ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలి

Feb 7 2026 2:48 PM | Updated on Feb 7 2026 2:48 PM

ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలి

ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలి

కోదాడ : పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకురావడానికే ప్రజాచైతన్య వేదిక పీపుల్స్‌ ఎజెండాను రూపొందించిదని, నాయకులు, కౌన్సిలర్‌ అభ్యర్థులు వీటిని గుర్తించి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్‌ రాయపూడి చిన్ని అన్నారు. శుక్రవారం పట్టణంలోని 14వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులకు పీపుల్‌ ఎజెండా కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైతన్య వంతమైన కోదాడ పట్టణం అభివృద్ధిలో రోల్‌ మోడల్‌గా ఉండడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన అవసరాన్ని ఉందన్నారు. సమస్యలను ప్రజాప్రతినిధులు గుర్తించాలని సూచించారు. ఆయన వెంట వేదిక సభ్యులు ఉన్నారు.

టీచరు కొట్టాడని.. పోలీసులకు విద్యార్థి ఫిర్యాదు

మర్రిగూడ : తనను ఉపాధ్యాయుడు కొట్టాడంటూ మర్రిగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. బుధవారం జడ్పీహెచ్‌ఎస్‌లోని 8వ తరగతి ఇ–1 సెక్షన్‌కు చెందిన క్లాస్‌ టీచర్‌ సెలవు పెట్టడంతో వారికి హాజరు తీసుకోలేదు. ఆ తరువాత వచ్చిన ఉపాధ్యాయులు పాఠాలు చెబుతూ వెళ్లారే గానీ హాజరు తీసుకోలేదు. ఈ విషయమై డీఈఓ కార్యాలయం నుంచి పాఠశాల ప్రధానోపాయుడికి ఫోన్‌ చేసి ప్రశ్నించారు. వెంటనే ప్రధానోపాధ్యాయుడు తరగతి గదికి వెళ్లి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో క్లాస్‌లో ఉన్న విద్యార్థిని మందలించాడు. సదరు విద్యార్థి గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అకారణంగా కొట్టారంటూ పోలీసులకు తెలిపాడు. దాంతో పోలీసులు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రూప్‌సింగ్‌ని వివరణ కోరగా తాను విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని పేర్కొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement