ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి

Feb 13 2026 7:04 AM | Updated on Feb 13 2026 7:04 AM

ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి

ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలి

పెద్దవూర : పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలంటే భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా గిరిజన సహాయ అభివృద్ధి అధికారి(ఏటీడీఓ) ఎం.శ్రీనివాస్‌ అన్నారు. గురువారం పెద్దవూర, అనుముల, తిరుమలగిరి సాగర్‌ మండలాల్లోని గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పెద్దవూర మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్‌ బాలికల హాస్టల్‌లో నిర్వహించిన మోటీవేషనల్‌ (ప్రేరణ), కెరీర్‌ గైడెన్స్‌ అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. సక్సెస్‌ అనేది ఒక్కరోజుతో వచ్చేది కాదని, అది నిరంతర సాధనతోనే సాధ్యమన్నారు. మీరు చేయాల్సిన పనిని తప్పులేకుండా శ్రద్ధతో చేయండి ఫలితం అదే వస్తుందన్నారు. పదవ తరగతి పూర్తయ్యాక ఏయే కోర్సులు ఉంటాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డీవీ.నాయక్‌, మోటీవేటర్‌ రవికుమార్‌, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం డీ.బాలోజీ, వార్డెన్లు కొల్లు బాలకృష్ణ, అహల్య, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌, జైపాల్‌, ఆర్‌పీలు కూన్‌రెడ్డి రాంరెడ్డి, బి.కృష్ణ, ఎండి.షబ్బీర్‌, రాములు, దూద్యానాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement