కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

Feb 13 2026 7:04 AM | Updated on Feb 13 2026 7:04 AM

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

నల్లగొండ : జిల్లాలోని నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు ఆరు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. గురువారం నల్లగొండలోని ఆర్జాలబావి కౌంటింగ్‌ కేంద్రంలోని కౌంటింగ్‌ ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు తెలిపారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఒక డీఎస్పీ ఆధ్వర్యంలో 15 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు ఇతర సిబ్బందితో కలిపి సుమారు 600 మంది పోలీస్‌ సిబ్బందిని బందోబస్తుకు నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్‌ హాల్‌లోకి ఇంక్‌ బాటిల్స్‌, పెన్నులు, మార్కర్లు, సెల్‌ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బ్యాగులు, పర్సులతోపాటు అనుమతి లేని సామగ్రి తీసుకురావొద్దన్నారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, భారీ ఊరేగింపులు, బాణసంచా కాల్చడం, డీజే సౌండ్‌ సిస్టమ్‌ వినియోగించడం వంటి కార్యక్రమాలకు అనుమతిలేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

అవంతీపురంలో కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

మిర్యాలగూడ : మండలంలోని అవంతీపురం మార్కెట్‌ వద్ద ఏర్పాటు చేసిన మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ పరిశీలించారు. కేంద్రంలో మాక్‌ కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌అమిత్‌, డిప్యూటీ ఎన్నికల అధికారి శ్రీనివాస్‌, డీఎస్పీ రాజశేఖర్‌రాజు ఉన్నారు.

ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement