. – మూడావత్ శ్రీను, రైతు డిండి -
వినూత్నంగా పోషణ మాసం
నల్లగొండ : అంగన్వాడీల ఆధ్వర్యంలో పోషణ మాసాన్ని వినూత్నంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ, తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కిచెన్ గార్డెన్ల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. సొంత భవనాలు ఉన్న 625 అంగన్వాడీ కేంద్రాల్లో కనీసం 425 కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ పెంచాలని ఆదేశించారు. ప్రహరి గోడలు లేని కేంద్రాలను బయో పెన్షింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలకు పోషణలో మగవారిని భాగస్వామ్యం, స్థానిక వంటకాలను ప్రోత్సహించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం పోషణ మాసం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్య క్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఎంహెచ్ఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్‌రెడ్డి, సీడీపీఓలు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
మూడేళ్ల నుంచి బిల్లులివ్వరా..
నల్లగొండ: బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రభుత్వం ఎంపిక చేసిన పేద విద్యార్థులకు విద్యనందించే ప్రైవేట్ పాఠశాలలు యాజ మాన్యాలకు మూడేళ్లుగా బిల్లులు అందక ఆందోళనకు గురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి పదవ తరగతి వకు రెసిడెన్షియల్, డే స్కాలర్ కింద 1వ తరగతి విద్యార్థులకు విద్యాబోధన అందిస్తుంది. అయితే మూడేళ్ల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. 12 పాఠశాలల ఎంపిక జిల్లాలో 12 ప్రైవేట్ పాఠశాలలను బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదివే రెసిడెన్షియల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.42 వేలు, నాన్ రెసిడెన్షియల్ విద్యార్థికి రూ.28 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే ఈ డబ్బులకు ఆ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద బోధించే పాఠశాలలు ప్రతి విద్యార్థికి ఏటా టెస్ట్ బుక్స్‌తోపాటు నోటుబుక్కులు, రెండు జతల యూనిఫామ్, రెండు జతల షూ ఇవ్వడంతో పాటు వారికి హాస్టల్ వసతి కల్పించి భోజనం అందిస్తున్నాయి. ఆయా పాఠశాలలకు మూడేళ్ల నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో రూ.6.81 కోట్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి.ఫ బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల యాజమాన్యాల ఆవేదన ఫ రూ.6.81 కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ ఫ కలెక్టరేట్లో సంక్షేమ భవన్ వద్ద ఆందోళన ఫ ఎస్సీ సంక్షేమ కార్యాలయంలో వినతిపత్రం అందజేత పాఠశాలలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇలా.. (రూపాయల్లో..) సంవత్సరం చెల్లించాల్సిన బిల్లులు 2022–23 70,70,8522023–24 2,91,67,880 2024–25 3,19,20,000 మొత్తం 6,81,58,732 -
తిరుమలగిరి సాగర్ మండలంలో భూములపై హక్కులు
మండలంలో చేపట్టిన భూభారతి సర్వేలో బోగస్ పట్టా పాస్‌బుక్కులు కలిగి ఉన్న రైతులు ఉన్నట్లు తేలింది. 2,936 ఎకరాల భూమిపై 3,069 మంది రైతులు బోగస్ పాస్ పుస్తకాలు కలిగి ఉన్నట్లు తేల్చింది. వీటిని ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ గతంలోనే బోగస్ కృష్ణ‘పట్టా’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బోగస్ పట్టాలను సృష్టించి వివిధ పథకాలు పొందుతూ రూ.కోట్లు కొల్లగొట్టినట్లు ఈ కథనంలో పేర్కొంది. భూములు తమ ఆధీనంలోనే ఉన్నా ధరణి కారణంగా హక్కులను కోల్పోయిన వారి పరిస్థితులను కూడా సమగ్రంగా వివరించింది. ఇప్పుడు ప్రభుత్వం ఆ విషయాలన్నీ అధికారికంగా నిర్ధారించింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలోని తిరుమలగిరి సాగర్ మండలంలోని 13 గ్రామాలకు చెందిన 4,219 మంది రైతులకు కొత్తగా పాస్‌బుక్కులు అందనున్నాయి. 4,037 ఎకరాలపై ఆయా రైతులకు హక్కులు దక్కబోతున్నాయి. వారందరికీ ప్రభుత్వం త్వరలోనే పట్టాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూభారతి అమలులోకి తీసుకొచ్చిన తర్వాత జిల్లాలోని తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంది. ఆ మండలంలోని 235 సర్వే నంబర్లను గుర్తించి వాటి పరిధిలోని 23 వేల ఎకరాల్లో సర్వే నిర్వహించి, 12 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించింది. అందులో 8,037 ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉన్నట్లు తేల్చింది. అందులోనూ 4 వేల ఎకరాలకు సంబంధించి రైతులు ఇప్పటికే పాస్‌బుక్కులు కలిగి ఉండి భూమిని సాగు చేసుకుంటున్నట్లు తేల్చింది. మరో 4,037 ఎకరాల పరిధిలో పాస్‌బుక్కులు లేకుండా సాగు చేసుకుంటున్నారని, వారందరికీ హక్కులు కల్పించాలని నిర్ణయిచింది. మరోవైపు తల్లిదండ్రులు చనిపోయిన వారికి పౌతి ద్వారా భూభారతిలో హక్కులను కల్పించేలా చర్యలు చేపట్టింది. చింతలపాలెంలో ఎక్కువ మందికి లబ్ధి మండలంలోని చింతలపాలెం గ్రామంలో అధిక విస్తీర్ణంలో అత్యధికంగా 1,288 మంది రైతులకు భూములపై పూర్తిస్థాయి హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆయా భూములను సాగు చేసుకుంటున్న రైతులుగా వారి పేర్లను భూభారతిలో నమోదు చేసింది. 519 మంది రైతులకు 591 ఎకరాల భూమిపై హక్కులు కల్పించనుంది. అతి తక్కువగా జమ్మికుంట గ్రామంలో 41 మంది రైతులకు 22 ఎకరాల్లో పట్టాలను అందజేయనుంది. పాస్‌బుక్కులు అందుకోనున్న రైతులు గ్రామం రైతులు ఎకరాలు చింతలపాలెం 1,288 1,537 నెల్లికల్ 420 364 తునికినూతల 261 344 తిరుమలపాలెం 519 591 ఎల్లాపురం 264 241 రాజవరం 350 179 నేతాపూర్ 345 261 కొంపల్లి 180 123 కొన్నేరుపురం 163 92 అల్వాల 204 197 శ్రీరాంపురం 97 45 సిల్గాపురం 87 35 జమ్మికుంట 41 22 మాకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తిమ్మయపాలెం శివారులోని సర్వే నంబర్ 60లో 1.05 ఎకరాల లావుణి పట్టాలు పంపిణీ చేసింది. 2017 వరకు అన్ని పథకాలు వర్తించాయి. ధరణిలో మా భూమిని పార్ట్–బీలో పెట్టడంతో ఒక్క రైతుబంధు ద్వారానే ఇప్పటి వరకు రూ.90వేలు కోల్పోయిన. ప్రస్తుత ప్రభుత్వం కాస్తుకాబ్జా ఆధారంగా సర్వే చేసి నా భూమి భూభారతిలో నమోదు చేసింది. 1బీ, పహాణీలు సైతం వస్తున్నాయి. ప్రతి సంక్షేమ పథకానికి అర్హున్ని అవుతాను. – మేరావత్ మునినాయక్, నాయకునితండా మా భూములు మొన్నటి వరకు పార్ట్–బీలో ఉండడంతో మాకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు రాలేదు. మేము సేద్యం చేస్తూ భూమిపై కబ్జాలో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి హక్కులు లేవు. మేము పండించిన పంటను కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేకపోయా. దీంతో మేము ఆర్థికంగా చాలా నష్టపోయినాం. నాకు చింతలపాలెం గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 222లో ఉన్న 3 ఎకరాల భూమి భూభారతి పోర్టల్‌లో నమోదై ఉంది. – సఫావత్ పూలా, సఫావత్తండా ఫ 13 గ్రామాల రైతులకు త్వరలోనే పట్టాల పంపిణీ ఫ 4,037 ఎకరాలపై 4,219 మందికి కొత్త పాస్‌బుక్కులు ఫ అత్యధికంగా చింతలపాలెం వాసులకు లబ్ధి ఫ నిరుపేద రైతుల్లో వెల్లివిస్తున్న ఆనందం ఈయన నేనావత్ శంకర్ నాయక్. ఈయనది తిరుమలగిరి(సాగర్) మండలం నాగార్జునపేట తండా. నాగార్జునసాగర్ ముంపు బాఽధితుడు కావడంలో 1978లో అప్పటి ప్రభుత్వం ఈయనకు చింతలపాలెం రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 12లో 2.20 ఎకరాల భూమికి డీఫార్మ్ పట్టా ఇచ్చింది. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ పథకాలతోపాటు బ్యాంకులో రుణాలు పొందారు. గత ప్రభుత్వం ధరణిలో ఈ సర్వే నంబర్‌ను వివాదాస్పద భూముల పేరుతో పార్ట్–బీలో చేర్చింది. దీంతో ఽఆయనకు కొత్త పాస్ పుస్తకం రాలేదు. అప్పటి నుంచి రైతుబంధు, రుణమాఫీ ఆగిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన భూభారతి పైలెట్ సర్వేలో కాస్తు, కబ్జా ఆధారంగా అధికారులు మళ్లీ నమోదు చేశారు. దీంతో ప్రభుత్వాలు అందజేసే సంక్షేమ పథకాలు ఇకనుంచి అందనున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈయనొక్కరే కాదు మండలంలో వేల మంది రైతుల సమస్య తీరబోతోంది. వారందరికీ భూభారతిలో ప్రస్తుత ప్రభుత్వం హక్కులను కల్పిస్తూ త్వరలో పట్టాలు ఇవ్వనుండడంతో తిరిగి సంక్షేమ పథకాలను పొందే వీలు ఏర్పడనుంది. దీంతో ఆయా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం
నల్లగొండ అగ్రికల్చర్: రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని జిల్లా రైతుబంధు సమితి మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుస్తు ప్రణాళికను రూపొందించని కారణంగా ఎరువుల కోసం రైతులు పరుగులు పెడుతున్నారన్నారు. ప్రైవేట్ దుకాణాల్లో వ్యవసాయాధికారుల సమక్షంలో యూరియా విక్రయించాలన్నారు. పంటలకు నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో జిట్ట లింగయ్యయాదవ్, చల్ల ఆంజనేయులు యాదవ్ పాల్గొన్నారు. -
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
పెద్దవూర : విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితేనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె పెద్దవూరమండల కేంద్రంలోని ఎస్టీ బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడారు. ఇంగ్లిష్ బాషపై పట్టు సాధించాలని సూచించారు.మినీ గురుకులానికి అప్రోచ్ రోడ్డు కావాలని కలెక్టర్‌ను సిబ్బంది కోరగా వెంటనే మంజూరు చేశారు. విద్యార్థుల ఆట వస్తువులకు నిధులు మంజూరు చేశారు. అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయంలో పీఎం ఆవాస్ యోజన ఇళ్లనిర్మాణాలపై సమీక్షించారు. ఆ తరువాత చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠం చెప్పారు. ఆమె వెంట గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, తహసీల్దార్ శాంతిలాల్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంఈఓ రాము తదితరులు ఉన్నారు. ఎంపీడీఓ నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపండి తిరుమలగిరి(సాగర్) : ఎంపీడీఓ కార్యాలయ నూతన భవనానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి దేశించారు. గురువారం ఆమె తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం పాత పీఏసీఎస్సీ భవనంలో అరకొర గదులలో కొనసాగుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె స్పందించి పైవిధంగా మాట్లాడారు. ఆమె వెంట గృహనిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, తహసీల్దార్ అనిల్, ఇన్చార్జి ఎంపీడీఓ భిక్షం రాజు ఉన్నారు.ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
దామరచర్లలో ఆందోళన
మిర్యాలగూడ: యూరియా సకాలంలో అందించాలనే డిమాండ్‌తో గురువారం దామరచర్ల మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తెల్లవారుజామున 3గంటల నుంచే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా పట్టించునే నాథుడే లేడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిల్లిపాది వచ్చి క్యూలైన్లో నిల్చొవాల్సిన యూరియా దొరకడం లేదన్నారు. వరినాట్లు పెట్టి నెలరోజులైనా మొదటి విడత యూరియా చల్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇదే పరిస్థితి మరో 15రోజులు కొనసాగితే వరిపంట ఎదుగుదల ఆగి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు యూరియా అందించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డి.ప్రసాద్ అక్కడికి వచ్చి ప్రతి రైతుకు రెండు బస్తాలకు టోకెన్లు ఇప్పించి రైతుల రాస్తారోకోను విరమింపజేశారు. -
20న నల్లగొండలో జాబ్‌మేళా
నల్లగొండ: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 20న ఉదయం 10.30 గంటలకు నల్లగొండలోని ఐటీఐ కళాశాల క్యాంపస్‌లో జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ, ఐటీఐ అర్హత కలిగి 18 నుంచి 35 సంవత్సరాల వయసుగల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు వారి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా 20వ తేదీన జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ :78934 20435 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. నాణ్యమైన పత్తికే మద్దతు ధర నల్లగొండ: రైతులు అన్ని ప్రమాణాలు పాటించి మార్కెట్‌కు తీసుకొచ్చే నాణ్యమైన పత్తికి మద్దతు ధర చెల్లించనున్నట్టు జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ కోరారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లోని తన చాంబర్లో పత్తి కొనుగోళ్లపై ఆయా శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 5,67,613 ఎకరాల్లో పత్తి పంట సాగైందని, 4.54లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రూ.8,110 మద్దతు ధర కల్పించిందన్నారు. గతంలో కంటే రూ.589 పెంచిందన్నారు. రైతులు మద్దతు పొందేందుకు 8 నుంచి 12 శాతం తేమ మించకుండా పత్తిని మార్కెట్‌కు తెచ్చేందుకు అధికారులు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. నాణ్యతలేని పత్తిని సీసీఐ కొనుగోలు చేయదన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, మిల్లుల యజమానులు పాల్గొన్నారు. 20న ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు నల్లగొండ టూటౌన్: ఈనెల 20న నల్లగొండలోని విపస్యా స్కూల్లో ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను ఈ నెల 25నుంచి 28 వరకు మహబూబ్‌నగర్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు పంపుతామని పేర్కొన్నారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఆధార్, పాస్ ఫొటోలతో రావాలని కోరారు. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం హాలియా, నిడమనూరు : పోషకాహారం తీసుకోవడం ద్వారానే కిశోరబాలికలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఐసీడీఎస్ అనుముల ప్రాజెక్టు అధికారిని ఉదయశ్రీ అన్నారు. అనుముల ప్రాజెక్టు హాలియా సెక్టార్ పరిధిలోని హాలియా–2, నిడమనూరు మండలం ముప్పారం అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుల్లో వారు మాట్లాడారు. చిన్నారులకు చదువుతో పాటు పోషకాహారం కీలకమన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చి న్నారులు, కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సదస్సుల్లో హాలియాలో సూపర్వైజర్ రమాదేవి, భవిత స్కూల్ టీచర్ వాణి అంగన్వాడీ టీచర్లు వజ్రమ్మ, విజయ, నర్మద, మంగమ్మ, శంకరమ్మ, నిడమనూరు మండలం ముప్పారంలో సూపర్వైజర్ సైదాబేగం, అంగన్వాడీ టీచర్ నాగమణి, హెల్పర్ లింగమ్మ, పంచాయతీ కార్యదర్శి బాలాజీ నాయక్ పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సా యంత్రం వెండిజోడు సేవలను అర్చకులు సంప్రదాయంగా ఊరేగించారు. వేకువజాము నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠాఅలంకారమూర్తులకు నిజాభిషేకం నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కైంకర్యాలు నిర్వహించారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
నిడమనూరు : నిడమనూరు రైతు ప్రాథమిక సహకార సంఘానికి వారం రోజులుగా యూరియా రాకపోవడంతో గురువారం రైతులు ఆగ్రహించారు. ఉదయం 6 గంటలకే సంఘం కార్యాలయం వద్దకు అక్కడి చేరుకున్న రైతులు వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నిడమనూరుక బస్టాండ్ వద్ద జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై రెండు గంటలకుపైగా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ నిడమనూరు సహకార సంఘానికి ఈ వారంలో యూరియా రాలేదన్నారు. వారం క్రితం పలు ఎరువుల దుకాణాలకు దాదాపు 140 మెట్రిక్ టన్నుల వరకు యూరియా రావడంతో వారు కొందరు రైతులకే ప్రభుత్వ ధరకు అమ్మి మిగతాది అధిక ధరలకు విక్రయించుకున్నారని ఆరోపించారు. నిడమనూరు, వెనిగండ్ల సహకార ఎరువుల విక్రయకేంద్రంలో కొందరు ఉద్యోగులు కూడా అక్రమాలకు పాల్పడి యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని వాపోయారు. సహకార సంఘాల ద్వారానే యూరియాను విక్రయించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే నిడమనూరు ఎస్ఐ శిక్షణకు వెళ్లడంతో, హాలియా ఎస్ఐ సాయిప్రశాంత్ రైతుల వద్దకు వచ్చి వారికి నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు. ఫ నిడమనూరులో జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై రాస్తారోకో ఫ ప్రాథమిక సహకార సంఘాల్లోనే విక్రయించాలని డిమాండ్ యూరియా పంపిణీలో జరిగిన అవకతవకలు, రైతుల రాస్తారోకోపై స్పందించని నిడమనూరు ఏఓ మునికృష్ణయ్యను కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు హాలియా ఏడీ సరిత గురువారం తెలిపారు. నిడమనూరులో గురువారం ఉదయం జడ్చర్ల–కోదాడ రహదారిపై రైతులు ధర్నా చేశారు. ధర్నాపై వ్యవసాయాధికారి సకాలంలో స్పందించలేదని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు స్థానిక పోలీసులు వివరించారు. దీంతో ఎస్పీ వెంటనే ధర్నా వివరాలను కలెక్టర్‌కు వివరించడంతో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం నిడమనూరు మండలం నారమ్మగూడెం, ముకుందా పురం, నిడమనూరు, బొక్కమంతలపహా డ్లోని ఎరువుల దుకాణాలకు వచ్చి యూరియా పక్కదారి పట్టిందనే ఆరోపణలున్నాయి. ఈ విషయాన్నే రైతులు ప్రస్తావించారు. అయితే సస్పెండైన ఏఓ మునికృష్ణయ్య హాలియా, తిరుమలగిరి సాగర్ మండలాలకు ఇన్చార్జి ఏఓగా వ్యవహరిస్తున్నారు. -
125 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు
నల్లగొండ: జిల్లా విద్యా శాఖలో 125 మంది ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ తదితర ఉపాధ్యాయులను కలెక్టర్ అనుమతితో డీఈఓ భిక్షపతి సర్దుబాటు చేశారు. ఈ జాబితాను గురువారం విడుదల చేశారు. ఇటీవల విద్యా శాఖ కమిషనర్ అవసరం ఉన్నచోట ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో దానికి అనుగుణంగా జిల్లాలో ఎక్కడైతే విద్యార్థుల కంటే ఎక్కువగా ఉపాధ్యాయులు ఉన్నారో వారిని అవసరమున్న చోటకు సర్దుబాటు చేస్తు డిప్యుటేషన్లు ఇచ్చారు. వారందరినీ సంబంధిత పాఠశాలల్లో వెంటనే విధుల్లో చేరాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారిని రిలీవ్ చేసేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని డీఈఓ ఆదేశించారు.ఫ జాబితా విడుదల చేసిన డీఈఓ ఫ వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశం ఫ నిబంధనలకు విరుద్ధంగా చేశారంటున్న యూటీఎఫ్ -
ఇంటర్ ఫలితాల పెంపుపై దృష్టి పెట్టాలి
నల్లగొండ : ఇంటర్మీడియట్ ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోడల్ స్కూల్స్, కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, మోడల్ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో సమీక్షించారు. ఇంటర్ కళాశాలల్లో ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ విధానం తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మట్లాడుతూ ఇంటర్ కళాశాలల్లో నూటికి నూరు శాతం పేస్ రికగ్నిషన్ సిస్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం, అభ్యసన సామర్థ్యం పెంచాలన్నారు. సమావేశంలో డీఐఈఓ దస్రూనాయక్, డీఈఓ భిక్షపతి, ఆర్సీఓ స్వప్న, బలరాం తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయాలి రామగిరి(నల్లగొండ): పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నల్లగొండ మండలంలోని దోమలపల్లిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను బుధవారం ఆమె పరిశీలించారు. దోమలపల్లికి 70 ఇళ్లు మంజూరు కాగా.. 56 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్ వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ పరశురామ్ పాల్గొన్నారు. 17ఎన్ఎల్సి304 : ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
బీఆర్ఎస్.. జాతీయ సమైక్యతా దినోత్సవం
నల్లగొండ టూటౌన్: బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బండా నరేందర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, చీర పంకజ్‌యాదవ్, మాలే శరణ్యారెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
ఫ సీపీఎం పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరత్ ఫ నల్లగొండలో సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు నల్లగొండ టౌన్ : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఆనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించి అబద్ధపు ప్రచారం చేయడాన్ని ఆపాలని సీపీఎం పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరత్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం బందాకరత్ మాట్లాడుతూ భారత చరిత్రలో సెప్టెంబర్ 17 లిఖించబడిందని, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17న 1948న ఇండియన్ యూనియన్‌లో విలీనమైందన్నారు. ఒక సంవత్సరం పాటు జరిగిన పరిణామాలను వక్రీకరించి రకరకాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రక్షణమంత్రి హైదరాబాద్ వస్తూ తనతో పాటు అబద్దాలు తయారు చేసే మిషన్ తెచ్చారని ఎద్దేవా చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం రాజు, హిందువులకు జరిగిన పోరాటమని చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల గ్రామాలను సందర్శించి చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. ఆనాడు దేశంలో మరోప్రాంతం జమ్ముకశ్మీర్ కూడా విలీనమైందని అక్కడ రాజు హరిసింగ్ హిందూ, ప్రజలు ముస్లింలు అక్కడ ఎందుకు ఇలా ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. దేశంలో ముస్లింలు, హిందువులు, సిక్కులు సబ్బండ వర్గాలు స్వాతంత్య్రం కోసం పోరాడాని గుర్తు చేశారు. నైజాంతో పాటు లక్షల ఎకరాల భూములను చేతిలో పెట్టుకున్న భూస్వాములు, దోపిడీదారులపై జరిగిన ఉద్యమమే వీర తెలంగాణ సాయుధ పోరాటమన్నారు. ఆనాటి అమరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు మర్రిగూడ బైపాస్ నుంచి సుభాష్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, బొంతల చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, నాగార్జున, ప్రమీల, హశం, ప్రభావతి, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, ఎండీ.సలీం, సత్తయ్య, అనురాధ, నన్నూరి వెంకట రమణారెడ్డి, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలర్పించింది కమ్యూనిస్టులే..
ఫ సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నల్లగొండ టౌన్ : భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసింది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు సందర్భంగా నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధులకు పింఛన్లను ఇవ్వకుండా నిలిపివేసి అవమానపరిచిన బీజేపీ.. నేడు విమోచనం పేరుతో సభలు పెట్టడం వెనుక ఏ కుట్ర దాగిఉందో ప్రజలకు అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గసభ్యుడు మల్లేపల్లి ఆదిరెడ్డి, శ్రవణ్‌కుమార్, పబ్బు వీరస్వామి, కర్ర సైదిరెడ్డి, లెనిన్, బూడిద సురేష్, యాదయ్య, ముండ్ల ముత్యాలు, దోటి పాండరి, కోమటిరెడ్డి ప్రధుమ్మరెడ్డి, యూసుఫ్, వీరయ్య, వెంకటయ్య, రాములు, విజయరెడ్డి, విజయ, దేవేందర్, చారి, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. -
అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవ’
నల్లగొండ : ప్రతి గ్రామ పంచాయతీలో అక్టోబరు 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం డీఆర్డీఏ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని గ్రామీణ పంచాయతీ అధికారులకు సూచించారు. ప్రతి ఉద్యోగి ఇంటి పరిసరాలతో పాటు కార్యాలయ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రవణ్‌కుమార్, వేణుగోపాలరావు, వెంకన్న, మెయినుద్దీన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మూసీకి కొనసాగుతున్న వరదకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీటి రాక కొనసాగుతోంది. ఎగువ నుంచి 3,523 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా.. బుధవారం అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్‌గేట్లను పైకెత్తి 2,625 క్యూసెక్కుల నీటిని దిగవకు వదులుతున్నారు. కాల్వలకు 552 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సీపేజీ ఆవిరి రూపంలో 60 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎంజీయూలో నూతన అధిపతుల నియామకం నల్లగొండ టూటౌన్: నల్లగొండ పట్టణ సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బుధవారం వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి ఎం. జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి జి. ఉపేందర్‌రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి శాంతకుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్‌గా ఆర్. రూప నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారిని వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు. -
‘బాలెంల’ బలగంతో తిరుగుబాటు
సూర్యాపేట అర్బన్: సాయుధ పోరాటంలో భాగంగా 1946 అక్టోబర్ 18న తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు బాలెంల గ్రామాని చుట్టుముట్టారు. అప్పటికే గ్రామంలో ఉన్న నాయకులు పసిగట్టి తీవ్రంగా ప్రతిఘటించారు. తప్పని పరిస్థితుల్లో గ్రామ యువకులు గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మట్టారెడ్డి, సుంకు రంగయ్య, జమాల్ సాబ్, చాకలి భిక్షం, చాకలి చెన్నయ్య చేతికి అందిన గునపాలు, ముల్లు కరల్రు, రోకల్లలో పోలీసులతో గంటకు పైగా భీకర యుద్ధం చేశారు. పోలీసుల తుపాకులు లాక్కొని వారిని ఉరికించారు. దీంతో పోలీసులు పారిపోయారు. తిరిగి దొంగచాటుగా 25 మంది పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి విక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఆయుధాలు లేని యువకులు పోలీసు మూకలను ఎదుర్కోవడం సాధ్యం కాలేదు. పోలీసుల కాల్పుల్లో గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మట్టారెడ్డి అమరులయ్యారు. -
ఎండు ఆకు తెగులు.. నివారణ చర్యలు
త్రిపురారం: ఉమ్మడి జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పంటలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బ్యాక్టీరియా సోకడం వల్ల ఎండు ఆకు తెగులు ఉదృతిని అధికంగా ఉంది. దీంతో రైతులు సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టాలని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. ఎండాకు తెగులు గుర్తించే పద్ధతులు, నివారణ చర్యలు ఆయన మాటల్లో... తెగులు సోకడానికి కారణాలు ఆగస్టు–సెప్టెంబర్ మధ్యలో ఉండే వాతావరణ పరిస్థితులు, మబ్బులతో కూడిన వాతావరణం రెండు నుంచి మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా వరిలో ఎండాకు తెగులు ఆశించడానికి దోహదం చేస్తాయి. నారు మడి దళ నుంచి గింజ పాలు పోసుకునే వరకు ఈ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. చెట్టు నీడ పడే ప్రదేశంలో ఎక్కువగా ఎండాకు తెగులు ఆశించి మిగిలిన పంటకు వేగంగా వ్యాప్తిస్తుంది. గుర్తించే విధానం వరి పంటలో ఎండాకు తెగులు సోకిన ప్రదేశంలో ముందుగా ముదురు ఆకులకు పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కింది అంచుల వెంబడి వ్యాప్తించి ఎండుతూ వస్తాయి. ఉదయం సమయంలో గమనించినట్లయితే ఆకుల మీద పసుపు రంగు జిగురు ముద్దలు కనబడతాయి. ఎండ వేడిమికి గట్టిపడి రాలిపోతాయి. ఈ ఎండిన బాక్టీరియా ముద్దలు నీటి ద్వారా వెళ్లి మిగిలిన పంటకు వ్యాప్తిస్తుంది. నివారణ చర్యలు బ్యాక్టీరియా వ్యాప్తి నివారణకు తెగులు సోకిన మొక్కల నుంచి ఆరోగ్యకరమైన పంటకు నీరు పారకుండా చూసుకోవాలి. తెగులు ఆశించిన పొలంలో నత్రజని వేయకూడదు. కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు మరియు ప్లాంటోమైసిన్ 4 గ్రాములు (లేదా) పోషామైసిన్ (లేదా) స్ట్రైప్లోసైక్లిన్ 4 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి 2 నుంచి 3 సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. -
ఉరి కంబానికి తలొగ్గని పోరు బిడ్డలు
మిర్యాలగూడ: సాయుధ పోరు సాగిస్తున్న సమయంలో ఉమ్మడి జిల్లాలోని అక్కినేపల్లి, షాబ్దుల్లాపురం గ్రామాల్లో జరిగిన హత్య కేసులో జిల్లాకు చెందిన 12 మందికి ఉరి శిక్ష పడింది. అది ‘తెలంగాణ 12’గా అంతర్జాతీయంగా సంచలనం రేపింది. హైదరాబాద్ గవర్నర్ ప్రత్యేక ట్రిబ్యూనల్ వీళ్ల కేసుపై విచారించింది. సైనిక గవర్నర్ ఆదేశాల మేరకు నల్లగొండలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ట్రిబ్యూనల్‌లో 1949 ఏప్రిల్ 7న నమోదైన క్రిమినల్ కేసుల్లో 1949 ఆగస్టు 13, 14న ఇచ్చిన తీర్పుతో 12 మందికి మరణశిక్ష విధించారు. ఇందులో నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, దోమల జనార్దన్‌రెడ్డి, గార్లపాటి రఘుపతిరెడ్డి, దూదిపాల చినసత్తిరెడ్డి, మేరా హనుమంతు, మాగి వెంకులు, దాసరి నారాయణరెడ్డి, వడ్ల మల్లయ్య, ఎర్రబోతు రాంరెడ్డి, మిర్యాల లింగయ్య, కల్లూరి ఎల్లయ్య, గులాం దస్తగిరి ఉన్నారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రాకముందే ఉరిశిక్ష అమలు చేసేందుకు యత్నించారు. ఈ వార్త జాతీయ, అంతర్జాతీయంగా ప్రచారమైంది. లండన్ నుంచి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ లాయర్స్ అధ్యక్షుడు డీఎన్. ప్రిట్, బొంబాయ్ నుంచి డేనియల్ లతీఫ్, గణేష్ షాన్‌బాగ్ వంటి న్యాయవాదులు హైదరాబాద్‌కు చేరుకుని అప్పటి స్థానిక న్యాయవాది మనోహర్‌లాల్ సక్సేనాతో కలిసి మరణశిక్ష ఆపే ప్రయత్నం మొదలుపెట్టారు. అంతర్జాతీయ సంస్థలు వారి మరణశిక్షలు రద్దు చేయాలని అప్పటి ప్రధాని నెహ్రూను విజ్ఞప్తి చేశాయి. హైదరాబాద్ స్టేట్ హైకోర్టు ఇచ్చిన ఈ మరణశిక్షల తీర్పును భారత సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పటికీ అది వీగిపోయింది. అంతర్జాతీయ న్యాయవాది డీఎన్.ప్రిట్ స్వయంగా కేసు చేపట్టడం వల్ల విదేశీ విలేకరులు, రాయబారుల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ వారి మరణశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మారుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్కరు 6 నుంచి 8 సంవత్సరాలు శిక్షలు అనుభవించి 1956లో కొందరు, 1958లో మరికొందరు విడుదల అయ్యారు. తెలంగాణ చరిత్రలో అతి ముఖ్యమైన ఈ ఉదంతానికి తగిన ప్రాముఖ్యత దక్కలేదు. -
బాల సంఘంలో చేరి వడిసెలు పట్టాం
రామన్నపేట: రజకార్లతో పోరాటం సమయంలో నా వయస్సు 14 సంవత్సరాలు. కమ్యూనిస్టు నాయకులు ఆరుట్ల రామచంద్రారెడ్డి, కాచం కృష్ణమూర్తి పిలుపు మేరకు నాతో పాటు పలువురు కలిసి బాల సంఘంలో చేరాం. ఉద్యమాన్ని అణచివేసేందుకు మా గ్రామంలో డాగ్ బంగ్లాను నిర్మించారు. అందులో మిలిటరీ క్యాంపు ఉండేది. ఒకసారి మిలిటరీ తుపాకీ మాయమైంది. దీంతో అనుమానం వచ్చిన ప్రతిఒక్కరిని క్రూరంగా హింసించారు. వడిసెలు, కారంపొడి పట్టుకొని సాయుధ పోరాటంలో పాల్గొన్నాం. మా కంటే ముందు గ్రామానికి చెందిన చాలా మంది యువకులు సంఘంలో పనిచేశారు. – ఉయ్యాల లక్ష్మీనర్సు, సాయుధ పోరాట యోధుడు, మునిపంపుల -
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పెద్దవూర: పెద్దవూర మండలం చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి గాను 9వ, 11వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 9వ తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉండాలని, 01–05–2011 నుంచి 31–07–2013 మధ్య జన్మించి ఉన్నవారు అర్హులని తెలిపారు. అదేవిధంగా 11వ తరగతిలో ప్రవేశానికి గాను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదువుతూ ఉండాలని, 01–06–2009 నుంచి 31–07–2011 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. పదవ తరగతి చదువుతున్న, నివాసం ఉంటున్న జిల్లా ఒకటే అయినప్పుడు మాత్రమే విద్యార్థి జిల్లాస్థాయి మెరిట్ కోసం పరిగణింపబడతారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న అభ్యర్థి అభ్యర్థిత్వం ఓపెన్, గ్రామీణ కోటా కింద పరిగణించబడుతుందని, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థి అభ్యర్థిత్వం అర్బన్ కోటా కింద పరిగణించబడుతుందని పేర్కొన్నారు. ● దరఖాస్తులు జాగ్రత్తగా నింపాలని, తప్పుగా నింపితే ప్రవేశ పరీక్షలో ఎంపికై నప్పటికీ అడ్మిషన్ కాన్సిల్ అవుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేయటానికి ఈ నెల 23 చివరి తేదీ అని, ప్రవేశ పరీక్ష 2026 ఫిబ్రవరి 7న నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నవోదయ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ఫారంను నింపి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. 9వ, 11వ తరగతిలో చేరేందుకు అవకాశం -
నిజాం సైన్యంపై తిరగబడ్డ రావులపెంట
మిర్యాలగూడ: తోపుచర్ల ఫిర్కాలోని రావులపెంట కేంద్రంగా సాయుధ పోరాటం సాగింది. వేములపల్లి మండలంలోని ఆమనగల్లు, పాములపాడు, రావులపెంటలో క్యాంపులు నిర్వహించి నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేశారు. రావులపెంటలోని భూస్వామ్య కుటుంబలో పుట్టిన చల్లా సీతారాంరెడ్డి నిజాంను ఎదిరించేందుకు క్యాంపులు నిర్వహించి వారి స్థావరాలపై దాడులు చేశారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆ క్యాంపుల్లో ఎంతో మంది తలదాచుకునేవారు. నిజాం పోలీసులు రావులపెంట, ఆగామోత్కూర్, తడకమళ్ల గ్రామాల్లో చొరబడి దాడులు చేసేవారు. చల్లా సీతారాంరెడ్డితో పాటు నారబోయిన నర్సయ్య, గట్టికొప్పుల రాంరెడ్డి కలిసి మొదటిసారిగా రావులపెంటలో సభ నిర్వహించారు. అనంతరం ధరణికోట సుబ్బయ్య, గుంటి వెంకటనర్సయ్య, అవిరెండ్ల ఎల్లయ్య, జిన్నె పెద్ద సత్తిరెడ్డి, చిన్న సత్తిరెడ్డి, రామనర్సయ్య, దొంతిరెడ్డి వెంకట్రాంరెడ్డి, దొంతిరెడ్డి చెన్నారెడ్డి, పొలగోని గోపయ్య, అవిరెండ్ల రామచంద్రయ్యలతో కలిసి ఉద్యమ రూపకల్పన చేశారు. చల్లా సీతారాంరెడ్డిని పట్టుకోవడానికి ఒకరోజు నిజాం సైన్యం మాటువేసింది. కానీ రావులపెంట గ్రామస్తులంతా కలిసి వారి స్థావరంపై దాడి చేయడంతో నిజాం పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు. -
బానిసత్వంపై ప్రజా పోరాటం
● నిజాంకు వ్యతిరేకంగా సామాన్య జనం తిరుగుబాటు ● రజాకార్ల కాల్పుల్లో నేలకొరిగిన ఎందరో వీరులుఒకేరోజు 17మంది సజీవ దహనంఅర్వపల్లి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజాం నవాబు ఆకృత్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న 17మంది కాసర్లపహాడ్ గ్రామస్తులను ఒకేరోజు రజాకార్లు సజీవ దహనం చేశారు. ఈ ఘటన అప్పట్లో ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. రజాకార్లకు వ్యతిరేకంగా అప్పట్లో చిగుర్ల సోమయ్య, మాజీ సర్పంచ్ సిరికొండ నర్సయ్య దళ కమాండర్లుగా పోరాడారు. ఆ సమయంలో రజాకార్లు కాసర్లపహాడ్ గ్రామానికి వచ్చి బాకి ముత్తయ్య, వేముల దేవయ్య, వేముల అర్వపల్లి, వేముల నర్సయ్య, మచ్చ చినరామయ్య, మంచాల గోపయ్య, కాటెబోయిన నర్సయ్య, పిట్టల రామయ్య, వడ్డగాని నర్సయ్య, బరిశెట్టి పాపయ్య, నల్లు చంద్రారెడ్డి, బౌరోజు లక్ష్మీనారాయణ, బౌరోజు సత్తయ్య, దిర్శనపు రాజయ్య, చెరుకు ఈదయ్య, ముద్దెరబోయిన కొండయ్య, దిర్శనపు రంగయ్యను పట్టుకొని గ్రామ శివారులోని కొమ్మోనిబండపై పశువుల కొట్టంలో తాళ్లతో కట్టేసి వారిపై ఎండుగడ్డి వేసి సామూహికంగా సజీవ దహనం చేశారు. అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం ప్రాంతాలకు చెందిన అనిరెడ్డి రాంరెడ్డి, పగిడిమర్రి జాను, రింగు హనుమయ్య, జోగు వెంకులు, రింగు వీరమల్లు నిజాం పోలీసుల చేతిలో అమరులయ్యారు. అమరుల జ్ఞాపకార్ధం కాసర్లపహడ్, అర్వపల్లిలో స్మారక స్థూపాలను నిర్మించారు. రజాకార్లకు ఎదురొడ్డి నిలిచిన గుండ్రాంపల్లిచిట్యాల: రజాకార్లకు ఎదురొడ్డి పోరాటం చేసిన గ్రామంగా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి సూర్యాపేట తాలుకాలోని వర్ధమానుకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్యక్తి తన అక్క నివాసముంటున్న గుండ్రాంపల్లి గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి వలస వచ్చాడు. బతుకుదెరువు కోసం ఏపూరు గ్రామానికి చెందిన ఓ భూస్వామి వద్ద పనిలో చేరాడు. అనంతరం మక్బూల్ రజాకార్ల బృందంలో చేరి గుండ్రాంపల్లి కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్న వారిపై అరాచకాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. మక్బూల్ అరాచకాలకు వ్యతిరేకంగా గుండ్రాంపల్లి కేంద్రంగా ఏపూరు, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు దళాలుగా ఏర్పడ్డారు. వీరు రజాకార్లకు ఎదురొడ్డి దాడులు చేసేవారు. దీనిని సహించని మక్బూల్ తిరుగుబాటుదారులపై దాడులు చేశాడు. ఒకసారి అతడు 30మంది యువకులను బంధించి వారిని ఎడ్ల బండికి కట్టేసి గుండ్రాంపల్లి నడిబొడ్డున (నేడు ఏపూరు గ్రామానికి వెళ్లే దారిలోని కూడలి) బావిలో పడేసి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనతో పలివెలకు చెందిన కొండవీటి గురున్నాథరెడ్డి నాయకత్వంలో మక్బూల్‌పై ఒకేసారి దళాలు దాడి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనిని గ్రహించి ఈ దాడి నుంచి మక్బూల్ తప్పించుకున్నాడు. మరోసారి వీరు జరిపిన దాడిలో మక్బూల్ చేయి విరగగా.. గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయాడు. కాని అతడి భార్య, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మక్బూల్‌కు సహకరించిన వారి ఇళ్లపై దాడి చేసి వారిని చంపేశారు. అమరవీరుల స్థూపం ఏర్పాటు.. నిజాం నవాబు భారత సైన్యానికి లొంగిపోయిన తర్వాత నాటి పోరాటంలో 30 మందిని బావిలో సజీవ దహనం చేసిన చోట 1992 జూన్ 4న సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు విజయవాడ–హైదరాబాద్ హైవే విస్తరణలో భాగంగా ఈ స్థూపాన్ని తొలగించి ఏపూరుకు వెళ్లే దారిలో పునఃనిర్మించారు. చిట్యాల: గుండ్రాంపల్లిలోని అమరవీరుల స్థూపం -
సింగపూర్, ఫిలిప్పీన్స్ శాస్త్రవేత్తల సందర్శన
సాక్షి, యాదాద్రి : సింగపూర్, ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రామకృష్ణాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రాన్ని సందర్శించారు. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న క్యాన్సర్ నివారణకు ఫిలిప్పిన్స్‌లో ఉపయోగిస్తున్న 3సి క్యారెట్ కుకుంబర్ సేలరీ ద్రావణం ద్వారా తాము సాధించిన ఫలితాలను వివరించి 3సీ ద్రావణం తయారు చేసుకునే విధానాన్ని వివరించారు. అమేయ కృషి వికాస కేంద్రం రూపొందించిన ఆగ్రో హోమియోపతిని గురించి ‘అమేయ’ నిర్వాహకుడు జిట్టా బాల్‌రెడ్డి వివరించారు. తాము రూపొందించిన పోషక ఎరువుల, పేడ ద్రావణం వినియోగంలో వస్తున్న ఫలితాలను వివరించారు. జాడంతో పాటుగా ఆగ్రో హోమియోపతి మరింత అందుబాటులోకి తెచ్చి కృషి సమష్టిగా కొనసాగిద్దామని విదేశీ శాస్త్రవేత్తల బృందం, అమేయ కృషి వికాస కేంద్రం ప్రతినిధులు బాల్‌రెడ్డి, జ్యోతిరెడ్డి పరస్పర అంగీకారానికి వచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
కొండమల్లేపల్లి: టీవీఎస్ ఎక్సెల్‌ను కారు ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందింది. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. పెద్దఅడిశర్లపల్లి మండలానికి చెందిన సంకు లింగారెడ్డి తన అక్క పాశం విజయ(48)ను కొండమల్లేపల్లిలో హైదరాబాద్ బస్సు ఎక్కించడానికి టీవీఎస్ ఎక్సెల్‌పై వస్తుండగా.. కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి సమీపంలో చేరుకోగానే వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాశం విజయను 108 వాహనంలో దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లింగారెడ్డికి గాయాలు కాగా దేవరకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి భర్త జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపారు. గీత కార్మికుడికి తీవ్ర గాయాలురాజాపేట: ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొందుగుల గ్రామానికి చెందిన గీత కార్మికుడు నర్మెట్ట శివ రోజుమాదిరిగా మంగళవారం సాయత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. మోకు జారి చెట్టుపై నుంచి కిందపడ్డాడు. దీంతో శివకు తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు అతడిని చికిత్స నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
4,037 ఎకరాలకు పట్టాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూభారతి పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిరుమలగిరి (సాగర్) మండలంలో 4,037 ఎకరాలకు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పేదలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చిన్నచిన్న విషయలను సాకుగా చూపించి సమస్యలను జఠిలం చేయవద్దని అటవీశాఖ అధికారులకు సూచించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా తిరుమలగిరి సాగర్ మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా సర్వే చేశామన్నారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్‌లో 235 సర్వే నంబర్లను ఎంపిక చేసి, 23 వేల ఎకరాల్లో సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. అందులో 12వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించినట్లు తెలిపారు. అందులోనూ 8 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిల్లో 4 వేల ఎకరాలు పాస్‌పుస్తకాలు కలిగిన రైతులు సాగు చేస్తున్నట్లు గుర్తించినట్లు వివరించారు. మిగిలిన 4,037 ఎకరాలకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే ఈ సర్వేలో 2,936 ఎకరాలకు సంబంధించి 3,069 మంది వద్ద బోగస్ పాసు పుస్తకాలు ఉన్నట్లు గుర్తించి వాటిని రద్దు చేశామని తెలిపారు. వారికి రైతు భరోసా, రైతు బీమా పథకాలను రద్దు చేశామన్నారు. సర్వేలో భాగంగా 7వేల ఎకరాలు అటవీ భూమిని గుర్తించామని, ఈ భూములకు సంబంధించిన వివాదాలను వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 40–50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అయితే వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీశాఖకు చెందినవని అటవీ అధికారులు కొర్రీలు వేస్తున్నారన్నారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో మాజీ మంత్రి కె.జానారెడ్డి, సాగర్ ఎమ్మెల్యే కె.జయవీర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయిక్, రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎస్.లోకేష్‌కుమార్, పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఫ తిరుమలగిరి సాగర్ మండలంలో త్వరలో పంపిణీకి ఆదేశాలు ఫ భూభారతి పైలట్ ప్రాజెక్ట్ సర్వేలో 3069 మంది అనర్హుల గుర్తింపు ఫ మానవీయ కోణంలో పరిష్కారంచూపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు -
ఎరువులు కృత్రిమ కొరత సృష్టించొద్దు
చిట్యాల : ఫర్టిలైజర్ దుకాణదారులు ఎరువులు, విత్తనాలను అధిక రేట్లకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా వెంటనే షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్ హెచ్చరించారు. చిట్యాల పట్టణంలోని మన గ్రోమోర్ సెంటర్, ఆగ్రో రైతు సేవా కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఆయా చోట్ల ఎరువుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల అమ్మకాల వివరాలను ఎప్పటికప్పుడు ఈపాస్ మిషన్‌లో నమోదు చేయాలని సూచించారు. స్టాక్ వివరాలను షాపులలో బోర్డుపై ప్రదర్శించాలన్నారు. అనంతరం మండలంలోని ఉరుమడ్ల జెడ్పీహెచ్ఎస్, మండల పరిషత్ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలకు సరఫరా అవుతున్న బియ్యం, కూరగాయాలు, వండిన భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ పి.గిరిబాబు ఉన్నారు. -
నాలుగు నెలలుగా వేతనాల్లేవ్..
పెద్దవూర: ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 16 ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 3, యాదాద్రి భువనగిరి 1 ఒకటి ఉన్నాయి. 2015 నవంబర్‌లో విద్యార్థులు ఎక్కువ ఉన్న ఆరు గిరిజన వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్ చేశారు. ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన బాగానే ఉన్నప్పటికి ఎలాంటి శాంక్షన్ పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో ప్రభుత్వం 2015లో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా రూ.5వేల వేతనంతో నోటిఫికేషన్ విడుదల చేశారు. వేతనాలు పెరుగుతాయన్న ఆశతో ఈ పోస్టులకు ఉన్నత విద్యాభ్యాసం చేసిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వేతనాలు తక్కువగా ఇస్తున్నారని ఆందోళనలు చేయడంతో 2020లో రూ.12వేల వేతనంతో పార్ట్ టైం అని తొలగించి విద్యా వలంటీర్లుగా మార్చారు. ఇదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సీఆర్టీలతో సమానమైన వేతనాలు ఇవ్వాలని పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించగా.. ఇదే పోస్టును 2023లో ఔట్‌సోర్సింగ్‌కు మార్చి అకడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయులుగా నామకరణం చేసి రూ.12వేల వేతనాన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించి రూ.10,440 వేతనం ఇస్తున్నారు. అయినా ఇప్పటివరకు వేతనాలు రాలేదు. నల్లగొండ జిల్లాలో 76 మంది, సూర్యాపేటలో 30 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరుగురు అకడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి గత విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలతో పాటు ఈ విద్యా సంవత్సరంలో జూన్ నెల నుంచి ఆగస్టు వరకు మొత్తం నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో కుటుంబ పోషణ కోసం సెలవు రోజుల్లో కూలి పనులకు వెళ్తున్నట్లు అకడమిక్ ఇన్స్ట్రక్లర్లుగా పనిచేస్తున్న వారు చెబుతున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా.. తాము రెగ్యులర్ ఉపాధ్యాయులు, సీఆర్టీలతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా చాలీచాలని వేతనాలు ఇస్తున్నారని అకడమిక ఇన్స్ట్రక్టర్లు పేర్కొంటున్నారు. కన్వర్ట్ ఆశ్రమ పాఠశాలలు కేవలం అకడమిక్ ఇన్స్ట్రక్టర్లతోనే నడుస్తున్నాయని, తమకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఫ అప్పులపాలవుతున్న అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఫ జీతాల కోసం ఉమ్మడి జిల్లాలో 116 మంది ఎదురుచూపు -
నేరాల నియంత్రణకు కృషిచేయాలి
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ కోరారు. మంగళవారం తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన రికార్డులు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్లు, కేస్ డైరీలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా నిబద్దతతో పనిచేయాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించి, పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెంపొందించేలా వ్యవహరించాలన్నారు. రిసెప్షన్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉమెన్ కానిస్టేబుల్ ఇంద్రజను ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు. అంతకుముందు పోలీసులు ఎస్పీకి గౌరవ వందనం చేశారు. ఆయన వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ వీరశేఖర్, సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
‘ప్రజాపాలన’కు ముస్తాబు
నల్లగొండ: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో వీలినమై రోజు సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఉదయం 10 జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేడుకలకు సంబంధించి పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన దినోత్సవ వేడులకు ముస్తాబైన పోలీస్ పరేడ్ గ్రౌండ్ -
ఐఈసీ జనరల్ మీటింగ్‌కు ఆహ్వానం
కనగల్ : ఢిల్లీలో ఈ నెల 8 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న 89వ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ (ఐఈసీ) జనరల్ సమావేశానికి కనగల్ మండలంలోని మోడల్ పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయుడు గాజుల శ్రీనివాస్‌గౌడ్ ఎంపికయ్యారు. ఈ యాన పాఠశాలలో బీఐఎస్ స్టాండర్డ్ క్లబ్ స్థాపించి వస్తువుల నాణ్యత, ప్రమాణాల లోపాలపై ఎక్కడ ఫిర్యాదు చేయాలి, వస్తువుల నాణ్యతను ఎలా పరిశీలించాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా, ఎలక్ట్రో టెక్నికల్ స్టాండర్డ్స్ సమావేశానికి తెలంగాణ నుంచి 9 మంది టీచర్లను ఎంపిక చేయగా వారిలో శ్రీనివాస్‌గౌడ్ ఒకరు. తన ఎంపికపై బీఐఎస్ హైదరాబాద్ బ్రాంచి అధికారులకు శ్రీనివాస్‌గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. నేడు నల్లగొండకు బృందాకరత్ రాకనల్లగొండ టౌన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నల్లగొండకు సీపీఎం పొలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు బృందా కరత్ వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా నల్లగొండలోని పెద్ద గడియారం సెంటర్ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పాలడుగు నాగార్జున, నారి ఐలయ్య, చిన్నపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. బోధనలో వ్యూహాలను మార్చుకోవాలినకిరేకల్ : విద్యా బోధనలో ఉపాధ్యాయులు వ్యూహాలను మార్చుకుని నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖ రాష్ట్ర ప్రాజెక్టు అసిస్టెంట్ డెరెక్టర్ రాధారెడ్డి సూచించారు. అకడమిక్ మానటరింగ్లో భాగంగా నకిరేకల్‌లోని భవిత విద్యా కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. తల్లిదండ్రులకు అహగాన కల్పించారు. అనంతరం స్దానిక జడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన 10వ తరగతిగదిలో సోషల్ స్టడీస్ పాఠ్యంశాల బోధనను పరిశీంచారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని కోరారు. ఆమె వెంట ఎంఈఓ మేక నాగయ్య, ఐఆర్టీ శ్రీనివాస్ ఉన్నారు. అధికారికంగా నిర్వహించాలినల్లగొండ టూటౌన్ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం దురదృష్టకరమని విమర్శించారు. మూసీకి కొనసాగుతున్న వరదకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీటి రాక కొనసాగుతోంది. ఎగువ నుంచి 4,732 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా.. మంగళవారం అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్టు గేట్లను పైకెత్తి 5,450 క్యూసెక్కుల నీటిని దిగవకు వదులుతున్నారు. కాల్వలకు 549 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం తగదు
గట్టుప్పల్ : పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులకు నిర్లక్ష్యం తగదని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య అన్నారు. గట్టుప్పల్ మండల పరిధిలోని వెల్మకన్నె, అంతంపేట గ్రామ పంచాయతీలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు. ఆయా చోట్ల రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, డంపింగ్ యార్డుల నిర్వహణపై నిర్లక్ష్యం వహించడంతో పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గ్రామాల కార్యదర్శులకు వెంటనే షోకాజ్ నోటీసులు అందజేయాలని ఎంపీఓ సునీతకు ఆదేశాలు జారీ చేశారు. -
టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
నల్లగొండ: జిల్లాను టీబీ, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం ఆయన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అధికారులు, ముఖ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్ కార్యక్రమానికి భారత ప్రధాని ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. జిల్లాలో కవులు, కళాకారులు, రచయితలు వివిధ రంగాల్లోని ప్రముఖులను టీబీ ముక్త్ భారత్‌లో భాగస్వాములను చేసి వారితో వివిధ చైతన్య కార్యక్రమాల చేపట్టడం ద్వారా టీబీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనపై శ్రద్ధ తీసుకోవాలని, మహిళా సాధికారతకు కృషి చేయాలన్నారు. విశ్వవిద్యాలయ వీసీల నుంచి కింది స్థాయి వరకు అందరూ భాగస్వాములు అయితే టీబీ, మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించవచ్చన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు అందేలా చూడాలన్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖులు సమాజానికి సేవ చేసేలా ఎంపీ రఘువీర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య, విద్య పథకాల అమలు పట్ల సంతృప్తి వ్యక్తం చేసి జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు. పథకాలపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర గవర్నర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పలు పథకాల గురించి సమగ్రంగా వివరించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ జిల్లాలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు వివరించారు. అలాగే లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్ మోహన్, ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, వైద్యులు జయప్రకాశ్‌రెడ్డి, సామాజిక కార్యకర్త సురేష్ గుప్తా, కవి సగర్ల సత్తయ్య, దుశ్చర్ల సత్యనారాయణ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణకాంత్ నాయక్, రైతు రాంరెడ్డి, పదవ తరగతి జిల్లా టాపర్ విద్యార్థిని అమూల్య, హెచ్ఐవీపై పనిచేస్తున్న సంఘసంస్కర్త మేరీలు వారు చేస్తున్న సేవల వివరాలను గవర్నర్‌కు వెల్లడించారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ జిల్లాలో టీబీ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, చికిత్స, తదితర అంశాలను గవర్నర్‌కు వివరించారు. అంతకు ముందు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎంపీ రఘువీర్రెడ్డిలు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను శాలువా, మెమెంటోతో సన్మానించారు. యంత్రాంగంతో కలిసి పనిచేస్తాం : ఎంపీ రఘువీర్‌రెడ్డి నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ టీబీ, మాదకద్రవ్యాల నిర్మూలనకు ముఖ్యుల సలహాలు తీసుకోవడమే కాకుండా, జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో ఆసియాలోనే అతి పెద్ద రైస్ ఇండస్ట్రీ ఉందని, దీనివల్ల టీబీవంటి వ్యాధులు సోకకుండా ఈ ప్రాంతంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, డీఎఫ్ఓ రాజశేఖర్, రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవాని శంకర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ మాదకద్రవ్యాల నిర్మూలనపై దృష్టిపెట్టండి ఫ మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలి ఫ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఫ కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ముఖాముఖి -
తీరని యూరియా కష్టాలు
ఫ పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద పడిగాపులు ఫ అక్కడక్కడా ఆందోళనలకు దిగుతున్న రైతులు ఫ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం మిర్యాలగూడ : నాగార్జునసాగర్, మూసీ ఆయకట్టుతోపాటు బోరుబావుల కింద వరిపంట సాగు చేసిన రైతులు రెండు నెలలుగా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతి రైతుకు రెండు బస్తాలు యూరియా ఇస్తుండడం, అది కేవలం ఎకరం పొలానికే సరిపోతుండడంతో ఎక్కువ ఎకరాలు సాగుచేసిన రైతులు యూరియా కోసం పీఏసీఎస్‌ల వద్ద బారులుదీరుతున్నారు. జూన్, జూలైలో మొదటిసారి చల్లాల్సిన యూరియా జూలై, ఆగస్టు నెలలో చల్లారు. ఎక్కువ భాగం పంటలకు యూరియా చల్లినప్పటికీ కొంతమేరకు ఇంకా చల్లాల్సి ఉంది. రెండవ విడత అక్టోబర్‌లో యూరియా చల్లాల్సి ఉంది. అలాగే జిల్లాలో పత్తిపంటకు కూడా యూరియా వేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తుగా కొనుగోలు చేసేందుకు రైతు సహకార సొసైటీలు, ఆగ్రోస్ దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈనెల చివరి వరకు కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. 60వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ జిల్లా వ్యాప్తంగా 33 మండలాలకు గాను వానాకాలం సీజన్‌కు 70వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. జూన్‌లో యూరియా వాడకం ప్రారంభమైంది. సెప్టెంబర్ చివరి నాటికి పూర్తిస్థాయిలో యూరియా రావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 60వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ, జిల్లాలో ఆయకట్టు విస్తీర్ణం పెరగడం వల్ల పంటలకు ఎక్కువగా నత్రజని అవసరం ఉండగా యూరియా వాడకం పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా మొత్తానికి 80వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా వ్యవసాయాధికారులు మాత్రం కేవలం 70వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని ప్రభుత్వానికి నివేదించారు. నానో యూరియా వాడకంపై ప్రచారం భవిష్యత్‌లో ఎరువుల వాడకాన్ని తగ్గించి ద్రవరూపంలో ఉన్న నానో యూరియాను వాడాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రాలకు యూరియా కేటాయింపు తగ్గించింది. దీంతో యూరియా కొరతపై ప్రభావం పడింది. ఇందులో భాగంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో ఎరువుల కేటాయింపు తగ్గించడం, నానో యూరియాపై ప్రచారం చేయింస్తోంది. కాగా ఒక యూరియా బస్తా రూ.265కు విక్రయిస్తుండగా లీటర్ నానో యూరియా రూ.150 నుంచి రూ.200కు లోపు దొరుకుతుంది. కానీ, ద్రవరూపంలోని యూరియా వాడకంలో స్ప్రే మిషన్‌తోపాటు ఇద్దరు కూలీలు అవసరం ఉండడం వల్ల ఖర్చు పెరుగుతుందని రైతులు ఘనరూపంలోని యూరియా కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. అక్టోబర్‌లో యూరియా వాడకం చాలా కీలకం కొన్ని ప్రాంతాల్లో వరిపంటను సాగుచేసి రెండు నెలలు దాటగా మరికొన్ని చోట్ల నెల, 45రోజులు అయింది. నాట్లు వేసిన 15–20రోజులలోపు దూపు కాడలు రావడానికి, పంటకు నత్రజని అందించేందుకు ఒకసారి యూరియాను చల్లుతారు. మళ్లీ రెండు నెలల తరువాత పంట గింజ తయారయ్యే సమయంలో యూరియాను చల్లుతారు. రెండోసారి 40–50 రోజుల మధ్య చల్లే యూరియా పంటకు బలం చేకూరుస్తుంది. అందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సమయంలో యూరియాను చల్లుతారు. కాగా మొదటి దశలోనే యూరియా కొరత తీవ్రంగా ఉండడం వల్ల రెండో దశలో యూరియా దొరుకుతుందో లేదోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. యూరియా కోసం రాస్తారోకో పెద్దవూర: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. పెద్దవూర మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు సోమవారం వేకువజామునే ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం వద్దకు వచ్చి వరుసలో నిల్చున్నారు. రెండు, మూడు రోజుల క్రితం ఇచ్చిన టోకెన్లకు యూరియా బస్తాలు ఇచ్చారు. వీరితో పాటు మూడొందలకు పైగా రైతులు పీఏసీఎస్ వద్దకు వచ్చి తమకు టోకెన్లు ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు. మధ్యాహ్నం జీరాక్స్ కాపీలను వరుసలో పెట్టిన రైతులందరికీ టోకెన్లు జారీచేస్తామని అధికారులు చెప్పారు. తర్వాత భోజనాన్ని వెళ్లి వస్తామని సాయంత్రం నాలుగు గంటలైనా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు మండల కేంద్రంలోని కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. గంటన్నరకు పైగా రాస్తారోకో చేయడంతో ఎటూ కిలోమీటర్ దూరం వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జిల్లా వ్యవసాధికారి, కలెక్టర్ వచ్చేదాకా రాస్తారోకోను విరమించేది లేదన్నారు. పోలీసులు వచ్చి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం అందరికీ టోకెన్లు జారీ చేయిస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. యూరియా (వేల మెట్రిక్ టన్నుల్లో)జిల్లాకు కావాల్సిన యూరియా 80 ప్రభుత్వానికి నివేదించింది 70 ఇప్పటి వరకు పంపిణీ చేసింది 60 -
అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దు
నల్లగొండ టౌన్ : నూతన విద్యావిధానం అమలులో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీటీయూ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని గడియారం సెంటర్లోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీలకు అప్పగించాలన్నారు. అంగన్వాడీ టీచర్లకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 25న చలో సెక్రటరీయేట్ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దండెపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టి నాగమణి, కార్యదర్శి బొందు పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.విజయలక్ష్మి, రమ, మణెమ్మ, సునంద, సైదమ్మ, ఫాతిమా, సరిత, స్వప్న, స్వరాజ్యం, సముద్రమ్మ, సుభాషిణి, ఎల్లమ్మ, జానమ్మ, సంధ్య, మల్లు గౌతంరెడ్డి, అవుట రవీందర్, రాజు తదితరలు పాల్గొన్నారు. -
జిల్లాలో మిగిలిపోయిన 5,927 మెట్రిక్ టన్నుల బియ్యం
సాక్షి ప్రతినిది, నల్లగొండ: జిల్లాలో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం ఇ–వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. జిల్లాలోని గోదాములు, మండల స్థాయి స్టాక్ పాయింట్లు (ఎంఎల్ఎస్), రేషన్ షాపుల్లో మిగిలిపోయిన ఆ బియ్యాన్ని వేలం వేసేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ ఈ వేలం ద్వారా మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని విక్రయించాలని నిర్ణయించగా, అందులో జిల్లా వ్యాప్తంగా 5,927 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం బియ్యాన్ని వేలం వేసేందుకు సిద్ధమవుతోంది. ఆరు నెలల తరువాత.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పథకాన్ని ఈ ఏడాది మార్చి 30న ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో కూడా అదే రోజునుంచి రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యాన్ని అందిస్తోంది. అయితే అప్పటి వరకే ఆయా రేషన్ షాపులతోపాటు గిడ్డంగులు, ఎంఎల్ఎస్ పాయింట్లలో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. అయితే సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం, వర్షాకాలం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలెవరూ వర్షాలు కురిసేప్పుడు రేషన్ షాపులకు వెళ్లి ఇబ్బంది పడకుండా ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్‌ను జూన్ నెలలోనే పంపిణీ చేసింది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాములన్నీ మూసే ఉన్నాయి. అయితే అప్పటికే రేషన్‌షాపులు, గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉన్న దొడ్డు బియ్యం విషయంలో మాత్రం ప్రభుత్వం అప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవన్నీ ఆరు నెలలుగా వాటిల్లోనే ఉండిపోయాయి. రెండు నెలలు రేషన్ షాపులు తెరవక పోవడంతో కొన్ని చోట్ల ఆ బియ్యానికి పురుగులు పడుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఆరు నెలల తరువాత ప్రస్తుతం నెలలో రేషన్ షాపులు మళ్లీ తెరిచి సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే సన్న బియ్యం, దొడ్డు బియ్యం ఒకేచోట ఉండటంతో దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు సన్న బియ్యానికి పట్టే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు సన్న బియ్యం వస్తున్న తరుణంలో పాత దొడ్డు బియ్యం కూడా అవే షాపుల్లో నిల్వ ఉండటంతో స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని, గోదాములకు తీసుకెళ్లాలని రేషన్ డీలర్ల సంఘం నాయకులు కలెక్టర్‌కు, ప్రభుత్వానికి విన్నవించారు. అయినా ప్రభుత్వం అప్పట్లో వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆరు నెలల తరువాత ప్రభుత్వం ఎట్టకేలకు దొడ్డు బియ్యాన్ని ఇ–వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కిలోకు రూ.24ల చొప్పున ఈ వేలం ద్వారా విక్రయించేందుకు సిద్ధం అవుతోంది. గిడ్డంగులు, ఇటు రేషన్ షాపుల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల బియ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అదేవిధంగా వానాకాలం సీజన్ చివరి దశకు వస్తుండటంతో మళ్లీ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్ బియ్యం) వస్తే నిలువ చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి తోడు ఆరు నెలలుగా అలాగే ఉండిపోయిన బియ్యం విక్రయించడం వల్ల ప్రభుత్వానికి భారం తగ్గడంతో పాటు, ఆదాయం రానుంది. ఫ ఏప్రిల్ నుంచి ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం ఫ అంతకు ముందు నెలల్లో వచ్చి అలాగే నిల్వ ఉన్న దొడ్డు బియ్యం ఫ విక్రయించి భారం తగ్గించుకునేలా ప్రభుత్వం చర్యలు దొడ్డు బియ్యం నిల్వలు ఇలా.. (మెట్రిక్ టన్నుల్లో..)గోదాముల్లో 4,322.057ఎంఎల్ఎస్ పాయింట్లలో 105.792రేషన్ షాపుల్లో 1,500 -
రైస్ మిల్లు సీజ్
నాంపల్లి: మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో అలువయ్య బిన్నీ రైస్ మిల్లును పౌర సరఫరా అధికారులు సోమవారం సీజ్ చేశారు. మండలంలో రేషన్ బియ్యాన్ని నూకలుగా చేసి దందా నడుపుతున్నట్టు సమాచారం తెలియడంతో సదరు రైస్ మిల్లులో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ తనిఖీలు నిర్వహించారు. రేషన్ బియ్యంగా అనుమానించిన 60బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మిల్లును సీజ్ చేశారు. అంతకుముందు నాంపల్లి మండల కేంద్రంలో నాగార్జున బిన్నీ, రామకృష్ణ రైస్ మిల్లులను తనిఖీ చేసినట్టు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ తెలిపారు. -
రేపు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
ఫ జాతీయజెండా ఆవిష్కరించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దినోత్సవాల సందర్భంగా ఉదయం 10 గంటలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారని పేర్కొన్నారు. అనంతరం బాలబాలికలతో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి తెలిపారు. విద్యారంగంలో మతోన్మాద బీజాలుచండూరు: విద్యారంగంలో మతోన్మాద బీజాలు నాటుతున్న బీజేపీపై పోరాడాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్ పిలుపునిచ్చారు. సోమవారం చండూరులో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ విద్యా వైజ్ఙానిక శిక్షణ తరగతుల రెండో రోజు సభకు వారు హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశ విద్యారంగంలో విద్యార్థులకు మూడవిశ్వాసాలను బోధింపజేస్తూ విద్యారంగాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టిందన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ఉన్నత విద్యను దూరం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, రాష్ట్ర కోకన్వీనర్ కుంచం కావ్య, సైదానాయక్, బెడిగ వెంకటేశ్, కోరె రమేష్, రవీందర్, కిరణ్, నవదీప్, జగన్, జగదీష్, వీరన్న, ప్రసన్న, ప్రణీత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికరామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలకు చెందిన బీఎస్సీ ఎంపీసీఎస్ ఫస్టియర్ విద్యార్థి ఎన్.మనోజ్ తెలంగాణ స్టేట్ తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్ 73 కేజీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. త్వరలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో నిర్వహించే జాతీయ స్థాయిలో తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, పీడీ డాక్టర్ ఏ.మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్‌ను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. మూడు గేట్ల ద్వారా ‘మూసీ’నీటి విడుదలకేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 6,019 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు సోమవారం ప్రాజెక్టు మూడు క్రస్ట్‌గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి ఉంచి 4,836 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 434 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో నీటిమట్టం 643.70 అడుగుల వద్ద నిలకడగా ఉంచి ఎగువ నుంచి వచ్చే నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అఽధికారులు పేర్కొన్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 4.13 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శివాలయంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శివపార్వతుల సేవను ఊరేగించారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. సుప్రభాత సేవ, నిత్యకల్యాణం నిర్వహించారు. -
చేతికొస్తున్న పత్తి
ఫ మొదటి దశ పత్తి తీత పనులు ప్రారంభం ఫ ఈ ఏడాది అంచనాకు మించి సాగు ఫ 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో తెల్ల బంగారమైన పత్తి చేతికొస్తోంది. పత్తి తీత పనులను ఇటీవల రైతులు ప్రారంభించారు. మునుగోడు, చండూరు, నల్లగొండ, మర్రిగూడ, చింతపల్లి, నాంపల్లి, దేవరకొండ, చందంపేట, గుర్రంపోడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పత్తిసాగు కాగా.. ఈ సారి 45 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తోంది. ఈ సారి పత్తి పంట సిరులు కురిపిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంచనాలకు మించి సాగు.. జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ అంచనాలకు మించి రైతులు పత్తి పెద్ద ఎత్తున సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5,47,735 ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా అంచనాకు మించి 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి వేశారు. అత్యధికంగా నాంపల్లి మండలంలో 46,959 ఎకరాల్లో, చింతపల్లి 41,375ఎకరాల్లో, మునుగోడులో 39,657 ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి మంచి అదునైన వర్షాలు కురవడంతో రైతులు పత్తి చేలకు 2, 3 దఫాలుగా ఎరువులను పెట్టుకున్నారు. దీంతో పత్తి చేలు ఏపుగా పెరిగి కాయదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పెద్ద ఎత్తున ఒక్కో చెట్టుకు 10 నుంచి 20 వరకు కొమ్మలు వచ్చి పెద్ద ఎత్తున కాయలు కాశాయి. వర్షాలు పెద్ద ఎత్తున కురిసిన కారణంగా పత్తి చేలకు చీడ పీడలు పెద్దగా ఆశించలేదు. జిల్లాలో 5,64,585 ఎకరాల్లో పత్తి సాగు కాగా ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు 45 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి మద్దతు ధరను రూ.8,110గా ప్రకటించిన నేపథ్యంలో రైతులకు మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. జిల్లా అంతటా పత్తి చేలకు మంచి అదునైన వర్షం కురవడంతో చేలు ఏపుగా పెరిగి ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే మొదటి దశ పత్తి తీసే పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పత్తి దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు వస్తుంది. రైతులకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరే అవకాశం ఉంది. – పాల్వాయి శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి -
రైతులకు యూరియా తిప్పలు
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : యూరియా సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. పంటలు సాగు చేసి నెలల గడుస్తున్నప్పటికీ రైతులకు యూరియా తిప్పలు మాత్రం తప్పడం లేదు. తిరుమలగిరి సాగర్ మండలానికి ప్రత్యేకంగా పీఏసీఎస్ లేకపోవడంలో ఉమ్మడి అనుముల మండలంగానే కొనసాగుతుంది. దీంతో రైతులపై రవాణా ఖర్చు భారం కూడా పడుతోంది. రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు ఆదివారం తిరుమలగిరి వ్యవసాయ సబ్‌మార్కెట్ యార్డులో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి టోకెన్లు అందించారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. తిరుమలగిరి మండలానికి 80మెట్రిక్ టన్నుల యూరియా రాగా డొక్కలబావితండాలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ద్వారా 40మెట్రిక్ టన్నులు, తిరుమలగిరి మార్కెట్ యార్డులో 40మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశారు. రైతుకు రెండు బస్తాల చొప్పున అందించారు. -
సా్నతకోత్సవానికి వేళాయే..
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి ముస్తాబైంది. ఈ స్నాతకోత్సవాన్ని సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో 12 నిర్వహణ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఐఐటీ హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ బిఎస్.మూర్తి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ స్నాతకోత్సవంలో 22 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు, 57 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందించనున్నారు. కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ యూనివర్సిటీ స్నాతకోత్సవం నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్ ఇప్పటికే యూనివర్సిటీని సందర్శించి జిల్లా యంత్రాంగానికి, యూనివర్సిటీల బాధ్యులకు దిశ నిర్ధేశం చేశారు. యూనివర్సిటీలోనే వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ పర్యటన ఇలా... ● సోమవారం ఉదయం 10 గంటలకు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, డీన్స్, ఫ్యాకల్టీస్ సమావేశం జరుగనుంది. ● 10.20 గంటలకు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ● 10.40 రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఆయనకు వైస్ ఛాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ స్వాగతం పలుకుతారు. ● 11.10 గంటలకు యూనివర్సిటీలో వైస్ ఛాన్స్లర్, అధ్యాపకులతో గవర్నర్ గ్రూప్ ఫొటో దిగుతారు. ● 11.15 గంటలకు గవర్నర్ వేదిక మీదికి రానున్నారు. 11.20 గంటలకు జాతీయ గీతాలాపన చేస్తారు. ● 11.30 విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందజేస్తారు. ● మధ్యాహ్నం 12.10 గంటలకు వీసీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ ప్రసంగం. ● 12.20 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థును ఉద్ధేశించి మాట్లాడతారు. ● 12.30 గంటలకు యూనివర్సిటీ తరఫున సందేశం ఇస్తారు. ● 12.45 కార్యక్రమం ముగింపు సందర్భంగా జాతీయ గీతాలాపన ఉంటుంది. ● 12.50 గంటలకు వేదకమీద నుంచి అతిథులు కిందికి దిగుతారు. ఎంజీ యూనివర్సిటీ వద్ద భారీ బందోబస్తు.. మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించే స్నాతకోత్సవ ప్రాంతంలో పోలీసులు బాంబు స్క్యాడ్‌తో తనిఖీ చేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఒక డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూనివర్సిటీ లోపలికి వెళ్లే వారిని తనిఖీ చేసిన తరువాతనే అనుమతించనున్నారు. పాస్‌లు, గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే స్నాతకోత్సవ వేడుకకు అనుమతిస్తామని ఇప్పటికే ఎస్పీ శరత్‌చంద్రపవార్ స్పష్టం చేశారు. ఏర్పాట్లను పరిశీలించిన వైస్ చాన్స్‌లర్.. ఎంజీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఆదివారం రిజిస్ట్రార్ అలువాల రవితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆడిటోరియంలో వేదికపైన ఏర్పాట్లకు సంబంధించి నిర్వాహకులకు వీసీ పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. నేడు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వేడుక ఫ ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఫ పీహెచ్డీ పట్టాలు అందుకోనున్న 22 మంది విద్యార్థులు ఫ 57 మందికి బంగారు పతకాలు అందించనున్న గవర్నర్ ఫ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన 12 కమిటీలు పాస్ ఉంటేనే అనుమతి.. స్నాతకోత్సవానికి యూనివర్సిటీలోకి విద్యార్థితో పాటు వారి వెంట కుటుంబ సభ్యుల్లో ఒకరిని లోపలికి అనుమతించనున్నారు. వేదికపై వారికి కేటాయించిన సీట్లలో మాత్రమే అతిథులు ఆసీనులు కావాల్సి ఉంటుంది. యూనివర్సిటీలోకి వెళ్లాలంటే వారికి ఇచ్చిన అనుమతి పత్రం (పాస్) తప్పనిసరిగా ఉండాలి. పాస్ లేకుంటే యూనివర్సిటీ లోపలికి భద్రతా సిబ్బంది అనుమతించరు. లోపలికి వెళ్లే అధ్యాపకులు, ఇతర సిబ్బంది వెంట పిల్లలను, ఫోన్లు, బ్యాగ్‌లు, కెమెరాలను కూడా అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. -
ఫ చెక్కుచెదరలే..
ఆధునిక దేవాలయంగా పేరుగాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజనీర్ల పనితనానికి మచ్చుతునక. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేయగా 12 సంవత్సరాల్లో పూర్తయింది. మానవ నిర్మితమైన ఈ ప్రాజెక్టుకు పలుమార్లు అంచనాకు మించి వరదలు వచ్చినప్పటికీ గట్టిగా నిలబడింది. సాగర్ ప్రాజెక్టు ఆనాటి ఇంజనీర్ల మేధస్సుకు, ప్రతిభకు తార్కాణంగా నిలుస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక కట్టడాలు నేటికీ చెక్కు చెదరలేదు. నేడు ఇంజనీర్స్ డే సందర్భంగా ఆనాటి కట్టడాలు, ప్రాజెక్టులపై ప్రత్యేక కథనాలు. -
నీలగిరిలో ముస్లింల ర్యాలీ
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలో ఆదివారం మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా మెట్ల దగ్గర నుంచి ప్రారంభమై క్లాక్‌టవర్, ఆర్పీ రోడ్డు, ఓల్డ్ సిటీ చౌరస్తా, గంజ్ ఏరియాల నుంచి తిరిగి దర్గా మెట్ల వరకు సాగింది. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రాగి బిస్కెట్లు, పండ్లు, పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, మిలాద్ జులూస్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ సల్మాన్ ఖాద్రి, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫాజిల్, జనరల్ సెక్రటరీ సయ్యద్ ఉబేదుల్లా ఖాద్రి, అడ్వైజర్ ఎం.డీ.కలీమ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతియాజ్ హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు జమాల్ ఖాద్రి, అడ్వకేట్ మసియుద్దీన్, అహ్మద్ కలీం, ముజావర్ సమీ ఖాద్రి, సుఫియా ఖాద్రి, తబ రేస్ ఖాద్రి, అవేస్ ఖాద్రి, నసీర్, ఫిరోజ్, ఉమైర్ తదితరులు పాల్గొన్నారు. -
సమతుల ఆహారం.. సంపూర్ణ ఆరోగ్యం!
మిర్యాలగూడ టౌన్ : మాత శిశు మరణాలను నివారించడంతో పాటు ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ప్రభుత్వం శ్రీపోషణ మాసంశ్రీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తూ.. పోషణ స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పోషణ మాసోత్సవాలు అక్టోబర్ 16వ తేదీని ముగుస్తాయి. ఈ పోషణ మాసంలో గర్భిణులు, బాలింతలతో సమావేశాలను ఏర్పాటు చేసి పౌష్టికాహారంపై అవగాహన కల్పించనున్నారు. స్వయంగా అంగన్వాడీలు తయారు చేసిన పౌష్టికాహారాన్ని వారికి అందించనున్నారు. పౌష్టికాహారం పంపిణీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇప్పటికే గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు పిల్లలకుపాలు, గుడ్లు, బాలామృతంతో పాటు పలు రకాల పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అదే విధంగా పిల్లల ఎత్తు, బరువు తీసుకుని వారికి అవసరమైన వైద్య పరీక్షలను చేయిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఐదేళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సంపూర్ణ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నెల 30 గుడ్లు, రోజూ ఒకొక్కరికి 200 మిల్లీలీటర్ల పాలను ఇస్తూ మాతాశిశు ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. పోషణ మాసం కార్యక్రమాలు ఇలా ● స్థానిక ఉత్పత్తులు, బొమ్మలు, పౌష్టికాహారం పదార్థాల వినియోగంపై అవగాహన. ● గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల పోషణపై సలహాలు, సూచనలు ఇస్తారు. అనుబంధ ఆహారాల తయారీ, వంటకాల పోటీలు. ● కిశోర బాలికలకు వైద్య పరీక్షలతో పాటు పిల్లల బరువు, ఎత్తు కొలతలను తీయడం, ఆహారంలో చెక్కర, నూనె వినియోగం తగ్గించడంపై అవగాహన. ● చిన్నారుల తండ్రులు, సంరక్షులకు అనుబంధ ఆహారంపై పోటీలు, అదే విధంగా తండ్రులతో పొషకాహారం ప్రతిజ్ఞ. అంగన్వాడీ కేంద్రాల్లో కథలు చెప్పడం, బొమ్మల ప్రదర్శన, వాటి ద్వారా ఈసీసీఈ సెషన్, 0– 3 ఏళ్ల పిల్లల ఆరంభ అభివృద్ధి, ప్రేరణ కోసం దృష్టి సారించాల్సిన కార్యక్రమాలు, తల్లిదండ్రులతో చేయించడం. ● పోషణ లోపం ఉన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, ఆకలి పరీక్షలు, గ్రోత్ మానటరింగ్, పిల్లల బరువు, ఎత్తును కొలవడం. ● బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు తాపడం, పిల్ల్లల అనుబంధ ఆహారంపై అవగాహన. ● ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలిపై అవగాహన. ● స్థానిక వంటకాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, స్వదేశీ బొమ్మల తయారీ. ● పోషణ మిషన్ వంద రోజుల ప్రచారం, గ్రామ, వార్డు సభలు, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ, గృహ సందర్శన, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించడం. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులుపోషక విలువలతో కూడిన ఆహారంఐసీడీఎస్ ప్రాజెక్టులు 09అంగన్వాడీ కేంద్రాలు 2,0930నెలల నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 75,612గర్భిణులు 8,659బాలింతలు 6,360ఫ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు ‘పోషణ మాసం’ ఫ అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహణ ఫ పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ పోషణ స్థాయిని పెంచడమే లక్ష్యం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటే మాతా శిశు మరణాలను తగ్గించవచ్చు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమ పద్ధతిలో తీసుకుంటే మంచిది. అంగన్వాడీ కేంద్రాల్లో అన్న ప్రాసన, జన్మదిన వేడుకలను కూడా నిర్వహించనున్నాం. పోషణ స్థాయిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం. – కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారిణి, నల్లగొండ -
నేటి ప్రజావాణి రద్దు
నల్లగొండ: నల్లగొండకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో జిల్లా అధికారులతో గవర్నర్ సమీక్ష సమావేశం, వివిధ కార్యక్రమాలు ఉన్నందున ప్రజావాణి రద్దు చేశామని.. బాధితులు కలెక్టరేట్‌కు రావద్దని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 22న జరిగే ప్రజావాణికి హాజరు కావాలని సూచించారు. పోలీస్ గ్రీవెన్స్‌డే కూడా.. నల్లగొండ : గవర్నర్ జిష్టుదేవ్ వర్మ నల్లగొండ పర్యటన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన పోలీస్ గ్రీవెన్స్‌డే రద్దు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్రపవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు ఈ విషయం గమనించి.. ఈ నెల 22న జరిగే పోలీస్ గ్రీవెన్స్‌డేకు హాజరు కావాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలంచండూరు : విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం చండూరులో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు విద్యను నిర్వీర్యం చేస్తున్నాయని, విద్యకు కనీసం 25 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు, మెస్ చార్జీలు, ఇతర బకాయిలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ముల్కలపల్లి రాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, భరత్, సైదానాయక్, కుంచం కావ్య, బుడిగ వెంకటేశ్, కోరె రమేష్, రవీందర్, కిరణ్, నవదీప్, జగన్, జగదీశ్, వీరన్న, సైఫ్, ప్రసన్న, ప్రణీత్, రమేష్ పాల్గొన్నారు. కమ్యూనిస్టుల పోరాటంతోనే విముక్తిచిట్యాల : నిజాం, రజాకార్ల దౌర్జాన్యాలపై కమ్యూనిస్టు పార్టీలు చేసిన పోరాటంతోనే నాటి తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో ఆదివారం వారు అమరవీరులకు నివాళులర్పించి, పార్టీ జెండాను ఎగురవేశారు. ఆనంతరం వారు మాట్లాడుతూ నాటి పోరాటంలో నాలుగు వేల మంది బలిదానం కాగా పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచామని, మూడు వేల గ్రామాల ప్రజలకు విముక్తి లభిందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర నాయకుడు బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, బొజ్జ చినవెంకులు, మల్లం మహేష్, జిట్ట సరోజ, పెంజర్ల సైదులు, రాచకొండ వెంకటేశ్వర్లు, శ్రీను, లింగస్వామి, ఐతరాజు నర్సింహ, నరేష్, యాదయ్య పాల్గొన్నారు. బుద్ధవనాన్ని సందర్శించిన డిప్యూటీ అకౌంటెంట్ జనరల్నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ సంజయ్ కామినేని సందర్శించారు. అంతకుముందు నాగార్జునసాగర్ డ్యామ్‌ను, ఎత్తిపోతల జలపాతాన్ని సందర్శించారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్థూపవనాలను సందర్శించి మహాస్థూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను తెలిపే వీడియోను వీక్షించారు. అనంతరం ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతిని వెలిగించారు. బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర ఆయనను కండువాలతో సత్కరించారు. వీటిని స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలు, చారిత్రక వివరాలను తెలియజేశారు. వీరితో పాటు సీనియర్ ఆడిట్ ఆఫీసర్ బ్రిజేష్ కుమార్, నాగార్జునసాగర్ డ్యాం డివిజన్ కార్యాలయ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్, ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. -
లోక్ అదాలత్ది అంతిమ తీర్పు
రామగిరి(నల్లగొండ): లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పు అంతిమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ జరిగిందన్నారు. అనంతరం కక్షిదారులకు రాజీ పత్రాలను అందజేశారు. లోక్ అదాలత్ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 13 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. లోక్ అదాలత్‌లో సివిల్ 71, క్రిమినల్ 15,921, మోటార వాహన ప్రమాద బీమా కేసులు 96, బ్యాంక్ 50, సైబర్ క్రైం 73, ట్రాన్స్‌కో 35, ట్రాఫిక్ చలాన్ 10,446, మొత్తం 26,692 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. ఇందులో ప్రమాద బీమా కేసుల్లో రూ.5,00,95,000 నష్టపరిహారం చెల్లించగా, బ్యాంకు కేసుల్లో రూ.32,83,184 రుణ పరిహారం బాధితులకు చెల్లించారని తెలిపారు. సైబర్ క్రైం కేసులో రూ.4,51,245 రికవరీ చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పి.పురుషోత్తంరావు, ఇతర న్యాయమూర్తులు సంపూర్ణ ఆనంద్, రోజారమణి, దుర్గాప్రసాద్, కవిత, శిరీష, సౌందర్య, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నగేష్, ఎన్.భీమార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కుక్కల దత్తత అభినందనీయం
నల్లగొండ: హైదరాబాద్ తరహాలో నల్లగొండలో కుక్కల దత్తత కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని రాంనగర్ పార్కులో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కుక్కల సంతతి పెరగకుండా స్టెరిలైజేషన్ చేస్తూనే కుక్కలను కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. కుక్కలకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కుక్కలను దత్తత తీసుకున్న వారిని ఆయన అభినందించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇటీవల వీధి కుక్కలు, కోతులు, పిల్లుల సంఖ్య పెరిగిపోయి వాటి దాడులు పెరిగాయన్నారు. వాటిని నివారించేందుకే కుక్కల దత్తత, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కుక్క కాటుకు గురైన వారు రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. నల్లగొండలో 92 వేల గృహాలు ఉన్నాయని సుమారు 5 వేల కుక్కలు ఉన్నాయని, ఒకొక్కరు ఒక్కో కుక్కను దత్తత తీసుకుంటే కుక్కల బెడద ఉండదన్నారు. ఈ సందర్భంగా 49 కుక్కలను దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, డీఎఫ్ఓ రాజశేఖర్, దేవరకొండ ఏసీపీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, పశు సంవర్థక శాఖ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ నల్లగొండలో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ ప్రారంభం -
మూసీ ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తివేత
కేతేపల్లి : కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరగడంతో అధికారులు శనివారం ప్రాజెక్టు తొమ్మిది క్రస్టు గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు 10,373 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 9,800 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. 4.46 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 4.15 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలిమిర్యాలగూడ టౌన్ : ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ సీీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగమొల్ల దర్శన్‌గౌడ్, నాగవెల్లి ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొరివి కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ ఉద్యోగులకు పింఛన్ సౌకర్యం లేకపోవడంతో వృద్ధాప్యంలో ఆర్ధిక భద్రత ఉండడం లేదన్నారు. సమావేశంలో మంగ నర్సింహులు, భూలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నికరామగిరి (నల్లగొండ): ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్(ఎఫ్‌పీఎస్‌టీ) జిల్లా కమిటీని శనివారం నల్లగొండలోని బోయవాడ పాఠశాలలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎ.నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా బి.శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారిగా టి.చంద్రశేఖర్, పి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఎ.వాణి, టి.డేవిడ్, జానకి సత్యవతి, కె. సైదులు, ఎన్.శ్రీనివాస్, వి.రాములు, కార్యదర్శులుగా వై.శ్యాంసుందర్‌రెడ్డి, పి.సాహితి, జి.కొండయ్య, ఎం.మురహరి, గౌరవ అధ్యక్షుడిగా టి.నర్సింహలు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా టి.బ్రహ్మచారి, అశోక్‌రెడ్డి వ్యవహరించారు. -
కియోస్క్ యంత్రాలు ప్రారంభం
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వీయ సేవా కియోస్క్ యంత్రాలను ఈఓ ప్రారంభించారు.- 8లోనిడమనూరు పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. కుటుంబ సభ్యులంతా క్యూలైనులో ఉన్నా యూరియా దొరకడం ఆవేదన చెందుతున్నారు. క్యూలైన్లో నిలబడినా యూరియా అందని రైతులకు కనీసం కూపన్లు ఇచ్చి.. మరుసటి రోజు ముందుగా యూరియా ఇవ్వాలని కోరుతున్నా అధికారుల పట్టించుకోవడం లేదు. దీంతో క్యూలైనులో ముందే ఉండాలని శుక్రవారం రాత్రి పలువురు రైతులు సహకార సంఘం వద్ద నిద్రపోయారు. -
పోరాటానికి కేంద్ర బిందువు నల్లగొండ
శాలిగౌరారం : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్రబిందువు ఉమ్మడి నల్లగొండ జిల్లా అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. సాయుధ పోరాటంలో అసువులు బాసిన వల్లాల గ్రామానికి చెందిన 10 మంది అమరవీరుల స్మారకార్థం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు సొంత ఖర్చులతో నిర్మించిన స్మారక స్థూపాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. వల్లాల ఘటనను వెలుగులోకి తీసుకువచ్చి, అమరవీరులకు స్మారక స్థూపాన్ని నిర్మించిన వి.హన్మంతరావు కృషి ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. కాంగ్రెస్, కమ్మూనిస్టులు సిద్ధాంతపరంగా తలబడినా తెలంగాణ సాయుధ పోరాటంలో కలిసి ముందుకుసాగి విజయం సాధించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. దేశ చరిత్రను తారుమారు చేసే పనిలో నిమగ్నమైందని విమర్శించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గానీ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో గానీ, హైదరాబాద్ విలీనంలో గానీ బీజేపీ పాత్ర, పోరాటం ఏమిటో, ఎవరైనా ఆ ఉద్యమాల్లో పాల్గొన్నారో ఆ పార్టీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. సాయుధ పోరాట అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇళ్లు వారికి వెంటనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఆ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్‌కు అప్పగించారు. అమరవీరుల కుటింబీకులు నిర్మించుకునే ఇందిరమ్మ ఇళ్లకు తాను వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందిస్తానని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రకటించారు. వల్లాలోని పురాతన పాఠశాలను అభివృద్ధి పర్చాలని ఎమ్మెల్యే మందుల సామేల్.. పీసీసీ అధ్యక్షుడిని కోరగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా చర్చించి వల్లాలకు వన్నెతెచ్చే విధంగా మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషిచేస్తానన్నారు. అనంతరం అమరవీరుల కుటింభీకులను పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ అద్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మాజీమంత్రి కుందూరు జానారెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నేతివిద్యాసాగర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సూర్యాపేట డీసీసీ అద్యక్షుడు చెవిటి వెంకన్న, నాయకులు గుడిపాటి నర్సయ్య, నూక కిరణ్, అన్నెబోయిన సుధాకర్, గంట్ల వేణుగోపాల్‌రెడ్డి, దండ అశోక్‌రెడ్డి, కందాల సమరంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ తాళ్లూరి మురళి, బొల్లికొండ గణేశ్, వల్లాల షేక్ ఇంతియాజ్, బుడిగె వెంకటేశ్వర్లు, కట్టంగూరి యాదగిరి, భూపతి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ మాదగోని కవితరామలింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ పీీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఫ చరిత్రను తారుమారు చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శ ఫ వల్లాలతో అమరవీరుల స్థూపం ఆవిష్కరణ